261 lines
21 KiB
Plaintext
261 lines
21 KiB
Plaintext
\id HAB 1SA GEN - Telugu Unlocked Literal Bible
|
|
\ide UTF-8
|
|
\rem Copyright © 2017 Bridge Connectivity Solutions. This translation is made available to you under the terms of the Creative Commons Attribution-ShareAlike 4.0 License
|
|
\h హబక్కూకు
|
|
\toc1 హబక్కూకు
|
|
\toc2 హబక్కూకు
|
|
\toc3 hab
|
|
\mt1 హబక్కూకు
|
|
|
|
|
|
\s5
|
|
\c 1
|
|
\s హబక్కూకు ఫిర్యాదు
|
|
\p
|
|
\v 1 ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
|
|
\p
|
|
\v 2 <<యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు?
|
|
\p బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు.
|
|
\p
|
|
\s5
|
|
\v 3 నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు?
|
|
\p బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు?
|
|
\p ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి.
|
|
\p జగడం, కలహం రేగుతున్నాయి.
|
|
\p
|
|
\v 4 అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది.
|
|
\p న్యాయం జరగకుండా ఆగిపోయింది.
|
|
\p భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు.
|
|
\p న్యాయం చెడిపోతున్నది.
|
|
\s యెహోవా జవాబు
|
|
\p
|
|
\s5
|
|
\v 5 అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి.
|
|
\p మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు.
|
|
\p
|
|
\v 6 కల్దీయులను
|
|
\f +
|
|
\fr 1:6
|
|
\fq కల్దీయులను
|
|
\ft బబులోనీయులు
|
|
\f* నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.
|
|
\p
|
|
\v 7 వారు ఘోరమైన భీకర జాతి.
|
|
\p వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు.
|
|
\p
|
|
\s5
|
|
\v 8 వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి.
|
|
\p రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి.
|
|
\p వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు.
|
|
\p ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.
|
|
\p
|
|
\v 9 వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు.
|
|
\p ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెర పట్టుకుంటారు.
|
|
\p
|
|
\s5
|
|
\v 10 రాజులను అపహాస్యం చేస్తారు.
|
|
\p అధిపతులను హేళన చేస్తారు.
|
|
\p ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు.
|
|
\p మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు.
|
|
\p
|
|
\v 11 తమ బలమే తమ దేవుడనుకుంటారు.
|
|
\p గాలి కొట్టుకుని పోయేలా వారు కొట్టుకు పోతూ అపరాధులౌతారు.
|
|
\s హబక్కూకు రెండవ ఫిర్యాదు
|
|
\p
|
|
\s5
|
|
\v 12 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా?
|
|
\p మేము మరణించము.
|
|
\p యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు.
|
|
\p ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.
|
|
\p
|
|
\s5
|
|
\v 13 నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా.
|
|
\p బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా.
|
|
\p కపటులను నువ్వు చూసి కూడా,
|
|
\p దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు?
|
|
\p
|
|
\v 14 పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు.
|
|
\p
|
|
\s5
|
|
\v 15 వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు.
|
|
\p ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు.
|
|
\p వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు.
|
|
\p
|
|
\v 16 కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు.
|
|
\p తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు.
|
|
\p
|
|
\v 17 వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?>>
|
|
|
|
\s5
|
|
\c 2
|
|
\p
|
|
\v 1 ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
|
|
\s యెహోవా జవాబు
|
|
\p
|
|
\s5
|
|
\v 2 యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా,
|
|
\p నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.
|
|
\p
|
|
\v 3 ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు.
|
|
\p అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు.
|
|
\p అది ఆలస్యం చేయక వస్తుంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 4 మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు.
|
|
\p అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.
|
|
\p
|
|
\v 5 ద్రాక్షారసం
|
|
\f +
|
|
\fr 2:5
|
|
\fq ద్రాక్షారసం
|
|
\ft నంపద
|
|
\f* గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది.
|
|
\p అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు.
|
|
\p అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు.
|
|
\p
|
|
\s5
|
|
\v 6 తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ.
|
|
\p తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు?
|
|
\p వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా.
|
|
\p
|
|
\v 7 పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు.
|
|
\p నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు.
|
|
\p నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు.
|
|
\p
|
|
\v 8 నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు.
|
|
\p పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.
|
|
\p
|
|
\s5
|
|
\v 9 తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని,
|
|
\p తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.
|
|
\p
|
|
\v 10 నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు.
|
|
\p నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు.
|
|
\p
|
|
\v 11 గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి.
|
|
\p దూలాలు వాటికి జవాబిస్తాయి.
|
|
\p
|
|
\s5
|
|
\v 12 రక్తపాతం మూలంగా పట్టణం కట్టించే వారికి బాధ.
|
|
\p దుష్టత్వం మూలంగా ఊరిని స్థాపించే వారికి బాధ.
|
|
\p
|
|
\v 13 జాతులు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారు.
|
|
\p వ్యర్థమైన దాని కోసం కష్టపడి ప్రజలు క్షీణించిపోతారు.
|
|
\p ఇది సేనల ప్రభువు యెహోవా చేతనే అవుతుంది.
|
|
\p
|
|
\v 14 ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 15 తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.
|
|
\p
|
|
\v 16 ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు.
|
|
\p నీవు కూడా తాగి నీ నగ్నత కనపరచుకుంటావు.
|
|
\p యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది.
|
|
\p అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 17 లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది.
|
|
\p నీవు పశువులను చేసిన నాశనం నీ మీదే పడుతుంది.
|
|
\p దేశాలకు, పట్టణాలకు, వాటి నివాసులకు, నీవు చేసిన హింసాకాండను బట్టి, ఇది సంభవిస్తుంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 18 చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి?
|
|
\p బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు.
|
|
\p తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?
|
|
\p
|
|
\v 19 కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ.
|
|
\p అవి ఏమైనా బోధించగలవా?
|
|
\p దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.
|
|
\p
|
|
\v 20 అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు.
|
|
\p లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.
|
|
|
|
\s5
|
|
\c 3
|
|
\s హబక్కూకు ప్రార్థన
|
|
\p
|
|
\v 1 ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన (వాద్యాలతో పాడదగినది).
|
|
\p
|
|
\v 2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను.
|
|
\p యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు.
|
|
\p ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి.
|
|
\p కోపంలో కనికరం మరచిపోవద్దు.
|
|
\p
|
|
\s5
|
|
\v 3 దేవుడు తేమాను
|
|
\f +
|
|
\fr 3:3
|
|
\fq తేమాను
|
|
\ft యూదాకు దక్షిణగా ఉన్న ఎదోం దేశంలో ఉన్న ప్రాంతం
|
|
\f* లో నుండి వచ్చాడు.
|
|
\p పరిశుద్ధ దేవుడు పారాను
|
|
\f +
|
|
\fr 3:3
|
|
\fq పారాను
|
|
\ft సీనాయికి దక్షిణ సరిహద్దులో ఉన్న బీడు భూమి
|
|
\f* లో నుండి వేంచేస్తున్నాడు (సెలా).
|
|
\p ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది.
|
|
\p భూమి ఆయన స్తుతితో నిండి ఉంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 4 ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి.
|
|
\p అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు.
|
|
\p
|
|
\v 5 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి.
|
|
\p ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి.
|
|
\p
|
|
\s5
|
|
\v 6 ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు.
|
|
\p నిత్య పర్వతాలు బద్దలైపోయాయి.
|
|
\p పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు.
|
|
\p
|
|
\s5
|
|
\v 7 కూషీయుల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను.
|
|
\p మిద్యాను దేశస్థుల గుడారాల తెరలు గజగజ వణికాయి.
|
|
\p
|
|
\v 8 యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా?
|
|
\p నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా?
|
|
\p సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా?
|
|
\p
|
|
\s5
|
|
\v 9 విల్లు వరలోనుండి తీశావు. బాణాలు ఎక్కుపెట్టావు.
|
|
\p భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు.
|
|
\p
|
|
\v 10 పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి.
|
|
\p జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి.
|
|
\p సముద్రాగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 11 నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు.
|
|
\p
|
|
\v 12 బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు.
|
|
\p మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు.
|
|
\p
|
|
\s5
|
|
\v 13 నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు.
|
|
\p నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు.
|
|
\p దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా).
|
|
\p
|
|
\s5
|
|
\v 14 పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు.
|
|
\p
|
|
\v 15 నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు.
|
|
\p నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి.
|
|
\p
|
|
\s5
|
|
\v 16 నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది.
|
|
\p
|
|
\s5
|
|
\v 17 అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా,
|
|
\p ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా,
|
|
\p ఒలీవచెట్లు కాపులేక ఉన్నా,
|
|
\p చేనులో పైరు పంటకు రాకపోయినా,
|
|
\p గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,
|
|
\p
|
|
\s5
|
|
\v 18 నేను యెహోవా పట్ల ఆనందిస్తాను.
|
|
\p నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను.
|
|
\p
|
|
\v 19 ప్రభువైన యెహోవాయే నాకు బలం.
|
|
\p ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు.
|
|
\p ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. |