migrated to RC0.2

This commit is contained in:
Joel Lonbeck 2017-05-18 22:56:45 -07:00
commit 704b5e418e
28 changed files with 17596 additions and 0 deletions

2301
41-MAT.usfm Normal file
View File

@ -0,0 +1,2301 @@
\id MAT Matthew
\s5
\c 1
\s యేసు క్రీస్తు వంశ వృక్షం
\p
\v 1 అబ్రాహాము సంతానంలోని దావీదు, అతని సంతానంలోని యేసు క్రీస్తు వంశావళి.
\v 2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
\v 3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు.
\s5
\v 4 పెరెసు కొడుకు ఎస్రోము, ఎస్రోము కొడుకు అరాము, అరాము కొడుకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.
\v 5 నయస్సోను కొడుకు శల్మాను, శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన కొడుకు బోయజు, బోయజుకు రూతు ద్వారా పుట్టిన కొడుకు ఓబేదు, ఓబేదు కొడుకు యెష్షయి.
\v 6 యెష్షయి కొడుకు దావీదు . గతంలో ఊరియా భార్యగా ఉన్న ఆమెద్వారా దావీదుకు పుట్టిన కొడుకు సొలోమోను.
\s5
\v 7 సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా, అబీయా కొడుకు ఆసా.
\v 8 ఆసా కొడుకు యెహోషాపాతు, యెహోషాపాతు కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు ఉజ్జియా.
\s5
\v 9 ఉజ్జియా కొడుకు యోతాము, యోతాము కొడుకు ఆహాజు, ఆహాజు కొడుకు హిజ్కియా.
\v 10 హిజ్కియా కొడుకు మనష్షే, మనష్షే కొడుకు ఆమోను, ఆమోను కొడుకు యోషీయా.
\v 11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులు బబులోను చెరలోకి వెళ్ళారు.
\s5
\v 12 బబులోనుకు వెళ్ళిన తరువాత వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
\v 13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు, అబీహూదు కొడుకు ఎల్యాకీము, ఎల్యాకీము కొడుకు అజోరు,
\v 14 అజోరు కొడుకు సాదోకు, సాదోకు కొడుకు ఆకీము, ఆకీము కొడుకు ఎలీహూదు.
\s5
\v 15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు, ఎలియాజరు కొడుకు మత్తాను, మత్తాను కొడుకు యాకోబు.
\v 16 యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరున్న యేసు పుట్టాడు.
\v 17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పధ్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకు పధ్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకు పధ్నాలుగు తరాలు.
\s యేసు జననం (లూకా 1:26-35; యోహాను 1:1, 2, 14)
\s5
\p
\v 18 యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయం అయింది కానీ వాళ్ళు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.
\v 19 ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. కాని ఆమెను బహిరంగంగా అవమాన పరచక రహస్యంగా ఆమెను వదిలేద్దామనుకున్నాడు.
\s5
\v 20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత కలలో అతనికి కనిపించి "దావీదు కుమారా, యోసేపూ, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు.
\v 21 తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు" అన్నాడు.
\s5
\v 22 "కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు 'దేవుడు మనతో ఉన్నాడు' అని అర్ధమిచ్చే 'ఇమ్మానుయేలు' అనే పేరు పెడతారు" అని
\v 23 ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.
\s5
\v 24 యోసేపు నిద్ర నుంచి లేచి ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఆమెను భార్యగా స్వీకరించాడు.
\v 25 ఆమె కొడుకును కనే వరకు ఆమెను కూడలేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
\s5
\c 2
\s జ్ఞానుల సందర్శన
\p
\v 1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే వూళ్ళో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాలనుండి జ్ఞానులు కొందరు యెరూషలేము వచ్చి
\v 2 "యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము" అన్నారు.
\v 3 హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారు పడ్డారు .
\s5
\v 4 కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రజ్ఞులు అందరినీ పిలిపించి "క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?" అని వారిని అడిగాడు.
\v 5 అందుకు వాళ్ళు "యూదయ ప్రాంతం లోని బేత్లెహేములో. 'యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజకు కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు' అని ప్రవక్తలు రాశారు" అని చెప్పారు.
\v 6 అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను ఏకాంతంగా పిలిపించి,
\s5
\v 7 ఆ నక్షత్రం కనిపించిన సరైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు.
\v 8 తరువాత వారిని బేత్లెహేము పంపుతూ "మీరు వెళ్లి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయన్ని కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి అతన్నిఆరాధిస్తాను" అని చెప్పాడు.
\s5
\v 9 వాళ్ళు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలం పైన ఆగింది.
\v 10 ఆ నక్షత్రం చూచి, వాళ్ళు అత్యధికంగా ఆనందించారు.
\s5
\v 11 ఇంట్లోకి వెళ్లి శిశువునూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగ పడి, ఆయన్ని ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి, బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు.
\v 12 హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళ వద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వాళ్ళు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.
\s ఈజిప్టు కు పలాయనం
\s5
\p
\v 13 వాళ్ళు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి "లేచి బిడ్డనూ, తల్లినీ తీసుకొని ఐగుప్తు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకు అక్కడే ఉండు. ఎందుకంటే బిడ్డను చంపాలని హేరోదు వెతకబోతున్నాడు." అని అతనితో చెప్పాడు.
\v 14 యోసేపు లేచి, రాత్రి వేళ బిడ్డనూ తల్లినీ తీసికొని ఐగుప్తుకు తరలిపోయాడు.
\v 15 హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉండిపోయాడు. 'ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను' అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.
\s పసి పిల్లల వధ
\s5
\p
\v 16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములోనూ దాని పరిసర గ్రామాలన్నిటిలోనూ రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.
\s5
\v 17 దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.
\v 18 " ఏడుపు, రోదనలతో రామాలో ఒక స్వరం వినబడింది. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది."
\s ఈజిప్టు నుంచి నజరేతు రాక (లూకా 2:39,40)
\s5
\p
\v 19 హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి
\v 20 "నీవు లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసికొని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు.
\v 21 బాలుడి ప్రాణం తీయాలని చూసేవాళ్ళు చనిపోయారు" అని చెప్పాడు. అప్పుడతడు లేచి, పిల్లవాణ్ణీ, తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చాడు.
\s5
\v 22 అయితే అర్కెలా తన తండ్రి హేరోదుకు బదులు యూదయ ప్రాంతాన్ని
\v 23 పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్లడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలలీ ప్రాంతానికి వెళ్లి, నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
\s5
\c 3
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మార్కు 1:3-8; లూకా 3:2-17; యోహాను 1: 6-8, 19-28)
\p
\v 1 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి
\v 2 "పరలోకరాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాప పడండి" అని యూదయ అరణ్యంలో బోధిస్తూ ఉన్నాడు.
\v 3 పూర్వం యెషయా ప్రవక్త చెప్పింది ఇతన్ని గురించే - "అరణ్యంలో ఒకని స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. 'ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన తోవలు తిన్నగా చేయండి."
\s5
\v 4 ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
\v 5 యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరకు వచ్చి,
\v 6 తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.
\s5
\v 7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు "మీరు విషసర్పాల పిల్లలు. రాబోయే దైవాగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
\v 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.
\v 9 'అబ్రాహాము మా తండ్రి' అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
\s5
\v 10 ఇప్పటికే గొడ్డలి, చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
\v 11 పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా కంటే గొప్పవాడు నా తరువాత వస్తున్నాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
\v 12 తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు" అని చెప్పాడు.
\s యేసు బాప్తిసం (మార్కు 1:9-11; లూకా 3:21,22; యోహాను 1: 31-34)
\s5
\p
\v 13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలలీ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరకు వచ్చాడు.
\v 14 అయితే యోహాను "నేను నీచేత బాప్తిసం పొందాల్సి ఉంటే నీవు నా దగ్గరకు వస్తున్నావా?" అని ఆయన్ని నివారింప జూశాడు గానీ
\v 15 యేసు "ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే" అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.
\s5
\v 16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురం లాగా దిగి తన మీదికి వాలడం ఆయన చూశాడు.
\v 17 "ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం" అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.
\s5
\c 4
\s యేసు ఎదుర్కొన్న పరీక్ష (మార్కు 1: 12, 13; లూకా 4: 1- 13; అది 3: 6)
\p p
\v 1 అప్పుడు సాతాను యేసును పరీక్షించడం కోసం ఆత్మ ఆయన్ను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు.
\v 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది.
\v 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి "నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు.
\v 4 అందుకు ఆయన "మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\v 5 అప్పుడు సాతాను ఆయన్ని పవిత్ర నగరం తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి
\v 6 "నీవు దేవుని కుమారుడివయితే కిందికి దూకు. ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 'నీ పాదానికి రాయి తగలకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు' అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\v 7 "'ప్రభువయిన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు' అని కూడా రాసి ఉంది" అని యేసు అతనితో అన్నాడు.
\v 8 మళ్ళీ సాతాను చాలా ఎత్తయిన ఒక కొండపైకి ఆయన్ని తీసుకుపోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్నీ ఆయనకు చూపించాడు.
\v 9 "నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను" అన్నాడు.
\s5
\v 10 అప్పుడు యేసు "సాతానా! అవతలికి పో! 'ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయననే నువ్వు సేవించాలి' అని రాసి ఉంది" అన్నాడు.
\v 11 అప్పుడు సాతాను ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేసారు.
\s యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభంలో కపెర్నహూముకు రాక (మార్కు 1:14; లూకా 4:14,15)
\s5
\p
\v 12 యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలలీ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు.
\v 13 నజరేతు విడిచి వెళ్లి కపెర్నహూము లో నివసించాడు. అది గలలీ సముద్ర తీరాన జెబూలూను నఫ్తాలి ప్రాంతాలలో ఉంది.
\s5
\v 14 యెషయా ప్రవక్త ద్వారా పలికింది ఈ విధంగా నెరవేరింది.
\v 15 "జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున్న యూదేతరుల గలలీ రాష్ట్రం ప్రాంతాల్లో చీకటిలో కూర్చున్న ప్రజలూ గొప్ప వెలుగు చూశారు.
\v 16 చావు నీడలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది."
\s5
\v 17 అప్పటినుంచి యేసు, "పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడండి" అంటూ బోధించడం మొదలు పెట్టాడు.
\s పేతురు అంద్రెయలకు పిలుపు (మార్కు 1: 16-20; లూకా 5: 2-11)
\s5
\p
\v 18 యేసు గలలీ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వాళ్ళు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు.
\v 19 యేసు వారితో, "నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను" అని పిలిచాడు.
\v 20 వెంటనే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
\s జెబెదయి కుమారులు యాకోబు, యోహానుల కు పిలుపు
\s5
\p
\v 21 యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్న దమ్ములను చూశాడు. వాళ్ళు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వాళ్ళు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి పిలిచాడు.
\v 22 వెంటనే వాళ్ళు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయన్ని వెంట వెళ్ళారు.
\s5
\v 23 యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలలీ ప్రాంతమంతా తిరిగాడు.
\v 24 ఆయన పేరు సిరియ దేశమంతా తెలిసిపోయింది. రక రకాల రోగాలతో నొప్పులతో బాధపడుతున్నవాళ్ళనీ దయ్యాలు పట్టిన వాళ్ళనీ మూర్ఛ రోగుల్నీ పక్షవాతం వచ్చిన వాళ్ళనీ ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వాళ్ళని బాగు చేశాడు.
\v 25 గలలీ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.
\s5
\c 5
\s పర్వత ప్రసంగం (లూకా 6:20- 49). నవ ధన్యతలు (లూకా 6: 20-23)
\p
\v 1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూచి కొండ ఎక్కి వెళ్లి కూర్చోగానే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
\v 2 ఆయన ఇలా ఉపదేశించసాగాడు.
\v 3 "ఆత్మలో దీనులుగా ఉన్న వాళ్ళు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
\v 4 దుఃఖించే వాళ్ళు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.
\s5
\v 5 సాధు గుణం గల వాళ్ళు ధన్యులు, ప్రపంచానికి వాళ్ళు వారసులు.
\v 6 నీతి కోసం ఆకలిదప్పులు ఉన్న వాళ్ళు ధన్యులు, వారికి తృప్తి కలుగుతుంది.
\v 7 దయ చూపే వాళ్ళు ధన్యులు, వారికి దయ లభిస్తుంది.
\v 8 పవిత్ర హృదయం గల వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవున్ని చూస్తారు.
\s5
\v 9 శాంతి కుదిర్చే వాళ్ళు ధన్యులు, వారిని దేవుని కుమారులు అంటారు.
\v 10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యే వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
\s5
\v 11 నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు.
\v 12 అప్పుడు సంతోషించండి! చాలా ఆనందించండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు.
\s విశ్వాసి పోలికలు (మార్కు 4: 21-23; లూకా 8: 16-18)
\s5
\p
\v 13 లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళకింద తొక్కడానికి తప్ప ఇంక దేనికీ పనికిరాదు.
\v 14 ప్రపంచానికి మీరు వెలుగు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.
\s5
\v 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడా దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.
\v 16 మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింప జేయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
\s క్రీస్తుకు ధర్మశాస్త్రం తో సంబంధం
\s5
\p
\v 17 నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దుచేయడానికి కాదు.
\v 18 నేను కచ్చితంగా చెబుతున్నాను, ఆకాశమూ భూమీ నశించే వరకు, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు దాని నుంఛి ఒక్క పొల్లు అయినా ఒక సున్న అయినా తప్పిపోదు.
\s5
\v 19 కాబట్టి ఈ ఆజ్ఞలలో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, అలా చేయమని బోధించే వాణ్ణి పరలోకరాజ్యంలో తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ వాటిని తానూ తాను చేస్తూ బోధించేవాడిని పరలోక రాజ్యంలో గొప్పవానిగా లెక్కిస్తారు .
\v 20 ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి మిన్నగా ఉండక పోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.
\s5
\v 21 'హత్య చేయకూడదు. హత్య చేసేవానికి శిక్ష పడుతుంది' అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.
\v 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివానికీ శిక్ష పడుతుంది. తన సోదరుణ్ణి 'పనికిమాలినవాడా' అనే ప్రతివాడూ మహాసభ ఎదుట నిలబడాలి. 'మూర్ఖుడా' అనే ప్రతివానికీ నరకాగ్ని తప్పదు.
\s5
\v 23 కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వస్తే
\v 24 నీ కానుక అక్కడే, బలిపీఠం ఎదుటనే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తర్వాత వచ్చి నీ కానుక అర్పించు.
\s5
\v 25 నీ ప్రత్యర్ధి తో న్యాయ స్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీ పడు. లేకపోతే నీ ప్రత్యర్ధి నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాలలో వేయిస్తాడేమో.
\v 26 చెల్లించాల్సి ఉన్న దాన్నంతా చెల్లించే వరకూ అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 27 'వ్యభిచారం చేయకూడదు' అని చెప్పడం మీరు విన్నారు గదా
\v 28 కానీ నేను మీతో చెప్పేదేంటంటే ఒక స్త్రీని కామపు చూపు చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
\s5
\v 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమయితే దానిని పీకి పారవెయ్యి. నీ శరీర మంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
\v 30 నీ కుడిచెయ్యి నీవు పాపం చేయడానికి కారణమయితే దానిని నరికి పారవెయ్యి. నీ శరీర మంతా నరకం లో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
\s విడాకుల గురించి యేసు ఉపదేశం (మత్తయి 13: 3-11; మార్కు 10: 2-12; 1 కొరింతి 7: 10- 15)
\s5
\p
\v 31 'తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకులు రాసి ఇవ్వాలి' అని చెప్పడం కూడా మీరు విన్నారు.
\v 32 నేను మీతో చెప్పేదేంటంటే వ్యభిచార కారణం లేకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్లి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
\s కచ్చితమైన మాట
\s5
\p
\v 33 'నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి' అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
\v 34 అయితేనేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు. అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు.
\v 35 అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం.
\s5
\v 36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.
\v 37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. అలా కానిది సాతాను సంబంధమైనదే.
\s5
\v 38 'కంటికి బదులుగా కన్ను, పన్నుకు బదులుగా పన్ను' అని చెప్పింది మీరు విన్నారు గదా.
\v 39 కానీ నేను మీతో చెప్పేదేంటంటే దుష్టుణ్ణి ఎదిరించ వద్దు. ఎవరైనా నీ కుడిచెంప మీద నిన్ను కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
\s5
\v 40 ఎవరైనా నీ అంగీ విషయం వాదం పెట్టు కుంటే అతనికి నీ పైచొక్కా కూడ ఇచ్చివెయ్యి.
\v 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్లు వెళ్లు.
\v 42 నిన్ను అడిగిన వానికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వానికి నీ ముఖం చాటు చేయవద్దు.
\s ధర్మశాస్త్రానికి మించిన నీతి
\s5
\p
\v 43 'నీ పొరుగు వాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు' అని చెప్పింది మీరు విన్నారు గదా.
\v 44 నేను మీతో చెప్పేదేంటంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారికోసం ప్రార్థించండి.
\v 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారికీ మంచి వారికీ తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులకూ, దుర్మార్గులకూ వాన కురిపిస్తున్నాడు.
\s5
\v 46 మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు గదా.
\v 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువ ఏమి చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా.
\v 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
\s5
\c 6
\s పర్వత ప్రసంగం- బాహ్యాచారాలపై విమర్శ
\p
\v 1 ప్రజలకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ఫలమూ రాదు.
\v 2 కాబట్టి దానం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముందు బాకా ఊదించు కోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాలలో, వీధుల్లో అలా చేస్తారు. వారి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 3 నువ్వైతే దానం చేసేటప్పుడు నీ కుడిచెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు.
\v 4 అప్పుడు ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\s5
\v 5 మీరు ప్రార్థనచేసేటప్పుడు దొంగ భక్తుల లాగా ఉండవద్దు. ప్రజలకు కనబడాలని వాళ్ళు సమాజ మందిరాలలో, వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
\v 6 నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసి, ఏకాంతంలో నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\v 7 మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరులలాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటున్నారు.
\s ప్రార్థన గురించి సరికొత్త ఉపదేశం (లూకా 11: 1-3)
\s5
\p
\v 8 కాబట్టి మీరు వారి లాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు
\v 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. "పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రంగా ఉండాలి.
\v 10 నీ రాజ్యం రావాలి. పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరాలి.
\s5
\v 11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
\v 12 మాపట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్టు మా అపరాధాలు క్షమించండి.
\v 13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించండి."
\s5
\v 14 మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు.
\v 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించక పోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.
\s5
\v 16 మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వాళ్ళు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
\v 17 అయితే మీరు ఉపవాసం ఉన్నపుడు తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కోండి
\v 18 అప్పుడు ప్రజలకు కాక, ఏకాంతంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు. అప్పుడు ఏకాంతంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\s5
\v 19 భూమిమీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు.
\v 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలు గానీ, తుప్పు గానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు.
\v 21 నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
\s5
\v 22 శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్నుబాగుంటే నీ శరీర మంతా వెలుగుతో నిండి ఉంటుంది.
\v 23 నీ కన్ను బాగోపోతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగు వాస్తవంగా చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!
\v 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకనికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగేదేవునికీ సంపదకూ సేవ చేయడం కుదరదు.
\s దిగులుకు విరుగుడు- తండ్రిపై నమ్మకం
\s5
\p
\v 25 అందుచేత నేను మీతో చెప్పేదేంటంటే, ఏమి తినాలి? ఏమి తాగాలి? అని మీ జీవితాన్ని గురించి గానీ, ఏమి కట్టుకోవాలి? అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా!
\v 26 ఎగిరే పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు, కోతకోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటె ఎంతో విలువైన వాళ్ళు కాదా?
\s5
\v 27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవిత కాలాన్ని కాస్త పెంచుకోగలడు?
\v 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లోని పూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి శ్రమ పడవు, బట్టలు నేయవు.
\v 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సయితం వీటిలో ఒక్క దాని కున్నంత అలంకారం లేదు.
\s5
\v 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
\v 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమీ కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. దేవుడంటే తెలియని వాళ్ళు వీటి కోసం తాపత్రయ పడతారు.
\s5
\v 32 ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు.
\v 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.
\v 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూచుకుంటుంది. ఏరోజు కష్టం ఆ రోజుకు చాలు.
\s5
\c 7
\s పర్వత ప్రసంగం- ఇతరులను తప్పులెన్నడం
\p
\p
\v 1 ఇతరులకు తీర్పు తీర్చవద్దు అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు.
\v 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది.
\s5
\v 3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు?
\v 4 నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో "నీ కంటిలోని నలుసు తీయనివ్వు" అని ఎందుకు చెప్తావు?
\v 5 కపట వేషధారీ ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలోఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.
\s5
\v 6 పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్ట వద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయొద్దు. అలాచేస్తే పందులు వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి. కుక్కలు మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.
\s ప్రార్థనకు ప్రోత్సాహం (లూకా11: 1-13)
\s5
\p
\v 7 అడగండి. మీకు ఇస్తారు. వెదకండి. మీకు దొరుకుతుంది. తట్టండి. మీకు తలుపు తీస్తారు.
\v 8 అడిగే ప్రతివానికీ లభిస్తుంది. వెదికే వానికి దొరుకుతుంది. తట్టే వానికి తలుపు తెరవడం జరుగుతుంది.
\v 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయి ఇస్తాడా? చేప అడిగితే పామునిస్తాడా?
\v 10 మీరు చెడ్డ వాళ్ళు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఎలా ఇవ్వాలో తెలుసు గదా!
\s5
\v 11 అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.
\s రెండు దారులు (కీర్తన 1)
\p
\v 12 కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.
\s5
\v 13 ఇరుకు ద్వారం ద్వారా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు.
\v 14 జీవానికి దారితీసే ద్వారం ఇరుకు. దారి కష్టం. దాన్ని కనుక్కొనే వాళ్ళు కొంతమందే.
\s కపట బోధకుల గురించి హెచ్చరికలు
\s5
\p
\v 15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్లు.
\v 16 వారు చేసే పనుల ప్రతి ఫలాన్ని బట్టి వారిని తెలుసుకోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూర పండ్లు గానీ కోస్తారా?
\v 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు, పనికి మాలిన పండ్లు కాస్తుంది.
\s5
\v 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.
\v 19 మంచి పండ్లు కాయని ప్రతిచెట్టునూ నరికి మంటల్లో వేస్తారు.
\v 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
\s విశ్వాసం లేకుండా నోటి మాటల వల్ల లాభం లేదు
\s5
\p
\v 21 "ప్రభూ, ప్రభూ," అని నన్ను పిలిచే వారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు, పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.
\v 22 ఆ రోజున చాలామంది నాతో, "ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ పేరున దయ్యాల్ని వెళ్ళగొట్టలేదా? నీ పేరున చాలా అద్భుతాలు చేయలేదా?" అంటారు.
\v 23 అప్పుడు నేను "దుర్మార్గులారా, నేను మిమ్మల్ని అసలు ఎరగను. నా దగ్గర నుండి వెళ్లి పొండి" అంటాను.
\s రెండు రకాల పునాదులు
\s5
\p
\v 24 కాబట్టి నా ఈ మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు గట్టి నేల మీద తన యిల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.
\v 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెను గాలులు ఆ యింటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
\s5
\v 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన యిల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.
\v 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ యింటి మీద కొట్టాయి. అప్పుడది కూలి పోయింది. అది ఘోరమైన పతనం."
\s5
\v 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
\v 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడి లాగా వారికి బోధించాడు.
\s5
\c 8
\s యేసు కుష్టరోగిని బాగు చేయడం
\p
\v 1 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
\v 2 ఒక కుష్టురోగి వచ్చి ఆయనకు మొక్కి "ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు" అన్నాడు.
\v 3 యేసు చేయి చాపి అతణ్ణి తాకి"నాకిష్టమే, నువ్వు బాగుపడు" అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది.
\s5
\v 4 అప్పుడు యేసు అతనితో "చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు" అని చెప్పాడు.
\s యేసు శతాధిపతి సేవకుణ్ణి బాగు చేయడం (లూకా7: 1- 10)
\s5
\p
\v 5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి,
\v 6 "ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు" అని చెప్పాడు.
\v 7 "నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను" అని యేసు అతనితో అంటే
\s5
\v 8 ఆ శతాధిపతి "ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. పనివాడు బాగుపడతాడు.
\v 9 నేను కూడా అధికారం కింద ఉన్న వాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవరినైనా 'వెళ్ళు' అంటే వెళ్తాడు. ఎవరినైనా 'రా' అంటే వస్తాడు. నా పనివాణ్ణి 'ఇది చెయ్యి' అంటే చేస్తాడు" అని జవాబిచ్చాడు.
\v 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో అన్నాడు "ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 11 తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో కూర్చుంటారు.
\v 12 అయితే రాజ్యానికి చెందిన వారిని బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి."
\v 13 యేసు శతాధిపతితో " వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది" అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగు పడ్డాడు.
\s పేతురు అత్తకు స్వస్థత (మార్కు 1:29-34; లూకా 4: 38-41)
\s5
\p
\v 14 తరువాత యేసు, పేతురు ఇంటిలోకి వెళ్లి, జ్వరంతో పడుకున్న అతని అత్తను చూశాడు.
\v 15 యేసు ఆమె చేతిని ముట్టగానే జ్వరం పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.
\s5
\v 16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలామందిని ప్రజలు ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.
\v 17 ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేసాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, "ఆయనే మన బాధలను భరించాడు. మన రోగాలను సహించాడు."
\s5
\v 18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపుల్ని చూచి గలలీ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.
\s శిష్యులుగా ఉండగోరే వారికి పరీక్ష (లూకా 9: 57- 62)
\p
\v 19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి "బోధకుడా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను" అన్నాడు.
\v 20 అందుకు యేసు అతనితో "నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మానవ పుత్రునికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు" అన్నాడు.
\s5
\v 21 ఆయన శిష్యులలో మరొకడు "ప్రభూ, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి" అని ఆయన్ని అడిగాడు.
\v 22 అయితే యేసు అతనితో "నాతో రా. చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి చనిపోయిన వాళ్ళు ఉన్నారులే!" అన్నాడు.
\s యేసు తుఫానును ఆపడం (మార్కు 4: 36- 41; లూకా 8: 22-25)
\s5
\p
\v 23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.
\v 24 సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.
\v 25 వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి "ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి" అంటూ ఆయన్ని లేపారు.
\s5
\v 26 యేసు వారితో "అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు?" అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.
\v 27 శిష్యులు ఆశ్చర్యపడి "ఈయన ఎలాంటివాడో గానీ గాలీ, సముద్రం ఈయన మాట వింటున్నాయే" అని చెప్పుకున్నారు.
\s గదరా ప్రదేశం లో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం (మార్కు 5: 1-21; లూకా 8: 26- 40)
\s5
\p
\v 28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధులలో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవడూ ఆ దారిన వెళ్లలేక పోయేవాళ్ళు.
\v 29 ఆ దయ్యాలు "దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?" అని కేకలు వేసాయి.
\s5
\v 30 వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
\v 31 "నీవు మమ్మల్ని బయటికి వెళ్ల గొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి" అని యేసును ప్రాధేయపడ్డాయి.
\v 32 యేసు "పొండి" అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ సముద్రంలో పడి చచ్చిపోయాయి.
\s5
\v 33 ఆ పందుల మందను కాసే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్లి జరిగినదంతా, అంటే దయ్యాలు పట్టిన వాళ్ళ సంగతి తెలియజేశారు.
\v 34 అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా యేసుకు ఎదురు వచ్చారు. ఆయన్ని చూచి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమని ఆయన్ని బతిమాలారు.
\s5
\c 9
\s యేసు కపెర్నహూముకు తిరిగి వచ్చి పక్షవాతరోగిని బాగు చేయడం (మార్కు 2:3-12; లూకా 5:18-36)
\p
\v 1 యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు.
\v 2 కొంతమంది ఒక పక్షవాత రోగిని పడక మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి "బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలు క్షమించాను" అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు.
\s5
\v 3 ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకుంటుంటే,
\v 4 యేసు వారి ఆలోచనలు గ్రహించి "మీరెందుకు మీ హృదయాలలో దురాలోచనలు చేస్తున్నారు?
\v 5 నీ పాపాలు క్షమించాను అని చెప్పడం తేలికా? లేచి నడవమని చెప్పడం తేలికా?
\v 6 అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి" అని చెప్పి, పక్షవాత రోగితో, "నీవు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 7 అతడు లేచి తన యింటికి వెళ్ళిపోయాడు.
\v 8 ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
\s మత్తయి పిలుపు (మార్కు 2:14; లూకా 5: 27-29)
\p
\v 9 యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూసాడు. యేసు అతనితో, "నా వెంట రా!" అన్నాడు. అతడు లేచి ఆయన్ని అనుసరించాడు.
\s5
\v 10 మత్తయి ఇంట్లో భోజనానికి యేసు కూర్చున్నపుడు చాలామంది పన్ను వసూలు చేసే వాళ్ళూ పాపులూ వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో కూర్చున్నారు.
\v 11 పరిసయ్యులు అది గమనించి, "మీ బోధకుడు సుంకం వసూలు చేసే వాళ్ళతో పాపులతో కలిసి తింటున్నాడేంటి?" అని ఆయన శిష్యులను అడిగారు.
\s5
\v 12 యేసు అది విని "ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు, రోగికే అవసరం.
\v 13 పశ్చాత్తాపపడాలని నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్లి 'మీరు బలి యాగాలు అర్పించడం కాదు, దయ చూపించాలనే కోరుతున్నాను' అనే వాక్యం భావం నేర్చుకోండి" అని చెప్పాడు.
\s5
\v 14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి "పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గాని నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?" అని ఆయన్ని అడిగారు.
\v 15 యేసు వారికిలా జవాబిచ్చాడు. "పెళ్లికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్లింట్లోని వాళ్ళు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు.
\s రెండు ఉపమానాలు ( మార్కు 2:21; లూకా 5: 36- 39)
\s5
\p
\v 16 ఎవడూ పాత బట్టకు కొత్తబట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు, బట్టను చించుతుంది, చినుగు పెద్దదవుతుంది.
\s5
\v 17 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.
\s యేసు రుతు స్రావమున్న స్త్రీని బాగు చేయడం, యాయీరు కుమార్తెను బ్రతికించడం (మార్కు 5:22- 43; లూకా 8:41- 56)
\s5
\p
\v 18 ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, "నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది" అన్నాడు.
\v 19 అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
\s5
\v 20 అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ
\v 21 ఆయన వెనకగా వచ్చి "నేను ఆయన పై బట్ట తాకితే బాగుపడతాను" అని తనలో తాను అనుకొని, ఆయన పై బట్ట తాకింది.
\v 22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి, "కుమారీ, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది" అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
\s5
\v 23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వేణువులు వాయించేవారినీ గోల చేస్తున్న గుంపునూ చూచి
\v 24 " వెళ్ళిపోండి. అమ్మాయి చనిపోలేదు. నిద్ర పోతూ ఉంది" అన్నాడు. అయితే వాళ్ళు నవ్వి ఆయన్ని హేళన చేసారు.
\s5
\v 25 అయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ అమ్మాయి లేచింది.
\v 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
\s ఇద్దరు గుడ్డి వారికి చూపు
\s5
\p
\v 27 యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయనను అనుసరిస్తూ "దావీదు కుమారుడా, మామీద దయ చూపించు" అని కేకలు వేశారు.
\v 28 యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు వాళ్ళతో "నేను దీనిని చేయగలనని మీరు నమ్ముతున్నారా?" అని వారిని అడిగితే
\s5
\v 29 వాళ్లు "అవును ప్రభూ" అన్నారు. అప్పుడాయన వారి కళ్ళు ముట్టి "మీరు నమ్మినట్టే మీకు జరుగు గాక" అన్నాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది.
\v 30 అప్పుడు యేసు, "ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి" అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు.
\v 31 అయినా వాళ్ళు బయటికి వెళ్లి ఆ ప్రాంతమంతా ఆ విషయాన్ని ప్రచారం చేసారు.
\s5
\v 32 యేసు, ఆయన శిష్యులు వెళ్తూ ఉంటే కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ని ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు.
\v 33 దయ్యాన్ని వెళ్లగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, "ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు" అని చెప్పుకున్నారు.
\v 34 అయితే పరిసయ్యులు, "ఇతడు దయ్యాల రాజు వలన దయ్యాలను వెళ్లగొడున్నాడు" అన్నారు.
\s గలిలయలో పరిచర్య (మార్కు 6: 5,6)
\s5
\p
\v 35 యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాల్నీ వ్యాధుల్నీ బాగుచేస్తూ అన్ని పట్టణాలలో గ్రామాలలో తిరిగాడు.
\v 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. వాళ్ళు కాపరి లేని గొర్రెల లాగా అలిసి చెదిరిపోయి ఉన్నారు.
\s5
\v 37 ఆయన తన శిష్యులతో "కోత చాలా ఎక్కువగా ఉంది, కానీ కూలి వాళ్ళు తక్కువగా ఉన్నారు.
\v 38 కాబట్టి తన కోతకు కూలి వాళ్ళను త్వరగా పంపమని కోత యజమానిని వేడుకోండి" అని తన శిష్యులతో చెప్పాడు.
\s5
\c 10
\s యేసు పన్నెండు మందిని పంపించడం (మార్కు 6: 7- 13; లూకా 9: 1-6) ల
\p
\v 1 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికీ అన్నిరకాల రోగాల్నీ వ్యాధుల్నీ బాగుచేయడానికి, వారికి అధికారం ఇచ్చాడు.
\s5
\v 2 ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను.
\v 3 ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి అనే వేరొక పేరున్న లెబ్బయి,
\v 4 కనానీయుడు సీమోను, ఆయన్ని అప్పగించిన ఇస్కరియోతు యూదా.
\s5
\v 5 యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, "మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్లొద్దు.
\v 6 ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి.
\v 7 వెళుతూ పరలోకరాజ్యం సమీపంగా ఉందని ప్రకటించండి.
\s5
\v 8 రోగులను బాగుచేయండి. చనిపోయినవారిని లేపండి. కుష్టురోగులను శుద్ధి చెయ్యండి. దయ్యాలను వెళ్లగొట్టండి. ఉచితంగా పొందారు. ఉచితంగానే ఇవ్వండి.
\v 9 బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు.
\v 10 ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.
\s5
\v 11 మీరు ఏదైనా పట్టణం లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడనుండి వెళ్ళే వరకు అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.
\v 12 ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి.
\v 13 ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని లోకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.
\s5
\v 14 ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుండా మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరు గానీ, విడిచి వెళ్లి పోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి.
\v 15 తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటె సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s 16 రానున్న గడ్డు రోజులు
\s5
\p
\v 16 తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా , పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.
\v 17 మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాలలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.
\v 18 వీరికీ యూదేతరులకూ సాక్ష్యార్థమై నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరికీ రాజుల దగ్గరికీ తెస్తారు.
\s5
\v 19 వాళ్ళు మిమ్మల్ని అప్పగించేటపుడు, 'ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?' అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియ చేస్తాడు.
\v 20 మాటలాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుతాడు.
\s5
\v 21 సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ, చావుకు అప్పగిస్తారు. పిల్లలు తలిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు.
\v 22 నా పేరు కోసం అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకు సహించేవారిని దేవుడు రక్షిస్తాడు.
\v 23 వాళ్ళు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నిటికీ వెళ్లి ఉండరు అని కచ్చితంగా మీతో చెబుతున్నాను.
\s5
\v 24 గురువు కంటె శిష్యుడూ యజమాని కంటె పనివాడూ గొప్పవాడేమీ కాదు.
\v 25 శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వాళ్ళు పేరు పెట్టి ఉంటే అతని ఇంటి వారికి మరింత కచ్చితంగా ఆ పేరు పెడతారు గదా!
\s5
\v 26 కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు.
\v 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడల పైన చాటించండి.
\s అభయం
\s5
\p
\v 28 ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు, ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగలవానికే భయపడండి.
\v 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.
\v 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్కంతా ఉంది.
\v 31 భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటె ఎంతో విలువైన వారు.
\s5
\v 32 ప్రజల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను.
\v 33 ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకం లో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.
\s శిష్యుడు చెల్లించవలసిన వెల
\s5
\p
\v 34 నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తి తేవడానికి వచ్చాను గానీ శాంతిని కాదు.
\v 35 అంటే ఒక మనిషి తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కూతురు తన తల్లికి వ్యతిరేకంగా, ఒక కోడలు తన అత్తకు వ్యతిరేకంగా అయ్యేలా చేస్తాను.
\v 36 తన ఇంటివాళ్ళే ఒక వ్యక్తికి శత్రువులుగా తయారవుతారు.
\s5
\v 37 నా కంటె ఎక్కువగా తండ్రిని గానీ తల్లిని గానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. నాకంటె ఎక్కువగా కుమారుని గానీ కుమార్తెను గానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.
\v 38 తన సిలువను ఎత్తికొని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.
\v 39 తన ప్రాణం దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు.
\s5
\v 40 మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన ఆయన్ని చేర్చుకుంటాడు.
\v 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు..
\s5
\v 42 శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్లయినా తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\c 11
\p
\v 1 యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాలలో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడనుంచి వెళ్లిపోయాడు.
\s బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులను యేసు దగ్గరకు పంపించడం (లూకా 7:18-35)
\p
\v 2 క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాలలో విని "రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వానికోసం కనిపెట్టాలా?"
\v 3 అని ఆయన్ని అడగడానికి తన శిష్యుల్ని పంపాడు.
\s5
\v 4 యేసు "మీరు వెళ్లి, విన్నవాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియచేయండి.
\v 5 గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, కుష్టురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివాళ్ళు వింటున్నారు, చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.
\v 6 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు" అని జవాబిచ్చాడు.
\s5
\v 7 వాళ్ళు వెళ్లిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు. "మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా? అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు?
\v 8 నాజూకు బట్టలు వేసుకున్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసుకునే వాళ్ళు రాజ భవనాల్లో ఉంటారు.
\s5
\v 9 మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? అవును గాని ఇతడు ప్రవక్త కంటె గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.
\v 10 'నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందు వెళ్లి నీ దారి సిద్ధం చేస్తాడు' అని రాసి ఉన్నది ఇతని గురించే.
\s5
\v 11 స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని కచ్చితంగా మీతో చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అల్పుడు అతని కంటె గొప్పవాడు.
\v 12 బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకు పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత కలవాళ్ళు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు.
\s5
\v 13 యోహాను కాలం వరకు ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ వీటిని గురించి ప్రవచించారు.
\v 14 ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనస్సుంటే రాబోయే ఏలీయా ఇతడే.
\v 15 వినే చెవులున్నవాడు విను గాక.
\s5
\v 16 ఈ తరం వాళ్ళని దేనితో పోల్చాలి? పిల్లలు బజారుల్లో ఆడుకుంటూ
\v 17 'మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ఏడుపు పాట పాడాం గాని మీరు ఏడవలేదు' అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.
\s5
\v 18 ఎందుకంటే యోహాను వచ్చి తినకుండా తాగకుండా ఉండేవాడు. అతనికి దయ్యం పట్టిందని వాళ్ళు అంటున్నారు.
\v 19 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు. కాబట్టి 'వీడు తిండిబోతూ తాగుబోతూ పన్నులు వసూలు చేసే వాళ్ళకూ పాపులకూ స్నేహితుడ'ని వారంటున్నారు. అయితే తెలివి తెలివి కలిగి చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది."
\s జాతి పై యేసు తీర్పు ప్రకటించడం
\s5
\p
\v 20 అప్పుడాయన ఏ పట్టణాలలో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను మందలించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు.
\v 21 అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకొని బూడిదె పూసుకునేవారే.
\v 22 తీర్పు దినాన మీకు పట్టే గతి కంటె తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోతగినది అవుతుంది" అని మీతో చెప్తున్నాను.
\s5
\v 23 కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే!
\v 24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటె సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.
\s5
\v 25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు. "తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతుల్ని మరుగుచేసి చిన్న పిల్లల్లాంటి పామరులకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను.
\v 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీ కెంతో ఇష్టం.
\v 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుని ఎవరూ ఎరగరు. కుమారుడూ, కుమారుడు ఆయన్ని ఎవరికి బయలుపరచాలని ఉద్దేశిస్తాడో వాడు తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
\s యేసు ఇచ్చిన వ్యక్తిగత ఆహ్వానం
\s5
\p
\v 28 మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు అలసట తీరుస్తాను.
\v 29 నేను నెమ్మది, వినయం గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది.
\v 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.
\s5
\c 12
\s యేసు తనను విశ్రాంతి దినానికి ప్రభువుగా ప్రకటించుకోవడం (మార్కు 2: 23-28; లూకా 6:1-5)
\p
\v 1 ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.
\v 2 పరిసయ్యులు అది చూసి , "విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 3 ఆయన వారితో "దావీదుకూ అతనితో ఉన్న వాళ్ళకు ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా?
\v 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవాళ్ళు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు.
\s5
\v 5 విశ్రాంతి రోజున దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులు గానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా?
\v 6 దేవాలయం కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్తున్నాను.
\s5
\v 7 'కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను' అనే వాక్యభావం మీకు తెలిసిఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు.
\v 8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు" అన్నాడు.
\s విశ్రాంతి దినాన చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం (మార్కు 3:1-6; లూకా 6: 6-11)
\s5
\p
\v 9 ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు.
\v 10 వారాయన మీద నేరం మోపాలని, "విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 11 అందుకాయన, "మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దానిని పైకి తీయడా?
\v 12 గొర్రె కంటె మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమే" అని చెప్పి
\s5
\v 13 ఆ మనిషితో, "నీ చెయ్యి చాపు" అన్నాడు. వాడు చెయ్యి చాపగా రెండవ దానిలాగా అది బాగుపడింది.
\v 14 పరిసయ్యులు బయటికి పోయి, ఆయన్ని ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేసారు.
\s యెషయా ప్రవచించిన సేవకుడు(మార్కు 3:7-12)
\s5
\p
\v 15 యేసు ఆ సంగతి తెలిసికొని అక్కడ నుండి వెళ్లిపోయాడు. చాలా మంది ఆయన్ని వెంబడించగా
\v 16 ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.
\v 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే
\s5
\v 18 "ఈయన నా సేవకుడు ఈయన్ని నేను ఏర్పరచుకున్నాను.
\p ఈయనంటే నాకెంతో ఆనందం. ఈయన మీద నా ఆత్మ ఉంచుతాను.
\p ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.
\s5
\p
\v 19 ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వాళ్ళకెవ్వరికీ వినిపించదు.
\p
\v 20 నేను న్యాయవంతుడినని మనుషులకు తెలిసే వరకు ఇలా చేస్తాడు.
\p ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోతున్న వత్తిని నలపడు.
\p
\v 21 ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది."అనే ప్రవచనం.
\s దయ్యాన్ని వెళ్ళగొట్టడం (మార్కు 3:22-౩౦; లూకా 11:14-23)
\s5
\p
\v 22 అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరకు తెచ్చారు. అతడు గుడ్డితనం మూగ కూడా. ఆయన అతణ్ణి బాగుచేసాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి.
\v 23 అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, "ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకున్నారు.
\s5
\v 24 పరిసయ్యులు ఆ మాట విని, " వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్లగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు" అన్నారు.
\v 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, "ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడై పోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ యిల్లయినా నిలవదు.
\s5
\v 26 ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?
\v 27 నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్లగొడుతుంటే మీ వాళ్ళు ఎవరి వలన వెళ్లగొడుతున్నారు? కాబట్టి వాళ్ళే మీకు తీర్పరులవుతారు.
\s5
\v 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్లగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది.
\v 29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలదడు.
\v 30 నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.
\s క్షమాపణ లేని పాపం (మార్కు 3: 29, 30)
\s5
\p
\v 31 కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుంది గాని దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు.
\v 32 మానవ పుత్రునికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుంది గానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలో గానీ రాబోయే లోకంలో గానీ క్షమాపణ ఉండదు.
\s మనిషి పలికే ప్రతి మాట
\s5
\p
\v 33 చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలాకాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు.
\v 34 విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
\v 35 మంచివాడు తన హృదయం లోని మంచి సంపద లోనుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయం లోని చెడ్డ సంపద లోనుండి చెడ్డ వాటిని బయటికి తెస్తాడు.
\s5
\v 36 మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను.
\v 37 నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.
\s యోనా సూచన. యేసు తన మరణ పునరుత్థానాలను ప్రకటించడం (లూకా 11: 24- 26)
\s5
\p
\v 38 అప్పుడు ధర్మశాస్త్ర జ్ఞానులలో పరిసయ్యులలో కొందరు ఆయనకు జవాబిస్తూ, "బోధకుడా, నీవు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది" అన్నారు. ఆయన ఇలా అన్నాడు.
\v 39 "వ్యభిచారులైన ఈ దుర్మార్గపుతరం వాళ్ళు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వను.
\v 40 యోనా మూడు రాత్రింబగళ్లు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భంలో ఉంటాడు.
\s5
\v 41 నీనెవె ప్రజ యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వాళ్ళు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. యోనా కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
\s5
\v 42 తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలోమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
\s5
\v 43 అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది.
\v 44 దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది 'నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను' అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్ది పెట్టి ఉండడం చూస్తుంది. అప్పుడది వెళ్లి తనకంటె చెడ్డవైన మరో ఏడు దయ్యాల్ని వెంటబెట్టుకొని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి.
\v 45 అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది."
\s సరికొత్త సంబంధాలు (మార్కు 3: 31- 35; లూకా 8: 19- 21)
\s5
\p
\v 46 ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు.
\v 47 అప్పుడొకడు, "నీ తల్లీ నీ సోదరులూ నీతో మాటలాడాలని బయట నిలబడి ఉన్నారు" అని ఆయనతో చెప్పాడు.
\s5
\v 48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి "నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?" అని చెప్పి
\v 49 తన శిష్యులవైపు చెయ్యి చాపి, " నా తల్లి, నా సోదరులు వీరే!
\v 50 నా పరలోక తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి" అన్నాడు.
\s5
\c 13
\s పరలోకరాజ్య మర్మాలు. మొదటిది. 1. విత్తనాలు (మార్కు4:1- 20; లూకా 8: 4:15)
\p
\p
\v 1 ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు.
\v 2 ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరితే ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిల్చున్నారు.
\s5
\v 3 ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. "విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.
\v 4 అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పిట్టలు వచ్చి వాటిని మింగేశాయి.
\v 5 కొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయి.
\v 6 పొద్దు పొడిచినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.
\s5
\v 7 కొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల్లో పడ్డాయి. ముళ్ళ మొక్కలు ఎదిగి వాటిని అణిచి వేశాయి.
\v 8 మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్నిముప్పై రెట్లు పండాయి.
\v 9 చెవులున్నవాడు విను గాక!" అన్నాడు.
\s5
\p
\v 10 తరువాత శిష్యులు వచ్చి, "నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు" అన్నారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు.
\v 11 "పరలోక రాజ్య మర్మాలు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు, వారికి తెలియచజేయ లేదు.
\v 12 కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఆతనికి సమృద్ధిగా ఉంటుంది. లేనివాని నుంచి అతని దగ్గర ఉన్నకొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది.
\s5
\v 13 ఇందు కోసమే నేను ఉపమానాలతో వారికి బోధిస్తున్నాను. వాళ్ళు చూన్నారుగానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.
\v 14 యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుతూ ఉంది.
\q 'మీరు వినడానికి వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు,
\q చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.
\q
\s5
\v 15 ఈ ప్రజల హృదయం బండబారి పోయింది.
\q వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది.
\q వారి కళ్ళు మూసుకు పోయాయి.
\q వారు కళ్ళారా చూసి , చెవులారా విని, హృదయంతో గ్రహించి
\q మనస్సు తిప్పుకుని నా వలన బాగు పడే వీలు లేకుండా అయిపోయింది.'
\s5
\p
\v 16 అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.
\v 17 చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్నవాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\p
\v 18 విత్తనాలు చల్లే వాని గురించిన ఉపమాన భావం వినండి.
\v 19 ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన విత్తనాలు పడినవాడు ఇతడే.
\s5
\v 20 రాతినేలను విత్తనాలు పొందినది ఎవరంటే వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు.
\v 21 అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.
\s5
\v 22 ముళ్ళ మొక్కల్లో విత్తనాలు పడింది ఎవరంటే వాక్యం వింటాడు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వాడు ఫలించని వాడై పోతాడు.
\v 23 మంచినేలను విత్తనాలు పడింది ఎవరంటే వాక్యం విని దానిని అర్ధం చేసుకునేవాడు. అలాటి వాళ్ళు నిజంగా ఫలించి వృద్ధిపొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్పై రెట్లు ఫలిస్తారు."
\s రెండవ మర్మం. గోధుమ చేలో కలుపు మొక్కలు (వ. 24 30; 36- 43)
\s5
\p
\v 24 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా పరలోకరాజ్యం ఉంది.
\v 25 మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.
\v 26 మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.
\s5
\v 27 అప్పుడు అ రైతు పనివాళ్ళు అతని దగ్గరికి వచ్చి "అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అని అడిగారు.
\v 28 "ఇది పగవాడు చేసిన పని" అని అతడు వారితో అన్నాడు. ఆ పనివాళ్ళు "మేము వెళ్లి ఆ కలుపు మొక్కల్ని పీకేయమంటారా?" అని అతన్ని అడిగారు.
\s5
\v 29 అందుకతడు, "వద్దు. కలుపు మొక్కల్ని పీకితే వాటితోపాటు గోధుమ మొక్కల్నీ పెళ్లగిస్తారేమో.
\v 30 కోతకాలం వరకు రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో కలుపు మొక్కల్ని పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోధుమలను నా గిడ్డంగిలో చేర్చండి అని కోత కోసే వారికి చెబుతాను", అన్నాడు."
\s మూడవ మర్మం. ఆవ గింజ (మార్కు 4: 30- 32)
\s5
\p
\v 31 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. "పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు.
\v 32 అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి."
\s నాలుగవ మర్మం. పొంగజేసే పదార్థం (లూకా 13: 20, 21)
\s5
\p
\v 33 ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు. "పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో, చాలా కొద్దిగా పులిపిండి వేసి కలుపుతుంది. అప్పుడు అదంతా పులుస్తుంది.
\q1
\s5
\v 34 "నేను నోరారా ఉపమానాలతో బోధిస్తాను. లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను."
\p
\v 35 అని ప్రవక్త చెప్పినమాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా వారికి ఏదీ బోధించలేదు.
\s గోధుమ కలుపు మొక్కల ఉపమానం వివరణ
\s5
\p
\v 36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంటిలోనికి వెళితే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పొలంలోని కలుపు మొక్కల్ని గురించిన ఉపమాన భావం తమకు తెలియజేయమన్నారు.
\v 37 అందుకాయన ఇలా అన్నాడు. మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు.
\v 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు రాజ్యసంబంధులు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు.
\v 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోతకోసే వాళ్ళు దేవదూతలు.
\s5
\v 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది.
\v 41 మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.
\v 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.
\v 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు వింటాడు గాక.
\s ఐదవ మర్మం. భూమిలో నిక్షిప్త నిధి
\s5
\p
\v 44 పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్లి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.
\s అరవ మర్మం. ఆణి ముత్యం
\p
\v 45 పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న వ్యాపారస్తుణ్ణి పోలి ఉంది.
\v 46 అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.
\s ఏడవ మర్మం. లాగే వల
\s5
\p
\v 47 పరలోకరాజ్యం, సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అది రకరకాల చేపలను పడుతుంది.
\v 48 అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరేస్తారు.
\s5
\v 49 ఆలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి,
\v 50 అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి."
\s5
\v 51 "వీటినన్నిటిని మీరు గ్రహించారా?" అని వారిని అడిగితే వాళ్ళు "గ్రహించాము" అన్నారు.
\v 52 ఆయన "అందువలన పరలోకరాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్తవాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిని పోలి ఉన్నాడు" అని వారితో చెప్పాడు.
\s యేసు నజరేతు తిరిగి రాక. మరలా తిరస్కారం (మార్కు 6:1-6; లూకా 4: 16-32)
\p
\v 53 యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాలలో వారికి బోధిస్తూ ఉన్నాడు.
\s5
\v 54 వారు ఆశ్చర్యపడి "ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి?
\v 55 ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా అనే వాళ్ళు ఇతని సోదరులు కారా?
\v 56 ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడనుండి వచ్చాయి?" అని చెప్పుకుని ఆయన్ని అంగీకరించ లేకపోయారు.
\s5
\v 57 అయితే యేసు "ప్రవక్త మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు, తన సొంత ఊళ్ళో తన సొంత ఇంట్లో తప్ప" అని వారితో చెప్పాడు.
\v 58 వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
\s5
\c 14
\s బాప్తిసమిచ్చే యోహాను వధ (మార్కు 6: 14- 29; లూకా 9:7-9)
\p
\v 1 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని
\v 2 "ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి" అని తన సేవకులతో చెప్పాడు.
\s5
\v 3 అంతకు పూర్వం "నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు" అని యోహాను చెప్పినందుకు,
\v 4 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి జైలులో వేయించాడు.
\v 5 హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.
\s5
\v 6 హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వాళ్ళ ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
\v 7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
\s5
\v 8 తన తల్లి ఆమె కిచ్చిన సూచన ప్రకారం "బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు" అని అడిగింది.
\v 9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం, అలా చేయమని ఆజ్ఞాపించాడు.
\s5
\v 10 భటుల్ని పంపి జైలులో ఉన్న యోహాను తల నరికించాడు.
\v 11 వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
\v 12 యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకు పోయి పాతిపెట్టారు. ఆ తర్వాత యేసు దగ్గరికి వెళ్లి ఈ సంగతి తెలియచేసారు.
\s5
\v 13 యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు.
\v 14 యేసు బయటికి వచ్చి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.
\s యేసు ఐదు వేలమంది ఆకలి తీర్చడం (మార్కు 6: ౩౦- 44; లూకా 9:10-17; యోహాను 6:1-14)
\s5
\p
\v 15 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది అరణ్య ప్రదేశం. ఇప్పటికే పొద్దు పోయింది. ఈ ప్రజలు వెళ్లి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి" అన్నారు.
\s5
\v 16 యేసు వారితో, "వాళ్ళు వెళ్లనక్కర్లేదు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి" అన్నాడు.
\v 17 వాళ్ళు, "ఇక్కడ మన దగ్గర అయిదు రొట్టెలూ రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు" అని ఆయనతో అన్నారు.
\v 18 అందుకు ఆయన "వాటిని నా దగ్గరికి తీసుకు రండి" అన్నాడు.
\s5
\v 19 ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలు చేతిలో తీసుకొని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.
\v 20 వారంతా తిని సంతృప్తి చెందినా తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగు చేస్తేమొత్తం పన్నెండు గంపలు నిండాయి.
\v 21 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు అయిదు వేలమంది తిన్నారు.
\s యేసు నీటిపై నడవడం, పేతురు అల్ప విశ్వాసం (మార్కు 6: 45- 56; యోహాను 6: 15- 21)
\s5
\p
\v 22 యేసు వెంటనే ఆ ప్రజలను పంపివేసి శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.
\v 23 ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
\v 24 అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అది అలల తాకిడికి కొట్టుకు పోతూ ఉంది.
\s5
\v 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.
\v 26 ఆయన సముద్రం మీద నడవడం శిష్యులు చూచి భయపడిపోయి, దయ్యం అనుకొని గాభరాగా కేకలు వేశారు.
\v 27 వెంటనే యేసు, "ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు" అన్నాడు.
\s5
\v 28 పేతురు, "ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వండి," అని ఆయనతో అన్నాడు.
\v 29 యేసు రమ్మన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ల మీద నడిచాడు గాని
\v 30 గాలిని చూసి భయపడి మునిగి పోతూ ప్రభూ, నన్ను రక్షించమని కేకలు వేశాడు.
\s5
\v 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని,"అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?" అన్నాడు.
\v 32 వాళ్ళు పడవ ఎక్కినప్పుడు గాలి వేగం తగ్గింది.
\v 33 పడవలో ఉన్న వాళ్ళు వచ్చి, "నీవు నిజంగా దేవుని కుమారుడివి" అని చెప్పి ఆయన్ని ఆరాధించారు.
\s5
\v 34 వారు అవతలి ఒడ్డుకు వెళ్లి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.
\v 35 అక్కడి ప్రజలు ఆయన్ని గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.
\v 36 'వీరిని నీ పైబట్ట అంచు మాత్రమే ముట్ట నివ్వండ' ని ఆయన్ని బతిమాలారు. ముట్టిన వాళ్ళంతా బాగయ్యారు.
\s5
\c 15
\s శాస్త్రులను, పరిసయ్యులను యేసు విమర్శించడం (మార్కు 7: 1-23)
\p
\p
\v 1 ఆ రోజుల్లో యెరూషలేమునుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి
\v 2 "నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి ?" అని యేసుని అడిగారు.
\v 3 అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, "మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు.
\s5
\v 4 ఎలాగంటే తలిదండ్రుల్ని ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు.
\v 5 కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నానుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దానిని దేవునికి ఇచ్చేశాను అని చెప్తే అతడు ఇకనుండి తన తల్లిదండ్రుల్ని పట్టించుకోనక్కర లేదని చెబుతారు.
\v 6 ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు.
\s5
\v 7 మీ భక్తి అంతా వట్టి దొంగభక్తి.
\v 8 'ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది.
\v 9 వారు నన్ను వ్యర్ధంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు' అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు."
\s5
\p
\v 10 ఆయన ప్రజలందరినీ పిలిచి, "మీరు తెలుసుకోవలసింది ఏమంటే
\v 11 ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్ర పరచదు. నోటినుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్ర పరుస్తుంది" అని చెప్పాడు.
\s5
\v 12 అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, "నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు" అని ఆయనతో అన్నారు.
\v 13 ఆయన "పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కా పీకివేయడం జరుగుతుంది.
\v 14 వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా" అన్నాడు.
\s5
\v 15 అందుకు పేతురు 'ఈ ఉపమానభావం మాకు వివరించు' అని ఆయన్ని అడిగాడు.
\v 16 అప్పుడాయన "మీరు ఇంకా అవివేకంగాఉన్నారా?
\v 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది.
\s5
\v 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా?
\v 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధసాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.
\v 20 మనిషిని అపవిత్రపరచేది ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు.
\s సురోఫెనికయ స్త్రీ కూతురు స్వస్థత (మార్కు 7: 24- 30)
\s5
\p
\v 21 యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు.
\v 22 అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, "ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది" అని పెద్దగా అరిచి చెప్పింది.
\v 23 కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు "ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఆమెని పంపించెయ్యి" అని ఆయన్ని వేడుకున్నారు.
\s5
\v 24 దానికి ఆయన, "దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు" అని జవాబిచ్చాడు.
\v 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి "ప్రభూ, నాకు సహాయం చెయ్యి" అంది.
\v 26 ఆయన, "పిల్లలు తినే రొట్టెని కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు" అని ఆమెతో అన్నాడు.
\s5
\v 27 ఆమె "ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపైనుండి కింద పడే ముక్కలు తింటాయి కదా" అంది.
\v 28 అందుకు యేసు "అమ్మా, నీ నమ్మకం గొప్పది. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది" అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
\s యేసు అనేకమందిని బాగు చేయడం (మార్కు 7: 31-37)
\s5
\p
\v 29 యేసు అక్కడనుండి బయలుదేరి, గలలీ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు.
\v 30 ప్రజలు గుంపులు గంపులుగా అనేకమంది కుంటివారినీ గుడ్డివారినీ మూగవారినీ వికలాంగుల్నీ తీసికొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు.
\v 31 ప్రజలు మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావటం చూసి ఆశ్చర్య పడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
\s నాలుగు వేలమందికి ఆహారం (మార్కు 8:1-9)
\s5
\p
\v 32 అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి, "ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వారు దారిలోనే స్పృహ కోల్పోతారేమో" అన్నాడు.
\v 33 ఆయన శిష్యులు, "ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?" అన్నారు.
\v 34 యేసు, "మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?" అని వారిని అడిగాడు. వారు, "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి" అని చెప్పారు.
\p
\v 35 అప్పుడు యేసు, 'నేల మీద కూర్చోండి' అని అ ప్రజలకి ఆజ్ఞాపించి
\s5
\v 36 ఆ యేడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకి వాటిని పంచిపెట్టారు.
\v 37 వారంతా కడుపారా తిన్న తర్వాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.
\v 38 స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
\v 39 తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి, పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు.
\s5
\c 16
\s అంధ మతనాయకులను యేసు విమర్శించడం (మార్కు 8: 1-12)
\p
\v 1 అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయన్ని పరీక్షించడం కోసం తమకొరకు పరలోకం నుండి ఒక అద్భుటం చెయ్యమని అడిగారు.
\v 2 ఆయన వారితో ఇలా అన్నాడు, "సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ,
\s5
\v 3 అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెప్తారు కదా, ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.
\v 4 సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు." ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్లిపోయాడు.
\s5
\p
\v 5 అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవటం మర్చిపోయారు.
\v 6 అప్పుడు యేసు, "పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పులిపిండిని గురించి జాగ్రత్త పడండి" అని వారితో అన్నాడు.
\v 7 అయితే శిష్యులు 'మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు' అని తమలో తాము చర్చించు కున్నారు.
\v 8 యేసుకు అది తెలిసి, "అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకురాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?
\s పొంగ జేసే పదార్ధం వివరణ (మార్కు 13-21)
\s5
\p
\v 9 మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదువేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో,
\v 10 ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా?
\s5
\v 11 నేను మీతో మాట్లాడింది రొట్టెల్ని గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పులిపిండిని గురించి జాగ్రత్త పడండి" అని వారితో చెప్పాడు.
\v 12 అప్పుడు రొట్టెల్లో వాడే పులిపిండిని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
\s పేతురు విశ్వాస ప్రకటన (మార్కు 8: 27-30; లూకా 9: 18- 21; యోహాను 6: 68, 69)
\s5
\p
\v 13 యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యుల్ని ఇలా అడిగాడు, "మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకొంటున్నారు?"
\v 14 వారు "కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు" అన్నారు.
\v 15 "అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?" వారిని అడిగాడు.
\v 16 వెంటనే సీమోను పేతురు, "నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!" అని చెప్పాడు.
\s ‘సంఘము‘ మొట్టమొదటి ప్రస్తావన
\s5
\p
\v 17 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, "యోనా కుమారుడైన సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు.
\v 18 ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళలోకపు ద్వారాలు దానిని ఎదిరించి నిలబడలేవు.
\s5
\v 19 పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దానిని పరలోకంలో బంధిస్తాను, దేనిని విడిపిస్తావో దానిని పరలోకంలో విడిపిస్తాను."
\v 20 తానే క్రీస్తు అని యెవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.
\s క్రీస్తు తన మరణ పునరుత్థానాలను ముందుగా చెప్పటం (మార్కు 8:31-38; లూకా 9:22-27)
\s5
\p
\v 21 అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్లి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడో రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలెట్టాడు.
\v 22 అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, "ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు" అని గద్దింపుగా అన్నాడు.
\v 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి "సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే నీ మనసు పెడుతున్నావు" అన్నాడు.
\s5
\p
\v 24 అప్పుడు యేసు తన శిష్యులతో, "ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకొని, తన సిలువను మోసుకుంటూ రావాలి.
\v 25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దానిని దక్కించుకుంటాడు.
\v 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?
\s5
\v 27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకొని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
\v 28 నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకు మరణించరు" అని చెప్పాడు.
\s5
\c 17
\s రూపాతరము (మార్కు 9:2-13; లూకా 9:28-36)
\p
\v 1 ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసికొని ఎత్తైన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది.
\v 2 ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.
\s5
\v 3 అకస్మాత్తుగా మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు.
\v 4 అప్పుడు పేతురు యేసుతో, "ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు, మూడు పాకలు వేస్తాను" అన్నాడు.
\s5
\v 5 అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలోనుండి ఒక స్వరం వారితో, "ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం. మీరు ఈయన చెప్పేది వినండి" అని పలికింది.
\v 6 శిష్యులు ఈ మాట విని భయంతో బోర్లాపడిపోయారు.
\v 7 యేసు వారి దగ్గరకు వచ్చి వారిని తాకి, "భయపడకండి, ఇక లేవండి" అన్నాడు.
\v 8 వారు కళ్ళు తెరచి చూస్తే, యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు.
\s5
\p
\v 9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు, "మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు" అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.
\v 10 అప్పుడు శిష్యులు, "మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు?" అని అడిగారు.
\s5
\v 11 అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, "ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే.
\v 12 అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే, ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గాని వారు అతణ్ణి గుర్తించలేదు. పైగా, అతన్ని ఇష్టం వచ్చినట్టుగా బాధించారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించ బోతున్నాడు."
\v 13 బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
\s శిష్యుల అశక్తత (మార్కు 9:14-29; లూకా 9:37-43)
\s5
\p
\v 14 వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరించి,
\v 15 "ప్రభూ, నా కొడుకుని కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో, నీళ్ళలో పడిపోతుంటాడు.
\v 16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసికొని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు" అని చెప్పాడు.
\s5
\v 17 అందుకు యేసు, "మూర్ఖులారా! విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకు మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి" అన్నాడు.
\v 18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.
\s5
\p
\v 19 తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి "మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేక పోయాం?" అని అడిగారు.
\v 20 అందుకాయన, "మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడనుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\v 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు. అని వారితో చెప్పాడు.
\s క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మరలా చెప్పటం (మార్కు 9:30-32; లూకా 9:43- 45)
\s5
\p
\v 22 వారు గలలీలో ఉన్నప్పుడు యేసు, "మానవ పుత్రుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు,
\v 23 వారు ఆయన్ని చంపుతారు. కానీ ఆయన మూడో రోజు సజీవుడై తిరిగి లేస్తాడు" అని వారితో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు.
\s ఆలయం పన్ను అద్భుతం (మార్కు 12:13)
\s5
\p
\v 24 వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, "మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?" అని అడిగారు. అతడు "అవును, చెల్లిస్తాడు" అన్నాడు.
\v 25 అతడు ఇంటి లోపలికి వెళ్లి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, "సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరినుండి వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?" అని అడిగాడు.
\s5
\v 26 అతడు, "బయటివాళ్ళ దగ్గరే" అని చెప్పినప్పుడు యేసు, "అలాగైతే కొడుకులు స్వతంత్రులే.
\v 27 అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసికొని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దానిని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు" అన్నాడు.
\s5
\c 18
\s చిన్న పిల్లల ఆదర్శం(మార్కు 9:33-37; లూకా 9:46- 48)
\p
\v 1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, "పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?" అని యేసుని అడిగారు.
\v 2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు,
\v 3 "మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
\v 5 ఇలాంటి చిన్నవారిని నా పేరట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే.
\v 6 నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
\s5
\p
\v 7 "నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి శిక్షా కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు, కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.
\v 8 నీ చెయ్యిగాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దానిని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.
\s5
\v 9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దానిని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.
\s5
\v 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు, ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడిఆయనవైపు చూస్తూ ఉంటారు.
\s పోయిన గొర్రె (లూకా 15:3-7)
\p
\v 11 మీరేమంటారు?\f + \fr 18.11 \ft కొన్ని ప్రాచీన ప్రతులలో 'నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు' అని రాసి ఉంది.\f* ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి,
\s5
\v 12 మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండలమీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెదకడానికి వెళ్తాడు గదా?
\v 13 అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\v 14 అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.
\s5
\p
\v 15 "ఇంకో విషయం. నీ సోదరుడు నీపట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.
\v 16 అతడు వినకపోతే, 'ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి' కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళు.
\s5
\v 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.
\s5
\p
\v 18 "నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దానిని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దానిని పరలోకంలో కూడా విప్పుతారు.
\v 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దానిని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
\s స్థానిక సంఘం మౌలిక రూపం
\p
\v 20 ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమావేశం అవుతారో అక్కడ నేను కూడా ఉంటాను.
\s క్షమ సిద్ధాంతం (లూకా 17: 3, 4)
\s5
\p
\v 21 అప్పుడు పేతురు వచ్చి, "ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?" అని యేసుని అడిగాడు.
\v 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, "ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్బై సార్ల వరకు అని నీతో చెబుతున్నాను.
\s5
\v 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.
\v 24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు.
\v 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్న సమస్తాన్నీ అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.
\s5
\v 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, 'రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను' అని వేడుకున్నాడు.
\v 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేసాడు.
\s5
\v 28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్లి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి 'నా బాకీ తీర్చు' అని అతని గొంతు పట్టుకున్నాడు.
\v 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, 'కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను' అని వేడుకున్నాడు.
\s5
\v 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకు అతణ్ణి జైలులో పెట్టించాడు.
\v 31 అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు.
\s5
\v 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, 'నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేసానే,
\v 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోడి పనివాణ్ణి క్షమించాలి కదా' అని చెప్పి
\s5
\v 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
\v 35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు" అని వారితో చెప్పాడు.
\s5
\c 19
\s యూదయ లో యేసు
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలలీ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు.
\v 2 గొప్ప జనసమూహాలు ఆయన్ని వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు.
\s విడాకుల గురించి యేసు ఉపదేశం (మత్తయి 5:31,32; మార్కు 10:1- 12; లూకా 16: 18; 1 కొరింతి 7: 10-15)
\s5
\p
\v 3 పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన్ని పరీక్షించడం కోసం, "ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?" అని అడిగారు.
\v 4 ఆయన "సృష్టికర్త ఆదినుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ
\s5
\v 5 అందుకే పురుషుడు తన తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారని చెప్పాడనీ మీరు చదవలేదా?
\v 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరచిన వారిని మనిషి వేరు చేయకూడదు" అని వారితో చెప్పాడు.
\s5
\v 7 అందుకు వారు, "అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?" అని అడిగారు.
\v 8 అప్పుడాయన, "మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్ట వచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు.
\v 9 వ్యభిచార కారణాన్ని బట్టి కాక, ఒకడు తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసికొంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు (వ్యభిచార కారణంగా) విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను" అని వారితో అన్నాడు.
\s5
\v 10 ఆయన శిష్యులు "భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది" అని ఆయనతో అన్నారు.
\v 11 అందుకు యేసు, "దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించలేరు.
\v 12 తల్లి గర్భంనుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుష్యులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దానిని స్వీకరించి పాటిస్తాడు గాక" అని వారితో చెప్పాడు.
\s యేసు చిన్న పిల్లలను దీవించడం (మార్కు 10:17- 30; లూకా18: 15-17)
\s5
\p
\v 13 అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి వారికోసం ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లల్ని ఆయన దగ్గరకి తీసికొని వచ్చారు.
\v 14 అయితే ఆయన శిష్యులు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన వారిని గద్దించారు. అప్పుడు యేసు, "చిన్నపిల్లల్ని అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే" అని వారితో చెప్పి,
\v 15 ఆ పిల్లల మీద చేతులుంచి, అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
\s సంపన్నుడైన యువ అధికారి (మార్కు 10:17-30; లూకా 18:18-30; 10: 25-30)
\s5
\p
\v 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, "బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏం మంచి పని చేయాలి?" అని ఆయన్ని అడిగాడు.
\v 17 అందుకు యేసు, "మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు" అన్నాడు. అతడు "ఏ ఆజ్ఞలు?" అని ఆయనను అడిగాడు.
\s5
\v 18 యేసు, "నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్షం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు,
\v 19 నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు, అనేవే" అని చెప్పాడు.
\s5
\v 20 అందుకు ఆ యువకుడు, "వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?" అన్నాడు.
\v 21 అందుకు యేసు, "నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్లి నీకున్నదంతా అమ్మేసి దానిని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు" అని అతనితో చెప్పాడు.
\v 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం.
\v 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూదిబెజ్జంలో గుండా దూరి వెళ్ళడం తేలిక."
\s5
\v 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. "ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?" అన్నారు.
\v 26 యేసు వారితో, "ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే" అని చెప్పాడు.
\s రానున్న రాజ్యంలో అపోస్తలుల స్థానాలు
\p
\v 27 పేతురు, "ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?" అని ఆయన్ని అడగ్గా
\s5
\v 28 యేసు వారితో ఇలా అన్నాడు, "కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.
\s5
\v 29 నా పేరు నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు.
\v 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు."
\s5
\c 20
\s ద్రాక్ష తోట కూలీల కథ
\p
\v 1 "ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు.
\v 2 రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకొని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు.
\s5
\v 3 తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి,
\v 4 'మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి, యేది న్యాయమో ఆ జీతం మీకిస్తానని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు.
\s5
\v 5 దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్లి, ఆ విధంగా చేసాడు.
\v 6 మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్లి, ఇంకా కొందరు ఉరికే నిలబడి ఉండటం చూసి, 'మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?' అని వారిని అడిగాడు.
\v 7 వారు 'ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు' అన్నారు. అతడు, 'అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి' అన్నాడు.
\s5
\v 8 సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, 'పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారివరకు అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు.
\v 9 దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది.
\v 10 అది చూసిన మొదట పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు.
\s5
\v 11 వారు దానిని తీసికొని 'చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేశారు.
\v 12 మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేసాము. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?' అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.
\s5
\v 13 అప్పుడా యజమాని వారిలో ఒకనితో, 'మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? నీ కూలి సొమ్ము తీసికొని వెళ్ళు.
\v 14 నీ కిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం.
\s5
\v 15 నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం న్యాయమే కదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపుమంటగా ఉందా?' అని అన్నాడు.
\v 16 ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.
\s క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మరలా చెప్పటం (మార్కు 10: 32-34; లూకా 18:31-34; మత్తయి 12:38-42; 16: 21-28; 17:22,23)
\s5
\p
\v 17 యేసు యెరూషలేముకు వెళ్లబోయే ముందు తన పన్నెండు మంది శిష్యుల్నీ ఏకాంతంగా తీసికొనిపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు,
\v 18 "ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మానవ పుత్రుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి
\v 19 ఆయన్ని అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు. మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు.
\s యాకోబు, యోహానుల తల్లి విన్నపం (మార్కు 10:35-45)
\s5
\p
\v 20 అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది.
\v 21 "నీకేమి కావాలి?" అని యేసు అమెను అడిగాడు. అందుకామె "నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులు, ఒకణ్ణి నీ కుడివైపున, మరొకణ్ణి నీ యెడమవైపున, కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు" అంది.
\s5
\v 22 అందుకు యేసు, "మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?" అని వారిని అడగ్గా వారు "తాగగలం" అన్నారు.
\v 23 ఆయన "నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి" అని చెప్పాడు.
\v 24 మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు.
\s5
\v 25 కాబట్టి యేసు వారిని పిలిచి, "ఇతర జాతులలో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు.
\v 26 కానీ మీరు అలా ప్రవర్తించ కూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి.
\v 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి.
\v 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు" అని చెప్పాడు.
\s ఇద్దరు గుడ్డివారికి చూపు (మార్కు 10:46-52; లూకా 18:35-43)
\s5
\p
\v 29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది.
\v 30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, "ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు" అని కేకలు వేశారు.
\v 31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు "ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు" అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.
\s5
\v 32 యేసు ఆగి, వారిని పిలిచి, "మీకోసం నన్నేమి చేయమంటారు? అని అడిగాడు.
\v 33 వారు "ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు" అన్నారు.
\v 34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
\s5
\c 21
\s రాజు తనను బహిరంగంగా రాజుగా ప్రకటించుకోవడం (జకర్యా 9: 9; మార్కు 11:1-10; లూకా 19:29-38; యోహాను 12: 12-19)
\p
\v 1 వారు యెరూషలేమును సమీపించి ఒలీవచెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి
\v 2 "మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్లగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తోలుకొని రండి.
\v 3 ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే 'అవి ప్రభువుకు కావాలి' అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు" అని చెప్పి వారిని పంపించాడు.
\s5
\v 4 దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరేలా ఇది జరిగింది-
\v 5 "ఇదిగో నీ రాజు దీనుడుగా, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి" అనేవే ఆ మాటలు.
\s5
\v 6 అప్పుడా శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
\v 7 వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిపైన ఆయనను కూర్చోబెట్టారు.
\v 8 జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.
\s5
\v 9 జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, "దావీదు కుమారునికి జయం! ప్రభువు పేరట వచ్చేవానికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం" అని కేకలు వేస్తూ వచ్చారు.
\v 10 ఆయన యెరూషలేము లోకి వచ్చినప్పుడు పట్టణమంతా "ఎవరీయన?" అని కలవరపడింది.
\v 11 ఆయనతో వచ్చిన జనసమూహం "ఈయన యేసు. గలలీలోని నజరేతునుండి వచ్చిన ప్రవక్త" అని చెప్పారు.
\s ఆలయం శుద్ధి చేయడం (మార్కు 11: 15-18; లూకా 19: 45-47; యోహాను 2: 13- 16)
\s5
\p
\v 12 యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మటం, కొనటం చేసేవారిని అందరినీ వెళ్లగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లల్నీ, పావురాలు అమ్మేవారి పీటల్నీ, పడదోసాడు.
\v 13 వాళ్ళతో ఇలా అన్నాడు, "నా ఆలయం ప్రార్థనకు నిలయం అని రాసి ఉంది. కానీ మీరు దానిని దొంగల గుహగా చేసేశారు."
\p
\v 14 అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరకు వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.
\s5
\v 15 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. "దావీదు కుమారునికి జయం" అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసినపుడు వారు కోపంతో మండిపడ్డారు.
\v 16 "వీరి కేకలు వింటున్నావా?" అని ఆయనను అడిగారు. అందుకు యేసు, "వింటున్నాను, 'చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు' అనే మాట మీరెప్పుడూ చదవలేదా?" అని వారితో చెప్పి
\v 17 ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్లి అక్కడ ఆ రాత్రి గడిపాడు.
\s నిష్ఫలమైన అంజూరు చెట్టును శపించడం (మార్కు 11: 12-14; 20-24)
\s5
\p
\v 18 తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
\v 19 అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. అయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే, దానిలో ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, "ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!" అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది.
\s5
\v 20 అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి "ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!" అని చెప్పుకున్నారు.
\v 21 అందుకు యేసు, "మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దానిని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, 'నీవు లేచి సముద్రంలో పడిపో' అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది.
\v 22 మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు" అని వారితో చెప్పాడు.
\s యేసుకు ఉన్న అధికారాన్ని మతపెద్దలు ప్రశ్నించడం (మార్కు 11:27-33; లూకా 20: 1-8)
\s5
\p
\v 23 ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి, "ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు.
\v 24 యేసు, "నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.
\s5
\v 25 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు,
\v 26 మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు.
\v 27 అందుకు ఆయన, "ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు.
\s ఇద్దరు కొడుకుల కథ
\s5
\p
\v 28 ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, "మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు.
\v 29 అతడు, 'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు గానీ తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు.
\v 30 అప్పుడా తండ్రి తన రెండో కొడుకు దగ్గరకు వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, 'నేను వెళతాను' అన్నాడు గానీ వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?" అని వారిని అడిగాడు.
\s5
\v 31 వారు "మొదటివాడే" అని జవాబిచ్చారు. యేసు "నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.
\v 32 యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు.
\s ద్రాక్ష తోట యజమాని, కౌలు రైతులు (మార్కు 12:1-9; లూకా 20:9-19; యెషయా 5:1-7)
\s5
\p
\v 33 "ఇంకో ఉదాహరణ వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దానిని కౌలుకిచ్చి, దూరదేశం వెళ్ళాడు.
\v 34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసికొని రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.
\s5
\v 35 ఆ రైతులు అతని దాసులను పట్టుకొని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకడి మీద రాళ్లు రువ్వి తరిమేశారు.
\v 36 అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసుల్ని పంపాడు. కానీ వారు వీరికి కూడా ముందు వారి లాగానే చేసారు.
\v 37 చివరికి ఆ యజమాని 'నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు' అనుకొని, తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు.
\s5
\v 38 అయితే ఆ కౌలుదారులు అతనిని చూసి, 'అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి' అని తమలో తాము చెప్పుకున్నారు.
\v 39 వారు అతణ్ణి పట్టుకొని ద్రాక్షతోట బయటికి తోసి చంపేసారు.
\s5
\v 40 ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతుల్ని ఏం చేస్తాడు?" అని వారిని అడిగాడు.
\v 41 వారు, "అతడు ఆ దుర్మార్గుల్ని నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు" అని ఆయనకు జవాబిచ్చారు.
\s5
\p
\v 42 అప్పుడు యేసు వారితో, "ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీనిని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం' అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?
\s5
\v 43 కాబట్టి దేవుని రాజ్యాన్ని మీనుండి తీసివేసి, దానికి ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.
\v 44 ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవని మీద పడుతుందో వాడిని అది నలిపి పొడి చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 45 ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ప్రధానయాజకులు, పరిసయ్యులు గ్రహించారు.
\v 46 వారు ఆయన్ని పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారు గానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయన్ని ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.
\s5
\c 22
\s పెళ్లి విందు ఉపమానం (లూకా14:16-24)
\p
\v 1 యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు.
\v 2 "పరలోకరాజ్యం, ఒక రాజు తన కుమారుని పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది.
\v 3 ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.
\s5
\v 4 అప్పుడు ఆ రాజు 'ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి' అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను పంపించాడు.
\s5
\v 5 కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి మరొకడు తన వ్యాపారానికి వెళ్లారు.
\v 6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొని అవమాన పరచి చంపారు.
\v 7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గుల్ని సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
\s5
\v 8 అప్పుడతడు, "పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు.
\v 9 కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి" అని తన దాసులతో చెప్పాడు.
\v 10 ఆ దాసులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారినీ మంచివారినీ తమకు కనబడినవారి నందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చినవారితో నిండిపోయింది.
\s5
\v 11 రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్లి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు.
\v 12 రాజు అతనితో, 'మిత్రమా, పెళ్లి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?' అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.
\s5
\v 13 కాబట్టి రాజు, 'ఇతని కాళ్లు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి' అని తన పరిచారకులతో చెప్పాడు.
\v 14 ఆహ్వానం అందుకొన్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికయిన వారు కొద్దిమందే."
\s హేరోదు అనుచర గణానికి యేసు జవాబు (మార్కు 12:13-17; లూకా 20:20-26)
\s5
\p
\v 15 అప్పుడు పరిసయ్యులు వెళ్లి, ఆయన్ని ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలి అని ఆలోచించారు.
\v 16 వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, "బోధకుడా, నీవు యధార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ మాకు తెలుసు.
\v 17 సీజరు చక్రవర్తికి పన్ను కట్టటం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు" అని అడిగారు.
\s5
\v 18 యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, "కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?
\v 19 ఏదీ, ఒక సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి" అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు.
\s5
\v 20 ఆయన, "దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?" అని వారి నడిగాడు. వారు, "అవి సీజరు చక్రవర్తివి" అన్నారు.
\v 21 ఆయన వెంటనే, "అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి" అని వారితో చెప్పాడు.
\v 22 వారీమాట విని ఆశ్చర్యపడి ఆయన్ని విడిచి వెళ్లిపోయారు.
\s సద్దూకయ్యుల ప్రశ్నకు జవాబు (మార్కు 12;18-27; లూకా (20: 27- 38)
\s5
\p
\v 23 అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి,
\v 24 "బోధకుడా, ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే చెప్పాడు గదా.
\s5
\v 25 మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసికొని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు.
\v 26 ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాని వరకు అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు.
\v 27 వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 28 చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా? అని ఆయనను అడిగారు.
\s5
\p
\v 29 అందుకు యేసు, "మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.
\v 30 పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.
\s5
\v 31 చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, 'నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి' అని చెప్పిన మాట మీరు చదవలేదా?
\v 32 ఆయన బ్రదికి ఉన్నవారికే దేవుడు, చనిపోయినవారికి కాదు" అని వారితో చెప్పాడు.
\v 33 ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు.
\s పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు (మార్కు 12: 28-34; లూకా 10:25-28)
\s5
\p
\v 34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.
\v 35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయన్ని పరీక్షించడానికి,
\v 36 "బోధకుడా , ధర్మశాస్త్రంలో ఏది అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ?" అని అడిగాడు.
\s5
\v 37 అందుకు యేసు, " 'నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి' అనేదే.
\v 38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
\s5
\v 39 'మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి' అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.
\v 40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం" అని అతనితో చెప్పాడు.
\s పరిసయ్యులకు ప్రశ్న (మార్కు 12: 35-37; లూకా 20: 41-44)
\s5
\p
\v 41 మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని,
\v 42 "క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?" అని ప్రశ్నించాడు. వారు, "ఆయన దావీదు కుమారుడు" అని చెప్పారు.
\s5
\v 43 అందుకు యేసు, "అయితే, 'నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకు
\v 44 నీవు నా కుడిపక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు' అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?
\s5
\v 45 దావీదు ఆయన్ని ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?" అని వారిని అడిగాడు.
\v 46 ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజునుండి ఆయన్ని ఒక ప్రశ్న అడగటానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.
\s5
\c 23
\s పరిసయ్యుల ఆగడాలు (మార్కు 12: 38-40; లూకా 20: 45-47)
\p
\v 1 అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
\v 2 ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు
\v 3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటిని ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు.
\s5
\v 4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.
\v 5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్నరక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.
\s5
\v 6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాలలో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.
\v 7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత 'రబ్బీ, రబ్బీ' అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.
\s5
\v 8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు.
\v 9 ఇంకా, భూమిమీద ఎవరినీ 'తండ్రి' అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి.
\v 10 అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
\s5
\v 11 మీలో అందరికంటె గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి.
\v 12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
\s పరిసయ్యులకు యాతన (మార్కు 12: 38-40; లూకా 20:47)
\s5
\p
\v 13 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.
\v 14 మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించ నియ్యరు. మీకు శిక్ష తప్పదు.
\v 15 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టివచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటె రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు.
\s5
\p
\v 16 అయ్యో, అంధ మార్గదర్శులారా, ఒకడు దేవాలయం తోడు అని ఒట్టుపెట్టుకొన్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి అని మీరు చెబుతారు.
\v 17 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్ర పరిచే దేవాలయమా?
\s5
\v 18 అలాగే బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలని మీరు చెబుతారు.
\v 19 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దానిని పవిత్ర పరిచే బలిపీఠమా?
\s5
\v 20 బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దానితోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టుపెట్టుకొంటున్నాడు.
\v 21 అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
\v 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
\s5
\p
\v 23 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదో వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదో వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.
\v 24 అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమల్ని వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.
\s5
\v 25 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారు గాని వాటి లోపలి వైపంతా దోపిడీ, అత్యాశ నిండి ఉన్నాయి.
\v 26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.
\s5
\v 27 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలూ, సమస్త కల్మషమూ నిండి ఉంటాయి.
\v 28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీ లోపల కపటమూ, దుష్టత్వమూ నిండి ఉంటారు.
\s5
\p
\v 29 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.
\v 30 'మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసేవాళ్ళం కాము' అని చెప్పుకొంటారు.
\v 31 నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.
\s5
\v 32 ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.
\p
\v 33 సర్పాల్లారా, సర్పసంతానమా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.
\s5
\v 34 కాబట్టి వినండి! నేను మీ దగ్గరకు ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు, సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు, మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.
\v 35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీపైకి వస్తుంది.
\v 36 అదంతా ఈ తరం వారిమీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s యెరూషలేముకై విలాపం (లూకా 13:34,35)
\s5
\p
\v 37 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరకు పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకొని పోషిస్తుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.
\v 38 ఇదిగో ఇక మీ యిల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను
\v 39 ఇప్పటినుండి మీరు 'ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతులు పొందు గాక' అని చెప్పే వరకు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను."
\s5
\c 24
\s ఒలీవ కొండ ప్రసంగం. దేవాలయం విధ్వంసం గురించి (మార్కు 13: 1, 2; లూకా 21: 5,6)
\p
\v 1 యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.
\v 2 అందుకాయన, "మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా, నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు" అని వారితో అన్నాడు.
\s శిష్యుల మూడు ప్రశ్నలు (మార్కు 13: 3, 4; లూకా 21: 7)
\s5
\p
\v 3 ఆయన ఒలీవ కొండమీద కూర్చొని ఉండగా శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వచ్చి, "నీవు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు" అని అడిగారు.
\s ఈ యుగం పరిణామాలు (మార్కు 13: 5, 13; లూకా 21: 8- 19)
\v 4 యేసు వారితో ఇలా అన్నాడు, "ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.
\v 5 చాలామంది నా పేరున వచ్చి 'నేనే క్రీస్తుని' అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.
\s5
\v 6 అంతే గాక మీరు యుద్ధాల గురించీ, వాటి గురించిన వార్తలను వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.
\v 7 జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి.
\v 8 అక్కడక్కడ కరవులూ భూకంపాలూ వస్తాయి. ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.
\s5
\p
\v 9 "అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా పేరు పెట్టుకున్నందుకు మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.
\v 10 ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు.
\v 11 అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు.
\s5
\v 12 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.
\v 13 అంతం వరకు ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.
\v 14 రాజ్యం గురించిన శుభవార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
\s మహా బాధల కాలం (మార్కు 13: 14-23)
\s5
\p
\v 15 "కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన 'వినాశకారి అయిన హేయ వస్తువు' అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక)
\v 16 యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
\v 17 మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లోనుండి దేన్నైనా తీసికొనిపోవడానికి దిగి రాకూడదు.
\v 18 పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.
\s5
\v 19 అయ్యో, ఆ రోజులు గర్భవతులకీ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.
\v 20 అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.
\v 21 ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు రాదు.
\v 22 ఆ రోజుల్ని దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. ఆయన ఎన్నుకున్నవారి నిమిత్తం ఆ రోజుల్ని దేవుడు తక్కువ చేస్తాడు.
\s5
\p
\v 23 "ఆ కాలంలో ఎవరైనా, 'ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు' అని చెబితే నమ్మవద్దు.
\v 24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.
\v 25 ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
\s5
\v 26 కాబట్టి ఎవరైనా 'ఇదిగో, క్రీస్తు ఎడారిలో ఉన్నాడు' అని చెప్పినా, 'ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు' అని చెప్పినా మీరు నమ్మవద్దు, వారివెంట వెళ్ళవద్దు.
\s మహిమ సహితంగా రాజు రాక (మార్కు 13: 24- 37; లూకా 21: 25- 36)
\p
\v 27 మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మానవ పుత్రుని రాక కూడా ఉంటుంది.
\v 28 పీనుగు ఎక్కడ ఉందో అక్కడ రాబందులు పోగవుతాయి.
\s5
\p
\v 29 "ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.
\s5
\v 30 అప్పుడు మానవ పుత్రుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న సమస్త జాతుల ప్రజలు తమ గుండెలు బాదుకుంటారు.
\v 31 ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకు నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్నవారిని సమకూర్చుతారు.
\s అంజూరు చెట్టు ఉపమానం (మార్కు 13: 28,29: లూకా 21: 29-31)
\s5
\p
\v 32 "అంజూరు చెట్టు గురించిన ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
\v 33 అదే విధంగా ఈ సంగతులన్నీ జరగటం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
\s5
\v 34 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\v 35 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
\s5
\p
\v 36 "అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గాని, ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారునికి కూడా తెలియదు.
\s5
\v 37 నోవహు రోజులు ఎలా ఉండేవో మానవ పుత్రుని రాకడ కూడా అలా ఉంటుంది.
\v 38 జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్లిన రోజు వరకు, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు.
\v 39 జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకొనిపోయే వరకు వారికి తెలియలేదు. ఆ విధంగానే మానవ పుత్రుని రాకడ ఉంటుంది.
\s5
\v 40 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.
\v 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.
\v 42 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలీదు కాబట్టి మెలకువగా ఉండండి.
\s5
\v 43 దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకొని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!
\v 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.
\s5
\p
\v 45 "ఒక యజమాని తన ఇంటిలో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుదు ఎవరుంటారు?
\v 46 యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు.
\v 47 ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, 'నా యజమాని ఆలస్యంగా వస్తాడులే' అని తన మనస్సులో అనుకొని
\v 49 తన సాటి సేవకుల్ని కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,
\v 50 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వచ్చి, వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు.
\v 51 అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.
\s5
\c 25
\s ఒలీవ కొండ ప్రసంగం. ప్రభువు రాక, పదిమంది కన్యలకు పరీక్ష
\p
\v 1 పరలోకరాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది యువతులు పెళ్ళికొడుకుని కలుసుకోడానికి కాగడాలు పట్టుకొని బయలుదేరారు.
\v 2 వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు.
\v 3 తెలివి తక్కువ వారు తమ కాగడాలు పట్టుకొన్నారు గాని తమతో నూనె తీసికొని పోలేదు.
\v 4 తెలివైన వారు తమ దివిటీలతో బాటు సీసాలలో నూనె తీసికొని వెళ్ళారు.
\s5
\v 5 పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రలోకి జారుకున్నారు.
\v 6 అర్ధరాత్రి, 'ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి' అనే పిలుపు వినిపించింది.
\s5
\v 7 అప్పుడు ఆ యువతులంతా లేచి తమ కాగడాలు సరిచేసుకున్నారు.
\v 8 అయితే తెలివి తక్కువ యువతులు, 'మా కాగడాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?' అని తెలివైన యువతులను అడిగారు.
\v 9 అందుకు వారు, 'మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి' అని చెప్పారు.
\s5
\v 10 వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్లారు.
\v 11 వెంటనే తలుపు మూశారు. ఆ తరువాత మిగిలిన యువతులు వచ్చి, 'ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి' అని అడిగారు.
\v 12 కాని ఆయన, 'నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు' అన్నాడు.
\v 13 ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకొని ఉండండి.
\s ప్రభువు రాక, సేవకులకు పరీక్ష
\s5
\p
\v 14 "పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు.
\v 15 వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు.
\v 16 ఐదు తలాంతులు తీసికొన్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు.
\s5
\v 17 అదే విధంగా రెండు తలాంతులు తీసికొన్న వాడు ఇంకో రెండు సంపాదించాడు.
\v 18 అయితే ఒక తలాంతు తీసికొన్న వాడు వెళ్లి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.
\s5
\p
\v 19 "చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు.
\v 20 అప్పుడు ఐదు తలాంతులు తీసికొన్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి 'అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను' అని చెప్పాడు.
\v 21 అతని యజమాని, 'ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో' అన్నాడు.
\s5
\v 22 అలాగే రెండు తలాంతులు తీసికొన్న వాడు వచ్చి, 'అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను' అని చెప్పాడు.
\v 23 యజమాని, 'ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో' అన్నాడు.
\s5
\v 24 తరువాత ఒక్క తలాంతు తీసికొన్నవాడు వచ్చాడు. అతడన్నాడు, 'అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు.
\v 25 కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసికోండి' అన్నాడు.
\s5
\v 26 అందుకు ఆ యజమాని అతనితో, 'నీవు సోమరివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసే వాడిని అని నీకు తెలుసు గదా!
\v 27 అలాంటప్పుడు నీవు నా డబ్బుని వడ్డీవ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసికొని ఉండేవాణ్ణి' అని చెప్పి,
\s5
\v 28 'ఆ తలాంతును వాని దగ్గరనుండి తీసికొని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి.
\v 29 కలిగిన ప్రతివానికీ మరింత ఇవ్వటం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేనివాని దగ్గరనుండి వాడు కలిగి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది.
\v 30 పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.
\s ప్రభువు రాక, యుదేతర జాతులకు పరీక్ష (యోవేలు 3:11-16)
\s5
\p
\v 31 "మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
\v 32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు
\v 33 ఆయన తన కుడివైపున 'గొర్రెలు' (నీతిపరులు), ఎడమవైపున 'మేకలు' (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.
\s5
\v 34 తరువాత రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, 'నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పుట్టినపుడే మీ కోసం సిద్ధపరచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి.
\v 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగొన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు.
\v 36 వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి పలకరించారు' అని చెబుతాడు.
\s5
\v 37 అందుకు నీతిపరులు 'ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం?
\v 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం?
\v 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండటం చూసి నీ దగ్గరకు వచ్చి పరామర్శించాం? అని ఆయనను అడుగుతారు.
\v 40 అందుకు రాజు, 'మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరులలో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే' అని వారికి జవాబిస్తాడు.
\s5
\p
\v 41 "తరువాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, 'శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి అనుచరులకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి.
\v 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పిగొన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు,
\v 43 వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి పలకరించలేదు' అని చెబుతాడు.
\s5
\v 44 అందుకు వారు కూడా, 'ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దప్పిగొని ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండటం చూసి నీకు సహాయం చేయలేదు?' అని అడుగుతారు.
\v 45 అందుకు రాజు, 'మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి కూడా ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే' అని వారికి జవాబిస్తాడు.
\v 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు."
\s5
\c 26
\s 1 యేసు వధకై యూదు నాయకుల కుట్ర (మార్కు 14:1, 2; లూకా 22: 1, 2)
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో,
\v 2 "రెండు రోజుల తరువాత పస్కా పండుగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మానవ పుత్రుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు" అని చెప్పాడు.
\s5
\p
\v 3 ఆ సమయంలోనే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు.
\v 4 వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకొని, చంపాలని కుయుక్తులు పన్నారు.
\v 5 అయితే ప్రజలలో అల్లరి జరుగుతుందేమో అని 'పండగ సమయంలో వద్దు' అని చెప్పుకొన్నారు.
\s బేతనీ మరియ యేసుకు చేసిన అభిషేకం (మార్కు 14: 3-9; యోహాను 12: 1-8)
\s5
\p
\v 6 యేసు బేతనీలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఉన్నాడు.
\v 7 ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసా లో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది.
\v 8 అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, "ఎంత నష్టం!
\v 9 దీనిని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును బీదలకు దానం చెయ్యవచ్చు కదా?" అన్నారు.
\s5
\v 10 యేసు ఆ సంగతి గ్రహించి, "ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయం ఒక మంచి పని చేసింది.
\v 11 బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. గాని నేను ఎల్లకాలం మీతో ఉండను.
\s5
\v 12 ఈమె ఈ అత్తరు నా తలపై పోసి నా శరీర భూస్థాపన కోసం సిద్ధం చేసింది.
\v 13 నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసికొని ప్రశంసిస్తారు."
\s యూదు నాయకులతో ఇస్కరియోతు యూదా లాలూచీ (మార్కు 14: 10,11; లూకా 22: 3- 6)
\s5
\p
\v 14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు.
\v 15 "యేసును మీకు పట్టిస్తే నాకేమి ఇస్తారు?" అని అతడు వారినడిగాడు. వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
\v 16 అతడు అప్పటి నుండి ఆయన్ని వారికి పట్టించడానికి తగిన సమయం కోసం కనిపెడుతున్నాడు.
\s పస్కా ఏర్పాట్లు (మార్కు 14: 12-16; లూకా 22: 7-13)
\s5
\p
\v 17 పొంగని రొట్టెల పండుగలో మొదటి రోజు, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, "మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?" అని అడిగారు.
\v 18 అందుకాయన, "మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరకు వెళ్లి, 'నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను' అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి" అన్నాడు.
\v 19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.
\s చివరి భోజనం (మార్కు 14: 17-21; లూకా 22:14-20, 24-30) (ఇక్కడ యోహాను 13: 2-30 చదువుకోవచ్చు)
\s5
\p
\v 20 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు.
\v 21 వారు భోజనం చేస్తుండగా ఆయన, "మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\v 22 అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, "ప్రభూ, అది నేనా?" అని ఆయన్ని అడగటం ప్రారంభించారు.
\s5
\v 23 ఆయన "నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు.
\v 24 మానవ పుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది."
\v 25 ఆయనను అప్పగించబోయే యూదా, "ప్రభూ, నేను కాదు కదా?" అని అడగ్గానే ఆయన, "నీవే చెబుతున్నావు కదా?" అన్నాడు.
\s ప్రభు రాత్రి భోజన సంస్కార స్థాపన (మార్కు 14:22-25; లూకా 22:17-20; 1 కొరింతి 11: 23-25)
\s5
\p
\v 26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, "దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం" అని చెప్పాడు.
\s5
\v 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, "దీనిలోనిది మీరంతా తాగండి.
\v 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.
\v 29 నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకు నేనిక దానిని తాగనని మీతో చెబుతున్నాను"
\s5
\v 30 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.
\s (ఇక్కడ యోహాను 14: 1- 31 చదువుకోవచ్చు). పేతురు తన్నెరగనంటాడని యేసు ముందుగా చెప్పడం (మార్కు 14; 26-31; లూకా 22:31-34; యోహాను 13: 36-38)
\p
\v 31 అప్పుడు యేసు వారితో, "ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, 'కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి' అని రాసి ఉంది కదా!
\v 32 కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటె ముందుగా గలలీకి వెళ్తాను" అన్నాడు.
\s5
\v 33 అందుకు పేతురు, "నీ విషయంలో అంతా వెనుకంజ వేసినా నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను" అని యేసుతో చెప్పాడు.
\v 34 యేసు అతణ్ణి చూసి, "నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెప్తావు" అన్నాడు.
\v 35 పేతురు ఆయనతో, "నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను" అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
\s (ఇక్కడ యోహాను 15, 16, 17 అధ్యాయాలు చదువుకోవచ్చు) వనం లో యేసు వేదన (మార్కు 14:32-42; లూకా 22:39-46; యోహాను 18:1)
\s5
\p
\v 36 ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సెమనే అనే చోటికి వచ్చారు. ఆయన, "నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి" అని వారితో చెప్పాడు.
\v 37 పేతురు, జెబెదయి ఇద్దరు కొడుకులనీ తన వెంట తీసుకెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు.
\v 38 అప్పుడు ఆయన వారితో, "నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి" అని చెప్పి,
\s మొదటి ప్రార్థన (మార్కు 14: 35; లూకా 22; 41,42)
\s5
\p
\v 39 కొంత దూరం వెళ్లి, సాగిలపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గరనుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు" అని ప్రార్థన చేశాడు.
\v 40 శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్ర పోతుండటం చూసి, "నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?
\v 41 మీరు శోధనలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధంగానే ఉన్నా శరీరం బలహీనంగా ఉంది" అని పేతురుతో అన్నాడు.
\s రెండవ ప్రార్థన (మార్కు 14:39; లూకా 22: 44)
\s5
\p
\v 42 యేసు రెండో సారి దూరంగా వెళ్ళి, "నా తండ్రీ, నేను దీనిని తాగితేనే తప్ప నానుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!" అని ప్రార్థన చేశాడు.
\v 43 ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండటం చూశాడు. వారి కన్నులు నిద్రాభారంలో మూతలు పడుతున్నాయి.
\s మూడవ ప్రార్థన (మార్కు 14:41)
\p
\v 44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్లి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు.
\s5
\v 45 అప్పుడాయన తన శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చి ఇలా అన్నాడు, "మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మానవ పుత్రుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.
\v 46 ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు."
\s యేసును బంధించడం (మార్కు 14: 43-50; లూకా 22: 47-53; యోహాను 18: 3-11)
\s5
\p
\v 47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల, ప్రజల పెద్దల నుండి వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు గదలు ఉన్నాయి.
\v 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, 'నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయన్ని మీరు పట్టుకోండి.' అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
\s5
\v 49 అతడు యేసు దగ్గరకు వచ్చి, "బోధకా , నీకు శుభం!" అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
\v 50 యేసు, "మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చేయి" అని అతనితో చెప్పగానే వారు దగ్గరకు వచ్చి ఆయన్ని ఒడిసి పట్టుకొన్నారు.
\s5
\v 51 వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి, అతని చెవి నరికేసాడు.
\v 52 అప్పుడు యేసు, "నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తి తోనే నశించిపోతారు.
\v 53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటె ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడు అనుకుంటున్నావా?
\v 54 నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?" అని అతనితో చెప్పాడు.
\s5
\p
\v 55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, "ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే,
\v 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది" అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.
\s కయఫా ఎదుటా సన్ హెడ్రిన్ ఎదుటా యేసు (మార్కు 14: 53- 65: యోహాను 18: 12, 19-24)
\s5
\p
\v 57 యేసును పట్టుకొన్న వారు ప్రధానయాజకుడు కయప దగ్గరకు ఆయనను తీసికొనిపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.
\v 58 పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుని ఇంటి గుమ్మం వరకు వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు.
\s5
\v 59 ప్రధాన యాజకులు, మహా సభ సభ్యులంతా యేసుని చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధసాక్షం కోసం వెదికారు.
\v 60 అబద్ధసాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్షం నిలబడలేదు.
\v 61 చివరికి ఇద్దరు మనుషులు వచ్చి "ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దానిని తిరిగి కడతానని చెప్పాడు" అన్నారు.
\s5
\v 62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, "నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?" అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.
\v 63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, "సజీవుడైన దేవుని పేరున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పు!" అన్నాడు.
\v 64 అందుకు యేసు, "నీకై నీవే ఆ మాట చెప్పావు. నేను చెప్పేదేమంటే, ఇకనుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు" అన్నాడు.
\s5
\v 65 వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొన్నాడు. "వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది?
\v 66 మీరేమంటారు?" అని సభవారిని అడిగాడు. అందుకు వారు, "వీడు చావుకు తగినవాడు!" అన్నారు.
\s5
\v 67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.
\v 68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, "క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!" అన్నారు.
\s పేతురు అబద్ధాలు (మార్కు 14: 66 -72; లూకా 22: 55-62)
\s5
\p
\v 69 పేతురు బయట వసారాలో కూర్చొని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరకు వచ్చి, "నీవు గలలీ వాడైన యేసుతో ఉన్నావు కదా?" అని అడిగింది.
\v 70 అందుకు అతడు, "నేను లేను, నీవు చెప్పే సంగతి నాకు తెలియదు" అని అందరి ముందూ అన్నాడు.
\s5
\v 71 అతడు నడవలోకి వెళ్లినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, "ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు" అని అక్కడున్న వారితో చెప్పింది.
\v 72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టుపెట్టుకుంటూ "ఆ మనిషి ఎవరో నాకు తెలియదు" అన్నాడు.
\s5
\v 73 కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరకు వచ్చి, "నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది" అన్నారు.
\v 74 దానితో పేతురు "ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను" అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
\v 75 'ఈ రాత్రి కోడి కూసే ముందే నన్ను ఎరుగనని నీవు మూడుసార్లు చెప్తావు' అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసికొని పేతురు బయటికి వెళ్లి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.
\s5
\c 27
\s పిలాతు వద్దకు యేసు (మార్కు 15:1; లూకా 23:1; యోహాను 18: 28)
\p
\v 1 తెల్లవారింది. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు.
\v 2 ఆయనను బంధించి, తీసికెళ్ళి రోము ప్రతినిధి, అధిపతీ అయిన పొంతి పిలాతుకు అప్పగించారు.
\s యూదా నిర్వేదనం (అపో కా 1: 16-19)
\s5
\p
\v 3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరకు తీసుకొచ్చి
\v 4 "నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను" అని చెప్పాడు. అందుకు వారు, "మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో" అని చెప్పారు.
\v 5 అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్లి ఉరి వేసుకొన్నాడు.
\s5
\v 6 ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలు తీసికొని 'ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం" అని చెప్పుకొన్నారు.
\v 7 వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశుల్ని పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కొన్నారు.
\v 8 ఆ పొలాన్ని నేటివరకూ రక్తపొలం అని పిలుస్తున్నారు.
\s5
\v 9 దీనితో "ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్పై వెండి నాణాలు.
\v 10 వాటిని ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాని పొలం కోసం ఇచ్చారు" అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది.
\s యేసును పిలాతు ప్రశ్నించడం (మార్కు 15: 2-5; లూకా 23: 2,3; యోహాను 18: 29-38)
\s5
\p
\v 11 యేసు పిలాతు ముందు నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, "నీవు యూదుల రాజువా?" అని ఆయనను అడిగాడు. యేసు "నీవే అంటున్నావు గదా" అన్నాడు.
\v 12 ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు.
\v 13 కాబట్టి పిలాతు, "నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?" అని ఆయనను అడిగాడు.
\v 14 అయితే ఆయన ఒక మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది.
\s యేసా, బరబ్బానా ? (మార్కు 15:6-15; లూకా 23: 13-25; యోహాను 18: 38-40)
\s5
\p
\v 15 ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం అధిపతికి వాడుక.
\v 16 ఆ కాలంలో బరబ్బ అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు.
\s5
\v 17 కాబట్టి ప్రజలు తన దగ్గరకు వచ్చినప్పుడు పిలాతు వారినిలా అడిగాడు, "నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?"
\v 18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయన్ని అప్పగించారని అతనికి తెలుసు.
\v 19 అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, "నీవు ఆ నీతిపరుని జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన్ని గురించి కలలో బహు బాధపడ్డాను" అని అతనికి కబురు పంపింది.
\s5
\v 20 ప్రధాన యాజకులు, పెద్దలు, బరబ్బనే విడిపించమనీ, యేసును చంపించమనీ అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.
\v 21 పిలాతు "ఈ యిద్దరిలో నేనెవరి ని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?" అని అడగ్గా వారు, "బరబ్బనే" అని అరిచారు.
\v 22 అందుకు పిలాతు "మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?" అన్నప్పుడు వారంతా "అతణ్ణి సిలువ వేయండి" అని కేకలు వేసారు.
\s5
\v 23 పిలాతు "ఎందుకు? ఇతడు ఏం నేరం చేసాడు?" అని అడిగినప్పుడు, వారు "సిలువ వేయండి" అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.
\p
\v 24 అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్లు తీసికొని ఆ జనసమూహం ముందు చేతులు కడుక్కొని, "ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీనిని మీరే చూచుకోవాలి" అని చెప్పాడు.
\s5
\v 25 అందుకు ప్రజలంతా, "అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉంటుంది" అన్నారు.
\s బరబ్బా విడుదల
\p
\v 26 అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.
\s రాజుకు ముళ్ళ కిరీటం, సిలువ శిక్షకై కొనిపోవడం (మార్కు 15: 16-23; లూకా 23:26-32)
\s5
\p
\v 27 అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు.
\v 28 వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు.
\v 29 ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, "యూదుల రాజా, నీకు శుభం!" అంటూ ఎగతాళి చేశారు.
\s5
\v 30 ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.
\v 31 అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్లారు.
\s5
\v 32 వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.
\s సిలువ (మార్కు 15:22-32; లూకా 23:33-43; యోహాను 19:16, 17)
\p
\v 33 వారు "కపాల స్థలం" అని అర్థమిచ్చే 'గొల్గొతా' అనే చోటికి వచ్చారు.
\v 34 అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దానిని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.
\s లేఖనాల నెరవేర్పు (మత్తయి 5:17,18; గలతి 3:11-14)
\s5
\p
\v 35 వారు ఆయన్ని సిలువ వేసిన తరువాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.
\v 36 అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.
\v 37 ''ఇతడు యూదుల రాజైన యేసు'' అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు.
\s5
\v 38 ఆయన కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు.
\v 39 ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ,
\v 40 "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు.
\s5
\v 41 అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ
\v 42 "ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీదనుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం.
\s5
\v 43 ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు" అని హేళనగా మాట్లాడారు.
\v 44 ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా అలాగే ఆయన్ని నిందించారు.
\s యేసు క్రీస్తు మరణం (మార్కు 15:33-41; లూకా 23: 44-49; యోహాను 19: 30-37)
\s5
\p
\v 45 మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది.
\v 46 సుమారు మూడు గంటలప్పుడు యేసు, "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ" అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు "నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?" అని అర్ధం.
\v 47 అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, "అతడు ఏలీయాను పిలుస్తున్నాడు" అన్నారు.
\s5
\v 48 వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పంజీ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు.
\v 49 మిగిలిన వారు, "ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం" అన్నారు.
\p
\v 50 యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు.
\s ధర్మ శాస్త్ర యుగం అంతం (హెబ్రీ 9: 3-8; 10:19,20)
\s5
\p
\v 51 అప్పుడు దేవాలయం లోనితెర పైనుండి కింది వరకు రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.
\v 52 సమాధులు తెరచుకున్నాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి.
\v 53 వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.
\s5
\p
\v 54 రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలు చూసి చాలా భయపడ్డారు. "ఈయన నిజంగా దేవుని కుమారుడే" అని వారు చెప్పుకొన్నారు.
\v 55 యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు.
\v 56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసే అనే వారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
\s 57 క్రీస్తు భూస్తాపన (మార్కు 15:42-47; లూకా 23: 50-56; యోహాను 19: 38-42)
\s5
\p
\v 57 ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.
\v 58 అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.
\s5
\v 59 యోసేపు ఆ దేహాన్ని తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.
\v 60 తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో దానిని పెట్టాడు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు.
\v 61 మగ్దలేనే మరియ, వేరొక మరియ, అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
\s5
\p
\v 62 ఆ తరువాతి రోజు, అంటే సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు దగ్గరకు వెళ్లి,
\v 63 "అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు 'మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను' అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది.
\v 64 కాబట్టి మూడో రోజు వరకు సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి 'ఆయన మృతులలో నుండి సజీవంగా లేచాడు' అని ప్రజలలో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచనకంటె చివరి వంచన మరింత చెడ్డదౌతుంది" అన్నారు.
\s5
\v 65 అందుకు పిలాతు, "కావలి వారున్నారు గదా, మీరు వెళ్లి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి" అని వారితో చెప్పాడు.
\v 66 వారు వెళ్లి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేసారు.
\s5
\c 28
\s యేసు క్రీస్తు సజీవంగా లేవడం (మార్కు 16: 1-14; లూకా 24: 1- 49; యోహాను 20: 1-23)
\p
\v 1 విశ్రాంతిదినం గడచిన తరువాత ఆదివారం నాడు, తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
\v 2 ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహా భూకంపం వచ్చింది.
\s5
\v 3 ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.
\v 4 అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.
\s5
\v 5 ఆ దూత ఆ స్త్రీలతో, "భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు.
\v 6 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలం చూసి,
\v 7 త్వరగా వెళ్లి, ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలలీకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయన్ని అక్కడ చూస్తారు. ఇదిగో నేను మీతో చెప్పాను గదా" అన్నాడు.
\s5
\p
\v 8 వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గరనుండి త్వరగా వెళ్లి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా
\v 9 యేసు వారికి ఎదురు వచ్చి, "మీకు శుభం!" అని చెప్పాడు. వారు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాలపై బడి ఆయనను పూజించారు.
\v 10 అప్పుడు యేసు, "భయపడకండి. మీరు వెళ్లి, నా సోదరులను గలలీకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు" అని వారితో చెప్పాడు.
\s5
\p
\v 11 వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు.
\v 12 కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి,
\v 13 "మీరు 'మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు' అని చెప్పండి.
\s5
\v 14 ఇది గవర్నర్ కి తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం." అన్నారు.
\v 15 సైనికులు ఆ డబ్బు తీసికొని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదులలో ఇప్పటి వరకు వ్యాపించి ఉంది.
\s గలిలయ లో యేసు. మహాభినియామకం (మార్కు 16: 15- 18)
\s5
\p
\v 16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలలీలోని కొండకు వెళ్ళారు.
\v 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
\s5
\v 18 అయితే యేసు వారి దగ్గరకు వచ్చి "పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
\v 19 కాబట్టి మీరు వెళ్లి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ
\s5
\v 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. నేను కలకాలం ఎల్లప్పుడూ మీతో ఉన్నాను" అని వారితో చెప్పాడు.

1445
42-MRK.usfm Normal file
View File

@ -0,0 +1,1445 @@
\id MRK Mark
\s5
\c 1
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మత్తయి 3: 1-11; లూకా 3:1-16; యోహాను 1:6-8, 19-28)
\p
\v 1 దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన శుభవార్త ఆరంభం.
\v 2 యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, "నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
\v 3 'ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి' అని అరణ్యంలో ఒకని కేక వినిపిస్తూ ఉంది."
\s5
\v 4 యోహాను ఎడారి ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
\v 5 యూదయ ప్రాంతంవారు, యెరూషలేము పట్టణంవారు, యోహాను మాటలు విని, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిసం పొందారు
\v 6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
\s5
\v 7 యోహాను "నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను" అని ప్రకటించాడు.
\v 8 "నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పవిత్రాత్మలో బాప్తిసం ఇస్తాడు" అన్నాడు.
\s5
\v 9 యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలలీ ప్రాంతంలోని నజరేతునుండి యేసు వచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
\v 10 యేసు నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి రావడం చూశాడు.
\v 11 అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, "నీవు నా ప్రియకుమారుడివి, నీవంటే నాకెంతో ఆనందం."
\s యేసు ఎదుర్కొన్న శోధన (మత్తయి 4: 1-11; లూకా 4:1- 13)
\s5
\p
\v 12 వెంటనే దేవుని ఆత్మ ఆయనను ఎడారి ప్రాంతానికి వెళ్ళమని ప్రేరేపించాడు.
\v 13 ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
\s గలిలయ పరిచర్య ఆరంభం (మత్తయి 4:12-17; లూకా 4: 14)
\s5
\p
\v 14 యోహాను ఖైదు పాలైన తరువాత యేసు గలలీ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య శుభవార్తను బోధిస్తూ,
\v 15 "కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మండి" అని ప్రకటించాడు.
\s5
\v 16 ఆయన గలలీ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, చేపలు పట్టుకునే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, సరస్సులో వలవేయటం చూశాడు.
\v 17 యేసు, "నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను" అని వారితో అన్నాడు.
\v 18 వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్లారు.
\s పేతురు అంద్రెయల పిలుపు (మత్తయి 4:18-22; లూకా 5:10,11; యోహాను 1:35-42)
\s5
\p
\v 19 ఆయన ఇంకా కొంతదూరం వెళ్లి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు.
\v 20 వారిని చూసిన వెంటనే, తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలోనే పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
\s కపెర్నహూములో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం (లూకా 4: 31-37)
\s5
\p
\v 21 తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణానికి వెళ్లారు. వెంటనే విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజకేంద్రంలో ఉన్నవారికి ఉపదేశం చేశాడు.
\v 22 ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వానిలా వారికి ఉపదేశం చేయడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు.
\s5
\v 23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ కేంద్రంలో ఉన్నాడు.
\v 24 వాడు, "నజరేతు వాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!" అని కేకలు వేసాడు.
\v 25 యేసు, "మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు" అన్నాడు.
\v 26 ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలోనుంచి బయటకు వెళ్ళిపోయింది.
\s5
\v 27 అందరికీ ఆశ్చర్యం కలిగింది. "ఇదేంటి? ఈ అధికార పూర్వకమైన కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!" అని తమలో తాము చర్చించుకున్నారు.
\v 28 ఆయన ఇక్కడ చేసింది గలలీ ప్రాంతమంతా త్వరగా తెలిసిపోయింది.
\s పేతురు అత్త జ్వరం నయం చేయడం (మత్తయి 8:14, 15; లూకా 4: 38, 39)
\s5
\p
\v 29 సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
\v 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.
\v 31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
\s దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇతర స్వస్తతలు (మత్తయి 8:16; లూకా 4:40, 41)
\s5
\p
\v 32 సాయంకాలం, సూర్యుడస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వాళ్ళనూ ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు.
\v 33 ఆ పట్టణమంతా ఆ యింటి దగ్గర గుమిగూడారు.
\v 34 రకరకాల రోగాలతో ఉన్న వాళ్ళను యేసు బాగు చేసాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
\s ప్రార్థన, అనేక గ్రామాల సందర్శనం
\s5
\p
\v 35 ఇంకా తెల్లవారకముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
\v 36 సీమోను, అతనితో ఉన్నవారు, యేసును వెదకడానికి వెళ్లారు.
\v 37 ఆయన కనబడినప్పుడు, "అందరూ నీ కోసం వెదుకుతున్నారు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 38 ఆయన వారితో "చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే" అన్నాడు.
\v 39 ఆయన గలలీ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజకేంద్రాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
\s కుష్టరోగి శుద్ధి (మత్తయి 8:2-4; లూకా 5:12-14)
\s5
\p
\v 40 ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, "నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను బతిమాలాడు.
\v 41 యేసు అతనిపై కనికరపడి, తన చెయ్యి చాపి అతన్ని ముట్టుకుని, "నిన్ను బాగు చేయడం నాకిష్టమే" అన్నాడు.
\v 42 వెంటనే కుష్ఠరోగం అతన్ని వదిలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
\s5
\v 43 ఆయన అతన్ని పంపివేస్తూ, "ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా," అని అతన్ని హెచ్చరించి
\v 44 "నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు" అన్నాడు.
\s5
\v 45 కానీ అతడు వెళ్లి అందరికీ ఈ విషయం చాటించ సాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాలలో నిలిచి ఉండాల్సి వచ్చింది. అందువలన ఆయా ప్రాంతాలనుండి ప్రజలే ఆయన దగ్గరకు తరలి వెళ్ళారు.
\s5
\c 2
\s పక్షవాత రోగిని బాగు చెయ్యడం (మత్తయి 9:1-8; లూకా 5: 18-26)
\p
\v 1 కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు.
\v 2 ఆయన ఇంటికి వచ్చాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా స్థలం లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు.
\s5
\v 3 నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ యేసు దగ్గరకు తీసుకొచ్చారు.
\v 4 ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని యేసు దగ్గరకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.
\s5
\v 5 యేసు వారి విశ్వాసం చూసి, "బాబూ, నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\v 6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు,
\v 7 "అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?"
\s5
\v 8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, "మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక?
\v 9 పక్షవాత రోగితో, 'నీ పాపాలకు క్షమాపణ దొరికింది' అనడమా? లేక 'లేచి నీ పడక ఎత్తుకుని నడువు' అనడమా?
\s5
\v 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మానవ పుత్రునికి ఉందని మీరు తెలుసుకోవాలి" అని చెప్పి
\v 11 ఆ పక్షవాత రోగిని చూసి, "నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను" అన్నాడు.
\v 12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్లిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, "మనం ఇంతవరకు ఇలాంటిది చూడలేదే" అని దేవుణ్ణి స్తుతించారు.
\s లేవీ (మత్తయి) పిలుపు (మత్తయి 9: 9-13; లూకా 5: 27-32)
\s5
\p
\v 13 ఆయన గలలీ సముద్ర తీరాన ఉండగా, అనేక మంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు.
\v 14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవిని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో "నా వెంట రా!" అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.
\s5
\v 15 యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాటి వారు చాలా మంది ఆయనతో వెళ్ళేవారు.
\v 16 అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, "ఈయన పాపం చేసే వాళ్ళతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?" అన్నారు.
\s5
\v 17 యేసు ఈ మాట విని వారితో, "ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుని అవసరం లేదు. రోగంతో ఉన్నవాళ్లకే వైద్యుని అవసరం ఉంది. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను" అని అన్నాడు.
\s5
\v 18 యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి, "యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?" అని ఆయన్ని అడిగారు.
\v 19 యేసు, "పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో ఆ ఇంటివారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు.
\s5
\v 20 పెళ్ళికొడుకును వాళ్ళ దగ్గరనుండి తీసుకువెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు.
\s గుడ్డ మాసిక, ద్రాక్ష తిత్తుల ఉదాహరణం (మత్తయి 9:16, 17; లూకా 5: 36, 39)
\p
\v 21 పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది.
\s5
\v 22 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి" అని వారితో అన్నాడు.
\s యేసు సబ్బాతుకు కూడా ప్రభువు (మత్తయి 12:1-8; లూకా 6:1-5)
\s5
\p
\v 23 విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకుల్ని తుంచారు.
\v 24 పరిసయ్యులు, "చూడు, నీ శిష్యులు విశ్రాంతిదినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 25 అందుకాయన వారితో ఇలా అన్నాడు, "దావీదు, అతనితో ఉన్నవారు, అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా?
\v 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?" అన్నాడు.
\s5
\v 27 ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, "విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు.
\v 28 అందుచేత మానవ పుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!" అని వారితో చెప్పాడు.
\s5
\c 3
\s చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం (మత్తయి 12:10- 14; లూకా 6: 6- 17-19)
\p
\v 1 యేసు మరోసారి సమాజకేంద్రంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడి పోయిన వాడొకడు ఉన్నాడు.
\v 2 అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
\s5
\v 3 యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, "ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు" అన్నాడు.
\v 4 అప్పుడు ఆయన వారితో, "విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? తీయడమా?" అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.
\s5
\v 5 వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకొని, కోపంతో రగిలిపోతూ అందరివైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, "నీ చెయ్యి చాపు" అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.
\v 6 అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు రాజు మనుషులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు.
\s చాలా మందికి స్వస్తత ( మత్తయి 12: 15 -16; లూకా 6: 17-19)
\s5
\p
\v 7 యేసు తన శిష్యులతో కలసి గలలీ సరస్సు వెంబడి వెళ్తూ ఉన్నాడు. గలలీ ప్రాంతం నుండి చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు.
\v 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదుమియా ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరకు వచ్చారు.
\s5
\v 9 ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు.
\v 10 ఆయన అనేకమందిని బాగు చేసాడు. అందువల్ల రోగులందరూ ఆయన్ని తాకాలని ఆయన దగ్గరకు తోసుకొస్తున్నారు.
\s5
\v 11 దయ్యాలు పట్టినవారు ఆయన్ని చూడగానే "నీవు దేవుని కుమారుడివి" అని కేకలు వేశారు.
\v 12 యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
\s పన్నెండు మంది ఎంపిక (మత్తయి 10:1-4; లూకా 6:12- 16)
\s5
\p
\v 13 తరువాత యేసు కొండ ఎక్కి వెళ్లి తనతో ఎవరు రావాలని ఇష్టపడ్డాడో వారిని పిలిచాడు. వారు ఆయన దగ్గరకు వచ్చారు.
\v 14 ఆయనతో ఉండడానికీ, సువార్త ప్రకటించడం కోసం వెళ్ళడానికీ, ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారిని అపోస్తలులు అని పిలిచాడు.
\v 15 రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
\v 16 వారి పేర్లు, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే పేరు పెట్టాడు),
\s5
\v 17 జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఆయన 'బోయనేర్గెసు' అనే పేరు పెట్టాడు, దానికి 'ఉరిమే వారు' అని అర్ధం),
\v 18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను,
\v 19 యేసుని శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.
\s5
\v 20 తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు, మళ్ళీ అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది.
\v 21 కొంతమంది ప్రజలు "ఈయనకు పిచ్చి పట్టింది" అన్నారు. ఇది తెలిసిన యేసు బంధువులు ఆయనను పట్టుకొని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు.
\s క్షమార్హం కాని పాపం (మత్తయి 12: 24-29; లూకా 11: 14-20)
\p
\v 22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు "దయ్యాల అధిపతి బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. అతని సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు" అన్నారు.
\s5
\p
\v 23 అందుచేత యేసు వారిని తన దగ్గరకు పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, "సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు?
\v 24 చీలికలు వచ్చిన రాజ్యం నిలవదు.
\v 25 చీలికలు వచ్చిన కుటుంబం నిలవదు.
\s5
\v 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా.
\v 27 నిజానికి ఒక బలవంతుని ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే.
\s5
\v 28 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు.
\v 29 కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన అపరాధంలో ఉంటాడు.
\v 30 "ఆయనకు దయ్యం పట్టింది" అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
\s కొత్త సంబంధాలు ( మత్తయి 12: 46-50; లూకా 8: 19-21)
\s5
\p
\v 31 అప్పుడు యేసు తల్లి, ఆయన తమ్ముళ్ళు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు.
\v 32 వారు ఆయనతో, "నీ తల్లి, తమ్ముళ్ళు బయట నీ కోసం చూస్తున్నారు" అన్నారు.
\s5
\v 33 ఆయన వారితో "ఎవరు నా తల్లి? ఎవరు నా తమ్ముళ్ళు?" అని
\v 34 తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ "ఇదిగో నా తల్లి, నా సోదరులు.
\v 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడుచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి" అని అన్నాడు.
\s5
\c 4
\s విత్తనాలు చల్లేవాడి ఉదాహరణ (మత్తయి 13:1-23; లూకా 8: 4- 15)
\p
\v 1 మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండటం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు.
\v 2 ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు,
\s5
\v 3 "వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.
\v 4 విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.
\v 5 మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి
\s5
\v 6 కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.
\v 7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.
\s5
\v 8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు వృద్ధి చెంది పంటకు వచ్చాయి."
\v 9 యేసు ఇలా చెప్పి, "వినడానికి మనస్సు ఉన్నవాడు వింటాడు గాక" అన్నాడు.
\s5
\p
\v 10 తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, వారితో ఉన్న సన్నిహితులు ఆ ఉదాహరణల గురించి ఆయన్ని అడిగారు.
\v 11 ఆయన వారితో, "దేవుని రాజ్యం గురించిన మర్మం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉదాహరణల రూపంలోనే లభిస్తుంది.
\v 12 ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్ధం చేసుకోకుండా ఉండాలి, లేదా, ఒకవేళ వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో."
\s ఉదాహరణ వివరణ (మత్తయి 13:18-23; లూకా 8: 11-15)
\s5
\p
\v 13 ఆయన వారితో ఇలా అన్నాడు, "ఈ ఉదాహరణ మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉదాహరణలు ఎలా అర్థం చేసుకొంటారు?
\v 14 విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.
\v 15 దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్యం వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.
\s5
\v 16 అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దానిని స్వీకరిస్తారు
\v 17 కానీ వాళ్ళలో వాక్కు లోతుగా వేరుపారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.
\s5
\v 18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు.
\v 19 కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర వస్తువుల పట్ల కోరికలు, ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
\v 20 ఇతరులు సారవంతమైన నేల లాంటివారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు."
\s దీపం ఉదాహరణ (మత్తయి 5: 15-16; లూకా 8:16; 11:33)
\s5
\p
\v 21 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, "దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా!
\v 22 దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి.
\v 23 వినడానికి చెవులు గలవాడు వింటాడు గాక."
\s5
\v 24 యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, "నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు.
\v 25 కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు."
\s లోలోపలి ఎదగుదల
\s5
\p
\v 26 ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, "దేవుని రాజ్యం ఒక వ్యక్తి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
\v 27 ఆ వ్యక్తి పండుకొని ఉన్నా, మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
\v 28 ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తర్వాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
\v 29 పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు."
\s ఆవగింజ ఉదాహరణ (మత్తయి 13: 31, 32; లూకా 13: 18,19)
\s5
\p
\v 30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, "దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి? ఏ ఉదాహరణ ఉపయోగించి దాన్ని వర్ణించాలి?
\v 31 అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది.
\v 32 కాని దానిని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకొంటాయి."
\s5
\v 33 యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్ధం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు.
\v 34 ఉదాహరణ లేకుండా వాళ్ళకు ఏ ఉపదేశమూ చేయలేదు. ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు.
\s5
\v 35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, "సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం, పదండి" అన్నాడు.
\v 36 శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.
\v 37 అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.
\s5
\v 38 పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని నిద్రలేపి ఆయనతో, "బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?" అని అన్నారు.
\v 39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, "శాంతించు! ఆగిపో!" అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
\s5
\v 40 అప్పుడాయన శిష్యులతో, "మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?" అని అన్నాడు.
\v 41 వాళ్ళకు చాలా భయమేసింది. ఒకరితో ఒకరు "ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!" అని చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు.
\s5
\c 5
\s గదరా ప్రదేశంలో ఉన్మాది (మత్తయి 8: 28-34; లూకా 8: 26-37)
\p
\v 1 వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు.
\v 2 యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు.
\s5
\v 3 వాడు స్మశానం లోనే నివసించేవాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు.
\v 4 వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు ఇనుప సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను, కట్లను తెంపేసే వాడు. వాణ్ణి బంధించి ఉంచే శక్తి ఎవ్వరికీ లేదు.
\s5
\v 5 వాడు స్మశానంలో, కొండలమీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు.
\v 6 వాడు యేసుని దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.
\s5
\v 7 "యేసూ, మహోన్నతుడైన దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్ట వద్దు!" అని అన్నాడు.
\v 8 ఎందుకంటే యేసు అతనితో, "అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!" అని అన్నాడు.
\s5
\v 9 ఆయన "నీ పేరేమిటి?" అని అతణ్ణి అడిగాడు. "నా పేరు సేన, మేము చాలా మందిమి," అని అతడు సమాధానం చెప్పాడు.
\v 10 అతడు ఆ ప్రాంతం నుండి తనను పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు.
\s5
\v 11 ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
\v 12 ఆ దయ్యాలు యేసుతో, "మమ్మల్ని ఆ పందుల గుంపులో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వు" అని వేడుకున్నాయి.
\v 13 యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
\s5
\v 14 ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
\v 15 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకొని బుద్ధిగా కూర్చుని ఉండటం గమనించారు. వారికి భయం వేసింది.
\s5
\v 16 జరిగినదాన్ని స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు.
\v 17 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.
\s5
\p
\v 18 యేసు పడవెక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు.
\v 19 కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, "నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు" అని అన్నాడు.
\v 20 అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి పదినగరాల ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
\s రుతు స్రావం గల స్త్రీ కి స్వస్తత, యాయీరు కుమార్తె ప్రాణ దానం(మత్తయి 9: 18- 26; లూకా 8: 41-56)
\s5
\p
\v 21 యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకొన్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది.
\v 22 అప్పుడు యూదుల సమాజకేంద్రం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి
\v 23 "నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది" అని దీనంగా వేడుకున్నాడు.
\v 24 యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
\s5
\p
\v 25 పన్నెండు సంవత్సరాల నుండి రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది.
\v 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
\v 27 యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది.
\s5
\v 28 తన మనస్సులో, "నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది" అని అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకింది.
\v 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది.
\s5
\v 30 వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్లిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, "నా బట్టలు తాకినదెవరు?" అని అన్నాడు.
\v 31 ఆయన శిష్యులు, "ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు? అంటున్నావేమిటి!" అన్నారు.
\v 32 కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు.
\s5
\v 33 ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది.
\v 34 ఆయన ఆమెతో "అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 35 యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజకేంద్రం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, "నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు శ్రమ కలిగించడం ఎందుకు?" అని అన్నారు.
\s5
\v 36 యేసు వారి మాట విని, వెంటనే సమాజకేంద్రం అధికారితో, "భయపడకు, నమ్మకం మాత్ర౦ ఉంచు" అన్నాడు.
\v 37 అప్పుడాయన పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు.
\v 38 ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు.
\s5
\v 39 ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, "ఎందుకు విచారంగా ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే" అన్నాడు.
\v 40 కాని, వారు ఆయన్ని హేళన చేశారు. యేసు వాళ్ళందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యుల్ని వెంటబెట్టుకొని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు.
\s5
\v 41 ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని, "తలితా కుమీ!" అని అన్నాడు. ఆ మాటకు "చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!" అని అర్ధం.
\v 42 వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది.
\v 43 ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 6
\s నజరేతులో యేసు (మత్తయి 13: 54 -58; లూకా 4:16)
\p
\v 1 యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు
\v 2 విశ్రాంతి దినాన సమాజకేంద్రంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. "ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
\v 3 ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!" అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.
\s5
\v 4 యేసు వారితో, "ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది" అని అన్నాడు.
\v 5 అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వాళ్ళను బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.
\v 6 వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
\s యేసు పన్నెండు మందిని పంపించడం (మత్తయి 10: 1-42; లూకా 9: 1-6)
\s5
\p
\v 7 యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని, వాళ్ళకు దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు,
\v 8 "ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
\v 9 చెప్పులు వేసుకోండి గాని, రెండు జతలు బట్టలు తీసుకువెళ్ళకండి.
\s5
\v 10 ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకు ఆ ఇంట్లోనే ఉండండి.
\v 11 ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాళ్ళకు అంటిన ధూళిని దులిపి వేయండి."
\s5
\v 12 శిష్యులు వెళ్ళి 'పశ్చాత్తాప పడండి' అంటూ ప్రకటించారు.
\v 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
\s హేరోదు ఇబ్బంది, యోహాను వధ (మత్తయి 14:1-14; లూకా 9: 7-9)
\s5
\p
\v 14 యేసు పేరు ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని అతనన్నాడు.
\v 15 ఇతరులు "ఈయన ఏలీయా" అన్నారు. ఇంకొందరు "ఈయన ప్రవక్త" అన్నారు. "పూర్వకాలపు ప్రవక్తల వంటి వాడు" అని మరి కొందరు అన్నారు.
\s5
\v 16 కాని, హేరోదైతే "నేను తల నరికించిన యోహాను మళ్ళీ బతికి వచ్చాడు" అని అన్నాడు.
\v 17 ఇంతకు ముందు హేరోదు స్వయంగా యోహానును బంధించి, ఖైదులో వేయించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా అతడు ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
\s5
\v 18 ఎందుకంటే యోహాను హేరోదుతో "నీ సోదరుని భార్యను తెచ్చుకోవడం అన్యాయం" అని హెచ్చరించాడు.
\v 19 అందుచేత హేరోదియ యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. కాని, హేరోదు యోహానుకు భయపడేవాడు. అందుచేత ఆమె అలా చెయ్యలేకపోయింది.
\v 20 యోహాను నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ ఉండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవర పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
\s5
\p
\v 21 ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖులను, అధికారులను, సైన్యాధిపతులను, గలలీలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
\v 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిధుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, "నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను!" అని అన్నాడు.
\s5
\v 23 "నువ్వు ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగమైనా సరే!" అని ప్రమాణం చేశాడు.
\v 24 ఆమె బయటకి వెళ్లి తన తల్లితో, "నన్నేమి కోరుకోమంటావు?" అని అడిగింది. ఆమె "బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో" అని చెప్పింది.
\v 25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి "బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే" అని అడిగింది.
\s5
\v 26 రాజుకు చాల దుఖం కలిగింది గాని, తాను చేసిన ప్రమాణం కారణంగా తనతో కూర్చుని ఉన్నవారిని బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
\v 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపించి భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి
\v 28 దానిని ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది.
\v 29 ఈ సంగతి విని యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకుపోయి సమాధిచేశారు.
\s ప్రచార పర్యటన నుండి అపోస్తలులు తిరిగి రాక (లూకా 9:10)
\s5
\p
\v 30 అపొస్తలులు యేసు దగ్గరకు తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ, బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
\s ఐదు వేలమందికి ఆహారం (మత్తయి 14: 13- 21; లూకా 9:10-17; యోహాను 6:5-13)
\p
\v 31 వాళ్ళ దగ్గరకు అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వాళ్ళకు భోజనం తినడానికి కూడా సమయం లేకపాయింది. యేసు వారితో, "నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి" అని అన్నాడు.
\v 32 అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.
\s5
\v 33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయన్ని గుర్తు పట్టి ఆయా ఊళ్ళనుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి కన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు.
\v 34 పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వాళ్ళకు అనేక విషయాలు ఉపదేశించ సాగాడు.
\s5
\v 35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, "ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పోద్దుపోయింది.
\v 36 ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో, గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివేయి" అని అన్నారు.
\s5
\v 37 అయితే యేసు వారితో, "మీరే వారికి ఆహారం పెట్టండి!" అన్నాడు. అందుకు వారు ఆయనతో, "రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వాళ్ళకు పంచి పెట్టమంటావా" అని ఆయన్ని అడిగారు.
\v 38 ఆయన వారితో "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి" అన్నాడు. వారు వెళ్ళి చూసి, "ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి" అని అన్నారు.
\s5
\v 39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డిమీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
\v 40 ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
\v 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
\s5
\v 42 అందరూ తిని సంతృప్తి చెందారు.
\v 43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.
\v 44 ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
\s యేసు నీటి పై నడక ( మత్తయి 14: 22-32; యోహాను 6: 15-21)
\s5
\p
\v 45 ఆ తర్వాత యేసు తన శిష్యులతో తనకన్న ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.
\v 46 జనసమూహాన్ని పంపివేసిన తరువాత ఆయన ప్రార్థించడానికి కొండకు వెళ్ళాడు.
\v 47 చీకటి పడుతూ ఉన్న సమయంలో శిష్యులు ఉన్న పడవ సముద్రం మధ్యలో ఉంది. యేసు మాత్రమే ఒడ్డున ఉన్నాడు.
\s5
\v 48 ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
\v 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేశారు.
\v 50 వెంటనే యేసు వారితో, "ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!" అని అన్నాడు.
\s5
\v 51 ఆయన వారి దగ్గరకు వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా దిగ్భ్రాంతి చెందారు.
\v 52 ఎందుకంటే రొట్టెలు పంచిన అద్భుతాన్ని వారు చూసారు కాని, వారి హృదయం బండబారి పోయింది కాబట్టి వారు రొట్టెలను గురించిన సంగతి గ్రహించలేదు.
\s గెన్నెసరెతు తీరాన స్వస్తతలు ( (మత్తయి 14: 34-36)
\s5
\p
\v 53 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.
\v 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
\v 55 ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతమంతటి నుండీ పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగుల్ని వారి మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు.
\s5
\v 56 యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధులలో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయన్ని బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.
\s5
\c 7
\s పరిసయ్యుల ఖండన (మత్తయి 15: 1-20)
\p
\v 1 యెరుషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు.
\s5
\v 2 వారు ఆయన శిష్యులలో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు.
\v 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతుల్ని ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు.
\v 4 వారు బయటనుండి వచ్చినపుడు స్నానం చేయకుండా భోజనం చేయరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు కచ్చితంగా పాటిస్తారు.
\s5
\p
\v 5 పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో "మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?" అని యేసును అడిగారు.
\s5
\v 6 యేసు వారితో,
\p " 'ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది
\p
\v 7 వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వాళ్ళ ఆరాధన వ్యర్ధం,'
\p అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే!
\s5
\v 8 మీరు దేవుని ఆజ్ఞల్ని తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు.
\v 9 మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు.
\v 10 మోషే, 'మీ తల్లిదండ్రుల్ని గౌరవించమనీ, తల్లిని గాని, తండ్రిని గాని దూషించిన వారికి శిక్ష మరణదండన' అనీ నియమించాడు.
\s5
\v 11 కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో 'నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కోర్బాన్’ (అంటే దైవార్పితం)' అని చెప్తే
\v 12 ఇంక ఆ వ్యక్తి తన తల్లి దండ్రుల కోసం ఏమీ చేయనక్కరలేదని చెప్తారు.
\v 13 మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.
\s5
\p
\v 14 అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరకు పిలిచి, "నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్ధం చేసుకోండి!
\v 15 బయటనుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు.
\v 16 మనిషి నుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది" అని అన్నాడు.
\s5
\p
\v 17 ఆయన జనసమూహన్ని విడిచి ఇంటిలో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉదాహరణ గురించి ఆయనను అడిగారు.
\v 18 ఆయన వారితో "మీరు ఇంత అజ్ఞానులా! బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా?
\v 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది" అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు).
\s5
\v 20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, "మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి.
\v 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,
\v 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి.
\v 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి."
\s సురోఫెనికయ స్త్రీ (మత్తయి 15:21,28)
\s5
\p
\v 24 యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన దాగి ఉండలేకపోయాడు.
\v 25 ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది.
\v 26 ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బ్రతిమలాడింది.
\s5
\p
\v 27 అందుకు యేసు ఆమెతో, "మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు" అని అన్నాడు.
\v 28 అందుకామె, "ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!" అని జవాబు ఇచ్చింది.
\s5
\v 29 అప్పుడాయన ఆమెతో, "ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతుర్ని వదిలిపోయింది" అన్నాడు.
\v 30 ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకొని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదిలిపోయింది.
\s మూగ చెవిటి దయ్యం నుండి విడుదల (మత్తయి 15: 29-31)
\s5
\p
\v 31 యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలలీ సముద్రం దగ్గరకు వచ్చాడు.
\v 32 అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరకు తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు.
\s5
\v 33 యేసు అతన్ని జనంలోనుండి పక్కకి తీసుకువెళ్లి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు.
\v 34 అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, "ఎప్ఫతా" అని అతనితో అన్నాడు. ఆ మాటకు "తెరుచుకో!" అని అర్ధం.
\v 35 వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
\s5
\v 36 ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, వారిని ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దానిని చాటించారు.
\v 37 ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, "ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వాళ్ళు మాట్లాడేలా చేస్తున్నాడు" అని చెప్పుకున్నారు.
\s5
\c 8
\s నాలుగు వేల మందికి ఆహారం (మత్తయి 15: 32-39)
\p
\v 1 ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమికూడి ఉండగా, వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి,
\v 2 "ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే ముడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.
\v 3 వాళ్ళను ఇప్పుడు పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు గనుక దారిలో మూర్ఛ పోవచ్చు" అని అన్నాడు.
\v 4 ఆయన శిష్యులు "ఈ ఎడారి ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడనుండి తేగలం?" అని అన్నారు.
\s5
\v 5 "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?" అని ఆయన వారిని అడిగాడు. వారు "ఏడు" అన్నారు.
\v 6 యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.
\s5
\v 7 వాళ్ళ దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు.
\v 8 ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు.
\v 9 తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వాళ్ళను పంపివేసి,
\v 10 వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
\s పరిసయ్యులు సూచనకై అడగడం, పులి పిండి వివరణం (మత్తయి 16: 1- 12)
\s5
\p
\v 11 పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలెట్టారు. ఆయన్ని పరీక్షించడం కోసం 'ఆకాశం నుండి ఒక సూచన' తమకు చూపమని అడిగారు.
\v 12 దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, "ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, మీకు ఏ సూచనా చూపడం జరగదు" అని వారితో చెప్పాడు.
\v 13 తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
\s5
\p
\v 14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు.
\v 15 యేసు వారితో "పరిసయ్యులు, హేరోదీయులు అనే వారి పులియ బెట్టే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!" అన్నాడు.
\s5
\v 16 శిష్యులు, "మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?" అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
\v 17 అది కనిపెట్టి యేసు, "రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?
\s5
\v 18 మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
\v 19 ఐదు వేల మందికి నేను ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగాడు. వారు, "పన్నెండు" అని జవాబు చెప్పారు.
\s5
\v 20 "మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగినప్పుడు వారు "ఏడు" అని జవాబు చెప్పారు.
\v 21 ఆయన వారితో, "ఇంకా మీకు అర్థం కాలేదా?" అన్నాడు.
\s బేత్సయిదా వద్ద గుడ్డి వానికి చూపు
\s5
\p
\v 22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన మీద చేయి ఉంచమని వేడుకున్నారు.
\v 23 యేసు ఆ గుడ్డివాని చేయి పట్టుకుని, ఊరి బయటకు తీసుకువెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, "నీకు ఏమైనా కనిపిస్తుందా?" అన్నాడు.
\s5
\v 24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, "మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు" అన్నాడు.
\v 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్లపై తన చేతులుంచాడు. అప్పుడామనిషి కన్నులు తెరచుకొని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
\v 26 యేసు అతనిని పంపివేస్తూ "నీవు ఊరిలోకి వెళ్ళవద్దు" అని అతనితో చెప్పాడు.
\s పేతురు విశ్వాస ప్రమాణం (మత్తయి 16:13-16; లూకా 9:18- 20)
\s5
\p
\v 27 యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన "నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు.
\v 28 అందుకు వారు, "బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తలలో ఒకడు అని కొందరూ అంటున్నారు" అని చెప్పారు.
\s5
\v 29 "అయితే నేనెవరినని మీరు అనుకుంటున్నారు?" అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, "నీవు అభిషిక్తుడివి!" అన్నాడు.
\v 30 అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
\s5
\p
\v 31 ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు, "మానవ పుత్రుడు అనేక కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆయన్ని తృణీకరించి చావుకు అప్పగిస్తారు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు."
\v 32 యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, పక్కకు తీసుకువెళ్ళి ఆయన్ని మందలించ సాగాడు.
\s5
\v 33 కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, "సైతానా! నా వెనకకు పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనస్సు లేదు" అని గద్దించాడు.
\s ప్రాణం విలువ (మత్తయి 16:24-27; లూకా 23-26)
\p
\v 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు, "ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను తిరస్కరించుకొని, తన సిలువను మోసుకొంటూ నాతో నడవాలి.
\s5
\v 35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దానిని దక్కించుకుంటాడు.
\v 36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?
\v 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?
\s5
\v 38 వ్యభిచారమూ, పాపమూ జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మానవ పుత్రుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు."
\s5
\c 9
\s రూపాంతరం (మత్తయి 17: 1-8; లూకా 9: 28-36)
\p
\v 1 ఆయన వాళ్లతో "నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికి ముందు వారు మరణించరు" అని అన్నాడు.
\v 2 ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసికొని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు.
\v 3 ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి.
\s5
\v 4 అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు.
\v 5 పేతురు యేసుతో, "రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి" అన్నాడు.
\v 6 తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు.
\s5
\v 7 అప్పుడు ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, "ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి."
\v 8 వెంటనే వారు తమ చుట్టూ చూసారు, యేసు తప్ప మరెవ్వరూ వాళ్ళకి కనిపించలేదు.
\s5
\v 9 వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, "మానవ పుత్రుడు చనిపోయి తిరిగి బ్రతికే వరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి" అని ఆజ్ఞాపించాడు.
\v 10 అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకొని "చనిపోయి తిరిగి బ్రతకడం" గురించి తమలో తాము చర్చించుకున్నారు.
\s5
\v 11 అప్పుడు వారు "ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?" అని ఆయనను అడిగారు.
\v 12 యేసు జవాబు చెబుతూ, "ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మానవ పుత్రుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది?
\v 13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు" అన్నాడు.
\s శక్తి లేని శిష్యులు, మహా శక్తి గల క్రీస్తు (మత్తయి 17:14-21; లూకా 9: 37-42)
\s5
\p
\v 14 మిగిలిన శిష్యుల దగ్గరకు ఆయన రాగానే వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉండడం, కొందరు ధర్మశాస్త్ర పండితులు వారితో వాదిస్తుండడం చూసాడు.
\v 15 ఆ ప్రజలు యేసును చూసిన వెంటనే విభ్రాంతికి లోనయ్యారు. వారంతా ఆయన దగ్గరకు పరుగెత్తి వచ్చి ఆయనకు నమస్కరించారు.
\v 16 యేసు "దేనిని గురించి వారితో వాదిస్తున్నారు?" అని వారిని అడిగాడు.
\s5
\v 17 ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, "బోధకుడా! నా కుమారుణ్ణి మీ దగ్గరకు తీసుకు వచ్చాను. వాడికి దయ్యం పట్టి మూగవాడయ్యాడు.
\v 18 ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురుగు కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని, వారు చేయలేకపోయారు" అని అన్నాడు.
\v 19 అందుకు యేసు, "విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరకు తీసుకొని రండి" అన్నాడు.
\s5
\v 20 వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి నురుగు కక్కుతున్నాడు.
\v 21 యేసు వాడి తండ్రితో "ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?" అని అడిగాడు. ఆ తండ్రి "వాడి బాల్యం నుండి.
\v 22 ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చేయి" అని వేడుకున్నాడు.
\s5
\v 23 యేసు అతనితో "నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే" అన్నాడు.
\v 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, "నేను నమ్ముతున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలగిపోవడానికి సహాయం చెయ్యి" అన్నాడు.
\v 25 యేసు జనసమూహం తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, "మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశింప వద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు.
\s5
\v 26 ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది.
\v 27 ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాల మంది అతడు చనిపోయాడని అనుకున్నారు. కాని, యేసు అతని చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
\s5
\p
\v 28 యేసు ఇంట్లోకి వచ్చిన తరువాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, "ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్ట లేకపోయాం?" అని అడిగారు.
\v 29 ఆయన వారితో, "ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల, ఉపవాసం వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం" అని జవాబు చెప్పాడు.
\s యేసు తన మరణాన్ని గురించి ముందుగా చెప్పడం (మత్తయి 17: 22-23; లూకా 9: 43-45)
\s5
\p
\v 30 వారు అక్కడ నుండి బయలుదేరి గలలీ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.
\v 31 ఆయన వాళ్లతో "మానవ పుత్రుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బతికి వస్తాడు" అని అన్నాడు.
\v 32 కాని యేసు చెప్పింది శిష్యులు గ్రహించలేదు. దాని గురించి యేసుని అడగడానికి వారు భయపడ్డారు.
\s ఎవరు గొప్పవాడని వివాదం (మత్తయి 18:1-6; లూకా 9: 46-48)
\s5
\p
\v 33 వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంటిలో చేరాక యేసు వారితో, "దారిలో మీరు దేని గురించి వాదిస్తున్నారు?" అని అడిగాడు.
\v 34 అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు 'తమలో ఎవరు గొప్ప' అని వాదించుకున్నారు.
\v 35 యేసు కూర్చొని పన్నెండు మందిని పిలిచి, "మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి" అని వారితో అన్నాడు.
\s5
\p
\v 36 అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకొని ఇలా అన్నాడు,
\v 37 "నా పేరట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు."
\s చీలికల విషయం గద్దింపు (లూకా 9: 49,50)
\s5
\p
\v 38 యోహాను ఆయనతో, "బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం" అన్నాడు.
\v 39 అయితే యేసు "అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి చెడుగా మాట్లాడలేడు.
\s5
\v 40 మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షంగా ఉన్నవాడే.
\v 41 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.
\s నరకం గురించి యేసు ఇచ్చిన గంభీరమైన హెచ్చరిక
\s5
\p
\v 42 కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
\v 43 మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే
\v 44 దానిని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.
\s5
\v 45 ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు
\v 46 కారణమైతే దానిని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.
\s5
\v 47 అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దానిని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు.
\v 48 నరకంలో వారిని తినివేసే పురుగులు చావవు, అగ్ని ఆరదు.
\s5
\v 49 భోజన పదార్ధాలకు ఉప్పు ఎలాగో ప్రతి ఒక్కరి మీదా దేవుడు అగ్ని అలా వేస్తాడు.
\v 50 ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\c 10
\s యేసు ఉద్దేశంలో విడాకులు (మత్తయి 5: 31, 32; 19: 1-9; లూకా 16: 18; 1 కొరింతి 7: 10 -15)
\p
\v 1 యేసు ఆ ప్రాంతం విడిచి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత యొర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చారు. ఎప్పటిలాగే యేసు వారికి ఉపదేశం చేశాడు.
\v 2 కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించే ఉద్దేశంతో "ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?" అని అడిగారు.
\v 3 యేసు, "మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?" అని అడిగాడు.
\v 4 వారు "విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు" అన్నారు.
\s5
\v 5 యేసు, "మీరు దేవునికి లోబడని వారు, బండబారిన హృదయాలు గలవారు కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు.
\v 6 కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు.
\s5
\v 7 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు.
\v 8 వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు.
\v 9 కాబట్టి దేవుడు కలిపిన వాళ్ళను ఏ మనిషీ వేరు చేయకూడదు" అని వారితో చెప్పాడు.
\s5
\p
\v 10 అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు.
\v 11 యేసు, "తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్లే.
\v 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి" అని వారితో అన్నాడు.
\s చిన్న పిల్లలకు క్రీస్తు దీవెన (మత్తయి 19: 13- 15; లూకా 18: 15-17)
\s5
\p
\v 13 కొంతమంది యేసు తమ చిన్న బిడ్డల్ని ముట్టాలని వారిని తీసుకువచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు.
\v 14 ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో "చిన్న బిడ్డల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే.
\s5
\v 15 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు" అన్నాడు.
\v 16 ఆయన ఆ చిన్నపిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై చేతులుంచి వారిని దీవించాడు.
\s ధనికుడైన యువ అధికారి (మత్తయి 19:16-30; లూకా 18:18-30; 10: 25)
\s5
\p
\v 17 ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, "మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?" అని ఆయన్ని అడిగాడు.
\v 18 యేసు, "నేను మంచివాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు.
\v 19 దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు , అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి" అన్నాడు.
\s5
\v 20 అతడు ఆయనతో, "బోధకా, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను" అని అన్నాడు.
\v 21 యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, "నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత సిలువ ఎత్తుకొని వచ్చి నన్ను అనుసరించు" అని అన్నాడు.
\v 22 అతడు గొప్ప ఆస్తిపరుడు కనుక యేసు చెప్పిన ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఖంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
\s ధనసంపాదన గురించి హెచ్చరికలు
\s5
\p
\v 23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, "ఆస్తిపరుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం" అని అన్నాడు.
\v 24 ఆయన మాటలకు శిష్యులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. యేసు, మళ్ళీ, "పిల్లలారా, తమ ఆస్తి మీద నమ్మకం ఉంచినవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం!
\v 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం" అన్నాడు.
\s5
\v 26 ఇది విని శిష్యులు ఇంకా ఆశ్చర్యపడ్డారు. వారు "అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?" అంటూ తమలో తాము మాట్లాడుకున్నారు.
\v 27 యేసు వాళ్ళ వైపు చూసి, "మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే" అన్నాడు.
\v 28 పేతురు ఆయనతో, "ఇదిగో, మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను అనుసరించాం గదా!" అని అన్నాడు.
\s5
\v 29 అందుకు యేసు, "మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నా కోసం, సువార్త కోసం, తన ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిని తండ్రిని, భార్యను, పిల్లలను, ఆస్తులను వదిలిపెట్టిన వారు
\v 30 ఇప్పుడు ఈ లోకంలో హింసలతో బాటు ఇళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, ఆస్తులు, రానున్న లోకంలో శాశ్వత జీవం పొందుతాడు.
\v 31 కాని, మొదటివారు చాల మంది చివరివారు అవుతారు, చివరివారు చాల మంది మొదటివారు అవుతారు" అన్నాడు.
\s యేసు తన మరణ పునరుత్థానాల గురించి ముందుగా చెప్పడం (మత్తయి 20: 17-19; లూకా 18: 31-33)
\s5
\p
\v 32 యేసు, ఆయనతో ఉన్నవారంతా యెరూషలేము బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులకి ఆశ్చర్యం కలిగింది. ఆయనను అనుసరిస్తున్న ఇతరులు భయపడ్డారు. యేసు మళ్ళీ తన శిష్యులను పక్కకు పిలిచి, తనకు జరగబోయే వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు.
\v 33 ఆయన, "వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మానవ పుత్రుణ్ణి ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు. వారు ఆయనకు మరణశిక్ష విధించి, యూదేతర ప్రజలకు అప్పగిస్తారు.
\v 34 వారు ఆయన్ని హేళన చేసి, ఆయన మీద ఉమ్మివేస్తారు. కొరడా దెబ్బలు కొడతారు, ఆ తరువాత చంపేస్తారు. మూడో రోజున ఆయన మళ్ళీ సజీవంగా లేస్తాడు" అని వారితో చెప్పాడు.
\s ప్రథములుగా ఉండాలన్న యాకోబు, యోహానుల అభిలాష (మత్తయి 20:20-28)
\s5
\p
\v 35 జెబెదయి కుమారులు యాకోబు, యోహాను ఆయన దగ్గరకు వచ్చి, "బోధకా! మేము నిన్ను అడిగేది మాకు అనుగ్రహిస్తావా?" అని అడిగారు.
\v 36 ఆయన, "నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?" అని ప్రశ్నించాడు.
\v 37 వారు "నీవు మహిమ పొందినప్పుడు మాలో ఒకరిని నీ కుడిచేతి వైపు, మరొకరిని ఎడమచేతి వైపు కూర్చోబెట్టుకో" అన్నారు.
\s5
\v 38 యేసు, "మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను తాగిన దానిని మీరు తాగగలరా? నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా?" అని అడిగాడు.
\v 39 వారు "పొందగలం" అని జవాబు చెప్పారు. యేసు వారితో, "నేను తాగిన దాన్ని మీరు తాగుతారు, నేను పొందిన బాప్తిసం మీరు పొందుతారు.
\v 40 కాని, నా కుడివైపు, నా ఎడమవైపు కూర్చోడానికి అనుమతించేది నేను కాదు. ఆ స్థానాలు ఎవరి కోసం సిద్దం చేసి ఉన్నాయో వారికే అవి దొరుకుతాయి" అన్నాడు.
\s5
\v 41 ఇది విని మిగతా పదిమందికి యాకోబు, యోహానుల మీద కోపం వచ్చింది.
\v 42 అయితే యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి వారితో ఇలా అన్నాడు, "అన్యజనుల అధికారులు ప్రజల మీద తమ ఆధిపత్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు. వారిలో ప్రముఖులు వారిపై అధికారం చెలాయిస్తారు.
\s5
\v 43 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఉండాలి.
\v 44 మీలో మొదటివాడు కావాలని కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి.
\v 45 ఎందుకంటే మానవ పుత్రుడు సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చేయడానికీ, అందరి పక్షాన తన ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చాడు."
\s బర్తిమయి చూపు పొందడం (మత్తయి 20: 29-34: లూకా 18: 35:43)
\s5
\p
\v 46 ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చొని ఉన్నాడు. అతడు భిక్షగాడు.
\v 47 ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకొని, "యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!" అని కేకలు పెట్టసాగాడు.
\v 48 చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, "దావీదు కుమారా! నా మీద దయ చూపు!" అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు.
\s5
\v 49 యేసు ఆగి, "అతణ్ణి పిలవండి" అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో "ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు" అన్నారు.
\v 50 ఆ గుడ్డివాడు తాను కప్పుకున్న పైబట్టను అవతల పారవేసి, గబాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
\s5
\v 51 యేసు, "ఏం కావాలి?" అని అడిగాడు. ఆ గుడ్డివాడు, "రబ్బీ! నాకు చూపు ప్రసాదించు" అని వేడుకున్నాడు.
\v 52 యేసు, "నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు" అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.
\s5
\c 11
\s యేసును రాజుగా ప్రదర్శించడం (జెకర్యా 9:9; మత్తయి 21:1-9; లూకా 19:29-38; యోహాను 12: 12-19)
\p
\v 1 వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, ఇలా అన్నాడు,
\v 2 "మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇదివరకు దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దానిని విప్పి తోలుకు రండి.
\v 3 అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, 'ఇది ప్రభువుకు అవసరం' అనండి. వెంటనే అతడు దానిని పంపిస్తాడు."
\s5
\v 4 శిష్యులు వెళ్లి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దానిని విప్పారు.
\v 5 అక్కడ ఉన్న కొందరు వారితో, "మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?" అని అడిగారు.
\v 6 శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు.
\s5
\v 7 వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తీసుకువచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు.
\v 8 చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు.
\v 9 ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ "జయం! ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యుడు!
\v 10 రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. మహోన్నతుడైన వానికి జయం!" అని బిగ్గరగా కేకలు వేశారు.
\s5
\p
\v 11 యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు.
\s వాడిపోయిన అంజూరు చెట్టు (మత్తయి 21: 19-21)
\p
\v 12 మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
\s5
\v 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరకు వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించ లేదు.
\v 14 ఆయన ఆ చెట్టుతో, "ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు" అన్నాడు. అది ఆయన శిష్యులు విన్నారు.
\s యేసు దేవాలయాన్ని శుద్ధి చేయడం ( మత్తయి 21: 12-16; లూకా 19:45-47; యోహాను 2: 13-16)
\s5
\p
\v 15 వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలోకి ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు.
\v 16 దేవాలయం గుండా ఎవ్వరూ అమ్మకానికి సరుకులు మోసుకుపోకుండా చూశాడు.
\s5
\v 17 ఆయన వారితో "‘నా ఆలయం అన్ని జనాంగాలకూ ప్రార్థనా ఆలయం అంటారు’ అని గ్రంథాలలో రాసి ఉంది. మీరైతే దానిని దోపిడి దొంగల గుహగా చేసారు" అని అన్నాడు.
\v 18 ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆయనను ఎలా చంపాలి అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం బట్టి ఆయనకు భయపడ్డారు.
\v 19 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు.
\s5
\v 20 తర్వాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు.
\v 21 అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, "రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది" అన్నాడు.
\s విశ్వాస సహిత ప్రార్థన (యాకోబు 5:15)
\s5
\p
\v 22 అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, "దేవుని మీద విశ్వాసం ఉంచండి.
\v 23 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే ఈ కొండతో ‘నీవు లేచి సముద్రంలో పడిపో! అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది.
\s5
\v 24 అందుచేత నేను చెప్పేది ఏమంటే, "మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
\v 25 అంతే కాక మీరు నిలిచి ప్రార్థన చేసినప్పుడెల్ల మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి.
\v 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు."
\s యేసు అధికారాన్ని గురించి ప్రశ్న (మత్తయి 21: 23-27; లూకా 20:1-8)
\s5
\p
\v 27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి
\v 28 ఆయనతో "నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ క్రియలు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?" అని అడిగారు.
\s5
\v 29 యేసు, "నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను.
\v 30 యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి" అని అడిగాడు.
\s5
\v 31 వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము చర్చించుకొని, "'మనం పరలోకం నుండి' అని అంటే ఇతడు 'అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?' అంటాడు.
\v 32 'మనుషుల నుండి' అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది" అని అనుకున్నారు. ఎందుకంటే యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు.
\v 33 కనుక వారు "మాకు తెలియదు" అని జవాబు చెప్పారు. యేసు, "అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను" అన్నాడు.
\s5
\c 12
\s కౌలు దారుల వద్ద వసూలుకై వచ్చిన తోట యజమాని ఉపమానం (మత్తయి 21: 33-46; లూకా 20:9-19; యెషయా 5:1-7)
\p
\v 1 ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. "ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడకట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు.
\v 2 పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరకు పంపాడు.
\v 3 అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకొని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.
\s5
\v 4 అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపర్చి, అవమానించి పంపివేశారు.
\v 5 అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు.
\s5
\v 6 వారి దగ్గరకు పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు.
\v 7 కాని ఆ కౌలుదారులు 'ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది' అని తమలో తాము మాట్లాడుకున్నారు.
\s5
\v 8 వారు అతన్ని పట్టుకొని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు.
\v 9 అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.
\s5
\v 10 మీరు ఈ లేఖనం చదవలేదా? 'ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
\v 11 అది ప్రభువు మూలంగా జరిగింది. అది ప్రభువు చేశాడు. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.' "
\v 12 ఈ ఉదాహరణ తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి భయపడిపోయారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు.
\s పన్ను విషయం ప్రశ్న (మత్తయి 22: 15-22; లూకా 20: 19-26)
\s5
\p
\v 13 యేసును ఆయన మాటలలోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరకు పంపారు.
\v 14 వారు వచ్చి ఇలా అన్నారు, "బోధకా ! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తావు. కైసరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా? కాదా?
\v 15 మనం పన్నులు కట్టాలా? మానాలా?" అని అడిగారు. అయితే యేసుకు వాళ్ళ కుయుక్తి తెలిసి వారితో, "నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకురండి" అన్నాడు.
\s5
\v 16 వారు ఒక నాణాన్ని తీసుకువచ్చారు. "దీని మీద ఎవరి బొమ్మ ఉంది ? ఎవరి శాసనం ఉంది?" అని ఆయన అడిగాడు. వారాయనతో "కైసరుది" అన్నారు.
\v 17 అప్పుడు యేసు వారితో, "కైసరుకు చెందింది కైసరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి" అని అన్నాడు.
\s సద్దూకయ్యులకు యేసు జవాబు (మత్తయి 22:23-33; లూకా 20: 27-38)
\s5
\p
\v 18 అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు.
\v 19 "బోధకా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్లి చేసుకొని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు.
\s5
\v 20 ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేకుండా చనిపోయాడు.
\v 21 రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వానికి కూడా అలాగే జరిగింది.
\v 22 ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకొని సంతానం లేకుండా చనిపోయారు. చివరకు ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 23 చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్లి చేసుకున్నారు కదా!" అని అడిగారు.
\s5
\v 24 యేసు వారికి జవాబిస్తూ, "మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు.
\v 25 చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు.
\s5
\v 26 ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో 'పొదను గురించిన భాగం' రాసినప్పుడు దేవుడతనితో, 'నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి' అని అతనితో చెప్పాడు.
\v 27 తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయినవారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు" అన్నాడు.
\s గొప్ప ఆజ్ఞలు (మత్తయి 22: 34-40; లూకా 10: 25-37)
\s5
\p
\v 28 ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, "ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?" అని ఆయనను అడిగాడు.
\v 29 అప్పుడు యేసు, "ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, 'ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే.
\v 30 హృదయ పూర్వకంగా, నిండు ఆత్మతో, మనస్పూర్తిగా, పూర్తి బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.' ఇది ప్రధాన ఆజ్ఞ.
\v 31 రెండవది, 'నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.' వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు" అని జవాబిచ్చాడు.
\s5
\v 32 ఆ ధర్మశాస్త్ర పండితుడు, "అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే.
\v 33 హృదయ పూర్వకంగా, నిండు ఆత్మతో, బుద్ధి అంతటితో, పూర్తి బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వానిని ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం" అన్నాడు.
\v 34 అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, "నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు" అన్నాడు. ఆ తర్వాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.
\s పరిసయ్యులకు యేసు ప్రశ్నలు (మత్తయి 22: 41-46; లూకా 20: 41-44)
\s5
\p
\v 35 యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, "క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు?
\v 36 దావీదు, తానే పవిత్రాత్మ మూలంగా మాట్లాడుతూ, 'ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు- నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో' అన్నాడు.
\v 37 దావీదు స్వయంగా ఆయన్ని 'ప్రభువు' అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?" అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు.
\s5
\v 38 ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, "ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ,
\v 39 సమాజకేంద్రాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు.
\v 40 వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు."
\s వితంతువు కానుక (లూకా 21;1-4)
\s5
\p
\v 41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో వ్యక్తులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు.
\v 42 అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి రెండు నాణేలను ఆ పెట్టెలో వేసింది.
\s5
\v 43 ఆయన తన శిష్యులను దగ్గరకు పిలిచి, "నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసింది.
\v 44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది" అన్నాడు.
\s5
\c 13
\s ఒలీవ కొండ ప్రసంగం శిష్యుల ప్రశ్నలు (మత్తయి 24, 25 అధ్యా. లూకా 21)
\p
\v 1 యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యులలో ఒకడు, "బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!" అన్నాడు.
\v 2 యేసు అతనితో "ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి" అన్నాడు.
\s5
\v 3 యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు. పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు,
\v 4 "ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగటానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?"
\s ఒలీవ కొండ ప్రసంగం- ఈ యుగం తీరుతెన్నులు
\s5
\p
\v 5 యేసు వారితో, "మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పు దోవ పట్టించకుండా జాగ్రత పడండి.
\v 6 అనేకులు నా పేరుతో వచ్చి 'నేనే ఆయనను' అంటూ చాల మందిని మోసం చేస్తారు.
\s5
\v 7 మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
\v 8 జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. అల్లర్లు కూడా జరుగుతాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే.
\s5
\v 9 మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సునగోగుల్లో మీరు దెబ్బలు తినవలసివస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్షం చెప్పవలసి వస్తుంది.
\v 10 అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.
\s5
\v 11 వారు మిమ్మల్ని పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడతాడు.
\v 12 సోదరులు ఒకరికి ఒకరు ద్రోహం చేసుకొని మరణానికి అప్పగించుకుంటారు. అదే విధంగా తండ్రి తన కుమారుని మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు.
\v 13 నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకు సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.
\s మహాశ్రమల కాలం (మత్తయి 24: 15)
\s5
\p
\v 14 వినాశకారి అయిన హేయవస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడటం మీరు చూచినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల మీదికి పారిపోవాలి.
\v 15 మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళటం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.
\v 16 పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.
\s5
\v 17 గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.
\v 18 ఈ సంఘటన చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.
\v 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజునుండి ఈనాటి వరకు ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇకముందు రావు కూడా.
\v 20 దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.
\s5
\v 21 ఆ రోజుల్లో ఎవరైనా మీతో ‘ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు’ లేదా ‘ఇదిగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.
\v 22 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.
\v 23 అందువల్ల మీరు జాగ్రతగా ఉండడానికి అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.
\s మహిమతో ప్రభువు తిరిగి రాక (మత్తయి 24: 27-31)
\s5
\p
\v 24 ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతి ఇవ్వడు.
\v 25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.
\v 26 అప్పుడు మానవ పుత్రుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.
\v 27 అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.
\s అంజూరు చెట్టు ఉపమానం (మత్తయి 24: 32, 33; లూకా 21: 29-31)
\s5
\p
\v 28 "అంజూరు చెట్టును చూసి ఈ పాఠం నేర్చుకోండి. దాని కొమ్మలు ఆకులు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు.
\v 29 అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరగా రానైయున్నాడనీ తెలుసుకోండి.
\s5
\v 30 నేను కచ్చితంగా చెప్పేదేమంటే ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి.
\v 31 ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
\v 32 అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.
\s5
\v 33 జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
\s 34 ప్రభువు రెండవ రాకకై మెలకువగా ఎదురు చూడడం
\p
\v 34 ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిని పోలి ఉంటుంది. తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కనికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవానికి కాపలా కాయమని చెప్పాడు.
\s5
\v 35 అలాగే ఎప్పుడూ సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు.
\v 36 ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!
\v 37 నేను మీకు చెప్తున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి."
\s5
\c 14
\s యేసును సంహరించడానికి కుట్ర (మత్తయి 26: 2-5: లూకా 22:1,2)
\p
\v 1 రెండు రోజుల తర్వాత పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ రాబోతున్నాయి. ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు.
\v 2 అయితే ప్రజలలో అల్లరి జరగవచ్చు అని భయపడి 'పండుగ సమయంలో వద్దు' అని చెప్పుకున్నారు.
\s బేతనీ మరియ యేసును అభిషేకించడం (మత్తయి 26: 6-13; యోహాను 12:1-8)
\s5
\p
\v 3 ఆ సమయంలో యేసు బేతనీలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్లనుండి చేసిన స్వచ్ఛమైన, చాలా విలువైన అత్తరును ఒక చలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది.
\v 4 అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, "అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు?
\v 5 ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు ఇచ్చి ఉండవలసింది" అని తమలో తాము చెప్పుకొని ఆ స్త్రీని గద్దించారు.
\s5
\v 6 అయితే యేసు, "ఆమె జోలికి వెళ్ళకండి! ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్టమైన పని చేసింది.
\v 7 పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చేయవచ్చు. కాని, నేను ఎల్లకాలం మీతో ఉండను.
\v 8 ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది.
\v 9 మీతో నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతిచోటా ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసికొని ప్రశంసిస్తారు" అన్నాడు.
\s యేసును పట్టిస్తానని యుదా ఒప్పందం (మత్తయి 26:14-16: లూకా 22:3-6)
\s5
\p
\v 10 ఆ తరువాత పన్నెండు మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చేందుకు ప్రధాన యాజకులతో మాట్లాడడానికి వారి దగ్గరకు వెళ్ళాడు.
\v 11 అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెపుతామని మాట ఇచ్చారు. అప్పటినుండీ యూదా యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
\s పస్కా భోజనం సిద్ధబాటు (మత్తయి 26: 17-19; లూకా 22:7-13)
\s5
\p
\v 12 పొంగని రొట్టెల పండుగ మొదటి రోజున పస్కా గొర్రెపిల్లను వధించినప్పుడు యేసు శిష్యులు, "పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయాలని కోరుతున్నావు?" అని ఆయనను అడిగారు.
\v 13 యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, "మీరు ఉళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి.
\v 14 అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు' అని చెప్పండి.
\s5
\v 15 అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి" అని ఆదేశించాడు.
\v 16 ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండుగ భోజనం సిద్ధం చేశారు.
\s చివరి రాత్రి భోజనం (మత్తయి 26: 20-24; లూకా 22: 14, 21; యోహాను 13:18-19)
\s5
\p
\v 17 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు.
\v 18 వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, "మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు" అన్నాడు.
\v 19 వారికి దుఖం వచ్చింది. ఒకరి తరువాత ఒకరు ఆయనతో, "నేను కాదు కదా!" అన్నారు.
\s5
\v 20 ఆయన వారితో, "అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి నా పాత్రలో చెయ్యి ముంచేవాడే!
\v 21 ఎందుకంటే మానవ పుత్రుడి గురించి రాసి ఉన్నట్టే అయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు."
\s ప్రభు రాత్రి భోజన సంస్కార స్థాపన ( మత్తయి 26: 26-29; లూకా22: 17-20; 1 కొరింతి 11:23-26)
\s5
\p
\v 22 వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసికొని ఆశీర్వదించి, దానిని విరిచి వారికిచ్చి "దీనిని తీసికొని తినండి. ఇది నా దేహం" అన్నాడు.
\v 23 తరువాత ఒక పాత్ర తీసికొని దేవునికి కృతజ్ఞత చెప్పి వాళ్ళకు ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు.
\v 24 ఆయన వారితో, "ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే కొత్త నిబంధన రక్తం.
\v 25 నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకు ఇక నేను దానిని తాగను అని మీతో ఖండితంగా చెబుతున్నాను" అన్నాడు.
\s5
\v 26 అప్పుడు వారు కీర్తన పాడి ఒలీవల కొండకు బయలుదేరారు.
\s పేతురు తన్నెరుగనంటాడని యేసు ముందుగా చెప్పడం (మత్తయి 26: 31-35; లూకా 22: 31-34; యోహాను 13: 35-38)
\p
\v 27 అప్పుడు యేసు వారితో, "ఈ రాత్రి నా విషయంలో మీరంతా తడబడతారు, ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, 'కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.'
\s5
\v 28 కాని నేను తిరిగి బతికిన తరువాత మీకంటే ముందుగా గలలీకి వెళ్తాను" అని చెప్పాడు.
\v 29 అయితే పేతురు ఆయనతో, "అందరూ తడబడినా నేను మాత్రం తడబడను" అన్నాడు.
\s5
\v 30 అప్పుడు యేసు, "నీతో కచ్చితంగా చెప్పేదేమంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని బొంకుతావు" అని అతనితో అన్నాడు.
\v 31 "నేను నీతో చావవలసి వచ్చినా నిన్ను ఎరుగను అని చెప్పను" అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు.
\s తోటలో వేదన (మత్తయి 26: 36-46; లూకా 22:42-42)
\s5
\p
\v 32 అందరూ 'గేత్సెమనే' అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, "నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి" అన్నాడు.
\v 33 అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్లి తీవ్రమైన దుఃఖం, ఆవేదన అనుభవించసాగాడు.
\v 34 ఆయన వారితో, "ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను.
\s మొదటి ప్రార్థన (మత్తయి 26: 39; లూకా 22:41,42)
\s5
\p
\v 35 మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి" అని చెప్పి, ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ తరుణం తన నుండి తప్పిపోవాలని ప్రార్థన చేశాడు.
\v 36 ఆయన "అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు" అని ప్రార్థించాడు.
\s5
\v 37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, "సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా?
\v 38 మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేటందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది" అన్నాడు.
\s రెండవ ప్రార్థన (మత్తయి 26: 42; లూకా22:44)
\p
\v 39 ఆయన మళ్ళీ వెళ్లి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు.
\s5
\v 40 ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు.
\s మూడవ ప్రార్థన (మత్తయి 26:44)
\p
\v 41 మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, "మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించ బోతున్నారు.
\v 42 వెళ్దాం, రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు."
\s యేసును బంధించడం (మత్తయి 26:47-56; లూకా 22: 47-53; యోహాను 18: 3-11)
\s5
\p
\v 43 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒక్కడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ, గదలూ ఉన్నాయి.
\v 44 ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, "నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన్ని బంధించి తీసుకు వెళ్ళండి" అన్నాడు.
\v 45 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరకు వచ్చి, "రబ్బీ!" అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు.
\v 46 అప్పుడు వారు యేసు మీద పడి చేతులతో గట్టిగా పట్టుకున్నారు.
\s పేతురు కత్తి దూయడం, యేసును దూరం నుండి వెంబడించడం, అందరూ యేసును విడిచి పోవడం (మత్తయి 26:51,56)
\s5
\p
\v 47 యేసు పక్కన నిలుచున్నవాడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేశాడు.
\v 48 యేసు వారితో ఇలా అన్నాడు, "మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా?
\v 49 నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాలలో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది."
\v 50 అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.
\s5
\p
\v 51 ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు.
\v 52 కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి, నగ్నంగా పారిపోయాడు.
\s సన్ హెడ్రిన్ ఎదుటా, ప్రధాన యాజకుని ఎదుటా యేసు (26: 57- 68; యోహాను 18: 12-14, 19-24)
\s5
\p
\v 53 వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు.
\v 54 పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు.
\s5
\v 55 ప్రధాన యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులందరూ యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్షం కోసం చూస్తూ ఉన్నారు గాని, అది వారికి దొరకలేదు.
\v 56 చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షం చెప్పారు. కాని, వాళ్ళ సాక్షాలు ఒకదానితో ఒకటి సరిపడలేదు.
\s5
\v 57 అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షం చెబుతూ
\v 58 "ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులలో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం" అన్నారు.
\v 59 కాని, వారి సాక్షం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు.
\s5
\p
\v 60 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, "నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్షం చెప్తున్నారు కదా!" అని యేసును ప్రశ్నించాడు.
\v 61 కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, "నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?" అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు.
\v 62 అప్పుడు యేసు, "ఔను. నేనే. మానవ పుత్రుడు సర్వశక్తుని కుడివైపున కూర్చుని ఉండటం, ఆయన పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు" అని అన్నాడు.
\s5
\v 63 ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకొని, "ఇంకా మనకు సాక్షాలతో ఏం పని?
\v 64 ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?" అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు.
\v 65 అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, "ఎవరో చెప్పుకో" అని అన్నారు. భటులు కూడా అర చేతులతో ఆయనను కొట్టారు.
\s యేసుని గురించి పేతురు అబద్ధం (మత్తయి 26:69-75; లూకా 22: 56-62; యోహాను 18: 16- 18, 25-27)
\s5
\p
\v 66 పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది.
\v 67 పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండటం చూసి, "నజరేతు వాడైన యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!" అని అతనితో అంది.
\v 68 పేతురు కాదన్నాడు. "నేను ఆయనను ఎరుగను. నీవేం అంటున్నావో నాకు అర్ధం కావడం లేదు" అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.
\s5
\v 69 ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, "ఇతడు వాళ్ళలో ఒకడు" అంది.
\v 70 పేతురు మళ్ళీ తిరస్కరించాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో "నిజమే! నీవు వాళ్ళల్లో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలలీ వాడివే కదా!" అన్నారు.
\s5
\v 71 అయితే పేతురు, "మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు" అంటూ తనను తను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలెట్టాడు.
\v 72 వెంటనే రెండోసారి కోడి కూసింది. 'కోడి రెండు సార్లు కూసేముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు" అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. పేతురు దుఖం ఆపుకోలేక ఏడ్చాడు.
\s5
\c 15
\s పిలాతు ఎదుట యేసు (మత్తయి 27: 1, 2, 11-15; లూకా 23: 1-7, 13-18; యోహాను 18: 28-40; 19:1-16)
\p
\v 1 తెల్లవారు జామున ప్రధాన యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్లి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
\v 2 పిలాతు యేసును, "నీవు యూదుల రాజువా?" అని ప్రశ్నించాడు. అందుకు యేసు, "నీవన్నట్టే" అని అతనికి జవాబిచ్చాడు.
\v 3 ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరాలు మోపారు.
\s5
\v 4 కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, "వీరు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?" అన్నాడు.
\v 5 అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.
\s యేసు కాదు బరబ్బాయే (మత్తయి 27:16-26; లూకా 23:16-25; యోహాను 18:40)
\s5
\p
\v 6 పండుగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ.
\v 7 బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో జైలులో ఉన్నాడు.
\v 8 జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు.
\s5
\v 9 పిలాతు, "యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?" అని అన్నాడు.
\v 10 ఎందుకంటే ప్రధాన యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు.
\v 11 కాని ప్రధాన యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు.
\s5
\v 12 పిలాతు, "అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?" అని అడిగాడు.
\v 13 వారు కేకలు వేస్తూ "సిలువ వేయండి" అన్నారు.
\s5
\v 14 పిలాతు, "ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?" అన్నాడు. జనసమూహం "సిలువ వేయండి" అంటూ మరి ఎక్కువగా కేకలు వేశారు.
\v 15 ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్లు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు.
\s ముళ్ళ కిరీటము (మత్తయి 27: 27-31)
\s5
\p
\v 16 సైనికులు యేసును అధికారి భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు.
\v 17 వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు.
\v 18 ఆ తరువాత "యూదుల రాజా, జయం!" అంటూ ఆయనకు వందనం చేయసాగారు.
\s5
\v 19 రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు.
\v 20 ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తర్వాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకువెళ్ళారు.
\v 21 కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (అతడు అలెగ్జాండర్, రూఫస్ అనేవారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువ మోయించారు.
\s5
\p
\v 22 వారు యేసును "గొల్గొతా" అనే స్థలానికి తీసుకువచ్చారు, గొల్గొతా అంటే "కపాల స్థలం" అని అర్ధం.
\v 23 అప్పుడు వారు ద్రాక్షారసంలో మత్తు కలిగించే బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు.
\s యేసు సిలువ శిక్ష (మత్తయి 27:33-56; యోహాను 19:17-37)
\p
\v 24 ఆ తరువాత వారు ఆయన్ని సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు.
\s5
\v 25 ఆయన్ని సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు.
\v 26 "యూదుల రాజు" అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు.
\v 27 ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు
\v 28 ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు.
\s5
\v 29 ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ "దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా!
\v 30 ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నీవే రక్షించుకో!" అన్నారు.
\s5
\v 31 ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ "వీడు ఇతరుల్ని రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు!
\v 32 'క్రీస్తు' అనే ఈ 'ఇశ్రాయేలు రాజు' సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు.
\s5
\p
\v 33 మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది.
\v 34 మూడు గంటలకు యేసు "ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!" అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటలకు "నా దేవా! నా దేవా! ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు?" అని అర్థం.
\v 35 దగ్గర నిలుచున్న కొందరు అది విని, "ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు" అన్నారు.
\s5
\v 36 ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్పంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. "ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం" అని అతడన్నాడు.
\v 37 యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
\v 38 అప్పుడు దేవాలయంలో తెర పైనుండి కింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది.
\s5
\p
\v 39 యేసు ముందు నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, "నిజంగా ఈయన దేవుని కుమారుడు" అన్నాడు.
\v 40 కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్డలేనె మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు.
\v 41 యేసు గలలీలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీళ్ళే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
\s సమాధి (మత్తయి 27:57-61; లూకా 23: 50-56; యోహాను 19:38-42)
\s5
\p
\v 42 అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.
\v 43 యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.
\v 44 యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, "యేసు అప్పుడే చనిపోయాడా?" అని అడిగాడు.
\s5
\v 45 ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకొని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు.
\v 46 యోసేపు సన్నని నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తర్వాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు.
\v 47 మగ్డలేనె మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.
\s5
\c 16
\s యేసు సజీవంగా తిరిగి లేవడం, ఆ దిన సంఘటనలు (మత్తయి 28:1-15; లూకా 24: 1-49; యోహాను 20:1-23)
\p
\v 1 విశ్రాంతి దినం అయిపోగానే, మగ్డలేనె మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్లి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.
\v 2 ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరకు వస్తూ,
\s5
\v 3 "మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\v 4 వారు వచ్చి సమాధి వైపుకు చూసినపుడు ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది.
\s5
\p
\v 5 వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడిపక్కన కూర్చుని ఉండటం చూసారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు.
\v 6 అతడు వారితో ఇలా అన్నాడు, "భయపడకండి! మీరు వెదకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే.
\v 7 మీరు వెళ్లి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి, "యేసు మీకంటే ముందుగా గలలీకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు."
\s5
\v 8 ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.
\s5
\v 9 వారపు మొదటి దినం ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు.
\v 10 ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరకు వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె, యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది.
\v 11 యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు.
\s5
\p
\v 12 ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు.
\v 13 వారు తిరిగి వెళ్లి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు కాని, వారు నమ్మలేదు.
\s5
\v 14 ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు.
\v 15 యేసు వారితో ఇలా అన్నాడు, "మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.
\v 16 దానిని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
\s5
\p
\v 17 "నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడుతారు.
\v 18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వాళ్లకు ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడతారు."
\s 19 ఆరోహణం (లూకా 24: 50- 53; అపో కా 1: 6 -11)
\s5
\p
\v 19 ప్రభు యేసు వారితో మాట్లాడిన తరువాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.
\v 20 ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్లి యేసును ప్రకటించారు. ప్రభువు వాళ్లకు తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు. ఆమెన్.

2491
43-LUK.usfm Normal file
View File

@ -0,0 +1,2491 @@
\id LUK Luke
\s5
\c 1
\s పరిచయం
\p
\v 1 ఘనులైన తియొఫిలా,
\v 2 మొదటినుంచీ కళ్ళారా చూసిన వాక్యసేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
\v 3 కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటన్నిటినీ మొదటినుండి పరిశోధించి పరిష్కారంగా తెలుసుకున్న నేను కూడా నీ కోసం వాటి గురించి
\v 4 క్రమపద్ధతిలో రాయడం మంచిదని అనుకుంటున్నాను.
\s బాప్తిసమిచ్చే యోహాను జనన ప్రకటన
\s5
\p
\v 5 యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
\v 6 వీరిద్దరూ ప్రభువు ఇచ్చిన అన్ని ఆజ్ఞల, న్యాయవిధుల విషయంలో నిరపరాధులుగా నడుచుకొంటూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండేవారు.
\v 7 ఎలీసబెతు గొడ్రాలు. వారికి పిల్లలు లేరు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
\s5
\v 8 జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
\v 9 యాజక ధర్మం ప్రకారం ప్రభువు ఆలయం లోపలికి వెళ్లి ధూపం వేయడానికి చీట్లు వేస్తే అతనికి వంతు వచ్చింది .
\v 10 ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తుండగా
\s5
\v 11 ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనిపించాడు.
\v 12 జెకర్యా అతనిని చూచి, కంగారుపడి భయపడ్డాడు.
\v 13 అప్పుడా దూత అతనితో "జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
\s5
\v 14 అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది.
\v 15 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసంగానీ సారాయిగానీ తాగడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
\s5
\v 16 ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
\v 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపుకీ, అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికీ మళ్ళించడానికీ, తద్వారా ప్రభువు కోసం సిద్ధపడిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలియా మనసుతో బలప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు" అన్నాడు.
\s5
\v 18 దేవదూతతో జెకర్యా "ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు," అన్నాడు
\v 19 దూత "నేను దేవుని సముఖంలో నిలిచే గబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
\v 20 నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మాటలు లేక మౌనంగా ఉంటావ"ని అతనితో అన్నాడు .
\s5
\v 21 ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
\v 22 అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అప్పుడతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
\v 23 అతడు సేవ చేసే రోజులు పూర్తి అయిన తరువాత యింటికి వెళ్లి పోయాడు.
\s5
\v 24 కొన్ని రోజులకు అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె అయిదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
\v 25 ఆమె "దేవుడు నన్ను కనికరించి మనుష్యులలో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు" అనుకొంది.
\s క్రీస్తు జనన ప్రకటన
\s5
\p
\v 26 ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు గబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే ఊరిలో
\v 27 దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో నిశ్చితార్థం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
\v 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో "దయ పొందిన దానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు" అని పలికాడు.
\v 29 ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
\s5
\v 30 దూత "మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
\v 31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
\v 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని "సర్వోన్నతుని కుమారుడు" అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
\v 33 ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు" ఆని ఆమెతో చెప్పాడు.
\s5
\v 34 మరియ "నేను కన్యని గదా, ఇదెలా జరుగుతుంది?" అంది.
\v 35 అ దూత "పరిశుద్ధాత్మ నిన్ను అవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
\s5
\v 36 పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది, కొడుకును కనబోతూ ఉంది. గొడ్రాలనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
\v 37 దేవుడు చెప్పిన ఏ మాటా వ్యర్థంగా పోదు" అని ఆమెతో చెప్పాడు.
\v 38 అందుకు మరియ "నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగు గాక" అంది. అప్పుడు దూత వెళ్ళిపోయాడు.
\s మరియ ఎలీసబెతును సందర్శించడం
\s5
\p
\v 39 ఇది జరిగిన కొద్దికాలానికే మరియ సిద్ధపడి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని
\v 40 ఇంట్లోకి వెళ్లి, ఎలీసబెతుకు వందనం చేసింది.
\v 41 ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
\s5
\v 42 "స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందిన వాడు.
\v 43 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
\v 44 నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
\v 45 ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుంది గనక నమ్మిన ఆమె ధన్యురాలు" అంది.
\s మరియ స్తోత్ర పాఠము (1 సమూ 2:1-10)
\s5
\p
\v 46 అప్పుడు మరియ ఇలా అంది, "నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
\p
\v 47 ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
\s5
\p
\v 48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది.
\p
\v 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
\s5
\p
\v 50 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
\p
\v 51 ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగాల ఆలోచనలను బట్టి చెదరగొట్టివేశాడు.
\s5
\p
\v 52 బలవంతులను గద్దెల పైనుంచి పడద్రోసి దీనులను ఎక్కించాడు
\p
\v 53 ఆకలితో ఉన్న వాళ్ళను మంచి ఆహారంతో కడుపు నింపి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
\s5
\p
\v 54 అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి వారిని జ్ఞాపకం చేసికొంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు
\v 55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు."
\s5
\p
\v 56 మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, అ పైన తన యింటికి వెళ్లి పోయింది.
\s బాప్తిసమిచ్చే యోహాను జననం
\p
\v 57 ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
\v 58 అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కూడా సంతోషించారు.
\s5
\v 59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయ బోతుండగా
\v 60 తల్లి "అలా కాదు. అ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి" అంది.
\v 61 అందుకు వారు "నీ బంధువుల్లో ఆ పేరు గలవారెవరూ లేరు గదా" అని,
\s5
\v 62 "వాడికి ఏ పేరు పెట్టాలి?" అని తండ్రిని సైగలతో అడిగారు.
\v 63 అతడు పలక తెమ్మని "బాబు పేరు యోహాను" అని రాశాడు; అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
\s5
\v 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
\v 65 అది చూసి చుట్టుపట్ల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారమంతా యూదయ మన్యం అందరూ చెప్పుకోసాగారు.
\v 66 జరిగిన సంగతులు విన్నవారంతా "ఈ బిడ్డ ఎలాటివాడవుతాడో!" అనుకొన్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉంది
\s5
\v 67 అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు
\p
\v 68 "ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.
\s5
\p
\v 69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలిగించాడు
\p
\v 70 తన సేవకుడైన దావీదు వంశంలో మనకోసం రక్షణ శృంగాన్ని నిలిపాడు.
\p
\v 71 మన శత్రువులబారి నుండీ మనల్ని ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణనిచ్చాడు.
\s5
\p
\v 72 దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.
\p
\v 73 ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన
\v 74 అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికోవడానికి ఈ విధంగా జరిగించాడు.
\p
\v 75 మనం శత్రువుల చేతినుండి విడుదల పొంది, మన జీవిత కాలమంతా నిర్భయంగా, ఆయన సన్నిధిలో
\s5
\v 76 పవిత్రంగా నిర్దోషంగా ఆయన్ని సేవించేలా అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగజేశాడు.
\p
\v 77 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి
\s5
\v 78 వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
\p
\v 79 మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను చావునీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పైనుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేసాడు."
\s5
\p
\v 80 ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.
\s5
\c 2
\s యేసు జననం (మత్తయి 1:18-25; 2:1)
\p
\v 1 ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజర్ అగష్టస్ ఆజ్ఞాపించాడు.
\v 2 ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య.
\v 3 అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
\s5
\v 4 యోసేపు కూడా ఆ సంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరుగల దావీదు ఊరికి వెళ్ళాడు. ఎందుకంటే అతడు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు.
\v 5 తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు
\s5
\v 6 వారక్కడ ఉండగా ఆమె నెలలు నిండాయి.
\v 7 ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. సత్రంలో వారికి స్థలం దొరకలేదు.
\s గొర్రెల కాపరుల ఆరాధన
\s5
\p
\v 8 ఆ పరిసరాలలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు
\v 9 ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
\s5
\v 10 అయితే ఆ దూత "భయపడకండి. ఇదిగో మనుషులందరి కోసం మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.
\v 11 దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువు, అభిషిక్తుడు
\v 12 మీకు కొండ గుర్తు ఒకటే. ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టి తొట్టిలో పండుకొని ఉండగా మీరు చూస్తారు" అని వారితో చెప్పాడు.
\s5
\v 13 వెంటనే పరలోక సేనావాహిని ఆ దూతతోబాటు ఉండి దేవుని స్తుతిస్తూ
\p
\v 14 "సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద శాంతిసమాధానాలు!" అన్నారు.
\s5
\p
\v 15 ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్లిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు "జరిగిన యీ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్లి చూద్దాం పదండి," అని ఒకడితో ఒకడు చెప్పుకొని
\v 16 త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు.
\s5
\v 17 చూసి, ఆ శిశువును గురించి తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు.
\v 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్న వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
\v 19 మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.
\v 20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గురించి దేవుని మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్లిపోయారు.
\s యేసు సున్నతి ఆచారం (లూకా 1:59)
\s5
\p
\v 21 ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు.
\s5
\v 22 మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయిన తరువాత
\v 23 'ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి' అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది గనక ఆయన్ని ప్రభువుకు ప్రతిష్ఠించడానికి,
\v 24 ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతనుగానీ రెండు పావురం పిల్లల్ని గానీ బలిగా సమర్పించడానికి, వారు ఆయన్ని యెరూషలేముకు తీసుకుపోయారు.
\s సుమెయోను ఆరాధనం, ప్రవచనం
\s5
\p
\v 25 యెరూషలేము లో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు.
\v 26 అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు.
\s5
\v 27 ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు బాల యేసును దేవాలయం లోకి తెచ్చారు.
\v 28 సుమెయోను తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు.
\p
\v 29 "ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!
\s5
\p
\v 30 అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా
\v 31 నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన
\v 32 నీ రక్షణ నేను కళ్ళారా చూశాను."
\s5
\p
\v 33 యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.
\v 34 అతడు వారిని దీవించి, "అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో అనేకులు పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు" అన్నాడు.
\v 35 ఆయన తల్లి మరియతో "నీ హృదయం లోకి కత్తి దూసుకు పోతుంది" అని చెప్పాడు.
\s అన్నా ఆరాధనం
\s5
\p
\v 36 దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె ఉంది. అమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె . ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో,
\v 37 ఎనభై నాలుగేళ్ళ పాటు విధవరాలుగా ఉండిపోయింది. ఆమె దేవాలయం లోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్లు సేవ చేస్తూ ఉండేది.
\v 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేములో విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
\s నజరేతుకు తిరిగి రాక
\s5
\p
\v 39 అ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున కర్మకాండలు పూర్తి చేసుకుని గలిలయ లోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్లిపోయారు.
\v 40 పసివాడు జ్ఞానంతో నిండిపోతూ, ఎదుగుతూ, బలపడుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
\s యేసు యెరూషలేము యాత్ర
\s5
\p
\v 41 పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్లడం కద్దు.
\v 42 ఆయన పన్నెండేళ్ళప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండుగకు యెరూషలేము వెళ్ళారు.
\v 43 ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు.
\v 44 ఆయన తల్లి దండ్రులు ఆ సంగతి తెలియక ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయిన వారిలో ఆయన్ని వెతకసాగారు.
\s5
\v 45 ఆయన కనబడక పోవడంతో ఆయన్ని వెతుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు.
\v 46 అప్పటికి మూడు రోజులైంది. ఆయన అలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు.
\v 47 ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు.
\s5
\v 48 ఆయన తలిదండ్రులు ఆయన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి "కుమారా, మా విషయంలో ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను అందోళనగా నిన్ను వెతుకుతున్నాం" అంది.
\v 49 అందుకు ఆయన "మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?" అన్నాడు.
\v 50 కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.
\s5
\v 51 అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొంది.
\v 52 యేసు జ్ఞానంలోనూ, వయస్సులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.
\s5
\c 3
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహాను 1:6-8, 15-36)
\p
\v 1 కైసరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు అధిపతి. హేరోదు గలలీ రాష్ట్రాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.
\v 2 అన్న, కయప ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది.
\s5
\v 3 పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని యొర్దాను నదీ ప్రాంతమంతా తిరిగి అతడు ప్రకటించాడు.
\s5
\v 4 యెషయా ప్రవక్త గ్రంథంలో ఇలా రాసి ఉంది. "ఎడారిలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయనకు తిన్నని బాటలు వేయండి.
\s5
\v 5 ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
\v 6 ప్రజలందరూ దేవుని రక్షణ చూస్తారు."
\s5
\v 7 అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో "విష సర్పసంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొనేలా మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
\s5
\v 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు చూపండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
\s5
\v 9 ఇప్పటికే , చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 10 అప్పుడు గుంపులో కొంతమంది, "అయితే మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు.
\v 11 అతడు "రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేనివాడికి ఒకటివ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి" అని చెప్పాడు.
\s5
\v 12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి "బోధకా, మేమేం చేయాలి" అని అతన్ని అడిగారు.
\v 13 అతడు "మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసికోవద్దు" అని వారితో చెప్పాడు.
\s5
\v 14 "మా సంగతేంటి? మేమేం చేయాలి?"అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. "ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి" అని వారితో చెప్పాడు. .
\s5
\v 15 క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
\v 16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు. "నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను . ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
\s5
\v 17 తన కళ్ళం బాగు చేయడానికి తూర్పార పట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోధుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చి వేస్తాడు."
\s5
\v 18 అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.
\v 19 అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం, యోహాను అతన్ని మందలించాడు.
\v 20 హేరోదు అంతవరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు యోహానును చెరసాలలో పెట్టాడు.
\s యేసు బాప్తిసం (మత్తయి 3:13-17; మార్కు 1:9-11)
\s5
\p
\v 21 ప్రజలంతా బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
\v 22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. "నీవు నా కిష్టమైన కుమారుడివి, నీ వంటే నాకెంతో ఆనందం."
\s యేసు తల్లి మరియ వంశ వృక్షం
\s5
\p
\v 23 యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కుమారుడు,
\v 24 హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు, లేవి మెల్కీ కుమారుడు,
\s5
\v 25 మెల్కీ యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు, యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నాహోము కుమారుడు, నాహోము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు,
\v 26 నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,
\s5
\v 27 యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు,
\v 28 నేరి మెల్కీ కుమారుడు, మెల్కీ అద్ది కుమారుడు, అద్ది కోసాము కుమారుడు, కోసాము ఎల్మదాము కుమారుడు, ఎల్మదాము ఏరు కుమారుడు,
\v 29 ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలీయెజెరు కుమారుడు, ఎలీయెజెరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు,
\s5
\v 30 లేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు, యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు,
\v 31 ఎల్యాకీము మెలెయా కుమారుడు, మెలెయా మెన్నా కుమారుడు, మెన్నా మత్తతా కుమారుడు, మత్తతా నాతాను కుమారుడు, నాతాను దావీదు కుమారుడు,
\v 32 దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,
\s5
\v 33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము ఎస్రోము కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,
\v 34 యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,
\v 35 నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,
\s5
\v 36 షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,
\v 37 లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు,
\v 38 కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.
\s5
\c 4
\s క్రీస్తు విషమ పరీక్ష(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)
\p
\v 1 యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. ఆత్మ ఆయన్ని అరణ్యంలోకి నడిపించాడు.
\v 2 అక్కడ నలభై రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
\s5
\v 3 సాతాను ఆయనతో "నీవు దేవుని కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు" అన్నాడు.
\v 4 యేసు "మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు" అని రాసి ఉంది" అని జవాబిచ్చాడు.
\s5
\v 5 అప్పుడు సాతాను ఆయన్ని ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్లి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు.
\v 6 "ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను.
\v 7 కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే యిదంతా నీదే" అని ఆయనతో చెప్పాడు.
\s5
\v 8 అయితే యేసు "నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయన్ని మాత్రమే సేవించాలి" అని రాసి ఉంది" అని వానికి జవాబిచ్చాడు.
\s5
\v 9 ఆ తర్వాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి "నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దూకు.
\v 10 "దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
\v 11 నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు" అని రాసి ఉంది గదా," అని ఆయనతో అన్నాడు.
\s5
\v 12 అయితే యేసు "నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు" అని రాసి ఉందని జవాబిచ్చాడు.
\v 13 సాతాను, యేసును పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
\s యేసు గలిలయ తిరిగి రావడం (మత్తయి 4:12-16; మార్కు 1:14)
\s5
\p
\v 14 అప్పుడు యేసు ఆత్మ శక్తి తో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
\v 15 ఆయన వారి సమాజ మందిరాలలో బోధిస్తుంటే అందరూ ఆయన్ని మెచ్చుకున్నారు.
\s నజరేతు సమాజ కేంద్రంలో
\s5
\p
\v 16 ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్లి చదవడానికి నిలబడ్డాడు.
\v 17 యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే
\s5
\v 18 "ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ
\v 19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు" అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
\s5
\v 20 ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు.
\v 21 సమాజ మందిరం లో ఉన్న వాళ్ళంతా ఆయనను తేరి చూశారు. "మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అని ఆయన వారితో అన్నాడు.
\v 22 అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. "ఈయన యోసేపు కొడుకు గదా?" అని చెప్పుకున్నారు.
\s5
\v 23 ఆయన వాళ్ళతో "వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో" అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు.
\v 24 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వాళ్ళు అంగీకరించలేదు.
\s5
\v 25 ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా,
\v 26 దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరికీ పంపలేదు, సీదోను పక్కనున్న సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి దగ్గరికే పంపాడు.
\v 27 ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్ఠరోగులున్నా, సిరియా దేశస్థుడు నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు."
\s5
\v 28 సమాజ మందిరం లో ఉన్నవాళ్ళంతా ఆ మాటలు విని
\v 29 ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండకొమ్ము వరకూ తీసికెళ్ళారు. వాళ్ళ ఊరు కొండపైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు.
\v 30 అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్లిపోయాడు.
\s కపెర్నహూములో దయ్యాలు వెళ్ళగొట్టడం (మార్కు 1:23-26)
\s5
\p
\v 31 అప్పుడాయన గలలీ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు.
\v 32 వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు .
\s5
\v 33 ఆ సమాజ మందిరం లో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొక డున్నాడు.
\v 34 అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు, "నజరేతు వాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీ వెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి."
\s5
\v 35 యేసు "ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా" అని దయ్యాన్ని మందలించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలోనుండి బయటికి వచ్చేసింది.
\v 36 అందరూ ఆశ్చర్య పడ్డారు. "ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\v 37 అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది.
\s పేతురు అత్తగారి స్వస్థత (మత్తయి 8:14-17; మార్కు 1:29-38)
\s5
\p
\v 38 ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమాలారు.
\v 39 ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.
\s5
\v 40 పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వాళ్ళని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు.
\v 41 దయ్యాలు "నీవు దేవుని కుమారుడివి" అని కేకలు వేసి చాలా మందిని వదలి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
\s5
\v 42 తెల్లారేసరికల్లా ఆయన బయలుదేరి ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపుగా ఆయనను వెదుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయన్ని ఆపాలని చూశారు.
\v 43 అయితే ఆయన "నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాదు" అని వారితో చెప్పాడు.
\v 44 ఆయన యూదయ ప్రాంతమంతటి లోని సమాజ మందిరాలలో ప్రకటిస్తూ వచ్చాడు.
\s5
\c 5
\s కోకొల్లలుగా చేపలు (యోహాను 21:6-8)
\p
\v 1 ఒకరోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు.
\v 2 ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.
\v 3 ఆయన ఆ పడవలలో సీమోను పడవ ఎక్కి ఒడ్డు నుండి కొద్ది దూరం తోయమని అతని నడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చొని ప్రజలకు బోధించాడు.
\s5
\v 4 ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో "పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వేయ" మని అన్నాడు.
\v 5 సీమోను, "స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను" అని ఆయనతో అన్నాడు.
\v 6 వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. వారి వలలు పిగిలి పోతుంటే
\v 7 వారు వేరే పడవల్లోనున్న తమ సహచరులు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సైగలు చేసారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు నింపారు. పడవలు మునిగిపోసాగాయి.
\s5
\v 8 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ల ముందు పడి "ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు." అన్నాడు.
\v 9 ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
\v 10 వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో "భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే వాడివవుతావు" అన్నాడు.
\v 11 వారు పడవల్ని ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
\s యేసు కుష్టురోగిని స్వస్థపరచడం (మత్తయి 8:2-4; మార్కు 1:40-44)
\s5
\p
\v 12 యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే సాగిలపడి "ప్రభూ! మీరు దయ తలిస్తే నన్ను బాగు చేయగలరు" అని ఆయనను వేడుకున్నాడు.
\v 13 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, "నాకిష్టమే. బాగు పడు," అన్నాడు. వెంటనే అతని కుష్టు పోయింది.
\s5
\v 14 "ఈ విషయం ఎవరికీ చెప్ప వద్దు. అయితే వెళ్లి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు శుద్ధి కోసం మోషే విధించిన దానిని అర్పించు" అని యేసు అతన్ని ఆదేశించాడు.
\s5
\v 15 అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాల్ని బాగుచేసుకోడానికీ వచ్చారు.
\v 16 అయితే ఆయన ప్రార్థన చేసుకోడానికి జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయేవాడు.
\s పక్షవాతరోగి స్వస్థత (మత్తయి 9:2-8; మార్కు 2:1-12)
\s5
\p
\v 17 ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలలీ, యూదయ ప్రాంతాలలోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనకుంది.
\s5
\v 18 కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకుని వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని
\v 19 జనులు క్రిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, ఇంటికప్పు మీది కెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
\s5
\v 20 యేసు వారి విశ్వాసం చూచి "అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\v 21 శాస్త్రులూ పరిసయ్యులూ "దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?" అనుకున్నారు
\s5
\v 22 యేసు వారి ఆలోచన గ్రహించి "మీరు మీ హృదయాలలో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
\v 23 ఏది సులభమంటారు? "నీ పాపాలు క్షమిస్తున్నాను" అనడమా, "లేచి నడువు" అనడమా?
\v 24 అయితే మనుష్యకుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలిసికోవాలి" అన్నాడు. పక్షవాత రోగిని చూచి "నీవు లేచి, నీ పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 25 వెంటనే వాడు వారి ఎదుటే లేచి నిలబడి, తాను పడుకొన్న పరుపు ఎత్తుకొని, దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.
\v 26 అందరూ విస్మయం చెంది "ఈ రోజు వింత విషయాలు చూశాం" అని దేవుని స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
\s మత్తయికి పిలుపు (మత్తయి 9:9; మార్కు 2:13-14)
\s5
\p
\v 27 ఆ తర్వాత ఆయన బయటికి వెళ్లి పన్నులు వసూలు చేసే లేవి అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో "నా వెంట రా" అన్నాడు.
\v 28 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.
\s5
\v 29 లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వాళ్ళూ వేరే వాళ్ళూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
\s మతాధికారులతో వాదం (మత్తయి 9:10-17; మార్కు 2:16-22)
\p
\v 30 పరిసయ్యులూ వారి శాస్త్రులూ "మీరు పన్నులు వసూలు చేసే వాళ్ళతో పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?" అని శిష్యులమీద సణుక్కొన్నారు.
\v 31 అందుకు యేసు "రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడక్కర లేదు.
\v 32 పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు," అన్నాడు.
\s5
\v 33 వారాయనతో "యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతున్నారు" అని అన్నారు.
\v 34 అందుకు యేసు "పెళ్లి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు ఉపవాసం చేయించగలరా?
\v 35 పెళ్లి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఉపవాసం చేస్తారు" అని వారితో చెప్పాడు.
\s పాత బట్ట, ద్రాక్షరసం నిలవ చేసే తోలు తిత్తి (మత్తయి 9:16, 17: మార్కు 2:21, 22)
\s5
\p
\v 36 ఆయన వారికి ఒక ఉదాహరణ చెప్పాడు. "ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలవదు.
\s5
\v 37 ఎవడూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగి పోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి.
\v 38 అయితే క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలోనే పోయాలి.
\v 39 పాత ద్రాక్షారసం తాగిన తర్వాత కొత్త దానిని ఎవరూ ఆశించరు. ఎందుకంటే 'పాతదే బాగుంది,' అంటారు."
\s5
\c 6
\s విశ్రాంతి దినం గురించి యేసు ఉపదేశం (మత్తయి 12:1-8; మార్కు 2:23-28)
\p
\v 1 ఒక విశ్రాంతిదినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు.
\v 2 అప్పుడు పరిసయ్యులలో కొందరు "విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు" అని వారినడిగారు.
\s5
\v 3 యేసు వారితో ఇలా అన్నాడు, "దావీదుకీ , అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేసాడో అది కూడా మీరు చదవలేదా?
\v 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని, తనతో ఉన్నవారికీ ఇచ్చాడు కదా!" అన్నాడు.
\v 5 ఇంకా ప్రభువు "అయితే మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి కూడా యజమాని" అని వారితో చెప్పాడు.
\s చెయ్యి చచ్చుబడిపోయిన వాణ్ణి బాగు చెయ్యడం (మత్తయి 12:9-14; మార్కు 3:1-6)
\s5
\p
\v 6 మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు.
\v 7 ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఆ చచ్చుబడిన చేతితో బాధపడుతున్న వాణ్ణి బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు.
\v 8 వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యిగలవాడితో "నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు" అన్నాడు. వాడు లేచి నిలిచాడు.
\s5
\v 9 అప్పుడు యేసు "విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? లేక కీడు చేయడం న్యాయమా? ప్రాణాన్ని రక్షించడం న్యాయమా? లేక హత్య చేయడం న్యాయమా? అని మిమ్మల్ని అడుగుతున్నాను" అని వారితో చెప్పి
\v 10 చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి "నీ చెయ్యి చాపు" అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.
\v 11 అప్పుడు వారు వెర్రి కోపంతో నిండి పోయి యేసును ఏమి చేయాలా అని తమలో తాము చర్చించుకున్నారు.
\s5
\v 12 ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్లి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.
\s పన్నెండుమంది ఎంపిక (మత్తయి10:2-4; మార్కు 3:13-19)
\p
\v 13 ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు.
\s5
\v 14 వాళ్ళెవరంటే ఆయన పేతురు అనే మారుపేరు పెట్టిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
\v 15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను,
\v 16 యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.
\s5
\v 17 ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యుల సమూహం అక్కడ ఉంది. ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటినుండీ, యెరూషలేము నుండీ తూరు సీదోను అనే పట్టణాలనుండీ, సముద్ర తీరాలనుండీ పెద్ద జనసమూహం వచ్చారు. వారంతా బాగుపడ్డారు.
\v 18 అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు.
\v 19 రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలోనుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు.
\s నవ ధన్యతలు (మత్తయి 5:3-12)
\s5
\p
\v 20 అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు,
\p " పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది.
\p
\v 21 ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది.
\p ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
\s5
\p
\v 22 మనుష్యకుమారుని కారణంగా మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీరు చెడ్డవారంటూ మీ పేరును కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు.
\v 23 ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.
\s5
\p
\v 24 అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు.
\v 25 అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు యాతన. మీకు ఆకలి వేస్తుంది. అయ్యో, ఇప్పుడు నవ్వుతున్న మీకు యాతన. మీరు దుఃఖించి ఏడుస్తారు.
\s5
\v 26 మనుష్యులందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు యాతన. వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు.
\s ఉత్తమ ఆదర్శం
\s5
\p
\v 27 వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి.
\v 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించండి.
\s5
\v 29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండో చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు.
\v 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ ధనాన్ని తీసుకున్న వాణ్ణి దాని కోసం తిరిగి అడగవద్దు.
\s5
\v 31 మనుష్యులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
\v 32 మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు కూడా ప్రేమిస్తే మిమ్మల్నెవరు మెచ్చుకుంటారు? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా.
\v 33 మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!
\v 34 అప్పు తీరుస్తారు అనుకున్న వాళ్ళకే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మరలా వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
\s5
\v 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానమై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడై ఉన్నాడు.
\v 36 కాబట్టి మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారై ఉండండి.
\s5
\v 37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు.
\s5
\v 38 క్షమించండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తారు. ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతలో కొలుస్తారో అదే కొలతలో మీకూ కొలుస్తారు."
\s5
\v 39 తర్వాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, "ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా?
\v 40 శిష్యుడు తన గురువు కంటే అధికుడు కాడు. అయితే సంపూర్ణంగా సిద్ధపడినవాడు తన గురువులా ఉంటాడు.
\s5
\v 41 నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు?
\v 42 నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో "సోదరా, నీ కంట్లో నలుసు తీసి వేయనియ్యి" అని నువ్వెలా చెప్పగలవు? మోసగాడా, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేయి. అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కన్పిస్తుంది.
\s5
\v 43 మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు.
\v 44 ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు. రక్కెస పొదలో ద్రాక్షపండ్లు కోయరు.
\s5
\v 45 మంచి మనిషి తన హృదయమనే ధననిధిలోనుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధి లోనుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది.
\s5
\v 46 నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే "ప్రభూ, ప్రభూ" అని నన్ను పిలవడం ఎందుకు?
\s గట్టి నేలపై కట్టిన ఇల్లు (మత్తయి 7:24-27)
\p
\v 47 నా దగ్గరకు వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవర్ని పోలి ఉంటాడో వినండి.
\v 48 వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడి వలె ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దానిని బలంగా కట్టారు కనుక దానిని కదిలించలేక పోయింది.
\s5
\v 49 అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేలమీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ యింటి నాశనం ఎంతో దయనీయం."
\s5
\c 7
\s శతాధిపతి సేవకుని స్వస్థత (మత్తయి 8:5-13)
\p
\v 1 ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూం కి వచ్చాడు.
\s5
\v 2 అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు.
\v 3 ఈ శతాధిపతి యేసును గురించి విని, ఆయన వచ్చి తన దాసుణ్ణి బాగు చేయాలని ఆయన్ని బతిమాలడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరకు పంపించాడు.
\v 4 వారు యేసు దగ్గరకు వచ్చి "నువ్వు తప్పక ఈ మేలు చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు.
\v 5 అతడు మన ప్రజల్ని ప్రేమించాడు. మన సమాజ మందిరాన్ని ఇతనే మన కోసం కట్టించాడు" అని ఆయన్ని ఎంతో బతిమాలారు.
\s5
\v 6 కాబట్టి యేసు వారితో వెళ్ళాడు. ఆయన అతని ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు, ఆ శతాధిపతి తన స్నేహితుల్ని కొందరిని పంపి వారితో యేసుకు ఇలా చెప్పించాడు "ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోవద్దు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు.
\v 7 అలాగే నీ దగ్గరకు వచ్చే యోగ్యత కూడా నాకు లేదు. నువ్వు మాట మాత్రం చెప్పు. నా దాసుడికి పూర్తిగా నయమవుతుంది.
\v 8 నేను కూడా అధికారం కింద ఉన్న వాణ్ణే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకణ్ణి 'వెళ్ళు' అంటే వెళ్తాడు, ఒకణ్ణి 'రా' అంటే వస్తాడు. నా దాసుణ్ణి ఫలానా పని చేయమంటే చేస్తాడు."
\s5
\v 9 యేసు ఈ మాటలు విని, ఆ వ్యక్తి విషయం ఆశ్చర్య పోయాడు. తన వెనకాలే వస్తున్న జనసమూహం వైపు తిరిగి "ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\v 10 అతను పంపిన వారు తిరిగి వచ్చి ఆ పనివాడు జబ్బు నయమై పూర్తి ఆరోగ్యంతో ఉండటం చూశారు.
\s విధవరాలి కొడుక్కి ప్రాణం పోయడం
\s5
\p
\v 11 ఇది జరిగిన తర్వాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు.
\v 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి బయటకు మోసుకుని వెళ్తూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె విధవరాలు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.
\v 13 ప్రభువు ఆమెను చూచి ఆమెపై జాలిపడి "ఏడవ వద్దు" అని ఆమెకు చెప్పి, దగ్గరకు వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దానిని మోసేవారు నిలబడి పోయారు.
\v 14 ఆయన "అబ్బాయ్, నేను చెప్తున్నాను, లే!" అన్నాడు.
\v 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
\s5
\v 16 అందరూ భయంతో నిండిపోయి "మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలకు దర్శనాన్ని అనుగ్రహించాడు" అంటూ దేవుణ్ణి కీర్తించారు.
\v 17 ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది.
\s5
\v 18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియచేశారు.
\s బాప్తిసమిచ్చే యోహాను సందేహం (మత్తయి 11:2-6)
\p
\v 19 అప్పుడు యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి "రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేం ఎదురు చూడాలా?" అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరకు పంపించాడు.
\v 20 వారు ఆయన దగ్గరకు వచ్చి "రావలసిన వాడివి నువ్వేనా ? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా? అని అడగమని మమ్మల్ని బాప్తిస్మమిచ్చే యోహాను నీ దగ్గరకు పంపాడు" అని చెప్పారు.
\s5
\v 21 అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారినీ బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
\v 22 అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు "వెళ్లి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టు రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది.
\v 23 నా విషయంలో అభ్యంతరాలేమీ లేనివాడు ధన్యుడు"
\s బాప్తిసమిచ్చే యోహాను గురించి యేసు సాక్ష్యం (మత్తయి 11:7-15)
\s5
\p
\v 24 యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు "మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?
\v 25 అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వాళ్ళు రాజ మందిరాల్లో ఉంటారు.
\v 26 అదీ కాక పోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెప్తున్నాను.
\s5
\v 27 "చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధ పరుస్తాడు" అని ఎవర్ని గురించి రాసారో అతడే యీ యోహాను.
\v 28 స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటె గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటె గొప్పవాడని మీతో చెప్తున్నాను."
\s5
\v 29 ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిస్మం పొందారు.
\v 30 కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిస్మం పొందకుండా వాళ్ళ జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.
\s5
\v 31 కాబట్టి యీ తరం మనుష్యులను నేను దేనితో పోల్చాలి? వీళ్ళు దేనిలాగా ఉన్నారు?
\v 32 సంతవీధుల్లో కూర్చుని "మేం వేణువు ఊదాం, మీరు నాట్యం చేయలేదు, ఏడుపు పాట పాడాం, మీరేమో ఏడవలేదు" అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు.
\s5
\v 33 బాప్తిస్మ మిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని వీడికి దయ్యం పట్టిందని మీరు అంటున్నారు.
\v 34 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని వీడు తిండిబోతూ, తాగుబోతూ, సుంకరులకీ పాపులకీ స్నేహితుడూ అంటున్నారు.
\v 35 అయితే జ్ఞానం దాని పిల్లల్ని బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది."
\s పరిసయ్యుని ఇంట్లో యేసు
\s5
\p
\v 36 పరిసయ్యులలో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్లి భోజనానికి కూర్చున్నాడు.
\v 37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి
\v 38 ఆయనకు వెనుకగా ఆయన పాదాలకు దగ్గరగా ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
\s5
\v 39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి "ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలుగుతాడు. ఈమె పాపాత్మురాలు" అని తనలో తాను అనుకున్నాడు.
\v 40 దానికి యేసు "సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి" అని అతనితో అన్నాడు. అతడు "ఉపదేశకా, చెప్పు" అన్నాడు.
\s అప్పు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు
\s5
\p
\v 41 అప్పుడు యేసు "అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు.
\v 42 ఆ అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళిద్దరినీ క్షమించేసాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?" అని అడిగాడు.
\v 43 అందుకు సీమోను "అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అన్పిస్తుంది" అన్నాడు. దానికి యేసు "సరిగ్గా ఆలోచించావు" అని అతనితో చెప్పి
\s5
\v 44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, "ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది.
\v 45 నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాల్ని ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
\s5
\v 46 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది.
\v 47 దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే అనేక పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచేమే ప్రేమిస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 48 తర్వాత ఆమెతో "నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\v 49 అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు "పాపాలు క్షమించడానికి ఇతనెవరు?" అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు.
\v 50 దానికి ఆయన "నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు" అని ఆమెతో చెప్పాడు.
\s5
\c 8
\s గలిలయ లో ఉపదేశాలు, స్వస్థతలు
\p
\v 1 ఆ తర్వాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు.
\v 2 పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, హేరోదు గృహనిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఆయనతో కూడా ఉన్నారు.
\v 3 వీరూ ఇంకా అనేకులు తమ ఆస్తిలో నుండి ఆయనకు సహాయం చేసేవారు.
\s విత్తనాలు చల్లే రైతు ఉపమానం (మత్తయి 13:1-23; మార్కు 4:1-20)
\s5
\p
\v 4 ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
\v 5 "విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగి వేశాయి
\v 6 మరి కొన్ని రాతినేలమీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండి పోయాయి.
\s5
\v 7 మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి.
\v 8 మరికొన్ని మంచినేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి." ఆయన ఇలా చెప్పి "వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక" అని బిగ్గరగా అన్నాడు.
\s5
\v 9 ఆయన శిష్యులు "ఈ ఉపమానం అర్ధం ఏమిటి?" అని అడిగారు
\v 10 ఆయన "దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులకైతే చూస్తూ ఉన్నా చూడకుండా, వింటూ ఉన్నా అర్ధం కాకుండా ఉండటానికి వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.
\s5
\v 11 ఈ ఉపమానానికి అర్ధం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.
\v 12 దారి పక్కనే ఉండేవారు, వీరు వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని తీసివేస్తాడు.
\v 13 రాతినేలపై ఉండే వారు, వీరు వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తర్వాత విషమ పరీక్షల కాలంలో తొలగి పోతారు.
\s5
\v 14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలను పోలిన వారు, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.
\v 15 మంచి నేలపై పడే విత్తనం ఎవరంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని నిలుపుకుని ఓపికతో ఫలించేవారు.
\s వెలిగించిన దీపం ఉపమానం (మత్తయి 5:15-16; మార్కు 4:21-23; లూకా 11:33)
\s5
\p
\v 16 ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు. మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చేవారికి వెలుగు కనిపించేలా దీపస్తంభం పై ఉంచుతాడు.
\v 17 తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, మరుగుగా ఉండిపోయేది ఏదీ లేదు.
\v 18 కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి" అన్నాడు.
\s కొత్త అనుబంధాలు (మత్తయి 12:46-50; మార్కు 3:31-35)
\s5
\p
\v 19 ఆయన తల్లీ, సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండటం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు.
\v 20 అప్పుడు "నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ తమ్ముళ్ళూ వచ్చి బయట నిల్చున్నారు" అని ఎవరో ఆయనతో అన్నారు.
\v 21 అందుకు ఆయన "దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వీరే నా తల్లీ నా తమ్ముళ్ళూ" అన్నాడు.
\s యేసు పెనుగాలిని, అలలను అదుపుచేయడం (మత్తయి 8:23-27; మార్కు 4:36-41)
\s5
\p
\v 22 మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి "సరస్సు అవతలి వైపుకు వెళ్దాం" అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు.
\v 23 వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్ర పోయాడు. ఈలోగా సరస్సు మీదికి గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.
\s5
\v 24 కాబట్టి వారు ఆయన దగ్గరకు వచ్చి, "ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం" అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.
\v 25 అప్పుడు ఆయన "మీ విశ్వాసం ఎక్కడ?" అన్నాడు. వారు భయపడి పోయారు, "ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో" అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
\s గదర ప్రదేశం లో దయ్యం పట్టిన వాణ్ణి బాగు చేయడం (మత్తయి 8:28-34; మార్కు 5:1-17)
\s5
\p
\v 26 వారు గలిలీకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు.
\v 27 ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయన్ని ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాల కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు.
\s5
\v 28 వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసాడు. "సర్వోన్నతుడైన దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను" అంటూ కేకలు పెట్టాడు.
\v 29 ఎందుకంటే ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి అడవిలోకి తీసుకుపోయేవి.
\s5
\v 30 యేసు "నీ పేరు ఏమిటి?" అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి.
\v 31 కాబట్టి వాడు "నా పేరు సైన్యం" అన్నాడు. పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వ వద్దని వాడు ఆయనను ఎంతో బతిమాలాడు.
\s5
\v 32 అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతి నిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు.
\v 33 అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్లి పందులలో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి.
\s5
\v 34 ఆ పందుల్ని మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.
\v 35 ఆ ఊరి ప్రజలు అదంతా చూడటానికి వెళ్లారు. వారంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడ్డారు.
\s5
\v 36 జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు.
\v 37 గెరాసేను ప్రాంతాల్లో ఉన్న వారంతా ఎంతో భయపడ్డారు. మమ్మల్ని విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.
\s5
\v 38 ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు.
\v 39 కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అని వాణ్ణి పంపి వేశాడు. వాడు వెళ్లి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.
\s రుతుస్రావం ఉన్న స్త్రీ స్వస్థత, యాయీరు కూతురుకి ప్రాణదానం(మత్తయి 9:18-26; మార్కు 5:22-43)
\s5
\p
\v 40 ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు.
\v 41 అప్పుడు సమాజ మందిరపు అధికారి యాయీరు అనే వ్యక్తి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు.
\v 42 సుమారు పన్నెండేళ్ళ వయసున్న తన ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే క్రిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు.
\s5
\v 43 అప్పుడు పన్నెండేళ్ళ నుండి రుతుస్రావంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆయనకి వెనగ్గా వచ్చి
\v 44 ఆయన పైబట్ట అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
\s5
\v 45 వెంటనే యేసు "నన్ను తాకిందెవరు?" అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు "మాకు తెలియదే" అన్నారు. అప్పుడు పేతురు, "ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ మీద పడుతున్నారు" అన్నాడు.
\v 46 యేసు "ఎవరో నన్ను తాకారు. నాలోనుండి ప్రభావం బయటకు వెళ్లిందని నాకు తెలిసింది" అన్నాడు.
\s5
\v 47 ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్ధమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలకి వివరించి చెప్పింది.
\v 48 అందుకు ఆయన "కుమారీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు" అన్నాడు.
\s5
\v 49 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటినుండి ఒక వ్యక్తి వచ్చి "మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక శ్రమ పెట్టవద్దు." అని చెప్పాడు.
\v 50 యేసు ఆ మాట విని "భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది" అని చెప్పాడు.
\s5
\v 51 అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తలిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు.
\v 52 అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో "ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు" అన్నాడు.
\v 53 ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు.
\s5
\v 54 అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని "అమ్మాయ్, లే" అని చెప్పగానే
\v 55 ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన "ఆమెకు భోజనం పెట్టండి" అని ఆదేశించాడు.
\v 56 ఆమె తలిదండ్రులు ఆనందాశ్చర్యాలలో మునిగి పోయారు. అప్పుడు ఆయన "జరిగింది ఎవరికీ చెప్పవద్దు" అని వారికి ఆజ్ఞాపించాడు.
\s5
\c 9
\s యేసు పన్నెండు మందిని ప్రకటించడానికి పంపించడం (మత్తయి 10:1-42; మార్కు 6:7-13)
\p
\v 1 ఆయన తన పన్నెండుగురు శిష్యుల్ని పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ, అధికారాన్నీ రోగాలు నయం చేసే వరాన్నీ ఇచ్చాడు.
\v 2 దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగుల్ని బాగు చేయడానికీ వారిని పంపాడు.
\s5
\v 3 అప్పుడు ఆయన "మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు.
\v 4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలు దేరండి.
\s5
\v 5 మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలోనుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండటానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి" అన్నాడు.
\v 6 వాళ్ళు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాలలో పర్యటించారు.
\s5
\v 7 జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన్ను గురించి కొందరు 'యోహాను చనిపోయి లేచాడనీ,'
\v 8 మరి కొందరు 'ఏలియా కనిపించాడనీ,' ఇంకొంతమంది 'పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడనీ' చెప్పుకుంటూ ఉన్నారు.
\v 9 అప్పుడు హేరోదు 'నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో' అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు.
\s అపోస్తలుల అనుభవాలు, ఐదు వందల మంది ఆకలి తీర్చడం (మత్తయి 14:13-21; మార్కు 6:30-44; యోహాను 6:1-14)
\s5
\p
\v 10 అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు.
\v 11 జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.
\s5
\v 12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, " మనం అడవిలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్లి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి" అన్నారు.
\v 13 ఆయన "మీరే వీళ్ళకి భోజనం పెట్టండి" అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర అయిదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే" అన్నారు.
\v 14 అక్కడ సుమారు పురుషులే అయిదు వేలమంది ఉన్నారు. ఆయన "వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు.
\s5
\v 15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు.
\v 16 అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకొని, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు.
\v 17 వారంతా తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.
\s క్రీస్తును గురించి పేతురు ఒప్పుకోలు (మత్తయి 16:13-20; మార్కు 8:27-30)
\s5
\p
\v 18 ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకొంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. "నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని ఆయన వారిని అడిగాడు.
\v 19 వారు "బాప్తిస్మమిచ్చే యోహాననీ, కొందరు ఏలీయా అనీ, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు" అని ఆయనకు జవాబిచ్చారు.
\s5
\v 20 అప్పుడు ఆయన "మరి మీరు నేను ఎవరని భావిస్తున్నారు?" అని వారిని అడిగాడు. అందుకు పేతురు "నువ్వు దేవుని అభిషిక్తుడివి" అన్నాడు.
\v 21 ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు.
\s యేసు తన మరణ, ఉత్థానాలను ముందుగా చెప్పడం(మత్తయి 16-21: మార్కు 8:31)
\p
\v 22 "మనుష్యకుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. అయన మూడో రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది." అని చెప్పాడు.
\s శిష్యత్వం(మత్తయి 16:22-28; మార్కు 8:32,38)
\s5
\p
\v 23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,
\v 24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడు దానిని కాపాడుకుంటాడు.
\v 25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుంటే వాడికేం లాభం?
\s5
\v 26 నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.
\v 27 ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను" అన్నాడు.
\s రూపాంతరం (మత్తయి 17:1-8; మార్కు 9:2-8)
\s5
\p
\v 28 ఈ మాటలు పలికిన తర్వాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురూ యోహానూ యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు.
\v 29 ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగ ధగ మెరిసాయి.
\s5
\v 30 ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే, ఏలియాలు.
\v 31 వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు.
\s5
\v 32 పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారు మేలుకున్నప్పుడు ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు.
\v 33 ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గరనుండి వెళ్ళిపోతుండగా పేతురు " ప్రభూ, మనం ఇక్కడ ఉండటం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలియాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేం కడతాం" అంటూ తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు.
\s5
\v 34 అతడీవిధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు ఎంతో భయపడ్డారు.
\v 35 తర్వాత "ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి" అని ఒక శబ్దం ఆ మేఘంలోంచి వచ్చింది.
\v 36 ఆ శబ్దం వచ్చిన తర్వాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. వీరు ఆ రోజుల్లో తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.
\s దయ్యం వదిలించే శక్తి లేని శిష్యులు (మత్తయి 17:14-21; మార్కు 9:14-29)
\s5
\p
\v 37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.
\v 38 ఆ జనసమూహములో ఒకడు "బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నా కొక్కడే కుమారుడు.
\v 39 చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయం చేస్తుంది.
\v 40 దానిని వెళ్లగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ వారి వాళ్ళ వల్ల కాలేదు" అని దీనంగా చెప్పాడు.
\s5
\v 41 దానికి యేసు "విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?" అని "నీ కుమారుణ్ణి ఇక్కడకు తీసుకుని రా" అని ఆ తండ్రితో చెప్పాడు.
\v 42 వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కిందకు పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు.
\s5
\v 43 అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
\s యేసు మరోసారి తన మరణం గురించి చెప్పాడు (మత్తయి 17:22,23; మార్కు 9:30-32)
\p
\v 44 ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్య పోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతులకు పట్టించబోతూ ఉన్నారు"
\v 45 అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యం గానే ఉండిపోయింది. కాబట్టి వారు దానిని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు.
\s పిల్లల గురించి ఉపదేశం (మత్తయి 18:1-5; మార్కు 9:33-37)
\s5
\p
\v 46 తమలో ఎవడు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.
\v 47 యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని
\v 48 ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.
\s ముఠాతత్త్వం తగదు (మార్కు 9:38-40)
\s5
\p
\v 49 అప్పుడు యోహాను "ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనల్ని అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం" అని యేసుతో చెప్పాడు.
\v 50 అందుకు యేసు "మీరు వాణ్ణి అడ్డుకోవద్దు. మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే"అని చెప్పాడు.
\s గలిలయ నుండి నిష్క్రమణం (యోహాను 7:2-10)
\s5
\p
\v 51 యేసును పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది.
\v 52 ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనస్సులో నిశ్చయం చేసుకున్నాడు. తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్లి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ వారి గ్రామంలో ప్రవేశించారు.
\v 53 ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు.
\s5
\v 54 శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి "ప్రభూ, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేం వీరిని శపించడం నీకిష్టమేనా?" అని అడిగారు.
\v 55 ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు.
\v 56 అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్లారు.
\s శిష్యత్వానికి పరీక్ష (మత్తయి 8:18,22)
\s5
\p
\v 57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి "నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను" అని ఆయనకు చెప్పాడు.
\v 58 అందుకు యేసు "నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు" అని అతనికి చెప్పాడు.
\s5
\v 59 ఆయన మరో వ్యక్తిని చూసి "నా వెంట రా" అన్నాడు. ఆ వ్యక్తి "ముందు నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి" అన్నాడు.
\v 60 అందుకాయన "చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 61 మరొకడు "ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి" అన్నాడు.
\v 62 దానికి యేసు "నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కిచూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు" అని వాడితో చెప్పాడు.
\s5
\c 10
\s యేసు తనకు ముందుగా డెబ్భై మందిని పంపడం (మత్తయి 10: 1-42)
\p
\v 1 ఆ తర్వాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.
\v 2 వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు. "కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానుణ్ణి వేడుకోండి.
\s5
\v 3 మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను.
\v 4 మీరు డబ్బులు గానీ సంచిని గానీ చెప్పులు గానీ తీసుకు వెళ్ళవద్దు. దారిలో ఎవర్నీ పలకరించవద్దు.
\s5
\v 5 మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా 'ఈ ఇంటికి శాంతి కలుగు గాక,' అని చెప్పండి.
\v 6 శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది.
\v 7 వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికీ తిరగవద్దు.
\s5
\v 8 మీరు ఏదైనా ఊర్లో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ముందు పెట్టినవి తినండి.
\v 9 ఆ ఊర్లో ఉన్న రోగుల్ని బాగు చేయండి. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని వారికి ప్రకటించండి.
\s5
\v 10 ఒకవేళ ఏ ఊళ్ళో నైనా మిమ్మల్ని వారు స్వీకరించక పోతే
\v 11 మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి 'మా కాళ్ళకు అంటిన మీ పట్టణపు దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని తెలుసుకోండి' అని చెప్పండి.
\v 12 తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెప్తున్నాను.
\s యూదయ పట్టణాలపై తీర్పు (మత్తయి 11:20-24)
\s5
\p
\v 13 అయ్యో కొరాజీనా, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదె లో కూర్చుని మనస్సు మార్చకుని ఉండేవారు.
\v 14 అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినది గా ఉంటుంది.
\v 15 కపెర్నహూమూ, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు.
\s5
\v 16 మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు."
\s5
\v 17 ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి "ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెప్తే మాకు లోబడుతున్నాయి" అని చెప్పారు.
\v 18 అప్పుడు ఆయన "సాతాను మెరుపులా ఆకాశం నుండి పడటం చూశాను.
\v 19 ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హాని చేయదు.
\v 20 అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి." అని వారికి చెప్పాడు.
\s5
\v 21 ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. "తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలమైంది.
\s5
\v 22 సమస్తమూ నా తండ్రి నాకు అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి తప్ప ఇంకెవరూ ఎరుగరు. అలాగే తండ్రి ఎవరో కుమారుడూ, ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరుగరు."
\s5
\v 23 అప్పుడు ఆయన తన శిష్యులవైపు తిరిగి ఏకాంతంగా వారితో "మీరు చూస్తున్న వాటిని చూసే కన్నులు ధన్యమైనాయి.
\v 24 అనేకమంది ప్రవక్తలూ, రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేక, వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెప్తున్నాను" అని వారితో అన్నాడు.
\s మంచి సమరయుడు (మత్తయి 22: 34-40; మార్కు 12:28-34)
\s5
\p
\v 25 ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ "బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?" అని అడిగాడు.
\v 26 అందు కాయన "ధర్మశాస్త్రం లో ఏమని రాసి ఉంది? నువ్వు ఏం చదువుతున్నావు?" అని అడిగాడు.
\v 27 అతడు "నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకం తోనూ ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణీ ప్రేమించాలి" అన్నాడు.
\v 28 దానికి ఆయన "సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు" అన్నాడు.
\s5
\v 29 అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు "అది సరే గానీ నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగాడు.
\v 30 అందుకు యేసు ఇలా అన్నాడు, "ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.
\s5
\v 31 అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు.
\v 32 ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు.
\s5
\v 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి పోయిన చోటికి వచ్చి
\v 34 అతణ్ణి చూసి అతని మీద జాలి పడి దగ్గరకు వెళ్ళాడు. అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకు వెళ్ళి అతని బాగోగులు చూశాడు.
\v 35 మరుసటి రోజు అతడు రెండు వెండి నాణేలు తీసి ఆ సత్రం వాడికిచ్చి, "ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను" అని వెళ్ళి పోయాడు.
\s5
\v 36 అయితే ఇప్పుడు దొంగల చేతిలో చిక్కిన వాడికి ఈ ముగ్గురిలో పొరుగువాడు ఎవరని నువ్వనుకుంటున్నావు? ఎవడు పొరుగువాడయ్యాడని నీకు తోస్తుంది?" అని యేసు అడిగాడు. దానికి అతడు "అతనిమీద జాలి చూపిన వాడే" అన్నాడు.
\v 37 అందుకు యేసు "నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి" అని అతనితో చెప్పాడు.
\s మార్త, మరియ
\s5
\p
\v 38 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది.
\v 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది.
\s5
\v 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందర పడుతూ ఆయన దగ్గరకు వచ్చి, "ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు" అంది.
\v 41 అందుకు ప్రభువు "మార్తా, మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారంతో తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే.
\v 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు" అని ఆమెతో చెప్పాడు.
\s5
\c 11
\s ప్రార్థన నమూనా
\p
\v 1 ఆయన ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు "ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు" అని ఆయనను అడిగాడు.
\s5
\v 2 అందుకు ఆయన "మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు పలకండి, 'పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం అందరికీ పవిత్రంగా ఉంటుంది గాక, నీ రాజ్యం వస్తుంది గాక,
\s5
\v 3 మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి,
\v 4 మా దగ్గర అప్పు తీసుకున్న ప్రతీ వాణ్ణీ క్షమిస్తూ ఉన్నాం కనుక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని శోధనలోకి తీసుకు వెళ్ళకు' అని పలకండి" అని చెప్పాడు.
\s వదలకుండా అడిగిన మిత్రుడు
\s5
\p
\v 5 తర్వాత ఆయన వారితో ఇలా అన్నాడు. "మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్ళి "మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు.
\v 6 నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరకు వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు" అని చెప్పాడనుకోండి.
\v 7 అతడు లోపలే ఉండి "నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను" అని చెప్తాడా?
\v 8 అతడు తన స్నేహితుడని కాక పోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెప్తున్నాను.
\s5
\v 9 అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది.
\v 10 అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికీ దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరచుకుంటుందని మీకు చెప్తున్నాను.
\s తండ్రి నైజం
\s5
\p
\v 11 మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపను అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? గుడ్డు కావాలంటే రాయినిస్తాడా?
\v 12 కాబట్టి మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే
\v 13 పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు." అని చెప్పాడు.
\s దయ్యాల రాజు సాయంతో యేసు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని నీలాపనింద (మత్తయి 12:22-37)
\s5
\p
\v 14 ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళ గొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలి పోయిన తర్వాత మూగ వాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్య పోయారు.
\v 15 అయితే వారిలో కొందరు "వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు" అని చెప్పుకున్నారు.
\s5
\v 16 మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
\v 17 ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు. "తనకు తానే వ్యతిరేకంగా వేరై పోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలి పోతుంది.
\s5
\v 18 సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరై పోతే వాడి రాజ్యం ఎట్లా నిలుస్తుంది?
\v 19 నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళ గొడితే మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళ గొడుతున్నారు? దీనివల్ల మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు.
\v 20 అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరకు వచ్చిందనే.
\s5
\v 21 బలవంతుడు ఆయుధాలు ధరించుకొని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది.
\v 22 అయితే అతని కంటె బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుని పంచి వేస్తాడు.
\v 23 నా వైపు ఉండని వాడు నాకు విరోధి; నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.
\s తనను తను సంస్కరించుకునే ప్రయత్నం (మత్తయి 12:43,45)
\s5
\p
\v 24 అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదలిపోయిన తరువాత విశ్రాంతి కోసం వెదకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది నా పాత ఇంటికే మళ్ళీ వెళతాననుకుంటుంది.
\v 25 అది వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూసి
\v 26 తిరిగి వెళ్లి, తన కంటె చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మల్ని వెంటబెట్టుకొని వస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది"అని చెప్పాడు.
\s5
\v 27 ఆయన యీ మాటలు చెప్తూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా "నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం" అని కేకలు వేసి చెప్పింది.
\v 28 దానికి ఆయన "అది నిజమే కానీ దేవుని మాట విని దానిని అంగీకరించేవారు ఇంకా ధన్యులు" అని చెప్పాడు.
\s యోనా సూచన (మత్తయి 12:39-42)
\s5
\p
\v 29 ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు. "ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరే సూచనా వీరికి చూపడం జరగదు.
\v 30 యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడూ ఈ తరానికి సూచనగా ఉంటాడు.
\s5
\v 31 దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలోమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సోలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
\s5
\v 32 నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.
\s వెలిగించిన దీపం ఉపమానం (మత్తయి 5:15, 16; మార్కు 4:21,22; లూకా 8:16)
\s5
\p
\v 33 ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీప స్తంభం పైనే పెడతారు.
\v 34 నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది.
\v 35 కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో.
\v 36 నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్లయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది."
\s5
\v 37 ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయన్ని ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజన వరుసలో కూర్చున్నాడు.
\v 38 ఆయన భోజనానికి ముందు కాళ్ళుచేతులు కడుక్కోలేదని ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.
\s యేసు పరిసయ్యులను తీవ్రంగా విమర్శించడం (మత్తయి 23:13-35)
\s5
\p
\v 39 అది చూసి ప్రభువిలా అన్నాడు, "పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతోనూ చెడుతనంతోనూ నిండి ఉంది.
\v 40 అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా!
\v 41 మీకు ఉన్నవాటిని దాన ధర్మాలు చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి.
\s5
\v 42 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదలి వేస్తున్నారు. మీరు న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మిగిలిన వాటిని కూడా జరిగించాలి.
\s5
\v 43 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన, మీరు సమాజ మందిరాలలో అగ్ర స్థానాలూ సంత వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు.
\v 44 అయ్యో, మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు."
\s యేసు ధర్మశాస్త్రులను తీవ్రంగా విమర్శించడం
\s5
\p
\v 45 అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు "బోధకుడా. ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు" అని ఆయనతో అన్నాడు.
\v 46 అందుకు యేసు "ఆయన అయ్యో, ధర్మ శాస్త్ర ఉపదేశకులారా, మీరు మనుషులపై వారు మోయలేని బరువులు మోపుతారు. మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు.
\s5
\v 47 అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు.
\v 48 దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు. వారు ప్రవక్తలను చంపారు. మీరు సమాధులు కడుతున్నారు.
\s5
\v 49 ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే "నేను వారి దగ్గరకు ప్రవక్తలనూ, అపోస్తలులనూ పంపుతాను.
\v 50 వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు."
\v 51 కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబేలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారికి విచారణ జరుగుతుంది. ఆ రక్తం కోసం ఈ తరం వారు విచారణకు నిలబడతారని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
\s5
\v 52 అయ్యో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానానికి తాళం చెవిని తీసుకు పోయారు. మీరు లోపల ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డుకుంటారు" అని చెప్పాడు.
\s5
\v 53 ఆయన అక్కడ నుండి వెళ్లి పోయిన తర్వాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన నోటి నుండి వచ్చే ఏ మాటనైనా పట్టుకోడానికి సిద్ధమై
\v 54 చాలా విషయాలను గురించి ఆయనతో మాట్లాడించాలని చూడటం మొదలు పెట్టారు.
\s5
\c 12
\s పరిసయ్యుల పొంగజేసే పదార్థం గురించి హెచ్చరిక (మార్కు 8:14-21)
\p
\v 1 అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు. "పరిసయ్యుల కపటం అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి.
\s5
\v 2 కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు.
\v 3 అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.
\s5
\v 4 నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు.
\v 5 ఎవరికి మీరు భయపడాలో మీకు చెప్తాను. చంపిన తర్వాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెప్తున్నాను.
\s5
\v 6 అయిదు పిచ్చుకల్ని రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.
\v 7 మీ తలవెంట్రుకలన్నిటి లెక్కా ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారే కదా.
\s5
\v 8 ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు.
\v 9 మనుష్యుల ముందు నేను ఎవరో తెలియదు అనే వాణ్ణి గురించి నేను కూడా దేవుని దూతల ముందు నాకు తెలియదు అని చెప్తాను.
\v 10 మనుష్యకుమారుడికి వ్యతిరేకంగా ఏదన్నా మాట అనే వాడికి పాపక్షమాపణ కలుగుతుంది గానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి క్షమాపణ లేదు.
\s5
\v 11 వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు.
\v 12 మీరు ఏం చెప్పాలో ఆ సమయం లోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు."
\s5
\v 13 ఆ జనసమూహంలో ఒకడు "ఉపదేశకా, వారసత్వంగా నాకు వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి" అన్నాడు.
\v 14 అందుకు ఆయన "ఏమయ్యా, మీ మీద తీర్పరిగానో లేక మధ్యవర్తి గానో నన్ను ఎవరు నియమించారు?" అన్నాడు.
\v 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, "మీరు అత్యాశకు చోటివ్వకండి. ఒకరి జీవానికి మూలం అతని కలిమి కాదు."
\s తెలివిలేని ధనికుని ఉపమానం
\s5
\p
\v 16 తర్వాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు, "ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది.
\v 17 అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. " నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను.
\v 18 నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను.
\v 19 అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు.
\s5
\v 20 అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు.
\v 21 దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు" అన్నాడు.
\s5
\v 22 తర్వాత ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు.
\v 23 ఆహారం కంటె ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా?
\s5
\v 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటె ఎంతో ఉన్నతమైన వారు.
\v 25 పైగా మీలో ఎవడు చింత పడటం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ పొడిగించుకోగలడు?
\v 26 కాబట్టి అన్నిటి కంటే చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి.
\s5
\v 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలోమోను కున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెప్తున్నాను.
\v 28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా.
\s5
\v 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని మధన పడకండి. ఏ అనుమానమూ పెట్టుకోకండి.
\v 30 ఈ లోకులు వీటిని వెదకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు.
\s5
\v 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితో పాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.
\v 32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం.
\s5
\v 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతబడని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.
\v 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.
\s రెండవ రాకకు సంబంధించిన ఉపమానాలు, హెచ్చరికలు (మత్తయి 24:37 25:30)
\s5
\p
\v 35 మీ నడుములు కట్టుకొని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి.
\v 36 యజమాని పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే అతనికి తలుపు తీయడం కోసం అతడు ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూసే సేవకుల్లా ఉండండి.
\s5
\v 37 యజమాని వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండటం చూస్తాడో ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతడు తన నడుం బిగించి వారిని భోజనానికి కూర్చోబెడతాడు. వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
\v 38 అతడు రాత్రి రెండో జాములో వచ్చినా, మూడో జాములో వచ్చినా ఏ దాసులు మెలకువగా ఉండటం చూస్తాడో ఆ దాసులు ధన్యులు.
\s5
\v 39 దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి.
\v 40 మీరు ఊహించని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి" అని వారికి చెప్పాడు.
\s5
\v 41 అప్పుడు పేతురు "ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెప్తున్నావా లేక అందరి కోసం చెప్తున్నావా?" అని ఆయనను అడిగాడు.
\s గృహనిర్వహకుడు, సేవకులు
\p
\v 42 దానికి ప్రభువు ఇలా అన్నాడు, "సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి కోసం నియమించే నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
\v 43 యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు.
\v 44 అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతడిని ఉంచుతాడని మీకు చెప్తున్నాను.
\s5
\v 45 అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని తన మనస్సులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండటం చేస్తే
\v 46 వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు.
\s5
\v 47 తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధ పడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే దాసుడికి చాలా దెబ్బలు తగులుతాయి.
\v 48 దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.
\s క్రీస్తు విభేదాలు కలిగించేవాడు
\s5
\p
\v 49 నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను.
\v 50 అయితే నేను పొందాల్సిన బాప్తిస్మం ఉంది. అది జరిగే వరకూ నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను.
\s5
\v 51 నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. నేను చీలికలు కలగజేయడానికి వచ్చానని మీకు చెప్తున్నాను.
\v 52 ఇకనుండి ఒక ఇంటిలో ఉండే అయిదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ, ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు.
\v 53 తండ్రి కొడుక్కీ, కొడుకు తండ్రికీ, తల్లి కూతురుకీ, కూతురు తల్లికీ, అత్త కోడలికీ, కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు" అని చెప్పాడు.
\s5
\v 54 తర్వాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, " మీరు పడమట నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది.
\v 55 దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెప్తారు. అలాగే జరుగుతుంది.
\v 56 కపట భక్తులారా, మీరు భూమీ ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు. కానీ ఈ కాలాన్ని గుర్తించడం తెలుసుకోలేక పోతున్నారు.
\s5
\v 57 ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు?
\v 58 మీ ప్రత్యర్థితో కలసి న్యాయాధికారి దగ్గరకు వెళ్తున్నప్పుడు దార్లోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి. లేకుంటే అతడు ఒక వేళ నిన్ను న్యాయాధిపతి దగ్గరకు లాక్కుపోతాడు. ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. ఆ భటుడు నిన్ను చెరసాలలో వేస్తాడు.
\v 59 నువ్వు చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెప్తున్నాను." అన్నాడు.
\s5
\c 13
\s మనుషులు ఇతరులను వేలెత్తి చూపకూడదు
\p
\v 1 కొందరు గలిలయులు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికుల్ని పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు.
\v 2 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, "ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయులందరి కంటే పాపులని మీరు అనుకుంటున్నారా?
\v 3 కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనస్సు పొందక పోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
\s5
\v 4 అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిదిమంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?
\v 5 కానే కాదని మీతో చెప్తున్నా. మీరు మారుమనస్సు పొందక పోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
\s పండ్లు లేని అంజూరు చెట్టు (యెషయా 5:1-7; మత్తయి 21:18-20)
\s5
\p
\v 6 తర్వాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, "ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరం చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కన్పించలేదు.
\v 7 దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో "మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను కానీ నాకేమీ దొరకడం లేదు, దీనినిక నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి" అన్నాడు.
\s5
\v 8 అయితే ఆ తోటమాలి "అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీనిని ఉండనియ్యి,
\v 9 అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి" అన్నాడు."
\s ఒక స్త్రీకి స్వస్థత
\s5
\p
\v 10 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజమందిరంలో బోధిస్తున్నాడు.
\v 11 బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది.
\s5
\v 12 యేసు ఆమెను చూచి, తన దగ్గరకు రమ్మని పిలిచి "అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు" అని ఆమెతో చెప్పి
\v 13 ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరచింది.
\v 14 యేసు విశ్రాంతి దినం రోజున స్వస్థపరచాడని ఆ సమాజ మందిరపు అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి "పని చేయదగిన ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు" అని చెప్పాడు.
\s5
\v 15 అందుకు ప్రభువు అతనికిలా జవాబిచ్చాడు, "కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గర్నుంచి విప్పి, తోలుకుపోయి, నీళ్లు పెడతాడు కదా.
\v 16 ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?" అని అతనితో చెప్పాడు.
\s5
\v 17 ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
\s ఆవగింజ ఉపమానం (మత్తయి 13: 31,32; మార్కు 4:30-32)
\s5
\p
\v 18 ఆయన ఇలా అన్నాడు, "దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దానిని దేనితో పోల్చగలం?
\v 19 అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మల పైన నివసించాయి," అన్నాడు.
\s పొంగ జేసే పదార్థం ఉపమానం (మత్తయి 13:33)
\s5
\p
\v 20 మళ్ళీ ఆయన "దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం?
\v 21 ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిని పోలి ఉంది" అన్నాడు.
\s యెరూషలేము మార్గంలో బోధనలు
\s5
\p
\v 22 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు.
\v 23 ఒకడు "ప్రభూ, దేవుడు కొద్ది మందినే రక్షిస్తాడా?" అని ఆయనని అడిగాడు.
\v 24 దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, "ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి శ్రమ పడండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు కాని వారివల్ల కాదని చెప్తున్నాను.
\s5
\v 25 ఇంటి యజమాని తలుపు వేసుకున్న తర్వాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ "అయ్యా, మాకు దయచేసి తలుపు తీయండి" అని ప్రార్థిస్తే
\v 26 ఆయన "మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు" అని మీతో అంటాడు. అప్పుడు మీరు "నీ ముందే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేసావు కదా" అంటారు.
\v 27 అప్పుడు ఆయన "మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేస్తారు. నా దగ్గర్నుంచి తొలగి పొండి" అంటాడు.
\s5
\v 28 అబ్రాహాము ఇస్సాకు యాకోబు, సకల ప్రవక్తలూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం, అది చూస్తూ మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు.
\v 29 ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు.
\v 30 ఇదిగో వినండి, చివరి వారిలో కొందరు మొదటి వారవుతారు, అలాగే మొదటివారిలో కొందరు చివరి వారవుతారు."
\s5
\v 31 అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి "నువ్వు ఇక్కడనుండి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు," అని ఆయనతో చెప్పారు.
\v 32 ఆయన వారిని చూసి, "మీరు వెళ్లి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుతాను.
\v 33 అయితే ఈ రోజూ రేపూ ఆ తర్వాత కూడా నేను యెరుషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరుషలేం వెలుపల ప్రవక్త హతం కావడం కుదరదు!
\s యెరూషలేము కోసం యేసు విలాపం (మత్తయి 23:37-39; లూకా 19:41-44)
\s5
\p
\v 34 యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరకు పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లల్ని చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.
\v 35 ఇదిగో విను! నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను. "ప్రభువు పేరట వచ్చే వాడు ధన్యుడు" అని నువ్వు చెప్పేంత వరకు నన్ను మళ్ళీ చూడవని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను," అన్నాడు.
\s5
\c 14
\s విశ్రాంతి దినాన యేసు స్వస్థపరిచాడు
\p
\v 1 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు.
\v 2 అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు.
\v 3 అప్పుడు యేసు "విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా? " అని ధర్మశాస్త్రాన్ని బోధించే వారినీ పరిసయ్యులనూ అడిగాడు.
\s5
\v 4 వారు మౌనం వహించారు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరకు తీసుకుని అతడి రోగాన్ని బాగు చేసి పంపించేశాడు.
\v 5 "మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దానిని బయటకు తీయకుండా ఉంటారా?" అని వారిని అడిగాడు.
\v 6 ఈ ప్రశ్నకు వారు జవాబివ్వలేకపోయారు.
\s తన గురించి ఎక్కువగా ఊహించుకునే అతిథి
\s5
\p
\v 7 ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు,
\v 8 "నిన్ను ఎవరైనా పెళ్లి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటె గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు.
\v 9 మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి 'ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు' అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు.
\s5
\v 10 కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో 'మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.' అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది.
\v 11 తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది."
\s5
\v 12 తర్వాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, "నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరులనైనా నీ బంధువులనైనా ధనవంతులనైనా నీ పొరుగువారినైనా పిలవకు. ఎందుకంటే నువ్వు వాళ్ళను పిలిచావు కాబట్టి వాళ్ళు నిన్ను తిరిగి పిలవ వచ్చు. కాబట్టి నీకు వారి ద్వారా ఉపకారం కలుగుతుంది.
\s5
\v 13 అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ పిలువు.
\v 14 నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారికేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది," అని చెప్పాడు.
\s5
\v 15 ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని "దేవునిరాజ్యం లో భోజనం చేసేవాడు ధన్యుడు" అని ఆయనతో చెప్పాడు.
\s గొప్ప విందు ఉపమానం (మత్తయి 22:1-14)
\p
\v 16 అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు, "ఒక మనిషి గొప్ప విందు చేయించి అనేక మందిని పిలిచాడు.
\v 17 విందుకు వేళయినప్పుడు అతడు 'ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, రండి' అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన దాసుణ్ణి పంపాడు.
\s5
\v 18 అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటి వాడు 'నేనొక పొలం కొన్నాను. వెంటనే వెళ్లి దానిని చూసుకోవాలి. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను' అన్నాడు.
\v 19 మరొకడు 'నేను అయిదు జతల ఎద్దుల్ని కొన్నాను. ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను' అన్నాడు.
\v 20 మరొకడు 'నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి రాలేను' అన్నాడు.
\s5
\v 21 అప్పుడాపనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు. దాంతో ఆ యజమాని కోపపడి ఆ దాసుడితో 'నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకీ, సందుల్లోకీ వెళ్లి అక్కడ ఉన్న పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ కుంటివారినీ తీసుకుని రా' అన్నాడు.
\v 22 తర్వాత ఆ పనివాడు వచ్చి 'ప్రభూ, నువ్వు చెప్పినట్లే చేసాను. కానీ ఇంకా చోటు ఉంది' అన్నాడు.
\s5
\v 23 అప్పుడు ఆ యజమాని తన దాసునితో ఇలా అన్నాడు, 'నా ఇల్లు నిండిపోవాలి. కనుక నువ్వు రాజ మార్గం లో ఉన్నవారినీ, కంచెలు వేసుకుని నివసిస్తున్న వారినీ బలవంతంగా తీసుకునిరా.'
\v 24 నేను నీకు చెప్తున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు."
\s శిష్యరికానికి పరీక్ష (మత్తయి 10:37-39)
\s5
\p
\v 25 గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు,
\v 26 "నా దగ్గరకు వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లల్నీ అన్నదమ్ముల్నీ అక్కచెల్లెళ్ళనీ చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.
\v 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
\s గోపురం
\s5
\p
\v 28 మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దానిని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా?
\v 29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తర్వాత గోపురం పూర్తి చేయలేకపోతే
\v 30 చూస్తున్న వాళ్ళంతా 'ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు' అంటూ వేళాకోళం చేస్తారు.
\s యుద్ధం
\s5
\p
\v 31 అలాగే ఒక రాజు మరో రాజు పై యుద్ధానికి బయల్దేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదకు వస్తున్న వాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా?
\v 32 తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే శాంతి రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా!
\v 33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.
\s ఉప్పదనం పోయిన ఉప్పు (మత్తయి 5:13; మార్కు 9:50)
\s5
\p
\v 34 ఉప్పు మంచిదే. అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది?
\v 35 అది భూమికి గానీ, ఎరువులా వాడడానికి గానీ పనికిరాదు. కాబట్టి దానిని బయట పారవేస్తారు. వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక."
\s5
\c 15
\s సణుగుకున్న పరిసయ్యులు
\p
\v 1 తర్వాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరకు వచ్చారు.
\v 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి "ఈ మనిషి పాపులను దగ్గరకు రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు" అని సణుగుకున్నారు.
\s5
\v 3 అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
\s కనిపించకుండా పోయిన గొర్రె ఉపమానం (మత్తయి 18: 12-24)
\p
\v 4 "మీలో ఏ మనిషి కైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి, వెళ్లి ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకూ వెదకడా"
\v 5 అది దొరకినప్పుడు సంతోషంతో దానిని తన భుజాల మీద వేసుకొని యింటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి
\s5
\v 6 'మీరు నాతో కలిసి సంతోషించండి. ఎందుకంటే తప్పి పోయిన నా గొర్రె దొరికింది' అని వారితో చెప్తాడు కదా.
\v 7 అలాగే పశ్చాత్తాపం అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.
\s పోయిన నాణెం
\s5
\p
\v 8 ఒకామెకు పది వెండి నాణేలు ఉండి వాటిలో ఒకటి పోతే ఆమె దానికోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి, పోయిన నాణెం దొరికే వరకూ జాగ్రత్తగా వెదకదా ?
\v 9 అది దొరికినప్పుడు తన స్నేహితురాళ్ళనూ ఇరుగుపొరుగు వారినీ పిలిచి "నేను పోగొట్టుకున్న నాణెం దొరికింది కాబట్టి నాతో కలసి సంతోషించండి" అంటుంది కదా.
\v 10 అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి పరలోకంలో దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెప్తున్నాను" అన్నాడు.
\s ఇల్లు విడిచి వెళ్లిపోయిన కొడుకు
\s5
\p
\v 11 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
\v 12 వారిలో చిన్నవాడు 'నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు' అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు.
\s5
\v 13 కొన్నాళ్ళయ్యాక చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని ఒక దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేసాడు.
\v 14 అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరవు వచ్చింది. వాడికి ఇబ్బందులు మొదలైనాయి.
\s5
\v 15 దాంతో వాడు వెళ్లి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి వీడిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు.
\v 16 వాడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ వాడికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు.
\s5
\v 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఇలా అనుకున్నాడు, 'నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్లకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను.
\v 18 నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను.
\v 19 ఇకనుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకడిగా పెట్టుకో అని చెప్తాను'. ఇలా అనుకుని వాడు లేచి తన తండ్రి దగ్గరకు వచ్చాడు.
\s5
\v 20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి వాణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.
\v 21 అప్పుడా కొడుకు తండ్రితో "నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు" అన్నాడు.
\s5
\p
\v 22 అయితే తండ్రి తన దాసులతో "శ్రేష్టమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి.
\v 23 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం.
\v 24 నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు." అని చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.
\s పరిసయ్యుల మనస్తత్వం
\s5
\p
\v 25 ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు సంగీతం, నాట్య ధ్వని అతనికి వినిపించాయి.
\v 26 ఒక దాసుణ్ణి పిలిచి "ఏం జరుగుతోంది?" అని అడిగాడు.
\v 27 ఆ పనివాడు అతనితో "నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరకు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు" అని చెప్పాడు.
\s5
\v 28 దాంతో పెద్దకొడుక్కి కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు.
\v 29 కాని అతడు "ఇదిగో విను, ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవ దాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకొక మేకపిల్లను కూడా ఇవ్వలేదు.
\v 30 కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు" అంటూ నిష్టూరంగా మాట్లాడాడు.
\s5
\v 31 అందుకతని తండ్రి "నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే.
\v 32 మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు" అని చెప్పాడు.
\s5
\c 16
\s న్యాయం తప్పిన మేనేజర్ ఉపమానం
\p
\v 1 ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, "ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది.
\v 2 అతడు ఆ అధికారిని పిలిపించి "నీ గురించి నేను వింటున్నదేమిటి ? నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు. ఇకపైన నువ్వు నిర్వహణాధికారిగా ఉండటానికి వీల్లేదు" అన్నాడు.
\s5
\v 3 అప్పుడు అతడు ఇలా అనుకున్నాడు "యజమాని నన్ను నిర్వహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు. ఇప్పుడు నేనేంచేయాలి? తవ్వకం పని నాకు చేతకాదు. భిక్షమెత్తాలంటే అవమానం.
\v 4 నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తర్వాత నలుగురూ తమ ఇళ్ళల్లోకి నన్ను ఆహ్వానించేలా ఎలా చేయాలో నాకు తెలుసు" అనుకున్నాడు.
\s5
\v 5 ఆ తర్వాత అతడు తన యజమానికి బాకీ ఉన్న వారందరినీ పిలిపించాడు. ఒకడితో "నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు" అని అడిగాడు.
\v 6 "మూడు వేల లీటర్ల నూనె" అని అతడు జవాబిచ్చాడు. ఈ అధికారి ఆ వ్యక్తితో "నీ పత్రంలో పదిహేను వందల లీటర్లని రాసుకో" అన్నాడు.
\v 7 "నువ్వు ఎంత బాకీ ఉన్నావు?" అని మరొకణ్ణి అడిగితే అతడు "వంద మానికల గోధుమలు" అని చెప్పాడు. నిర్వహణాధికారి అతనితో "నీ పత్రంలో ఎనభై మానికలని రాసుకో" అన్నాడు.
\s5
\v 8 న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేసాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు.
\v 9 అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెప్తున్నాను.
\s5
\v 10 చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండే వాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు.
\v 11 కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే, ఇక న్యాయమైన ధనం మీకెవరిస్తారు ?
\v 12 మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు?
\s5
\v 13 ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకర్ని ద్వేషించి రెండో యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు."
\s పరిసయ్యులకు యేసు జవాబు.
\s5
\p
\v 14 ధనాన్ని ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు.
\v 15 ఆయన వారితో ఇలా అన్నాడు. "మీరు మనుష్యుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.
\s5
\v 16 బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చేంత వరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ ఉన్నాయి. అప్పట్నించి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు.
\v 17 ధర్మశాస్త్రంలో ఒక పొల్లయినా తప్పి పోవడం కంటే ఆకాశం, భూమీ నశించి పోవడమే తేలిక.
\s విడాకులు (మత్తయి 5: 31,32; 19:3-11; మార్కు 10:2-12; కొరింతి 7: 10-15)
\s5
\p
\v 18 భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
\s ధనికుడు, లాజరు
\s5
\p
\v 19 ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు వస్త్రాలూ, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు.
\v 20 లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు.
\v 21 ధనవంతుని భోజన బల్ల పైనించి కిందపడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి.
\s5
\v 22 ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండటానికి తీసుకు వెళ్ళారు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
\v 23 అతడు పాతాళంలో యాతన పడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి
\s5
\v 24 "తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడి పోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు" అని కేకలు పెట్టాడు.
\s5
\v 25 దానికి జవాబుగా అబ్రాహాము "నాయనా, గుర్తు తెచ్చుకో, నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతను సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.
\v 26 అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరకు రావాలనుకునే వారు వెళ్ళలేకుండా అక్కడి వారు మా దగ్గరకు రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది," అన్నాడు.
\s5
\v 27 అప్పుడతడు "అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు.
\v 28 వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను" అన్నాడు.
\s5
\v 29 అందుకు అబ్రాహాము "వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి" అన్నాడు.
\v 30 అతడు "తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలోనుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాప పడతారు" అన్నాడు.
\v 31 అందుకు అబ్రాహాము అతనితో "మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలోనుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు" అన్నాడు.
\s5
\c 17
\s క్షమాపణ గురించిన ఉపదేశం (మత్తయి 18:7, 15)
\p
\v 1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.
\v 2 అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డలలో ఎవరికైనా ఆటంకం కలగచేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
\s5
\v 3 మీ వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
\v 4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరకు వచ్చి "పశ్చాత్తాప పడుతున్నాను" అంటే మీరు అతణ్ణి క్షమించాలి."
\s5
\v 5 అపొస్తలులు "ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి." అన్నారు.
\v 6 ప్రభువు "మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి 'నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రం లో నాటుకు పో' అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.
\s ఉపచారం గురించిన ఉపమానం
\s5
\p
\v 7 మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని 'నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో' అంటాడా? అనడు.
\v 8 పైగా 'నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తర్వాత నువ్వు తినవచ్చు' అంటాడు.
\s5
\v 9 తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేసాడని యజమాని 'నాపై దయ చూపించావు' అని వాణ్ణి మెచ్చుకుంటాడా?
\v 10 అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తర్వాత 'మేము పనికిమాలిన దాసులం. మేం చేయాల్సిందే చేసాం' అని చెప్పాలి.
\s పదిమంది కుష్టరోగుల స్వస్థత
\s5
\p
\v 11 ఆయన యెరూషలేం కు ప్రయాణమై దారిలో సమరియ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ
\v 12 ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగమున్న పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు.
\v 13 "యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు" అని గట్టిగా కేకలు వేసారు.
\s5
\v 14 ఆయన వారిని చూసి, "మీరు వెళ్లి, యాజకులకు కనపడండి" అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.
\v 15 వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి
\v 16 బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు.
\s5
\v 17 అందుకు యేసు "పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఎక్కడ?
\v 18 దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?" అన్నాడు.
\v 19 "నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని వాడితో చెప్పాడు.
\s రాజ్యం గురించిన ఆత్మిక అంతరార్థం (లూకా 19:11, 12)
\s5
\p
\v 20 ఒకసారి పరిసయ్యులు "దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది" అని ఆయనను అడిగారు. దానికి ఆయన "దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.
\v 21 ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అంటూ చెప్పడానికి కుదరదు" అని వారికి జవాబిచ్చాడు.
\s యేసు తన రెండవ రాక విషయం వెల్లడించడం
\s5
\p
\v 22 ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజుని చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజుని చూడరు.
\v 23 వారు "ఇదిగో యిక్కడుంది, అదిగో అక్కడుంది" అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు.
\v 24 ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకు ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు.
\s5
\v 25 అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయన్ని పూర్తిగా నిరాకరించాలి.
\v 26 నోవహు రోజులలో జరిగినట్టు గానే మనుష్యకుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది.
\v 27 నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్లిళ్లకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.
\s5
\v 28 లోతు రోజులలో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నారు నాటుతూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు.
\v 29 అయితే లోతు, సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.
\s5
\v 30 అలాగే మనుష్యకుమారుడు ప్రత్యక్షమయే రోజున కూడా జరుగుతుంది.
\v 31 ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకు పోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పనిచేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు.
\s5
\v 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
\v 33 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు.
\s5
\v 34 నేను చెప్పేదేమంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరు పైకి వెళతారు. మరొకరు కిందనే ఉండిపోతారు.
\v 35 ఇద్దరు స్త్రీలు ఒకే తిరుగలి విసురుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె కిందనే ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు కిందనే ఉండిపోతాడు."
\v 36 అప్పుడు శిష్యులు "ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది" అని అడిగారు.
\v 37 దానికి జవాబుగా ఆయన "శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి" అన్నాడు.
\s5
\c 18
\s న్యాయం లేని న్యాయాధికారి ఉపమానం
\p
\v 1 తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
\v 2 "ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుష్యులంటే లెక్కలేదు.
\s5
\v 3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరకు తరచుగా వచ్చి 'నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి' అని అడుగుతూ ఉండేది.
\v 4 అతడు ఆమెకు న్యాయం చేయడానికి కొంతకాలం ఇష్టపడలేదు. కాని తరువాత ఇలా అనుకున్నాడు. 'నేను దేవుడికి భయపడను, మనుష్యులనూ లెక్కచెయ్యను.
\v 5 కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను' అనుకున్నాడు."
\s5
\v 6 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, "న్యాయవంతుడు కాని ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి.
\v 7 తాను ఎన్నుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ వుంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా?
\v 8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. వారి విషయమై ఆయన సహనం చూపిస్తున్నాడు కదా? అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?"
\s పరిసయ్యుడు, పన్ను వసూలుదారుడు
\s5
\p
\v 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
\v 10 "ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.
\s5
\v 11 పరిసయ్యుడు నిలబడి "దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
\v 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదో వంతు నీకిస్తున్నాను" అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు
\s5
\v 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడటానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ "దేవా, నేను పాపిని. నన్ను కరుణించు" అన్నాడు.
\v 14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాడినే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడని మీతో చెప్తున్నాను. నేను గొప్పవాణ్ణి అనుకునే వాణ్ణి తగ్గించడం, నేను హీనుడని అనుకునే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
\s యేసు చిన్నపిల్లలను దీవించడం (మత్తయి 19:13-15; మార్కు 10:13-16)
\s5
\p
\v 15 తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకు వచ్చిన వారిని గద్దించారు.
\v 16 అయితే యేసు వారిని తన దగ్గరకు పిలిపించాడు. "పసిపాపల్ని నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆటంక పెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.
\v 17 చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను." అన్నాడు.
\s ధనికుడైన యువ అధికారి (మత్తయి 19:16-30; మార్కు 10:17-31)
\s5
\p
\v 18 ఒక అధికారి ఆయనను చూచి "మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి" అని అడిగాడు.
\v 19 అందుకు యేసు "నన్ను మంచి వాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.
\v 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా" అని అతనితో అన్నాడు.
\v 21 దానికి జవాబుగా అతడు "వీటిని చిన్నప్పట్నించి పాటిస్తూనే ఉన్నాను" అన్నాడు.
\s5
\v 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు. "నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. నువ్వేమో నన్ను అనుసరించు" అన్నాడు.
\v 23 అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.
\s5
\v 24 యేసు అతని చూచి "ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
\v 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది రంధ్రం గుండా ఒంటె వెళ్ళడం తేలిక" అన్నాడు.
\s5
\v 26 ఇది విన్న వారు "అలాగైతే రక్షణ ఎవరు పొందగలరు?"అని అడిగారు
\v 27 అందుకు ఆయన "మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే" అని చెప్పాడు.
\s5
\v 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు "చూడు, మేం అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాము."
\v 29 అందుకు ఆయన "దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నాదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి
\v 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను " అన్నాడు .
\s యేసు తన మరణ ఉత్థానాల గురించి చెప్పడం (మత్తయి 20:17-19; మార్కు 10:32-34)
\s5
\p
\v 31 ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, "వినండి, మనం యెరూషలేం వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్యకుమారుని గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.
\v 32 ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు. అవమానిస్తారు. ఆయన మీద ఉమ్మి వేస్తారు.
\v 33 ఆయనను కొరడాలతో కొడతారు. చంపివేస్తారు. కానీ మూడో రోజున ఆయన తిరిగి లేస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 34 వారికి ఈ మాటలలో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.
\s యెరికో దగ్గర గుడ్డివాడికి చూపునివ్వడం (మత్తయి 20:29-34: మార్కు 10: 46-52)
\s5
\p
\v 35 ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
\v 36 పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి "ఏం జరుగుతోంది?" అని అడిగాడు.
\v 37 నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని ఎవరో అతనికి చెప్పారు.
\s5
\v 38 అప్పుడు వాడు "యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు" అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
\v 39 ముందు నడుస్తున్న వాళ్ళు "నోరు మూసుకో" అని గద్దించారు. కానీ వాడు "యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు" అని మరింత బిగ్గరగా కేకలు వేసాడు.
\s5
\v 40 అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరకు తీసుకు రమ్మన్నాడు.
\v 41 వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన "నీ కోసం నేనేం చేయాలని కోరుతున్నావు?" అని అడిగాడు. దానికి వాడు, "ప్రభూ, నాకు చూపు కావాలి" అన్నాడు.
\s5
\v 42 దానికి యేసు "చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని వాడితో చెప్పాడు.
\v 43 వెంటనే వాడు చూపు పొందాడు. దేవుని కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు..
\s5
\c 19
\s జక్కయ మార్పు
\p
\v 1 ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి
\v 2 దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ప్రధాన పన్ను వసూలుదారు, ధనవంతుడు.
\s5
\v 3 ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు. కాని జనసమూహం గుమిగూడటం కారణంగానూ ఇతడు పొట్టివాడు కావడం వల్లనూ చూడలేకపోయాడు.
\v 4 అప్పుడు యేసు ఆ దార్లోనే వస్తున్నాడు, కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్లి ఒక మేడి చెట్టు ఎక్కాడు.
\s5
\v 5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి "జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి" అన్నాడు
\v 6 అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.
\v 7 అది చూసి అందరూ "ఈయన ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాడు" అని గొణగడం మొదలు పెట్టారు.
\s5
\v 8 జక్కయ్య నిలబడి "ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరి నైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను" అన్నాడు.
\v 9 అందుకు యేసు "ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాం సంతతి వాడే.
\v 10 నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు" అని చెప్పాడు.
\s పది బంగారు నాణేల ఉపమానం
\s5
\p
\v 11 వారు ఈ మాటలు వింటున్నప్పుడు అయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండటం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.
\v 12 "గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం ఒకటి సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు.
\s5
\v 13 దానికి ముందు తన దాసులను పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణేలు ఇచ్చాడు. "నేను తిరిగి వచ్చే వరకు మీరు వీటితో వ్యాపారం చేయండి" అని చెప్పాడు.
\v 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. "ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు" అంటూ అతని వెనుకే రాయబారం పంపారు.
\v 15 అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.
\s5
\v 16 మొదటి వాడు వచ్చి "అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది" అన్నాడు.
\v 17 దానికి ఆ యజమాని "భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారి గా ఉండు" అన్నాడు.
\s5
\v 18 ఇక రెండో పనివాడు వచ్చాడు. "అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో అయిదు నాణేలు సంపాదించాను" అన్నాడు.
\v 19 యజమాని వాడితో "నువ్వు అయిదు పట్టణాల మీద అధికారిగా ఉండు" అన్నాడు.
\s5
\v 20 అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, "అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం.
\v 21 దీనిని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడవని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు," అన్నాడు.
\s5
\v 22 అందుకా యజమాని "చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా
\v 23 అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా" అని వాడితో చెప్పాడు.
\s5
\v 24 తన దగ్గర ఉన్న వారితో "వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణేలు ఉన్న వాడికివ్వండి." అన్నాడు.
\v 25 దానికి వాళ్ళు "అయ్యా అతని దగ్గర పది నాణేలు ఉన్నాయి కదా" అన్నారు.
\s5
\v 26 అందుకు అతడు "కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెప్తున్నాను "
\v 27 తర్వాత నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వాళ్ళని వధించండి" అన్నాడు.
\s యెరూషలేము జయప్రవేశం (మత్తయి 21:1-9; మార్కు 11:1-10; యోహాను 12:12-19)
\s5
\p
\v 28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేం కు ప్రయాణమై సాగిపోయాడు.
\s5
\v 29 ఆయన ఆలీవ్ కొండ దగ్గర ఉన్న బేత్ఫగే, బేతని అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు.
\v 30 "మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కన్పిస్తుంది. దాని మీద ఇంతవరకు ఎవ్వరూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకుని రండి.
\v 31 ఎవరైనా 'దీనిని ఎందుకు విప్పుతున్నారు' అని మిమ్మల్ని అడిగితే 'ఇది ప్రభువుకు కావాలి' అని చెప్పండి" అని చెప్పి వారిని పంపించాడు.
\s5
\v 32 ఆయన పంపిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే దానిని చూసారు.
\v 33 ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు "మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?" అని వారినడిగారు.
\v 34 దానికి వారు "ఇది ప్రభువుకు కావాలి" అన్నారు.
\v 35 తర్వాత యేసు దగ్గరకు దానిని తోలుకుని వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయన్ని దానిపై కూర్చోబెట్టారు.
\v 36 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు.
\s5
\v 37 ఆలీవ్ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.
\v 38 ప్రభువు పేరట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!" అన్నారు.
\s5
\v 39 ఆ జనసమూహం లో ఉన్న కొందరు పరిసయ్యులు "బోధకా, నీ శిష్యులను గద్దించు" అని ఆయనతో అన్నారు.
\v 40 ఆయన "వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\s యేసు యెరూషలేము గురించి విలపించడం (లూకా 13: 34, 35)
\s5
\p
\v 41 ఆయన యెరూషలేం పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని చూస్తూ దాని కోసం విలపించాడు.
\v 42 "ఇది నీ దినం. నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు.
\s5
\v 43 ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టి దిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపులనుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.
\v 44 నీలో ఒక రాయిపై మరో రాయి ఉండకుండా కూల్చి వేసే రోజు వస్తుంది." అన్నాడు.
\s ఆలయ శుద్ధి రెండవ సారి (మత్తయి 21:12-16; మార్కు 11:15-18; యోహాను 2:13-17)
\s5
\p
\v 45 అప్పుడు ఆయన దేవాలయం లో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో " 'నా మందిరం ప్రార్థనా మందిరం' అని రాసి ఉంది.
\v 46 కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు" అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.
\s5
\v 47 ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజలలో ప్రాముఖ్యమైన వారూ ఆయనను అంతం చేయాలని చూశారు .
\v 48 కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.
\s5
\c 20
\s యేసుకు అధికారం ఎక్కడిది? (మత్తయి 21:23-27; మార్కు 11:27-33)
\p
\v 1 ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి,
\v 2 "నువ్వు ఏ అధికారం తో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు" అని ఆయనను అడిగారు.
\s5
\v 3 దానికి ఆయన "నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి.
\v 4 యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, మనుష్యులలో నుండి కలిగిందా?" అని వారినడిగాడు
\s5
\v 5 వారు ఇలా ఆలోచించారు "మనం పరలోకం నుండి కలిగింది అంటే, అలాగైతే మీరెందుకు నమ్మలేదు? అని అడుగుతాడు.
\v 6 మనుషులలో నుండి కలిగింది అంటే జనం మనల్ని రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు"
\s5
\v 7 ఇలా ఆలోచించుకుని "అది ఎక్కడనుండి కలిగిందో మాకు తెలీదు" అని జవాబిచ్చారు.
\v 8 దానికి యేసు "నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను" అన్నాడు.
\s ద్రాక్షతోట ఉపమానం (మత్తయి 21:33-46; మార్కు 12:1-12; యెషయా 5:1-7)
\s5
\p
\v 9 ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు. "ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దానిని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తర్వాత వేరే దేశానికి వెళ్లి అక్కడ చాలా కాలం ఉన్నాడు.
\v 10 కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.
\s5
\v 11 మళ్ళీ అతడు మరో దాసుణ్ణి పంపాడు. వారు వాణ్ణి కొట్టి, అవమానపరచి వట్టి చేతులతో పంపివేశారు.
\v 12 మళ్ళీ అతడు మూడో వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరచి బయటకు తోసివేశారు.
\s5
\v 13 అప్పుడా ద్రాక్షతోట యజమానుడు ఇలా అనుకున్నాడు. "ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో"
\v 14 అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి "ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\v 15 అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వాళ్ళనేం చేస్తాడు?
\v 16 అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు." వారు అది విని "అలా ఎన్నటికీ కాకూడదు" అన్నారు.
\s5
\v 17 ఆయన వారిని చూసి "అలాగైతే ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది, అని రాసి ఉన్న మాట సంగతి ఏంటి?
\v 18 ఈ రాయి పైన పడే ప్రతీ వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవడి పైన పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది."
\s పన్నుకట్టడం విషయమై ప్రశ్న(మత్తయి 22: 15-22; మార్కు 12: 13-17)
\s5
\p
\v 19 ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.
\v 20 వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయన్ని అధిపతి వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయన్ని మాటల్లో తప్పు పట్టుకోవాలని, తాము నీతిపరులమని ఎంచుకునే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు.
\s5
\v 21 వారు వచ్చి బోధకా, "నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు. మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు.
\v 22 మనం కైసరునకు పన్ను కట్టడం న్యాయమా కాదా?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 23 ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి "ఒక దేనారం నాణెం చూపించండి.
\v 24 దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?" అని అడిగాడు. వారు "కైసరువి" అన్నారు.
\s5
\v 25 అందుకాయన "ఆలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి" అన్నాడు.
\v 26 వారు ప్రజల యెదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు.
\s పునరుత్థానం గురించి సద్దూకయ్యులకు యేసు ఇచ్చిన జవాబు (మత్తయి 22:23-33; మార్కు 12: 18-27)
\s5
\p
\v 27 పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అడిగారు.
\v 28 "బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి కదా,
\s5
\v 29 ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు.
\v 30 రెండవవాడు మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు.
\v 31 ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చని పోయారు. అ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 32 కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది?
\v 33 ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా" అన్నారు.
\s5
\v 34 అందుకు యేసు "ఈ లోక జనులు పెళ్లికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ
\v 35 పరలోకానికీ మృతుల పునరుత్థానానికీ అర్హులు పెళ్లి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు.
\v 36 వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి వారికి చావు లేదు.
\s5
\v 37 మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో
\v 38 చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా; ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవితులే" అని వారికి జవాబిచ్చాడు.
\s శాస్త్రులను యేసు ప్రశ్నించడం (మత్తయి 22:51-46; మార్కు 12:35-37)
\s5
\p
\v 39 అ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు "బోధకా,
\v 40 చాలా బాగా చెప్పావు" అన్నారు.
\s5
\v 41 ఆయన వారితో "క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెప్తున్నారు?
\v 42 "నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేదాకా నీవు నా కుడివైపున కూర్చోమని
\v 43 ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు," అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.
\v 44 దావీదు ఆయన్ని ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?" అన్నాడు.
\s5
\v 45 ప్రజలందరూ వింటుండగా ఆయన "శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు నిలువుటంగీలు వేసుకొని తిరుగుతూ ఉండాలని చూస్తారు
\v 46 వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందులలో అగ్ర స్థానాలను ఆశిస్తారు.
\v 47 వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు" అని తన శిష్యులతో చెప్పాడు.
\s5
\c 21
\s విధవరాలి కానుక. దేవునికి ఇవ్వడం గురించి యేసు అభిప్రాయం (మార్కు12:41, 44)
\p
\v 1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు.
\v 2 ఒక పేద విధవరాలు అతి తక్కువ విలువగల రెండు నాణేలు అందులో వేస్తుంటే చూశాడు.
\v 3 "ఈ పేద విధవరాలు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెప్తున్నాను.
\v 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది" అని వారితో చెప్పాడు.
\s ఒలీవ కొండ ప్రసంగం (మత్తయి 24, 25. మార్కు 13)
\s5
\p
\v 5 దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
\v 6 అప్పుడు ఆయన "ఈ కట్టడాల్ని మీరు చూస్తున్నారే, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది" అన్నాడు.
\s5
\v 7 అప్పుడు వారు "బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కన్పిస్తుంది?" అని ఆయనను అడిగారు.
\s భావి మానవ చరిత్ర (మత్తయి 24:3-14)
\p
\v 8 ఆయన "మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. అనేకులు నా పేర వచ్చి "నేనే ఆయనను" అంటారు. "ఆ కాలం దగ్గర పడింది" అంటారు. మీరు వారిని అనుసరించవద్దు.
\v 9 మీరు యుద్ధాలను గూర్చీ పోట్లాటలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు" అన్నాడు.
\s5
\v 10 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు. "ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది.
\v 11 కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కన్పిస్తాయి.
\s5
\v 12 ఇవన్నీ జరగడానికి ముందు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు.
\v 13 దీనివల్ల సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
\s5
\v 14 కనుక మేం ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించరాదని మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి.
\v 15 మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటనీ మీకిస్తాను.
\s5
\v 16 తలిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వాళ్ళు మీలో కొంతమందిని చంపిస్తారు.
\v 17 నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.
\v 18 కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
\v 19 మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.
\s యెరూషలేము వినాశనం
\s5
\p
\v 20 యెరూషలేము చుట్టూ సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.
\v 21 అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.
\v 22 ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.
\s5
\v 23 ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.
\v 24 వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్ని జనాలలోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేంను కాళ్ళ కింద తొక్కుతారు.
\s మహా తేజస్సు లో ప్రభువు రాక (మత్తయి 24: 29-31)
\s5
\p
\v 25 ఇంకా సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు.
\v 26 ఆకాశం లోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసిపోయి కూలిపోతారు.
\s5
\v 27 అప్పుడు మనుష్యకుమారుడు బలప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు.
\v 28 ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది." అన్నాడు.
\s అంజూరు చెట్టు ఉపమానం (మత్తయి24:32,33; మార్కు 13:28,29)
\s5
\p
\v 29 తర్వాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. "అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి.
\v 30 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా !
\v 31 అట్లాగే ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.
\s5
\v 32 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
\v 33 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.
\s ప్రభువు రాక, హెచ్చరికలు (మత్తయి 24:34-51; మార్కు 13:30-37)
\s5
\p
\v 34 తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి పోకుండా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదకు వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.
\v 35 ఆ రోజు ఈ లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది.
\s5
\v 36 కాబట్టి జరుగబోయే వీటన్నటి నుండీ తప్పించుకుని, మనుష్యకుమారుని ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండటానికి ఎప్పుడూ ప్రార్ధన చేస్తూ మెలకువగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\v 37 ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఆలివ్ కొండపై గడిపేవాడు.
\v 38 ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు.
\s5
\c 22
\s యేసును పట్టివ్వడానికి యూదా లాలూచీ (మత్తయి 26:2,4; మార్కు 14: 1,2,10,11)
\p
\v 1 పొంగని రొట్టెల పండుగ పస్కా దగ్గర పడింది.
\v 2 ప్రధానయాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళు ప్రజలకి భయపడుతున్నారు.
\s5
\v 3 అప్పుడు పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
\v 4 దాంతో యూదా వెళ్లి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధానయాజకులతోనూ అధికారులతోనూ మాట్లాడాడు.
\s5
\v 5 దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.
\v 6 అతడు కూడా వారికి మాట ఇచ్చాడు. జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.
\s పస్కా ఏర్పాట్లు (మత్తయి 26:17-19; మార్కు 14: 12-16)
\s5
\p
\v 7 పొంగని రొట్టెల పండుగ సందర్భంగా పస్కాపశువును వధించాల్సిన రోజు వచ్చింది.
\v 8 యేసు పేతురు యోహానులతో "మీరు వెళ్లి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి" అన్నాడు.
\v 9 వారు "మేము దానిని ఎక్కడ సిద్ధం చేయాలి?" అన్నారు.
\s5
\v 10 ఆయన "మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.
\v 11 మా గురువు 'నేను నా శిష్యులతో కలసి పస్కాభోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?' అంటున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.
\s5
\v 12 అతడు సదుపాయాలన్నీ ఉన్న ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి" అని వారితో చెప్పాడు.
\v 13 సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధ పరచారు.
\s చివరి పస్కా (మత్తయి 26:20; మార్కు 14:17; యోహాను 13)
\s5
\p
\v 14 సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.
\v 15 అప్పుడాయన "నేను హింస పొందకముందు మీతో కలిసి ఈ పస్కావిందు ఆరగించాలని ఎంతో ఆశించాను.
\v 16 ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దానిని తిననని మీతో చెప్తున్నాను."
\s5
\v 17 తర్వాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి "మీరు దీనిని తీసికొని పంచుకోండి.
\v 18 ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\s ప్రభు రాత్రి భోజన సంస్కారం స్థాపన (మత్తయి 26: 26-29; మార్కు 14: 22-25)
\s5
\p
\v 19 ఆ తర్వాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దానిని విరిచి వారికిచ్చి "ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీనిని చేయండి" అని చెప్పాడు.
\v 20 అలాగే భోజనమైన తర్వాత ఆయన ఆ పాత్రను తీసుకుని "ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.
\s యేసు తనకు జరగనైయున్న ద్రోహం గురించి వెల్లడించడం (మత్తయి 26: 21-25; మార్కు 14:18-21; యోహాను 13:18-30)
\s5
\p
\v 21 వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడి చెయ్యి నా చేతితో కూడా ఈ బల్ల మీదనే ఉంది.
\v 22 దేవుని నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లి పోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి యాతన తప్పదు" అన్నాడు,
\v 23 ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు.
\s తమలో ఎవరు గొప్ప వారని శిష్యుల మధ్య వాదం (మత్తయి 20:25,28; మార్కు 10:42-45)
\s5
\p
\v 24 తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
\v 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, "ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. తమ మీద అధికారం చెలాయించే వారు 'ఉపకారులు' అని పిలిపించుకుంటారు.
\s5
\v 26 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు చిన్నవాడిలా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.
\v 27 అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
\s రానున్న రాజ్యంలో అపోస్తలుల స్థానం (మత్తయి 19:28; ప్రకటన 3:21)
\s5
\p
\v 28 నాకు కలిగిన విషమ పరీక్షలలో మీరే నాతో నిలిచి ఉన్నారు.
\v 29 నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి
\v 30 సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.
\s పేతురు చెప్పనున్న అబద్ధం (మత్తయి 26: 33-35; మార్కు 14: 29-31)
\s5
\p
\v 31 సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోధుమల్లా జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు.
\v 32 నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తర్వాత నీ సోదరులను స్థిరపరచు."
\s5
\v 33 కానీ పేతురు "ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్లడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆయనతో అన్నాడు.
\v 34 అప్పుడు ఆయన "నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తర్వాతే కోడి కూస్తుందని నీకు చెప్తున్నాను" అన్నాడు.
\s వాటిల్లబోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు
\s5
\p
\v 35 ఇంకా ఆయన "నేను సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా" అని అడిగాడు. దానికి వారు "ఏమీ తక్కువ కాలేదు" అన్నారు.
\v 36 ఆయన "కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
\s5
\v 37 'ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు' అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నేరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\v 38 శిష్యులు " ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి" అన్నారు. ఆయన "అవి చాలు" అన్నాడు.
\s గేత్సేమనే వనం లో యేసు (మత్తయి 26: 36-46; మార్కు 14:32, 42; యోహాను 18:1)
\s5
\p
\v 39 భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఆలివ్ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
\v 40 వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన వారితో "మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి" అన్నాడు.
\s5
\v 41 వారి దగ్గరనుండి ఆయన రాతివేత దూరం వెళ్లి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేసాడు.
\v 42 "తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి."
\s5
\v 43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.
\v 44 ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట పెద్ద రక్త బిందువుల్లా నేలపై రాలింది.
\s5
\v 45 ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరకు వచ్చాడు. వారు దుఖం చేత నిద్రపోవడం చూశాడు. వారితో
\v 46 "మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి" అన్నాడు.
\s యూదా ద్రోహం (మత్తయి 26: 47-56; మార్కు 14: 43-50; యోహాను 18:3-11)
\s5
\p
\v 47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.
\v 48 అప్పుడు యేసు "ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?" అన్నాడు.
\s5
\v 49 ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించారు. "ప్రభూ, కత్తితో నరకమంటావా?" అని అడిగారు.
\v 50 ఈలోగా వారిలో ఒకడు ప్రధానయాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.
\v 51 దానికి యేసు "ఇక్కడితో ఆగండి" అని అతని చెవిని తాకి బాగుచేసాడు.
\s5
\v 52 తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో "ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?
\v 53 నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ప్రభావం" అన్నాడు.
\s యేసును బంధించడం. పేతురు అబద్ధం (మత్తయి 26:57, 69-75; మార్కు 14:53,54, 66-72; యోహాను 18:12, 15-18, 25-27)
\s5
\p
\v 54 వారు ఆయన్ని పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.
\v 55 అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని వున్నారు. పేతురు కూడా వెళ్లి వారితో కూర్చున్నాడు.
\s5
\v 56 అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి "ఈ మనిషి కూడా అతనితో ఉన్నాడు" అంది.
\v 57 దానికి పేతురు "అమ్మాయ్, అతనెవరో నాకు తెలియదు" అన్నాడు.
\v 58 కాసేపటికి మరొకడు పేతురును చూసి "నువ్వు కూడా వారిలో ఒకడివే" అన్నాడు. దానికి పేతురు "నేను కాదయ్యా" అన్నాడు.
\s5
\v 59 మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి "ఇతడు ఖచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయుడే" అని నొక్కి చెప్పాడు.
\v 60 అందుకు పేతురు "నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు" అన్నాడు. అతనిలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.
\s5
\v 61 అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. "నేనెవరో నీకు తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తర్వాతే కోడి కూస్తుందని" ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది.
\v 62 దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
\s యేసును కొట్టడం (మత్తయి 26:67,68; మార్కు 14:65; యోహాను 18:22,23)
\s5
\p
\v 63 యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు. కొట్టారు.
\v 64 ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి "నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు" అన్నారు.
\v 65 ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక మాటలు పలికారు.
\s సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు (మత్తయి 26:59-68; మార్కు 14:55-65; యోహాను 18:19-24)
\s5
\p
\v 66 ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ప్రధానయాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.
\v 67 "నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు" అన్నారు. అందుకాయన "నేను మీతో చెప్పినా మీరు నమ్మరు.
\v 68 అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు.
\s5
\v 69 అయితే ఇకపై మనుష్యకుమారుడు బలప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు" అన్నాడు.
\v 70 "అయితే నువ్వు దేవుని కుమారుడివా?" అన్నారు. వారితో ఆయన వారితో "మీరన్నట్టు ఆయనను నేనే" అన్నాడు.
\v 71 అందుకు వారు "మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటిమాట మనమే విన్నాం కదా" అని చెప్పారు.
\s5
\c 23
\s పిలాతు ఎదుట యేసు (మత్తయి 27: 2, 11-14; మార్కు 15:1-5; యోహాను 18: 28-38)
\p
\v 1 అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు.
\v 2 "ఇతడు మా ప్రజలను తిరగబడమని ప్రోత్సహిస్తున్నాడు. కైసరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెప్తుంటే విన్నాము" అని ఆయన మీద నేరారోపణ చేశారు.
\s5
\v 3 అప్పుడు పిలాతు "నువ్వు యూదుల రాజువా?" అని ఆయనను అడిగాడు. దానికి ఆయన "నువ్వే అంటున్నావు కదా" అన్నాడు.
\v 4 పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ "ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కన్పించడం లేదు," అన్నాడు.
\v 5 అయితే వారు "ఇతడు గలిలీ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు"అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు.
\s హేరోదు ఎదుట యేసు
\s5
\p
\v 6 పిలాతు ఈ మాట విని "ఈ వ్యక్తి గలిలీ ప్రాంతం వాడా" అని అడిగాడు.
\v 7 ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయన్ని హేరోదు దగ్గరకు పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.
\s5
\v 8 హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయన్ని చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు.
\v 9 హేరోదు ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు.
\v 10 ప్రధానయాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
\s5
\v 11 హేరోదు తన సైనికులతో కలిసి, ఆయన్ని అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి పిలాతు దగ్గరకు మళ్ళీ పంపించాడు.
\v 12 అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు.
\s తిరిగి పిలాతు ఎదుటికి, బరబ్బా విడుదల, యేసుకు మరణ శిక్ష (మత్తయి 27: 15-26; మార్కు 15:6-15; యోహాను 18:39, 40)
\s5
\p
\v 13 అప్పుడు పిలాతు ప్రధాన యాజకులనూ, అధికారులనూ, ప్రజలనూ పిలిపించాడు.
\v 14 "ప్రజలు తిరుగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరకు తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు.
\s5
\v 15 హేరోదుకు కూడా ఏ దోషమూ కన్పించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతను చేయలేదు.
\v 16 అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను" అన్నాడు.
\v 17 పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయాల్సి ఉంది.
\s5
\v 18 అయితే వారంతా "వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి" అని ఒక్కపెట్టున కేకలు వేశారు.
\v 19 ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యా నేరాలకై చెరసాలలో ఉన్నాడు.
\s5
\v 20 పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు.
\v 21 కాని వారంతా "వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి" అని మరింతగా కేకలు వేశారు.
\v 22 మూడో సారి అతడు "ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేసాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలి వేస్తాను" అన్నాడు.
\s5
\v 23 కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి "వీణ్ణి సిలువ వేయండి" అని కోరారు. చివరకు వారి కేకలే గెలిచాయి.
\v 24 వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు.
\v 25 తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్న వాణ్ణి వారు కోరినట్టే విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు.
\s5
\v 26 వారాయనను తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దానిని అతనిమీద పెట్టారు.
\s సిలువ (మత్తయి 27: 33-38; మార్కు 15:22-28; యోహాను 19:17-19)
\s5
\p
\v 27 పెద్ద జనసమూహమూ, ఆయనను గురించి రొమ్ముకొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
\v 28 యేసు వారివైపు తిరిగి "యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
\s5
\v 29 వినండి, "గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం," అని చెప్పే రోజులు వస్తున్నాయి.
\v 30 అప్పుడు మా మీద పడండని పర్వతాలతోనూ, మమ్మల్ని కప్పివేయమని కొండలతోనూ ప్రజలు చెప్పడం మొదలుపెడతారు.
\v 31 చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో" అని చెప్పాడు.
\s5
\v 32 ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
\s5
\v 33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తులలో ఒకణ్ణి ఆయనకు కుడివైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతో బాటు సిలువ వేశారు.
\v 34 అప్పుడు యేసు "తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళని క్షమించు" అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
\s5
\v 35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు "వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి" అంటూ ఎగతాళి చేశారు.
\s5
\v 36 ఇక సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ
\v 37 "నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు.
\v 38 "ఇతడు యూదుల రాజు" అని రాసి ఆయనకు పైగా ఉంచారు.
\s పరితాపం చెందిన దొంగ (మత్తయి 27:44; మార్కు 15:32)
\s5
\p
\v 39 వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.
\v 40 కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. "నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా?
\v 41 మనకైతే యిది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు" అన్నాడు.
\s5
\v 42 తర్వాత ఆయనను చూసి "యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అన్నాడు.
\v 43 అందుకాయన వాడితో "ఈ రోజు నువ్వు నాతో కూడా ఆనంద నివాసంలో ఉంటావని నీతో కచ్చితంగా చెప్తున్నాను" అన్నాడు.
\s5
\v 44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకు ఆ దేశమంతటిమీదా చీకటి అలముకొంది.
\v 45 సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.
\s యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించడం (మత్తయి 27:50; మార్కు 15:37; యోహాను 19:30)
\s5
\p
\v 46 అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను." అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి తన ప్రాణం విడిచాడు.
\v 47 శతాధిపతి జరిగిందంతా చూసి "ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే" అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు.
\s5
\v 48 చూడటానికి సమకూడిన ప్రజలంతా జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్లారు.
\v 49 ఆయనతో పరిచయమున్నవారూ, గలిలీ నుండి ఆయన్ని అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
\s భూస్థాపన (మత్తయి 27: 57-61; మార్కు 15: 42,47; యోహాను 19:38,42)
\s5
\p
\v 50 యూదుల మహా సభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.
\v 51 మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
\s5
\v 52 అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.
\v 53 తర్వాత ఆయన శరీరాన్ని సిలువ పైనుండి దించి, సన్నని నారవస్త్రంతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకుముందు ఎప్పుడూ ఉంచలేదు.
\s5
\v 54 అది పండుగకు సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది.
\v 55 అప్పుడు గలిలీ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి
\v 56 తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
\s5
\c 24
\s యేసు క్రీస్తు పునరుత్థానం (మత్తయి 28:1-6; మార్కు 16:1-8; యోహాను 20:1-17)
\p
\v 1 ఆదివారం తెల్లవారిన తర్వాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు.
\v 2 సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండటం చూసి లోపలికి వెళ్ళారు.
\v 3 కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు.
\s5
\v 4 దాంతో వారికేమీ తోచలేదు. అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు.
\v 5 వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు "సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు?
\s5
\v 6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు
\v 7 మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడో రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి" అన్నారు.
\s5
\v 8 అప్పుడు వారు ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకున్నారు.
\v 9 వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతుల్ని పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.
\v 10 ఇలా ఈ సంగతుల్ని అపోస్తులులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో కూడ ఉన్న యితర స్త్రీలూ.
\s5
\v 11 అయితే వారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు.
\v 12 అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్య పడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
\s పునరుత్థాన క్రీస్తు పరిచర్య
\s5
\p
\v 13 ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మావస్ గ్రామానికి వెళ్తున్నారు.
\v 14 జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు.
\s5
\v 15 అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు.
\v 16 అయితే వారు ఆయన్ని గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కన్నులు మూతలు పడ్డట్టు అయింది.
\s5
\v 17 ఆయన "మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?" అని వారిని అడిగాడు. దాంతో వారు దుఖంతో నిండిపోయి నిలబడిపోయారు.
\v 18 వారిలో క్లెయొపా అనేవాడు "యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా" అన్నాడు.
\s5
\v 19 ఆయన "ఏ విషయాలు?" అని అడిగాడు. అప్పుడు వారు "నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు.
\v 20 మన ప్రధాన యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా?
\s5
\v 21 ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
\s5
\v 22 అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరకు వెళ్లి అక్కడ ఆయన దేహం కన్పించక తిరిగి వచ్చారు.
\v 23 కొందరు దూతలు తమకు కనబడి "ఆయన బతికే ఉన్నాడని చెప్పారు" అని మా అందరికీ చెప్పినప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది.
\v 24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు" అని ఆయనకు చెప్పారు.
\s5
\v 25 అందుకాయన "అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా,
\v 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?" అని చెప్పాడు.
\v 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు.
\s5
\v 28 ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్లు కన్పించింది.
\v 29 దాంతో వారు "పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు" అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంటిలోకి వెళ్ళాడు.
\s5
\v 30 ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు.
\v 31 అప్పుడు వారి కన్నులు తెరచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు.
\v 32 అప్పుడు వారు "దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయేలా చెప్తున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్లు అనిపించ లేదూ" అని చెప్పుకున్నారు.
\s5
\v 33 అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేం వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని
\v 34 "ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు" అని చెప్పుకుంటున్నారు. వారిది విని
\v 35 దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరవడం వల్ల తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియచేశారు.
\s5
\v 36 వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే యేసే వారి మధ్య నిలబడి "మీకు శాంతి కలుగు గాక" అన్నాడు.
\v 37 అయితే వారు తమకేదో ఆత్మ కన్పించిందనుకుని భయంతో హడలిపోయారు.
\s5
\v 38 అప్పుడాయన "మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో సందేహం ఎందుకు పుడుతుంది?
\v 39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకి ఎముకలూ మాంసమూ ఉండవు" అని చెప్పాడు.
\v 40 అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.
\s5
\v 41 అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన "మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?" అని అడిగాడు.
\v 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చారు.
\v 43 ఆయన దానిని తీసికొని వారి కళ్ళ ముందే తిన్నాడు.
\s5
\v 44 తర్వాత ఆయన "మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా" అన్నాడు.
\s5
\v 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.
\s మహాభినియామకం (మత్తయి 28:18-20; మార్కు 16:15-18; యోహాను 1:8)
\p
\v 46 "క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ,
\v 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది.
\s5
\v 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
\s క్రీస్తు ఆరోహణం (మార్కు 16:19,20; అపో కా 1:9,11)
\p
\v 49 వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదకు పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి" అని వారికి చెప్పాడు.
\s5
\v 50 ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు.
\v 51 అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు.
\s5
\v 52 వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేం కు తిరిగి వెళ్ళారు.
\v 53 దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.

1873
44-JHN.usfm Normal file
View File

@ -0,0 +1,1873 @@
\id JHN John
\s5
\c 1
\s యేసు క్రీస్తు దైవత్వము (హెబ్రీ 1: 5-13)
\p
\v 1 ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
\v 2 ఈ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.
\s అయన అవతారపూర్వ కార్యము (హెబ్రీ 1:2)
\p
\v 3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు.
\s5
\v 4 ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది.
\v 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. చీకటి ఆ వెలుగును నిర్మూలం చేయలేక పోయింది.
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (వ. 29-34; మత్తయి 3: 1- 17; మార్కు 1:1-11; లూకా 3: 1- 23)
\s5
\p
\v 6 దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను.
\v 7 అందరూ ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకి సాక్షిగ ఉండి దానిని నిరూపించడానికి వచ్చాడు.
\v 8 ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పటానికి వచ్చాడు.
\s యేసుక్రీస్తు నిజమైన వెలుగు (యోహాను 8: 12; 9: 5; 12: 46)
\s5
\p
\v 9 లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.
\s5
\v 10 లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనని తెలుసుకోలేదు.
\s కుమారులు, అవిశ్వాసులు (1 యోహాను 2: 5, 11, 12; 3: 1)
\p
\v 11 ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. కానీ వారు ఆయనను ఒప్పుకోలేదు.
\s5
\v 12 తనను ఎవరెవరు ఒప్పుకున్నారో, అంటే తన పేరులో నమ్మకం ప్రకటించారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.
\v 13 వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.
\s అయన అవతారము (మత్తయి 1: 18- 23; లూకా 1: 30- 35; రోమా 1: 3, 4)
\s5
\p
\v 14 ఆ వాక్కు శరీరమై మన మధ్యలో కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ప్రత్యేక వ్యక్తికి ఉండే మహిమ లాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.
\s బాప్తిసమిచ్చే యోహాను సాక్ష్యం (మత్తయి 3: 1- 17; మార్కు 1: 1- 11; లూకా 3: 1- 18)
\p
\v 15 యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, "'నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు' అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన"
\s5
\p
\v 16 ఆయన సంపూర్ణతలోనుండి మనమందరం కృప తర్వాత కృపను పొందాం.
\v 17 మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.
\v 18 దేవుణ్ణి ఇంతవరకూ ఎవరూ చూడలేదు. తండ్రిని అనునిత్యం హత్తుకుని ఉండే ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు.
\s5
\p
\v 19 యెరూషలేము నుండి యూదులు, "నువ్వు ఎవరు?" అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు.
\v 20 అతడు "నాకు తెలియదు" అనకుండా, "నేను క్రీస్తును కాదు" అంటూ ఒప్పుకున్నాడు.
\v 21 కాబట్టి వాళ్ళు "అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?" అంటే అతడు "కాదు" అన్నాడు.
\s5
\v 22 "నువ్వు ప్రవక్తవా?" అని అడిగితే కాదని జవాబిచ్చాడు. దాంతో వాళ్ళు, "అయితే అసలు నువ్వు ఎవరివి? మమ్మల్ని పంపిన వారికి మేమేం చెప్పాలి? అసలు నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావ్?" అన్నారు.
\v 23 దానికి అతడు, "యెషయా ప్రవక్త పలికినట్టు నేను,
\q1 'ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి' అని
\q1 అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని" అన్నాడు.
\s5
\p
\v 24 అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు.
\v 25 వారు, "నువ్వు క్రీస్తువు కావు, ఏలీయావు కావు, ప్రవక్తవూ కావు. అలాంటప్పుడు మరి బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు?" అని అడిగారు.
\s5
\v 26 దానికి యోహాను "నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కాని మీ మధ్య మీరు గుర్తించని వ్యక్తి నిలిచి ఉన్నాడు.
\v 27 నా వెనుక వస్తున్నది ఆయనే. నేను ఆయన చెప్పుల పట్టీని విప్పడానిక్కూడా యోగ్యుణ్ణి కాదు" అని వారితో చెప్పాడు.
\v 28 ఈ విషయాలన్నీ యోర్దాను నదికి అవతల వైపు ఉన్న బేతని లో జరిగాయి. ఇక్కడే యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు.
\s5
\v 29 తర్వాత రోజు యేసు యోహాను దగ్గరకు వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, "చూడండి, లోకంలోని పాపాన్నంతా తీసివేసే దేవుని గొర్రెపిల్ల!
\v 30 'నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు' అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.
\v 31 నేను ఆయనని గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తూ వచ్చాను"
\s5
\v 32 యోహాను ఇంకా సాక్ష్యమిస్తూ "ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను.
\v 33 నేను ఆయన్ని గుర్తు పట్టలేదు. కాని 'ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు' అని నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు.
\v 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్ష్యమూ ఇచ్చాను."
\s 35 యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య (యోహాను 1: 35- 12: 50)
\s5
\p
\v 35 తర్వాతి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలిచి ఉన్నాడు.
\v 36 అప్పుడు యేసు అక్కడ నడచుకుంటూ వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, "చూడండి, దేవుని గొర్రెపిల్ల" అన్నాడు.
\s5
\p
\v 37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు.
\v 38 యేసు వెనక్కి తిరిగి, వాళ్ళు తన వెనకాలే రావడం చూసి "మీకేం కావాలి?" అని అడిగాడు. వాళ్ళు "రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్ధం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?" అని అడిగారు.
\v 39 ఆయన "వచ్చి చూడండి" అన్నాడు. వాళ్ళు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వాళ్ళు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.
\s5
\v 40 యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు.
\v 41 ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోను వెదకి పట్టుకొని, అతనితో "మేం మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్ధం) కనుక్కున్నాం" అని చెప్పాడు.
\v 42 యేసు దగ్గరకు అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, "నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు" అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్ధం).
\s5
\p
\v 43 మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయల్దేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో "నా వెనకే రా" అన్నాడు.
\v 44 ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే.
\v 45 ఫిలిప్పు నతనయేలును చూసి, "ధర్మశాస్త్రంలో మోషే, ఇంకా ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేం చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు" అని చెప్పాడు.
\s5
\v 46 దానికి నతనయేలు, "నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?" అన్నాడు. ఫిలిప్పు "నువ్వే వచ్చి చూడు" అన్నాడు.
\v 47 నతనయేలు తన దగ్గరకు రావడం యేసు చూశాడు. "చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు" అన్నాడు.
\v 48 అప్పుడు నతనయేలు, "నేను నీకెలా తెలుసు?" అన్నాడు. అందుకు యేసు, "ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను" అన్నాడు.
\s5
\p
\v 49 బోధకుడా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే" అని నతనయేలు బదులిచ్చాడు.
\v 50 అందుకు యేసు "ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలను నువ్వు చూస్తావు" అన్నాడు. "
\v 51 తర్వాత యేసు ఇలా అన్నాడు, "ఆకాశం తెరచుకుంటుంది. దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇదంతా మీరు చూస్తారు."
\s5
\c 2
\s కానా పెండ్లి మొదటి అద్భుతకార్యం
\p
\v 1 మూడో రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది.
\v 2 యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్ళికి యేసునీ ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు.
\s5
\v 3 విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, "వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది" అని చెప్పింది.
\v 4 యేసు ఆమెతో "అమ్మా, అయితే నాకేం పని? నా సమయం ఇంకా రాలేదు" అన్నాడు.
\v 5 ఆయన తల్లి పనివాళ్ళను చూసి "ఆయన మీకు ఏం చెబుతాడో దానిని చేయండి" అంది.
\s5
\v 6 యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి.
\v 7 యేసు, "ఆ బానల్ని నీళ్లతో నింపండి" అన్నాడు. వాళ్ళు అలాగే వాటిని నిండుగా నింపారు.
\v 8 అప్పుడు ఆయన, "ఇప్పుడు దీనిని కొంచెం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి" అన్నాడు. వాళ్ళు అలాగే తీసుకు వెళ్ళారు.
\s5
\v 9 ద్రాక్షారసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడినుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దానిని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో,
\v 10 "అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షారసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు" అన్నాడు.
\s5
\v 11 యేసు చేసిన అద్భుతాలలో ఈ మొదటిదానిని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీనివల్ల ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
\s5
\v 12 ఇదయ్యాక ఆయన తన తల్లీ, సోదరులూ, శిష్యులతో కలసి కపెర్నహూం కు వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు.
\s మొదటి పస్కా (యోహాను 6: 4; 11: 55) మొదటి ఆలయ శుద్ధి (మత్తయి 21: 12, 13; మార్కు 11: 15- 17; లూకా 19: 45, 46)
\s5
\p
\v 13 యూదుల పండగ అయిన పస్కా దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్ళాడు.
\v 14 అక్కడ దేవాలయంలో ఎద్దుల్నీ, గొర్రెల్నీ, పావురాల్నీ అమ్ముతున్న వాళ్ళను చూశాడు. అక్కడే కూర్చుని డబ్బును మారకం చేసే వాళ్ళను కూడా చూశాడు.
\s5
\v 15 ఆయన పేనిన తాళ్ళను ఒక కొరడాగా చేసి దానితో వాళ్ళందర్నీ దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. గొర్రెలనూ ఎద్దులను కూడా అక్కడ్నించి తోలివేశాడు. డబ్బును మారకం చేసే వాళ్ళ బల్లల్ని పడవేశాడు. వాళ్ళ డబ్బును చెల్లాచెదరు చేశాడు.
\v 16 పావురాలు అమ్మేవారితో ఆయన, "వీటిని ఇక్కడ్నించి తీసివేయండి. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయడం మానండి" అన్నాడు.
\s5
\v 17 ఆయన శిష్యులు "నీ యింటిని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తూ ఉంది" అని రాసి ఉన్న మాటను జ్ఞాపకం చేసుకున్నారు.
\p
\v 18 అప్పుడు అక్కడి యూదు అధికారులు ఆయనతో, "నీవు ఈ పనులు చేస్తున్నావే. దీనిని బట్టి మాకు ఏ సంకేతం చూపుతావు?" అన్నారు.
\v 19 దానికి యేసు, "ఈ దేవాలయాన్ని కూల్చండి. మూడు రోజుల్లో దీనిని లేపుతాను" అన్నాడు.
\s5
\v 20 అప్పుడు యూదు అధికారులు "ఈ దేవాలయాన్ని నిర్మించడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. దీనిని మూడు రోజుల్లోనే లేపుతావా?" అన్నారు.
\v 21 అయితే ఆయన చెప్పింది తన శరీరం అనే దేవాలయం గురించి.
\v 22 ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.
\s5
\p
\v 23 ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు.
\v 24 అయితే యేసుకు అందరూ తెలుసు. కాబట్టి ఆయన వారిని సంపూర్ణంగా నమ్మలేదు.
\v 25 ఆయనకు మనుషుల అంతరంగం బాగా తెలుసు. ఎవరూ మనుషుల గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు.
\s5
\c 3
\s నికోదేముతో యేసు : నూతన జన్మ
\p
\v 1 నికోదేము అనే పేరు గల ఒక పరిసయ్యుడున్నాడు. అతడు యూదుల చట్ట సభలో ఒక సభ్యుడు.
\v 2 అతడు రాత్రి సమయంలో యేసు దగ్గరకు వచ్చాడు. ఆయనతో, "బోధకా, నువ్వు దేవుని దగ్గరనుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరనీ మాకు తెలుసు" అన్నాడు.
\s5
\v 3 దానికి జవాబుగా యేసు అతనితో, "ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని ఖచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\v 4 అందుకు నికొదేము, "మనిషి ముసలి వాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండో సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?" అని ఆయనను అడిగాడు.
\s5
\v 5 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, "ఖచ్చితంగా చెప్తున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.
\v 6 శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ.
\s5
\v 7 నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు విడ్డూరంగా భావించవద్దు.
\v 8 గాలి తన కిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు."
\s5
\v 9 దీనికి జవాబుగా నికొదేము "ఈ విషయాలు ఎలా సాధ్యం అవుతాయి?" అన్నాడు.
\v 10 యేసు ఇలా అన్నాడు, "నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడడివై ఉండీ ఈ సంగతులు అర్ధం చేసుకోలేవా?
\v 11 మాకు తెలిసిన సంగతులను చెప్తున్నాం, మేం చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్ష్యాన్ని ఒప్పుకోరని ఖచ్చితంగా చెప్తున్నాను.
\s5
\v 12 భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు?
\v 13 పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
\s5
\v 14 అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో
\v 15 అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్యకుమారుణ్ణి కూడా పైకి ఎత్తాలి.
\s5
\p
\v 16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతీ వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు.
\v 17 తన కుమారుని వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు, కానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
\v 18 ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.
\s5
\v 19 ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకం లోకి వెలుగు వచ్చింది. వాళ్ళు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు.
\v 20 దుర్మార్గపు పనులు చేసే వాడు వెలుగు దగ్గరకు రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి దుర్మార్గపు పనులు చేసే ప్రతీ వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
\v 21 అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరకు వస్తాడు."
\s బాప్తిసమిచ్చే యోహాను చివరి సాక్ష్యం
\s5
\p
\v 22 ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు.
\v 23 సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్లి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు.
\v 24 యోహానును ఇంకా చెరసాలలో వేయలేదు.
\s5
\v 25 అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది.
\v 26 వారు యోహాను దగ్గరకు వచ్చారు. "బోధకా, యోర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు" అని చెప్పారు.
\s5
\v 27 అందుకు యోహాను ఇలా అన్నాడు, "పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
\v 28 నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు.
\s5
\v 29 పెళ్లి కొడుక్కే పెళ్లి కూతురు ఉంటుంది. అయితే పెళ్లి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఉంటాడు. పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది.
\v 30 ఆయన అధికం కావాలి, నేను తగ్గిపోవాలి.
\s యేసుక్రీస్తు గురించిన అమోఘ ప్రకటన
\s5
\p
\v 31 పై నుండి వచ్చిన వాడు అందరికీ పైవాడే. భూమి సంబంధమైన వాడు భూమి నుండి వస్తాడు కాబట్టి భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చిన వాడు అందరికీ పైనున్న వాడు.
\v 32 ఆయన తను చూసిన వాటిని గురించీ విన్న వాటిని గురించీ సాక్ష్యం ఇస్తాడు కానీ ఎవరూ ఆయన సాక్ష్యాన్ని అంగీకరించరు.
\v 33 ఆయన సాక్ష్యాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపిస్తున్నాడు.
\s5
\v 34 దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన కొలత లేకుండా ఆత్మను దయ చేస్తాడు.
\v 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు. సమస్తాన్నీ ఆయన చేతులకు అప్పగిస్తాడు.
\v 36 కుమారునిలో విశ్వాసం ఉంచే వాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారునికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది."
\s5
\c 4
\s యేసు గలిలయకు తరలి పోవడం
\p
\v 1 యోహాను కంటె యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసికొన్నట్టూ, వారికి బాప్తిసం ఇస్తున్నట్టూ పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది.
\v 2 నిజానికి యేసు బాప్తిసం ఇవ్వలేదు గానీ ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు.
\v 3 అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు.
\s5
\v 4 మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది.
\v 5 అలా ఆయన సమరయ లో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.
\s సమరయ స్త్రీతో యేసు
\s5
\p
\v 6 యాకోబు బావి అక్కడ ఉంది. ప్రయాణంలో అలసిన యేసు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.
\p
\v 7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. యేసు ఆమెతో "తాగడానికి నీళ్ళు ఇస్తావా?" అని అడిగాడు.
\v 8 ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు.
\s5
\v 9 ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, "నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?" ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు.
\v 10 దానికి యేసు, "నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయన్ని అడిగే దానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు" అన్నాడు.
\s5
\v 11 అప్పుడా స్త్రీ "అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది?
\v 12 మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?" అంది.
\s5
\v 13 దానికి యేసు "ఈ నీళ్లు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
\s అంతరంగంలో నివాసముండే ఆత్మ (యోహాను 7: 37- 39)
\p
\v 14 నేను ఇచ్చే నీళ్ళు తాగే వాడికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వాడికి ఇచ్చే నీళ్ళు వాడిలో ఒక నీటి ఊటగా మారి నిత్యజీవం లోకి ఊరుతూ ఉంటుంది" అన్నాడు.
\s5
\p
\v 15 అప్పుడు ఆమె ఆయనతో, "అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు" అంది.
\v 16 యేసు ఆమెతో, "నువ్వు వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా" అన్నాడు.
\s5
\v 17 దానికి ఆ స్త్రీ "నాకు భర్త లేడు" అంది. యేసు ఆమెతో "'నాకు భర్త లేడని నువ్వు సరిగ్గానే చెప్పావు.
\v 18 ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు" అన్నాడు.
\s5
\v 19 అప్పుడా స్త్రీ "అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్ధమౌతున్నది.
\v 20 మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలని మీరు అంటారు" అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు,
\s5
\v 21 " "అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము.
\v 22 మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదులలోనుండే వస్తుంది.
\s5
\v 23 తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యం తోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. అలాంటి వారే తనను అరాధించాలని తండ్రి చూస్తున్నాడు.
\v 24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయన్ని ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి."
\s5
\v 25 అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, "క్రీస్తు అని పిలిచే మెస్సియా వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమూ వివరిస్తాడు" అంది.
\v 26 అది విని యేసు "నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని" అని చెప్పాడు.
\s5
\p
\v 27 ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీ తో ఆయన మాట్లాడుతూ ఉండటం చూసి 'ఎందుకు మాట్లాడుతున్నాడా' అనుకున్నారు. కానీ 'నీకేం కావాలని' గానీ 'ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు' అని గానీ ఎవరూ అడగలేదు.
\s5
\v 28 ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే విడిచి ఊరి లోకి వెళ్ళింది.
\v 29 ఆ ఊరి వారితో, "మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?" అంది.
\v 30 వాళ్ళంతా ఊరు విడిచి ఆయన దగ్గరకు వచ్చారు.
\s5
\p
\v 31 ఆ లోగా శిష్యులు "బోధకుడా, భోజనం చేయి" అని ఆయన్ని బతిమాలారు.
\v 32 దానికి ఆయన, "తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది" అని వారితో చెప్పాడు.
\v 33 "ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?" అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\v 34 యేసు వారిని చూచి "నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పనిని చేసి ముగించడమే నా ఆహారం.
\v 35 పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెప్తున్నాను.
\v 36 విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేట్లుగా కోసేవాడు వేతనం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు.
\s5
\v 37 ఈ విషయంలో విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు అనే మాట నిజమే.
\v 38 మీరు దేని కోసం ప్రయాస పడలేదో దానిని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు శ్రమించారు, వారి శ్రమ ఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు" అన్నాడు.
\s5
\p
\v 39 'నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు' అంటూ నివేదిక ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు.
\s సమరయ ప్రజానీకంతో యేసు
\p
\v 40 ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు.
\s5
\v 41 ఆయన మాటలు విని ఇంకా అనేకులు ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, "మేం విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు.
\v 42 మేం కూడా ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాం" అన్నారు.
\s5
\v 43 ఆ రెండు రోజులయ్యాక ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్ళాడు.
\v 44 ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు.
\v 45 ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతం పలికారు. పండగ ఆచరించడం కోసం గలిలయులు కూడా యెరూషలేముకు వెళ్తారు. అక్కడ ఆయన చేసిన పనులన్నీ వారు చూశారు.
\s5
\p
\v 46 యేసు గలిలయ లోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూం లో ఒక రాజ వంశానికి చెందిన ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు.
\v 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు.
\s5
\v 48 యేసు అతడితో ఇలా అన్నాడు, "సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు."
\v 49 అందుకా అధికారి, "ప్రభువా, నా కొడుకు చావక ముందే రా" అని వేడుకున్నాడు.
\v 50 యేసు అతడితో "నువ్వు వెళ్ళు. నీ కొడుకు బదికే ఉన్నాడు" అని చెప్పాడు. ఆ మాటను నమ్మి అతడు వెళ్లి పోయాడు.
\s5
\v 51 అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బదికి ఉన్నాడని తెలియజేశారు.
\v 52 "ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది" అని అతడు వారిని అడిగాడు. వారు, "నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది" అని చెప్పారు.
\s5
\v 53 'నీ కొడుకు బతికి ఉన్నాడు' అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు.
\v 54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.
\s5
\c 5
\s పండుగ : బెతెస్డ కోనేటి వద్ద స్వస్థత
\p
\v 1 ఇదయ్యాక యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
\v 2 యెరూషలేములో గొఱ్ఱల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి అయిదు ద్వార మంటపాలున్నాయి.
\v 3-4 రకరకాల రోగాలున్న వారూ, గుడ్డివారూ, కుంటి వారూ నిర్జీవమైన కాళ్ళూ చేతులున్న వారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
\s5
\v 5 అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి అంగ వైకల్యంతో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు.
\v 6 యేసు అతనిని చూసి వాడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, "బాగవ్వాలని కోరుతున్నావా?" అని అడిగాడు.
\s5
\v 7 అప్పుడు ఆ రోగి, " అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్నుకోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు" అని జవాబిచ్చాడు.
\v 8 యేసు "నువ్వు లేచి నీ చాపా పరుపూ తీసుకుని నడిచి వెళ్ళు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 9 వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు.
\p ఆ రోజు విశ్రాంతి దినం.
\s5
\v 10 అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, "ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!" అన్నారు.
\v 11 అందుకు ఆ వ్యక్తి "నన్ను బాగు చేసిన వాడు 'నీ చాపా పరుపూ ఎత్తుకుని నడువు' అని నాకు చెప్పాడు" అన్నాడు.
\s5
\v 12 అప్పుడు వాళ్ళు "నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?" అని అతణ్ణి అడిగారు.
\v 13 అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండటం వలన యేసు నెమ్మదిగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
\s5
\v 14 ఆ తర్వాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. "చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయ వద్దు." అని అతడితో చెప్పాడు.
\v 15 వాడు యూదా నాయకుల దగ్గరకు వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
\s5
\p
\v 16 ఈ పనుల్ని యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు.
\v 17 యేసు వారితో, "నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను" అన్నాడు.
\v 18 ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వాళ్ళు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు.
\s5
\v 19 కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు. "మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. కుమారుడు తనంత తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
\v 20 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారునికి చూపిస్తాడు.
\s5
\p
\v 21 తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్ర్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
\v 22 తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
\v 23 దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుని కూడా గౌరవించాలి. కుమారుని గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.
\s5
\v 24 ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచే వాడికి నిత్యజీవం ఉంది. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవం లోకి దాటి వెళ్ళాడు.
\s5
\v 25 మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి నైన నా స్వరాన్ని వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బదుకుతారు.
\s5
\v 26 తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండటానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
\v 27 అలాగే ఆయన కుమారునికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు.
\s రెండు పునరుత్థానాలు
\s5
\p
\v 28 దీనికి మీరు ఆశ్చర్యపడ వద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
\v 29 అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వాళ్ళు జీవపు పునరుత్థానానికీ చెడు చేసినవాళ్ళు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.
\s5
\p
\v 30 నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను ముందు విని దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
\v 31 నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
\v 32 నా గురించి సాక్ష్యమిచ్చేవాడు మరొకరున్నారు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
\s యేసును గురించి నాలుగు సాక్షాలు
\s5
\p
\v 33 మీరు యోహాను దగ్గరకు కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
\v 34 కానీ నేను మనుషుల సాక్ష్యాన్ని ఒప్పుకోను గానీ మీ రక్షణ కోసం ఈ మాటలు చెప్తున్నాను.
\v 35 యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉన్నాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు.
\s5
\p
\v 36 అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను సాధించడానికి నా తండ్రి నా కిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెప్తున్నాయి.
\v 37 నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు.
\v 38 ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.
\s5
\v 39 లేఖనాలలో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
\v 40 అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరకు రావడానికి మీరు ఇష్టపడటం లేదు.
\s5
\v 41 మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.
\v 42 ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు.
\s5
\p
\v 43 నేను నా తండ్రి పేరు మీద వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరకు వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు.
\v 44 ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు?
\s5
\v 45 నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు.
\v 46 మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు.
\v 47 మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?"
\s5
\c 6
\s ఐదు వేల మందికి ఆహారం (మత్తయి 14: 13- 21; మార్కు 6: 32- 44; లూకా 9: 10- 17)
\p
\v 1 ఈ సంగతులు జరిగిన తర్వాత యేసు తిబెరియ సముద్రం, అంటే గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తీరానికి వెళ్ళాడు.
\v 2 రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు గొప్ప సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
\v 3 యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చున్నాడు.
\s5
\v 4 యూదుల పండగ అయిన పస్కా దగ్గరలోనే ఉంది.
\v 5 యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో "వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు.
\v 6 యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.
\s5
\v 7 దానికి ఫిలిప్పు, "రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు.
\v 8 ఆయన శిష్యులలో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ
\v 9 "ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు.
\s5
\p
\v 10 యేసు "ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాల పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు.
\v 11 యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు.
\v 12 అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన "మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్ధం కానీయ వద్దు" అని శిష్యులతో చెప్పాడు.
\s5
\v 13 అందరూ తిన్న తర్వాత మిగిలిన ఐదు యవల రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి.
\v 14 వాళ్ళందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, "ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే" అని చెప్పుకున్నారు.
\v 15 వాళ్ళు తనను పట్టుకుని బలవంతంగా రాజుని చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్ధమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్లి పోయాడు.
\s యేసు నీటిపై నడక (మత్తయి 14: 22- 36; మార్కు 6: 45- 56)
\s5
\p
\v 16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్లి పడవ పైన సముద్రానికి అవతల ఉన్న కపెర్నహూంకు వెళ్తున్నారు.
\v 17 అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళ దగ్గరకు ఇంకా రాలేదు.
\v 18 అప్పుడు పెను గాలి వీయడం మొదలైంది. సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.
\s5
\v 19 వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు.
\v 20 అయితే ఆయన "నేనే, భయపడవద్దు" అని వాళ్ళతో చెప్పాడు.
\v 21 ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ పైన ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
\s జీవాహారం గురించి ఉపదేశం
\s5
\p
\v 22 తరువాతి రోజు సముద్రానికి ఇవతల ఉండిపోయిన జన సమూహం అక్కడికి వచ్చారు. అక్కడ ఒక చిన్న పడవ మాత్రమే ఉంది. మరో పడవ వాళ్లకు కనిపించలేదు. శిష్యులు యేసు లేకుండానే పడవలో ప్రయాణమై వెళ్ళారని వాళ్ళు తెలుసుకున్నారు.
\v 23 అయితే ప్రభువు కృతఙ్ఞతలు చెప్పి వారికి రొట్టెలు పంచగా వాళ్ళు తిన్న స్థలానికి దగ్గరలో ఉన్న తిబెరియనుండి వేరే చిన్న పడవలు వచ్చాయి.
\s5
\v 24 యేసూ ఆయన శిష్యులూ అక్కడ లేక పోవడంతో ప్రజలందరూ ఆ చిన్న పడవలెక్కి యేసును వెదకుతూ కపెర్నహూముకు వచ్చారు.
\v 25 సముద్రం అవతల తీరాన వారు ఆయన్ని చూశారు. "బోధకా, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు?" అని అడిగారు.
\s5
\p
\v 26 యేసు "ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు అద్భుతాలను చూసినందు వల్ల కాదు గానీ రొట్టెలు కడుపునిండా తిని తృప్తి పొందడం వల్లే నన్ను వెదకుతున్నారు.
\v 27 నాశనమయ్యే ఆహారం కోసం కష్టపడవద్దు, నిరంతర జీవం కలగజేసే నాశనం కాని ఆహారం కోసం కష్టపడండి. దాన్ని మనుష్య కుమారుడు మీకిస్తాడు. దానికోసం తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి అధికారమిచ్చాడు" అని చెప్పాడు.
\s5
\v 28 అప్పుడు వాళ్ళు, "దేవుని పనులు చేయాలంటే మేమేం చేయాలి?" అని ఆయనను అడిగారు.
\v 29 దానికి యేసు, "దేవుడు పంపిన వ్యక్తి పైన విశ్వాసముంచడమే దేవుని కార్యాలు చేయడమంటే" అన్నాడు.
\s5
\v 30 వాళ్ళు, "అలా అయితే మేం నిన్ను నమ్మడానికి నువ్వు ఏ అద్భుతాన్ని చేస్తున్నావ్? ఇప్పుడు ఏం చేస్తావ్?
\v 31 'వారు తినడానికి పరలోకం నుండి ఆయన వారికి ఆహారం ఇచ్చాడు' అని రాసి ఉన్నట్టుగా మన పూర్వీకులు అరణ్యంలో మన్నాను భుజించారు" అని చెప్పారు.
\s5
\v 32 అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, "పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని మోషే మీకివ్వలేదు. పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారాన్ని నా తండ్రే మీకిస్తున్నాడు.
\v 33 ఎందుకంటే దేవుడిచ్చే ఆహారం పరలోకం నుండి దిగి వచ్చి లోకానికంతటికీ జీవాన్నిస్తుంది."
\v 34 అందుకు వాళ్ళు, "ప్రభూ, మాకు ఎప్పుడూ ఈ ఆహారాన్ని ఇస్తూ ఉండు" అన్నారు.
\s5
\p
\v 35 దానికి జవాబుగా యేసు, "జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరకు వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు.
\v 36 మీతో చెప్పాను, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు.
\v 37 తండ్రి నాకు ఇచ్చే వాళ్ళంతా నా దగ్గరకు వస్తారు. ఇక నా దగ్గరకు వచ్చేవాళ్ళను నేను ఎంత మాత్రం నా దగ్గరనుండి తోలివేయను.
\s5
\v 38 నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను.
\v 39 ఆయన నాకు ఇచ్చిన వాళ్ళలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండటమూ, వారందరినీ ఆఖరు దినాన లేపడమూ నన్ను పంపిన వాని ఇష్టం.
\v 40 ఎందుకంటే కుమారుణ్ణి చూసి ఆయనలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందాలన్నదే దేవుని ఇష్టం. ఆఖరు రోజున నేను వాణ్ణి సజీవంగా లేపుతాను."
\s5
\p
\v 41 అప్పుడు 'నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని' అని ఆయన చెప్పినందుకు యూదు నాయకులు సణగడం మొదలు పెట్టారు.
\v 42 "ఈయన యోసేపు కుమారుడైన యేసు కదా? ఇతని తలిదండ్రులు మనకు తెలుసు కదా! 'నేను పరలోకం నుండి వచ్చాన'ని ఎలా చెప్తున్నాడు?" అనుకున్నారు.
\s5
\v 43 యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీలో మీరు సణుక్కోవడం ఆపండి.
\v 44 తండ్రి ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరకు రాలేరు. అలా వచ్చిన వాణ్ణి నేను ఆఖరు రోజున సజీవంగా లేపుతాను.
\v 45 "వారికి దేవుడు ఉపదేశిస్తాడు" అని ప్రవక్తలు రాశారు. కాబట్టి తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడు నా దగ్గరకు వస్తాడు.
\s5
\v 46 దేవుని దగ్గరనుండి వచ్చిన వాడు తప్ప తండ్రిని ఎవరూ చూడలేదు. ఆయన తండ్రిని చూశాడు.
\v 47 ఖచ్చితంగా చెప్తున్నాను. విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడు.
\s5
\v 48 జీవాన్నిచ్చే ఆహారం నేనే.
\v 49 మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు.
\s5
\v 50 పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు.
\v 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే."
\s5
\p
\v 52 యూదులకు కోపం వచ్చింది. "ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు" అంటూ తమలో తాము వాదించుకున్నారు.
\v 53 అప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.
\s5
\v 54 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగే వాడే నిత్యజీవం ఉన్నవాడు.
\v 55 నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం.
\v 56 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండి పోతాడు. నేను అతనిలో ఉండి పోతాను.
\s5
\v 57 సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు.
\v 58 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు."
\v 59 ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూం లోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు.
\s యేసును అనుసరించేవారికి పరీక్ష
\s5
\p
\v 60 ఆయన శిష్యులలో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు "ఇది చాల కష్టమైన బోధ. దీనిని ఎవరు అంగీకరిస్తారు" అని చెప్పుకున్నారు.
\v 61 తన శిష్యులు ఇలా సణుగు కుంటున్నారని యేసుకు తెలిసిపోయింది. ఆయన వారితో ఇలా అన్నాడు, "ఈ మాటలు మీకు కోపం తెప్పించాయా?
\s5
\v 62 మనుష్యకుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు?
\v 63 జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.
\s5
\v 64 కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు." తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు.
\v 65 ఆయన "నా తండ్రి ఆ కృప ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరని ఈ కారణం బట్టి చెప్పాను" అన్నాడు.
\s5
\p
\v 66 ఆ తరువాత ఆయన శిష్యులలో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆయన్ని ఇక ఎప్పుడూఅనుసరించలేదు.
\s పేతురు విశ్వాసపు ఒప్పుకోలు (మత్తయి 16: 13- 20; మార్కు 8: 27- 30; లూకా 9: 18 -21)
\p
\v 67 అప్పుడు యేసు, "మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?" అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.
\v 68 సీమోను పేతురు ఆయనతో, "ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరకు వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి.
\v 69 నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేం విశ్వసించాం. తెలుసుకున్నాం" అని చెప్పాడు.
\s5
\v 70 యేసు వాళ్ళతో, "నేను మీ పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను" అని చెప్పాడు.
\v 71 పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ఆయన పట్టి ఇవ్వబోతున్న సీమోను ఇస్కరియోతు కొడుకైన యూదా గురించి ఆయన ఈ మాట చెప్పాడు.
\s5
\c 7
\s పర్ణశాలల పండుగకు యేసు పయనం (లూకా 9: 51-62)
\p
\v 1 ఆ తర్వాత యేసు గలిలయకు వెళ్లి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెదకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు.
\v 2 ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది.
\s5
\v 3 అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో "నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు.
\v 4 అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్లయితే లోకమంతటికీ తెలిసేలా చేయి. నిన్ను నువ్వే చూపించుకో" అన్నారు.
\s5
\v 5 ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు.
\v 6 అప్పుడు యేసు, "నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
\v 7 లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది.
\s5
\v 8 మీరు పండగకు వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండగకి ఇప్పుడే వెళ్ళను" అని వారితో చెప్పాడు.
\v 9 వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండి పోయాడు.
\s గలిలయ నుండి అంతిమ నిష్క్రమణం
\s5
\p
\v 10 కానీ తన తమ్ముళ్ళు పండగకి వెళ్ళిన తర్వాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా పండగకి వెళ్ళాడు.
\v 11 ఆ ఉత్సవంలో యూదులు 'ఆయన ఎక్కడ ఉన్నాడు' అంటూ ఆయన కోసం వెదకుతూ ఉన్నారు.
\s5
\v 12 ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో "ఆయన మంచివాడు" అన్నారు. మరికొందరు "కాదు. ఆయన ఒక మోసగాడు" అన్నారు.
\v 13 అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు.
\s పర్ణశాలల పండుగలో యేసు
\s5
\p
\v 14 పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్లి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు.
\v 15 ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి "చదువూ సంధ్యా లేనివాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది" అని చెప్పుకున్నారు.
\v 16 దానికి యేసు "నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వానిదే.
\s5
\v 17 దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు.
\v 18 తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి అన్యాయమూ ఉండదు.
\s5
\v 19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. అలాంటి మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు" అన్నాడు.
\v 20 అందుకు ప్రజలంతా "నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?" అన్నారు.
\s5
\v 21 యేసు వారితో "నేనో కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు.
\v 22 మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు.
\s5
\v 23 విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు?
\v 24 బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి" అన్నాడు.
\s5
\p
\v 25 యెరూషలేము వారిలో కొందరు "వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా?
\v 26 చూడండి, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయన్ని ఏమీ అనరు. ఈయనే క్రీస్తని అధికారులకి తెలిసి పోయిందా ఏమిటి?
\v 27 అయినా ఈయన ఎక్కడి వాడో మనకు తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడైతే ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు" అని చెప్పుకున్నారు.
\s5
\p
\v 28 కాబట్టి యేసు దేవాలయములో ఉపదేశిస్తూ "మీకు నేను తెలుసు. నేను ఎక్కడనుండి వచ్చానో మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు.
\v 29 నేను ఆయన దగ్గరనుండి వచ్చాను. ఆయనే నన్ను పంపాడు కాబట్టి నాకు ఆయన తెలుసు" అని గొంతెత్తి చెప్పాడు.
\s5
\v 30 దానికి వాళ్ళు ఆయనను పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు.
\v 31 ప్రజలలో అనేక మంది ఆయనలో విశ్వాసముంచారు. "క్రీస్తు వచ్చినప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడా ఏమిటి" అని వారు చెప్పుకున్నారు.
\v 32 ప్రజలు ఆయనను గురించి ఇలా మాట్లాడుకోవడం పరిసయ్యుల దృష్టికి వెళ్ళింది. అప్పుడు ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆయనను పట్టుకోడానికి సైనికులను పంపించారు.
\s5
\p
\v 33 యేసు మాట్లాడుతూ, "నేను ఇంకా కొంత కాలం మాత్రమే మీతో ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపినవాని దగ్గరకు వెళ్లిపోతాను.
\v 34 అప్పుడు మీరు నన్ను వెదకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు" అన్నాడు.
\s5
\v 35 దానికి యూదులు "మనకు కనిపించకుండా ఈయన ఎక్కడికి వెళ్తాడు? గ్రీసు దేశం వెళ్ళి అక్కడ చెదరి ఉన్న యూదులకు, గ్రీసు వారికి ఉపదేశం చేస్తాడా?
\v 36 'నన్ను వెదకుతారు. కానీ నేను మీకు కనిపించను. నేను ఉండే చోటికి మీరు రాలేరు' అన్న మాటలకి అర్ధం ఏమిటో" అంటూ తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు.
\s పరిశుద్ధాత్మ గురించిన గొప్ప ప్రవచనం (అపో. కా. 2: 2- 4; యోహాను 4: 14)
\s5
\p
\v 37 ఆ పండగలో మహాదినమైన చివరి రోజున యేసు నిలబడి, "ఎవడికైనా దాహం వేస్తె నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోవాలి.
\v 38 లేఖనాలు చెబుతున్నాయి. నాపై విశ్వాసముంచే వాడి కడుపులోనుండి జీవ జలనదులు ప్రవహిస్తాయి" బిగ్గరగా చెప్పాడు.
\s5
\v 39 తనఫై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు.
\s ప్రజల్లో భేదాభిప్రాయాలు
\s5
\p
\v 40 ప్రజలలో కొందరు ఆ మాట విని "ఈయన నిజంగా ఆ ప్రవక్తే" అన్నారు.
\v 41 మరికొందరు "ఈయన క్రీస్తే" అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు "ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా?
\v 42 క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరైన బెత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ గ్రంథాలలో రాసి లేదా?" అన్నారు.
\s5
\v 43 ఈ విధంగా ప్రజలలో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది.
\v 44 వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయను పట్టుకోలేదు.
\s5
\p
\v 45 పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, "మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?" అని అడిగారు.
\v 46 దానికి ఆ సైనికులు "ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు" అని జవాబిచ్చారు.
\s5
\v 47 దానికి పరిసయ్యులు "మీరు కూడా మోస పోయారా?
\v 48 అధికారులలో గానీ పరిసయ్యులలో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా?
\v 49 ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది" అని సైనికులతో అన్నారు.
\s5
\v 50 అంతకు ముందు యేసు దగ్గరకు వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు,
\v 51 "ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?" అన్నాడు.
\v 52 దానికి వారు, "నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు" అన్నారు.
\s5
\v 53 ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.
\s5
\c 8
\s వ్యభిచారంలో దొరికిన స్త్రీ
\p
\v 1 యేసు ఒలీవ కొండకు వెళ్ళాడు.
\v 2 ఉదయం పెందలకడనే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. అప్పుడు ప్రజలంతా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన కూర్చుని వాళ్లకు ఉపదేశించడం మొదలెట్టాడు.
\v 3 అప్పుడు ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ ఒక స్త్రీని తీసికొని వచ్చారు. వాళ్ళు ఆమెను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అందరి మధ్య నిలబెట్టారు.
\s5
\v 4 వాళ్ళు ఆయనతో "బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
\v 5 ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?" అని అడిగారు.
\v 6 ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయన్ని పరీక్షిస్త్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు.
\s5
\v 7 వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, "మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు" అని వాళ్ళతో చెప్పి
\v 8 మరల వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు.
\s5
\v 9 ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలిచే ఉంది.
\v 10 యేసు తలెత్తి ఆమెను చూశాడు. "అమ్మా, వీళ్ళంతా ఎక్కడ? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?" అని అడిగాడు.
\v 11 ఆమె "లేదు ప్రభూ" అంది. దానికి యేసు "నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు" అన్నాడు.
\s పండుగ తరువాత ఉపదేశం: లోకానికి వెలుగు యేసే (యోహాను 1: 9)
\s5
\p
\v 12 మళ్ళీ యేసు ఇలా అన్నాడు, "నేను లోకానికి వెలుగుని. నా వెనక వచ్చేవాడు చీకటిలో జీవించడు. జీవాన్నిచ్చే వెలుగుని కలిగి ఉంటాడు."
\v 13 అప్పుడు పరిసయ్యులు "నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం సరైనది కాదు" అన్నారు.
\s5
\v 14 జవాబుగా యేసు, "నా గురించి నేను సాక్ష్యం చెప్పినా అది సత్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కణ్ణించి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కణ్ణించి వస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు.
\v 15 మీరు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చను.
\v 16 నేను అందులో ఒంటరిని కాదు. నేనూ నన్ను పంపిన నా తండ్రితో కలిసి ఉన్నాను. కాబట్టి ఒకవేళ నేను తీర్పు తీర్చినా అది సత్యమే అవుతుంది.
\s5
\v 17 ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యం అవుతుందని మీ ధర్మశాస్త్రంలోనే రాసి ఉంది కదా!
\v 18 నా గురించి సాక్ష్యం నేను చెప్పుకుంటాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు" అన్నాడు.
\s5
\v 19 వాళ్ళు, "నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?" అని అడిగారు. అందుకు యేసు, "మీకు నేను గానీ నా తండ్రి గానీ తెలియదు. ఒకవేళ నేను మీకు తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉంటాడు" అన్నాడు.
\v 20 ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ చందా పెట్టె ఉన్నచోట ఈ మాటలు చెప్పాడు. ఆయన సమయం రాలేదు కాబట్టి ఎవరూ ఆయన్ని పట్టుకోలేదు.
\s5
\p
\v 21 మరోసారి ఆయన, "నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మీరు నాకోసం వెదకుతారు. కానీ మీ పాపాల్లోనే మీరు మరణిస్తారు. నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు" అని వాళ్ళతో చెప్పాడు.
\v 22 దానికి యూదులు, "'నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు' అంటున్నాడేమిటి? ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి?" అని చెప్పుకున్నారు.
\s5
\v 23 అప్పుడు అయన, "మీరు కింద ఉండేవారు. నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోకానికి సంబంధించిన వారు. నేను ఈ లోకానికి సంబంధించిన వాణ్ణి కాదు.
\v 24 కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే క్రీస్తునని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు" అని వారితో చెప్పాడు.
\s5
\v 25 కాబట్టి వారు, "అసలు నువ్వు ఎవరు?" అని అడిగారు. అప్పుడు ఆయన వాళ్ళతో ఇలా చెప్పాడు, "నేను ప్రారంభం నుండి ఎవరినని మీకు చెబుతూ ఉన్నానో ఆయననే.
\v 26 మీ గురించి చెప్పడానికీ మీకు తీర్పు తీర్చడానికీ నాకు అనేకమైన సంగతులు ఉన్నాయి. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలనే ఈ లోకానికి బోధిస్తున్నాను."
\v 27 తండ్రి అయిన దేవుని గురించి ఆయన తమకు చెబుతున్నాడని వాళ్ళు అర్ధం చేసుకోలేక పోయారు.
\s5
\p
\v 28 కాబట్టి యేసు, "మీరు మనుష్యకుమారుణ్ణి పైకెత్తినప్పుడు 'ఉన్నవాడు' అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. నా స్వంతగా నేను ఏమీ చేయననీ తండ్రి నాకు చెప్పినట్టుగానే ఈ సంగతులు మాట్లాడుతున్నాననీ మీరు గ్రహిస్తారు.
\v 29 నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన వాటినే నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచి పెట్టలేదు" అని చెప్పాడు.
\v 30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే అనేకమంది ఆయనలో నమ్మకముంచారు.
\s5
\v 31 కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, "మీరు నా వాక్కు లో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. సత్యాన్ని గ్రహిస్తారు.
\v 32 అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది" అన్నాడు.
\v 33 అప్పుడు వాళ్ళు "మేము అబ్రాహాము వారసులం. మేం ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. 'మీరు విడుదల పొందుతారు' అని ఎలా అంటున్నావ్?" అన్నారు.
\s5
\v 34 దానికి యేసు, "మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతీ వాడూ పాపానికి బానిసే.
\v 35 బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు.
\v 36 కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు.
\s5
\v 37 మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు.
\v 38 నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినవే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే కార్యాలు చేస్తున్నారు" అని చెప్పాడు.
\s5
\p
\v 39 దానికి వారు, "మా తండ్రి అబ్రాహాము" అన్నారు. అప్పుడు యేసు, "మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు.
\v 40 దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారే. అయితే అబ్రాహాము అలా చేయలేదు.
\v 41 మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు" అని వాళ్ళతో చెప్పాడు. దానికి వాళ్ళు "మేం వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు" అన్నారు.
\s5
\v 42 యేసు వాళ్ళతో ఇలా అన్నాడు, "దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు.
\v 43 నా మాటలు మీరు ఎందుకు అర్ధం చేసుకోవడం లేదు? నా మాట వినడానికి సహించలేక పోవడమే దానికి కారణం.
\v 44 మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వాళ్ళు. మీ తండ్రి దురాశల్ని నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడూ, అబద్ధానికి తండ్రీ.
\s5
\p
\v 45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు.
\v 46 నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు?
\v 47 ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు."
\s5
\v 48 అందుకు యూదులు, "నువ్వు సమరయుడివి, నీకు దయ్యం పట్టింది అని మేం చెబుతున్న మాట నిజమే!" అన్నారు.
\v 49 అప్పుడు యేసు "నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తున్నాను. మీరు నన్ను అవమానిస్తున్నారు.
\s5
\v 50 నేను నా పేరు ప్రతిష్టల కోసం వెదకడం లేదు. అలా వెదికే వాడూ, తీర్పు తీర్చే వాడూ వేరే ఉన్నాడు.
\v 51 మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాటలు అంగీకరించిన వాడు మరణం రుచి చూడడు" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 52 అందుకు యూదులు, "నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మేము నిశ్చయంగా తెలుసుకున్నాం. అబ్రాహామూ, ప్రవక్తలూ చనిపోయారు. 'నా మాట విన్న వాడు మరణం రుచి చూడడని' నువ్వు అంటున్నావ్.
\v 53 మన తండ్రి అయిన అబ్రాహాము చనిపోయాడు కదా! నువ్వు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలూ చనిపోయారు. అసలు నువ్వు ఎవరినని చెప్పుకుంటున్నావు?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 54 అందుకు యేసు, "నన్ను నేనే గౌరవించుకుంటే ఆ గౌరవం అంతా ఒట్టిది. ఎవరిని మా దేవుడు అని మీరు చెప్పుకుంటున్నారో ఆయనే నా తండ్రి. ఆయనే నన్ను గౌరవిస్తున్నాడు.
\v 55 మీకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదు అని నేను చెబితే మీలాగా నేనూ అబద్ధికుడిని అవుతాను. కానీ నాకు ఆయన తెలుసు. ఆయన మాటను నేను పాటిస్తాను.
\v 56 నా రోజును చూడటం మీ తండ్రి అయిన అబ్రాహాముకు సంతోషం. అతడు దానిని చూసి ఎంతో సంతోషించాడు" అన్నాడు.
\s5
\p
\v 57 అందుకు యూదులు, "నీకింకా యాభై సంవత్సరాలు కూడా లేవు. నువ్వు అబ్రాహామును చూశావా?" అన్నారు.
\v 58 దానికి జవాబుగా యేసు, "మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. నేను అబ్రాహాము పుట్టక ముందు నుంచీ ఉన్నాను" అన్నాడు.
\v 59 అప్పుడు వాళ్ళు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీశారు. కానీ యేసు దేవాలయంలో దాగి అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.
\s5
\c 9
\s పుట్టు గుడ్డి వాడు చూపు పొందడం
\p
\v 1 ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు.
\v 2 ఆయన శిష్యులు, "బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తలిదండ్రులు చేసిన పాపమా?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 3 అందుకు యేసు, "వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. కానీ దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డి వాడుగా పుట్టాడు.
\v 4 పగలున్నంత వరకూ నన్ను పంపిన వాని పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు.
\v 5 ఈ లోకంలో ఉన్నంత వరకూ నేను ఈ లోకానికి వెలుగుని" అని చెప్పాడు.
\s5
\v 6 ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు.
\v 7 "సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో" అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు 'వేరొకరు పంపిన వాడు' అని అర్ధం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుగుకొని చూపు పొంది తిరిగి వచ్చాడు.
\s5
\v 8 అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, "వీడు కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!" అన్నారు.
\v 9 "వీడే" అని కొందరూ, "వీడు కాదు" అని కొందరూ అన్నారు. ఇక వాడైతే "అది నేనే" అన్నాడు.
\s5
\p
\v 10 వాళ్ళు. "నీ కళ్ళు ఎలా తెరచుకున్నాయి?" అని వాణ్ణి అడిగారు.
\v 11 దానికి వాడు, "యేసు అనే ఒకాయన బురద చేసి నా కన్నుల పైన పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను" అన్నాడు.
\v 12 వాళ్ళు, "ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అని అడిగితే వాడు "నాకు తెలియదు" అన్నాడు.
\s5
\v 13 ఇంతకు ముందు గుడ్డి వాడిగా ఉన్న ఆ వ్యక్తిని వాళ్ళు పరిసయ్యుల దగ్గరకు తీసుకు వెళ్ళారు.
\v 14 యేసు బురదచేసి వాడి కన్నులు తెరచిన రోజు విశ్రాంతిదినం.
\v 15 వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, "ఆయన నా కన్నులపై బురద ఉంచాడు. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందాను" అని వాళ్ళకు చెప్పాడు.
\s5
\p
\v 16 కాబట్టి "ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గరనుండి రాలేదు" అని పరిసయ్యులలో కొందరు అన్నారు. మరి కొందరు, "ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?" అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది.
\v 17 దాంతో వాళ్ళు గుడ్డివాడుగా ఉన్నవాడితో, "నీ కన్నులు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏంటి?" అని అడిగారు. అప్పుడు వాడు, "ఆయన ఒక ప్రవక్త" అన్నాడు.
\v 18 వాడు గుడ్డి వాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తలిదండ్రులను పిలిపించారు.
\s5
\v 19 "గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడ గలుగుతున్నాడు?" అని వాళ్ళను అడిగారు.
\v 20 దానికి వాడి తలిదండ్రులు, "వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు.
\v 21 అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కన్నులు తెరిచిన దెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకో గలడు" అన్నారు.
\s5
\p
\v 22 వాడి తలిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయన్ని క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సునగోగుల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
\v 23 కాబట్టే వాని తలిదండ్రులు 'వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి' అన్నారు.
\s5
\v 24 కాబట్టి వాళ్ళు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండో సారి పిలిపించారు. "దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు" అని అతనితో అన్నారు.
\v 25 అందుకు వాడు, "ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలియదు. అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను" అన్నాడు.
\s5
\v 26 దానికి వాళ్ళు, "అసలు ఆయన నీకేం చేసాడు? నీ కన్నులు ఎలా తెరిచాడు?" అని మళ్ళీ అడిగారు.
\v 27 దానికి వాడు, "ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 28 అందుకు వారు "నువ్వే వాడి శిష్యుడివి. మేం మోషే శిష్యులం.
\v 29 దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడినుండి వచ్చాడో కూడా తెలియదు" అంటూ వాణ్ణి బాగా తిట్టారు.
\s5
\v 30 అయితే వాడు, "ఆయన ఎక్కడినుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు.
\v 31 దేవుడు పాపుల ప్రార్థనలను వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు.
\s5
\v 32 గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం ప్రారంభం నుండీ ఎవరూ వినలేదు.
\v 33 ఈయన దేవుని దగ్గర నుండి రాకపోయినట్లయితే ఇలాంటివి ఏమీ చేయలేడు" అని చెప్పాడు.
\v 34 దానికి వాళ్ళు, "పాపిగా పుట్టినవాడివి, నువ్వు మాకు బోధ చేస్తున్నావా?" అని చెప్పి వాణ్ణి తమ సునగోగు నుండి బహిష్కరించారు.
\s5
\p
\v 35 పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కనుగొని, "నువ్వు దేవుని కుమారునిలో విశ్వాసముంచుతున్నావా?" అని వాణ్ణి అడిగాడు.
\v 36 అందుకు వాడు "ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే" అన్నాడు.
\v 37 యేసు, "ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని" అన్నాడు.
\v 38 అప్పుడు వాడు, "’నేను నమ్ముతున్నాను ప్రభూ" అంటూ ఆయనను ఆరాధించాడు.
\s5
\p
\v 39 అప్పుడు యేసు, "'చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను" అన్నాడు.
\v 40 ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, "అయితే మేం కూడా గుడ్డివాళ్ళమేనా?" అని అడిగారు.
\v 41 అందుకు యేసు, "మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ 'మాకు చూపు ఉంది' అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది" అని చెప్పాడు.
\s5
\c 10
\s మంచి కాపరి గురించిన ఉపదేశం (కీర్తన 23; హెబ్రీ 13:20; 1 పేతురు 5:4)
\p
\v 1 మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం ద్వారా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
\v 2 ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.
\s5
\v 3 అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెల్ని అతను పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
\v 4 తన సొంత గొర్రెల్ని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతను నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
\s5
\v 5 వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా తప్పుకుంటాయి.
\v 6 యేసు ఈ ఉదాహరణ ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్ధం కాలేదు.
\s5
\v 7 అందుకు యేసు మళ్ళీ వాళ్ళతో ఇలా అన్నాడు, "మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే
\v 8 నా ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వాళ్ళ మాట వినలేదు.
\s5
\v 9 నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చిక కలిగి ఉంటాడు.
\v 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృధ్ధిగా కలగాలని నేను వచ్చాను.
\s5
\p
\v 11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.
\v 12 జీతం కోసం పనిచేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెల్ని వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెల్ని పట్టుకొని చెదరగొడుతుంది.
\v 13 జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెల్ని పట్టించుకోకుండా పారిపోతాడు.
\s5
\v 14 నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
\v 15 నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం నా ప్రాణం పెడతాను.
\v 16 ఈ శాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.
\s5
\v 17 నా ప్రాణం మళ్ళీ పొందడానికి దానిని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
\v 18 నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. దానిని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను."
\s5
\p
\v 19 ఈ మాటలవల్ల యూదులలో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
\v 20 వాళ్ళలో చాలా మంది, "ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?" అన్నారు.
\v 21 ఇంకొంతమంది, "ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?" అన్నారు.
\s యేసు తన దైవత్వాన్ని రూఢి పరచడం (యోహాను 14:9; 20: 28, 29)
\s5
\p
\v 22 ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది.
\v 23 అది చలికాలం. అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
\v 24 యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. "ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు" అన్నారు.
\s5
\v 25 అందుకు యేసు వాళ్ళతో ఇలా అన్నాడు, "నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
\v 26 అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.
\s5
\v 27 నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి
\v 28 నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని నా చేతిలోనుంచి ఎవ్వరూ ఎత్తుకుపోరు.
\s5
\v 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవ్వరూ వాటిని ఎత్తుకుపోలేరు.
\v 30 నేను, నా తండ్రి, ఒకటే!"
\p
\v 31 అప్పుడు యూదులు ఆయన్ని కొట్టడానికి రాళ్ళు పట్టుకొన్నారు.
\s5
\v 32 యేసు వాళ్ళతో, "తండ్రి నుంచి వచ్చిన ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?" అన్నాడు.
\v 33 అందుకు యూదులు, "నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 34 యేసు వాళ్లకు జవాబిస్తూ ఇలా అన్నాడు, "'మీరు దేవుళ్ళని నేనన్నాను' అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?
\v 35 లేఖనం వ్యర్ధంగా ఉండదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వాళ్ళని ఆయన దేవుళ్ళని పిలిస్తే,
\v 36 తండ్రి పవిత్రంగా యీ లోకంలోకి పంపినవాడు 'నేను దేవుని కుమారుణ్ణి' అని అంటే 'నువ్వు దేవదూషణ చేస్తున్నావు' అని మీరు అంటారా?
\s5
\v 37 నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి,
\v 38 అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలిసికొని అర్ధంచేసుకునేందుకు ఆ పనులను నమ్మండి."
\v 39 వాళ్ళు మళ్ళీ ఆయన్ని పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వాళ్ళ చేతిలోనుండి తప్పించుకున్నాడు.
\s5
\p
\v 40 యేసు మళ్ళీ యోర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తీసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
\v 41 చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారు. వారు, "యోహాను ఏ సూచక క్రియలను చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే" అన్నారు.
\v 42 అక్కడ చాలా మంది యేసుని నమ్మారు.
\s5
\c 11
\s లాజరు చనిపోయి బ్రతకడం
\p
\v 1 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త, ఆ గ్రామానికి చెందిన వాళ్ళే.
\v 2 ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ సోదరుడు లాజరు జబ్బుగా ఉన్నాడు.
\s5
\v 3 "ప్రభువా, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది" అని అక్క చెల్లెళ్ళు యేసుకు కబురు పంపించారు.
\v 4 యేసు అది విని, "ఈ జబ్బు చావు కోసం రాలేదు. దీని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది" అన్నాడు.
\s5
\v 5 మార్త, ఆమె సోదరి, లాజరులను యేసు ప్రేమించాడు.
\v 6 లాజరు జబ్బు పడ్డాడని యేసు విన్నప్పుడు, ఆయన ఉన్న స్థలంలోనే ఇంకొక రెండు రోజులు ఉండిపోయాడు.
\v 7 దాని తరువాత ఆయన తన శిష్యులతో, "మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి" అన్నాడు.
\s5
\v 8 ఆయన శిష్యులు ఆయనతో, "రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తావా?" అని అన్నారు.
\v 9 అందుకు యేసు జవాబిస్తూ, "పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతను వెలుగులో అన్నీ చూస్తాడు.
\s5
\v 10 అయితే ఒకడు రాత్రివేళ నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి తడబడతాడు" అని చెప్పాడు.
\v 11 యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, "మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను."
\s5
\v 12 అందుకు శిష్యులు ఆయనతో, "ప్రభువా, అతను నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు" అన్నారు.
\v 13 యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వాళ్ళు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు.
\v 14 అప్పుడు యేసు వాళ్ళతో స్పష్టంగా "లాజరు చనిపోయాడు,
\s5
\v 15 నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి" అన్నాడు.
\v 16 దిదుమ అనే మరొక పేరు ఉన్న తోమా, "యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి" అని తన తోటి శిష్యులతో అన్నాడు.
\s5
\p
\v 17 యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకొన్నాడు.
\v 18 బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
\v 19 చాలామంది యూదులు మార్త మరియలను వాళ్ళ సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు.
\v 20 అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయన్ని ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
\s5
\v 21 అప్పుడు మార్త యేసుతో, "ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు,
\v 22 ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు" అంది.
\v 23 యేసు ఆమెతో, "నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు" అన్నాడు.
\s5
\v 24 మార్త ఆయనతో, "చివరి రోజున పునరుత్థానంలో బ్రతికి లేస్తాడని నాకు తెలుసు" అంది.
\v 25 అందుకు యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
\v 26 బతికి ఉండి నన్ను నమ్మినవాళ్ళు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?" అన్నాడు.
\s5
\v 27 ఆమె, "అవును ప్రభువా, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను" అని ఆయనతో చెప్పింది.
\v 28 ఈ మాట చెప్పిన తరువాత, వెళ్లి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, "బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు" అంది.
\v 29 మరియ ఇది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరకు వెళ్ళింది.
\s5
\p
\v 30 యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తని కలుసుకున్న చోటే ఉన్నాడు.
\v 31 మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు, ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి, ఆమె వెంట వెళ్లారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరకు వెళ్తూ ఉందని వాళ్ళు అనుకున్నారు.
\v 32 అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయన్ని చూసి, ఆయన కాళ్ళమీద పడి, "ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు" అంది.
\s5
\v 33 ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, "అతణ్ణి ఎక్కడ పెట్టారు?" అన్నాడు.
\v 34 వాళ్ళు, "ప్రభువా, వచ్చి చూడు" అన్నారు.
\v 35 యేసు ఏడ్చాడు.
\s5
\v 36 అప్పుడు యూదులు, "ఆయన లాజరుని ఎంతగా ప్రేమించాడో చూడండి" అని చెప్పుకున్నారు.
\v 37 వారిలో కొంతమంది, "గుడ్డివాని కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?" అన్నారు.
\s లాజరు సమాధి దగ్గర యేసు
\s5
\p
\v 38 యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరకు వెళ్ళాడు.
\v 39 యేసు, "రాయి తీసి వెయ్యండి" అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, "ప్రభువా, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది" అంది.
\v 40 యేసు ఆమెతో, "నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?" అన్నాడు.
\s5
\v 41 కాబట్టి వాళ్ళు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, "తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు.
\v 42 నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను" అన్నాడు.
\s5
\v 43 ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, "లాజరూ, బయటికి రా!" అన్నాడు.
\v 44 చనిపోయినవాడు కాళ్లు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వాళ్ళతో, "అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి" అన్నాడు.
\s బేతని మరియ స్నేహితులు యేసుపై విశ్వాసముంచడం (లూకా 10: 38- 42; యోహాను 12: 1- 7)
\s5
\p
\v 45 అప్పుడు మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయన్ని నమ్మారు, కాని
\v 46 వాళ్ళల్లో కొంతమంది వెళ్లి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు.
\s 47 యేసును సంహరించాలని పరిసయ్యుల కుట్ర
\s5
\p
\v 47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరచి, "మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
\v 48 మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకు పోతారు" అన్నారు.
\s5
\v 49 అయితే, వాళ్ళలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వాళ్ళతో, "మీకేమీ తెలియదు.
\v 50 మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు" అన్నాడు.
\s5
\v 51 అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు. గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతను ప్రవచించాడు.
\v 52 ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదిరిపోయిన దేవుని పిల్లల్ని ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని ప్రవచించాడు.
\v 53 కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వాళ్ళు ఆలోచన చేస్తూ వచ్చారు.
\s5
\p
\v 54 అందుచేత యేసు అప్పటినుంచి యూదులలో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి ఎడారి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు.
\v 55 యూదుల పస్కాపండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు.
\s5
\v 56 వాళ్ళు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, "మీరేమంటారు? ఆయన పండగకు రాడా?"
\v 57 యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయన్ని పట్టుకోవడం కోసం, వాళ్లకు తెలియచేయాలని ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.
\s5
\c 12
\s బేతనిలో రాత్రి భోజనం (మత్తయి 26: 6- 13; మార్కు 14: 3- 9; లూకా 7: 37- 38)
\p
\v 1 పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే.
\v 2 అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు.
\v 3 అప్పుడు మరియ, అర కిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన అత్యంత ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది.
\s5
\v 4 ఆయన్ని అప్పగించ బోతున్నవాడూ, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా,
\v 5 "ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?" అన్నాడు.
\v 6 అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు గాని, అతడొక దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు.
\s5
\v 7 యేసు, "ఈమెను చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీనిని సిద్ధపరచింది.
\v 8 పేదవాళ్ళు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా" అన్నాడు.
\s5
\p
\v 9 అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు.
\v 10 లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళిపోయి యేసు మీద నమ్మకం ఉంచారు.
\v 11 కాబట్టి ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు.
\s జయ ప్రవేశం (మత్తయి 21: 4- 9; మార్కు 11: 7- 10; లూకా 19: 35- 38)
\s5
\p
\v 12 ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు,
\v 13 వారంతా ఖర్జూరపు మట్టలు తీసికొని ఆయనకు ఎదురుగా వెళ్లి, "హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగుతుంది గాక!" అని కేకలు వేశారు.
\s5
\v 14 "సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిదపిల్ల మీద కూర్చుని వస్తున్నాడు"
\v 15 అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు.
\s5
\v 16 ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వాళ్ళు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు.
\s5
\p
\v 17 ఆయన లాజరును సమాధిలోనుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు.
\v 18 ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయన్ని కలుసుకోడానికి వెళ్ళారు.
\v 19 దీనిగురించి పరిసయ్యులు "చూడండి, మనం ఏమీ చెయ్యలేం. ఈ లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది." అని తమలో తాము చెప్పుకున్నారు.
\s యేసును చూడగోరిన గ్రీకులు
\s5
\p
\v 20 ఆ పండగలో ఆరాధించడానికి వచ్చినవారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు.
\v 21 వాళ్ళు, గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, "అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది" అన్నారు.
\v 22 ఫిలిప్పు వెళ్లి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్లి యేసుతో చెప్పారు.
\s యేసు జవాబు
\s5
\p
\v 23 యేసు వాళ్లకు జవాబిస్తూ, "మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది.
\v 24 మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది.
\s5
\v 25 తన ప్రాణాన్ని ప్రేమించుకునే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.
\v 26 నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.
\s5
\v 27 ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? 'తండ్రీ! ఈ గడియ నుంచి నన్ను తప్పించు' అని చెప్పనా? కాని, దీనికోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను.
\v 28 తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో." అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, "నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను."
\v 29 అప్పుడు, అక్కడ నిలుచుని విన్న జనసమూహం, "ఉరిమింది" అన్నారు. మిగతా వాళ్ళు, "ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు" అన్నారు.
\s5
\p
\v 30 అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, "ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది.
\v 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం.
\s5
\v 32 నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, ప్రజలందరిని నా దగ్గరకు ఆకర్షించుకుంటాను."
\v 33 ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు.
\s5
\v 34 ఆ జనసమూహం ఆయనతో, "క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. 'మనుషకుమారుణ్ణి పైకెత్తడం జరగాలి' అని నువ్వెలా చెబుతావు? ఈ మనుషకుమారుడు ఎవరు?" అన్నారు.
\v 35 అప్పుడు యేసు వాళ్ళతో, "వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచేవానికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.
\v 36 మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి" అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్లి వాళ్ళకు కనబడకుండా రహస్యంగా ఉన్నాడు.
\s5
\p
\v 37 యేసు వాళ్ళ ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వాళ్ళు ఆయన్ని నమ్మలేదు.
\q1
\v 38 ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?"
\p అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.
\s5
\v 39 ఈ కారణంగా వాళ్ళు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మళ్ళీ ఇలా అన్నాడు,
\q1
\v 40 "ఆయన వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలగచేశాడు. ఆయన వాళ్ళ హృదయాలను కఠినం చేశాడు.
\q1 అలా చెయ్యకపోతే వాళ్ళు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి,
\q1 నా వైపు తిరిగేవాళ్ళు.
\q1 అప్పుడు నేను వాళ్ళని బాగు చేసేవాణ్ణి."
\s5
\p
\v 41 యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు.
\v 42 అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సునగోగులోనుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు.
\v 43 వాళ్ళు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.
\s5
\p
\v 44 అప్పుడు యేసు పెద్ద స్వరంతో, "నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవానిలో కూడా నమ్మకం ఉంచుతాడు.
\v 45 నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు.
\s5
\v 46 నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకుండా ఉండాలని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను.
\v 47 ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను కాని, తీర్పు తీర్చడానికి కాదు.
\s5
\v 48 నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.
\v 49 ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు.
\v 50 ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను" అన్నాడు.
\s5
\c 13
\s చివరి రాత్రి భోజనం (మత్తయి 26: 7-30; మార్కు 14: 17- 26; లూకా 22: 14- 29)
\p
\v 1 అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వాళ్ళను ఆయన ప్రేమించాడు. చివరి వరకు వాళ్ళని ప్రేమించాడు.
\s యేసు తన శిష్యుల పాదాలు కడగడం
\p
\v 2 యేసును అప్పగించాలని సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో అప్పటికే సాతాను ఆ ఉద్దేశం పెట్టాడు.
\s5
\v 3 తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ, యేసుకు తెలుసు.
\v 4 ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసికొని, దానిని నడుముకు చుట్టుకున్నాడు.
\v 5 అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు.
\s5
\p
\v 6 ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, "ప్రభువా, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?" అన్నాడు.
\v 7 యేసు అతనికి జవాబిస్తూ, "నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్ధం కాదు. కాని, నువ్వు తరువాత అర్ధం చేసుకుంటావు" అన్నాడు.
\v 8 పేతురు ఆయనతో, "నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు" అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, "నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు" అన్నాడు.
\v 9 సీమోను పేతురు ఆయనతో, "ప్రభువా, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు" అన్నాడు.
\s5
\v 10 యేసు అతనితో, "స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతను పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\v 11 ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, "మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\s5
\v 12 యేసు వాళ్ళ కాళ్ళు కడిగి, ఆయన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వాళ్ళతో, "నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా?
\v 13 మీరు నన్ను 'బోధకుడు, 'ప్రభువు' అని సరిగానే పిలుస్తున్నారు.
\v 14 బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి.
\v 15 నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను.
\s5
\p
\v 16 నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వానిని పంపినవానికన్నా గొప్పవాడు కాదు.
\v 17 ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.
\v 18 మీ అందరి గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఎంపిక చేసిన వాళ్ళు నాకు తెలుసు. అయితే, లేఖనం సంపూర్ణం అయ్యేలా ఇది చెబుతున్నాను, 'నా రొట్టె తినేవాడు నాకు వ్యతిరేకంగా తన మడం ఎత్తాడు.'
\s5
\v 19 అది జరగక ముందే, ఇప్పుడు దీనిని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు, నేను 'ఉన్నవాడను' అని మీరు నమ్మాలని నా ఉద్దేశం.
\v 20 నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. నన్ను స్వీకరించినవాడు నేను ఎవరిని పంపినా స్వీకరిస్తాడు. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపినవాణ్ణీ స్వీకరిస్తాడు.
\s యేసు తనను శత్రువులకు పట్టిస్తారని ముందుగా చెప్పడం (మత్తయి 26: 20-25; మార్కు 14: 17- 21; లూకా 22: 21, 22)
\s5
\p
\v 21 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, "మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\v 22 ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
\s5
\v 23 భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యులలో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు.
\v 24 ఎవరి గురించి యేసు అలా అన్నాడో తమకు చెప్పమని సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేశాడు.
\v 25 ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఆయనతో, "ప్రభువా, ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగాడు.
\s5
\v 26 అప్పుడు యేసు జవాబిస్తూ, "ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే" అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు.
\v 27 అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో , "నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి" అన్నాడు.
\s5
\v 28 ఆయన అతనితో ఇలా ఎందుకు చెప్పాడో, బల్ల దగ్గర ఉన్నవాళ్ళకు తెలియలేదు.
\v 29 డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి యేసు అతనితో, "పండగకు కావలసినవి కొను" అని గాని, పేదవాళ్ళకు ఇమ్మని గాని చెప్పాడని వాళ్ళల్లో కొంతమంది అనుకున్నారు.
\v 30 అది రాత్రి సమయం. అతను ఆ రొట్టె ముక్క తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 31 యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, "ఇప్పుడు మనుషకుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు" అన్నాడు.
\v 32 దేవుడు ఆయనకు ఆయనలోనే మహిమ కలిగిస్తాడు. ఆయనకు వెంటనే మహిమ కలిగిస్తాడు.
\v 33 పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, 'నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.'
\s5
\v 34 మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి.
\v 35 మీరు ఒకనిపట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలిసికొంటారు" అన్నాడు.
\s యేసును గురించి పేతురు చెప్పనున్న అబద్ధాన్ని గురించి యేసు ముందుగా చెప్పడం (మత్తయి 26: 33-35; మార్కు 14: 29-31; లూకా 22: 33,34)
\s5
\p
\v 36 సీమోను పేతురు ఆయనతో, "ప్రభువా, నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అన్నాడు. యేసు జవాబిస్తూ, "నేను వెళ్ళే స్థలానికి నువ్వు నా వెంట రాలేవు, కాని నువ్వు తరువాత వస్తావు" అన్నాడు.
\v 37 అందుకు పేతురు, " ప్రభువా, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను" అన్నాడు.
\v 38 యేసు జవాబిస్తూ, "నా కోసం నీ ప్రాణం పెడతావా? నేను నీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు" అన్నాడు.
\s5
\c 14
\s పస్కా భోజనగదిలో మాటలు: తన వారికోసం వస్తానని యేసు అభయం (1 తెస్స 4: 14- 17)
\p
\v 1 "మీ హృదయం కలవరపడనీయ వద్దు. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. నన్నూ నమ్మండి.
\v 2 నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను.
\v 3 నేను వెళ్లి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను.
\s5
\v 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు" అన్నాడు.
\v 5 తోమా యేసుతో, "ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?" అన్నాడు.
\v 6 యేసు అతనితో, "నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరకు రారు.
\s యేసూ తండ్రీ ఒక్కటే
\p
\v 7 మీరు నన్ను తెలుసుకొని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయన్ని మీరు చూశారు" అన్నాడు.
\s5
\v 8 ఫిలిప్పు యేసుతో, "ప్రభువా, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు" అన్నాడు.
\v 9 యేసు అతనితో, ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. 'తండ్రిని చూపించు' అని నువ్వు ఎలా అంటున్నావు?
\s5
\v 10 నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడంలేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు.
\v 11 తండ్రిలో నేను, నాలో తండ్రి, ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నమ్మండి.
\s5
\v 12 నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నా మీద, నేను చేసే క్రియల మీద, నమ్మకం ఉంచినవాడు, తాను కూడా ఈ క్రియలు చేస్తాడు. నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు.
\s ప్రార్థన గురించిన కొత్త వాగ్దానం
\p
\v 13 తండ్రికి తన కుమారునిలో మహిమ కలగడం కోసం, మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
\v 14 మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
\s5
\v 15 మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.
\s ఆత్మను గురించిన వాగ్దానం
\p
\v 16 నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. ఆయన సత్యం అయిన ఆత్మ.
\v 17 లోకం ఆయన్ని చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయన్ని స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు.
\s5
\v 18 నేను మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను. కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు.
\v 19 కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.
\v 20 నేను నా తండ్రిలో, మీరు నాలో, ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకొంటారు.
\s5
\v 21 నా ఆజ్ఞలను కలిగి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్నుఅతనికి ప్రత్యక్ష్యం చేసుకుంటాను" అన్నాడు.
\v 22 యూదా (ఇస్కరియోతు కాదు) యేసుతో, "ప్రభువా, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్ష్యం చేసుకోడానికి కారణం ఏంటి?" అన్నాడు.
\s5
\v 23 యేసు జవాబిస్తూ, "ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేం అతని దగ్గరకు వచ్చి అతనితో సహనివాసం చేస్తాం,
\v 24 నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.
\s5
\v 25 మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను.
\v 26 నా తండ్రి నా పేరిట పంపే ఆదరణ కర్త అయిన పవిత్రాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.
\s శాంతి ప్రదాత యేసు
\p
\v 27 శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.
\s5
\v 28 'నేను వెళ్లిపోతున్నాను గాని మీ దగ్గరకు తిరిగి వస్తాను' అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషించేవాళ్ళే. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు.
\v 29 ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.
\v 30 ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు.
\v 31 నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం."
\s5
\c 15
\s తోటకు వెళ్ళే దారిలో చెప్పిన మాటలు; ద్రాక్ష చెట్టు, దాని తీగెలు
\p
\v 1 "నేను నిజమైన ద్రాక్ష తీగ. నా తండ్రి ద్రాక్ష రైతు.
\v 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దానిని శుభ్రం చేస్తాడు.
\s5
\v 3 నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు అయ్యారు.
\v 4 నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు.
\s5
\v 5 ద్రాక్ష తీగ నేను, కొమ్మలు మీరు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.
\v 6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. మనుషులు ఆ కొమ్మల్ని పోగుచేసి మంటలో వేసేస్తారు. అవి కాలిపోతాయి.
\v 7 మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది.
\s5
\v 8 మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.
\v 9 తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి.
\s5
\v 10 నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు.
\v 11 మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం సంపూర్తి అవ్వాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను.
\s5
\v 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ.
\v 13 స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు.
\s5
\v 14 నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే, మీరు నాకు స్నేహితులు.
\s నూతన సాన్నిహిత్యం
\p
\v 15 ఇక మిమ్మల్ని దాసులు అని నేను పిలవను. ఎందుకంటే దాసునికి యజమానుడు చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవి అన్నీ మీకు తెలియ చేశాను.
\s5
\v 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్లి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను.
\v 17 మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
\s విశ్వాసి, లోకం
\s5
\p
\v 18 ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి.
\v 19 మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరుపరిచాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
\s5
\p
\v 20 'దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు' అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వాళ్ళు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు.
\v 21 వాళ్ళకు నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు.
\v 22 నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఉండకపోతే, వాళ్ళకు పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వాళ్ళ పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు.
\s5
\p
\v 23 నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడ ద్వేషిస్తున్నాడు.
\v 24 ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వాళ్లకు పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వాళ్ళు నన్నూ, నా తండ్రినీ చూశారు, ద్వేషిస్తున్నారు కూడా.
\v 25 'కారణం లేకుండా నన్ను ద్వేషించారు' అని వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది.
\s విశ్వాసి, ఆత్మ
\s5
\p
\v 26 తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరకు నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు.
\v 27 మీరు మొదటనుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరుకూడా సాక్షులుగా ఉన్నారు.
\s5
\c 16
\s హింసల గురించి శిష్యులకు హెచ్చరికలు (మత్తయి 24: 9, 10; లూకా 21: 16- 19)
\p
\v 1 "మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడుతున్నాను.
\v 2 వారు మిమ్మల్ని సునగోగుల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవాళ్ళు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది.
\s5
\v 3 నేను గాని, తండ్రిగాని వాళ్లకు తెలియదు కాబట్టి అలా చేస్తారు.
\v 4 అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు.
\s5
\v 5 అయితే ఇప్పుడు నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, 'నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?' అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు గాని
\v 6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఖం ఉంది.
\s లోకం కోసం ఆత్మ చేసే మూడు విధాల పరిచర్య
\p
\v 7 అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. కాని నేను వెళ్తే, ఆయన్ని మీ దగ్గరకు పంపిస్తాను.
\s5
\p
\v 8 ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి, లోకాన్ని ఒప్పిస్తాడు.
\v 9 ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు కాబట్టి పాపం గురించి ఒప్పిస్తాడు
\v 10 నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు కాబట్టి, నీతి గురించి ఒప్పిస్తాడు
\v 11 ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు కాబట్టి తీర్పును గురించి ఒప్పిస్తాడు.
\s ఆత్మ వెల్లడించ నున్న నూతన సత్యం
\s5
\p
\v 12 నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్ధం చేసుకోలేరు.
\v 13 అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని పూర్తి సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.
\v 14 ఆయన నా వాటిని తీసికొని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు.
\s5
\v 15 నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసికొని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.
\s యేసు తన మరణ, పునరుత్థానాల గురించీ, రెండవ రాక గురించీ ప్రవచించడం
\p
\v 16 కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు."
\s5
\p
\v 17 ఆయన శిష్యులలో కొంతమంది "'కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు,' ఇంకా, 'నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను,' అంటున్నాడు, ఇది ఏంటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు,
\v 18 కాబట్టి వాళ్ళు, "కొద్ది కాలం అంటే ఆయన అర్ధం ఏంటి?, ఆయన ఏం చెబుతున్నాడో మాకు తెలియడం లేదు" అన్నారు.
\s5
\v 19 వాళ్ళు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వాళ్ళతో, "'కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు' అని నేను అన్నదానికి అర్ధం ఏంటని ఆలోచిస్తున్నారా?
\v 20 నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది.
\v 21 స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు.
\s5
\p
\v 22 అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు.
\v 23 ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో ఖచ్చింతంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు.
\v 24 ఇంతవరకు నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు.
\s5
\v 25 ఈ సంగతులు ఇంతవరకు తేలికగా అర్ధంకాని భాషలో మీకు చెప్పాను. ఇప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను.
\s5
\v 26 ఆ రోజున మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడంలేదు.
\v 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
\v 28 నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను" అన్నాడు.
\s5
\p
\v 29 ఆయన శిష్యులు, "చూడు, ఇప్పుడు నువ్వు అర్ధం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు.
\v 30 నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేం తెలుసుకున్నాం. దీనివలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేం నమ్ముతున్నాం" అన్నారు.
\v 31 యేసు జవాబిస్తూ, "మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? అన్నాడు.
\s5
\v 32 మీరందరూ ఎవరి ఇంటికి వాళ్ళు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు.
\v 33 నన్నుబట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు శ్రమ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను."
\s5
\c 17
\s విజ్ఞాపన ప్రార్థన
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, "తండ్రీ, సమయం వచ్చింది.
\v 2 నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారునికి మహిమ కలిగించు. నువ్వు నీ కుమారునికి అప్పగించిన వాళ్ళందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు.
\s5
\v 3 ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.
\v 4 నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమిమీద నీకు మహిమ కలిగించాను.
\v 5 తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీతోపాటు అలాంటి మహిమ నాకు కలిగించు.
\s5
\v 6 లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వాళ్లకు నిన్ను వెల్లడి చేశాను. వాళ్ళు నీ వాళ్ళు. నువ్వు వాళ్ళను నాకు అప్పగించావు. వాళ్ళు నీ వాక్కు పాటించారు.
\v 7 నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వాళ్లకు తెలుసు.
\v 8 ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వాళ్లకు ఇచ్చాను. వాళ్ళు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు.
\s5
\p
\v 9 నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి, వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తున్నాను.
\v 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. వాళ్ళలో నాకు మహిమ కలిగింది.
\v 11 నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన పేరును బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వాళ్ళూ ఏకంగా ఉండేలా వాళ్ళని కాపాడు.
\s5
\v 12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ పేరును బట్టి వాళ్ళను కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వాళ్ళను సంరక్షించాను.
\v 13 ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళలో సంపూర్తి అవ్వాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.
\v 14 వాళ్లకు నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వాళ్ళు కూడా ఈ లోకానికి చెందినవాళ్ళు కాదు కాబట్టి ఈ లోకం వాళ్ళను ద్వేషించింది.
\s5
\v 15 నువ్వు ఈ లోకంలో నుంచి వాళ్ళని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
\v 16 నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వాళ్ళు కూడా లోకానికి చెందినవాళ్ళు కాదు.
\v 17 సత్యం ద్వారా వాళ్ళని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.
\s5
\p
\v 18 నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వాళ్ళని ఈ లోకంలోకి పంపించాను.
\v 19 వాళ్ళు సత్యం ద్వారా పవిత్రం అవ్వాలని, వాళ్ళ కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.
\s5
\v 20 నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే,
\v 21 వాళ్ళు మనలో ఏకమై ఉండాలని వాళ్ళ కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు గాని, వాళ్ళ మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
\s5
\v 22 మనం ఏకమై ఉన్నట్టే, వాళ్ళు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను, నేను వాళ్ళకు ఇచ్చాను.
\v 23 వాళ్ళలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వాళ్ళు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వాళ్ళను కూడా ప్రేమించావని, లోకం తెలుసుకునేలా, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వాళ్లకు ఇచ్చాను.
\s5
\p
\v 24 తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వాళ్ళు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వాళ్ళు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమి పునాదికి ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు.
\s5
\v 25 నీతిమంతుడవైన తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు.
\v 26 నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వాళ్ళలో ఉండాలనీ, నేను వాళ్ళలో ఉండాలనీ, నిన్ను వాళ్లకు తెలియచేశాను. ఇంకా తెలియచేస్తాను."
\s5
\c 18
\s గేత్సేమనే లో యేసు (మత్తయి 26: 36-46; మార్కు 14: 32-42; లూకా 22: 39-46)
\p
\v 1 యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు.
\s ద్రోహం, అరెస్టు కావడం (మత్తయి 26: 47-56; మార్కు 14: 43- 50; లూకా 22: 47-53)
\p
\v 2 యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయన్ని పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు.
\v 3 అతడు సైనికుల గుంపును, ప్రధాన యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంటతీసుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు.
\s5
\v 4 అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వాళ్ళతో, "మీరు ఎవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు.
\v 5 వారు "నజరేతు వాడైన యేసు" అని జవాబిచ్చారు. యేసు వాళ్ళతో, "నేనే ఆయన్ని" అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు.
\s5
\v 6 ఆయన వాళ్ళతో, "నేనే" అని చెప్పినప్పుడు వాళ్ళు వెనక్కి జరిగి, నేల మీద పడ్డారు.
\v 7 ఆయన మళ్ళీ, "మీరు ఎవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు. వాళ్ళు మళ్ళీ, "నజరేతు వాడైన యేసు కోసం" అన్నారు.
\s5
\v 8 యేసు వాళ్ళతో, "ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళను వెళ్లిపోనివ్వండి" అన్నాడు.
\v 9 "నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళల్లో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు" అన్న వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు.
\s5
\v 10 అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడిచెవి తెగ నరికాడు.
\v 11 ఆ సేవకుడి పేరు మల్కు. యేసు పేతురుతో, "కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?" అన్నాడు.
\s ప్రధాన యాజకుని ఎదుట యేసు(మత్తయి 26; 57- 68; మార్కు 14: 53-65; లూకా 22: 66- 71)
\s5
\p
\v 12 అప్పుడు సైనికుల గుంపు, వాళ్ళ అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని, బంధించారు. మొదట ఆయన్ని అన్న దగ్గరకు తీసుకువెళ్ళారు.
\v 13 అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ.
\v 14 ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.
\s యేసు ఎవరో తెలియదని పేతురు నిరాకరణ (మత్తయి 26: 69- 75; మార్కు 14: 66- 72; లూకా 22: 54- 62)
\s5
\p
\v 15 సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసు వెంట వెళ్ళారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతను ప్రధాన యాజకుని యింటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు.
\v 16 కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతుర్ని లోపలికి తీసుకొచ్చాడు.
\s5
\v 17 గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసీ పేతురుతో, "నువ్వు ఇతని శిష్యుల్లో ఒకడివి కదూ?" అంది. అతడు "కాదు" అన్నాడు.
\v 18 చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలికాచుకొంటున్నారు. పేతురు కూడా వాళ్ళతో నిలుచుని చలికాచుకొంటున్నాడు.
\s5
\p
\v 19 ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు.
\v 20 యేసు జవాబిస్తూ, "నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ ప్రాంగణాలలో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు.
\v 21 నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్నవాళ్ళని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు" అన్నాడు.
\s5
\v 22 యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, "ప్రధాన యాజకునికి నువ్వు జవాబిచ్చే విధానం అదేనా?" అన్నాడు.
\v 23 యేసు అతనికి జవాబిస్తూ, "నేను ఏదైనా చెడు మాట్లాడి ఉంటే, ఆ చెడు ఏంటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?" అన్నాడు.
\v 24 తరువాత అన్న, బంధించి ఉన్న యేసును ప్రదాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.
\s5
\v 25 అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. ప్రజలు అతనితో, "నువ్వు కూడా అతని శిష్యులలో ఒకడివి కాదా?" అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. "కాదు" అన్నాడు.
\v 26 పేతురు చెవి తెగ నరికినవాని బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, "నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?" అన్నాడు.
\v 27 పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది.
\s పిలాతు ఎదుట యేసు (మత్తయి 27: 1- 4; మార్కు 15: 1- 5; లూకా 23: 1-7, 13, 16)
\s5
\p
\v 28 వాళ్ళు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు వాళ్ళు మైల పడకుండా ఉండడానికి వాళ్ళు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు.
\v 29 కాబట్టి పిలాతు బయట ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి, "ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?" అన్నాడు.
\v 30 వాళ్ళు అతనితో, "ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వాళ్ళం కాదు" అన్నారు.
\s5
\v 31 అందుకు పిలాతు వాళ్ళతో, "అతణ్ణి మీరే తీసుకుకొని వెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి" అన్నాడు.
\v 32 యూదులు, "ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు" అన్నారు. తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వాళ్ళు ఈ మాట పలికారు.
\s5
\v 33 అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్లి, యేసును పిలిచి, ఆయనతో, "నువ్వు యూదులకు రాజువా?" అన్నాడు.
\v 34 యేసు జవాబిస్తూ, "ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?" అన్నాడు.
\v 35 అందుకు పిలాతు, "నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ప్రధాన యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?" అని అడిగాడు.
\s5
\p
\v 36 యేసు, "నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు" అని జవాబిచ్చాడు.
\v 37 అప్పుడు పిలాతు, "అయితే నువ్వు రాజువా??" అని యేసుతో అన్నాడు. యేసు, "నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వాళ్ళందరూ నా మాట వింటారు" అని జవాబిచ్చాడు.
\s5
\v 38 పిలాతు ఆయనతో, "సత్యం అంటే ఏంటి?" అన్నాడు.
\s యేసుకు మరణ శిక్ష, బరబ్బా విడుదల (మత్తయి 27: 15-26; మార్కు 15: 6-15; లూకా 23: 18- 25)
\p అతను ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, "ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు,
\v 39 పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?" అన్నాడు.
\v 40 అప్పుడు వాళ్ళు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, "ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!" అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ.
\s5
\c 19
\s యేసుకు ముళ్ళ కిరీటం (మత్తయి 27: 27- 30; మార్కు 15 : 16-20)
\p
\v 1 ఆ తరువాత పిలాతు యేసును పట్టుకొని కొరడాలతో కొట్టించాడు.
\v 2 సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి
\v 3 ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరకు వచ్చి, "యూదుల రాజా, దండం," అని చెప్పి ఆయన్ని అర చేతులతో కొట్టారు.
\s జన సమూహం ఎదుట యేసు
\s5
\p
\v 4 పిలాతు మళ్ళీ బయటకు వెళ్లి ప్రజలతో, "ఈయనలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఈయన్ని మీ దగ్గరకు బయటకి తీసికొని వస్తున్నాను," అని వాళ్ళతో అన్నాడు.
\v 5 కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వాళ్ళతో, "ఇదిగో ఈ మనిషి!" అన్నాడు.
\v 6 ప్రధాన యాజకులు, యూదుల అధికారులు యేసును చూసినప్పుడు, "సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!" అని, కేకలు వేశారు. పిలాతు వాళ్ళతో, "ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి," అన్నాడు.
\s5
\p
\v 7 యూదులు పిలాతుతో, "మాకు ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి, అతను తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, అతను చావ వలసిందే," అన్నారు.
\v 8 పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ రాజ్యాధికార భవనంలో ప్రవేశించి,
\v 9 "నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?" అని యేసును అడిగాడు. అయితే యేసు అతనికి ఏ జవాబూ చెప్పలేదు.
\s5
\v 10 అప్పుడు పిలాతు ఆయనతో, "నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?" అన్నాడు.
\v 11 యేసు జవాబిస్తూ, "నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం ఉంది" అన్నాడు.
\s5
\v 12 అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, "నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, కైసరుకు మిత్రుడవు కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు కైసరుకు విరోధంగా మాట్లాడినట్టే" అన్నారు.
\v 13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, 'రాళ్లు పరచిన స్థలం'లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి 'గబ్బతా' అని పేరు.
\s రాజును ప్రజలు, యూదుల పెద్దలు చివరిగా తిరస్కరించడం
\s5
\p
\v 14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు!" అన్నాడు.
\v 15 వాళ్ళు కేకలు పెడుతూ, "చంపండి, చంపండి, సిలువ వేయండి!" అని అరిచారు. పిలాతు వాళ్ళతో, "మీ రాజును సిలువ వేయమంటారా?" అన్నాడు. ప్రధాన యాజకుడు, "మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు," అన్నాడు.
\s యేసుక్రీస్తు సిలువ (మత్తయి 27: 33-54; మార్కు 15: 22-39; లూకా 23: 33-47)
\p
\v 16 అప్పుడు, పిలాతు సిలువ వేయడానికి యేసును వాళ్లకు అప్పగించాడు.
\s5
\v 17 వాళ్ళు యేసును తీసుకువెళ్ళారు. తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, 'కపాల స్థలం' అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి 'గొల్గొతా' అని పేరు.
\v 18 అక్కడ వాళ్ళు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య, సిలువ వేశారు.
\s5
\p
\v 19 పిలాతు, ఒక పలక మీద 'నజరేతు వాడైన యేసు, యూదుల రాజు' అని రాయించి సిలువకు తగిలించాడు.
\v 20 యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హెబ్రీ, రోమా, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు.
\s5
\v 21 యూదుల ప్రధాన యాజకుడు పిలాతుతో, "'యూదుల రాజు' అని కాకుండా, అతను చెప్పుకున్న ప్రకారం 'నేను యూదుల రాజును' అని రాయించండి" అన్నాడు.
\v 22 పిలాతు, "నేను రాసిందేదో రాశాను" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 23 సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసికొని, నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకొన్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి,
\v 24 వాళ్ళు ఒకరితో ఒకరు, "దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం" అన్నారు.
\q1 "నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు,
\q1 నా దుస్తుల కోసం చీట్లు వేశారు,"
\p అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
\s5
\v 25 యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు.
\v 26 ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, "అమ్మా, ఇదిగో నీ కొడుకు" అన్నాడు.
\v 27 తరువాత ఆ శిష్యునితో, "ఇదిగో నీ తల్లి" అన్నాడు. ఆ సమయం నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
\s5
\v 28 దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, "నాకు దాహంగా ఉంది," అన్నాడు.
\v 29 అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పంజిని ముంచి, ఆ స్పంజిని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు.
\v 30 యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకొని, "సమాప్తం అయ్యింది" అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు.
\s5
\v 31 అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు కాబట్టి, వాళ్ళ దేహాలు అక్కడ వేలాడకుండా, వాళ్ళ కాళ్ళు విరగగొట్టి, వాళ్ళని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు.
\v 32 కాబట్టి సైనికులు వచ్చి, యేసుతోకూడా సిలువ వేసిన మొదటి వాని కాళ్ళు, రెండవవాని కాళ్ళు విరగగొట్టారు.
\v 33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు.
\s5
\p
\v 34 అయితే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు బయటకు వచ్చాయి.
\v 35 ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతను చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే.
\s5
\v 36 "అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు" అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి.
\v 37 "వాళ్ళు తాము పొడిచిన వాని వైపు చూస్తారు," అని మరొక లేఖనం చెబుతూ ఉంది.
\s సమాధి (మత్తయి 27: 57-60; మార్కు 15: 43- 47; లూకా 23: 50-56)
\s5
\p
\v 38 ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయియ యోసేపు, యేసు దేహాన్ని తాను తీసికొని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకొని వెళ్ళాడు.
\v 39 మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్పై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమం తనతో తీసుకొని వచ్చాడు.
\s5
\v 40 వాళ్ళు యేసు దేహాన్ని తీసుకొని వచ్చి సుగంధ ధ్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం.
\v 41 ఆయన్ని సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకు ఎవరినీ పాతిపెట్టని కొత్త సమాధి ఉంది.
\v 42 ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వాళ్ళు యేసును అందులో పెట్టారు.
\s5
\c 20
\s యేసుక్రీస్తు పునరుత్థానం (మత్తయి 28: 1-10; మార్కు 16: 1- 14; లూకా 24: 1-43)
\p
\v 1 ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. అక్కడ సమాధి పైన ఉంచిన రాయి తీసి ఉండటం చూసింది.
\v 2 కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, "ప్రభువుని ఎవరో సమాధిలోనుండి తీసుకొని పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" అని చెప్పింది.
\s5
\v 3 కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరకు వచ్చారు.
\v 4 వాళ్ళిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరకు వచ్చాడు.
\v 5 అతడు ఆ సమాధి లోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించ లేదు.
\s5
\v 6 అ తర్వాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు.
\v 7 అక్కడ నారబట్టలు పడి ఉండటమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండటమూ చూశాడు.
\s5
\v 8 ఆ తర్వాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు.
\v 9 అయితే ‘ఆయన చనిపోయిన వారినుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వాళ్ళింకా గ్రహించలేదు.
\v 10 అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
\s యేసు మగ్దలేనే మరియకు ప్రత్యక్షం కావడం
\s5
\p
\v 11 కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
\v 12 ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు.
\v 13 వాళ్ళు మరియతో "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. దానికి ఆమె, "ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు" అంది.
\s5
\v 14 ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండటం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్ట లేదు.
\v 15 యేసు "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవర్ని వెదకుతూ ఉన్నావు?" అని ఆమెను అడిగాడు. ఆమె ఆయన్ను తోటమాలి అనుకుంది. "అయ్యా, ఒకవేళ నువ్వు ఆయన్ను తీసుకు వెళ్తే ఆయన్ను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ను మోసుకొని వెళ్తాను" అంది.
\s5
\p
\v 16 అప్పుడు యేసు ఆమెను చూసి, "మరియా" అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి "రబ్బూనీ" అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రు భాషలో ఉపదేశకుడు అని అర్ధం.
\v 17 యేసు ఆమెతో, "నేను ఇంకా తండ్రి దగ్గరకు ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరకు వెళ్లి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరకు ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు" అన్నాడు.
\v 18 మగ్దలేనే మరియ వచ్చిశిష్యులతో, "నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు" అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
\s తోమా లేనప్పుడు యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం (లూకా 24: 36- 49)
\s5
\p
\v 19 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, "మీకు శాంతి కలుగుతుంది గాక" అన్నాడు.
\v 20 ఆయన అలా చెప్పిన తర్వాత వారికి తన పక్కనూ చేతుల్నీ చూపించాడు. వారు అది చూసి ఎంతో సంతోషించారు.
\s5
\v 21 అప్పుడు యేసు తిరిగి, "మీకు శాంతి కలుగుతుంది గాక!. తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను" అని వారితో చెప్పాడు.
\v 22 ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, "పరిశుద్ధాత్మను పొందండి.
\v 23 మీరు ఎవరి పాపాల్ని క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి " అని చెప్పాడు.
\s తోమా ఉండగా యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం
\s5
\p
\v 24 పన్నెండుమంది శిష్యులలో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వాళ్ళతో లేడు.
\v 25 మిగిలిన శిష్యులు, "మేం ప్రభువును చూశాం" అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు "నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నావేలు ఆ గాయపు రంధ్రం లో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను" అన్నాడు.
\s5
\v 26 ఎనిమిది రోజులైన తర్వాత మరల ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసుకుని ఉన్నాయి. అప్పుడు యేసు వాళ్ళ మధ్యకు వచ్చి, " మీకు శాంతి కలుగు గాక!" అన్నాడు.
\v 27 తర్వాత ఆయన తోమాను చూసి, "నీ వేలు ఇలా చాచి నా చేతిని చూడు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు" అన్నాడు.
\s5
\v 28 దానికి జవాబుగా తోమా, "నా ప్రభూ, నా దేవా" అన్నాడు.
\v 29 అప్పుడు యేసు, "నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వాళ్ళు ధన్యులు" అన్నాడు.
\s యోహాను సువార్త రాసిన కారణం
\s5
\p
\v 30 యేసు క్రీస్తు ఇంకా అనేకమైన అద్భుతాలను తన శిష్యుల ముందు చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
\v 31 కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన పేరులో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
\s5
\c 21
\s ఉత్థానం చెందిన క్రీస్తు మన సేవకు యజమాని
\p
\v 1 ఆ తర్వాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచు కున్నాడు. ఎలాగంటే
\v 2 సీమోను పేతురూ, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యులలో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు.
\v 3 సీమోను పేతురు, "నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా" అన్నాడు. మిగిలిన వాళ్ళు, "మేం కూడా నీతో వస్తాం" అన్నారు. వాళ్ళంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్టలేదు.
\s5
\v 4 తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు.
\v 5 యేసు "పిల్లలూ, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా?" అని వారిని అడిగాడు.
\v 6 వాళ్ళు "ఏమీ లేదు" అన్నారు. అప్పుడాయన, "పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి" అన్నాడు. కాబట్టి వాళ్ళు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వాళ్ళు వలను లాగలేకపోయారు.
\s క్రీస్తు కనుసన్నల్లో సేవ, ఫలితం
\s5
\p
\v 7 అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, "ఆయన ప్రభువు!" అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే తీసివేసిన పైబట్ట మళ్ళీ వేసుకుని సముద్రంలో దూకాడు.
\v 8 ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు.
\v 9 ఒడ్డుకి రాగానే వాళ్ళకు అక్కడ నిప్పులూ, వాటిపైన ఉన్న చేపలూ, రొట్టే కనిపించాయి.
\s5
\v 10 అప్పుడు యేసు, "ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి" అని వాళ్లకు చెప్పాడు.
\v 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి.
\s తన సేవకుల అవసరాలు తీర్చే యజమాని (లూకా 22: 35; ఫిలిప్పీ 4: 19)
\s5
\p
\v 12 అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. అప్పుడు యేసు, "రండి, భోజనం చేయండి" అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వాళ్ళకు తెలిసి పోయింది కాబట్టి "నువ్వు ఎవరు" అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.
\v 13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు.
\v 14 యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తర్వాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.
\s సేవకు ఉండవలసిన ఒకే ఒక ఆమోదయోగ్యమైన ప్రేరణ (2 కొరింతి 5: 14; ప్రకటన 2: 4- 5)
\s5
\p
\v 15 వాళ్ళంతా భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, "యెహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటె నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?" అని ప్రశ్నించాడు. అతడు, "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెల్ని మేపు" అని అతనితో చెప్పాడు.
\v 16 మరోసారి ఆయన, "యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అతణ్ణి అడిగాడు. అతడు "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెలకు కాపరిగా ఉండు" అన్నాడు.
\s5
\p
\v 17 ఆయన మూడోసారి, "యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి "నీకు సమస్తమూ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు" అన్నాడు.
\s తన సేవకుని మరణ సమయం విధానం యజమాని నిర్ణయించడం
\p
\v 18 అప్పుడు యేసు, "నా గొర్రెలను మేపు. నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. ఖచ్చితంగా నీకు చెప్తున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకొని వెళ్తాడు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దానిని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన "నాతో రా" అని అతనితో అన్నాడు.
\s5
\p
\v 20 పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండుగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, "ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు" అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు.
\v 21 పేతురు అతణ్ణి చూసి, "ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?" అని ఆయన్ని అడిగాడు.
\s5
\v 22 దానికి యేసు "నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండటం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు" అన్నాడు.
\v 23 దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యులలో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండటం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు.
\s5
\v 24 ఈ సంగతులను గురించి సాక్ష్యమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు.
\v 25 యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.

2183
45-ACT.usfm Normal file
View File

@ -0,0 +1,2183 @@
\id ACT Acts
\s5
\c 1
\s పరిచయం
\p
\v 1 తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన
\v 2 తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకు ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను.
\v 3 ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తన్నుతాను సజీవునిగా కనపరచుకున్నాడు.
\s క్రీస్తు పునరుత్థానానంతర పరిచర్య
\s5
\p
\v 4 ఆయన వారిని కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, "మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి.
\v 5 యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు గాని కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు."
\s5
\p
\v 6 వారు సమకూడినప్పుడు, "ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?" అని శిష్యులు అడగ్గా ఆయన,
\v 7 "కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలిసికోవడం మీ పని కాదు.
\s అపోస్తలిక అదేశం
\p
\v 8 అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు" అన్నాడు.
\s5
\v 9 ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్లిపోయింది.
\v 10 ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి
\v 11 "గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్లడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడ" ని వారితో చెప్పారు.
\s1 పరిశుద్ధాత్మకై పది దినాల నిరీక్షణ
\s5
\p
\v 12 అప్పుడు వారు ఆలివ్ తోట అనే పేరు గల కొండనుండి యెరూషలేము తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.
\v 13 వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగది లోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అయిన సీమోను, యాకోబు కుమారుడు యూదా.
\v 14 వీరూ, వీరితోకూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
\s మత్తీయ ఎంపిక
\s5
\p
\v 15 ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి,
\v 16 "సోదరులారా, యేసును పట్టుకొన్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి వచ్చింది.
\s5
\v 17 ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు.
\v 18 ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బులిచ్చి ఒక పొలం కొన్నాడు. అతడు తలక్రిందుగాపడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి.
\v 19 ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని అకెల్దమ అంటున్నారు. దాని అర్థం 'రక్త భూమి.' "ఇందుకు రుజువుగా
\q1
\s5
\v 20 అతని యిల్లు పాడై పోవు గాక,
\q1 దానిలో ఎవ్వడూ కాపురముండక పోవు గాక,
\q1 అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక
\q1 అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
\s5
\p
\v 21 కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకు,
\v 22 ఆయన మన మధ్య ఉన్నకాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి" అని చెప్పాడు.
\v 23 అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి ఇలా ప్రార్థించారు
\s5
\v 24 "అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ,
\v 25 తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్నవానిని కనపరచు."
\v 26 తరువాత శిష్యులు వీరి కోసం చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.
\s5
\c 2
\s పెంతెకోస్తు
\p
\v 1 పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చింది. అంతా ఒక చోట సమావేశమయ్యారు.
\v 2 అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న యిల్లంతా నిండింది.
\v 3 జ్వాలల లాంటివి నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరిమీదా వ్రాలాయి.
\v 4 అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారిని మాట్లాడించినట్టుగా వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.
\s5
\v 5 ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి జనంలోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.
\v 6 ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తమ సొంత భాషలో వారు మాట్లాడ్డం విని కలవరపడ్డారు.
\v 7 వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ "మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.
\s5
\v 8 మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడ్డం మనం వింటున్నామేంటి ?
\v 9 పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసొపొతమియ యూదయ కప్పదొకియ పొంతు ఆసియ
\v 10 ఫ్రుగియ పంపులియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనే లో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన
\v 11 యూదులూ, యూదమతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెప్తుంటే వింటున్నామ"ని చెప్పుకున్నారు.
\s5
\v 12 అందరూ ఆశ్చర్య చకితులై ఎటూ తోచక ఇదేమిటోనని ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు.
\v 13 కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు.
\s పేతురు ఉపన్యాసం. యేసే ప్రభువు, క్రీస్తు
\s5
\p
\v 14 అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, ''యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి.
\s (1) యోవేలు ప్రవచనం నెరవేర్పు
\p
\v 15 మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిది అయినా కాలేదు.
\s5
\v 16 యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే
\q1
\v 17 అంత్యదినాల్లో నేను
\q1 మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను.
\q1 మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు.
\q1 మీ యువకులకు దర్శనాలొస్తాయి.
\q1 మీ వృద్ధులు కలలు కంటారు,
\q1
\s5
\v 18 ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.
\q1
\v 19 పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరిని చూపిస్తాను.
\q1
\s5
\v 20 ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
\q1
\v 21 ప్రభువు పేరున ప్రార్థన చేసే వాళ్ళంతా పాప విముక్తి పొందుతారు అని
\q1 దేవుడు చెప్తున్నాడు.
\s (2) యేసు క్రియలు ఆయన్ను ప్రభువుగా క్రీస్తుగా నిరూపిస్తున్నాయి
\s5
\p
\v 22 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.
\v 23 దేవుని స్థిరమైన ప్రణాళికనీ ఆయనకున్న భవిష్యద్‌ జ్ఞానాన్నీ అనుసరించి ఆయన్ని అప్పగించడం జరిగింది. ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
\v 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.
\s (3) క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక అయన రాజరికం గురించి దావీదు ప్రవచనం
\s5
\p
\v 25 ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు
\q1 నే నెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను,
\q1 ఆయన నా కుడిపక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.
\v 26 నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది.
\q1 నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది.
\s5
\v 27 నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు,
\q1 నీ పరిశుద్ధుణ్ణి కుళ్లు పట్టనియ్యవు
\v 28 నాకు జీవమార్గాలు తెలిపావు.
\q1 నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.
\s5
\v 29 సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
\v 30 అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి
\p అతని గర్భఫలం నుంచి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చోబెడతానని
\q1 దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి ఎరిగి
\v 31 క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్లి పోలేదనీ దావీదు ముందే తెలిసికొని ఆయన పునరుత్థానాన్నిగూర్చి చెప్పాడు.
\s (4) యేసు పునరుత్థానం ఆయన్ను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది
\s5
\p
\v 32 ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.
\v 33 కాబట్టి ఆయన దేవుని కుడిపక్కకు హెచ్చించడం జరిగింది. తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న వింటున్న పరిశుద్ధాత్మను కుమ్మరించాడు.
\s5
\v 34 దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు
\p
\v 35 నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకు
\q1 నీవు నా కుడిపక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.
\q1
\v 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి.''
\s (5) ఇశ్రాయేలు ప్రజ ప్రస్తుత కర్తవ్యం
\s5
\p
\v 37 వారీ మాట విని హృదయంలో గుచ్చినట్టయి , "సోదరులారా, మేమేం చేయాల"ని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు
\v 38 దానికి పేతురు, "మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.
\v 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరకు పిలిచే వారందరికీ చెందుతుంద" ని వారితో చెప్పాడు.
\s5
\v 40 ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్ష్యమిచ్చి, " మీరు యీ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు.
\v 41 అతని సందేశం నమ్మినవారు బాప్తిస్మం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది సంఘంలో చేరారు.
\s అది క్రైస్తవ సంఘం
\p
\v 42 వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.
\s5
\p
\v 43 అప్పుడు ప్రతివానికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేసారు.
\v 44 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడి గా ఉంచుకొన్నారు.
\v 45 అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.
\s5
\v 46 ప్రతిరోజూ ఏక మనస్సుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,
\v 47 ఆనందంతో, కపటంలేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతి రోజూ సంఘం లో చేరుస్తున్నాడు.
\s5
\c 3
\s ప్రథమ అపోస్తలిక అద్భుతం
\p
\v 1 మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
\v 2 పుట్టినప్పటినుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి 'సౌందర్యం' అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయం లోనికి వెళ్ళేవారి దగ్గర భిక్షమెత్తుకునే వాడు.
\v 3 పేతురు యోహాను దేవాలయం లోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
\s5
\v 4 పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, "మావైపు చూడు" అన్నారు.
\v 5 అతడు వారిదగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూసాడు.
\v 6 అప్పుడు పేతురు, "వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్నదాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు" అని
\s5
\v 7 వాడి కుడిచెయ్యి పట్టుకొని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
\v 8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు.
\s5
\v 9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
\v 10 'సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే' అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దానిని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
\s5
\p
\v 11 వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
\s పేతురు రెండవ ఉపన్యాసం: నిబంధన నెరవేర్పు
\p
\v 12 పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, "ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంతశక్తితోనో , భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
\s5
\v 13 అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ఎదుట ఆయనను తిరస్కరించారు.
\v 14 పవిత్రుడూ నీతిమంతుడైన వానిని మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
\s5
\v 15 మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
\v 16 ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
\s5
\v 17 సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
\v 18 అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియచేసిన సంగతులను ఆయన ఇప్పుడు నెరవేర్చాడు.
\s5
\v 19 కనుక పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధినుండి విశ్రాంతి సమయాలు వస్తాయి.
\v 20 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
\s5
\v 21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తలచేత చెప్పించాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండడం అవసరం.
\v 22 మోషే నిజంగా యిలా అన్నాడు కదా "ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.
\v 23 ఆ ప్రవక్త చెప్పేది పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండ సర్వనాశనమై పోతాడు.
\s5
\v 24 సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగా చెప్పారు.
\v 25 నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
\v 26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు."
\s5
\c 4
\s హింసలు ఆరంభం
\p
\v 1 పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, దేవాలయపు అధికారీ, సద్దూకయ్యులూ వారిమీదికి వచ్చారు.
\v 2 వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.
\v 3 వారిని బలవంతంగా పట్టుకొని, సాయంకాలం అయిందని మరునాటి వరకు వారిని ఖైదు లో ఉంచారు.
\v 4 వాక్యం విన్నవారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు అయిదువేలు.
\s సన్ హెడ్రిన్ సభ ఎదుట పేతురు
\s5
\p
\v 5 మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.
\v 6 ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు.
\v 7 వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, "మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీనిని చేసార" ని అడిగారు
\s5
\v 8 పేతురు పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా అన్నాడు, "ప్రజల అధికారులారా, పెద్దలారా,
\v 9 ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టయితే
\v 10 ఇశ్రాయేలు ప్రజలైన మీరంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిల్చున్నాడు.
\s5
\v 11 ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధార శిల అయ్యింది.
\v 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామం లోనూ రక్షణ పొందలేము."
\s యేసు నామం ప్రకటించడం నిషేధం
\s5
\p
\v 13 వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలిసికొని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.
\v 14 బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.
\s5
\v 15 అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకొని,
\v 16 'ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం.
\v 17 అయినా ఇది జనాల్లోకి యింకా వెళ్ళకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడ వద్దని మనం వారిని బెదిరిద్దాం' అని చెప్పుకొన్నారు.
\v 18 అప్పుడు వారిని పిలిపించి, "మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు" అని వారికి ఆజ్ఞాపించారు.
\s5
\v 19 అందుకు పేతురు యోహాను వారిని చూసి, "దేవుని మాట కంటె మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.
\v 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము" అని వారికి జవాబిచ్చారు.
\s5
\v 21 ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు ప్రజలకు భయపడి, వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.
\v 22 అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.
\s విశ్వాసులు మరలా ఆత్మతో నిండిపోవడం
\s5
\p
\v 23 పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు.
\v 24 వారు విని, ఒకే మనస్సుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. 'ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.
\p
\v 25 యూదేతరులు ఎందుకు అల్లరి చేసారు?
\q1
\s5
\v 26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొన్నారు?
\q1 ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు,
\q1 అధికారులు ఏకమయ్యారు
\q1 అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.
\s5
\v 27 ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో,
\v 28 వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.
\s5
\v 29 ప్రభూ, వారి బెదరింపులు గమనించి
\v 30 రోగుల్ని బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు పేరున సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చేయి చాపి ఉండగా, నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్యం బోధించేలా అనుగ్రహించు.'
\v 31 వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
\s యెరూషలేములో దేవుని సంఘం
\s5
\p
\v 32 విశ్వసించిన వారంతా ఏకహృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమష్టిగా ఉంచుకున్నారు.
\v 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది.
\s5
\v 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.
\v 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.
\s5
\p
\v 36 సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు 'బర్నబా' అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ఆదరణ పుత్రుడు. ఇతడు తనకున్న పొలం అమ్మేసి
\v 37 ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
\s5
\c 5
\s అననీయ, సప్పిర ల మరణకరమైన పాపం
\p
\v 1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు.
\v 2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
\s5
\v 3 అప్పుడు పేతురు, "అననీయా, నీ భూమి ఖరీదులో కొంత దాచుకొని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు?
\v 4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవుని తోనే అబద్ధమాడావ" ని అతనితో చెప్పాడు.
\v 5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్నవారందరికీ చాలా భయం వేసింది.
\v 6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు.
\s5
\p
\v 7 సుమారు మూడుగంటల తర్వాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది.
\v 8 అప్పుడు పేతురు "మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు" అని ఆమెనడిగాడు. అందుకామె "అవును, యింతకే అమ్మాము" అని చెప్పింది.
\s5
\v 9 అందుకు పేతురు "ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికొని పోతారు" అని ఆమెతో చెప్పాడు.
\v 10 వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు.
\v 11 సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.
\s సంఘం మహాత్మ్యం
\s5
\p
\v 12 ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు.
\v 13 తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే
\s5
\v 14 సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు.
\v 15 పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగుల్ని వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు.
\v 16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగుల్నీ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారినీ తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
\s రెండవ సారి హింసాకాండ
\s5
\p
\v 17 ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి
\v 18 అపొస్తలుల్ని పట్టుకొని పట్టణం లోని చెరసాలలో వేశారు.
\s5
\v 19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి "మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి
\v 20 ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పంది " అని వారితో అన్నాడు.
\v 21 వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారినీ ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు.
\s5
\v 22 భటులు అక్కడికి వెళ్లి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగివచ్చి
\v 23 "చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదని" వారికి తెలిపారు.
\s5
\v 24 దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని 'ఇది ఏమవుతుందోన'ని వారి విషయమై అయోమయంలో పడిపోయారు.
\v 25 అప్పుడొకడు వచ్చి "మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు" అని చెప్పాడు.
\s5
\v 26 అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి, సౌమ్యంగానే
\v 27 వారిని తీసికొని వచ్చి మహాసభ ముందుంచాడు.
\v 28 ప్రధాన యాజకుడు వాళ్ళతో "ఈ పేరున బోధించవద్దని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు" అని చెప్పాడు.
\s అపోస్తలుల జవాబు
\s5
\p
\v 29 అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు యిలా జవాబిచ్చారు "మనుషులకు కాదు, దేవునికే మేము లోబడాలి గదా.
\v 30 మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు.
\v 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తనా , పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా రక్షకునిగా తన కుడివైపున ఉండే స్థాయికి హెచ్చించాడు.
\v 32 మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం."
\s5
\v 33 వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు.
\v 34 అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి "ఈ అపొస్తలులను కాసేపు బయట ఉంచ" మని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు.
\s గమలియేలు హితవు
\s5
\p
\v 35 "ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా.
\v 36 కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల ది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వాళ్ళంతా చెల్లా చెదరై పోయారు.
\v 37 అతని తర్వాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలలీవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వాళ్ళంతా చెదరిపోయారు.
\s5
\v 38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పనిగానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది.
\v 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో కదా."
\s5
\v 40 వారతని మాటకు అంగీకరించి, అపొస్తలుల్ని పిలిపించి వారిని కొట్టించి, యేసు పేరున బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు.
\v 41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపోస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు.
\v 42 ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.
\s5
\c 6
\s ప్రథమ సంఘ పరిచారకులు
\p
\v 1 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేసారు.
\s5
\v 2 అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, "మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు.
\v 3 కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం.
\v 4 మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం" అన్నారు.
\s5
\v 5 ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానొరు, తీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు.
\v 6 వారిని అపొస్తలుల ముందుంచారు. అపోస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.
\s5
\p
\v 7 దేవుని వాక్యం అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.
\s మూడవ హింసాకాండ: మహాసభ ఎదుట స్తెఫను
\s5
\p
\v 8 స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు.
\v 9 అయితే 'స్వతంత్రుల సమాజం' అనే సమాజానికి చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని
\s5
\v 10 అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.
\v 11 అప్పుడు వారు 'వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నామ'ని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు.
\s5
\v 12 ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి
\v 13 అతణ్ణి పట్టుకొని మహాసభ ముందుకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టారు. వారు "ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు.
\v 14 నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము" అని చెప్పారు.
\v 15 సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.
\s5
\c 7
\p
\v 1 ప్రధాన యాజకుడు 'ఈ మాటలు నిజమేనా?' అని అడిగాడు.
\s మహాసభ ఎదుట స్తెఫను ప్రసంగం: ఇశ్రాయేలు చరిత్ర
\p
\v 2 అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే "సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసెపోటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై
\v 3 'నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళమ'ని చెప్పాడు.
\s5
\p
\v 4 అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడనుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు.
\v 5 ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తర్వాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు.
\s5
\p
\v 6 అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారనీ, ఆ దేశస్థులు వారిని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారనీ చెప్పాడు.
\v 7 అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న ఆ దేశాన్ని తాను శిక్షిస్తాననీ ఆ తర్వాత వారు బయటికి వచ్చి ఈ స్థలంలో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు.
\v 8 ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక ఒడంబడికను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేసాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు.
\s5
\p
\v 9 ఆ గోత్రకర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులోకి అమ్మేశారు గాని, దేవుడతనికి తోడుగా ఉండి అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు.
\v 10 ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు.
\s5
\p
\v 11 ఆ తర్వాత ఐగుప్తు దేశమంతటి మీదా, కనాను దేశమంతటి మీదా తీవ్రమైన కరువూ, గొప్ప బాధలూ వచ్చాయి. కాబట్టి మన పితరులకు ఆహారం దొరకలేదు.
\v 12 ఐగుప్తులో తిండి గింజలున్నాయని యాకోబు తెలుసుకొని మన పూర్వీకులను అక్కడికి మొదటిసారి పంపాడు.
\v 13 వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తాను తెలియచేసుకున్నాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.
\s5
\p
\v 14 యోసేపు తన తండ్రి యాకోబునూ, తన సొంత వారందరినీ పిలిపించాడు. వారు మొత్తం 75 మంది.
\v 15 యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు. వారిని షెకెము అనే ఊరికి తెచ్చి
\v 16 హమోరు సంతతి దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు.
\s5
\p
\v 17 అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగ్గరపడే కొద్దీ ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందారు.
\v 18 చివరికి యోసేపును గూర్చి తెలియని వేరొక రాజు ఐగుప్తులో అధికారానికి వచ్చేవరకూ అలా జరిగింది.
\v 19 ఆ రాజు మన జాతి ప్రజలని మోసగించి, వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పారేసేలా మన పూర్వీకులను పీడించాడు.
\s5
\p
\v 20 ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందగాడు. తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు.
\v 21 అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసికొని తన కుమారునిగా పెంచుకొంది.
\s5
\v 22 మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకొని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.
\v 23 అతనికి సుమారు నలభై ఏళ్ళ వయసప్పుడు ఇశ్రాయేలీయులైన తన స్వంత ప్రజలను చూడాలని నిశ్చయించుకున్నాడు.
\v 24 అప్పుడు వాళ్ళలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి, అతనిని కాపాడి అతడి పక్షాన ఒక ఐగుప్తు వాణ్ణి చంపి ప్రతీకారం చేశాడు.
\v 25 తన ద్వారా తన ప్రజను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతి వారు గ్రహిస్తారని అతడనుకున్నాడు గాని వారు గ్రహించలేదు.
\s5
\p
\v 26 ఆ తర్వాతి రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వారిని చూసి 'అయ్యలారా, మీరు సోదరులు. మీరెందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నార'ని వారికి సర్దిచెప్పాలని చూశాడు.
\v 27 అయితే తన పొరుగువాడికి అన్యాయం చేసినవాడు 'మామీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు?
\v 28 నిన్న ఐగుప్తు వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?' అని చెప్పి అతణ్ణి నెట్టేశాడు .
\s5
\p
\v 29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడుగా ఉంటూ, అక్కడే ఇద్దరు కొడుకులను కన్నాడు.
\v 30 నలభై ఏళ్లయిన తర్వాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక మండుతున్న పొద లోని అగ్నిమంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.
\s5
\v 31 మోషే అది చూసి ఆ దర్శనానికి ఆశ్చర్యపడి దానిని స్పష్టంగా చూడ్డానికి దగ్గరకు వచ్చినపుడు
\v 32 'నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి' అన్న ప్రభువు మాట వినబడింది. మోషే వణికిపోతూ, అటు చూడడానికి సాహసించలేక పోయాడు.
\s5
\v 33 ప్రభువు అతనితో ఇలా అన్నాడు, 'నీ చెప్పులు తీసివెయ్యి . నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం.
\v 34 ఐగుప్తులో ఉన్న నా ప్రజల యాతన చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రా, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతాను.'
\s5
\p
\v 35 'మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడ'ని వారు నిరాకరించిన ఈ మోషేను, అతనికి పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపాడు.
\v 36 మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చాడు.
\q1
\v 37 'నాలాటి ఒక ప్రవక్తను దేవుడు మీ సోదరుల్లో బయలు దేరేలా చేస్తాడు' అని
\q1 ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే.
\s5
\v 38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ అరణ్యంలోని సంఘంలో ఉన్నదీ మన కివ్వడానికి జీవవాక్యాలను తీసికొన్నదీ ఇతడే.
\s ఇశ్రాయేలు అపనమ్మకం
\p
\v 39 మన పూర్వికులు లోబడకుండా ఇతడినే తిరస్కరించి, తమ హృదయాల్లో ఐగుప్తుకు తిరిగి వెళ్లిపోదామనుకున్నారు.
\v 40 అప్పుడు వారు 'మా ముందర నడిచే దేవుళ్ళను మాకోసం ఏర్పాటు చేయి. ఐగుప్తు దేశంనుండి మమ్ములను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియద'ని అహరోనుతో అన్నారు.
\s5
\v 41 ఆ రోజుల్లో వాళ్ళొక దూడను చేసికొని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.
\v 42 అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా
\q 'ఇశ్రాయేలీయులారా,
\q నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో
\q వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
\q
\s5
\v 43 మీరు మొలెకు గుడారాన్నీ ,
\q రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడానికి మీరు చేసుకున్న ప్రతిమలను మోసుకుపోయారు.
\p కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.'
\s5
\v 44 అతడు చూసిన నమూనా చొప్పున సాక్ష్యపు గుడారం చేయాలని మోషేతో దేవుడు మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్ష్యపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉంది.
\v 45 మన పూర్వీకులు దానిని తీసికొని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన రాజ్యాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దానిని తీసుకొచ్చారు. అది దావీదుకాలం వరకూ ఉంది.
\v 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు.
\s5
\v 47 కాని మందిరం కట్టింది సోలోమోను.
\q
\v 48 అయితే, సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళల్లో నివసించడు.
\q ప్రవక్త చెప్పినట్టుగా
\q
\v 49 'ఆకాశం నా సింహాసనం,
\q భూమి నా పాదపీఠం.
\q మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
\q నా విశ్రాంతి స్థలమేది?
\q
\v 50 ఇవన్నీ నా చేతిపనులు కావా?
\q అని ప్రభువు అడుగుతున్నాడు.
\s ఆనాటి ప్రజల పాపం
\s5
\p
\v 51 మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేనివారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
\v 52 మీ పూర్వీకులు ఏ ప్రవక్తను హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందే తెలియచేసిన వారిని చంపేశారు. ఆయన్ని కూడా మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు.
\v 53 దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దానిని మీరే పాటించలేదు " అని చెప్పాడు.
\s మొదటి హతసాక్షి. పౌలు మొదటి ప్రస్తావన
\s5
\p
\v 54 మహాసభవారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్లు కొరికారు.
\v 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ, దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడం చూసి
\v 56 "ఆకాశం తెరచుకోవడం, మనుష్యకుమారుడు దేవుని కుడిపక్క నిలిచి ఉండడం చూస్తున్నాను" అని పలికాడు.
\s5
\v 57 అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసికొని మూకుమ్మడిగా అతని మీదికి వచ్చి
\v 58 అతనిని పట్టణం బయటకు ఈడ్చుకు పోయి, రాళ్ళతో కొట్టారు. సాక్షులు సౌలు అనే యువకుని పాదాల దగ్గర తమ పైబట్టలు పెట్టారు.
\s5
\v 59 వారు స్తెఫనును రాళ్ళతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును సంబోధిస్తూ "యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకోమ" ని చెప్పాడు.
\v 60 అతడు మోకరించి "ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్ద"ని గొంతెత్తి పలికాడు. ఈ మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు.
\s5
\c 8
\s నాలుగవ హింసాకాండ. సౌలు ఆధ్వర్యంలో
\p
\v 1 ఆ రోజునుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది.
\v 2 కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి పారిపోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.
\v 3 అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడుచేస్తున్నాడు.
\s మొట్టమొదటి సువార్త ప్రచారకులు
\s5
\p
\v 4 అయినా, చెదరిపోయిన వారు వాక్యం ప్రకటిస్తూ వెళుతున్నారు.
\s ఫిలిప్పు పరిచర్య
\p
\v 5 ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్లి వారికి క్రీస్తును ప్రకటించాడు.
\s5
\v 6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు.
\v 7 చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు.
\v 8 అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
\s మంత్రగాడు సిమోను వ్యవహారం
\s5
\p
\v 9 సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను ఆశ్చర్యపరిచేవాడు.
\v 10 అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, 'దేవుని మహాశక్తి అంటే ఇతడే' అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా విన్నారు.
\v 11 అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట విన్నారు.
\s5
\v 12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిస్మం పొందారు.
\v 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
\s5
\v 14 సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు.
\v 15 వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు.
\v 16 అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం మాత్రం పొందారు.
\p
\v 17 అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగానే వారు పరిశుద్ధాత్మను పొందారు.
\s5
\v 18 అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం సీమోను చూసి
\v 19 వారికి డబ్బులివ్వ జూపి 'నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండ'ని అడిగాడు.
\s5
\v 20 అందుకు పేతురు "నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశించు గాక.
\v 21 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు.
\v 22 నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
\v 23 నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాలలో ఉన్నావు. నీ నిలువెల్లా విషమే' అని చెప్పాడు.
\s5
\v 24 అప్పుడు సీమోను 'మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కోసం ప్రభువుకు ప్రార్ధించమని' జవాబిచ్చాడు.
\s5
\p
\v 25 ఆ తర్వాత వారు సాక్ష్యమిస్తూ ప్రభువు వాక్యం బోధించి యెరూషలేము తిరిగి వెళ్తూ, సమరయ ప్రజల గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు.
\s ఇతియోపియా కోశాధికారి తో ఫిలిప్పు
\s5
\p
\v 26 ప్రభువు దూత ఫిలిప్పుతో 'లే, దక్షిణానికి వెళ్లి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్యమార్గంలో వెళ్ళు' అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.
\v 27 అప్పుడు ఇతియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇతియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు.
\v 28 అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
\s5
\v 29 ఆత్మ ఫిలిప్పుతో 'నీవు ఆ రథం దగ్గరకు వెళ్ళి దానిని కలుసుకో' అని చెప్పాడు.
\v 30 ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్లి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని "మీరు చదివేది మీకు అర్థమవుతుందా?" అని అడిగాడు.
\v 31 అతడు "నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంద"ని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.
\s5
\v 32 ఇతియోపీయుడు చదివే లేఖన భాగం ఏదంటే-
\q1 ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.
\q1 బొచ్చు కత్తిరించే వాడి దగ్గర
\q1 గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే ,
\q1 ఆయన నోరు తెరవలేదు.
\q1
\v 33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.
\q1 ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?
\q1 ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు .
\s5
\p
\v 34 అప్పుడు ఆ నపుంసకుడు, "ప్రవక్త చెప్పేది ఎవరి గురించి ? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు" అని ఫిలిప్పును అడిగాడు.
\v 35 ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.
\s5
\v 36 వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్లున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు 'ఇక్కడ నీళ్లున్నాయి! నాకు బాప్తిస్మమివ్వడానికి ఆటంకమేంట'ని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు.
\v 37 ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు.
\v 38 అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.
\s5
\v 39 వారు నీళ్లలోనుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకొనిపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.
\v 40 అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కన్పించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.
\s5
\c 9
\s సౌలు మార్పు (అపో. కా. 22:1-16; 26:9-18)
\p
\v 1 ప్రభువు శిష్యుల్ని హతమారుస్తానని సౌలు యింకా బుసలుకొడుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి
\v 2 యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు.
\s5
\v 3 అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
\v 4 అప్పుడతడు నేల మీద పడిపోయాడు. "సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?" అనే ఒక శబ్దం విన్నాడు.
\s5
\v 5 "ప్రభూ, నీవెవరివి?" అనిఅతను అడిగినప్పుడు, ప్రభువు "నువ్వు హింసిస్తున్న యేసుని.
\v 6 లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది" అని చెప్పాడు.
\v 7 అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని ఎవర్నీ చూడలేక మాటల్లేక నిలబడిపోయారు.
\s5
\v 8 సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చేయి పట్టుకొని దమస్కులోకి నడిపించారు.
\v 9 అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.
\s5
\p
\v 10 దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో "అననీయా" అని అతనిని పిలిచాడు.
\v 11 అతడు "చిత్తం" అన్నాడు. అందుకు ప్రభువు "నువ్వు లేచి, 'ఋజుమార్గం' అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడు సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.
\v 12 దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు" అని చెప్పాడు.
\s5
\v 13 అయితే అననీయ "ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేము లోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు.
\v 14 ఇక్కడ కూడా నీ పేరున ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకులనుండి అధికారం పొందాడు" అని జవాబిచ్చాడు.
\v 15 అందుకు ప్రభువు "నీవు వెళ్లు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం.
\v 16 ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను" అని అతనితో చెప్పాడు.
\s5
\v 17 అననీయ వెళ్లి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి "సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండిపోయేలా నన్ను నీ దగ్గరకి పంపాడు" అని చెప్పాడు.
\v 18 వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిస్మం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.
\s పౌలు సువార్త ప్రకటన
\p
\v 19 అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
\s5
\v 20 వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు.
\v 21 విన్నవారంతా ఆశ్చర్యపడి, యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడని చెప్పుకున్నారు.
\v 22 అయితే సౌలు మరింతగా బలపడి 'యేసే క్రీస్తు' అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదుల్ని కలవరపరచాడు.
\s5
\p
\v 23 చాలా రోజులు గడిచిన తర్వాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.
\v 24 వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబవళ్ళు ద్వారాల దగ్గర కాపు కాశారు.
\v 25 అయితే అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసికొనిపోయి గంపలో కూర్చోబెట్టి గోడమీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు.
\s యెరూషలేము సందర్శనం
\s5
\p
\v 26 అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.
\v 27 అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి 'అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు పేరున ధైర్యంగా బోధించాడ'నీ, వారికి వివరంగా తెలియపరచాడు.
\s5
\v 28 అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ,
\v 29 ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు.
\s పౌలు తార్సుకు తిరుగు ప్రయాణం
\p
\v 30 సోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు.
\s5
\p
\v 31 కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువుపట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.
\s ఐనెయ స్వస్థత
\p
\v 32 ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.
\s5
\v 33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి
\v 34 "ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ చాప సర్దుకో" మని అతనితో చెప్పగానే
\v 35 వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.
\s తబితకు ప్రాణం పోయడం
\s5
\p
\v 36 యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. ఈమె అస్తమానం మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది.
\v 37 ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.
\s5
\v 38 లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గిరికి పంపారు.
\v 39 పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు.
\s5
\v 40 పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి "తబితా, లే" అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది.
\v 41 అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. విశ్వాసుల్నీ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
\v 42 ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది , చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.
\v 43 పేతురు యొప్పేలో సీమోను అనే జంతు చర్మాలు బాగు చేసే అతని దగ్గర చాలా రోజులున్నాడు.
\s5
\c 10
\s యూదేతరులకు సువార్త. కొర్నేలి దర్శనం
\p
\v 1 కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి.
\v 2 అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు.
\s5
\v 3 మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి "కొర్నేలీ" అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు.
\v 4 అతడు దూతను తేరి చూసి చాలా భయపడి "ప్రభూ, ఏమిటి?" అని అడిగాడు. అందుకు దూత "నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి.
\v 5 ఇప్పుడు యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో.
\v 6 అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది" అని చెప్పాడు.
\s కొర్నేలి పేతురు కొరకు పిలువనంపించడం
\s5
\p
\v 7 ఆ దూత వెళ్లిన తర్వాత కొర్నేలి తన ఇంటిలో పనిచేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి
\v 8 వారికీ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాడు.
\s పేతురు దర్శనం
\s5
\p
\v 9 తర్వాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు.
\v 10 అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై,
\v 11 ఆకాశం తెరచుకొని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు.
\v 12 దాన్లో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగుకాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి.
\s5
\v 13 అప్పుడు "పేతురూ, లేచి చంపుకొని తిను" అనే ఒక శబ్డం అతనికి వినిపించింది.
\v 14 అయితే పేతురు "వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు" అని జవాబిచ్చాడు.
\v 15 'దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు' అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది.
\v 16 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
\s5
\p
\v 17 పేతురు తనకు వచ్చిన దర్శనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటూ అయోమయంలో ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి, తలుపు దగ్గర నిలబడి
\v 18 "పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?" అని అడిగారు.
\s5
\v 19 పేతురు ఆ దర్శనాన్ని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఆత్మ "చూడు, ముగ్గురు వ్యక్తులు నీ కోసం చూస్తున్నారు.
\v 20 నీవు లేచి కిందికి దిగి వారితో పాటు వెళ్ళు. వారితో వెళ్ళడానికి భయపడవద్దు. వారిని నేనే పంపాను" అని అతనితో చెప్పాడు.
\v 21 పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వెళ్లి "మీరు వెదికే వాణ్ణి నేనే. మీరెందుకు వచ్చారు?" అని అడిగాడు.
\s5
\v 22 అందుకు వారు "నీతిమంతుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరి దగ్గరా మంచి పేరు సంపాదించిన శతాధిపతి కొర్నేలి అనే ఒకాయన ఉన్నాడు. తన ఇంటికి నిన్ను పిలిపించుకుని నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత అతనికి తెలియచేసాడ" ని చెప్పారు. అప్పుడు పేతురు వారిని లోపలికి పిలిచి అతిథ్యమిచ్చాడు.
\s పేతురు కైసరయ ప్రయాణం
\p
\v 23 తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్లారు.
\s5
\v 24 ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు.
\s5
\v 25 పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్లి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు.
\v 26 అయితే పేతురు అతనిని లేపి 'లేచి నిలబడు. నేను కూడ మనిషినే' అని చెప్పాడు.
\s5
\v 27 అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు.
\v 28 అప్పుడతడు "అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషేధించకూడదనీ, అపవిత్రుడుగా భావించకూడదనీ దేవుడు నాకు చూపించాడు.
\v 29 కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. కాబట్టి ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు" అని కొర్నేలి తో చెప్పాడు.
\s5
\v 30 అందుకు కొర్నేలి "నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి
\v 31 'కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి
\v 32 పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడ' ని నాతో చెప్పాడు.
\v 33 వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు వచ్చింది మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశమయ్యాము" అని చెప్పాడు.
\s కోర్నేలి ఇంట్లో యూదేతరులకు పేతురు సందేశం. విశ్వాసం ద్వారా రక్షణ
\p అందుకు పేతురు ఇలా అన్నాడు,
\s5
\v 34 "దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.
\v 35 ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు.
\s5
\v 36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి గురించిన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా .
\v 37 యోహాను ప్రకటించిన బాప్తిస్మం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు.
\v 38 అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ , బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ పిశాచం పీడ కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
\s5
\p
\v 39 ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడ తీసి చంపారు.
\v 40 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు.
\v 41 ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి భోజన పానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు.
\s5
\v 42 దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు.
\v 43 ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన పేరున పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నార" ని చెప్పాడు.
\s యూదేతర విశ్వాసుల పైకి పరిశుద్ధాత్మ దిగి రావడం
\s5
\p
\v 44 పేతురు ఈ మాటలు చెప్తూ ఉండగానే అతని బోధ విన్నవారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు.
\v 45 సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు .
\s5
\v 46 ఎందుకంటే యూదేతరులు ఇతర భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు.
\v 47 అప్పుడు పేతురు "మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీళ్ళు నీటితో బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్లకు అడ్డు చెప్పగలరా" అని చెప్పి
\v 48 యేసుక్రీస్తు పేరున వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
\s5
\c 11
\s పేతురు యూదేతరులమధ్య తన పరిచర్యను సమర్థించుకోవడం
\p
\v 1 యూదేతరులు కూడా దేవుని వాక్యం అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.
\v 2 పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,
\v 3 'నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావ' ని అతనిని విమర్శించారు.
\s5
\p
\v 4 అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి యిలా వివరించి చెప్పాడు,
\v 5 "నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దాన్లో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటివంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.
\v 6 దానిని నేను నిదానించి చూస్తే భూమిమీదుండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
\s5
\v 7 అప్పుడు, 'పేతురూ, నీవు లేచి చంపుకొని తిను' అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.
\v 8 అందుకు నేను, 'వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేద' ని జవాబిచ్చాను.
\v 9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, 'దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్ద' ని వినిపించింది .
\v 10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
\s5
\v 11 వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న యింటి దగ్గర నిలబడ్డారు.
\v 12 అప్పుడు ఆత్మ, 'నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్లమ' ని అజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.
\v 13 అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెప్తూ, 'నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
\v 14 నీవూ, నీ యింటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెప్తాడు' అని అన్నాడని తెలియచేసాడు.
\s5
\v 15 నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ మొదట్లో మన మీదికి దిగినట్టుగా వారి మీదికీ దిగాడు.
\v 16 అప్పుడు, 'యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతార'ని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
\s5
\p
\v 17 కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?" అని చెప్పాడు.
\v 18 వారీమాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా 'అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరచారు.
\s అంతియొకయ సంఘం. విశ్వాసుల కొత్త పేరు
\s5
\p
\v 19 స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యం బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకు సంచరించారు.
\v 20 వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసుప్రభువును ప్రకటించారు.
\v 21 ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
\s5
\v 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపారు.
\v 23 అతడు వచ్చి దేవుని వరాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సహపరిచాడు.
\v 24 అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి. చాలామంది ప్రభువు ను నమ్మారు.
\s5
\v 25 బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్లి, అతనిని వెదికి పట్టుకుని అంతియొకయ తోడుకొని వచ్చాడు.
\v 26 వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయ లోని శిష్యులను మొట్టమొదటి సారిగా 'క్రైస్తవులు' అన్నారు.
\s అంతియొకయ సంఘం యెరూశలేము విశ్వాసులకోసం సహాయం పంపడం
\s5
\p
\v 27 ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.
\v 28 వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరవు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.
\s5
\v 29 అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడూ తన శక్తి కొద్దీ యూదయ లోని సోదరులకు సహాయం పంపడానికి నిశ్చయించుకున్నాడు.
\v 30 వారు అలా చేసి, బర్నబా, సౌలు అనే వారితో పెద్దలకు డబ్బు పంపించారు.
\s5
\c 12
\s ఐదవ హింసాకాండ. పేతురు చెర
\p
\v 1 ఆపైన హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు.
\v 2 యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.
\s5
\v 3 ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
\v 4 అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తర్వాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు.
\s5
\v 5 పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు.
\v 6 హేరోదు అతనిని విచారణకై తీసికొని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.
\s దూత మూలంగా పేతురు విడుదల
\s5
\p
\v 7 అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్లు ఊడి పడ్డాయి.
\v 8 దూత అతనితో, "నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో" అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన "పై బట్ట వేసికొని నాతో రా" అన్నాడు.
\s5
\v 9 అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్లి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు.
\v 10 మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరచుకొంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 11 పేతురు తెలివి తెచ్చుకుని, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండీ, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసిందని అనుకొన్నాడు.
\v 12 దీనిని గ్రహించిన తర్వాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ యింటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు.
\s5
\v 13 అతడు తలుపు తట్టినప్పుడు, రోడా అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.
\v 14 ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది.
\v 15 అందుకు వారు ఆమెను 'పిచ్చి దానివి' అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, 'అతని దూత అయి ఉండవచ్చు' అన్నారు.
\s5
\v 16 పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు.
\v 17 అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియచేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.
\s5
\v 18 తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాబరా పడ్డారు.
\v 19 హేరోదు అతని కోసం వెతికి కనబడక పోయేసరికి కావలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్లి అక్కడ నివసించాడు.
\s హేరోదు దుర్మరణం
\s5
\p
\v 20 తూరు, సీదోను వాసులపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గిరికి వెళ్ళారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తును వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది.
\v 21 నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చొని వారికి ఉపన్యాసమిచ్చాడు.
\s5
\v 22 ప్రజలు, "ఇది దేవుని స్వరమే గానీ మనిషిది కాదు" అని కేకలేశారు.
\v 23 అతడు దేవునికి మహిమ ఇవ్వనందుకు వెంటనే ప్రభువు దూత అతనికి ఘోర వ్యాధి కలిగించాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.
\s5
\p
\v 24 దేవుని వాక్యం అంతకంతకూ వ్యాపించింది.
\v 25 బర్నబా, సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని తిరిగి వచ్చారు.
\s5
\c 13
\s పౌలు బర్నబాలకు పరిశుద్ధాత్మ పిలుపు
\p
\v 1 అంతియొకయ లోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీవాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.
\v 2 వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, 'నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి' అని వారితో చెప్పాడు.
\v 3 విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తర్వాత వారిని పంపించారు.
\s పౌలు మొదటి సువార్త ప్రయాణం
\s5
\p
\v 4 కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్లారు.
\v 5 వారు సలమీ అనే ఊరికి చేరుకొని యూదుల సమాజ మందిరాలలో దేవుని వాక్యం ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
\s5
\v 6 వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్‌ యేసు అనే ఒకణ్ణి చూశారు.
\v 7 ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్యం వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.
\v 8 అయితే ఎలుమ(ఈ పేరుకు మాంత్రికుడు అని అర్ధం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు.
\s5
\v 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి
\v 10 అతనిని తేరి చూసి "అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా?
\s5
\v 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవ'ని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారేమో అని తడుములాడ సాగాడు.
\v 12 అధిపతి, జరిగిన దానిని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
\s5
\p
\v 13 తరువాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంపులియా లోని పెర్గే వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్లిపోయాడు.
\s పిసిదియ అంతియొకయ సమాజ కేంద్రం లో పౌలు ఉపదేశం: విశ్వాసం ద్వారానే నిర్దోషత్వం
\p
\v 14 అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియ లోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు.
\v 15 ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, "సోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా ఉపదేశం చెయ్యాలంటే, చెయ్యండి" అని అడిగారు.
\s5
\v 16 అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు,
\p
\v 17 "ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసికొని వచ్చాడు.
\v 18 సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు.
\s5
\v 19 కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు.
\v 20 ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు.
\s5
\v 21 ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ల పాటు రాజుగా ఇచ్చాడు.
\v 22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన 'నేను యెష్షయి కుమారుడు దావీదును కనుగొన్నాను. అతడు నా యిష్టానుసారుడైన మనిషి. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడ' ని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.
\s5
\p
\v 23 అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు.
\v 24 ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించాడు.
\v 25 యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, "నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు" అని చెప్పాడు.
\s5
\p
\v 26 "సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుణ్ణి ఆరాధించే వారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది.
\v 27 యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గాని, ప్రతి విశ్రాంతిదినాన చదివే ప్రవక్తల మాటలను గాని నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
\s5
\v 28 ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా ఆయనను చంపాలని పిలాతును కోరారు .
\v 29 ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయన్ని మాను మీదనుండి దింపి సమాధిలో పెట్టారు.
\s5
\v 30 అయితే దేవుడు చనిపోయిన వాళ్ళలో నుండి ఆయనను లేపాడు.
\v 31 ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు.
\s5
\v 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతులలో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు."
\p
\v 33 "నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను" అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.
\v 34 యింకా, ఇకపై కుళ్లు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపడం ద్వారా, 'దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను మీకిస్తాను' అని చెప్పాడు.
\s5
\v 35 అందుకే వేరొక కీర్తనలో, 'నీ పరిశుద్ధుని కుళ్లు పట్టనియ్యవు' అని చెబుతున్నాడు.
\v 36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు.
\v 37 తన పితరుల దగ్గర సమాధిలో కుళ్లిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్లు పట్టలేదు.
\s5
\v 38 కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.
\v 39 మిమ్మల్ని మోషే ధర్మశాస్త్రం ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి.
\s5
\v 40 ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే,
\q1
\v 41 'తిరస్కరిస్తున్న మీరు, ఆశ్చర్యపడి, నశించండి.
\q1 మీ రోజుల్లో నేనొక పని చేస్తాను,
\q1 ఆ పని ఎవరైనా మీకు వివరించినా మీరెంత మాత్రమూ నమ్మరు.'"
\s5
\p
\v 42 పౌలు బర్నబాలు వెళ్లిపోతుంటే ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినాన మళ్ళీ చెప్పాలని ప్రజలు బతిమిలాడారు.
\v 43 సమావేశం ముగిసిన తర్వాత చాలామంది యూదులూ, యూదా మతంలోకి మారినవారూ, పౌలునూ బర్నబానూ వెంబడించారు. పౌలు బర్నబాలు వారితో మాట్లాడుతూ, దేవుని కృపలో నిలిచి ఉండాలని వారిని ప్రోత్సహించారు.
\s యూదుల నుండి ప్రతిఘటన
\s5
\p
\v 44 మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్యం వినడానికి సమావేశం అయింది.
\v 45 యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి అవమానపర్చారు.
\s5
\v 46 అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు,"దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం అవసరమే. అయినా మీరు దానిని తోసి వేసి, మీకు మీరే నిత్యజీవానికి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము యూదేతరుల దగ్గరికి వెళ్తున్నాం.
\p
\v 47 ఎందుకంటే, 'నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చే వానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను' అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు" అన్నారు.
\s5
\v 48 యూదేతరులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్కును కొనియాడారు. అంతేగాక నిత్యజీవానికి నియమితులైన వారంతా విశ్వసించారు.
\v 49 ప్రభువు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాప్తి చెందింది.
\s5
\v 50 అయితే భక్తి మర్యాదలున్న స్త్రీలనూ ఆ పట్టణ ప్రముఖులనూ, యూదులు రెచ్చగొట్టి పౌలునూ బర్నబానూ హింసల పాలు చేసి, వారిని తమ ప్రాంతం నుండి తరిమేశారు.
\v 51 అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు.
\v 52 అయితే శిష్యులు ఆనందంతో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు.
\s5
\c 14
\s ఈకొనియలో పరిచర్య
\p
\v 1 ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.
\v 2 అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనస్సుల్లో సోదరుల మీద పగ పుట్టించారు.
\s5
\v 3 పౌలు బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
\v 4 ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి, కొందరు యూదుల వైపు, మరి కొందరు అపొస్తలుల వైపు చేరారు.
\s5
\v 5 యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్లు రువ్వి చంపాలని అనుకున్నారు.
\v 6 వారు ఆ సంగతి తెలిసికొని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.
\s లుస్త్ర, దెర్బే పట్టణాలలో
\p
\v 7 లుస్త్రలో కాళ్ళలో సత్తువ లేనివాడు ఒకడున్నాడు.
\s5
\v 8 అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.
\v 9 అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసముందని గమనించి,
\v 10 'లేచి నిలబడు' అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.
\s5
\v 11 జనం పౌలు చేసిన దానిని చూసి, లుకయోనియ భాషలో, 'దేవతలు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు' అని కేకలు వేసి,
\v 12 బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు.
\v 13 పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండల్నీ పట్టణ ముఖద్వారం దగ్గిరికి తీసికొని వచ్చి సమూహంతో కలిసి, బలి అర్పించాలని చూశాడు.
\s5
\v 14 అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకొని సమూహం లోకి చొరబడి
\v 15 "అయ్యా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.
\v 16 ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు.
\s5
\v 17 అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువుల్నీ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్షం నిలిపి ఉంచాడు."
\v 18 వారీవిధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.
\s లుస్త్రలో పౌలును రాళ్ళతో కొట్టడం
\s5
\p
\v 19 అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకొని, పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు.
\v 20 అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు.
\s5
\v 21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగివచ్చి
\v 22 శిష్యుల మనస్సులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.
\s సంఘాలలో పెద్దలను నియమించడం. అంతియొకయకు తిరిగి రాక
\s5
\p
\v 23 ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
\v 24 తరువాత పిసిదియ దేశమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.
\v 25 పెర్గేలో వాక్యం బోధించి, అత్తాలియ వెళ్ళారు.
\v 26 అక్కడనుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించుకొని, మొదట బయలుదేరిన అంతియొకయ తిరిగి వచ్చారు.
\s5
\v 27 వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.
\v 28 ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.
\s5
\c 15
\s యెరూషలేము పెద్దల సభ: సున్నతి గురించి చర్చ
\p
\v 1 యూదయ నుండి కొందరు వచ్చి, 'మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు', అని విశ్వాసులకు బోధించారు.
\v 2 పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, యింకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.
\s5
\v 3 కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియచేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.
\v 4 వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం ఇచ్చారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు.
\s5
\v 5 పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.
\p
\v 6 అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమకూడారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో యిలా అన్నాడు,
\s క్రైస్తవ స్వేచ్ఛకు అనుకూలంగా పేతురు వాదం
\s5
\p
\v 7 "సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలోనుండి నన్ను కొన్ని రోజుల ముందు దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు.
\v 8 హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి చేశాడు.
\v 9 మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు. .
\s5
\v 10 కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?
\v 11 ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు."
\s పౌలు బర్నబాల సాక్ష్యం
\s5
\p
\v 12 అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరులలో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.
\s యాకోబు సమీక్ష
\s5
\p
\v 13 వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు యిలా అన్నాడు, "సోదరులారా, నా మాట వినండి.
\v 14 యూదేతరులలో నుండి దేవుడు తన పేరున ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియచేసాడు.
\s5
\v 15 ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే
\q1
\v 16 'ఆ తరువాత నేను తిరిగి వస్తాను.
\q1 మనుషుల్లో మిగిలినవారూ,
\q1 నా నామం ఎవరైతే ధరించారో
\q1 ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా
\q1
\v 17 పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ
\v 18 అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియచేసిన ప్రభువు సెలవిస్తున్నాడు'
\q1 అని రాసి ఉంది.
\s యూదేతరులను ధర్మశాస్త్రం కిందికి తేకూడదు
\s5
\p
\v 19 కాబట్టి యూదేతరులలోనుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా
\v 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ, జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దానినీ, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.
\v 21 ఎందుకంటే, సమాజ మందిరాలలో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దానిని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు" అని చెప్పాడు.
\s5
\p
\v 22 అప్పుడు సోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, పౌలు బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది.
\v 23 వారు ఇలా రాసి పంపారు, "అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియ, కిలికియ లోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాసేది,
\s5
\v 24 కొందరు మా దగ్గర నుండి వెళ్లి తమ బోధతో మిమ్మల్ని గాభరా పెట్టి, మీ మనస్సులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ యివ్వలేదు.
\v 25 కాబట్టి కొందరిని ఎన్నుకొని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే
\v 26 మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది.
\s5
\v 27 అందువలన యూదానూ సీలనూ పంపుతున్నాము. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియచేస్తారు.
\v 28 విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి.
\v 29 తప్పనిసరైన వీటి కంటె ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు."
\s5
\p
\v 30 ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం యిచ్చారు.
\v 31 వారు దానిని చదువుకొని ప్రోత్సాహం పొంది సంతోషించారు.
\v 32 యూదా, సీల కూడ ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి ప్రోత్సాహపరిచారు.
\s5
\v 33 వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన
\v 34 వారి దగ్గరికి వెళ్లడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.
\v 35 పౌలు బర్నబాలు అంతియొకయలో చాలా మందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు.
\s పౌలు రెండవ సువార్త ప్రయాణం
\s5
\p
\v 36 కొన్నిరోజులైన తరువాత పౌలు 'ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్యం ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్లి, వారెలా ఉన్నారో చూద్దామ'ని బర్నబాతో అన్నాడు.
\v 37 అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు.
\v 38 అయితే పౌలు, పంఫులియ లో పనికోసం తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వానిని వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు.
\s5
\v 39 ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.
\v 40 పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి,
\v 41 సంఘాలను బలపరుస్తూ సిరియ కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.
\s5
\c 16
\s తిమోతి పరిచయం
\p
\v 1 పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన యూదు వనిత. తండ్రి గ్రీసు దేశం వాడు.
\v 2 తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది.
\v 3 అతడు తనతోకూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు .
\s5
\v 4 వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధుల్ని పాటించేలా వాటిని వారికి అందజేశారు.
\v 5 కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
\s ఆత్మ మార్గనిర్దేశం. మాసిదోనియా దర్శనం
\s5
\p
\v 6 ఆసియా ప్రాంతంలో వాక్యం చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్లారు. ముసియ దగ్గరకు వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేసారు గాని
\v 7 యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు.
\v 8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
\s5
\v 9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, 'నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చేయి' అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది.
\v 10 అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము .
\s5
\v 11 మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడనుండి ఫిలిప్పీకి వచ్చాము.
\s ఫిలిప్పి లో పరిచర్య. ఐరోపా ఖండంలో మొదటి విశ్వాసి లూదియ మార్పు
\p
\v 12 మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
\v 13 విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని తెలిసింది. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం.
\s5
\v 14 లూదియ అనే ఒక భక్తురాలు మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు వస్త్రాలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు.
\v 15 ఆమె, ఆమె యింటివారూ బాప్తిస్మం పొందారు. ' నేను ప్రభువులో విశ్వాసం గలదానిని అని మీరు భావిస్తే, నా యింటికి వచ్చి ఉండాలి,' అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
\s దయ్యాన్ని వదిలించడం. పౌలు సీలలకు దెబ్బలు
\s5
\p
\v 16 మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
\v 17 ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, "వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు" అని కేకలు వేసి చెప్పింది.
\v 18 ఆమె యిలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, 'నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు పేరున ఆజ్ఞాపిస్తున్నాను,' అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
\s5
\v 19 ఆమె యజమానులు తమ రాబడి పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండ దగ్గర అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
\v 20 న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసికొచ్చి, 'వీరు యూదులై ఉండి
\v 21 రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు', అని చెప్పారు.
\s5
\v 22 అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
\v 23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
\v 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాల లోకి తోసి, కాళ్లను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.
\s జైలు అధికారి మార్పు
\s5
\p
\v 25 మధ్యరాత్రి సమయంలో పౌలు సీల ప్రార్థన చేసుకొంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు.
\v 26 అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
\s5
\v 27 అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూచి, ఖైదీలు పారిపోయారనుకొని, కత్తిదూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు.
\v 28 అయితే పౌలు, "నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా యిక్కడే ఉన్నాం", అన్నాడు..
\s5
\v 29 చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి ,
\v 30 వారిని బయటికి తెచ్చి, "అయ్యా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?" అని అడిగాడు.
\v 31 అందుకు వారు, "ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ యింటివారూ రక్షణ పొందుతారు", అని చెప్పి
\s5
\v 32 అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యం చెప్పారు.
\v 33 రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసికొచ్చి, వాళ్ళ గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిస్మం పొందారు.
\v 34 అతడు పౌలు సీలలను తన యింటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవుని లో విశ్వాసముంచినందుకు తన యింటి వారందరితో కూడ ఆనందించాడు.
\s5
\v 35 తెల్లవారగానే, వారిని విడిచి పెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటుల్ని పంపారు.
\v 36 చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియ చేసి, "మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి", అని చెప్పాడు.
\s5
\v 37 అయితే పౌలు, "వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్లగొడతారా? మేము ఒప్పుకోము. వాళ్ళే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి", అని చెప్పాడు.
\v 38 భటులు ఈ మాటల్ని న్యాయాధికారులకు తెలియచేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి
\v 39 వారిని బతిమాలుకొని చెరసాల బయటికి తీసికొనిపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు .
\s5
\v 40 పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ యింటికి వెళ్లారు. వారు సోదరులను చూచి, ప్రోత్సహించి అ పట్టణం నుండి బయలుదేరి వెళ్లి పోయారు.
\s5
\c 17
\s తెస్సలోనిక సంఘ స్థాపన
\p
\v 1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలొనీక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
\v 2 పౌలు తన అలవాటు ప్రకారం అక్కడికి వెళ్లి మూడు విశ్రాంతి దినాలు లేఖనాలలో నుండి వారితో తర్కించాడు.
\s5
\v 3 క్రీస్తు హింసలు అనుభవించి మృతులలోనుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. 'నేను మీకు ప్రకటించే యేసే, క్రీస్తు' అని తెలియచేశాడు.
\v 4 కొంతమంది యూదులు ఒప్పుకొని పౌలు సీలల తో కలిశారు, వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖమైన స్త్రీలూ ఉన్నారు.
\s యూదుల వ్యతిరేకత
\s5
\p
\v 5 అయితే అ బోధకి సమ్మతించని యూదులు అసూయతో నిండి పోయి , ఊరిలో పనిపాటా లేకుండా తిరిగే కొంతమంది పోకిరీవాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్దగా అల్లరి చేస్తూ, యాసోను యింటి మీదపడి పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్లాలనుకున్నారు.
\v 6 అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరుల్నీ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయి, "భూలోకాన్ని తలక్రిందులు చేసిన వీరు యిక్కడికి కూడ వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.
\v 7 వీళ్ళంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెప్తూ కైసరు చట్టాలకు విరోధంగా నడుచుకొంటున్నారు," అని కేకలు వేశారు.
\s5
\v 8 జనమూ అధికారులూ ఈ మాటలు విని అందోళనపడ్డారు.
\v 9 వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసికొని విడుదల చేశారు.
\s బెరాయలో పరిచర్య
\s5
\p
\v 10 సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరం లోకి వెళ్ళారు.
\v 11 వీరు తెస్సలొనీక లో ఉన్నవారి కంటె ఉదాత్తమైన మనసు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు సీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
\v 12 అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
\s5
\v 13 అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని తెస్సలొనీకే లోని యూదులు తెలిసికొని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రేపి కలవరపరచారు.
\v 14 వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకు పంపారు. సీల, తిమోతి లు అక్కడే ఉండిపోయారు.
\v 15 పౌలును సాగనంపడానికి వెళ్లిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకు తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.
\s ఎతెన్సులో పౌలు
\s5
\p
\v 16 పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.
\v 17 అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి అరాధించే వారితోనూ, అంగడి వీధుల్లో ప్రతి రోజూ తనను కలిసికొనే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.
\s5
\v 18 ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, "ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి" అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, "ఇతడు మనం ఎరగని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాదు" అని చెప్పుకున్నారు.
\s5
\v 19 వారు అతనిని వెంటబెట్టుకొని అరేయొపగు అనే సమాఖ్య దగ్గరికి తీసికొనిపోయి, "నీవు చెప్తున్న ఈ కొత్త బోధ మేము తెలిసికోవచ్చా?
\v 20 నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది," అని చెప్పారు.
\v 21 ఏతెన్సు వారూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
\s అరియోపగు సభలో పౌలు ఉపన్యాసం
\s5
\p
\v 22 పౌలు అరేయొపగు సభనుద్దేశించి "ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా భక్తిపరులని నేను గమనిస్తున్నాను.
\v 23 నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద 'తెలియని దేవునికి' అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని అరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియచేస్తున్నాను.
\s5
\v 24 విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతితో చేసిన ఆలయాలలో నివసించడు.
\v 25 ఆయన అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
\s5
\v 26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతట్లో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. అందుచేత వారు దేవుణ్ణి వెతికి కనుగొనాలి.
\v 27 వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు.
\s5
\v 28 మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయన లోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. 'మనమాయన సంతానం,' అని మీ కవుల్లో కూడా కొందరు చెప్పారు.
\v 29 కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
\s5
\v 30 ఆ అజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.
\v 31 ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు."
\s5
\v 32 మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేసారు. మరి కొంతమంది దీనిని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.
\v 33 ఆ తర్వాత పౌలు వారి దగ్గర నుండి వెళ్లిపోయాడు.
\v 34 అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరేయొపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోపాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.
\s5
\c 18
\s కొరింతు లో పౌలు
\p
\v 1 ఆ తరువాత పౌలు ఏతెన్స్ నుండి బయలుదేరి కొరింతుకు వచ్చి, పొంతు వంశానికి చెందిన అకుల అనే ఒక యూదుడినీ అతని భార్య ప్రిస్కిల్లనూ గురించి తెలుసుకుని వారి దగ్గరకు వెళ్ళాడు.
\v 2 యూదులంతా రోమ్ నగరాన్ని విడిచి వెళ్ళాలని క్లాడియస్ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేసిన కారణం చేత, వారు ఇటలీ నుంచి కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి తరలి వచ్చారు.
\v 3 వారి వృత్తి డేరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
\s5
\v 4 అతడు ప్రతి విశ్రాంతిదినాన సమాజ మందిరంలో యూదులతో, గ్రీకు వారితో తర్కిస్తూ వారిని ఒప్పిస్తూ వచ్చాడు.
\v 5 సీల, తిమోతిలు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడంలో మరింతగా నిమగ్నమయ్యాడు. ఆసక్తితో యేసే క్రీస్తని యూదులకు బలంగా సాక్ష్యమిస్తున్నాడు.
\v 6 వారు అతనిని ఎదిరించి దూషించారు, అతడు తన బట్టలు దులుపుకొని "మీ రక్తం మీ తలమీదే ఉంటుంది గాక. నేను నిర్దోషిని. ఇకనుండి నేను యూదేతరుల దగ్గరికి వెళ్తాన" ని వారితో చెప్పి
\s5
\v 7 అక్కడనుండి వెళ్లి, దైవభక్తి గల తితియస్ యూస్తు అనే అతని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది.
\v 8 ఆ సమాజ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా ప్రభువులో విశ్వాసముంచాడు. ఇంకా కొరింతు పౌరుల్లో చాలామంది విని, విశ్వసించి బాప్తిస్మం పొందారు.
\s5
\v 9 ప్రభువు రాత్రివేళ దర్శనంలో "నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు.
\v 10 నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు" అని పౌలుతో చెప్పాడు.
\v 11 అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు.
\s గల్లియో నిర్లక్షం
\s5
\p
\v 12 గల్లియో అకయకు గవర్నర్ గా ఉన్న రోజుల్లో యూదులంతా ఏకమై పౌలు మీదికి లేచి న్యాయపీఠం ముందుకి అతణ్ణి తీసికొని వచ్చారు.
\v 13 "వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడ" ని ఆరోపణ చేశారు.
\s5
\v 14 పౌలు మాట్లాడడం ప్రారంభించినపుడు గల్లియో, "యూదులారా, ఈ వివాదం ఏదో ఒక అన్యాయానికో, ఒక చెడ్డ నేరానికో సంబంధించినదైతే నేను మీ మాట సహనంగా వినడం న్యాయమే.
\v 15 ఇది ఏదో ఉపదేశం గురించో, పేరులు గురించో, ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకోండి. ఇలాంటి వాటి గురించి విచారణ చేయడానికి నాకు మనసు లేదు" అని యూదులతో చెప్పి
\s5
\v 16 వారిని న్యాయపీఠం దగ్గర నుండి పంపి వేశాడు.
\v 17 అప్పడు అందరూ సమాజ మందిరం అధికారి సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు అయితే ఈ సంగతులేవీ గల్లియో పట్టించుకోలేదు.
\s పౌలు మొక్కుబడి
\s5
\p
\v 18 పౌలు ఇంకా చాల రోజులు అక్కడే ఉండి చివరికి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు. అతనికి మొక్కుబడి ఉండడం వల్ల కెంక్రేయలో తన జుట్టు కత్తిరించుకొని ప్రిస్కిల్ల, అకులతో కలిసి సిరియాకు బయలుదేరాడు.
\v 19 వారు ఎఫెసు వచ్చినప్పుడు పౌలు వారిని అక్కడ విడిచి పెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో వాదిస్తూ ఉన్నాడు.
\s5
\v 20 వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు.
\v 21 అతడు అంగీకరించక దేవుని చిత్తమైతే మరొకసారి వస్తానని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
\s5
\v 22 తరువాత కైసరయ రేవు లో దిగి యెరూషలేము వెళ్ళి, అక్కడి సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.
\v 23 అక్కడ కొంతకాలం ఉన్న తరువాత బయలుదేరి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు.
\s ఎఫెసులో అపోల్లో
\s5
\p
\v 24 అలెగ్జాండ్రియ వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు.
\v 25 అతడు ప్రభువు మార్గంలో ఉపదేశం పొంది, ఆత్మలో తీవ్రత కలిగి, యేసును గూర్చి స్పష్టంగా మాట్లాడుతూ, సమాజ మందిరాలలో ధైర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. కానీ అతనికి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలుసు.
\v 26 ప్రిస్కిల్ల, అకుల అతని గురించి విని, అతనిని చేర్చుకొని దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారు.
\s5
\v 27 తరువాత అతడు అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అక్కడి విశ్వాసులకు ఉత్తరాలు రాసి అతనిని చేర్చుకోమని అక్కడి సోదరులను ప్రోత్సాహపరిచారు. అతడు అక్కడికి వచ్చి, దైవ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసాడు.
\v 28 లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తని రుజువు పరుస్తూ, బహిరంగంగా యూదుల వాదాన్ని గట్టిగా ఖండిస్తూ వచ్చాడు.
\s5
\c 19
\s ఎఫెసులో యోహాను శిష్యగణం క్రైస్తవులు కావడం
\p
\v 1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని "మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా" అని అడిగాడు.
\v 2 వారు "పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేం వినలే" దని చెప్పారు.
\s5
\v 3 అప్పుడు పౌలు "అలాగైతే మీరు దేనిలోకి బాప్తిస్మం పొందార"ని అడగ్గా, వారు "యోహాను బాప్తిస్మం లోకి" అని చెప్పారు.
\v 4 అందుకు పౌలు "యోహాను తన వెనుక వచ్చే వానిలో, అనగా యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెప్తూ, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చాడు" అని చెప్పాడు.
\s5
\v 5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం పొందారు.
\v 6 తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు.
\v 7 వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు.
\s సమాజకేంద్రంలో ఆపైన తురన్ను అనే వాడి బడిలో పౌలు బోధనలు
\s5
\p
\v 8 తరువాత అతడు సమాజ మందిరంలోకి వెళ్లి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.
\v 9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసికొని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారినుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.
\v 10 రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్యం విన్నారు.
\s పౌలు చేసిన అద్భుతాలు
\s5
\p
\v 11 అంతేగాక దేవుడు పౌలు చేత కన్నులు మిరిమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు.
\v 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరకు తెస్తే వారి రోగాలు పోయాయి, దుష్టాత్మలు కూడ వదలిపోయాయి.
\s5
\v 13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు "పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను" అని చెప్పి, దుష్టాత్మలు పట్టినవారి మీద ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకొన్నారు.
\v 14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు.
\s5
\v 15 అందుకు ఆ దుష్టాత్మ "నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవర"ని అడగింది.
\v 16 ఆ దుష్టాత్మ పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దుష్టాత్మ గెలిచింది. అందుచేత వారు గాయాలతో నగ్నంగా ఆ ఇంటినుండి పారిపోయారు.
\v 17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం కలిగింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది.
\s5
\v 18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
\v 19 అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, బహిరంగంగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి రూపాయలు అయింది.
\v 20 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్యం వ్యాపించింది.
\s5
\v 21 ఇది జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఉద్దేశించి 'నేను అక్కడికి వెళ్లిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి' అని నిర్ణయించుకున్నాడు.
\v 22 అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదొనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.
\s ఎఫెసులో కంసాలుల ఆగడం
\s5
\p
\v 23 ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది.
\v 24 ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.
\v 25 అతడు వారిని, ఆ పని చేసే ఇతరులను పోగుచేసి వారితో, "ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు.
\s5
\v 26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్లు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడత్రోవ పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా.
\v 27 పైగా మన వృత్తిమీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్ష్యానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది" అని వారితో చెప్పాడు.
\s5
\v 28 వారు అది విని ఉగ్రులైపోయి "ఎఫెసీయుల డయానా మహాదేవి" అని కేకలు వేశారు.
\v 29 దానితో పట్టణం బహు గందరగోళం గా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మసిదోనియాకు చెందిన గాయినీ అరిస్తార్కునీ పట్టుకొని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శన శాలలోకి ఈడ్చుకు పోయారు.
\s5
\v 30 పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్లనియ్యలేదు.
\v 31 అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి "నీవు నాటక ప్రదర్శనశాల లోకి వెళ్లవద్దు" అని నచ్చజెప్పారు.
\v 32 ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలమందికి తెలియనే లేదు.
\s5
\v 33 అప్పుడు యూదులు అలెగ్జాండర్ ను ముందుకు తోసి అతనిని జనం ముందుకు తెచ్చారు. అలెగ్జాండర్ సైగ చేసి ఆ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలని చూసాడు.
\v 34 అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటలసేపు 'ఎఫెసీయుల డయానా మహాదేవి' అని నినాదాలు చేసారు.
\s5
\v 35 అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి "ఎఫెసీవాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు?
\v 36 ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడక పోతే మంచిది
\v 37 మీరు ఈ వ్యక్తుల్ని తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా?
\s5
\v 38 దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు.
\v 39 అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి.
\v 40 మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?" అని వారితో అన్నాడు.
\v 41 అతడలా చెప్పి సభను ముగించేసాడు.
\s5
\c 20
\s మాసిదోనియ గ్రీసుల గుండా పౌలు యెరూషలేము ప్రయాణం
\p
\v 1 ఆ అల్లరి సద్దుమణిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరికి పిలిచి ప్రోత్సాహక వాక్కులు చెప్పి వారి దగ్గర సెలవు తీసికొని మాసిదోనియ బయలుదేరాడు.
\v 2 ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసుల్ని ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు.
\v 3 అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తరువాత ఓడపై సిరియా వెళ్ళాలని భావించాడు గాని అక్కడి యూదులు అతనిపై కుట్ర చేస్తున్నారని తెలిసి తిరిగి మాసిదోనియ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
\s5
\v 4 ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, థెస్సలొనికవారు అరిస్తార్కు, సెకుందు, దెర్బె ఊరివాడు గాయి, తిమోతి, ఆసియా దేశాలకు చెందిన తుకికు, త్రోఫిము లు అతనితో ఆసియా వరకు వచ్చారు.
\v 5 అయితే వారంతా ముందుగా వెళ్లి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు.
\s త్రోయ లో పౌలు చర్యలు
\p
\v 6 మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి అయిదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకొని వారి దగ్గర ఏడు రోజులు గడిపాము.
\s5
\p
\v 7 ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు.
\v 8 మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.
\s5
\v 9 పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీ లో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడో అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు
\v 10 అప్పుడు పౌలు కిందికి వెళ్లి అతని మీద పడుకొని కౌగలించుకొని, "మీరిక చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడ" ని వారితో చెప్పాడు.
\s5
\v 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకు వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు.
\v 12 సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి లోపలి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
\s మిలేతుకు
\s5
\p
\v 13 మేము ఓడ ఎక్కి అస్సు అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ పౌలుని ఎక్కించుకోవాలని ముందుగా బయల్దేరాం. తాను అక్కడివరకు కాలి నడకను రావాలని ఉద్దేశించి పౌలు మమ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు.
\v 14 అస్సులో అతడు మాతో కలిసిన తరువాత మేమంతా కలిసి మితిలేనే వచ్చాం.
\s5
\v 15 అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకొని ఆ తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం.
\v 16 సాధ్యమైతే పెంతెకోస్తు రోజున యెరూషలేములొ ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియాలో కాలయాపన చేయకుండా ఎఫెసు వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
\s ఎఫెసు సంఘపెద్దలతో పౌలు
\s5
\p
\v 17 అతడు మిలేతులో ఉండగానే ఎఫెసు లోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు.
\v 18 వారు వచ్చినపుడు వారితో యిలా అన్నాడు, "నేను ఆసియాలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ప్రవర్తించానో మీకే తెలుసు.
\v 19 యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేసానని మీకు తెలుసు.
\v 20 ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను.
\v 21 అంతేకాక, దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ , గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు.
\s5
\v 22 ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు.
\v 23 కానీ , పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్ష్యమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు.
\v 24 అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు.
\s5
\v 25 ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు.
\v 26 కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.
\v 27 ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.
\s5
\v 28 ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.
\v 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటి వారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.
\v 30 అంతేకాక శిష్యుల్ని తమతో ఈడ్చుకుపోవడం కోసం వక్రమైన మాటలు పలికే వ్యక్తులు మీలోనుండే బయలుదేరుతారు.
\s5
\v 31 కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి చెప్తూ ఉన్నానని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.
\v 32 ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్దులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిమంతుడు.
\s5
\v 33 నేను ఎవరి వెండిని గానీ, బంగారాన్ని గానీ ఆశించలేదు.
\v 34 నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.
\v 35 మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, 'పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము', అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసికోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను".
\s5
\p
\v 36 అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేసాడు.
\v 37 అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు.
\v 38 మరి ముఖ్యంగా మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకు అతనిని సాగనంపారు.
\s5
\c 21
\s తూరు పట్టణానికి ప్రయాణం
\p
\v 1 మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్లి కోసుకు, మరునాడు రొదుకు, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం.
\v 2 అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం.
\s5
\v 3 దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి కుడి పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్లి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
\s యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలుకు హెచ్చరిక
\p
\v 4 మేమక్కడి శిష్యులను కలుసుకొని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా 'నీవు యెరూషలేములో కాలు పెట్టవద్ద'ని పౌలుతో చెప్పారు.
\s5
\v 5 ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకు సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం.
\v 6 మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
\s5
\p
\v 7 మేము తూరునుండి ప్రయాణించి, తొలెమాయి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం.
\v 8 మరునాడు బయలుదేరి కైసరయ వచ్చి, అపొస్తలులు నియమించిన ఏడుగురిలో ఒకడైన సువార్తికుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం.
\v 9 ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
\s యెరూషలేముకు వెళ్ళవద్దని మరలా హెచ్చరిక
\s5
\p
\v 10 మేమక్కడ చాలా రోజులు ఉన్నాం. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
\v 11 అతడు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, దానితో తన చేతులను కాళ్లను కట్టుకొని "యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల వ్యక్తిని ఈ విధంగా బంధించి, యూదేతరుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడని" అన్నాడు.
\s5
\v 12 ఈ మాట విన్నప్పుడు మేమూ, అక్కడివారూ యెరూషలేముకు వెళ్లవద్దని పౌలును బతిమాలుకొన్నాం.
\v 13 కానీ పౌలు, "ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాడు.
\v 14 అతడు మా మాట అంగీకరించక పోవడం వలన మేము "ప్రభువు చిత్తం జరుగు గాక" అని ఊరుకున్నాం.
\s యెరూషలేములో పౌలు
\s5
\p
\v 15 ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేముకు ప్రయాణించాం.
\v 16 మాతో కలిసి కైసరయ నుంచి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోనును తమతో తీసుకువచ్చారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేసారు.
\s5
\v 17 మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొన్నారు.
\v 18 మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు.
\v 19 అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
\s5
\v 20 అది విని వారు దేవుణ్ణి మహిమ పరచి అతనితో "సోదరా, యూదులలో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు కదా? వారంతా ధర్మశాస్త్ర్రంలో ఆసక్తి గలవారు.
\v 21 యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించ కూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
\s5
\v 22 కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది.
\v 23 మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు.
\v 24 నీవు వారిని తీసుకుపోయి వారితో కూడ శుద్ధి చేసికొని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
\s5
\v 25 అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటి రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం." అని చెప్పారు.
\v 26 కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తుల్ని వెంటబెట్టుకొని వెళ్లి , వారితో కలిసి శుద్ధి చేసికొని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకు శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
\s ఆలయంలో యూదులు పౌలును బంధించడం
\s5
\p
\v 27 ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకొని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి
\v 28 "ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసాడు" అని కేకలు వేశారు.
\v 29 ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసికొని వచ్చాడని వారు భావించారు.
\s5
\v 30 పట్టణమంతా గందరగోళం ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
\v 31 వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది.
\s5
\v 32 వెంటనే అతడు సైనికుల్నీ, శతాధిపతుల్నీ వెంటబెట్టుకొని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.
\v 33 అతడు వచ్చి పౌలుని పట్టుకొని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, "ఇతడెవడు? ఏమి చేశాడు?" అని అడిగాడు.
\s5
\v 34 అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలుని కోటలోకి తీసికొని పొమ్మని ఆజ్ఞాపించాడు.
\v 35 పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకు పోవాల్సి వచ్చింది.
\v 36 ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.
\s5
\p
\v 37 వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని "నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?" అని అడిగాడు. అందుకు అతడు "నీకు గ్రీకు భాష తెలుసా?'
\v 38 ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉద్యమకారుల్ని తీసుకొని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?" అని అడిగాడు.
\s5
\v 39 అందుకు పౌలు, "నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నా" అన్నాడు.
\v 40 అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్లమీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దు మణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు,
\s5
\c 22
\s జనసమూహం ఎదుట పౌలు సంజాయిషీ. తన మార్పు గురించి సాక్ష్యం (అపో. కా. 9:1-18; 26:9-18)
\p
\v 1 "సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.''
\p
\v 2 అతడు హెబ్రీభాషలో మాటలాడటం విన్నప్పుడు వారు నిశ్శబ్దమై పోయారు. అతడు ఈ విధంగా చెప్పాడు.
\s5
\p
\v 3 "నేను కిలికియలోని తార్సు పట్టణంలో పుట్టిన యూదుణ్ణి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల దగ్గర పెరిగి, మన పూర్వీకుల ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలలో శిక్షణ పొందాను. మీరంతా ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి,
\v 4 ఈ విశ్వాస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషుల్ని బంధించి చెరసాలలో వేయిస్తూ, చనిపోయేదాకా హింసించాను.
\v 5 ఈ విషయంలో ప్రధాన యాజకుడూ పెద్దలందరూ సాక్షులు. నేను వారి నుండి దమస్కులోని మన సోదరులకు లేఖలు తీసికొని, అక్కడి విశ్వాసులను కూడా బంధించి శిక్ష వేయడానికి యెరూషలేముకు తీసుకు రావాలని అక్కడికి వెళ్ళాను.
\s5
\v 6 నేను ప్రయాణం చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు హఠాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది.
\v 7 నేను నేల మీద పడి 'సౌలూ సౌలూ, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని' నాతో ఒక స్వరం పలకడం విన్నాను.
\v 8 అందుకు నేను 'ప్రభూ! నీవెవరివి?' అని అడగ్గా ఆయన, 'నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని' అని నాతో చెప్పాడు.
\s5
\v 9 నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారు గాని నాతో మాటలాడిన స్వరాన్ని వినలేదు.
\v 10 అప్పుడు నేను 'ప్రభూ, నన్నేం చేయమంటావు?' అని అడిగాను. అప్పుడు ప్రభువు, 'నువ్వు లేచి దమస్కులోకి వెళ్లు, అక్కడ నువ్వేం చేయాలని నేను నిర్ణయించానో అవన్నీ నీకు తెలుస్తాయి' అని నాతో అన్నాడు.
\v 11 ఆ వెలుగు ప్రభావం వలన నేను చూడలేకపోయాను. దాంతో నాతో ఉన్నవారు నన్ను నడిపిస్తూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు.
\s5
\p
\v 12 అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి
\v 13 ' సోదరా సౌలూ, చూపు పొందు' అని నాతో చెప్పగానే నేను చూపు పొంది అతణ్ణి చూశాను.
\s5
\v 14 అప్పుడు అతడు 'మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలిసికోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ , ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు.
\v 15 నీవు చూసిన వాటిని గురించీ, విన్నవాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు.
\v 16 కాబట్టి ఆలస్యమెందుకు? లేచి ఆయన పేరున బాప్తిస్మం పొంది, ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసికో' అన్నాడు.
\s5
\v 17 ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను.
\v 18 ఆయన నాతో, 'నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్లు. నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యం ఇక్కడి వారు అంగీకరించరు' అని చెప్పాడు.
\s5
\v 19 అందుకు నేను, 'ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకముంచిన వారిని నేను చెరసాలలో వేయిస్తూ కొడుతూ ఉన్నానని వారికి తెలుసు.
\v 20 అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను' అని చెప్పాను.
\v 21 అందుకు ఆయన 'వెళ్లు, ఎందుకంటే నేను నిన్ను దూరంగా యూదేతరుల దగ్గరకు పంపుతాను' అని నాతో చెప్పాడు".
\s5
\p
\v 22 ఇంతవరకు అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, 'ఇటువంటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండ వాణ్ణి చంపివేయండి' అని కేకలు వేశారు.
\v 23 వారు కేకలు వేస్తూ తమ పై వస్త్రాలు విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు.
\v 24 ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణమేమిటో తెలిసికోవడం కోసం సహస్రాధిపతి అతనిని కొరడాలతో కొట్టి, విచారణ కోసం కోటలోకి తీసికొని పొండని ఆజ్ఞాపించాడు.
\s రోమా పౌరుని ఆధిక్యత
\s5
\p
\v 25 వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, 'శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?' అని అడిగాడు.
\v 26 శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి, 'నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?' అన్నాడు.
\s5
\v 27 అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలును చూసి, 'నీవు రోమీయుడవా? అది నాతో చెప్పు' అన్నప్పుడు
\v 28 అతడు 'అవున'ని చెప్పాడు. అప్పుడా సహస్రాధిపతి 'నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించు కున్నాను' అన్నాడు. అందుకు పౌలు, 'నేనైతే పుట్టుకతోనే రోమీయుణ్ణి' అని చెప్పాడు.
\v 29 కాబట్టి వారు వెంటనే పౌలుని విడిచిపెట్టారు. పైగా అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతణ్ణి బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు.
\s5
\p
\v 30 మరునాడు, యూదులు అతని మీద మోపిన నేరాన్ని ఖచ్చితంగా తెలిసికోవడం కోసం, సహస్రాధిపతి అతని సంకెళ్ళు విడిపించి, ప్రధాన యాజకులూ, మహా సభవారంతా సమావేశం కావాలని ఆజ్ఞాపించి, పౌలును తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టాడు.
\s5
\c 23
\s సన్ హెడ్రిన్ సభ ఎదుట పౌలు
\p
\v 1 పౌలు మహా సభవారిని సూటిగా చూసి, "సోదరులారా, నేను ఈ రోజు వరకు దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడుచుకొంటున్నాను" అని చెప్పాడు.
\v 2 అందుకు ప్రధాన యాజకుడు అననీయ, "అతన్ని నోటి మీద కొట్టండి" అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు.
\v 3 పౌలు అతణ్ణి చూసి, "సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?" అన్నాడు.
\s5
\v 4 అప్పుడు దగ్గర ఉన్నవారు, "నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?" అన్నారు.
\v 5 అందుకు పౌలు "సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు.'నీ ప్రజల అధికారిని నిందింపవద్దు' అని రాసి ఉంది" అన్నాడు.
\s పరిసయ్యుడు పౌలు
\s5
\p
\v 6 అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, "సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను." అని సభలో గొంతెత్తి చెప్పాడు.
\v 7 అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది.
\v 8 సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెప్తారు. కాని పరిసయ్యులు రెండూ ఉన్నాయంటారు.
\s5
\v 9 అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, "ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగాని, దేవదూత గానీ అతనితో మాట్లాడి ఉండవచ్చు" అని వాదించారు.
\v 10 కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, "వారి మధ్యనుండి అతణ్ణి బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసికొని రండ" ని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s ప్రభువు ఆదరణ వాక్కులు
\s5
\p
\v 11 ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి 'ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ లో కూడా చెప్పాల్సి ఉంటుంది." అని చెప్పాడు.
\s5
\p
\v 12 తెల్లవారిన తర్వాత కొందరు యూదులు పోగై, తాము పౌలుని చంపేటంత వరకు అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకొన్నారు.
\v 13 నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు.
\s5
\v 14 వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, "మేము పౌలును చంపేవరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టుపెట్టుకొన్నాం.
\v 15 కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం" అని చెప్పారు.
\s5
\v 16 అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేసాడు.
\v 17 అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, "ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకి తీసికొని వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది" అన్నాడు.
\s5
\v 18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరికి తీసుకొని పోయి, "'ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరకు తీసికొని పొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట" అని చెప్పాడు.
\v 19 సహస్రాధిపతి ఆ యువకుడి చెయ్యి పట్టుకొని అవతలికి తీసికొని పోయి, 'నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?' అని ఒంటరిగా అడిగాడు.
\s5
\v 20 అందుకతడు, "నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరకు తీసికొని రావాలని నిన్నుబ్రతిమాలేటందుకు యూదులు ఎదురుచూస్తున్నారు.
\v 21 వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటె ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపే దాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకొని ఉన్నారు" అని చెప్పాడు.
\s5
\v 22 అప్పుడు ఆ సహస్రాధిపతి, 'నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్ద'ని హెచ్చరించి పంపేశాడు.
\s కైసరయకు పౌలు
\p
\v 23 తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, 'కైసరయ వరకు వెళ్ళడానికి రెండు వందలమంది సైనికులనూ డెబ్భై మంది గుఱ్ఱపురౌతులనూ రెండు వందలమంది యీటెలవారినీ రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి.
\v 24 గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసికొని పోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి' అని చెప్పాడు.
\s5
\v 25 అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు,
\p
\v 26 "అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు, క్లాడియస్ లూసియస్ వందనాలు.
\v 27 యూదులు ఈ వ్యక్తిని పట్టుకొని చంపబోతుండగా, అతడు రోమీయుడని విని, సైనికులతో వెళ్ళి అతణ్ణి తప్పించాను.
\s5
\v 28 వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలిసికోవాలని నేను వారి మహాసభకు అతణ్ణి తీసికొని వెళ్ళాను.
\v 29 వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని, చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు.
\v 30 అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి, వెంటనే అతణ్ణి మీ దగ్గరకు పంపించాను. నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను."
\s5
\p
\v 31 కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రి పూట అంతిపత్రి తీసికొని వెళ్ళారు. మరునాడు వారు గుర్రపురౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు.
\v 32 వారు కైసరయ వచ్చి గవర్నరుకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు.
\v 33 గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగి, కిలికియకు చెందినవాడని తెలిసికొని,
\s5
\v 34 "'నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాన" ని చెప్పి,
\v 35 హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.
\s5
\c 24
\s ఫేలిక్స్ ఎదుట పౌలు
\p
\v 1 ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు.
\v 2 పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు,
\v 3 "మహా ఘనత వహించిన ఫేలిక్స్, మేము మీ పరిపాలనలో ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. అ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం.
\s5
\v 4 నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు ఎప్పటిలాగా శాంతంగా వినాలని వేడుకొంటున్నాను.
\v 5 ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేం గమనించాం.
\v 6 పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు.
\s5
\v 7 అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం. మీరు విచారిస్తే
\v 8 మేం ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ మీకే తెలుస్తాయి."
\v 9 యూదులంతా అందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.
\s ఫేలిక్స్ ఎదుట పౌలు సంజాయిషీ
\s5
\p
\v 10 అప్పుడు గవర్నర్, పౌలుని మాట్లాడమని సైగ చేసాడు. పౌలు ఇలా అన్నాడు, "మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను.
\v 11 నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్లి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలిసికోవచ్చు.
\v 12 దేవాలయంలో గానీ, సమాజ మందిరాల్లో గానీ, పట్టణంలో గానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజలను పోగుచేయడం ఎవరూ చూడలేదు.
\v 13 వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచ లేరు.
\s5
\v 14 ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి,
\v 15 నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతభేదం అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నానని మీ ముందు ఒప్పుకొంటున్నాను.
\v 16 ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.
\s5
\v 17 కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా సొంత ప్రజలకి దాన ధర్మంగా డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను.
\v 18 నేను శుద్ధి చేసికొని వాటిని అప్పగిస్తుండగా వీరు దేవాలయంలో నన్ను చూశారు. నేనేమీ గుంపు కూర్చలేదు, నా వలన అల్లరీ కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు.
\v 19 నామీద వారికేమైన ఉంటే వారే మీ వద్దకు వచ్చి నా మీద నేరం మోపి ఉండవలసింది.
\s5
\v 20 లేదా, నేను మహాసభలో నిలబడి ఉన్నప్పుడు, 'మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ముందు విమర్శ పాలవుతున్నా'నని
\v 21 నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయమై తప్ప నాలో మరి ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు."
\s5
\v 22 ఫేలిక్సుకు ఈ మార్గం గూర్చి బాగా తెలుసు. అతడు "సహస్రాధిపతి లూసియస్ వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాన" ని చెప్పి విచారణ నిలిపివేశాడు.
\v 23 పౌలుని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారం చేయడానికి అతని బంధువులలో ఎవరినీ ఆటంకపరచ వద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాడు.
\s రెండవ సారి ఫేలిక్స్ ఎదుట పౌలు
\s5
\p
\v 24 కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు.
\v 25 అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, "ఇప్పటికి వెళ్లు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను" అని చెప్పాడు.
\s5
\v 26 తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.
\s రెండేళ్ళు విరామం
\p
\v 27 రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నర్ గా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాలలోనే విడిచిపెట్టి వెళ్ళాడు.
\s5
\c 25
\s ఫేస్తు ఎదుట పౌలు
\p
\v 1 ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.
\v 2 అప్పుడు ప్రధాన యాజకులూ , యూదుల పెద్దలూ, పౌలు మీద తమ ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు.
\v 3 "దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండ" ని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకొని ఉన్నారు.
\s5
\v 4 అందుకు ఫేస్తు, "పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్లబోతున్నాను.
\v 5 కాబట్టి మీలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నేరమేదైనా ఉంటే మోపవచ్చు" అని జవాబిచ్చాడు.
\s5
\v 6 అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించాడు.
\v 7 పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలబడి, ఎన్నో తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేక పోయారు.
\v 8 పౌలు "యూదుల ధర్మశాస్త్రం గూర్చి గానీ, దేవాలయం గూర్చి గానీ, కైసరును గూర్చి గానీ నేనే తప్పూ చేయలేద"ని జవాబు చెప్పాడు.
\s5
\v 9 అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడని అనిపించుకోవాలని "యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణ నెదుర్కోవడం నీకిష్టమేనా?" అని పౌలును అడిగాడు.
\s "సీజరు ఎదుటే చెప్పుకుంటాను."
\p
\v 10 అందుకు పౌలు, "కైసరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విమర్శించ వలసిన స్థలమిదే, యూదులకు నేను ఏ అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు.
\s5
\v 11 నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నామీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి అప్పగించడానికి వీలు లేదు. నేను కైసరు ముందే చెప్పుకుంటాను' అన్నాడు.
\v 12 అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, "కైసరు ముందు చెప్పుకుంటాను అన్నావు కదా, కైసరు దగ్గరకే పంపిస్తాను" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 13 ఆ తరవాత కొన్ని రోజులకు అగ్రిప్ప రాజు, బెర్నీకే, ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు.
\v 14 వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, 'ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఒక ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు.
\v 15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, అతని మీద ఫిర్యాదు చేసి అతణ్ణి శిక్షించమని కోరారు.
\v 16 అందుకు నేను 'నేరం ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి, తన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి అవకాశం ఇవ్వకుండా ఏ వ్యక్తికీ తీర్పు తీర్చడం రోమనుల ఆచారం కాదు' అని జవాబిచ్చాను.
\s5
\v 17 వారిక్కడికి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయకుండా, మరునాడే న్యాయపీఠం మీద కూర్చొని ఆ వ్యక్తిని తీసుకు రమ్మని ఆజ్ఞాపించాను.
\v 18 అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు.
\v 19 కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకని గూర్చీ ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది.
\v 20 ఆ యేసు బతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడు. నేనలాటి వాదాల విషయం ఏ విధంగా విచారించాలో తోచక, యెరూషలేముకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విచారించడం అతని కిష్టమవుతుందేమో అడిగాను.
\s5
\v 21 అయితే పౌలు, చక్రవర్తి ముందు తనను నిలబెట్టాలని చెప్పడం చేత నేనతణ్ణి కైసరు దగ్గరకు పంపించే వరకు కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాను."
\v 22 అందుకు అగ్రిప్ప "ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది" అన్నాడు. దానికి ఫేస్తు "రేపు వినవచ్చు" అని చెప్పాడు.
\s5
\p
\v 23 మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞ పై పౌలును తీసుకు వచ్చారు.
\v 24 అప్పుడు ఫేస్తు, "అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా, మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారు గదా. యెరూషలేములోనూ, ఇక్కడా యూదులంతా వీడు ఇక బతక కూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరేకంగా నాకు మనవి చేసుకున్నారు.
\s5
\v 25 ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదని నేను గ్రహించాను. కానీ ఇతడు చక్రవర్తి ముందు చెప్పుకుంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చయించాను.
\v 26 కానీ ఇతని గూర్చి మన చక్రవర్తికి రాయడానికి నాకు సరైన కారణం ఏమీ కనబడలేదు. కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ముందుకు, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా, మీ ముందుకు ఇతనిని రప్పించాను.
\v 27 ఖైదీ మీద మోపిన నేరాలను వివరించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉద్దేశ్యం." అని వారితో చెప్పాడు.
\s5
\c 26
\s అగ్రిప్ప ఎదుట పౌలు
\p
\v 1 అగ్రిప్ప పౌలుతో, "నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి నిచ్చాను" అన్నాడు. అప్పుడు పౌలు తను మాట్లాడబోతున్నట్టు సూచిస్తూ చేయి చాచి ఈ విధంగా జవాబు చెప్పాడు.
\v 2 "అగ్రిప్ప రాజా, మీరు యూదుల ఆచారాలనూ, వివాదాలనూ బాగా ఎరిగిన వారు.
\v 3 యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి ఈ రోజు మీ ముందు జవాబు చెప్పుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. దయచేసి ఓపికతో నా మనవి వినండి.
\s5
\v 4 యెరూషలేములో నా ప్రజల మధ్య బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.
\v 5 వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠ గల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.
\s5
\v 6 అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణ గూర్చి విమర్శించడానికి నన్ను నిలబెట్టారు.
\v 7 మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.
\v 8 దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?
\s5
\v 9 నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను.
\v 10 యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేసాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను.
\v 11 చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.
\s5
\v 12 అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞల్నీ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు
\v 13 రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటె ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.
\v 14 మేమందరమూ నేల మీద పడినప్పుడు, 'సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నటం నీకు కష్టం' అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
\s5
\v 15 అప్పుడు నేను 'ప్రభూ, నీవు ఎవరివి?' అని అడిగినపుడు ప్రభువు, 'నీవు హింసిస్తున్న యేసుని.
\v 16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,
\v 17 నేను ఈ ప్రజల వల్లా, యూదేతరుల వల్లా నీకు హాని కలుగకుండా కాపాడతాను.
\v 18 వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధులలో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తాను' అని చెప్పాడు.
\s5
\v 19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి
\v 20 మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.
\v 21 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు.
\s5
\v 22 అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకు నిలిచి ఉన్నాను. క్రీస్తు హింసలు పొంది మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటివాడు కావడంచేత, యూదులకూ యూదేతరులకూ వెలుగు ప్రసరిస్తుందని
\v 23 ప్రవక్తలు, మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమీ కలపకుండా, అల్పులకూ ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను."
\s5
\v 24 అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, "పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింద"ని గట్టిగా అరిచాడు.
\v 25 అందుకు పౌలు ఇలా అన్నాడు, "మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.
\v 26 రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు.
\s5
\v 27 అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు." అన్నాడు.
\v 28 అందుకు అగ్రిప్ప,"ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే" అని పౌలుతో అన్నాడు.
\v 29 అందుకు పౌలు, "తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నా లాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక" అన్నాడు.
\s5
\v 30 అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి
\v 31 "ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు" అని తమలో తాము మాట్లాడుకున్నారు.
\v 32 అప్పుడు అగ్రిప్ప "ఈ మనిషి కైసరు ముందు చెప్పుకుంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే" అని ఫేస్తుతో చెప్పాడు.
\s5
\c 27
\s రోమ్ కు ప్రయాణ సన్నాహాలు
\p
\v 1 మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు.
\v 2 ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అద్రముత్తియ పట్టణపు ఓడ ఎక్కి మేం బయలుదేరాం. మాసిదోనియలోని థెస్సలొనీక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు.
\s5
\v 3 మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.
\v 4 అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.
\v 5 తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మూర (మైరా)కు చేరాం.
\v 6 అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు.
\s5
\v 7 చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.
\v 8 అతి కష్టంతో దానిని దాటి, 'సురక్షిత ఆశ్రయాలు' అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది.
\s5
\v 9 చాలా కాలం గడిచింది. యూదుల ఉపవాసదినం కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
\v 10 అప్పుడు పౌలు "సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలుగబోతున్నదని నాకనిపిస్తుంది". అని వారిని హెచ్చరించాడు.
\v 11 అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.
\s5
\v 12 పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతు లోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.
\v 13 అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి లంగరెత్తి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు.
\s తుఫాను
\s5
\p
\v 14 కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీదనుండి విసిరింది.
\v 15 ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకొనిపోయాం.
\v 16 తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా దాని నడిపించాం. బహు కష్టంగా ఓడను కాపాడుకోగలిగాం.
\s5
\v 17 దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసికొని ఓడ చుట్టూ బిగించి కట్టారు. సూర్తిస్ అనే ఇసుకతిప్ప మీద పడతామేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయారు.
\v 18 గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలెట్టారు.
\s5
\v 19 మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
\v 20 కొన్ని రోజులపాటు సూర్యుడు గాని, నక్షత్రాలు గాని కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది.
\s పౌలు ప్రోత్సాహ వాక్కులు
\s5
\p
\v 21 వారు చాలాకాలం పస్తులు ఉండడం వలన పౌలు వారి మధ్య నిలబడి, "అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలు దేరకుండానే ఉండాల్సింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది.
\v 22 ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకే గానీ, మీలో ఎవరి ప్రాణానికి గానీ హాని కలగదు.
\s5
\v 23 నేను ఎవరి వాడినో, ఎవరిని సేవిస్తున్నానో, ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, 'పౌలూ, భయపడకు.
\v 24 నీవు కైసరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడ'ని నాతో చెప్పాడు.
\v 25 కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.
\v 26 అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉంద"ని చెప్పాడు.
\s5
\v 27 పద్నాల్గవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్ధరాత్రి వేళ ఓడనావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి
\v 28 ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు నూట ఇరవై అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్లిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి తొంభై అడుగుల లోతని తెలుసుకున్నారు.
\v 29 అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉన్నారు.
\s5
\v 30 అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.
\v 31 అందుకు పౌలు "వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకోలేర" ని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.
\v 32 వెంటనే సైనికులు పడవ తాళ్లు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు.
\s5
\v 33 తెల్లవారుతుండగా పౌలు, "పద్నాలుగు రోజులనుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు.
\v 34 కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు" అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.
\v 35 ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకొని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగాడు.
\s5
\v 36 అప్పుడంతా ధైర్యం తెచ్చుకొని ఆహారం తీసుకున్నారు.
\v 37 ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరు మందిమి.
\v 38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు.
\s5
\v 39 తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేకపోయారు, తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడని అందులోకి తోయాలని ఆలోచించారు.
\v 40 కాబట్టి లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు.
\v 41 కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకు పోయి ఇసుక లో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదల లేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలై పోతూ ఉంది.
\s5
\v 42 ఖైదీలలో ఎవరూ ఈదుకొని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని,
\v 43 శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,
\v 44 మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకొని ఒడ్డుకు చేరాం.
\s5
\c 28
\s మెలితే దివిలో పౌలుకు పాము కాటు
\p
\v 1 మేము తప్పించుకొన్న తరువాత ఆ ద్వీపం మెలితే అని మాకు తెలిసింది.
\v 2 అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన పరిచర్యలు అన్నీ ఇన్నీ కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు.
\s5
\v 3 అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది.
\v 4 ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకొని వేలాడటం చూసి, 'ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకొన్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బతకనియ్యద'ని తమలో తాము చెప్పుకొన్నారు.
\s5
\v 5 కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు.
\v 6 వారైతే అతని శరీరం వాచి పోవడమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని, 'ఇతడొక దేవుడు' అని చెప్పసాగారు.
\s5
\v 7 పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకొని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు.
\s పొప్లి తండ్రికి స్వస్థత
\p
\v 8 ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకొని ఉన్నాడు. పౌలు అతని దగ్గరకు వెళ్లి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు.
\v 9 ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు.
\v 10 వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు.
\s5
\v 11 అశ్వినీ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి
\v 12 సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం.
\s5
\v 13 అక్కడనుండి చుట్టు తిరిగి రేగియు వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీకి వచ్చాం.
\v 14 అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం.
\v 15 అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకు, మూడు సత్రాల పేట వరకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొన్నాడు.
\s రోమ్ చేరుకున్న పౌలు, యూదుల మధ్య పరిచర్య
\s5
\p
\v 16 మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు.
\v 17 మూడు రోజుల తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరకు పిలిపించాడు. వారు వచ్చినప్పుడు అతడు, "సోదరులారా, నేను మన ప్రజలకూ , పూర్వీకుల ఆచారాలకూ వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా, యెరూషలేములో నన్ను రోమీయుల చేతికి అప్పగించారు.
\v 18 వారు నన్ను విచారించి నాలో మరణానికి తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని
\s5
\v 19 యూదులు అభ్యంతరం చెప్పడం వలన నేను 'కైసరు ఎదుట చెప్పుకుంటాను' అనవలసి వచ్చింది. నా స్వజనం మీద నేరం మోపాలని నా అభిప్రాయం కాదు.
\v 20 ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు" అని వారితో చెప్పాడు.
\s5
\v 21 అందుకు వారు "యూదయ నుండి మీ గురించి మాకేమీ ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదరులలో ఒక్కడైనా మీ గురించి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలుపలేదు. ఎవరూ చెప్పుకోలేదు కూడా.
\v 22 అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు" అని జవాబిచ్చారు.
\s5
\v 23 అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తలలో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు.
\v 24 అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.
\s5
\v 25 వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే,
\p
\v 26 'వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు అని ఈ ప్రజలతో చెప్పండి.
\s5
\p
\v 27 ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏదీ వినిపించుకోరు, వారి కన్నులు మూసుకుని ఉన్నారు' అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే.
\s5
\p
\v 28 కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరకు తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు.
\v 29 వారు దానిని అంగీకరిస్తారు.' ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు.
\s5
\v 30 పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంటిలో నివసించి, తన దగ్గరకు వచ్చే వారినందరినీ ఆదరిస్తూ
\v 31 ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.

1055
46-ROM.usfm Normal file
View File

@ -0,0 +1,1055 @@
\id ROM Romans
\s5
\c 1
\s ముందు మాట; ముఖ్యాంశం
\p
\v 1 యేసు క్రీస్తు దాసుడు, అపొస్తలుడుగా పిలుపు పొందినవాడు,
\v 2 దేవుని శుభవార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండటానికి పిలుపు పొందినవారికి శుభాలు చెబుతూ రాస్తున్నది.
\v 3 మన తండ్రి అయినదేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ, కృప, సమాధానం, మీకు కలుగు గాక.
\s5
\v 4 దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ శుభవార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు.
\v 5 యేసు క్రీస్తు, శారీరకంగా చూస్తే దావీదు సంతానం అయినా దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఇది బల ప్రభావాలతో రుజువైంది.
\v 6 ఈయన నామం కోసం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము.
\s5
\v 7 వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండటానికి పిలుపు పొందారు.
\s5
\v 8 మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.
\v 9 ఏదో ఒక విధంగా మీ దగ్గరకు రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనలలో ఎప్పుడూ ఆయన్ని బతిమాలుకుంటున్నాను.
\v 10 మిమ్మల్ని ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన కుమారుని సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి.
\s5
\v 11 మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందటం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను.
\v 12 అప్పుడు ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.
\s5
\p
\v 13 సోదరులారా, ఇది మీకు తెలియాలి. యూదేతరులైన ఇతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని చాలా సార్లు ప్రయత్నించాను గాని ఇప్పటి వరకు వీలు కాలేదు.
\v 14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను.
\v 15 కాబట్టి రోమాలోని మీకు కూడా శుభవార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
\s5
\v 16 శుభవార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే యూదుడైనా, గ్రీసు దేశస్తుడైనా నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి.
\v 17 "నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడని" రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
\s మొదటి భాగం- దోషభరిత లోకం పై దేవుని ఉగ్రత
\s5
\p
\v 18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి బయలుపడింది.
\v 19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దానిని వారికి వెల్లడి చేశాడు.
\s5
\v 20 అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు, ఈ లోకం పుట్టినప్పటి నుండి ఉన్న వస్తువులను పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.
\s యూదేతరుల భ్రష్టత్వం, ఏడు దశలు
\p
\v 21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయన్ని దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గాని తమ ఆలోచనలలో బుద్ధిహీనులయ్యారు.
\s5
\v 22 వారి అవివేక హృదయం చీకటిమయం అయ్యింది. తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.
\v 23 వారు ఎన్నటికీ తరిగిపోని దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు, వీటన్నిటి రూపాలకు ఆపాదించారు.
\s యూదేతరుల భ్రష్టత్వం ఫలితాలు
\s5
\p
\v 24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమానపరచుకొనేలా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు.
\v 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.
\s5
\p
\v 26 దీని కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సహితం తమ ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి ప్రకృతి విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించారు.
\v 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.
\s5
\v 28 వారి మనస్సుల్లో దేవునికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు.
\s5
\v 29 వారు సమస్తమైన దుర్నీతి, చెడుతనం, లోభత్వం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం, వీటన్నిటితో నిండిపోయారు.
\v 30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తలిదండ్రుల్ని ఎదిరించేవారు, బుద్ధిహీనులు,
\v 31 మాట తప్పేవారు, జాలి లేనివారు, దయ చూపనివారు అయ్యారు.
\s5
\v 32 ఇలాటివారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
\s5
\c 2
\s యూదేతర నీతి బోధకులు
\p
\v 1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకొంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?
\v 2 ఆ పనులు చేసేవారి మీద దేవుని తీర్పు న్యాయమైందే అని మనకు తెలుసు.
\s5
\v 3 ఆ పనులు చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు?
\v 4 దేవుని కటాక్షం నిన్ను మారు మనస్సుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?
\s5
\v 5 నీ మొండితనం, మారని నీ హృదయాన్ని బట్టి, దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజున, దేవుని కోపాన్ని పోగుచేసుకుంటున్నావు.
\v 6 ఆయన ప్రతివ్యక్తికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు.
\v 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయత లను వెదికేవారికి నిత్యజీవమిస్తాడు.
\s5
\v 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి.
\v 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి, బాధ, వేదన కలుగుతాయి.
\s5
\v 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి, మహిమ, ఘనత, సమాధానం కలుగుతాయి.
\v 11 దేవునికి పక్షపాతం లేదు.
\v 12 ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు.
\s5
\v 13 ధర్మశాస్త్రం వినేవారిని కాదు, దానిని అనుసరించి ప్రవర్తించేవారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు.
\v 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు ధర్మశాస్త్ర సంబంధమైన పనులు చేస్తే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రం లాగా ఉంటారు.
\s5
\v 15 అలాటి వారి మనస్సాక్షి కూడ సాక్షమిస్తుంది, వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది.
\v 16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.
\s ధర్మశాస్త్రం తెలిసిన యూదులకు ధర్మశాస్త్రం ప్రకారమే శిక్ష
\s5
\p
\v 17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని బట్టి దేవునిలో అతిశయిస్తున్నావు కదా?
\v 18 ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దానిని మెచ్చుకొంటావు కదా?
\v 19 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలిగి, "నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి,
\v 20 బుద్ధి లేనివారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలకి ఉపదేశం చేసేవాణ్ణి" అని నీకు నీవే పిలుచుకుంటున్నావు కదా?
\s5
\v 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా?
\v 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకొంటూ నీవు గుడులను దోచుకుంటావా?
\s5
\v 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా?
\v 24 "మిమ్మును బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?" అని రాసి ఉంది కదా.
\s5
\p
\v 25 నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే వాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే.
\v 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినట్టే గదా?
\v 27 సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతీ కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా?
\s5
\v 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు.
\v 29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వారినే మన దేవుడు మెచ్చుకుంటాడు.
\s5
\c 3
\s యూదులకున్న లాభం వారికి మరింత శిక్షకే దారి తీసింది
\p
\v 1 అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి?
\v 2 ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కు ప్రత్యక్షత యూదులకే కలిగింది.
\s5
\v 3 కొందరు యూదులు నమ్మకపోతే ఏమిటి? వారు అవిశ్వాసులు కాబట్టి దేవుడు నమ్మతగినవాడు కాకపోతాడా? కానేకాదు.
\v 4 "నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీవు తీర్పు చెప్పేటప్పుడు గెలవటానికి" అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగానే ఉంటాడు.
\s5
\v 5 మన దుర్నీతి దేవుని నీతిని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయస్థుడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను.
\v 6 అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?
\s5
\p
\v 7 నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు?
\v 8 మంచి జరగటం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారిమీదికి వచ్చే శిక్ష న్యాయమైందే.
\s ఫలితార్థం- లోకమంతా దేవుని ఎదుట దోషిగా నిలిచింది
\s5
\p
\v 9 అలాగని మేము వారికంటె మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.
\v 10 దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే,
\q1 "నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.
\q1
\s5
\v 11 గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
\q1
\v 12 అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు.
\q1 మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.
\q1
\s5
\v 13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.
\q1 వారి నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.
\q1 వారి పెదవుల కింద నాగుపాము విషం ఉంది.
\q1
\v 14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
\q1
\s5
\v 15 రక్తం చిందించడానికి వారి పాదాలు పరుగెడుతూ ఉన్నాయి.
\q1
\v 16 వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.
\q1
\v 17 వారికి శాంతిమార్గం తెలియదు.
\q1
\v 18 వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు."
\s5
\p
\v 19 ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు.
\v 20 ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.
\s రెండవ భాగం- కేవలం సిలువ వేయబడిన క్రీస్తు పై విశ్వాసం ద్వారా మాత్రమే మనిషిని నిర్దోషిగా తీర్చడం ఒక్కటే పాపనివారణ మార్గం (రోమా 3:21- 5:11) నిర్దోషిగా తీర్చడం, నిర్వచనం
\s5
\p
\v 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని నీతి వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్షంగా ఉన్నాయి.
\v 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికి కలిగే దేవుని నీతి.
\s5
\v 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు.
\v 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు.
\s5
\v 25 గతంలో చేసిన పాపాలను దేవుడు తన ఓర్పుతో సహించాడు అనడానికి రుజువుగా క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా ఆయన తన నీతిని బయలుపరచ డానికి ఆయనను అనుగ్రహించాడు.
\v 26 ఇదంతా ఇప్పుడెందుకు జరిగిందంటే దేవుడు తాను నీతిమంతుడు, యేసులో విశ్వాసం ఉంచేవారిని నీతిమంతులుగా తీర్చేవాడు అని చూపించడం కోసమే.
\s5
\p
\v 27 కాబట్టి మనం గొప్పలు పోడానికి కారణమేది? దానిని కొట్టివేశాడు. ఏ నియమాన్ని బట్టి కొట్టివేశాడు? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.
\v 28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
\s నిర్దోషిగా తీర్చడం అనేది సార్వత్రిక పాప నివారణ మార్గం
\s5
\p
\v 29 దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే.
\v 30 దేవుడు ఒకడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగా, సున్నతి లేనివారిని విశ్వాసం ద్వారా, నీతిమంతులుగా తీరుస్తాడు.
\s విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం అనేది ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తుంది
\s5
\p
\v 31 విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని నిర్ధారిస్తున్నాం.
\s5
\c 4
\s విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం- ఉదాహరణ సహిత వివరణ
\p
\v 1 కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం లభించింది?
\v 2 అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోడానికి కారణం ఉండేది కానీ అది దేవుని ముందు కాదు.
\v 3 లేఖనం చెబుతున్నదేమిటి? "అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు."
\s5
\v 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.
\s విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం- నిర్వచనం (వ. 18-21)
\p
\v 5 కాని ఒకడు ఏమీ చేయకుండానే భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే తనలో విశ్వాసం ఉంచే వ్యక్తిని వాని విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతుడుగా ఎంచుతాడు.
\s5
\v 6 అదేవిధంగా క్రియలు లేకుండ దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు.
\v 7 ఎలా అంటే,
\q "తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,
\q1 తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
\q1
\v 8 ప్రభువు నిర్దోషి అని ఎంచినవాడు ధన్యుడు."
\s విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం- ధర్మశాస్త్ర విధులకు భిన్నమైనది.
\s5
\p
\v 9 ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతనిని నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా?
\v 10 అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి ఆచరించినప్పుడా లేక సున్నతి లేనప్పుడా? లేనప్పుడే కదా!
\s5
\v 11 సున్నతి లేకపోయినా నమ్మినవారికందరికి అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆరోపించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా, సున్నతి అనే గుర్తును పొందాడు.
\v 12 అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే సున్నతి పొందినవారే కాకుండా మన తండ్రి అబ్రాహాము సున్నతి లేనప్పుడు అతని విశ్వాసపు అడుగుల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.
\s విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం- ధర్మశాస్త్రానికి భిన్నమైనది
\s5
\p
\v 13 అబ్రహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్రమూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది.
\v 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది.
\v 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు.
\s5
\p
\v 16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక కృప ననుసరించి అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడ వర్తించాలని, అది విశ్వాసమూలం అయ్యింది.
\v 17 తాను విశ్వసించిన దేవుని ముందు, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేనివాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ముందు అతడు మనకందరికి తండ్రి. దీని గురించే "నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను" అని రాసి ఉంది.
\s5
\v 18 అలాగే "నీ సంతానం ఇలా ఉంటుంది" అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎటువంటి ఆశాభావం లేనప్పడు సహితం అతడు నమ్మాడు.
\v 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరమూ శారా గర్భమూ మృతతుల్యమైనట్టు భావించాడు.
\s5
\v 20 అయితే అతడు దేవుని వాగ్దానం విషయంలో అవిశ్వాసం చూపక దేవుణ్ణి మహిమపరచాడు.
\v 21 ఆయన మాట ఇచ్చిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మి తన విశ్వాసం వలన బలం పొందాడు.
\v 22 దేవుడు దానిని అతనికి నీతిగా ఎంచాడు.
\s5
\v 23 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని గురించి మాత్రమే రాసి లేదు,
\v 24 మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనల్ని కూడా నీతిమంతులుగా ఎంచడానికి మనకోసం కూడ రాసి ఉంది.
\v 25 ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.
\s5
\c 5
\s విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం మూలంగా కలిగిన ఏడు ఫలితాలు
\p
\v 1 విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము.
\v 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం.
\s5
\v 3 అంతే కాదు, కష్టాలు ఓర్పును కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందిద్దాం.
\v 4 ఓర్పు పరీక్షనూ, పరీక్ష నమ్మకాన్ని కలిగిస్తుంది.
\v 5 ఎందుకంటే ఈ నమ్మకం మనల్ని నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
\s5
\p
\v 6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు.
\v 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవటం అరుదు. మంచివాని కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు.
\s5
\v 8 అయితే దేవుడు మనమీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మనకోసం చనిపోయాడు.
\v 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి తప్పించుకుంటాం.
\s5
\v 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా తప్పించుకుంటాం.
\v 11 అంతేకాదు, మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధానస్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.
\s మూడవ భాగం- పవిత్రపరచడం. అంతరంగంలో పాపం, దానికి సువార్త ద్వారా నివారణ. (1) ఆదాము ద్వారా పాపం, మరణం
\s5
\p
\v 12 ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ విస్తరించింది.
\v 13 ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు.
\s5
\v 14 అయినప్పటికీ ఆదాము అవిధేయత వంటి పాపం చేయని వారి మీద కూడా, ఆదాము నుండి మోషే వరకు మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వానికి ఒక సూచనగా ఉన్నాడు.
\s (2) క్రీస్తు ద్వారా నిర్దోషత్వం, జీవం
\p
\v 15 అయితే అపరాధం కలిగినట్టుగా కృపావరం కలగలేదు. ఎలాగంటే ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది.
\s5
\v 16 పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేకమైన అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది.
\v 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప అనే నీతిదానం పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకని ద్వారానే ఏలుతారు.
\s5
\p
\v 18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికి జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది.
\v 19 ఎందుకంటే ఒకని అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకని విధేయత అనేకమందిని నీతిమంతులుగా చేస్తుంది.
\s5
\v 20 ధర్మశాస్త్రం ప్రవేశించడం వలన అపరాధం విస్తరించింది. అయినా పాపం మరణాన్ని ఆధారం చేసికొని ఏవిధంగా ఏలిందో,
\v 21 అదే విధంగా శాశ్వత జీవం కలగడానికి నీతి ద్వారా కృప, మన ప్రభు యేసు క్రీస్తు మూలంగా ఏలడానికి పాపం విస్తరించిన చోటెల్లా కృప అపరిమితంగా విస్తరించింది.
\s5
\c 6
\s (3) అంతరంగంలో పాపం యొక్క శక్తి నుండి విడుదల క్రీస్తు మరణపునరుత్థానాలతో ఐక్యత మూలంగా
\p
\v 1 కాబట్టి ఏమందాము? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా?
\v 2 అలా ఎన్నటికీ జరగకూడదు. పాపానికి చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం?
\v 3 క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?
\s5
\p
\v 4 తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలో నుండి ఏవిధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, బాప్తిసం వలన చావులో పాలు పొందడానికి ఆయనతో కూడ సమాధిలోకి వెళ్లాం.
\v 5 ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం గలిగి ఉంటాం.
\s5
\v 6 ఎందుకంటే, మనకు తెలుసు, మనమింక పాపానికి దాసులుగా ఉండకుండా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది.
\v 7 చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పుపొందాడు.
\s5
\p
\v 8 మనం క్రీస్తుతో కూడ చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.
\v 9 చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు.
\s5
\v 10 ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.
\s 11 అంతరంగంలో పాపం యొక్క శక్తి నుండి విడుదల పాత బ్రతుకు చనిపోయినట్టుగా ఎంచి కొత్త బ్రతుకును దేవునికి లోబరచడం మూలంగా
\p
\v 11 ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో సజీవులుగా ఎంచుకోండి.
\s5
\p
\v 12 కాబట్టి చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. శరీర దురాశలకు లోబడకండి.
\v 13 మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
\s (3) ఆత్మ మూలంగా మరణం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం ద్వారా (రోమా 8:2)
\p
\v 14 మీరు కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నీయవద్దు.
\s5
\p
\v 15 అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు.
\v 16 మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా?
\s5
\v 17 దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మీరు అప్పగించుకున్నారో దానికి హృదయ పూర్వకంగా లోబడ్డారు.
\v 18 తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.
\s5
\p
\v 19 మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏవిధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.
\v 20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు.
\v 21 అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం.
\s5
\v 22 అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వతజీవం.
\v 23 ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు క్రీస్తు యేసులో శాశ్వతజీవం.
\s5
\c 7
\p
\v 1 సోదరులారా, ధర్మశాస్త్రం మనిషి జీవించి ఉన్నంతవరకే అధికారం చెలాయిస్తుందని మీకు తెలియదా? ధర్మశాస్త్రం తెలిసిన మీతో మాట్లాడుతున్నాను.
\s5
\v 2 వివాహిత అయిన స్త్రీ, తన భర్త జీవించి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోతే వివాహ సంబంధమైన ధర్మశాస్త్ర నియమం నుండి ఆమె స్వేచ్ఛ పొందుతుంది.
\v 3 కాబట్టి భర్త జీవించి ఉండగా ఆమె వేరే పురుషుని కలిస్తే ఆమె వ్యభిచారి అవుతుంది గాని, భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందింది కాబట్టి వేరొక పురుషుని పెళ్ళి చేసికొన్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు.
\s5
\v 4 కాబట్టి నా సోదరులారా, మనం దేవుని కోసం ఫలించ గలిగేలా చనిపోయి తిరిగి లేచిన క్రీస్తును చేరుకోడానికి మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయారు.
\v 5 ఎందుకంటే మనం శరీరసంబంధులుగా ఉన్నప్పుడు చావు ఫలాన్ని ఫలించడానికి ధర్మశాస్త్రం ద్వారా కలిగే పాపపు కోరికలు మన అవయవాల్లో పని చేస్తూ ఉండేవి.
\s5
\v 6 ఇప్పుడైతే ఏది మనల్ని బంధించి ఉంచిందో దాని విషయంలో చనిపోయి, ధర్మశాస్త్రం నుండి స్వేచ్చ పొందాము. కాబట్టి మనం దాని అక్షరార్ధమైన పాత విధానంలో కాక దేవుని ఆత్మను అనుసరించిన కొత్త విధానంలో సేవ చేస్తున్నాము.
\s (4) ధర్మశాస్త్రం ద్వారా విశ్వాసి పవిత్రుడు కాడు
\s5
\p
\v 7 కాబట్టి ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం పాపమా? కానే కాదు. ధర్మశాస్త్రం వలన కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు. ఇతరులకు చెందిన దానిని ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు.
\v 8 అయితే పాపం, ఆజ్ఞను ఆధారంగా చేసికొని అన్ని రకాల దురాశలను నాలో పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం చనిపోయినట్టే.
\s5
\v 9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు జీవంతోనే ఉన్నాను గాని, ఆజ్ఞ రావడంతోనే పాపానికి మరల జీవం వచ్చి నేను చనిపోయాను.
\v 10 అప్పుడు జీవాన్ని తెచ్చే ఆజ్ఞ నాకు చావును కలిగించేదిగా కనబడింది.
\s5
\v 11 ఎందుకంటే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసికొని మోసం చేసి నన్ను చంపింది.
\v 12 కాబట్టి ధర్మశాస్త్రం పవిత్రం, ఆజ్ఞ కూడ పవిత్రం, నీతివంతం, ఉత్తమం.
\s5
\v 13 మరి ఉత్తమమైంది నాకు చావును తెచ్చిందా? కానే కాదు. అయితే పాపం ఉత్తమమైన దాని ద్వారా పాపంగా కనిపించాలని, అది నాకు చావును తీసికొచ్చింది. అంటే పాపం ఆజ్ఞ మూలంగా మరింత ఎక్కువ పాపం కావడం కోసం, అది నాకు చావును తెచ్చిపెట్టింది.
\v 14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మనకు తెలుసు. అయితే నేను పాపానికి అమ్ముడుబోయిన శరీర సంబంధిని.
\s (5) ధర్మశాస్త్రం కింద మనిషిలోని రెండు స్వభావాల మధ్య ఘర్షణ
\s5
\p
\v 15 ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను దేనిని ఇష్టపడతానో దానిని కాక దేనిని ద్వేషిస్తానో దానినే చేస్తున్నాను.
\v 16 నేను ఇష్టపడని దానిని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకొంటున్నాను.
\s5
\v 17 కాబట్టి దానిని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు.
\v 18 నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దానిని చేయడం నా వల్ల కావడం లేదు.
\s5
\v 19 నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను.
\v 20 నేను కోరని దానిని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.
\v 21 కాబట్టి మంచి చేయగోరే నాకు, కీడు చేయడం కలుగుతున్నదనే ఒక నియమం నాకు కనబడుతున్నది.
\s5
\p
\v 22 అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.
\v 23 కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నన్ను బందీగా చేసికొని నా అవయవాల్లోని పాప నియమానికి లోబరచుకొంటున్నది.
\s5
\v 24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు?
\v 25 మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయములో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.
\s5
\c 8
\p
\v 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా లేదు.
\s (6) ఆత్మ నూతన నియమం విడుదల కలిగిస్తుంది, నిర్దోషిగా తీరుస్తుంది
\p
\v 2 క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది.
\s5
\v 3 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దానిని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం
\v 4 దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.
\s (7) శరీరంతో ఆత్మ ఘర్షణ (గలతి 5: 16-18)
\p
\v 5 శరీరానుసారులు శరీర విషయాలమీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు.
\s5
\p
\v 6 శరీరానుసారమైన మనస్సు చావు. ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం.
\v 7 ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా పనిచేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.
\v 8 కాబట్టి శరీరస్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.
\s5
\v 9 దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.
\v 10 క్రీస్తు మీలో ఉంటే మీ శరీరం పాపానికి చనిపోయింది గాని మీ ఆత్మ నీతి విషయంలో జీవించి ఉంది.
\s5
\v 11 చనిపోయిన వారిలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడ మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.
\s5
\p
\v 12 కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.
\v 13 మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు. గాని ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.
\s నాలుగవ భాగం- సువార్త వలన కలిగే పరిపూర్ణమైన ఫలితం (1) విశ్వాసి కుమారునిగా వారసునిగా అవుతాడు (గలతి 4:4)
\s5
\p
\v 14 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
\v 15 ఎందుకంటే, మరలా భయపడటానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం "నాన్నా, తండ్రీ" అని దేవుణ్ణి పిలుస్తున్నాం.
\s5
\v 16 మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు.
\v 17 మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడ మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోడి వారసులం.
\s (2) బాధలనుండి, మరణం నుండి విడుదలైన సృష్టి దైవకుమారుల కోసం సిద్ధంగా ఉంది (అది 3: 18, 19)
\s5
\p
\v 18 మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
\v 19 దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురుచూస్తూ ఉంది.
\s5
\v 20 ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దానిని లోబరచినవాని మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి,
\v 21 నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది.
\v 22 ఇప్పటి వరకు సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదనపడుతున్నదని మనకు తెలుసు.
\s5
\v 23 అదే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడ దత్త పుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.
\v 24 ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురుచూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దానికోసం ఎవరు ఎదురు చూస్తాడు?
\v 25 మనం చూడని దానికోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
\s (3) విశ్వాసిలో నివాసముండే విజ్ఞాపన కర్త పరిశుద్ధాత్మ (హెబ్రీ 7: 25)
\s5
\p
\v 26 అలాగే ఆత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో ఆత్మ మన పక్షంగా వేడుకొంటున్నాడు.
\v 27 ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల కోసం వేడుకొంటున్నాడు కాబట్టి హృదయాలను పరిశీలించేవానికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
\s (4) సువార్త మూలంగా దేవుడు ఉద్దేశించిన అమోఘమైన ఫలితాలు
\s5
\p
\v 28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.
\v 29 ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరులలో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగినవారిని, తన కుమారుని పోలిన రూపం పొందడానికి వారిని ముందుగానే నిర్ణయించాడు.
\v 30 ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
\s5
\p
\v 31 వీటి గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి యెవడు?
\v 32 తన సొంత కుమారుని మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయన్ని అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?
\s5
\v 33 దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగలవాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే.
\v 34 ఎవరు శిక్ష విధించ గలిగేది? చనిపోయిన క్రీస్తు యేసే. అంతే కాదు, చనిపోయినవారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.
\s (5) విశ్వాసి భద్రత
\s5
\p
\v 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరవులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనల్ని వేరు చేస్తాయా?
\v 36 దీనిని గురించి ఏమని రాసి ఉందంటే,
\q1 "నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం.
\q1 వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు."
\s5
\p
\v 37 అయినా వీటన్నిటిలో మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం సమృద్ధిగా విజయం పొందుతున్నాం.
\v 38 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అధికారులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే,
\v 39 మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు.
\s5
\c 9
\s ఐదవ భాగం- ఇస్రాయేల్ గురించిన విషయం (రోమా 9-11). ఇస్రాయేల్ తో నిబంధనను సువార్త వమ్ము చేయదు (1) ఇస్రాయేల్ జాతిని గురించి అపోస్తలుని ఆవేదన
\p
\v 1 నా హృదయంలో గొప్ప దుఃఖం, ఆగిపోని వేదన ఉన్నాయి.
\v 2 నేను అబద్ధమాడటం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్ష్యమిస్తున్నది.
\s5
\v 3 సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే.
\s (2) ఇస్రాయేల్ కున్న ఏడింతల ఆధిక్యతలు
\p
\v 4 వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, ఆరాధన ఆచారాలు, వాగ్దానాలు వీరికున్నాయి.
\v 5 పూర్వికులు వీరివారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలోనుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్‌.
\s (3) అబ్ర్రహాము ద్వారా కేవలం సహజ సంతానమైన యూదులకూ ఆత్మ సంబంధమైన యూదులకూ తేడా
\s5
\p
\v 6 అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
\v 7 అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, "ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు."
\s5
\v 8 అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గాని దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు.
\v 9 ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, "తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు."
\s5
\p
\v 10 అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు,
\v 11 దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాని మూలంగానే నెరవేరడం కోసం,
\v 12 పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే "పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు" అని ఆమెతో చెప్పాడు.
\v 13 దీనిని గురించి "నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను" అని రాసి ఉంది.
\s (4) దేవుని కృప ఆయన సార్వభౌమిక సంకల్పమే
\s5
\p
\v 14 కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు.
\v 15 అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, "నేను ఎవరిని కనికరం చూపాలనుకుంటానో వారిపైనే కనికరం చూపిస్తాను. ఎవరిపైన జాలి చూపాలనుకుంటానో వారి పైనే జాలి చూపిస్తాను."
\v 16 కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాసపడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది.
\s5
\p
\v 17 దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, "నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను."
\v 18 కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు.
\s5
\v 19 అలాగైతే, "ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనల్ని తప్పు పట్టడమెందుకు?" అని నీవు నాతో అనవచ్చు.
\v 20 అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేసావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా?
\v 21 ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ఘనత కోసం, ఇంకొకటి ఘనహీనత కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా?
\s5
\p
\v 22 ఆవిధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచడానికీ కోరుకొని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి?
\v 23 తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల,
\v 24 అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్నిచూపాలని సంకల్పిస్తే ఏమిటి?
\s (5) యూదుల గుడ్డితనం, యుదేతరులకు కృప గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పారు
\s5
\p
\v 25 దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు,
\q1 "నా ప్రజలు కానివారికి నా ప్రజలనీ,
\q1 ప్రేయసి కానిదానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను.
\q1
\v 26 మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే "జీవం గల దేవుని కుమారులు" అని వారికి పేరుపెట్టడం జరుగుతుంది."
\s5
\p
\v 27 "ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు"
\v 28 అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు.
\v 29 యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం,
\q1 "సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లల్ని మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యే వాళ్ళం, గొమొఱ్ఱాలాగా ఉండేవాళ్ళం."
\s5
\p
\v 30 అలా అయితే మనం ఏమనగలం? నీతిని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు.
\v 31 అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దానిని చేరుకోలేకపోయారు.
\s5
\v 32 ఎందుకు? ఎందుకంటే వారు దానిని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు.
\q1
\v 33 "ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను.
\q1 ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పొందడు"
\p అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.
\s5
\c 10
\s (6) ఇస్రాయేలుకు చేసిన వాగ్దానాలు విఫలం అయినట్టు కనిపించడం వారి అపనమ్మకం మూలానే
\p
\v 1 సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన.
\v 2 దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు.
\v 3 అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వంత నీతిని అనుసరించి నడుచుకొంటూ దేవుని నీతికి విధేయత చూపలేదు.
\s5
\v 4 నీతి విషయంలో నమ్మిన ప్రతి ఒక్కరికీ క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నాడు.
\v 5 ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దానివల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు.
\s5
\v 6 అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, "ఎవడు పరలోకానికి ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి).
\v 7 లేక ఎవడు అగాధంలోకి దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయినవారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు."
\q1
\s5
\v 8 కానీ అ నీతి ఏమి చెబుతున్నదో చూడండి, "దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో, మీ హృదయంలో ఉంది."
\p మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్యం కూడా ఇదే.
\v 9 అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు పాపవిమోచన కలుగుతుంది.
\v 10 ఎలాగంటే మనిషి నీతికోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు.
\s5
\v 11 "ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు" అని దేవుని వాక్యం చెబుతున్నది.
\v 12 ఇందులో యూదులూ, గ్రీసు దేశస్థులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు.
\v 13 ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది.
\s5
\v 14 వారు నమ్మనివానికి ఎలా ప్రార్థన చేస్తారు? తాము విననివానిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన గురించి ప్రచురించే వాడు లేకుండ వారెలా వింటారు?
\v 15 ప్రచురించే వారిని పంపకపోతే ఎలా ప్రచురిస్తారు? దీన్ని గురించి "శ్రేష్టమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి" అని రాసి ఉంది.
\s5
\v 16 అయితే అందరూ సువార్తకు లోబడలేదు. "ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?" అని యెషయా చెబుతున్నాడు కదా?
\v 17 కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.
\s5
\p
\v 18 అయినా, నేను చెప్పేదేమంటే, "వారు వినలేదా?" విన్నారు గదా?
\q1 వారి స్వరం భూలోకమంతటిలోకీ,
\q1 వారి మాటలు భూదిగంతాలకు చేరాయి"
\s5
\p
\v 19 నేనింకా చెప్పేదేమంటే, "ఇశ్రాయేలు ప్రజలకు ఇది తెలియలేదా? మోషే ముందుగా మాట్లాడుతూ,
\q1 "అసలు జాతి అని పిలవటానికి వీలులేని వారి వలన మీలో అసూయ పుట్టిస్తాను. తెలివి లేని ప్రజల వలన మీకు కోపం కలిగేలా చేస్తాను." అని అన్నాడు.
\s5
\p
\v 20 తరువాత యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు,
\q1 "నన్ను వెదకనివారు నన్ను కనుగొన్నారు.
\q1 నా గురించి అడగని వారికి నేను ప్రత్యక్షమయ్యాను."
\p
\v 21 ఇశ్రాయేలు విషయమైతే అతడు, "అవిధేయులై మూర్ఖంగా ప్రవర్తించే ప్రజలవైపు నేను రోజంతా నా చేతులు చాస్తూనే ఉన్నాను" అని చెబుతున్నాడు.
\s5
\c 11
\s (7) అయితే ఆత్మ సంబంధులైన ఇస్రాయేల్ రక్షణ కనుగొంటున్నారు
\p
\v 1 అలాగైతే నేనడిగేది ఏమంటే, దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేశాడా? కానేకాదు. నేను కూడ ఇశ్రాయేలీయుడినే, అబ్రాహాము సంతానంలోని బెన్యామీను గోత్రంలో పుట్టాను.
\v 2 తాను ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు. ఏలీయా గురించిన లేఖనభాగం చెప్పింది, అతడే విధంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవునితో వాదించాడో మీకు తెలియదా?
\v 3 "ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడదోశారు. నేనొక్కడినే మిగిలాను. వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు."
\s5
\v 4 అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, "బయలుకు మోకరించని 7000 మంది పురుషులు నాకున్నారు."
\v 5 అప్పటి కాలంలో వలె ఇప్పుడు కూడా కృప వలని ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది.
\s5
\v 6 అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైంది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు.
\s (8) ఒక జాతిగా ఇస్రాయేల్ చట్టపరంగా గుడ్డితనం లో ఉంది
\p
\v 7 అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
\v 8 దీని గురించి "నేటి వరకు దేవుడు వారికి మత్తులో మునిగిన మనస్సు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు" అని రాసి ఉంది.
\s5
\v 9 దీనికి దావీదు ఏమన్నాడంటే,
\q1 "వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా,
\q1 ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక.
\q1
\v 10 వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక.
\q1 వారి వీపులు ఎల్లప్పుడు వంగిపోయి ఉండు గాక."
\s5
\p
\v 11 కాబట్టి నేనడిగేది ఏమిటంటే, వారు పడిపోవడం కోసమే తొట్రుపడ్డారా? అలా కానేకాదు. వారి తొట్రుపాటు వలన యూదేతరులకు పాపవిమోచన కలిగి, అది వారు అసూయ చెందడానికి కారణమైంది.
\v 12 వారు తొట్రుపడడం లోకానికి, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే, వారి పరిపూర్ణత ఇంకెంత ఎక్కువ ఐశ్వర్యకరమౌతుంది!
\s (9) యూదేతరులకు హెచ్చరిక
\s5
\p
\v 13 యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. నేను యూదేతరులకు అపొస్తలుడనై ఉన్నందుకు నా పరిచర్య విషయంలో అతిశయిస్తాను.
\v 14 ఎలాగైనా నా రక్తసంబంధులకు అసూయ కలిగించడం ద్వారా వారిలో కొందరినైనా రక్షించాలని నా కోరిక.
\s5
\v 15 వారు తిరస్కారం పొందడం లోకాన్ని దేవునితో సమాధానపరచటం అయితే, వారిని స్వీకరించడం చనిపోయిన వారు సజీవులుగా లేచినట్టే అవుతుంది గదా?
\v 16 ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్దంతా పవిత్రమే. వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే.
\s5
\v 17 అయితే కొమ్మలలో కొన్ని విరిచివేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటుకట్టి, ఒలీవచెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే,
\v 18 నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు.
\s5
\v 19 అందుకు "ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటుకట్టడానికే" అని నీవు చెప్పవచ్చు.
\v 20 నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు.
\v 21 ఎందుకంటే దేవుడు అసలైన కొమ్మలనే విడిచిపెట్టకపోతే నిన్ను కూడా విడిచిపెట్టడు గదా!
\s5
\p
\v 22 కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఒకవైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.
\s5
\v 23 అంతేకాక, వారు తమ అవిశ్వాసంలో కొనసాగకుండా వెనక్కి తిరిగితే వారిని తిరిగి అంటుకడతాడు. దేవుడు వారిని మళ్ళీ అంటు కట్టడానికి సమర్ధుడు.
\v 24 ఎలాగంటే, నిన్ను ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కోసి, అసహజంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్ట గలిగిన వాడు సహజమైన కొమ్మలను మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవచెట్టుకు అంటుకట్ట గలడు కదా!
\s5
\p
\v 25 సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలిసికోవాలని కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకు ఇశ్రాయేలు ప్రజలలో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.
\s (10) ఒక జాతిగా ఇశ్రాయేల్ ఇంకా రక్షణ పొందవలసి ఉంది
\q1
\s5
\v 26 "విమోచకుడు సీయోనులో నుండి వచ్చి
\q1 యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.
\q1
\v 27 నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు
\q1 వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే"
\p అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు.
\s5
\p
\v 28 సువార్త విషయమైతే వారు మిమ్మల్నిబట్టి విరోధులే గాని, దేవుని ఎన్నిక విషయమైతే పితరులనుబట్టి దేవునికి ప్రియమైనవారు.
\v 29 ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేనివాడు.
\s5
\v 30 గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు.
\v 31 అలాగే మీపై చూపిన కనికరాన్ని బట్టి వారు ఇప్పుడు కనికరం పొందడం కోసం, వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు.
\v 32 అందరిపైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు.
\s5
\p
\v 33 ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం అసాధ్యం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
\q1
\v 34 "ప్రభువు మనస్సు తెలిసిన వాడెవడు?
\q1 ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?
\q1
\s5
\v 35 ఆయన దగ్గరనుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగల వాడెవడు?"
\p
\v 36 సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగుతుంది గాక. ఆమేన్‌.
\s5
\c 12
\s ఆరవ భాగం. క్రైస్తవ జీవితం, సేవ (రోమా 12: 1-15, 33) (1) సమర్పణ, ప్రతిష్ట
\p
\v 1 కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇలాటి సేవ మీకు తగినది.
\v 2 మీరు ఈ లోక విధానాలను అనుసరించ వద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి.
\s (2) సేవ
\s5
\p
\v 3 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటె ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరు తాను నెమ్మది కలిగి ఉండటానికి తగినట్టుగా ఎంచుకోండి.
\s5
\v 4 ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు.
\v 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకనికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము.
\s5
\p
\v 6 దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము.
\v 7 కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి.
\v 8 పరిచర్యలో, బోధించడంలో, హెచ్చరించడంలో, ఎవరి వరం వారు శ్రద్ధగా ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు పవిత్రమైన మనస్సుతో, పర్యవేక్షించేవాడు జాగ్రత్తగా, కనికరం చూపేవాడు సంతోషంతో తమ పనులు జరిగించాలి.
\s (3) క్రైస్తవులు, సాటి విశ్వాసులు
\s5
\p
\v 9 మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకొని మంచిని హత్తుకోండి.
\v 10 సోదర ప్రేమతో ఒకనిపై ఒకడు అభిమానం చూపిస్తూ, ఘనత విషయంలో ఒకని నొకడు గౌరవించుకోండి.
\s5
\v 11 ఆసక్తి విషయంలో వెనకబడి పోవద్దు, ఆత్మలో తీవ్రతతో ప్రభువును సేవించండి.
\v 12 ఆశాభావంతో ఎదురుచూస్తూ సంతోషించండి. కష్టాల్లో సహనం చూపుతూ, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి.
\v 13 పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథుల్ని శ్రద్ధగా ఆదరించండి.
\s5
\v 14 మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, దీవించడమే గాని శపించవద్దు.
\v 15 సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడేవారితో కలిసి దుఖపడండి.
\v 16 ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. గొప్పవాటి గురించి ఆలోచించవద్దు. దీనులతో సహవాసం చెయ్యండి. మిమ్మల్ని మీరు తెలివైన వారని అనుకోవద్దు.
\s (4) క్రైస్తవులు, క్రైస్తవేతరులు
\s5
\p
\v 17 కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి మంచి విషయాల గురించి ఆలోచించండి.
\v 18 మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానం కలిగి ఉండండి.
\s5
\p
\v 19 ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోవద్దు. దేవుని కోపానికి చోటియ్యండి. "పగతీర్చడం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు" అని రాసి ఉంది.
\q1
\v 20 "కాబట్టి, నీ విరోధి ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికతో ఉంటే దాహం ఇవ్వు.
\q1 అలా చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది."
\p
\v 21 కీడు వలన అపజయం పాలు కావద్దు. మేలుతో కీడును జయించు.
\s5
\c 13
\s
\p
\v 1 ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారమూ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.
\v 2 కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు.
\s5
\v 3 పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండ ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు.
\v 4 వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డపని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీ కారం చేసే దేవుని సేవకులు.
\v 5 కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.
\s5
\p
\v 6 ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.
\v 7 కాబట్టి ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి సుంకమో వారికి సుంకం చెల్లించండి. అలాగే ఎవరికి భయపడాలో వారిపట్ల భయమూ, ఎవరిని గౌరవించాలో వారి పట్ల గౌరవమూ కలిగి ఎవరికి ఏది రుణపడి ఉన్నారో దానిని చెల్లించండి.
\s (5) సాటి మనిషి పట్ల ప్రేమ నియమం (లూకా 10: 29- 37)
\s5
\p
\v 8 ప్రేమ విషయంలో తప్ప మరి దేనినీ ఎవరికీ రుణపడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు.
\v 9 ఎందుకంటే వ్యభిచరించ వద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, "నిన్నునీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు" అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.
\v 10 ప్రేమ పొరుగువారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండటం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
\s5
\v 11 కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్రనుండి మేల్కొనవలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటికంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది.
\v 12 రాత్రి చాల వరకు గతించిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం.
\s5
\v 13 అల్లరిచిల్లరిగా తిరగకుండా, మత్తుగా తాగకుండా, లైంగిక దుర్నీతి, పోకిరీ పనులు, కలహాలు, అసూయ, వీటన్నిటినీ విడిచిపెట్టి పగటి వెలుగులో మర్యాదగా నడుచుకుందాం.
\v 14 చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకొని, శరీర కోరికలను తీర్చుకోవాలనే ఆలోచన రానీయకండి.
\s5
\c 14
\s (6) సందేహాస్పదమైన విషయాలలో ప్రేమ నియమం(1 కొరింతి 8: 1-10: 33)
\p
\v 1 విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్నవారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు.
\v 2 ఆహారపదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలనే తింటున్నాడు.
\s5
\v 3 తినేవాడు తిననివాణ్ణి తక్కువగా చూడకూడదు. తిననివాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు.
\v 4 వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.
\s5
\p
\v 5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటె మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడు తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి.
\v 6 ప్రత్యేకమైన రోజుల్ని పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినటం మానేస్తున్నాడు.
\s5
\v 7 మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు.
\v 8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం.
\v 9 చనిపోయినవారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మరల బతికింది?
\s5
\p
\v 10 అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాం.
\q1
\v 11 "నా తోడు, ప్రతి మోకాలు నా ముందు వంగుతుంది.
\q1 ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు"
\s5
\p
\v 12 అని రాసి ఉంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించాల్సి ఉంది.
\p
\v 13 కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చవద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం.
\s5
\v 14 సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మేవారికి అది అపవిత్రమే అవుతుంది.
\v 15 నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవనికోసం క్రీస్తు చనిపోయాడో అతనిని నీ ఆహారం చేత పాడు చేయవద్దు.
\s5
\v 16 మీకు కలిగిన మంచి, దూషణకు గురి కాకుండా చూసుకోండి.
\p
\v 17 దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం.
\s5
\v 18 ఈ విషయంలో క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.
\v 19 కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం.
\s5
\v 20 ఆహారం కోసం దేవుని పని పాడుచేయ వద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ అనుమానంతో తినేవాడికి అది దోషం.
\v 21 మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దానిని మానివేయడం మంచిది.
\s5
\v 22 ఈ విషయాలలో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు.
\v 23 అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండ తింటాడు. కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.
\s5
\c 15
\p
\v 1 కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనల్ని మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి.
\v 2 మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడు మంచి విషయాల్లో అతనిని సంతోషపరచాలి.
\s5
\v 3 క్రీస్తు కూడ తనను తాను సంతోషపరచుకోలేదు గాని "నిన్ను నిందించే వారి అవమానాలు నా మీద పడ్డాయి" అని రాసి ఉన్నట్లు ఆయనకు జరిగింది.
\s (7) రక్షణలో యూదు, యూదేతర విశ్వాసులు సమానమే
\p
\v 4 ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పువలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.
\s5
\v 5 మీరు ఒకే మనసుతో అందరూ కలిసి, మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి,
\v 6 క్రీస్తు యేసు సంకల్పం ప్రకారం ఒకనితో నొకడు మనస్సు కలిసి ఉండేలా, ఓర్పుకు, ఆదరణకు కర్త అయిన దేవుడు మీకు అనుగ్రహించు గాక.
\p
\v 7 కాబట్టి క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే దేవునికి మహిమ కలిగేలా మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి.
\s5
\v 8 నేను చెప్పేదేమంటే పితరులకు చేసిన వాగ్దానాల విషయం దేవుడు సత్యవంతుడని నిరూపించడానికీ, యూదేతరులు దేవుని కనికరాన్నిబట్టి దేవుని మహిమపరచడానికీ క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు.
\v 9 దీని గురించి,
\q1 "ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను.
\pi నీ నామ సంకీర్తనం చేస్తాను" అని రాసి ఉంది.
\q1
\s5
\v 10 ఇంకా ఏమని ఉన్నదంటే,
\q1 "యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి." అనీ
\q1
\v 11 "యూదేతరులందరూ ప్రభువుని స్తుతించండి. ప్రజలంతా ఆయన్ని కొనియాడతారు."
\q1
\s5
\v 12 యెషయా ఇలా అన్నాడు,
\q1 "యెష్షయిలో నుండి వేరు చిగురు, యూదేతరుల్ని ఏలడానికి వస్తాడు.
\q1 ఆయనలో యూదేతరులు తమ నమ్మకం పెట్టుకుంటారు."
\s5
\p
\v 13 మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సమృద్ధి అయిన నమ్మిక కలిగి ఉండేలా నిరీక్షణకర్త అయిన దేవుడు పూర్తి ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపు గాక.
\s (8) అపోస్తలుని సేవ, ప్రయాణాలు
\s5
\p
\v 14 సోదరులారా, మీరు మంచివారు, జ్ఞాన సంపన్నులు, ఒకరినొకరు ప్రోత్సహించుకోగల సమర్థులని నేను గట్టిగా నమ్ముతున్నాను.
\s5
\v 15 అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకొని రాస్తున్నాను.
\v 16 ఎందుకంటే యూదేతరులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పవిత్రత పొంది, దేవునికి ఇష్టమయ్యేలా, నేను సువార్త విషయం యాజక ధర్మం జరిగిస్తూ, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి యూదేతరులకు యేసుక్రీస్తు సేవకుడినయ్యాను.
\s5
\v 17 కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని విషయాలలో నాకు అతిశయ కారణముంది.
\v 18 అదేమిటంటే యూదేతరులు లోబడేలా, వాక్యం చేతా, క్రియల చేతా, సూచనల బలం చేతా, అద్భుతాల చేతా, పరిశుద్ధాత్మ శక్తి చేతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి మాత్రమే గాని మరి ఇతర విషయాలు మాటలాడను.
\v 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
\s5
\v 20 నేను వేరొకడు వేసిన పునాది మీద కట్టకూడదని క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని బహు ఆశతో అలాగే ప్రకటించాను.
\v 21 దీనిని గురించి ఇలా రాసి ఉంది,
\q1 "ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు,
\q1 ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు."
\s5
\p
\v 22 ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరకు రాకుండ నాకు చాలా సార్లు ఆటంకం కలిగింది.
\v 23 ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరకు రావాలని ఎంతో ఆశతో ఉన్నాను.
\s5
\v 24 కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడల్లా దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందించిన తరువాత, మీరు నన్ను అక్కడికి సాగనంపుతారని ఎదురుచూస్తున్నాను.
\v 25 అయితే ఇప్పుడు పరిశుద్ధుల పరిచర్య నిమిత్తం యెరూషలేము వెళ్తున్నాను.
\s5
\v 26 ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధులలో బీదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు.
\v 27 అవును, వీరు చాలా ఇష్టంగా ఆ పని చేశారు. నిజానికి వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో భాగం పంచుకున్నారు కాబట్టి శరీర సంబంధ విషయాల్లో వారికి సహాయం చేయడం సబబే.
\s5
\v 28 నేను ఈ ఫలాన్ని వారికప్పగించి నా పని ముగించిన తరువాత, మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను.
\v 29 నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు, క్రీస్తు యొక్క సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
\s5
\p
\v 30 సోదరులారా, మీరు దేవునికి చేసే ప్రార్థనలలో నా కోసం నాతో కలిసి పోరాడమని మన ప్రభు యేసు క్రీస్తును బట్టి, ఆత్మవలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\v 31 ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా,
\v 32 దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీదగ్గరకు వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి.
\s5
\v 33 సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్‌.
\s5
\c 16
\s ఏడవ భాగం. క్రైస్తవ ప్రేమ, అభినందనలు
\p
\v 1 కెంక్రేయలో ఉన్న మన సోదరి, సంఘ పరిచారకురాలైన ఫీబే ను, పవిత్రులకు తగిన విధంగా ప్రభువులో చేర్చుకోండి.
\v 2 మీ దగ్గర ఆమెకు అవసరమైనది ఏదైన ఉంటే సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె నాకు, ఇంకా అనేకమందికి సహాయం చేసింది.
\s5
\v 3 క్రీస్తు యేసులో నా సహ పనివారు ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి.
\v 4 వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి తెగించారు. వారి ఇంటిలో సమావేశమయ్యే సంఘానికి కూడా అభివందనాలు చెప్పండి. నేను ఒక్కడినే కాదు, యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.
\v 5 ఆసియలో క్రీస్తుకు మొదటి ఫలం, నాకిష్టమైన ఎపైనెటుకు అభివందనాలు.
\s5
\v 6 మీకోసం అధికంగా కష్టపడిన మరియకు అభివందనాలు.
\v 7 నాకు బంధువులు, నా తోడి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు అభివందనాలు. వీరు అపొస్తలులలో పేరు పొందినవారు, నాకంటె ముందు క్రీస్తులో విశ్వసించిన వారు.
\v 8 ప్రభువులో నాకు ప్రియమైన అంప్లీయతుకు అభివందనాలు.
\s5
\v 9 క్రీస్తులో మన జత పనివాడైన ఊర్బానుకు, నాకు ఇష్టుడైన స్టాకుకు అభివందనాలు.
\v 10 క్రీస్తులో యోగ్యుడైన అపెల్లెకు అభివందనాలు. అరిస్టొబూలు కుటుంబానికి అభివందనాలు.
\v 11 నా బంధువు హెరోదియోనుకు అభివందనాలు. నార్కిస్సు కుటుంబంలో ప్రభువును ఎరిగిన వారికి అభివందనాలు.
\s5
\v 12 ప్రభువులో ప్రయాసపడే త్రుపైనాకు, త్రుఫోసాకు అభివందనాలు. ప్రియమైన పెర్సిసుకు అభివందనాలు. ఆమె ప్రభువులో ఎంతో కష్టపడింది.
\v 13 ప్రభువు ఎన్నుకున్న రూఫుకు అభివందనాలు, అతని తల్లికి వందనాలు, ఆమె నాకు కూడా తల్లి.
\v 14 అసుంక్రితు, ప్లెగో, హెర్మే, పత్రొబ, హెర్మా, వారితో కూడ ఉన్న సోదరులకు అభివందనాలు.
\s5
\v 15 పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సహోదరికీ, ఒలుంపాకు వారితో కూడ ఉన్న పవిత్రులు అందరికీ అభివందనాలు.
\v 16 పవిత్రమైన ముద్దులతో ఒకనికొకడు అభివందనాలు చెప్పుకోండి. క్రైస్తవ సంఘాలు మీకు అభివందనాలు చెబుతున్నాయి.
\s5
\p
\v 17 సోదరులారా, నేను వేడుకొనేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి.
\v 18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకుల్ని మోసం చేస్తారు.
\s5
\v 19 మీ విధేయత మంచి ఆదర్శంగా అందరికీ వెల్లడైంది. అందుకు మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మంచి విషయంలోజ్ఞానంగా, చెడు విషయంలో నిర్దోషంగా ఉండాలి.
\v 20 సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ల కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.
\s5
\p
\v 21 నా సహ పనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు.
\v 22 ఈ పత్రికను చేతితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.
\s5
\p
\v 23 నాకు, సంఘమంతటికీ ఆతిథ్యమిచ్చే గాయియు మీకు అభివందనాలు చెబుతున్నాడు. ఈ పట్టణానికి కోశాధికారి ఎరస్తు, సోదరుడు క్వర్తు, మీకు అభివందనాలు చెబుతున్నారు.
\v 24 మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉంటుంది గాక.
\s5
\p
\v 25 యూదేతరులంతా విశ్వాసానికి లోబడేలా, దేవుడు ప్రారంభం నుండి దాచి ఉంచి, ఇప్పుడు వెల్లడి చేసిన రహస్య సత్యం శాశ్వతుడైన దేవుని ఆజ్ఞప్రకారం, ప్రవక్తల ద్వారా వారికి వెల్లడైంది.
\v 26 నా సువార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ప్రకటన ప్రకారం, దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడు.
\s5
\v 27 ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా, నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌.

942
47-1CO.usfm Normal file
View File

@ -0,0 +1,942 @@
\id 1CO 1 Corinthians
\s5
\c 1
\s కృపలో విశ్వాసి స్థానము
\p
\v 1 దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, సోదరుడు సొస్తెనేసు,
\v 2 కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండటానికి పిలుపు పొందిన వారికీ, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది.
\v 3 మన తండ్రి దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
\s5
\v 4 క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూచి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
\v 5 క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది.
\v 6 అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు.
\s5
\v 7 కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు.
\v 8 మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు.
\v 9 మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
\s క్రీస్తులో కొరింతి విస్వాసుల స్థానం తో పోల్చుకుంటే వారి పతనమైన ఆత్మిక స్థితి
\s5
\p
\v 10 సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనస్సు, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.
\s 1. వారు మానవ నాయకులను అనుసరిస్తున్నారు
\p
\v 11 సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది.
\s5
\p
\v 12 మీలో ఒకడు 'నేను పౌలు వాణ్ణి', ఒకడు 'నేను అపొల్లో వాణ్ణి', మరొకడు 'నేను కేఫా వాణ్ణి', ఇంకొకడు 'నేను క్రీస్తు వాణ్ణి' అని చెప్పుకొంటున్నారని నేను విన్నాను.
\v 13 మీరు క్రీస్తును విడగొట్టారు. పౌలు మీ కోసం సిలువను అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా?
\s5
\v 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
\v 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు.
\v 16 స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు.
\s5
\v 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, మానవ జ్ఞానం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు.
\s 2. మానవపరమైన జ్ఞానంలో అతిశయిస్తున్నారు
\s5
\p
\v 18 సిలువను గూర్చిన వార్త, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.
\v 19 దీని గురించే 'జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్ధం చేస్తాను' అని రాసి ఉంది.
\s5
\v 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? ఈ లోకం పక్షాన వాదించేవాడు ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా?
\v 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.
\s5
\v 22 యూదులు సూచన కోసం అద్భుతాలు కావాలని కోరుతూ ఉంటే, గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు.
\v 23 అయితే మేము సిలువ శిక్ష పొందిన క్రీస్తును ప్రకటిస్తున్నాం.
\s5
\v 24 ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. అయితే యూదులు గానీ, గ్రీసు దేశస్థులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ, ఆయన జ్ఞానమూ అయ్యాడు.
\v 25 ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటె తెలివైంది, దేవుని బలహీనత మానవుల కంటె బలమైంది.
\s 3. ఏది ఏమైనా వారు అంత జ్ఞానులు కారు
\s5
\p
\v 26 సోదరీ సోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎవరూ లేరు కదా.
\v 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు, బలవంతుల్ని సిగ్గు పరచడానికి లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
\s5
\v 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచుల్నీ, మనుషులు తిరస్కరించిన వారినీ, ఎన్నిక లేనివారినీ దేవుడు ఎన్నుకున్నాడు.
\v 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
\s5
\p
\v 30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు.
\v 31 'అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి' అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.
\s5
\c 2
\s 4. క్రీస్తు ఇచ్చిన వెల్లడింపు మానవ జ్ఞానానుసారమైనది కాదు. పౌలు దానిని ఉపయోగించుకో లేదు. ఆధ్యాత్మిక సత్యాలు మానవ వివేచనకు అందవు.
\p
\v 1 సోదరీసోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు.
\v 2 మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరి దేనినీ తెలిసి ఉండకూడదని తీర్మానించుకున్నాను.
\s5
\v 3 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను.
\v 4 మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ.
\v 5 అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ, శక్తినే ప్రదర్శించాను.
\s5
\v 6 ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు.
\v 7 అది దేవుని రహస్య సత్యం లోని జ్ఞానం. ఈ మరుగైన జ్ఞానాన్ని దేవుడు లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.
\s5
\v 8 దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమ స్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు.
\v 9 దీనిని గూర్చి 'దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు' అని రాసి ఉంది.
\s5
\v 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.
\p
\v 11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు.
\s5
\v 12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలిసికోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము.
\v 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాము.
\s వెల్లడి అయిన అంశాలు ఆత్మ సంబంధంగా మాత్రమే అర్థం అవుతాయి
\s5
\p
\v 14 ఆత్మ సంబంధి కాని వ్యక్తి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి బుద్ధిహీనంగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు.
\v 15 ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతనిని ఎవరూ సరిగా అంచనా వేయలేరు.
\v 16 ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.
\s5
\c 3
\s శరీర సంబంధమైన స్థితి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆవరోధకం
\p
\v 1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది.
\v 2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని మాంసాహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దానిని తీసుకునే స్థితిలో లేరు.
\s5
\v 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దానిని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడుచుకొనేవారే కదా?
\v 4 మీలో ఒకడేమో 'నేను పౌలుకు చెందినవాణ్ణి', మరొకడు 'నేను అపొల్లోకు చెందిన వాణ్ణి', అని చెప్తూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా
\v 5 అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు.
\s5
\v 6 నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దానిని పెరిగేలా చేసింది దేవుడే.
\v 7 కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.
\s5
\v 8 నాటే వాడూ నీరు పోసేవాడూ చేసేది ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు.
\v 9 మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
\s క్రైస్తవ సేవ, దాని ప్రతిఫలాలు
\s5
\p
\v 10 దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.
\s ఒకే పునాది
\p
\v 11 పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
\s రెండు రకాల పరిచర్యలు, వాటి ఫలితాలు
\s5
\p
\v 12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్లు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే
\v 13 వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దానిని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అగ్ని ఆ పని చేస్తుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి.
\s5
\v 14 పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది.
\v 15 ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.
\s5
\p
\v 16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?
\v 17 దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడుచేస్తే దేవుడు వారిని పాడుచేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైంది. ఆ ఆలయం మీరే.
\s5
\v 18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందటం కోసం అతడు బుద్దిహీనుడు కావాలి.
\v 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి బుద్ధిహీనతే. 'జ్ఞానుల్ని వారి సొంత జిత్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు' అనీ
\v 20 'జ్ఞానుల ఆలోచనలు వ్యర్ధం అని ప్రభువుకు తెలుసు' అనీ రాసి ఉంది కదా.
\s5
\v 21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే.
\v 22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే.
\v 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.
\s5
\c 4
\s క్రీస్తు సేవకుల తీర్పు మానవమాత్రుల చేతుల్లో లేదు
\p
\v 1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని రహస్య సత్యాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి.
\v 2 నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండటం చాలా అవసరం.
\s5
\v 3 మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నాకు నేను తీర్పు తీర్చుకోను.
\v 4 నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు.
\s5
\v 5 కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకు, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఆలోచనలు బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.
\s5
\p
\v 6 సోదరీసోదరులారా, దేవుని వాక్యంలో రాసి ఉన్నవాటిని అతిక్రమించకూడదన్న విషయాన్ని మీరు మమ్మల్ని చూసి గ్రహిస్తారని, ఈ మాటలు మీ మేలు కోసం నాకూ అపొల్లోకూ ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవీగకూడదని ఈ విధంగా చేశాను.
\v 7 ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో ఇతరుల నుండి పొందనిది ఏముంది? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు?
\s5
\v 8 ఇప్పటికే మీరు అన్నీ సంపాదించుకున్నారు! ఇప్పటికే ధనవంతులయ్యారు! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారు! అయినా, మేము కూడా మీతో కలిసి ఏలగలిగేలా మీరు రాజులు కావడం నాకు సంతోషమే.
\s వినయభావం, సహనం విషయంలో పౌలు ఆదర్శం
\p
\v 9 దేవుడు క్రీస్తు అపోస్తలులమైన మమ్మల్ని చివరి వరుసలో ఉంచి మరణశిక్షకు గురైన వారిగా ప్రదర్శిస్తున్నాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం.
\s5
\v 10 క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలహీనులం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వారం.
\v 11 ఈ గంట వరకు మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేనివారం.
\s5
\v 12 మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా బదులుగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం.
\v 13 మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పెంటగా ఎంచుతున్నారు.
\s5
\p
\v 14 నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు.
\v 15 ఎందుకంటే క్రీస్తులో మీకు బోధించేవారు పదివేలమంది ఉన్నా, తండ్రులు లేరు.
\v 16 క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి నన్ను పోలి నడచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\s5
\v 17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరకు పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.
\s అపోస్తలిక అధికారం
\p
\v 18 నేను మీ దగ్గరకు రాను అనుకుని కొందరు మిడిసిపడుతున్నారు.
\s5
\v 19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వచ్చి, అలా మిడిసి పడేవారి మాటలు కాదు, వారి బలమేమిటో తెలుసుకుంటాను.
\v 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది బలప్రభావాలతో నిండి ఉంది.
\v 21 మీకేం కావాలి? మీ దగ్గరకు నేను బెత్తంతో రావాలా, ప్రేమతో, సాత్వికమైన మనస్సుతో రావాలా?
\s5
\c 5
\s దుర్నీతి విషయం గద్దింపు, క్రమశిక్షణ చర్య
\p
\v 1 మీ సమాజంలో వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట గదా. ఇలాటి వ్యభిచారం క్రైస్తవేతరులలో సహితం కనిపించదు.
\s సంఘంలో చెడుగును పట్టించుకోక పోవడం చీలికల మూలగానే
\p
\v 2 పైగా, మీరు దాని విషయం ఏ మాత్రం బాధపడక, ఇంకా విర్రవీగుతున్నారు. ఇలాటి పని చేసినవాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి.
\s5
\v 3 నేను శరీర రీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాని విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను.
\v 4 ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమావేశమైనప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా,
\v 5 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.
\s5
\p
\v 6 మీరు గర్వంతో మిడిసి పడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా!
\v 7 మీరు పులిపిండి లేనివారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువును వధించారు.
\v 8 కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండుగ జరుపుకుందాం.
\s5
\p
\v 9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను.
\v 10 అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, వంచకులు, విగ్రహాలను పూజించేవారు, ఇలాటివారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.
\s5
\v 11 ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ పోట్లాడేవారూ తాగుబోతులూ వంచకులూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు.
\v 12 సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు.
\v 13 లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.
\s5
\c 6
\s విశ్వాసులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కోర్టులకు వెళ్ళకూడదు
\p
\v 1 మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ముందు కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ముందు వాదించడానికి పూనుకుంటాడా?
\v 2 పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా?
\v 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?
\s5
\v 4 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎన్నిక లేనివారి దగ్గరకు వెళ్తారా?
\v 5 మీరు సిగ్గు పడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా?
\v 6 అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!
\s5
\p
\v 7 అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీరు ఓడిపోయారని సూచన. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటె మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా?
\v 8 అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. మీ సోదరులకే ఈ విధంగా చేస్తున్నారు.
\s శరీర, వివాహ పవిత్రత
\s5
\p
\v 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. జారత్వం చేసేవారూ, విగ్రహాలను పూజించేవారూ, వ్యభిచారులూ, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే పురుషులూ, స్వలింగ సంపర్కులూ,
\v 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ, వీరెవరూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
\v 11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగటం ద్వారా పవిత్రులై నీతిమంతులయ్యారు.
\s5
\v 12 నాకు అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.
\s శరీరం ప్రభువుది
\p
\v 13 ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. దేవుడు దానిని, వాటిని కూడా నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు.
\s5
\v 14 దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనల్ని కూడ తన శక్తితో లేపుతాడు.
\p
\v 15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసికొనిపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా చేయకుందును గాక.
\s5
\v 16 వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? 'వారిద్దరూ ఒకే శరీరం అవుతారు' అని మోషే చెప్పాడు కదా?
\v 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు.
\s5
\v 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
\s శరీరం ఆలయం
\s5
\p
\v 19 మీ శరీరాన్ని అనుగ్రహించింది దేవుడే అనీ, అది మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.
\v 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.
\s5
\c 7
\s వివాహం దేవుడు స్థాపించాడు
\p
\v 1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. స్త్రీని ముట్టకపోవడం పురుషునికి మంచిది.
\v 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికి తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.
\s5
\v 3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి.
\v 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
\s5
\v 5 ప్రార్థన చేయటానికి వీలు కలిగేలా కొంత కాలం మట్టుకు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం అవ్వండి.
\v 6 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు. ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను.
\v 7 దేవుడు ప్రతి ఒక్కరికీ వేరు వేరు విధాలుగా కృపావరాలు ఇచ్చాడు.
\s5
\v 8 నాలాగా ఉండటం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను.
\v 9 అయితే కోరికలను నిగ్రహించు కోలేకపోతే పెండ్లి చేసికోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.
\s యూదేతర విశ్వాసుల్లో వివాహ వ్యవస్థ క్రమం
\s5
\p
\v 10 ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.
\v 11 ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసికోకూడదు. లేదా తన భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
\s5
\p
\v 12 మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఏ సోదరుని భార్య అయినా అవిశ్వాసి అయి ఉండి, ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.
\v 13 అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు.
\v 14 అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు.
\s5
\p
\v 15 అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్లిపోడానికి మొగ్గు చూపవచ్చు. అప్పుడు సోదరునికైనా సోదరికైనా నిర్బంధం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు.
\v 16 మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకు తెలియదు కదా? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకు తెలియదు కదా?
\s5
\v 17 అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.
\v 18 ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు.
\v 19 దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందటంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,
\s5
\p
\v 20 ఎవరు ఏ స్థితిలో ఉండగా విశ్వసించారో ఆ స్థితిలోనే ఉండాలి.
\v 21 దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛను పొందడమే మంచిది.
\v 22 ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస.
\v 23 ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.
\v 24 సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.
\s5
\p
\v 25 కన్యల విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గాని నమ్మదగిన వాడిగా ఉండటానికి ప్రభువు వలన కనికరం పొందిన వాడుగా నా భావం చెబుతున్నాను.
\v 26 ఇపుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని నా ఉద్దేశం.
\s5
\v 27 వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా ఒంటరిగా లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు.
\v 28 ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా అపరాధమేమీ కాదు. కన్య పెళ్ళి చేసుకున్నా ఆమెకు అపరాధం కాదు. అయితే అలాటి వారికి శారీరిక కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
\s5
\p
\v 29 సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.
\v 30 ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి.
\v 31 ఈ లోకంలో ఉన్నవాటిని అనుభవించే వారు వాటిని ఎక్కువగా అనుభవిస్తున్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.
\s5
\p
\v 32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.
\v 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు.
\v 34 అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, కన్యకూ తేడా ఉంది. పెళ్లి కాని స్త్రీ శరీరంలో, ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.
\s5
\v 35 మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
\s5
\p
\v 36 ఒక వ్యక్తి కూతురు కన్యగా ఉండి ఆమెకు వయసు మించిపోయినప్పుడు ఆమెకు పెళ్ళి జరిపించకుండా ఉంచడం సరైన విషయం కాదని ఒకడు భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. ఆ విషయంలో అతనిపై అపరాధం ఏమీ లేదు.
\v 37 అయితే ఎవరైనా తన కుమార్తెకు పెళ్ళి చేయనని హృదయంలో నిశ్చయించుకొని, దానికి తగిన మనోబలం ఉండి, తన ఇష్ట ప్రకారం చేయగల శక్తి ఉన్నవాడయితే అతడు చేసేది మంచి పని.
\v 38 కాబట్టి తన కూతురుకు పెళ్ళి జరిగించేవాడు మంచి పని చేస్తున్నాడు. పెళ్ళి చేయనివాడు మరింత మంచి పని చేస్తున్నాడు.
\s5
\v 39 భార్య తన భర్త బతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసికోడానికి ఆమెకుస్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.
\v 40 అయితే ఆమె ఉన్న రీతిగా నిలిచిపోతే మరింత శ్రేష్టమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.
\s5
\c 8
\s మాంసాహారం, క్రైస్తవ స్వాతంత్ర్యం పరిథి
\p
\v 1 విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది.
\v 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలిసికోవలసినంత ఇంకా తెలిసికోలేదు అని.
\v 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.
\s5
\v 4 అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు.
\v 5 దేవతలు, ప్రభువులు అని పిలిచేవారు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవతలనే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ,
\v 6 మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
\s5
\p
\v 7 అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది.
\s5
\v 8 భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు.
\v 9 అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి.
\v 10 ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా?
\s5
\v 11 తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు నీ తెలివి వలన పాడైపోతాడు.
\v 12 ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
\v 13 కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.
\s5
\c 9
\s పౌలు అపోస్తలత్వం సమర్థన
\p
\v 1 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా?
\v 2 నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు.
\s5
\v 3 నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే.
\v 4 తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా?
\v 5 మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసికొని తిరగటానికి మాకు అధికారం లేదా?
\v 6 బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?
\s సువార్త ప్రకటించేవారి జీవనోపాధి సువార్త వల్లనే
\s5
\p
\v 7 ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు?
\v 8 ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడ ఇదే చెబుతున్నది కదా?
\s5
\v 9 "ధాన్యపు కళ్ళం తొక్కే యెద్దు మూతికి చిక్కం పెట్టవద్దు" అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది?
\v 10 నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీనిని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి.
\v 11 మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.
\s5
\p
\v 12 వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండటం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.
\v 13 దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువులలో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?
\v 14 అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు.
\s5
\v 15 అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు.
\v 16 నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.
\s5
\v 17 దానిని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు.
\v 18 అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కుల్ని పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం.
\s నిజమైన సేవావిధానం, ప్రతిఫలం
\s5
\p
\v 19 నాకు అన్ని రకాల బాధ్యతల విషయంలో స్వేచ్ఛ ఉంది. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను.
\v 20 యూదుల్ని సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను.
\s5
\v 21 దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేనివాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను.
\v 22 బలహీనుల్ని సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను.
\v 23 సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో వారితో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
\s5
\p
\v 24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.
\v 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే కిరీటం కోసం పరుగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
\v 26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను.
\v 27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే గురి తప్పిపోతానేమో అని నా శరీరాన్ని నలగగొట్టి, దానిని నాకు లోపరచుకొంటున్నాను.
\s5
\c 10
\s అరణ్యప్రయాణం లో ఇశ్రాయేలు మనకి హెచ్చరికగా ఉన్నారు
\p
\v 1 సొదరీసోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.
\v 2 అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు.
\v 3 వారంతా ఆత్మీయమైన ఒకే ఆహారం తిన్నారు.
\v 4 ఆత్మీయమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలోనుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.
\s5
\v 5 అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.
\v 6 వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డసంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణగా మన కోసం రాసి ఉన్నాయి.
\s5
\v 7 "ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు" అని రాసి ఉన్నట్టు వారి లాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.
\v 8 వారి లాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవైమూడు వేలమంది చనిపోయారు.
\s5
\v 9 వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు.
\v 10 అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో మరణించారు.
\s5
\p
\v 11 ఈ సంగతులు వారికి జరిగింది, మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి.
\v 12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండటానికి జాగ్రత్త తీసుకోవాలి.
\v 13 ఇప్పటివరకూ మీరు ఎదుర్కొన్న కష్టాలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన కష్టాలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకొనే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.
\s5
\p
\v 14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి.
\v 15 తెలివైన వారితో మాట్లాడినట్టే మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.
\s ప్రభువు బల్ల సహవాసం కోసం ప్రత్యేకత అవసరం
\p
\v 16 మనం స్తుతులు చెల్లించే పాత్రలోనుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే.
\v 17 మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దానిని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.
\s5
\p
\v 18 ఇశ్రాయేలీయుల్ని చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?
\v 19 దీనికి నా అభిప్రాయమేమిటని అనుకుంటున్నారు? విగ్రహాలలో గాని, వాటికీ అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.
\s5
\v 20 యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.
\v 21 మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ, ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్లమీదా, ఈ రెంటిమీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.
\v 22 ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?
\s ఆహారపానీయాల విషయంలో ప్రేమనియమం (రోమా 14: 1- 23)
\s5
\p
\v 23 అన్ని విషయాల్లో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ ప్రయోజనకరం కాదు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనకి వృద్ధి కలిగించవు.
\v 24 ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి.
\s5
\v 25 మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.
\v 26 ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.
\v 27 ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.
\s5
\v 28 అయితే "ఇది విగ్రహాలకు అర్పించినది" అని ఎవరైనా మీతో చెబితే, వాని నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దానిని తినవద్దు.
\v 29 ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛను వేరొకని మనస్సాక్షి విమర్శకు ఎందుకు గురిచెయ్యాలి?
\v 30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?
\s5
\p
\v 31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.
\v 32 యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి.
\v 33 నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, అనేకులు పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకొంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.
\s5
\c 11
\s క్రైస్తవ క్రమం, ప్రభువు బల్ల
\p
\v 1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి.
\v 2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకొంటూ, నేను మీకు ఉపదేశించిన పద్ధతులను అనుసరిస్తున్నారని మిమ్మల్ని మెచ్చుకొంటున్నాను.
\v 3 మీరు తెలుసుకోవలసిందేమంటే, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు.
\v 4 తన తల కప్పుకొని ప్రార్థన చేసే పురుషుడు తన తలను అవమానపరచినట్టే.
\s5
\v 5 తన తలను కప్పుకోకుండా ప్రార్థన చేసే, లేక ప్రవచించే స్త్రీ తన తలను అవమానపరచినట్టే. ఎందుకంటే అది ఆమె తల గొరిగించుకున్న దానితో సమానం.
\v 6 తన తల కప్పుకోని స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకోవడం లేక పూర్తిగా వెంట్రుకలు తీసివేయడం ఆమెకు అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి.
\s5
\v 7 పురుషుడు దేవుని పోలిక, ఆయన మహిమ. కాబట్టి అతడు తన తలను కప్పుకోకూడదు. స్త్రీ పురుషుని మహిమ.
\v 8 అదెలాగంటే, స్త్రీ పురుషుని నుండి కలిగింది గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.
\s5
\v 9 స్త్రీని పురుషుని కోసం సృష్టించడం జరిగింది గాని పురుషుణ్ణి స్త్రీ కోసం కాదు.
\v 10 కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి.
\s5
\p
\v 11 అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.
\v 12 ఏ విధంగా స్త్రీ పురుషుని నుండి కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు. అయితే సమస్తమూ దేవునినుండే కలుగుతాయి.
\s5
\v 13 మీరే చెప్పండి. స్త్రీ తల కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరైనదేనా?
\v 14 పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమనీ,
\v 15 దేవుడు స్త్రీకి తల వెంట్రుకలు పైటచెంగుగా ఇచ్చాడు కాబట్టి ఆమె వాటిని పెంచుకోవడం ఆమెకు ఘనత అనీ మీకు స్వతహాగా తెలుసు కదా!
\v 16 ఈ విషయంలో వేరే వాదనలు చేసేవాడు, మాలో గానీ, దేవుని సంఘంలో గానీ దీనికి వ్యతిరేకంగా ఎలాటి ఆధారమూ లేదని తెలుసుకోవాలి.
\s ప్రభువు బల్ల దగ్గర అక్రమాలు ఖండన
\s5
\p
\v 17 మీకు ఈ ఆజ్ఞనిస్తూ మిమ్మల్నేమీ మెచ్చుకోవడం లేదు. ఎందుకంటే మీరు సమావేశం కావడం ఎక్కువ కీడుకే కారణమౌతున్నదిగానీ ఎక్కువ మేలుకు కాదు.
\v 18 మొదటి సంగతి, మీరు సమావేశమైనప్పుడు మీలో కక్షలు ఉన్నాయని వింటున్నాను. కొంతమట్టుకు ఇది నిజమే అనిపిస్తుంది.
\v 19 మీలో నిజంగా యోగ్యులు ఎవరో తెలియాలంటే మీలో భిన్నాభిప్రాయాలు ఉండాల్సిందే.
\s5
\v 20 మీరంతా సమావేశమై కలిసి తినేది ప్రభు రాత్రి భోజనం కాదు.
\v 21 ఎందుకంటే మీరు ఆ భోజనం తినేటప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తన మట్టుకు తానే తింటున్నాడు. దీనివలన ఒకడు ఆకలితో ఉండగానే ఇంకొకడు బాగా తిని తాగి మత్తులో మునిగిపోతాడు.
\v 22 ఏమిటిది? తిని తాగడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘాన్ని చిన్నచూపు చూస్తూ ఏమీ లేనివారిని అవమానపరుస్తారా? మీతో ఏమి చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోమంటారా? ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోలేను.
\s ప్రభువు బల్ల క్రమం, పరమార్థం
\s5
\p
\v 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసును శత్రువులు పట్టుకొన్న రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకొన్నాడు.
\v 24 స్తుతులు చెల్లించిన తరువాత దానిని విరిచి, 'ఇది మీ కోసమైన నా శరీరం. తీసికొని తినండి. నా జ్ఞాపకార్ధం దీనిని చేయండి' అని చెప్పాడు.
\s5
\v 25 భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకొని, 'ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త ఒడంబడిక. మీరు దీనిని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసికోడానికి దీనిని చేయండి' అన్నాడు.
\v 26 మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు.
\s5
\p
\v 27 కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు.
\v 28 కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి.
\v 29 ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దానిని తిని, తాగేవాడు తన మీదికి శిక్షను కొని తెచ్చుకుంటున్నాడు.
\v 30 ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా.
\s5
\v 31 అయితే మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు.
\v 32 మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.
\s5
\p
\v 33 కాబట్టి నా సోదరీ సోదరులారా, మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకని కోసం ఒకడు వేచి ఉండండి.
\v 34 మీరు ఇలా కలుసుకోవడం మీపై తీర్పు రావడానికి కారణం కాకుండేలా, ఆకలి వేసినవాడు తన ఇంట్లోనే భోజనం చేసి రావాలి. మీరు రాసిన మిగతా సంగతులను నేను మీ దగ్గరకి వచ్చినప్పుడు సరిచేస్తాను.
\s5
\c 12
\s దేవుని సంఘంలో పరిచర్య, ఆరాధనకై ఆత్మ వరాలు
\p
\v 1 సోదరీసోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.
\v 2 పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ విగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు.
\v 3 అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ "యేసు శాపగ్రస్తుడు" అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ "యేసే ప్రభువు" అని చెప్పలేరు.
\s ఆత్మవరాల వాడకమే నిజమైన పరిచర్య (ఎఫెసి 4: 7- 16)
\s5
\p
\v 4 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు.
\v 5 అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు.
\v 6 వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే.
\s5
\v 7 అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కనికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు.
\v 8 ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకనికి తెలివైన మాట, ఒకనికి జ్ఞాన వాక్కు,
\s5
\v 9 మరొకనికి విశ్వాసం, మరొకనికి స్వస్థత వరం ఇస్తాడు.
\v 10 ఆ ఆత్మే ఒకనికి అద్భుతాలు చేసే శక్తి, మరొకనికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకనికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకనికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకనికి ఆ భాషల అర్ధం చెప్పే శక్తి అనుగ్రహించాడు.
\v 11 ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
\s ప్రతి విశ్వాసీ క్రీస్తు శరీరంలో భాగమే గనక ప్రతి ఒక్కరికీ స్పష్టమైన పరిచర్య ఉంది
\s5
\p
\v 12 శరీరం ఒక్కటే అయినా, అనేక అవయవాలు ఆ ఒకే శరీరంలో ఉన్న విధంగా క్రీస్తు ఉన్నాడు.
\v 13 ఎలాగంటే, యూదులైనా, గ్రీకు లైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం.
\s5
\v 14 శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది.
\v 15 పాదం, 'నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు' అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.
\v 16 అలాగే చెవి, 'నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు' అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు.
\v 17 శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? అంతా వినడమే అయితే వాసన ఎలా చూడాలి?
\s5
\p
\v 18 అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు.
\v 19 అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది?
\v 20 అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే.
\s5
\v 21 కాబట్టి కన్ను చేతితో, 'నీవు నాకక్కర లేదు' అనీ, తల పాదాలతో, 'మీరు నాకక్కర లేదు' అనీ చెప్పడానికి వీలు లేదు.
\v 22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి.
\v 23 శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం.
\v 24 అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు.
\s5
\v 25 ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు.
\v 26 కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.
\v 27 అదే విధంగా, మీరు క్రీస్తు శరీరంలో వేరు వేరు అవయవాలుగా ఉన్నారు.
\s5
\p
\v 28 దేవుడు సంఘంలో మొదట కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని అద్భుతాలు చేసేవారుగా, మరి కొందరిని స్వస్థత వరం గలవారిగా, కొందరిని ఉపకారాలు చేసేవారిగా, కొందరిని నాయకులుగా, కొందరిని వివిధ భాషలు మాట్లాడేవారిగా నియమించాడు.
\v 29 అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు, అందరికీ స్వస్థతా వరం లేదు.
\s5
\v 30 అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్ధం చెప్పలేరు.
\v 31 కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ట మార్గాన్ని మీకు చూపిస్తాను.
\s5
\c 13
\s పరిచర్య వరాలను ప్రేమతో ఉపయోగించాలి
\p
\v 1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.
\v 2 దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే.
\v 3 బీదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
\s5
\p
\v 4 ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
\v 5 అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
\v 6 ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
\v 7 అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురుచూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
\s5
\p
\v 8 ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.
\v 9 ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచించగలం.
\v 10 అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి.
\s5
\v 11 నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే ఆలోచించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
\v 12 అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు అరకొరగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంతమట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.
\p
\v 13 ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ, ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.
\s5
\c 14
\s దేవుని మూలంగా పలకడం అన్నిటికన్నా గొప్ప వరం
\p
\v 1 ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దేవుని మాటలను ఉపదేశించే వరం కోరుకోండి.
\v 2 ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్ధం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు.
\v 3 అయితే దేవుని మాటలు ఉపదేశించే వాడు వినేవారికి క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు.
\v 4 భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని ఉపదేశించేవాడు సంఘానికి మేలు చేస్తాడు.
\s5
\v 5 మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దేవుని మూలంగా ఉపదేశించే వారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడేవాడి కంటె (అర్ధం చెబితే తప్ప) దేవుని మూలంగా ఉపదేశించేవాడే గొప్పవాడు.
\p
\v 6 సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరకు భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, జ్ఞానోపదేశం గానీ, దేవుని మూలంగా పలికే ఉపదేశం గానీ లేకుండా ఉంటే, నా వలన మీకు ప్రయోజనమేమిటి?
\s5
\v 7 నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది?
\v 8 బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?
\v 9 అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్ధమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా!
\s5
\p
\v 10 లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్ధాలు ఉంటాయి.
\v 11 మాటల అర్ధం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివాళ్ళుగా ఉంటాం.
\s5
\v 12 మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తి కలిగి సంఘం అభివృద్ధి చెందేలా వాటిని విస్తరింపజేసుకోండి.
\v 13 తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్ధం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి.
\v 14 నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనస్సు చురుకుగా ఉండదు.
\s5
\v 15 కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనస్సుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనస్సుతో కూడా పాడతాను.
\v 16 అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దానిని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు "ఆమేన్‌" అని చెప్పలేడు కదా!
\s5
\v 17 నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు.
\v 18 దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటె ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను.
\v 19 అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనస్సుతో అయిదు మాటలు చెప్పడం మంచిది.
\s5
\v 20 సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ తెలివి విషయంలో పరిణతి చెందినవారుగా ఉండండి.
\v 21 ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, "తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు."
\s5
\p
\v 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుని మూలంగా ఉపదేశించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన.
\s స్థానిక సంఘం లో ఆత్మవరాల పరిచర్య క్రమం
\p
\v 23 సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకుంటారు కదా?
\s5
\v 24 అయితే అందరూ దేవుని మూలంగా ఉపదేశిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది.
\v 25 అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.
\s5
\p
\v 26 సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దానిని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్ధం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి.
\v 27 ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్ధం చెప్పాలి.
\v 28 అర్ధం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు.
\s5
\v 29 దేవుని మూలంగా ఉపదేశించే వారు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి.
\v 30 అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి.
\s5
\v 31 అందరూ నేర్చుకొనేలా, హెచ్చరిక పొందేలా మీరంతా ఒకని తరువాత ఒకడు ఉపదేశించవచ్చు.
\v 32 ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి.
\v 33 ఎందుకంటే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు శాంతి సమాధానాలు కలిగించేవాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు.
\s5
\v 34 స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండాల్సిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది.
\v 35 వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంటిలో తమ తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడ్డం అవమానకరం.
\v 36 ఏం, దేవుని వాక్యం మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా?
\s5
\p
\v 37 ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి.
\v 38 తెలియని వాడెవరన్నా ఉంటే అతణ్ణి తెలియని వాడుగానే ఉండనివ్వండి
\s5
\v 39 కాబట్టి నా సోదరులారా, దేవుని మూలంగా ఉపదేశించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి.
\v 40 అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.
\s5
\c 15
\s ప్రభువు రాకడ, మొదటి పునరుత్థానం (ప్రకటన 20: 5, 11-15)
\p
\v 1 సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ చెబుతున్నాను. మీరు దానిని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు.
\v 2 మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.
\s5
\v 3 దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు,
\v 4 లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయన్ని మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.
\s5
\v 5 ఆయన కేఫాకూ, తరువాత పన్నెండుమందికీ కనబడ్డాడు.
\v 6 ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్నుమూశారు.
\v 7 తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.
\s5
\v 8 చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు.
\v 9 ఎందుకంటే నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి కాబట్టి నాకు అపొస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు.
\s5
\v 10 అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.
\v 11 నేనైనా, వారైనా, మేము ప్రకటించాము, మీరు విశ్వసించారు.
\s క్రీస్తు పునరుత్థానం ప్రాముఖ్యత
\s5
\p
\v 12 క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు?
\v 13 మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు.
\v 14 క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటనా వ్యర్ధం, మీ విశ్వాసమూ వ్యర్ధం.
\s5
\v 15 దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పాం కదా? మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే.
\v 16 మృతులు లేవకపోతే క్రీస్తు కూడ లేవలేదు.
\v 17 క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట.
\s5
\v 18 అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే.
\v 19 మనం ఈ జీవిత కాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకునే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు.
\s పునరుత్థానాల క్రమం
\s5
\p
\v 20 కానీ ఇప్పుడు క్రీస్తు చనిపోయిన వారిలోనుండి లేచి కన్నుమూసిన వారిలో ప్రథమఫలం అయ్యాడు.
\v 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది.
\s5
\v 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బతుకుతారు.
\v 23 ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బతుకుతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బతుకుతారు.
\s5
\p
\v 24 ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది.
\v 25 ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకు ఆయన పరిపాలించాలి.
\v 26 చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.
\s5
\v 27 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచినవాడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా.
\v 28 సమస్తం ఆయన కింద ఉంచిన దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.
\s5
\p
\v 29 ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయిన వారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు?
\v 30 మేము గంట గంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకొని బతకడం ఎందుకు?
\s5
\p
\v 31 సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, "నేను ప్రతి దినం చనిపోతున్నాను."
\v 32 నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది కేవలం మానవరీత్యా అయితే నాకు లాభమేముంది? చనిపోయిన వారు లేవకపోతే "రేపు చనిపోతాం కాబట్టి తిని, తాగుదాం."
\s5
\v 33 మోసపోకండి. "దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది."
\v 34 కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను.
\s పునరుత్థాన విధానం
\s5
\p
\v 35 అయితే 'చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాటి శరీరంతో వస్తారు?' అని ఒకడు అడుగుతాడు.
\v 36 బుద్ధి హీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా, తిరిగి బతికేది!
\s5
\v 37 నీవు పాతినది గోధుమ గింజైనా, మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతిపెడుతున్నావు గాని పైకి మొలిచే శరీరాన్ని కాదు.
\v 38 దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు.
\v 39 అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు.
\s5
\v 40 ఆకాశంలో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు.
\v 41 నూర్యుని ప్రకాశం వేరు, చంద్రుని ప్రకాశం వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా.
\s5
\p
\v 42 చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. పాతిపెట్టిన శరీరం నశించిపోయి, ఇక నశించనిదిగా లేస్తుంది.
\v 43 ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది.
\v 44 ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది.
\s5
\v 45 దీని గురించి, 'ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు' అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు.
\v 46 మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరువాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి.
\s5
\v 47 మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు.
\v 48 మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే.
\v 49 మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం.
\s5
\v 50 సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.
\s విశ్వాసుల్లో కొందరు చనిపోరు (1 తెస్స 4: 14- 17)
\p
\v 51 ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం, నిమిషంలో ఒక రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం.
\s5
\v 52 బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం.
\v 53 నశించి పోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.
\s5
\v 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, 'విజయం మరణాన్ని మింగివేసింది' అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.
\v 55 'మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?'
\s5
\v 56 మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
\v 57 అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
\s5
\v 58 కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నెమ్మదిగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్ధం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.
\s5
\c 16
\s అంతిమ హెచ్చరికలు, అభినందనలు
\p
\v 1 పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
\v 2 నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
\s5
\v 3 నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారి చేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
\v 4 నేను కూడ వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
\s5
\v 5 నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరకు వస్తాను.
\v 6 అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. అప్పుడు అక్కడినుండి నేను వెళ్ళే చోటికి నన్ను మీరు సాగనంపవచ్చు.
\s5
\v 7 ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
\v 8 పెంతెకొస్తు వరకు ఎఫెసులో ఉంటాను.
\v 9 ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
\s5
\p
\v 10 తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
\v 11 కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరకు అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
\v 12 సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్లమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
\s5
\v 13 మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషం గలిగి, బలవంతులై ఉండండి.
\v 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
\s5
\p
\v 15 స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
\v 16 కాబట్టి సోదరులారా, అలాటివారికి పనిలో సహాయం చేస్తూ కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
\s5
\v 17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది.
\v 18 మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది, నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గౌరవంగా చూడండి.
\s5
\v 19 ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంటిలో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
\v 20 ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
\s5
\v 21 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందన రాస్తున్నాను.
\v 22 ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగుతుంది గాక. ప్రభువు వస్తున్నాడు.
\v 23 ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉంటుంది గాక.
\v 24 క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్‌.

554
48-2CO.usfm Normal file
View File

@ -0,0 +1,554 @@
\id 2CO 2 Corinthians
\s5
\c 1
\s కార్యాచరణలో పౌలు పద్ధతులు- వివరణ
\p
\v 1 కొరింతు లోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపోస్తలుడుఅయిన పౌలు, మన సోదరుడు తిమోతి, రాస్తున్న విషయాలు.
\v 2 మన తండ్రి దేవుని నుండి యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు కృప, శాంతి కలుగుతాయి గాక.
\s5
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగుతుంది గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
\v 4 ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాలలో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
\s5
\v 5 క్రీస్తు పడిన శ్రమలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.
\v 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
\v 7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో ఆలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.
\s5
\v 8 సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.
\v 9 వాస్తవంగా, మామీద మరణ దండన పడింది. అయితే చనిపోయిన వాళ్ళని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది.
\v 10 ఆయన అటువంటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్ని తప్పించాడు. ఆయన మీద మా నమ్మకం ఉంచాము, మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు.
\s5
\v 11 మాకోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీనిని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వలన దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరఫున కృతజ్ఞత చెబుతారు.
\s5
\p
\v 12 మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే పరిశుద్ధతతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి లోకంలో, మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము.
\v 13 మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు.
\v 14 మీరు ఇప్పటికే కొంతవరకు మమ్మల్నిఅర్థం చేసుకున్నారు. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం.
\s5
\v 15 ఈ నమ్మకంతో మొదట మీ దగ్గరకు నేను రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.
\v 16 మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరకు రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంప గలరనీ అనుకున్నాను.
\s5
\v 17 నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను "అవును, అవును" అన్న తరువాత "కాదు, కాదు" అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా?
\v 18 అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, "అవును" అని చెప్పి "కాదు" అనం.
\s5
\v 19 నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు, "అవును" అని చెప్పి "కాదు" అనేవానిగా ఉండలేదు గాని ఆయన ఎప్పుడూ "అవును" అనే వానిగానే ఉన్నాడు.
\v 20 దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో "అవును" గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం "ఆమెన్" అంటున్నాం.
\s5
\v 21 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనల్ని అభిషేకించి
\v 22 మనకు ముద్రవేసి, మన హృదయాలలో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.
\s5
\p
\v 23 మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి.
\v 24 మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.
\s5
\c 2
\s కార్యాచరణలో పౌలు పద్ధతులు- వివరణ
\p
\v 1 నేను బాధ కలిగించేలా మీ దగ్గరకు తిరిగి రాకూడదని నా అంతట నేనే నిశ్చయించుకున్నాను.
\v 2 నేను మీకు బాధ కలిగిస్తే బాధ పొందినవాడు తప్ప ఇంకెవరు నన్ను సంతోషపరచగలరు?
\s5
\v 3 నేను వచ్చేటప్పుడు ఎవరివలన నాకు సంతోషం కలగాలో వారివలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. నా సంతోషమే మీ అందరి సంతోషమని నా నమ్మకం.
\v 4 మీకు బాధ కలగాలని కాదు, మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్లు కారుస్తూ రాశాను.
\s5
\p
\v 5 ఎవరైనా నాకు బాధ కలగజేసి ఉంటే, నాకు మాత్రమే కాదు, కొంతవరకు మీకందరికీ బాధ కలగచేసాడు (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు).
\v 6 అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు.
\v 7 కాబట్టి మీరిక అతణ్ణి శిక్షించకుండా క్షమించి, ఆదరించడం మంచిది. లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.
\s5
\v 8 అందుచేత అతని పట్ల మీ ప్రేమ స్థిరపరచమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
\v 9 మీరన్ని విషయాల్లో విధేయులై ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకు కూడా అలా రాశాను.
\s5
\v 10 మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను.
\v 11 నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.
\s5
\p
\v 12 క్రీస్తు శుభవార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో
\v 13 నాకు మనశ్శాంతి లేక, వారి దగ్గర సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరాను.
\s 14 విజయవంతమైన పరిచర్య
\s5
\p
\v 14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు.
\v 15 విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము.
\s5
\v 16 నాశనమైపోతున్న వారికి చావుకు చెందిన శవం వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవప్రదమైన సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?
\v 17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే పవిత్ర ఉద్దేశాలతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాము.
\s5
\c 3
\s ఆమోదం పొందిన పరిచర్య
\p
\v 1 మళ్ళీ మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టామా? కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా?
\v 2 మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు.
\v 3 అది రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు
\s5
\v 4 క్రీస్తు ద్వారా దేవుని మీద మాకిలాంటి నమ్మకముంది.
\v 5 మా సొంత సామర్ధ్యంతో ఏదైనా చేయగలమని కాదు. మా సామర్ధ్యం దేవునినుండే కలిగింది.
\s 6 ఈ పరిచర్య ఆత్మ సంబంధమైనది,మహిమగలది, ధర్మశాస్త్రపరమైనది కాదు
\p
\v 6 ఆయనే మమ్మల్ని కొత్త ఒడంబడికకు సేవకులుగా మాకు అర్హత కలిగించాడు. అంటే అక్షరానికి కాదు, ఆత్మకే సేవకులం. అక్షరం చంపుతుంది గాని ఆత్మ బ్రతికిస్తుంది.
\s5
\v 7 మనుషుల్ని చంపే సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు.
\v 8 ఇలాగైతే ఆత్మ సంబంధమైన సేవ మరింకెంత గొప్పగా ఉంటుందో గదా!
\s5
\v 9 శిక్షా విధికి కారణమైన సేవ ఇంత గొప్పగా ఉంటే, నీతికి కారణమైన సేవ మరింకెంతో గొప్పగా ఉంటుందిగా!
\v 10 అపారమైన వైభవం దీనికి ఉండడం వలన ఒకప్పుడు వైభవంగా ఉండేది, ఇప్పుడు వైభవం లేనిదవుతుంది.
\v 11 గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
\s5
\v 12 తగ్గిపోయే వైభవాన్ని ఇశ్రాయేలీయులు నేరుగా చూడకుండా మోషే తన ముఖం మీద ముసుకు వేసుకున్నాడు.
\v 13 మాకెంతో భరోసా ఉంది కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాము.
\s5
\v 14 అయితే వారి మనస్సులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వాళ్ళు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దానిని తీసివేశాడు.
\v 15 అయితే ఇప్పటికీ వాళ్ళు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని
\v 16 వాళ్ళు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు.
\s5
\v 17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.
\v 18 మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోనికి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
\s5
\c 4
\s పరిచర్య నిష్కపటమైనది
\p
\v 1 కనికరం ఎలా పొందామో అలానే ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము.
\v 2 అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని కల్తీ చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.
\s5
\v 3 ఒకవేళ మా శుభవార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే.
\v 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే శుభవార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగచేసాడు.
\s5
\v 5 కాబట్టి మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా క్రీస్తు యేసును మా ప్రభువుగా, యేసు కోసం మీ పనివాళ్ళంగా ప్రకటిస్తున్నాము.
\v 6 "చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది" అని చెప్పిన దేవుడే తన జ్ఞానవైభవపు వెలుగును యేసు క్రీస్తులో ఇవ్వడానికి మా హృదయాలలో ప్రకాశించాడు.
\s5
\v 7 అయితే ఈ సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి ఊహించనంత గొప్ప శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
\s పరిచర్య హింసలతో కూడినది
\p
\v 8 అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు.
\v 9 చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు.
\v 10 యేసు జీవం మా దేహాలలో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము.
\s5
\v 11 యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు అప్పగించ బడుతూ ఉన్నాము.
\v 12 ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పనిచేస్తున్నాయి.
\s5
\v 13 కాగా "నమ్మాను కాబట్టి మాట్లాడాను" అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము.
\v 14 ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెట్టుకుంటాడని మాకు తెలుసు.
\v 15 కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి.
\s5
\v 16 అందుచేత మేము నిరుత్సాహ పడడం లేదు. మా దేహాలు రోజు రోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు.
\v 17 మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం.
\v 18 కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి.
\s5
\c 5
\p
\v 1 భూమి మీద మన నివాసమైన ఈ గుడారం శిథిలమైపోయినా, మన చేతులతో చేయనిదీ దేవుడు కట్టిందీ ఎప్పటికీ ఉండేదీ అయిన నివాసం పరలోకంలో ఉందని మనకు తెలుసు.
\v 2 పరలోక సంబంధమైన మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ ఈ గుడారంలో మూలుగుతున్నాము.
\v 3 ఎందుకంటే దానిని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం.
\s5
\v 4 ఈ గుడారంలో ఉన్న మనం బరువు మోస్తూ మూలుగుతూ ఉన్నాం. వీటిని తీసివేయాలని కాదు గాని 'చావుకు లోనయ్యేది జీవంలో లీనం కావాలి' అన్నట్టుగా, ఆ నివాసాన్ని దీనిమీద ధరించుకోవాలని మన ఆశ.
\v 5 దీని కోసం మనల్ని సిద్ధపరచినవాడు దేవుడే. ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు.
\s5
\v 6 అందుచేత ఎప్పుడూ నిబ్బరంగా ఉండండి. ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం, ప్రభువుకు దూరంగా ఉన్నామని గుర్తుంచుకోండి.
\v 7 (కంటికి కనిపించే వాటితో కాక విశ్వాసం తోనే మనం నడుచుకుంటున్నాము).
\v 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి నిబ్బరంగా ఉన్నాం.
\s5
\v 9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.
\v 10 మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా తీర్పు పొందాలి.
\s5
\p
\v 11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులతో ప్రజలను ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము.
\v 12 మాకు మేమే మీ ఎదుట మళ్ళీ మెప్పించుకోవడం లేదు, హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మా విషయం మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాము.
\s5
\v 13 మాకు మతి తప్పింది అని ఎవరైనా అంటే అది దేవుని కోసమే. మేము ఆరోగ్యంగా ఉన్నామంటే అది మీ కోసమే.
\s పరిచర్య ఉద్దేశం
\p
\v 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరికోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం ఖచ్చితం.
\v 15 బతికే వాళ్ళు ఇక నుంచి తమ కోసం బతకకుండా తమ కోసం చనిపోయి సజీవంగా తిరిగి లేచిన వాని కోసమే బతకాలని ఆయన అందరి కోసం చనిపోయాడు.
\s5
\v 16 ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే చూశాం. అయితే ఇప్పటి నుండి ఎవరితోనూ ఇలా వ్యవహరించం.
\v 17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే వాళ్ళు కొత్త సృష్టి. పాతవి గతించి పోయాయి. కొత్తవి వచ్చాయి.
\s5
\v 18 అంతా దేవుని వలననే అయ్యింది. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన పరచే సేవను మాకిచ్చాడు.
\v 19 అంటే, దేవుడు వారి అతిక్రమాల్ని వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.
\s5
\v 20 కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం.
\v 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయన్ని దేవుడు మన కోసం పాప బలిగా చేశాడు.
\s5
\c 6
\s పరిచర్య సారాంశం
\p
\v 1 అందుచేత మేము దేవునితో కలిసి పనిచేస్తూ దేవుని కృపను వ్యర్ధం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
\v 2 "అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను.
\q1 రక్షణ దినాన మీకు సాయం చేశాను," అని ఆయన చెబుతున్నాడు.
\m ఇదిగో, ఇప్పుడే ఎంతో అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.
\v 3 మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం.
\s5
\v 4 దానికి బదులు మేము మా పనులన్నిటితో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో,
\v 5 దెబ్బల్లో, చెరసాలల్లో అల్లర్లలో, శ్రమల్లో, నిద్రలేని రాత్రుల్లో, తిండి లేనప్పుడు- ఎంతో సహనం చూపాం.
\v 6 పవిత్రత, జ్ఞానం, దీర్ఘశాంతం, దయ, పరిశుద్ధాత్మలో, నిష్కపటమైన ప్రేమలో
\v 7 సత్యవాక్యంలో, దేవుని శక్తిలో- కుడి ఎడమ చేతుల్లో నీతి ఆయుధాలతో
\s5
\v 8 ఘనతలో, ఘనహీనతలో, అపవాదుల్లో, ప్రశంసల్లో మేము పనిచేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మామీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే.
\v 9 అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే పనులను బట్టి మాకు శిక్ష పడుతూ ఉంది, అయినా మరణ శిక్ష పడడం లేదు.
\v 10 ఏడుస్తున్నట్టు ఉంటాం కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేనివాళ్ళంగా కనబడుతున్నా, అన్నీ ఉన్నవాళ్ళమే.
\s ప్రత్యేకంగా ఉండాలని పిలుపు
\s5
\p
\v 11 ఓ కొరింతు ప్రజలారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది.
\v 12 మీ విషయంలో మా అంతరంగం సంకుచితంగా లేదు, మీ అంతరంగమే సంకుచితంగా ఉంది.
\v 13 మేము చేసినట్టే మీరూ చేయండి. మీరూ మీ హృదయాలను విశాలంగా తెరవండి. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.
\s5
\v 14 అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేంటి?
\v 15 క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేంటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేంటి?
\v 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏంటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.
\q1 "నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు."
\q1
\s5
\v 17 కాబట్టి, "మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టవద్దు" అని ప్రభువు చెబుతున్నాడు.
\q1
\v 18 "నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులూ కూతుర్లుగా ఉంటారు" అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
\s5
\c 7
\p
\v 1 ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాము.
\s పౌలు హృదయం
\s5
\p
\v 2 మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. మేమెవరికీ అన్యాయం చేయలేదు, ఎవరికీ అపకారం తలపెట్టలేదు. ఎవరినీ మోసగించలేదు.
\v 3 మీమీద నింద మోపాలని నేనిలా అనడం లేదు. మీరు మా హృదయాల్లో ఉన్నారు. మీతో పాటు చావడానికైనా జీవించడానికైనా మేమున్నామని నేను ముందే చెప్పాను.
\v 4 నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. నిండు ఓదార్పుతో ఉన్నాను. మాకు బాధలెన్నున్నా సరే ఆనందంతో పొంగి పోతున్నాను.
\s5
\v 5 మేము మాసిదోనియ వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు. అన్నివైపులా మాకు కష్టాలే. బయట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి.
\v 6 కానీ కృంగిన వారిని ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు.
\v 7 తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని ఆదరించాడు. నాపై ఉన్న మీ అభిమానం, నా పట్ల మీ దుఃఖం, మీ ప్రగాఢ వాంఛ మాకు తెలియచేసాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.
\s5
\v 8 నేను రాసిన ఉత్తరం మీకు విచారం కలిగించినా బాధ లేదు. మీరు బాధ పడినా ఆ ఉత్తరం మీకు తాత్కాలికంగానే విచారం తెచ్చింది.
\v 9 మీరు విచారించారని ఆనందించడం లేదు గాని మీ విచారం పశ్చాత్తాప పడేలా చేసింది. మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువల్ల మా వలన ఎలాంటి నష్టమూ మీరు పొందలేదు.
\v 10 దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన విచారం కాదు, రక్షణ లభిస్తుంది. అయితే లోకానుసారమైన విచారం చావును తెస్తుంది.
\s5
\v 11 దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మీరు నిర్దోషులని రుజువు చేసే ఎంత గొప్ప పట్టుదల, ఎలాంటి రోషం, ఎలాంటి భయభక్తులు, ఎలాంటి తపన, ఎలాంటి ఆసక్తి, ప్రతి దానిలో న్యాయం తప్పక జరగాలనే ఎలాంటి ఆశ, మీలో కలిగాయో చూడండి! ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు.
\v 12 నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాని వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. అయితే మా పట్ల మీకున్న ఆసక్తి దేవుని దృష్టిలో మీకు తెలియడానికే రాశాను.
\s5
\v 13 వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. మీ అందరి వలన అతని ఆత్మకు ఊరట కలిగింది.
\v 14 ఎందుకంటే నేనతనికి మీ గురించి గొప్పగా చెప్పిన విషయాల్లో మీరు నన్ను సిగ్గుపరచలేదు. దీనికి భిన్నంగా మేము మీతో చెప్పినదంతా ఎలా వాస్తవమో అలాగే మేం మీ గురించి తీతుకు గొప్పగా చెప్పినదంతా వాస్తవమని తేలింది.
\s5
\v 15 మీరు అతన్ని భయంతో, వణుకుతో చేర్చుకొని విధేయత చూపిన సంగతి జ్ఞాపకం చేసుకున్నపుడు అతనికి మీ పట్ల ప్రేమ అధికమయ్యింది.
\v 16 ప్రతి విషయంలో మీ గురించి నాకు ఉన్న నమ్మకాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను.
\s5
\c 8
\s రెండవ భాగము- పేదలకై చందా
\p
\v 1 సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతం లోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియ చేస్తున్నాం.
\v 2 విపరీతమైన బాధలు వాళ్ళని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది.
\s5
\v 3 వారిని గురించి నా సాక్ష్యం ఏంటంటే, పరిశుద్ధులకు ఇలాంటి సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు.
\v 4 వాళ్ళు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు.
\v 5 అంతేకాక వాళ్ళు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమేన్నడూ తలంచలేదు.
\s5
\v 6 కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము.
\s ఉద్బోధలు
\p
\v 7 మీరు ప్రతి విషయంలో, అంటే విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానంలో, శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా మేటిగా ఉన్నారో ఆలానే మీరు ఈ కృపా పరిచర్య లో కూడ తప్పక మేటిగా ఉండండి.
\s5
\v 8 ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియచేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను.
\v 9 మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.
\s5
\v 10 ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఏదో ఒకటి చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, చేయాలని ఆశ పడ్డారు.
\v 11 కాబట్టి ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో, మీరు సమర్ధులు కాబట్టి, ఆ విధంగానే మీరిప్పుడు దానిని ముగింపుకు తీసుకు రండి.
\v 12 అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం, ఒక వ్యక్తి, తనకున్న దానిని బట్టి కానీ లేనిదానిని బట్టి కానీ.
\s5
\v 13 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం లేదు,
\q1
\v 14 "ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగలలేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు" అని రాసి ఉంది.
\p
\v 15 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.
\s వార్తాహరులు
\s5
\p
\v 16 మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు.
\v 17 అతడు మా విన్నపాన్ని అంగీకరించడమే గాక దాని గురించి ఎంతో ఆసక్తితో తన ఇష్టప్రకారమే మీ దగ్గరకు వచ్చాడు.
\s5
\v 18 క్రీస్తుప్రభువు సంఘాలన్నిటిలో శుభవార్త ప్రకటించే పనిలో ప్రసిద్ధి చెందిన సోదరుణ్ణి అతనితో పంపిస్తున్నాం.
\v 19 అంతేకాక మన ప్రభువు మహిమ కోసం సాయం చేయడానికి మాకున్న ఉత్సాహాన్ని చూపించడానికి మేము చేస్తున్న ఈ కృపా పరిచర్యలో మాతో తిరగాలని సంఘాలు అతన్ని కోరుకున్నాయి.
\s5
\v 20 మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం.
\v 21 ఎందుకంటే ప్రభువు దృష్టిలోనే కాక మనుషుల దృష్టిలో కూడా గౌరవింప తగిన వాటినే చేయాలని మేము జాగ్రత్త పడుతున్నాం.
\s5
\v 22 వారితో కూడ మరొక సోదరుణ్ణి మేము పంపుతున్నాం. అతన్ని చాలా విషయాల్లో చాలా సార్లు పరీక్షించి, ఆసక్తి గలవాడని గ్రహించాం. అతనికి మీమీద నమ్మకం కుదిరింది. అతడిప్పుడు మరింత ఆసక్తితో ఉన్నాడు.
\v 23 తీతు విషయంలో నైతే, అతడు నా సేవలో భాగస్థుడు, మీ విషయంలో నా జత పనివాడు. మన సోదరులయితే, సంఘ ప్రతినిధులూ క్రీస్తుకు మహిమ తెచ్చేవాళ్ళు .
\v 24 కాబట్టి వాళ్లకు మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాలలో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పామో వాళ్లకు రుజువు చేయండి.
\s5
\c 9
\p
\v 1 పరిశుద్ధుల కోసమైన ఈ సేవ గురించి నేను మీకు రాయనవసరం లేదు.
\v 2 మీ ఆసక్తి గురించి నాకు తెలుసు. దానిని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వాళ్ళు సిద్ధంగా ఉన్నారని వాళ్లకు చెప్పాను. మీ ఆసక్తి, వాళ్ళల్లో చాలా మందిని ప్రోత్సహించింది.
\s5
\v 3 అయితే మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు ఈ విషయంలో వ్యర్ధం కాకూడదని, నేను చెప్పినట్లు మీరు సిద్ధంగా ఉండాలని సోదరుల్ని పంపాను.
\v 4 ఒకవేళ మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం కలుగుతుంది.
\v 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరకు వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయాలని ప్రోత్సహించడానికి వారిని పంపడం అవసరమని నేను భావించాను. తద్వారా మీ విరాళం బలవంతంగా ఇచ్చింది కాకుండా స్వచ్ఛందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
\s ప్రోత్సాహం- సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు
\s5
\p
\v 6 "కొద్దిగా విత్తేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా విత్తేవాడు విస్తారమైన పంట కోస్తాడు" అని దీని గురించి చెప్పవచ్చు.
\v 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.
\s5
\v 8 అన్నిట్లో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు.
\q1
\v 9 దీని గురించి 'అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది' అని లేఖనంలో రాసి ఉంది.
\s5
\p
\v 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి తిండినీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు.
\v 11 ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దానిని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియచేసే కారణం దొరుకుతుంది.
\s5
\v 12 మీరు చేసే ఈ సేవ పరిశుద్ధుల అక్కరలు తీర్చడమే కాకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించేలా చేస్తుంది.
\v 13 ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడింది. క్రీస్తు శుభవార్తను ఒప్పుకొని విధేయులై, ఇంత ఉదారంగా వారికీ, అందరికీ పంచిపెట్టడం బట్టి, మీరు కూడా దేవుని మహిమ పరుస్తున్నారు.
\v 14 మీ పట్ల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూసి, వాళ్ళు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.
\v 15 వర్ణించశక్యం గాని ఆయన బహుమానానికి దేవునికి ధన్యవాదాలు.
\s5
\c 10
\s పౌలు అపోస్తలత్వ సమర్థన (దేవుని నుండి)
\p
\v 1 స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా!
\v 2 మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేధించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 3 మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం.
\v 4 మా యుధ్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు, కోటలను ధ్వంసం చేసి, మనుషుల్ని పక్కదోవ పట్టించే వాదాల్ని ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
\s5
\v 5 వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని నాశనం చేసి, ప్రతి ఆలోచనను వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.
\v 6 మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
\s5
\v 7 మీ ముందున్న వాటిని స్పష్టంగా చూడండి. మీలో ఎవరైనా తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తు వాడో మేము కూడా అలానే క్రీస్తు వాళ్ళమని తాను గుర్తుంచుకోవాలి.
\v 8 మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకున్నా సిగ్గుపడను.
\s5
\v 9 నేను రాసే ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టే వాడిలాగా ఉండకూడదు.
\v 10 కొందరు ఇలా అంటారు, "అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి, కానీ శరీరం బలహీనం, మాటలు చప్పగా ఉంటాయి."
\s5
\v 11 అలాంటి వాళ్ళు తెలుసుకోవలసింది ఏంటంటే మేమక్కడ లేనపుడు ఉత్తరాలలో రాసిన మాటల ప్రకారం ఏమి చెప్పామో మేమక్కడ ఉన్నప్పుడూ అలానే చేస్తాము.
\v 12 తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వాళ్ళు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వాళ్ళు తెలివిలేని పని చేస్తున్నట్టు.
\s5
\v 13 మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దులలోనే ఉంటాం.
\v 14 మేము మీ దగ్గరకు వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు శుభవార్త మోసికొంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే.
\s5
\v 15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడం. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా సరిహద్దుల్లోని పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన
\v 16 మీకు అవతల ఉన్న ప్రాంతాలలో కూడా శుభవార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి సరిహద్దులో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం.
\s5
\v 17 అయితే "అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి."
\v 18 ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తన్ను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.
\s5
\c 11
\s దైవికమైన రోషం
\p
\v 1 నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు.
\v 2 మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అనగా క్రీస్తుకు సమర్పించాలని, మిమ్మల్ని ప్రధానం చేశాను గాని,
\s5
\v 3 సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు మీ మనస్సులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
\v 4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక శుభవార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.
\s5
\v 5 ఆ "గొప్ప అపొస్తలుల" కంటె నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.
\v 6 ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాలలో దీనిని మీకు తెలియచేసాం.
\s5
\v 7 మీకు దేవుని శుభవార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకొని తప్పు చేశానా?
\v 8 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను "దోచుకున్నాను."
\v 9 నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
\s5
\v 10 క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాలలో నా అతిశయాన్ని ఎవరూ అడ్డుకోలేదు.
\v 11 ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు.
\s5
\v 12 అయితే ప్రస్తుతం నేను చేసేది తర్వాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏయే విషయాల్లో గర్వంగా చెప్పుకుంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.
\s కపట బోధకుల గురించి హెచ్చరిక
\p
\v 13 అలాంటి వాళ్ళు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు.
\s5
\v 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా కాంతి దూత వేషం వేసుకుంటాడు.
\v 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనుల్నిబట్టే వారి అంతముంటుంది.
\s 16 పౌలు ఆధిక్యతలు
\s5
\p
\v 16 మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్దిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్దిహీనుడిగానే చేర్చుకోండి.
\v 17 గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్దిహీనుడిలా చెబుతున్నాను.
\v 18 చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను.
\s5
\v 19 తెలివిగల మీరు బుద్దిహీనుల్ని సంతోషంతో సహిస్తున్నారు.
\v 20 ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు తెచ్చినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, ఒకడు తనను గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, మీ ముఖం మీద కొట్టినా మీరు సహిస్తున్నారు.
\v 21 వాళ్ళు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే- బుద్దిహీనుడిలా మాట్లాడుతున్నాను- నేనూ అతిశయిస్తాను.
\s5
\p
\v 22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుడినే. వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడనే. వాళ్ళు అబ్రాహాము సంతానమా? నేను కూడా.
\v 23 వాళ్ళు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేని సార్లు దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను.
\s5
\v 24 యూదులచేత అయిదు సార్లు 'ఒకటి తక్కువ నలభై' కొరడా దెబ్బలు తిన్నాను.
\v 25 మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.
\v 26 తరచుగా ప్రయాణాలలో అపాయాలకు గురయ్యాను. నదులలో అపాయాలూ, దోపిడీ దొంగల వలన అపాయాలూ, నా సొంత ప్రజల వలన అపాయాలూ, యూదేతరుల వలన అపాయాలూ, పట్టణాలలో అపాయాలూ, అరణ్యాలలో అపాయాలూ, సముద్రంలో అపాయాలూ, కపట సోదరులవల్ల అపాయాలూ, నాకు ఎదురయ్యాయి.
\s5
\v 27 కష్ట పడ్డాను, వేదన అనుభవించాను, నిద్ర పట్టని అనేక రాత్రులు గడిపాను, ఆకలి దప్పులతో, తింటానికి తిండిలేక, చలిలో బట్టల్లేక ఉన్నాను.
\v 28 ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన ఆత్రుత రోజూ నా మీద భారంగా ఉంది.
\v 29 ఎవడు బలహీనుడు? నేను కాదా? ఒకడు పాపంలో పడేలా ఎవడైనా కారకుడయ్యాడా? నా లోపల మంట పుట్టదా?
\s5
\v 30 అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను.
\v 31 ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు.
\s5
\v 32 దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు.
\v 33 అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.
\s5
\c 12
\p
\v 1 నేను అతిశయించాలి, అయితే దాని వలన ప్రయోజనమేమీ రాదు. ప్రభువు దర్శనాలూ ప్రత్యక్షతలూ మీకు తెలియచేస్తాను.
\v 2 క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
\s5
\v 3 అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
\v 4 దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన సంగతుల్ని విన్నాడు.
\v 5 అలాంటి వ్యక్తి తరఫున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరఫున నేను అతిశయించను.
\s5
\v 6 నేను అతిశయించాలనుకుంటే తెలివి తక్కువ వాడిగా ఉండను. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. గాని ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.
\v 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి ఉన్న సాతాను దూత.
\s5
\v 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను.
\v 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, "నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది." కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల లోనే అతిశయిస్తాను.
\v 10 బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.
\s5
\v 11 నేను బుద్దిహీనుడినయ్యాను! మీరే నన్ను బలవంతం చేశారు. వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను వట్టివాడనయినా ఆ "గొప్ప అపోస్తలుల" కంటే ఏ మాత్రం తక్కువ వాడను కాను.
\v 12 అసలైన అపొస్తలుని గురుతులు ఎంతో సహనంతో మీ మధ్య చూపించాను. సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ చేశాను.
\v 13 నేను మీకు భారంగా లేను అనే విషయంలో తప్ప, ఇతర సంఘాలకంటె మీరు ఏ విషయంలో తక్కువ వారయ్యారు? ఈ నా తప్పు క్షమించండి.
\s5
\v 14 ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు డబ్బులు దాచరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం డబ్బులు దాచాలి.
\v 15 కాబట్టి మీ ఆత్మల కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం ఖర్చై పోతాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తుంటే అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా?
\s5
\v 16 అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండలేదు, గాని నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకున్నాను!
\v 17 నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా లాభం సంపాదించానా?
\v 18 మీ దగ్గరకు వెళ్లమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? మేము ఒకేలా ప్రవర్తించలేదా?
\s 19 హెచ్చరిక
\s5
\p
\v 19 మేమింత వరకు మా పక్షంగా మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తుని బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం ఇవన్నీ చెబుతున్నాం.
\s5
\v 20 ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. వాదాలూ, అసూయ, క్రోధాలూ, స్వార్ధ పూరిత అత్యాశ, వ్యర్ధమైన మాటలు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో.
\v 21 నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, పోకిరి చేష్టల విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.
\s5
\c 13
\p
\v 1 మీ దగ్గరకు నేను రావడం ఇది మూడోసారి. "ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ అవ్వాలి."
\v 2 నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడు, పాపం చేసిన వారికీ మిగతా వారందరికీ ముందే చెప్పినట్టు, మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ వస్తే, నేను వాళ్ళని వదిలి పెట్టను.
\s5
\v 3 క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని రుజువు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. ఆయన మీ పట్ల బలహీనుడు కాడు, మీలో శక్తిమంతుడుగా ఉన్నాడు.
\v 4 బలహీనతను బట్టి ఆయనను సిలువ వేశారు గాని, దేవుని శక్తిని బట్టి అయన సజీవుడుగా ఉన్నాడు. మేము కూడా ఆయనలో బలహీనులమైనా, మేము మీతో మాట్లాడుతూ ఉంటే, దేవుని శక్తినిబట్టి, ఆయనతో జీవిస్తాం.
\s5
\v 5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు క్రీస్తు మీలో ఉన్నాడని గ్రహించరా? పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీలో ఉన్నట్టు.
\v 6 మేము పరీక్షలో ఓడిపోయే వారం కామని మీరు తెలిసికోగలరని నా నమ్మకం.
\s5
\v 7 మీరు ఏ చెడ్డ పనీ చేయకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. మేము యోగ్యులంగా కనబడాలని కాదు గాని, మేము అయోగ్యులంగా కనబడినా మీరు మంచినే చేయాలని మా ఉద్దేశం.
\v 8 మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చేయ్యలేం.
\s5
\v 9 మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉంటే సంతోషిస్తాం. మీరు సంపూర్ణులు కావాలని కూడా ప్రార్థిస్తున్నాం.
\v 10 కాబట్టి నేను మీతో ఉన్నప్పుడు మీతో కఠినంగా ఉండకుండా, పడగొట్టడానికి కాక, మిమ్మల్ని కట్టడానికే ప్రభువు నాకిచ్చిన అధికారాన్ని వాడుతూ దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను.
\s ముగింపు
\s5
\p
\v 11 చివరికి, సోదరీ సోదరులారా, ఆనందించండి! పునరుద్ధరణ కోసం పాటు పడండి. ప్రోత్సాహం పొందండి. ఏక మనస్సుతో ఉండండి. శాంతితో జీవించండి. ప్రేమ, సమాధానాల దేవుడు మీతో ఉంటాడు.
\v 12 పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోండి.
\s5
\v 13 పరిశుద్ధులందరూ మీకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
\v 14 ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడుగా ఉంటుంది గాక.

331
49-GAL.usfm Normal file
View File

@ -0,0 +1,331 @@
\id GAL Galatians
\s5
\c 1
\s పలకరింపులు
\p
\v 1 మనుష్యుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపోస్తులుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,
\v 2 నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతం లో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.
\s5
\v 3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుంచి మీకు కృపా, శాంతీ కలుగు గాక.
\v 4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు.
\v 5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగుతుంది గాక. ఆమేన్‌.
\s లేఖ ముఖ్యాంశం, సందర్భం
\s5
\p
\v 6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన శుభ వార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
\v 7 అసలు వేరే శుభ వార్త అనేది లేదు, క్రీస్తు శుభ వార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
\s5
\v 8 మేము మీకు ప్రకటించిన శుభ వార్త గాక వేరొక శుభ వార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక!.
\v 9 మేము ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన శుభ వార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వానిని దేవుడు శపిస్తాడు గాక!
\v 10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
\s 10 పౌలు ప్రకటించిన సువార్త అతనికి ప్రత్యేకంగా వెల్లడి అయినది, ఇతర అపోస్తలుల నుంచి పొందినది కాదు
\s5
\p
\v 11 సోదరులారా, నేను ప్రకటించిన శుభ వార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.
\v 12 మనిషి నుంచి నేను దానిని పొందలేదు, నాకెవరూ దానిని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
\s5
\v 13 నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.
\v 14 అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.
\s5
\v 15 అయినా తల్లిగర్భం లోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుని ప్రకటించాలని
\v 16 ఆయన్ని నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.
\v 17 నాకంటె ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్లలేదు, అరేబియా దేశానికి వెళ్లి ఆ తర్వాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
\s5
\v 18 మూడు సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వచ్చి అతనితో పదిహేను రోజులున్నాను.
\v 19 అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
\v 20 నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను అబద్ధమాడడం లేదు.
\s5
\v 21 ఆ తరువాత సిరియ, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.
\v 22 క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ
\v 23 "మునుపు మనల్ని హింసించినవాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు" అనే విషయం మాత్రమే విని,
\v 24 వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచారు.
\s5
\c 2
\s నిర్దోషిగా అయ్యేది విశ్వాసం మూలంగానే (గలతి 2: 15 3: 24). యూదులకు సైతం ఇదే మార్గం
\p
\v 1 పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్లాను.
\v 2 మేము వెళ్లాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్లాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న శుభ వార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ప్రత్యేకంగా వివరించాను.
\s5
\v 3 అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనా సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు.
\v 4 క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనల్ని ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరుల్ని ప్రవేశపెట్టారు.
\v 5 శుభ వార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.
\s5
\p
\v 6 ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నాకెలాంటి తోడ్పాటూ ఇవ్వలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు.
\v 7 అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు శుభ వార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందనివారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు.
\v 8 అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగచేసాడు.
\s5
\v 9 నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు.
\v 10 మేము యెరూషలేములో ఉన్న తోటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాల్ని ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వాళ్ళు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తితో ఉన్నాను.
\s5
\p
\v 11 అయితే కేఫా, అంతియొకయ వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను.
\v 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. గాని వాళ్ళు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు.
\s5
\v 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపటవేషధారణ వల్ల మోసపోయాడు.
\v 14 వారు శుభ వార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, "నీవు యూదుడవై ఉండి కూడా యూదుల లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?" అన్నాను.
\s5
\p
\v 15 మనం పుట్టుకతో యూదులం గానీ "పాపులైన యూదేతరులం" కాదు. మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు నందలి విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము.
\v 16 ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
\s5
\v 17 అయితే, దేవుడు మనల్ని క్రీస్తులో నీతి మంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు.
\v 18 నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా.
\v 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.
\s 20 లోపల నివసిస్తున్న క్రీస్తును బయటకు కనుపరచేదే క్రైస్తవ జీవితం
\s5
\p
\v 20 నేను క్రీస్తుతో కూడ సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తన్నుతాను సమర్పించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వలననే.
\v 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్లే గదా.
\s5
\c 3
\s ఆత్మ వరం విశ్వాసం వల్లనే, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు
\p
\v 1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళముందు చూపించాము గదా!
\v 2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దానిని విశ్వసించడం వలన పొందారా?
\v 3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?
\s5
\p
\v 4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా?
\v 5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
\s అబ్రాహాము నిబంధన విశ్వాస నిబంధన
\s5
\p
\v 6 అబ్రాహాము "దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది."
\v 7 కాబట్టి, నమ్మకముంచే వాళ్ళే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి.
\v 8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరుల్ని నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. "ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి." అని అబ్రాహాముకు శుభ వార్త ముందుగానే ప్రకటించడం జరిగింది.
\v 9 కాబట్టి విశ్వాస సంబంధుల్నే విశ్వాసముంచిన అబ్రాహాముతో కూడా దేవుడు దీవిస్తాడు.
\s ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్న మనిషి ధర్మశాస్త్ర శాపం కింద ఉన్నవాడు
\s5
\p
\v 10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వారందరినీ దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే "ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు" అని రాసి ఉంది.
\v 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవర్నీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, "నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు."
\v 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గానీ "దాని విధులను ఆచరించే వాడు వాటి వలనే జీవిస్తాడు."
\s ధర్మశాస్త్ర సంబంధిత శాపాన్ని క్రీస్తు భరించి విశ్వాస సంబంధమైన దీవెనలను మనకు ఇచ్చాడు
\s5
\p
\v 13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనల్ని ధర్మశాస్త్రం శిక్ష నుంచి విమోచించాడు.
\v 14 అందుకే "మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు" అని రాసి ఉంది .
\s5
\v 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.
\v 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు "నీ సంతానాలకు" అని అనలేదు గానీ ఒకని గురించి అన్నట్టుగా, "నీ సంతానానికి" అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
\s అబ్రాహాముకు చేసిన విశ్వాస నిబంధనకు ధర్మశాస్త్రం ఏమీ కలపడం లేదు
\s5
\p
\v 17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్ధం చేయదు.
\v 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వలనే వారసత్వాన్ని ఇచ్చాడు.
\s ధర్మశాస్త్రం అసలు ఉద్దేశం శిక్ష విధించడమే
\s5
\p
\v 19 ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దానిని కలిపాడు. ఎవరికి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకు అది అమల్లో ఉంది. దానిని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.
\v 20 మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.
\s5
\v 21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వలననే నీతి కలిగి ఉండేది.
\v 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.
\s5
\v 23 క్రీస్తులో మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకు, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము.
\v 24 కాబట్టి దేవుడు మనల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు.
\s 25 విశ్వాసి జీవితంపై రాజ్యమేలుతున్నది కృపే, చట్టం కాదు.
\p
\v 25 అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము.
\v 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
\s5
\v 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు.
\v 28 ఇందులో యూదుడు, గ్రీకు, దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు, స్త్రీ అనే తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
\v 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.
\s5
\c 4
\p
\v 1 నేను చెప్పేదేమిటంటే వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు.
\v 2 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకు అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు.
\s5
\v 3 అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.
\s విశ్వాసి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాడు
\p
\v 4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కొడుకుని పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి,
\v 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యాడు.
\s విశ్వాసి కుమారత్వాన్ని వాస్తవం చేసేది ఆత్మ
\s5
\p
\v 6 మీరు కొడుకులు కాబట్టి, "నాన్నా, తండ్రీ," అని పిలిచే తన కుమారఆత్మను దేవుడు మన హృదయాలలోకి పంపాడు.
\v 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.
\s ధర్మశాస్త్ర క్రియల వైపుకు మళ్ళడం అంటే తిరిగి ప్రాథమిక మతం వైపు తిరగడమే
\s5
\p
\v 8 ఆ కాలంలో మీరు దేవుని ఎరుగనివారై, వాస్తవానికి దేవుళ్లు కానివారికి బానిసలుగా ఉన్నారు గాని
\v 9 ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి, బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా?
\s5
\v 10 మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తూ ఉన్నారు.
\v 11 మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.
\s5
\v 12 సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వాళ్ళు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\v 13 మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను శుభ వార్త మీకు ప్రకటించానని మీకు తెలుసు.
\v 14 అప్పుడు నా దేహంలో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
\s చట్టపరమైన నీతికి మళ్లడం ద్వారా గలతీయులు తమ దీవెనలను పోగొట్టుకున్నారు
\s5
\p
\v 15 మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను.
\v 16 నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
\s5
\p
\v 17 వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు.
\v 18 నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండటం మంచిది.
\s ధర్మశాస్త్రం, కృప, ఈ రెండూ కలిసి ఉండడం అసాధ్యం
\s5
\p
\v 19 నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.
\v 20 మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
\s5
\v 21 ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారలారా, మీరు ధర్మశాస్త్రం వినడం లేదా? నాతో చెప్పండి.
\v 22 దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉందిగదా?
\v 23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమూలంగా పుట్టాడు.
\s5
\v 24 ఈ విషయాల్ని అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలుగా ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లల్ని కంటుంది. ఇది హాగరు.
\v 25 ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది.
\s5
\v 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. అది మనకు తల్లి.
\q1
\v 27 "గొడ్రాలా, పిల్లల్ని కనని దానా, ఆనందించు.
\q1 ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.
\q1 ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటె భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు" అని రాసి ఉంది .
\s5
\p
\v 28 సోదరులారా, మనం కూడా ఇస్సాకు లాగా వాగ్దాన ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నాం.
\v 29 అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింసపెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది.
\s5
\v 30 లేఖనం ఏమి చెబుతున్నది? "దాసిని, ఆమె కొడుకుని వెళ్లగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు."
\v 31 అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.
\s5
\c 5
\s ఉపమానం వివరణ
\p
\v 1 స్వేచ్ఛ గా ఉండడం కోసం క్రీస్తు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడి మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
\v 2 మీరు సున్నతి పొంది ఉంటే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
\s5
\v 3 ధర్మశాస్త్రమంతటినీ పాటించ బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషికీ నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
\v 4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునేవారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
\s5
\v 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
\v 6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో , పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం.
\v 7 మీరు బాగా పరుగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
\v 8 ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాని నుంచి కలగలేదు.
\s5
\v 9 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియ చేస్తుంది.
\v 10 మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
\s5
\v 11 సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి నాశనం చేస్తుంది గదా?
\v 12 మిమ్మల్ని తప్పు దారి పట్టించే వాళ్ళు తమ్మును తాము మీ నుంచి నరికివేసుకొనడం మంచిది.
\s5
\v 13 సోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
\v 14 ధర్మశాస్త్రమంతా "నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు" అనే ఒక్క ఆజ్ఞ లో ఇమిడి ఉంది.
\v 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకొని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
\s పవిత్రీకరణ ఆత్మ ద్వారానే, ధర్మశాస్త్రం ద్వారా కాదు
\s5
\p
\v 16 నేను చెప్పేది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
\v 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పనిచేస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
\v 18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
\s5
\v 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
\v 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
\v 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
\s5
\p
\v 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
\v 23 అలాంటి వాటికి ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదు.
\v 24 క్రీస్తు యేసుకు చెందిన వాళ్ళు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
\s క్రీస్తులో నూతన జీవం బహిర్గతం కావడం
\s5
\p
\v 25 మనం దేవుని ఆత్మతో బతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి కలిసి నడుద్దాం.
\v 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయపడకుండా ఉందాం.
\s5
\c 6
\s సహోదరత్వం తో కూడిన నూతన జీవితం
\p
\v 1 నా తోటి సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనస్సుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. అలాటి వ్యక్తిని మీరు సరిదిద్దుతున్నపుడు మీరు కూడా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
\v 2 ఒకరి సమస్యల్ని ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
\s5
\v 3 వ్యర్ధుడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు.
\v 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది.
\v 5 ప్రతివాడు తన బరువు తానే మోసుకోవాలి గదా?
\s5
\v 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.
\v 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనుషుడు ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
\v 8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.
\s5
\v 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.
\v 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
\s5
\p
\v 11 నా సొంత దస్తూరి తో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి.
\v 12 శరీర విషయంలో చక్కగా కన్పించాలని కోరే వాళ్ళు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు.
\v 13 అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వాళ్ళు మీ శరీర విషయంలో అతిశయించడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
\s5
\v 14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ అతిశయించడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నేను లోకానికీ సిలువ మరణం చెందాను.
\v 15 కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
\v 16 ఈ పద్ధతి ప్రకారం నడుచుకొనే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగుతాయి గాక.
\s5
\v 17 నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు.
\v 18 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు+గాక. ఆమేన్‌.

328
50-EPH.usfm Normal file
View File

@ -0,0 +1,328 @@
\id EPH Ephesians
\s5
\c 1
\s అపోస్తలుని అభివందనాలు
\p
\v 1 ఎఫెసులో దేవుడు ప్రత్యేకించుకొనగా క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
\v 2 మన తండ్రి దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతిసమాధానాలు కలుగు గాక .
\s కృపలో విశ్వాసి స్థితి
\s5
\p
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాలలో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనల్ని దీవించాడు.
\v 4 క్రీస్తులో విశ్వాసముంచిన మనల్ని సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.
\s5
\v 5 యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా ప్రేమతో స్వీకరించడానికి దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
\v 6 తన దివ్య కృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దానిని తన ప్రియ కుమారుని ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
\s5
\v 7 దేవుని కృపా సమృద్ధి వలననే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
\v 8 ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
\s5
\v 9 ఆయన తన ప్రణాళికలో ఉన్న రహస్య సత్యాన్ని క్రీస్తులో విశదపరచి, తన సంకల్పానుసారంగా మనకు వెల్లడించాడు.
\v 10 కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు.
\s5
\v 11 క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగచేయాలని,
\v 12 దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకొని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.
\s5
\v 13 మీరు కూడ రక్షణ శుభవార్త అయిన సత్య వాక్యాన్ని విని, క్రీస్తులో విశ్వాసముంచారు. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ముద్ర మీమీద పడింది.
\v 14 దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగేంత వరకు మన వారసత్వానికి, ఆత్మ హామీ గా ఉన్నాడు.
\s జ్ఞానం, బలం కలగాలని ప్రార్థన
\s5
\p
\v 15 ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుండి
\v 16 మీ విషయంలో మానకుండా నా ప్రార్థనలలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
\s5
\v 17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
\v 18 మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన ఆశాభావం ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయనకున్న మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.
\s5
\v 19 తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
\s దేవుడు క్రీస్తును ఘనపరిచాడు
\p
\v 20 దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి లేపి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
\v 21 సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలో గానీ రాబోయే యుగంలో గానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.
\s5
\v 22 దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘం లోని అన్నిటి మీదా ఆయన్ని తల గా నియమించాడు.
\v 23 ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్నీ పూర్తిగా నింపుతున్న ఆయన సంపూర్ణత.
\s5
\c 2
\s యూదేతరులు రక్షణ పొందే విధానం
\p
\v 1 మీ అతిక్రమాలలో పాపాలలో మీరు మరణించారు.
\v 2 పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయులలో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు.
\v 3 పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.
\s5
\v 4 అయితే దేవుడు కరుణాసంపన్నుడు కాబట్టి,
\v 5 మనం మన అతిక్రమాలలో చచ్చి ఉన్నప్పటికీ, మన పట్ల తన మహా ప్రేమను చూపి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేతనే మీకు రక్షణ కలిగింది.
\v 6 దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు.
\v 7 రాబోయే యుగాలలో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా అపరిమితమైన తన కృపా సమృద్ధిని మనకు కనుపరచడానికి ఆయన ఇలా చేశాడు.
\s5
\v 8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుడే బహుమానంగా ఇచ్చాడు.
\v 9 అది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవరూ గొప్పలు చెప్పుకోడానికి వీలు లేదు.
\v 10 మనం దేవుని చేతి కళాఖండం, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు మనం చేయడం కోసం మనల్ని క్రీస్తు యేసులో సృష్టించాడు.
\s స్వతహాగా యూదేతరుల స్థితి
\s5
\p
\v 11 కాబట్టి పూర్వం మీరు శారీరకంగా యూదేతరులు. 'సున్నతి పొందిన యూదులు' మిమ్మల్ని 'సున్నతి లేనివారు' అని పిలిచేవారు. ఈ సున్నతిని శరీరంలో చేతితో, మనుషులు చేశారు.
\v 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.
\s5
\v 13 అయితే పూర్వం దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు రక్తం వలన దేవునికి దగ్గరయ్యారు./
\s ఇప్పుడు క్రీస్తులో యూదులూ యూదేతరులూ ఏక శరీరం
\p
\v 14 ఆయనే మన శాంతి. ఆయన యూదుల్నీ యూదేతరుల్నీ ఏకం చేశాడు. మన ఉభయులనూ విడదీస్తున్న ద్వేషమనే అడ్డుగోడను తన శరీరం ద్వారా కూలగొట్టాడు.
\v 15 అంటే, ఆ ఇద్దరినుండి నుండి ఒక కొత్త ప్రజను సృష్టించడానికి, విధులూ ఆజ్ఞలూ గల ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు.
\v 16 వారి మధ్య ఉన్న ద్వేషాన్ని సిలువ ద్వారా నిర్మూలించి, వీరిద్దరినీ దేవునితో ఏకం చేసి శాంతి నెలకొల్పాలని ఇలా చేశాడు
\s5
\v 17 యేసు వచ్చి దూరంగా ఉన్న మీకూ దగ్గరగా ఉన్నవారికీ సమాధాన సువార్తను ప్రకటించాడు.
\v 18 యేసు ద్వారానే మీరూ మేమూ ఒకే ఆత్మ ద్వారా తండ్రిని చేరగలం.
\s5
\v 19 కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ విదేశస్థులు కారు, పరిశుద్ధులతో సాటి పౌరులు, దేవుని కుటుంబ సభ్యులు.
\v 20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టడంగా మీరు ఉన్నారు.
\v 21 అయన శక్తి తోనే తన కుటుంబమనే కట్టడం చక్కగా అమరి, ప్రభువు కోసం పరిశుద్ధ దేవాలయంగా రూపొందుతూ ఉంది.
\v 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాసస్థలంగా ఉండడానికి వృద్ది చెందుతూ ఉన్నారు.
\s5
\c 3
\s సంఘం ఒక మర్మం
\p
\v 1 ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను.
\v 2 మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు విన్నారు.
\s5
\v 3 అదేమంటే క్రీస్తు మర్మం దర్శనం ద్వారా నాకు వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతిని గూర్చి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
\v 4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన వెల్లడింపును గ్రహించగలరు.
\v 5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు.
\s5
\v 6 ఈ మర్మం ఏమిటంటే - శుభవార్త కారణంగా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలివారు అనేదే.
\v 7 నేను ఆ శుభవార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.
\s5
\v 8 పరిశుద్ధులందరిలో అతి చిన్నవాణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ,
\v 9 సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు.
\s5
\v 10 తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా పరలోకంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం.
\v 11 అది మన ప్రభువు క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం.
\s5
\v 12 అయనపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే స్వేచ్ఛ కలిగింది.
\s అంతరంగ పరిపూర్ణత, జ్ఞానాలకై ప్రార్థన
\p
\v 13 కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దు. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
\s5
\v 14 ఈ కారణం వలన పరలోకంలో, భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్లూని
\v 15 మీరు అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా బలం పొందాలనీ
\v 16 క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించి తన మహిమ భాగ్యాన్ని మీకు అనుగ్రహించాలనీ
\s5
\v 17 మీరు దేవుని సంపూర్ణత లోకి ఎదిగేలా ప్రేమలో స్థిరంగా పాదుకొని
\v 18 పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించాలనీ
\v 19 జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలిసికోడానికి తగిన శక్తి పొందాలనీ ప్రార్థిస్తున్నాను.
\s5
\v 20 మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేసే శక్తి గల దేవునికి,
\v 21 క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరాలకూ ఎప్పుడూ మహిమ కలుగుతుంది గాక. ఆమేన్‌.
\s5
\c 4
\s విశ్వాసుల ప్రవర్తన, సేవ
\p
\v 1 కాబట్టి, మీరు శాంతిసమాధానాలు అనే బంధం ద్వారా పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తూ, ప్రేమ కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు సహనం వహించండి.
\v 2 ప్రభువు పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాధుగుణంతో జీవించమని
\v 3 ప్రభువును బట్టి ఖైదీగా ఉన్న నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 4 శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. మీరు ఒకే నిరీక్షణ గురించిన పిలుపు పొందారు.
\v 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే.
\v 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరిలో ఉన్నాడు.
\s తన శరీరం కోసం క్రీస్తు ఇచ్చిన పరిచర్య వరాలు
\s5
\p
\v 7 అయితే క్రీస్తు అనుగ్రహించే కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి.
\v 8 దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు, బందీలను చెరలోకి కొనిపోయాడనీ, తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది.
\s5
\v 9 'ఆరోహణమయ్యాడు' అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్ధం ఉంది కదా.
\v 10 అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
\s5
\v 11 విశ్వాసులు పరిపూర్ణులు కావాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా,
\s పరిచర్య వరాల ఉద్దేశ్యం
\p
\v 12 కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.
\v 13 మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞానంలో సంపూర్ణత సాధించాలనీ, అంటే క్రీస్తు కలిగి ఉన్న అత్యున్నతమైన సంపూర్ణతకు సమానంగా అభివృద్ధి చెందాలనీ అయన ఉద్దేశం.
\s5
\v 14 కాబట్టి మనం ఇంకా పసిపిల్లలంగా ఉండకూడదు. మనుషులు కపటంతో, కుయుక్తి చేత కల్పించే మాయోపాయాలకు మోసపోకూడదు. అలల తాకిడికి అటూ ఇటూ తేలికగా కొట్టుకొని పోయే వారంగా, వివిధ రకాల సిద్ధాంతాల గాలికి ఎగిరిపోయే వారంగా ఉండకూడదు.
\v 15 ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.
\v 16 ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పనిచేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
\s క్రీస్తులో నూతన జీవిగా విశ్వాసి ప్రవర్తన
\s5
\p
\v 17 కాబట్టి మీరిక నుండి అవిశ్వాసుల్లాగా జీవించ వద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\v 18 ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని అజ్ఞానం వలనా తమ మనస్సులోని అజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు.
\v 19 వారు సిగ్గు లేకుండా నానా రకాల అపవిత్ర కార్యాలను ఆత్రుతగా చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
\s5
\p
\v 20 అయితే మీరు క్రీస్తును నేర్చు కున్నప్పుడు ఆవిధంగా జీవించ కూడదని నేర్చుకున్నారు.
\v 21 యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశం పొందారు.
\v 22 కాబట్టి మీ గత జీవిత విధానానికి కారణమై, మోసకరమైన కోరికల చేత చెడిపోయే మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి.
\s5
\v 23 మీ మనసును కొత్తది చేసుకోవాలి.
\v 24 నీతి, యథార్థమైన భక్తి కలిగి దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి.
\s5
\v 25 మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ పొరుగువారితో సత్యమే పలకాలి.
\v 26 కోపం చూపవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు.
\v 27 సాతానుకు అవకాశం ఇవ్వకండి.
\s5
\v 28 దొంగతనం చేసేవాడు దానిని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి.
\v 29 మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారి అవసరం కొద్దీ వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
\s ఆత్మను కలిగి ఉన్న వాడుగా విశ్వాసి ప్రవర్తన
\p
\v 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకు మీపై ఉంటుంది.
\s5
\v 31 ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, అపనిందలు వంటి దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.
\v 32 హృదయంలో కరుణ కలిగి ఒకనిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.
\s5
\c 5
\s దేవుని ప్రియ సంతానంగా విశ్వాసి ప్రవర్తన
\p
\v 1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
\v 2 క్రీస్తు మనలను ప్రేమించి, మనం దేవునికి సువాసనగా ఉండేందుకు మన కోసం తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
\s5
\v 3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
\v 4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలి గాని బూతులు, అల్లరి, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలకకూడదు. ఇవి మీకు తగినవి కావు.
\s5
\v 5 మీకు తెలుసు. వ్యభిచారులూ, అపవిత్రులూ, విగ్రహారాధికులూ, పిసినిగొట్టులూ, క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు.
\v 6 పనికిమాలిన మాటలు పలికేవారి చేతిలో మోసపోకండి.
\v 7 అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి వారికి దూరంగా ఉండండి.
\s5
\v 8 గత కాలంలో మీరు చీకటిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు.
\v 9 ఈ వెలుగు మంచితనంలో, నీతిలో, సత్యంలో ప్రతిఫలిస్తుంది.
\v 10 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో దానినే చేస్తూ, వెలుగు సంబంధుల్లాగా జీవించండి.
\v 11 పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
\v 12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడటం కూడా చాలా అవమానకరం.
\s5
\v 13 ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
\v 14 అందుకే నిద్రిస్తున్న నీవు మేలుకో మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అని రాసి ఉంది.
\s5
\p
\v 15 బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
\v 16 సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
\v 17 అందుకే మీరు వివేకంగా ఉంటూ ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
\s5
\v 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది మీకు నష్టదాయకం. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
\v 19 కీర్తనలతో, సంగీతాలతో, ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహిస్తూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
\v 20 ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
\s ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల వైవాహిక జీవనం
\p
\v 21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరి కొకరు లోబడి ఉండండి.
\s5
\v 22 స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
\v 23 క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
\v 24 సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
\s5
\v 25 పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
\v 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్ర పరచడానికి,
\v 27 దానిని కళంకం గాని, ముడుతలు గాని అలాటిది మరేదీ లేకుండా, పవిత్రంగా, నిర్దోషంగా, మహిమ గలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
\s5
\v 28 అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించే వాడు తనను ప్రేమించుకొన్నట్టే.
\v 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దానిని పోషించి సంరక్షించుకుంటాడు.
\v 30 మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
\s5
\p
\v 31 "ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు"
\v 32 ఈ మాటల అర్థం గ్రహించడం కష్టసాధ్యం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
\v 33 చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
\s5
\c 6
\s ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల గృహ జీవనం
\p
\v 1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది.
\v 2 "నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది."
\v 3 ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
\s5
\v 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
\s5
\v 5 దాసులారా, భయంతో కూడిన గౌరవంతో, వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలోని మీ యజమానులకు హృదయ పూర్వకంగా లోబడండి.
\v 6 మనుషుల్ని సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయ పూర్వకంగా జరిగిస్తూ,
\v 7 ప్రభువుకు చేసినట్టే యిష్టపూర్వకంగా సేవచేయండి.
\v 8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
\s5
\v 9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేనివాడనీ గ్రహించి, వారిని బెదరించడం మానండి.
\s ఆత్మతో నిండిన విశ్వాసుల పోరాటం
\s5
\p
\v 10 చివరిగా, ప్రభువు మహా శక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
\v 11 మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
\s శత్రువులు
\s5
\p
\v 12 ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.
\s కవచం
\p
\v 13 అందుచేత మీరు ఈ చెడ్డ కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
\s5
\v 14 మీ నడుముకి సత్యం అనే బెల్టు, నీతి అనే కవచం,
\v 15 పాదాలకు శాంతి శుభవార్త కోసం సిద్ధపడిన మనస్సు అనే చెప్పులు ధరించండి.
\v 16 వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.
\s5
\v 17 ఇంకా పాపవిమోచన అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
\v 18 ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.
\s5
\v 19 అలాగే నేను ఏ కారణం చేత సంకెళ్లలో ఉన్నానో, ఆ శుభవార్తను ప్రకటించడానికి నోరు తెరచినప్పుడు
\v 20 ధైర్యంగా మాటలాడగలిగేలా నాకోసం ప్రార్ధించండి.
\s5
\v 21 నా ప్రియ సోదరుడు తుకికు నా క్షేమ సమాచారమంతా మీకు తెలియజేస్తాడు. అతడు ప్రభువులో నమ్మకమైన సేవకుడు.
\v 22 మా సంగతులు మీరు తెలుసుకోడానికీ, మీ హృదయాలను ఓదార్చడానికీ అతణ్ణి మీ దగ్గరికి పంపాను.
\s5
\v 23 తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ విశ్వాసపూర్ణమైన శాంతీ, ప్రేమా సోదరులకు కలుగు గాక.
\v 24 మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉంటుంది గాక.

233
51-PHP.usfm Normal file
View File

@ -0,0 +1,233 @@
\id PHP Philippians
\s5
\c 1
\s విశ్వాసికి జీవం క్రీస్తే
\p
\v 1 ఫిలిప్పీ పట్టణం లో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు సేవకులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు.
\v 2 మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగుతాయి గాక.
\s5
\p
\v 3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను.
\v 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే.
\v 5 శుభవార్త విషయంలో మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు.
\v 6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టిన వాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకు ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.
\s5
\p
\v 7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను జైలులో ఉన్నప్పుడూ, నేను శుభవార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు, మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.
\v 8 క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుండి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.
\s హింసలపై విజయం సాధించిన ఆనందం
\s5
\p
\v 9 మీ ప్రేమ తెలివితో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
\v 10 క్రీస్తు వచ్చే రోజు వరకూ నిష్కపటంగా నిర్దోషంగా ఉండడానికి మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి పొందాలని కోరుతున్నాను.
\v 11 అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలములతో నిండి ఉండాలి.
\s5
\p
\v 12 సోదరులారా, నాకు సంభవించినవి శుభవార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను.
\v 13 ఎలాగంటే, నా బంధకాలు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారందరికీ తక్కినవారందరికీ తెలిసిపోయింది.
\v 14 అంతేకాక, ప్రభువు లోని సోదరులలో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యం ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.
\s5
\v 15 కొంతమంది అసూయ, కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
\v 16 ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను శుభవార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు.
\v 17 అయితే మిగతావారు, నా బంధకాలకు తోడు మరింత బాధ కలిగించాలని, శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
\s5
\v 18 అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.
\v 19 మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు.
\s5
\v 20 నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కాకుండా ఉంటానని నాకు సంపూర్ణ ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవం వలన గానీ, చావు వలన గానీ, క్రీస్తుకు నా శరీరంతో ఘనత తెస్తాను.
\v 21 నామట్టుకైతే బతకడం క్రీస్తు కోసమే, మరి చావడం లాభమే.
\s5
\v 22 అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియదు.
\v 23 ఈ రెంటి మధ్య ఇరుక్కు పోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.
\v 24 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.
\s5
\v 25 ఈ నమ్మకంతో, మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉండిపోతానని నాకు తెలుసు.
\v 26 తద్వారా నేను మీ దగ్గరకు మళ్ళీ వస్తే నా గురించి మీరు క్రీస్తు యేసులో అతిశయించాలి.
\v 27 నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా శుభవార్త విశ్వాసం కోసం పోరాడుతూ, ఏక మనస్సుతో నిలిచియున్నారని నేను మిమ్మును గురించి వినేలా, మీరు క్రీస్తు శుభవార్త కు తగినట్టుగా ప్రవర్తించండి.
\s5
\v 28 మిమ్మల్ని బెదిరించేవారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు విడుదల కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవునివలన కలిగే విడుదల.
\v 29 నాలో ఈ పోరాటం ఉండడం మీరు గతంలో చూశారు. ఇప్పుడు కూడా అది నాలో ఉందని విన్నారు.
\v 30 ఎందుకంటే క్రీస్తును నమ్మడమే కాకుండా ఆయన పక్షంగా కష్టాలు భరించడం కూడా దేవుడు మీకు ప్రసాదించాడు.
\s5
\c 2
\s విశ్వాసి కి ఆదర్శం క్రీస్తే (1) ఐక్యత, సాత్వికం కలిగి ఉండాలని హెచ్చరిక
\p
\v 1 క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్లయితే
\v 2 మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో ఏకత్వం, ఒకే ఉద్దేశం కలిగి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.
\s5
\v 3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరుల్ని మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి.
\v 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాల్ని కూడా పట్టించుకోవాలి.
\s5
\v 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి మనసునే మీరూ కలిగి ఉండండి.
\s క్రీస్తు ఏడు విధాలుగా విధేయత కనుపరచడం
\q1
\v 6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.
\q2 దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్టలేనిదిగా ఎంచుకోలేదు.
\q1
\v 7 అయితే, దానికి ప్రతిగా తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు.
\q2 సేవకుని రూపం తీసుకున్నాడు.
\q2 మానవుల పోలికలో కనిపించాడు.
\q2 ఆకారంలో ఆయన, మనిషిగా కనిపించాడు.
\q1
\v 8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకొని, లోబడ్డాడు.
\s యేసుకు ఘనత
\q1
\s5
\v 9 అందుచేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు.
\q1
\v 10 పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు పేరున వంగాలి.
\q1
\v 11 ప్రతి నాలుక, తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి.
\s అంతరంగంలోని రక్షణకు బాహ్య గురుతులు
\s5
\p
\v 12 నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మీతో లేనప్పుడు మరి ఎక్కువగా, భయ భక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.
\v 13 ఎందుకంటే దేవుడు తన సంతృప్తి కోసం, మీరు ఇష్టపడటానికీ, దానిని నెరవేర్చుకోడానికీ, ఆయనే మీలో పనిచేస్తూ ఉన్నాడు.
\s5
\v 14 మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి.
\v 15 దానివల్ల మీరు, దుర్మార్గమైన, నీతిబాహ్యమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు.
\v 16 జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్త లేదనీ నాపని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.
\s 17 అపోస్తలుని ఆదర్శం
\s5
\p
\v 17 మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడుతూ ఉన్నా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను.
\v 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోపాటు ఆనందించండి.
\s5
\v 19 మీరెలా ఉన్నారో తెలిసికొని నాకు ప్రోత్సాహం కలిగేలా, ప్రభు యేసు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరకు పంపాలనుకుంటున్నాను.
\v 20 తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు.
\v 21 మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు.
\s5
\v 22 తిమోతి తన్నుతాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడ శుభవార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు.
\v 23 అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను.
\v 24 ప్రభువు చిత్తమైతే, నేనే త్వరలో రావడం ఖాయం.
\s5
\p
\v 25 నా సోదరుడు, జతపనివాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవచేసేవాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరకు పంపడం అవసరమనుకున్నాను.
\v 26 అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా ఆత్రుత తో ఉన్నాడు.
\v 27 అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు.
\s5
\v 28 కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను.
\v 29 అతన్ని పూర్ణానందంతో ప్రభువు పేరట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి.
\v 30 ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపు చావును ఎదుర్కొన్నాడు. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాల్ని మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం కూడా లెక్కచేయలేదు.
\s5
\c 3
\s విశ్వాసి నమ్మకానికీ, అభిలాషలకీ, ఎదురు చూపులకీ నమూనా (ఫిలిప్పి 3: 1- 21) (1) యూదు మతంలోకి మార్చాలని చూసే వారి విషయం హెచ్చరిక
\p
\v 1 చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం.
\v 2 కుక్కల విషయం జాగ్రత్త. చెడుపనులు చేసే వారి విషయం జాగ్రత్త. నరికివేసే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త.
\v 3 ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన దేవుని ప్రజలం.
\s (2) చట్టసంబంధమైన నీతిని నమ్ముకోవడం
\s5
\p
\v 4 చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను.
\v 5 ఎనిమిదో రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీ తల్లిదండ్రులకు పుట్టిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయుణ్ణి.
\s5
\v 6 క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి కంకణం కట్టుకున్నాను. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణ విధేయతతో పాటించాను.
\s (3) నీతి కలిగేలా విశ్వాసికి ఉండే నమ్మకానికి ఆధారం
\p
\v 7 అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటన్నిటినీ క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను.
\s5
\v 8 వాస్తవంగా నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్టమైన విషయం. కాబట్టి మిగతా సమస్తాన్నీ పనికిరానిదిగా ఎంచుతున్నాను. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును మాత్రమే కలిగి ఉండడానికి, వాటిని చెత్తతో సమానంగా ఎంచాను.
\v 9 క్రీస్తుతో నాకిప్పుడు సంబంధం ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన నా సొంత నీతి నాకు లేదు. దానికి భిన్నంగా, క్రీస్తులో విశ్వాసం ద్వారా దేవుడిచ్చిన నీతి నాకు ఉంది.
\s (4) పునరుత్థాన శక్తితో సహవాసానికై విశ్వాసికి ఆధారం క్రీస్తు
\p
\v 10 అది ఆయనను ఎరిగే నీతి. ఆయన పునరుత్థాన శక్తినీ ఆయన శ్రమలనూ పంచుకునే నీతి. ఆయన మరణ అనుభవంలోనికి క్రీస్తు నన్ను మార్చాడు.
\v 11 ఎలాగైనా సరే, నేను చనిపోయిన వారిలోనుంచి తిరిగి బతికే అనుభవం కలిగి ఉండాలని ఆయన అలా చేసాడు.
\s5
\p
\v 12 వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దానిని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
\v 13 సోదరులారా, దానిని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దానిని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను.
\v 14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరికే పరుగెత్తుతూ ఉన్నాను.
\s (5) ప్రవర్తన లో ఐక్యతకై హెచ్చరిక
\s5
\p
\v 15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరే విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దానిని దేవుడు కూడా మీకు స్పష్టం చేస్తాడు.
\v 16 ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి మనమంతా లోబడుతూ ఉందాం.
\s (6) అయితే ఐక్యత కోసమని సత్యాన్ని నిర్లక్ష్యానికి గురి చేయకూడదు
\s5
\p
\v 17 సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నడుచుకొనే వారిని జాగ్రత్తగా గమనించండి.
\v 18 చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఖంతో చెబుతున్నాను.
\v 19 నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే మనసు ఉంచుతారు.
\s (7) విశ్వాసి నిరీక్షణకు ఆధారం క్రీస్తు
\s5
\p
\v 20 మనం పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం.
\v 21 సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన భూసంబంధమైన దేహాల్ని తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.
\s5
\c 4
\s ఆందోళనలో విశ్వాసి ఆనందించడానికి బలం క్రీస్తు (1) ఐక్యత, ఆనందాలకై హెచ్చరిక
\p
\v 1 కాబట్టి నా ప్రియ సోదరులారా, మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. నా ఆనందం, నా కిరీటమై ఉన్న నా ప్రియ మిత్రులారా, ప్రభువులో స్థిరంగా ఉండండి.
\v 2 ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.
\v 3 అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. ఆ స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో శుభవార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథం లో రాసి ఉన్నాయి.
\s5
\v 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి, మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
\s (2) దేవుని శాంతి రహస్యం
\p
\v 5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.
\v 6 దేని గురించీ ఆందోళనతో ఉండవద్దు. ప్రతి విషయంలో విన్నపాలతో కూడిన ప్రార్థనతో దేవునికి తెలియచేసి ఆయనకు వందనాలు చెప్పండి.
\v 7 అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
\s (3) శాంతి ప్రదాత దేవుని సన్నిధి
\s5
\p
\v 8 చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో, ఏవి గౌరవింప తగినవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మంచి పేరు గలవో, అవి నైతికంగా మంచివో, మెచ్చుకోదగినవో, అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.
\v 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకొని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
\s (4) అందోళనల పై విజయం
\s5
\p
\v 10 నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు.
\v 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను.
\v 12 అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో, అన్ని పరిస్థితుల్లో, కడుపు నిండి ఉండడానికీ, ఆకలితో ఉండడానికీ, సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం, నేర్చుకున్నాను.
\v 13 నన్ను బలపరచే వాని ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
\s5
\v 14 అయినా నా కష్టాలు పంచుకుని మీరు మంచిపని చేశారు.
\v 15 ఫిలిప్పీయులారా, శుభవార్తను నేను బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఒక్క మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు.
\v 16 ఎందుకంటే థెస్సలొనీకలో కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు.
\v 17 నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను.
\s5
\v 18 నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందుకుని ఏమీ కొదువలేక ఉన్నాను. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణ గా ఉన్నాయి.
\v 19 కాగా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.
\v 20 మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగుతుంది గాక. ఆమేన్‌.
\s5
\v 21 పవిత్రులందరికీ క్రీస్తు యేసులో శుభాకాంక్షలు చెప్పండి.
\v 22 నాతో పాటు ఉన్న సోదరులంతా మీకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పవిత్రులంతా, ముఖ్యంగా చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
\v 23 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.

175
52-COL.usfm Normal file
View File

@ -0,0 +1,175 @@
\id COL Colossians
\s5
\c 1
\p
\v 1 దేవుని ఇష్టప్రకారం యేసు క్రీస్తుకు అపోస్తలుడైన పౌలూ, సోదరుడు తిమోతీ కొలొస్సయి పట్టణంలో ఉన్న పరిశుద్ధులకూ,
\v 2 క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ శుభాకాంక్షలతో రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా, శాంతీ మీకు లభించుగాక!
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కోసం ఎప్పుడూ ప్రార్ధన చేస్తున్నాం.
\s5
\v 4 పరలోకంలో మీ కోసం భద్రంగా ఉన్న ఆశాభావం కారణంగా క్రీస్తు యేసు పై మీకున్న విశ్వాసం గూర్చీ, పరిశుద్ధులందరి పైనా మీకున్న ప్రేమను గూర్చీ మేం విన్నాం.
\v 5 సత్యమైన దేవుని వాక్కు అయిన సువార్త మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆశాభావం గూర్చి మొదటిసారి మీరు విన్నారు.
\v 6 ఈ సువార్తను మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచీ అది మీలో ఫలించి అభివృద్ధి చెందినట్లే ఈ ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది.
\s5
\v 7 ప్రియమైన మా తోటి దాసుడూ, యేసుక్రీస్తు కు నమ్మకమైన సేవకుడూ అయిన ఎపఫ్రా మీకీ విషయాలను బోధించాడు.
\v 8 ఆత్మలో మీ ప్రేమను గూర్చి మాకు తెలియజేసింది కూడా ఇతనే.
\s5
\v 9 ఈ ప్రేమ కారణంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మీరు ఆయన ఇష్టాన్ని తెలుసుకునే విషయంలో సంపూర్ణ జ్ఞానంతోనూ, ఆత్మ సంబంధమైన తెలివితోనూ నిండి పోవాలని మీకోసం మానకుండా ప్రార్ధిస్తున్నాం.
\v 10 ప్రతీ మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, దేవునికి తగినట్టుగా ఆయన ఆమోదానికి అనుకూలంగా మీరు జీవించాలని మేం ప్రార్ధిస్తున్నాం.
\s5
\v 11 ఆయన మహిమ ప్రభావాలకు అనుగుణంగా మీలోని ప్రతి సామర్ధ్యమూ శక్తి పుంజుకోవాలని దేవుని వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.
\v 12 వెలుగు నివాసులైన పరిశుద్ధుల వారసత్వంలో మనల్ని భాగస్వాముల్ని చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెప్తూ ఉంటే ఇదంతా జరగాలని మేం దేవుణ్ణి వేడుకుంటున్నాం.
\s5
\v 13 ఆయన మనల్ని చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలో ఉంచాడు.
\v 14 ఆ కుమారుడి లోనే మనకు పాప క్షమాపణా, విమోచనా ఉన్నాయి.
\s5
\v 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన మొదటివాడుగా ఉన్నాడు.
\v 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి.
\v 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.
\s5
\v 18 తన శరీరమైన సంఘానికి ఆయనే తలగా ఉన్నాడు. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. చనిపోయిన వారిలోనుండి సజీవుడిగా లేవడంలో ఆయనే ప్రథముడు.
\v 19 ఆయనలో సర్వసంపూర్ణత నివసించాలనీ,
\v 20 కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.
\s5
\v 21 ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయి వారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుర్మార్గాల వల్లనూ దేవునికి శత్రువులుగా ఉన్నారు.
\v 22 అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ముందు మిమ్మల్ని పరిశుద్ధులుగానూ, నిర్దోషులుగానూ, నిందారహితులుగానూ నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు.
\v 23 ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసం లో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటన జరిగిన సువార్త వల్ల కలిగిన ఆశాభావం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను.
\s5
\v 24 ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసలలో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కొరకు క్రీస్తు పడిన యాతనలలో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను.
\v 25 రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును నెరవేర్చడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను.
\v 26 ఈ రహస్య సత్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు దానిని తన పరిశుద్ధులకు తెలియజేశాడు.
\v 27 అన్యజనులలో ఈ మర్మం అనే దివ్య సంపదను తన పరిశుద్ధులకు తెలియజేయాలని దేవుడు తలచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.
\s5
\v 28 మేం ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశ్యంతోనే మేము ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం. సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాం.
\v 29 దీనికోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాస పడుతున్నాను.
\s5
\c 2
\p
\v 1 మీ కోసమూ, లవొదికయ పట్టణం లోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ
\v 2 నేను ఎంత తీవ్ర పోరాటం చేస్తున్నానో మీరు తెలుసుకోవాలి. వారందరూ ప్రేమలో ఒక్కటి కావడం వల్లనూ, దేవుని మర్మమైన క్రీస్తును క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల కలిగే సంపదల మూలంగానూ తమ హృదయాలలో ప్రోత్సాహం పొందాలని పోరాటం చేస్తున్నాను.
\v 3 జ్ఞానమూ, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి.
\s5
\v 4 ఎవరైనా మీతో ఇంపుగా మాట్లాడి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకీ సంగతి చెప్తున్నాను.
\v 5 నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నా ఆత్మలో మీతోనే ఉన్నాను. మంచి క్రమంలో సాగే మీ ప్రవర్తననూ, క్రీస్తుపై మీకున్న బలమైన విశ్వాసాన్నీ చూసి సంతోషిస్తున్నాను.
\s5
\v 6 మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి.
\v 7 ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి, ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి, మీకు బోధించిన రీతిలోనే విశ్వాసంలో నిలకడగా ఉండండి. కృతజ్ఞతలు చెప్పడంలో విస్తరిస్తూ ఉండండి.
\s5
\v 8 క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రపంచంలోని పాపభూయిష్టమైన మత విశ్వాసాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరిత వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి.
\v 9 ఎందుకంటే దైవత్వపు సంపూర్ణత ఆయన శరీరంలో నివసిస్తుంది.
\s5
\v 10 ప్రభుత్వానికీ, ఆధిపత్యానికీ పై శిరస్సుగా ఉన్న ఆయనలో మీరు సంపూర్ణులు.
\v 11 మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీకు జరిగిన సున్నతి.
\v 12 బాప్తిస్మంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలోనుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిలో మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు.
\s5
\v 13 శరీరంలో మీకు సున్నతి జరగక పోవడం వల్లా మీరు చేసే అపరాధాల వల్లా మీరు చనిపోయారు. అప్పుడు ఆయన తనతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు.
\v 14 మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనల్నీ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు.
\v 15 ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ తొలగించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపు లో బహిరంగంగా ప్రదర్శించాడు.
\s5
\v 16 కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండుగ రోజులూ, అమావాస్య, విశ్రాంతిదినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి.
\v 17 ఇవన్నీ జరుగనున్న వాటి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది.
\s5
\v 18 ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ తద్వారా మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాంటివాడు తాను చూసిన విషయాలను ఎక్కువ పట్టించుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచల వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు. .
\v 19 అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్ళు, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది.
\s5
\v 20 ప్రపంచంలోని పాప భూయిష్టమైన విశ్వాసాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణిస్తే ఆ విశ్వాసాలకు మీరెందుకు లోబడి ఉండాలి?
\v 21 "అది పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు" లాంటి మనుష్యుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి?
\v 22 ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే.
\v 23 వీటిలో మానవ నిర్మితమైన మతాల జ్ఞానమూ, కపట వినయమూ, శరీరాన్ని నియంత్రించడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను తీర్చుకునే విషయానికి వ్యతిరేకంగా వీటికి ఎలాంటి శక్తీ లేదు.
\s5
\c 3
\p
\v 1 అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపినట్లయితే పైన ఉన్న వాటినే వెదకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు.
\v 2 పైన ఉన్న వాటి మీదే మీ మనస్సు నిలపండి. భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు.
\v 3 ఎందుకంటే దేవుడు మీ జీవాన్ని క్రీస్తులో దాచి పెట్టాడు.
\v 4 మీ జీవం అయిన క్రీస్తు తన మహిమ ప్రభావంతో కనిపించినప్పుడు మీరు కూడా ఆయనతో కనిపిస్తారు.
\s5
\v 5 కాబట్టి ఈ లోకంలోని పాపపు కోరికల్ని అంటే వ్యభిచారమూ, అపవిత్రతా, లైంగిక విశృంఖలతా, దురాశా, ధన వ్యామోహానికి మారు పేరైన విగ్రహారాధనలను చంపి వేయండి.
\v 6 వీటి వల్లే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది.
\v 7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు.
\v 8 కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపమూ, ఆగ్రహమూ, దుర్మార్గపు ఉద్దేశాలూ, నిందా వాక్కులూ, మీ నోటినుండి అవమానకరమైన మాటలూ, బూతులూ అన్నీ వదిలి పెట్టాలి.
\s5
\v 9 ఒకరితో మరొకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు.
\v 10 ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాని స్వరూపంలోకి నూతనమవుతూ ఉన్నారు.
\v 11 ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ, యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి జరిగిన వాడనీ, సున్నతి లేని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ ఏమీ లేదు. క్రీస్తే సమస్తమూ, సమస్తంలో ఆయనే ఉన్నాడు.
\s5
\v 12 కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ, పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ, దయనీ, దీనత్వాన్నీ, సాత్వికతనీ, సహనాన్నీ ధరించుకోండి.
\v 13 ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు చేసే సందర్భం వస్తే, ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరూ క్షమించండి.
\v 14 వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది.
\s5
\v 15 క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాలలో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి.
\v 16 క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. కీర్తనలతోనూ, పద్యాలతోనూ, ఆత్మసంబంధమైన పాటలతోనూ ఒకరికొకరు జ్ఞానం బోధించండి. హెచ్చరించండి. దేవుని పట్ల కృతజ్ఞతతో మీ హృదయాలలో పాటలు పాడండి.
\v 17 మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి యేసు ద్వారా కృతజ్ఞతలు అర్పించండి.
\s5
\v 18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన.
\v 19 భర్తలారా, మీ భార్యల్ని ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు.
\v 20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తలిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.
\v 21 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండా వారిని చికాకు పెట్టవద్దు.
\s5
\v 22 దాసులారా, మనుషుల్ని మెప్పించాలని చూసే వారిలా పైకి కనిపించాలని కాకుండా ప్రభువుకు భయపడుతూ చిత్తశుద్ధితో శారీరికంగా అన్ని విషయాల్లో యజమానులకు లోబడి ఉండండి.
\v 23 మీరేపని చేసినా హృదయ పూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్లు భావించుకుని చేయండి.
\v 24 ప్రభువునుండి మీకు వారసత్వం బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు. ప్రభువైన క్రీస్తుకు మీరు సేవ చేస్తున్నారు.
\v 25 అక్రమం చేసేవాడికి తాను చేసిన అక్రమానికి తగిన శాస్తి జరుగుతుంది. ఎలాంటి పక్షపాతం ఉండదు.
\s5
\c 4
\p
\v 1 యజమానులారా, పరలోకంలో మీకో యజమాని ఉన్నాడని తెలుసుకోండి. మీ దాసుల పట్ల న్యాయమైన దానినీ సరైన దానినీ చేయండి.
\s5
\v 2 ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలతో ప్రార్ధిస్తూ మెలకువగా ఉండండి.
\v 3 దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితుల్ని అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను.
\v 4 నేను బోధించాల్సిన విధంగానే బోధించాలనీ, స్పష్టంగా బోధించాలనీ నాకోసం ప్రార్ధించండి.
\s5
\v 5 సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
\v 6 మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండేలా చూసుకోండి. ఏ వ్యక్తికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోండి.
\s5
\v 7 ప్రియమైన సోదరుడూ, నమ్మకమైన సేవకుడూ, ప్రభువులో నా సహ దాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు.
\v 8 ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ, మీ హృదయాల్ని ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను.
\v 9 ఇతనితో కూడా మీ ఊరివాడే. నమ్మకమైన ప్రియసోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు.
\s5
\v 10 నాతోకూడా చెరసాలలో ఉన్న అరిస్తార్కూ, బర్నబాకు దగ్గర బంధువైన మార్కూ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ మార్కు "మీ దగ్గరకు వచ్చినప్పుడు చేర్చుకోండి" అని మిమ్మల్ని గతంలోనే ఆదేశించాను గదా.
\v 11 ఇంకా యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. వీరంతా సున్నతి జరిగిన వర్గంలో ఉన్నవారు. వీరే దేవుని రాజ్యం కోసం నాకు జత పని వారుగా ఉన్నారు. నాకు ఆదరణగా ఉన్నది కూడా వీరే.
\s5
\v 12 మీలో ఒకడూ క్రీస్తుయేసు సేవకుడూ అయిన ఎపఫ్రా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు . దేవుని ఇష్టమంతటిలో మీరు సంపూర్ణులుగానూ, నిశ్చయత గలవారై నిలకడగానూ ఉండాలని ఇతడు ఎప్పుడూ మీ కోసం తన ప్రార్ధనలో పోరాటం చేస్తున్నాడు.
\v 13 ఇతడు మీకోసం, లవొదికయవారి కోసం, హియెరాపొలి వారి కోసం ఎంతో ప్రయాస పడుతున్నాడు. ఇది ఇతని గూర్చి నా సాక్ష్యం .
\v 14 ప్రియమైన వైద్యుడు లూకా, దేమా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
\s5
\v 15 లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ, వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘానికీ శుభాకాంక్షలు తెలియజేయండి.
\v 16 ఈ పత్రిక మీరు చదివాక లవొదికయలోని సంఘంలో చదివించండి. అలాగే నేను లవొదికయ సంఘానికి రాసి పంపిన పత్రికను మీరు తెప్పించుకుని చదవండి.
\v 17 అలాగే "ప్రభువులో నీకు అప్పగించిన సేవను నెరవేర్చడానికి జాగ్రత పడు" అని అర్ఖిప్పుతో చెప్పండి.
\s5
\v 18 పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉంటుంది గాక.

172
53-1TH.usfm Normal file
View File

@ -0,0 +1,172 @@
\id 1TH 1 Thessalonians
\s5
\c 1
\s ఆదర్శ సంఘం. క్రైస్తవ జీవితం
\p
\v 1 తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తు లోనూ ఉన్న థెస్సలొనీక సంఘానికి పౌలూ, సిల్వానూ, తిమోతీ రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగుతాయి గాక!
\s5
\v 2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం.
\v 3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనీ, మన ప్రభు యేసు క్రీస్తు లో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేముఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
\s5
\v 4 దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే మా సువార్త కేవలం మాటతో మాత్రమే కాకుండా శక్తితో, పరిశుద్దాత్మతో, పూర్తి నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చిందన్న సంగతి మాకు తెలుసు.
\v 5 మీ మేలు కోసం మేము మీ మధ్య ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.
\s5
\v 6 మమ్మల్నీ, ప్రభువునీ ఆదర్శంగా తీసుకొని పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో మీరు తీవ్రమైన హింసల మధ్య వాక్యాన్ని అంగీకరించారు. .
\v 7 కాబట్టి మాసిదోనియలో అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శ ప్రాయులయ్యారు.
\s5
\v 8 మీ దగ్గర నుండే ప్రభువు వాక్కు మాసిదోనియాలో అకయలో వినిపించింది. అక్కడ మాత్రమే కాకుండా ప్రతీ స్థలంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
\v 9 మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి సజీవుడైన, నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో, పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కొరకు ఎలా వేచి ఉన్నారో అక్కడివారు మా గురించి చెప్తున్నారు.
\v 10 ఈ యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడు.
\s5
\c 2
\s ఆదర్శ సేవకుడు, అతని ప్రతిఫలం
\p
\v 1 సోదరులారా, మీ దగ్గరకు మేము రావడం వ్యర్ధం కాలేదు
\v 2 మేము ఫిలిప్పీ లో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకుని దేవుని సువార్తను మీకు ఉపదేశించామనీ మీకు తెలుసు.
\s5
\v 3 ఎందుకంటే మా ఉపదేశం కపటమైనదీ, అపవిత్రమైనదీ మోసపూరితమైనదీ కాదు.
\v 4 దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషుల్ని సంతోషపరచడానికి కాకుండా హృదయాల్ని పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే ఉపదేశిస్తున్నాం.
\s5
\v 5 మేము ముఖస్తుతి మాటలను ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి.
\v 6 ఇంకా మేము యేసుక్రీస్తు అపోస్తలులం కనుక ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు.
\s5
\v 7 కానీ పాలిచ్చే తల్లి తన పసి పిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం.
\v 8 మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు కాబట్టి మీ పట్ల ప్రీతితో దేవుని సువార్త మాత్రమే కాదు, మీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
\v 9 సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం.
\s5
\v 10 విశ్వాసులైన మీ ముందు మేము ఎంత పవిత్రంగా, నీతిగా, నిందారహితంగా నడుచుకున్నామో మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి.
\v 11 తన రాజ్యానికీ, మహిమకూ మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండాలని మేము మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ సాక్ష్యం ఇస్తూ
\v 12 తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.
\s5
\v 13 ఆ కారణం చేత మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దానిని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. అది నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పనిచేస్తూ ఉంది కూడా.
\s5
\v 14 అవును సోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. వారు యూదుల వలన అనుభవించిన హింసలే ఇప్పుడు మీరు కూడా మీ స్వదేశీయుల వలన అనుభవిస్తున్నారు.
\v 15 వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని వెలివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టే వారు కాదు. మనుషులందరికీ విరోధులు.
\v 16 యూదేతరులు రక్షణ పొందేలా వారికి సువార్త ప్రకటించకుండా వారు మమ్మల్ని అడ్డుకున్నారు. తమ పాపాల్ని పెంచుకుంటూ ఉన్నారు. దేవుని తీవ్ర కోపం విపరీతంగా వారి మీదికి వచ్చింది.
\s5
\v 17 సోదరులారా, మేము కొంతకాలం శరీర రీతిగా దూరంగా ఉన్నా హృదయంలో మాత్రం మీకు దగ్గరగానే ఉన్నాం. మీ ముఖాలు చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.
\v 18 కాబట్టి మేము మీ దగ్గరకు రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నో సార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు
\v 19 ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా!
\v 20 నిజంగా మా మహిమా ఆనందమూ మీరే.
\s5
\c 3
\s ఆదర్శ సోదరుడు. విశ్వాసి పవిత్రీకరణ
\p
\v 1 కాబట్టి ఇక ఆగలేక ఎతెన్స్ లో మేము ఒంటరిగానైనా ఉండటం మంచిదే అని నిశ్చయించుకుని
\v 2 ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరి పోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ, క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరకు పంపించాం.
\v 3 ఈ కష్టాలను అనుభవించడం మామూలే అని మనకి తెలుసు.
\s5
\v 4 మేము మీ దగ్గర ఉన్నప్పుడు 'మనం హింసలు పొందాలి' అని ముందుగానే మీతో చెప్పాం కదా! ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది.
\v 5 అందుకే ఇక నేను కూడా తట్టుకోలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమై పోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.
\s5
\v 6 ఇప్పుడు అతడు మీ దగ్గరనుంచి తిరిగి వచ్చి మీ విశ్వాస ప్రేమలను గురించి మాకు తెలియజేశాడు. మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు.
\v 7 అందుచేత సోదరులారా, మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో మీ విశ్వాసం చూసి ఆదరణ పొందాం.
\s5
\v 8 ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మాకు అంతులేని ప్రోత్సాహం.
\v 9 మీ గురించీ దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించీ దేవునికి కృతజ్ఞతలు ఏమని చెల్లించగలం?
\v 10 మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలోని లోపాలు సరి చేయాలనీ రాత్రింబగళ్ళు ప్రార్ధనలో వేడుకుంటున్నాం
\s5
\v 11 మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరకు ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకు వస్తాడు గాక!
\v 12 మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే మీ మధ్య ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, ఇతరుల పట్ల కూడా సమృద్ధిగా పెరిగేలా ప్రభువు చేస్తాడు గాక!
\v 13 తన పరిశుద్ధులందరితో కలసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ప్రభువు స్థిర పరుస్తాడు గాక!
\s5
\c 4
\s ఆదర్శ పూర్వకమైన నడత. విశ్వాసి నిరీక్షణ
\p
\v 1 చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు.
\v 2 మీరు ఎలా జీవిస్తే దేవుడు సంతోషపడతాడో మేము మీకు నేర్పించిన ప్రకారంగా మీరు జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.
\s5
\v 3 మీరు పరిశుద్ధులు కావడమే అంటే జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని ఉద్దేశం.
\v 4 మీలో ప్రతివాడూ, దేవుని ఎరుగని ఇతరుల్లాగా కామ వికారంతో కాకుండా
\v 5 పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం.
\v 6 ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుని మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకుముందు మీకు చెప్పి సాక్ష్యమిచ్చినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు.
\s5
\v 7 పరిశుద్ధులు కావడానికే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి పిలవ లేదు.
\v 8 కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించే వాడు మనిషిని కాదు, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు.
\s5
\v 9 సోదరుల మధ్య ఉండాల్సిన ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు.
\v 10 అలాగే మీరు మాసిడోనియా అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
\v 11 సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండాలనీ మీకు ఏమీ కొదువ లేకుండా ఉండటానికి మీ సొంత విషయాలలో ఆసక్తి కలిగి, మీ చేతులతో కష్టపడి పనులు చేసుకోవాలనీ
\v 12 మేము ఆదేశించిన విధంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలనీ హెచ్చరిస్తున్నాం.
\s మరణించిన వారి విషయం, క్రీస్తు రాక
\s5
\p
\v 13 సోదరులారా, భవిష్యత్తు పట్ల ఎలాటి ఆశాభావం లేని ఇతరుల్లా కన్నుమూసిన వారిని గూర్చి మీరు విలపించకూడదు. కన్నుమూసిన వారిని గూర్చి మీకు తెలియక పోవడం మాకు ఇష్టం లేదు.
\v 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
\v 15 మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము.
\s5
\v 16 కోలాహలంతో, ప్రధానదూత చేసే గొప్ప శబ్దంతో, దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.
\v 17 ఆ తర్వాత బ్రతికి ఉండే మనల్ని కూడా వారితో కూడా ఆకాశమండలం లో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాల పైన తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
\v 18 కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకుని ఒకరినొకరు ఆదరించుకోండి.
\s5
\c 5
\s ఆదర్శ వంతమైన నడవడి. యెహోవా దినం
\p
\v 1 సోదరులారా, ఆ కాలాలను గూర్చీ, సమయాలను గూర్చీ నేను మీకు రాయనక్కరలేదు.
\v 2 రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు.
\v 3 ప్రజలు "అంతా ప్రశాంతంగా, భద్రంగా ఉంది. భయమేమీ లేదు", అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
\s5
\v 4 సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు.
\v 5 మీరంతా వెలుగు సంతానం, పగలు సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు.
\v 6 కాబట్టి ఇతరుల్లా నిద్ర పోకుండా, మత్తులో ఉండకుండా మెలకువగా ఉందాం.
\v 7 నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్ర పోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు.
\s5
\v 8 విశ్వాసులమైన మనం పగటి వారం కాబట్టి మనల్ని మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమ అనే కవచాన్నీ, రక్షణ కొరకైన ఆశాభావం అనే శిరస్త్రాణాన్నీ ధరించుకుందాం.
\v 9 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనల్ని నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు.
\v 10 మనం మేలుకొని ఉన్నా నిద్ర పోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.
\v 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, అభివృద్ధి కలుగజేసుకోండి.
\s5
\v 12 సోదరులారా, మీ మధ్య ప్రయాస పడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెప్తూ ఉన్నవారిని గౌరవించండి.
\v 13 వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
\v 14 సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, అక్రమంగా ప్రవర్తించే వారిని హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.
\s5
\v 15 ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయండి.
\v 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
\v 17 అస్తమానం ప్రార్థన చేస్తూ ఉండండి.
\v 18 ప్రతి విషయం లోనూ దేవునికి కృతజ్ఞతలూ స్తుతులూ చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
\s5
\v 19 దేవుని ఆత్మను ఆర్పవద్దు.
\v 20 ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
\v 21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్టమైన దానిని పాటించండి.
\v 22 ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
\s5
\v 23 శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచును గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనంలో నిందా రహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!
\v 24 మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన అలాగే చేస్తాడు.
\s5
\v 25 సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి.
\v 26 పవిత్రమైన ముద్దుపెట్టుకొని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి.
\v 27 సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను.
\v 28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది గాక!

99
54-2TH.usfm Normal file
View File

@ -0,0 +1,99 @@
\id 2TH 2 Thessalonians
\s5
\c 1
\s అభివందనాలు
\p
\v 1 మన తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న థెస్సలోనిక సంఘానికి పౌలూ, సిల్వానూ, తిమోతీ రాస్తున్న సంగతులు.
\v 2 తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృపా సమాధానమూ మీకు కలుగుతాయి గాక.
\s5
\v 3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది.
\v 4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి గర్వంగా చెప్తున్నాం.
\s హింసల్లో ఆదరణ
\p
\v 5 ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు.
\s5
\v 6 ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు
\v 7 మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలుగజేయడం దేవునికి న్యాయమే.
\v 8 ఇది జరిగినప్పుడు దేవుడెవరో తెలియని వారినీ మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారినీ అగ్నిజ్వాలలలో ఆయన దండిస్తాడు.
\s5
\v 9 ఆ రోజు తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు
\v 10 వారు ఆయన సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు. మేము మీకు చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.
\s5
\v 11 ఈ కారణం చేత మన దేవుడూ ప్రభుయేసు క్రీస్తూ ప్రసాదించే కృప మూలంగా మీలో ఆయన నామం మహిమ పొందాలి. మీరు ఆయనలో మహిమ పొందాలి.
\v 12 దాని కోసం మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననీ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీకోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాం.
\s5
\c 2
\s యెహోవా దినం. పాతక పురుషుడు
\p
\v 1 సోదరులారా, ఇకపోతే యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడటం గురించీ ఒక హెచ్చరిక.
\v 2 క్రీస్తు రాక జరిగిపోయిందని ఏదైనా ఆత్మ ప్రకటన చేత గానీ, మాట చేత గానీ, లేదా మేము రాసినట్టుగా ఏదైనా ఉత్తరం చేత గానీ మీకు తెలిస్తే మీ మనస్సులలో కలవర పడవద్దనీ, ఆందోళన చెందవద్దనీ మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 3 ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట తిరుగుబాటు జరగాలి. అశాంతికీ, అల్లకల్లోలానికీ కారకుడైన అక్రమ పురుషుడు రావాలి. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంత వరకూ ఆ రోజు రాదు.
\v 4 వీడు దేవునికి సంబంధించిన దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను తాను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.
\s5
\v 5 మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా?
\v 6 వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు.
\v 7 అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకు దానిని అడ్డుకొనే వాడిని దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు.
\s5
\v 8 అప్పుడా అక్రమ పురుషుడు బయట పడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాడిని సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు.
\v 9 సాతాను యొక్క సమస్త శక్తీ, వాడి సూచక క్రియలు, కపటమైన అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.
\v 10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యం గూర్చిన ప్రేమను అంగీకరించలేదు.
\s5
\v 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమం లోనే సంతోషించే వారిని శిక్షించడానికి
\v 12 వారి మధ్యకు అబద్ధాన్ని నమ్మేలా మోసం చేసే శక్తిని దేవుడు పంపిస్తున్నాడు.
\s హెచ్చరికలు, సూచనలు
\s5
\p
\v 13 ప్రభువు ప్రేమించిన సోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మడానికీ, పరిశుద్ధాత్మ చేసే శుద్ధీకరణ లోని రక్షణకీ దేవుడు మిమ్మల్ని తొలిపంటగా ఎంచుకున్నాడు.
\v 14 మేము ప్రకటించిన సువార్త ద్వారా యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా మిమ్మల్ని పిలిచాడు.
\v 15 కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. మా నోటి మాట చేతా, మా పత్రికల చేతా మేము ఉపదేశించిన విధులను పాటించండి.
\s5
\v 16 మనల్ని ప్రేమించి శాశ్వత ఆదరణ, కృప ద్వారా భవిష్యత్తు విషయంలో సంపూర్ణ ఆత్మ విశ్వాసం అనుగ్రహించిన
\v 17 మన ప్రభు యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడూ మీ హృదయాలను ఆదరించి ప్రతి మంచి పనిలో, వాక్యంలో స్థిర పరచును గాక.
\s5
\c 3
\p
\v 1 చివరిగా సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా,
\v 2 మేము మూర్ఖులైన దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మాకోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
\v 3 అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
\s5
\v 4 మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.
\v 5 దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!
\s5
\v 6 సోదరులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరిగా ఉంటున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.
\v 7 మమ్మల్ని ఎలా అనుకరించాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.
\v 8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం. కష్టపడి పనిచేశాం. శ్రమించాం.
\v 9 మీరు మమ్మల్ని అనుకరించాలనీ, మీకు ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు.
\s5
\v 10 అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు "పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు" అని ఆజ్ఞాపించాం కదా!
\v 11 మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం.
\v 12 అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
\s5
\v 13 సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహ పడవద్దు.
\v 14 ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాడిని కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో స్నేహం మానండి.
\v 15 అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి.
\s ఆశీస్సులు
\s5
\p
\v 16 శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహిస్తాడు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉంటాడు గాక!
\v 17 నేను పౌలును. నా చేతి రాతతో మీకు అభివందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి పత్రిక లోనూ ఇదే గుర్తు ఉంటుంది.
\v 18 మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుంది గాక!

233
55-1TI.usfm Normal file
View File

@ -0,0 +1,233 @@
\id 1TI 1 Timothy
\s5
\c 1
\s చట్టపరమైన, పనికిమాలిన బోధ ఖండన
\p
\v 1 విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం ఆయన అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు.
\v 2 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగును గాక.
\s5
\v 3 నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్లుగా నువ్వు ఎఫెసు లోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించేవారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి. .
\v 4 కల్పనా కథలకూ అంతూ పొంతూ లేని వంశావళులకూ , విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనే సంబంధం ఉంది కాబట్టి వాటిని పట్టించుకోవద్దని కొందరికి ఆజ్ఞాపించడానికి నీవు ఎఫెసులోనే ఉండి పోవాలని నిన్ను హెచ్చరించాను.
\s5
\v 5 దీనిలోని ఉద్దేశం, పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ నిష్కపటమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.
\v 6 కొంతమంది వీటినుండి తొలగిపోయి పనికి మాలిన కబుర్లకు దిగారు.
\v 7 వాళ్ళు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాక పోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.
\v 8 అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.
\s5
\v 9 దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు, ధర్మ విరోధులూ, తిరుగుబాటు చేసేవారూ, దేవుని నమ్మని వారూ దుర్మార్గులూ, భక్తిహీనులూ, చెడిపోయిన వారూ, తల్లినీ, తండ్రినీ చంపే వారూ, హంతకులూ,
\v 10 వ్యభిచారులూ, స్వలింగ సంపర్కులూ, మనుష్యుల్ని అపహరించే వారూ, అబద్ధికులూ, అబద్ధ సాక్షం చెప్పేవారూ, నిజమైన బోధకు వ్యతిరేకంగా నడుచుకొనేవారూ, ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది.
\v 11 ఈ మహిమాన్విత సువార్తను దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
\s5
\v 12 తన సేవకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి బలపరచిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి.
\v 13 అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను.
\v 14 క్రీస్తు యేసు లోని విశ్వాసం ప్రేమతో కలిసి, మన ప్రభువు కృప అత్యధికంగా విస్తరించింది.
\s5
\v 15 పాపుల్ని పాప విముక్తుల్ని చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మ దగినదీ, సంపూర్ణ అంగీకారానికి యోగ్యమైనదీ. అలాంటి పాపుల్లో నేను ప్రముఖుణ్ణి.
\v 16 అయినా నిత్యజీవం కోసం తనను విశ్వసించబోయే వారికి నేను నమూనా గా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో ప్రదర్శించి నన్ను కరుణించాడు.
\v 17 అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన అసమాన దేవునికి ఘనతా మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్‌.
\s5
\v 18 తిమోతీ, నా కుమారా , నీవు విశ్వాసాన్నీ మంచి మనస్సాక్షినీ కలిగి ఉండి, నిన్నుగూర్చి ముందుగా చెప్పిన ప్రవచనాల చొప్పున ఈ మంచి పోరాటంలో పాల్గొనాలని వాటిని బట్టి నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
\v 19 అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు.
\v 20 వారిలో హుమెనే, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.
\s5
\c 2
\s ప్రార్థన, స్త్రీ పురుషులకై దైవక్రమం
\p
\v 1 మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం,
\v 2 రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలూ మనవులూ చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటె ముఖ్యంగా కోరుతున్నాను.
\v 3 ఇది మన రక్షకుడయిన దేవుని దృష్టిలో మంచిది,సమ్మతమైనది.
\v 4 మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసు కోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
\s5
\v 5 దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు.
\v 6 ఈయన అందరికోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. దీనిని సరైన సమయంలో ధృవీకరించడం జరుగుతుంది.
\v 7 దీనిని గూర్చి ప్రకటించే వానిగానూ , అపొస్తలునిగానూ దేవుడు నన్ను నియమించాడు. నిజం చెప్తున్నాను. అబద్ధం చెప్పడం లేదు. నేను విశ్వాస సత్యాల విషయాల్లో యూదులు కాని వారికి బోధకుణ్ణి.
\s5
\v 8 అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, అనుమానం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
\v 9 అలాగే స్త్రీలు కూడా వినయంగా, మర్యాదగా ఉంటూ, తగిన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
\v 10 భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమని తాము అలంకరించుకోవాలి.
\s5
\v 11 స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
\v 12 స్త్రీ మౌనంగా ఉండవలసిందే గానీ, ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ ఆమెకు అనుమతినివ్వను.
\s5
\v 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు?
\v 14 ఆదాము మోసపోలేదు గాని స్త్రీయే మోసపోయి అపరాధంలో పడింది.
\v 15 అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం ప్రేమ పరిశుద్ధతలలో నిలకడగా ఉంటే ప్రసవం సమయంలో దేవుడు వారిని కాపాడతాడు.
\s5
\c 3
\s పెద్దల, పరిచారకుల అర్హతలు
\p
\v 1 ఎవరైనా సంఘానికి అధ్యక్షుడు గా ఉండాలనుకుంటే అతడు శ్రేష్టమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు.
\v 2 అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ, ఒకే భార్యను కలిగి ఉన్నవాడూ, కోరికలు అదుపులో ఉంచుకొనేవాడూ, వివేచనాపరుడూ, మర్యాదస్థుడూ, అతిథి ప్రియుడూ, బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి.
\v 3 అతడు తాగుబోతూ పోట్లాడేవాడూ కాక సాత్వికుడూ, ధనాశ లేనివాడూ అయి ఉండాలి.
\s5
\v 4 తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకొంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకొనే వాడై ఉండాలి.
\v 5 ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు ?
\s5
\v 6 అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో .
\v 7 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్న వారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.
\s5
\v 8 అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడని వారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించే వారుగా ఉండకూడదు.
\v 9 వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకునే వారుగా ఉండాలి.
\v 10 మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వని వారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు.
\s5
\p
\v 11 అలాగే వారి భార్యలు కూడా గౌరవింప దగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి.
\v 12 పరిచారకులు ఒకే భార్యని కలిగినవారూ, తమ పిల్లలనూ తమ యింటివారినీ చక్కగా నిర్వహించుకొనే వారుగా ఉండాలి.
\v 13 పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకొని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు.
\s5
\p
\v 14 త్వరలో నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను .
\v 15 ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ.
\q1
\s5
\v 16 మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది.
\q1 ఏ సందేహమూ లేదు. దేవుడు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు.
\q1 ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు.
\q1 ఆయన్ని దేవదూతలు చూశారు.
\q1 దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు.
\q1 లోకం ఆయన్ని నమ్మింది.
\q1 మహిమతో అయన ఆరోహణమయ్యాడు.
\s5
\c 4
\s క్రీస్తు యొక్క మంచి సేవకుని ప్రవర్తన
\p
\v 1 ఆత్మ స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.
\v 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు.వారికి వాత పడిన మనస్సాక్షి ఉంది.
\s5
\v 3 వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాలలో కొన్ని తినకూడదని వీరు అంటారు.
\v 4 దేవుడు సృష్టించిన ప్రతీదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు.
\v 5 ఎందుకంటే దేవుని వాక్యమూ, ప్రార్థనా దానిని పవిత్ర పరుస్తాయి.
\s5
\v 6 ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.
\v 7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయం లో నీకు నీవే సాధన చేసుకో.
\v 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తి ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ వాగ్దానంతో కూడి ఉన్నందున అన్ని విషయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.
\s5
\v 9 ఈ విశ్వాస సందేశం విశ్వసనీయమైనదీ పూర్తిగా అంగీకరించ తగినదీ.
\v 10 మనుష్యులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నమ్మకముంచాం కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.
\s5
\v 11 ఈ సంగతులు ఆదేశించి నేర్పు.
\v 12 నీ యౌవనాన్నిబట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు.
\v 13 నేను వచ్చే వరకు పఠనంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.
\s5
\v 14 పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన నీలోని వరాన్ని నిర్లక్షం చేయవద్దు.
\v 15 నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనస్సు ఉంచి, వీటిలో సాధన చెయ్యి.
\v 16 నీ గురించీ ఉపదేశాల గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్నవారినీ రక్షించు కుంటావు .
\s5
\c 5
\s క్రీస్తు యొక్క మంచి సేవకుని క్రియలు
\p
\v 1 వయసులో పెద్దవాణ్ని కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
\v 2 యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.
\s5
\p
\v 3 అనాథలైన వితంతువులను గౌరవించు.
\v 4 అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారిని గౌరవిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం.
\s5
\v 5 నిజంగా అనాథ అయిన వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకముంచి, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ ఉంటుంది.
\v 6 అయితే విలాసాల్లో బతికే వితంతువు బతుకుతున్నా, చచ్చినట్టే.
\s5
\v 7 వారు నింద పాలు కాకుండేలా బోధించు.
\v 8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత యింటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని త్యజించినవాడు. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
\s5
\v 9 అరవై ఏళ్ల కంటె ఎక్కువ వయస్సు ఉండి, ఒక్క పురుషుడికే భార్యగా ఉన్నట్లయితేనే ఆమెను విధవరాలిగా నమోదు చేయి.
\v 10 ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం చేయడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకొని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
\s5
\v 11 పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
\v 12 ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు.
\v 13 వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికి మాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల జోలికి పోయేవారుగా తయారవుతారు.
\s5
\v 14 కాబట్టి పడుచు అమ్మాయిలు పెళ్లి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చేసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.
\v 15 ఇంతకుముందే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.
\v 16 ఎవరైనా విశ్వాసి యింట్లో నిజమైన వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా తానే వీరికి సహాయం చేయాలి.
\s5
\v 17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.
\v 18 ఇందుకు అనుగుణంగా లేఖనంలో, 'కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు' అనీ 'పనివాడు తన జీతానికి అర్హుడు' అనీ ఉంది.
\s5
\v 19 ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించవద్దు.
\v 20 మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.
\s5
\v 21 విరోధ బుద్ధితోగానీ పక్షపాతంతోగానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
\v 22 ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాలలో పాలిభాగస్తుడివి కావొద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.
\s5
\v 23 ఇకనుండి నీళ్ళు మాత్రమే తాగక నీ కడుపులో తరచుగా వచ్చే రోగాలకోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.
\v 24 కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరికొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.
\v 25 అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.
\s5
\c 6
\s క్రీస్తు యొక్క మంచి సేవకుని క్రియలు
\p
\v 1 బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి.
\v 2 విశ్వాసులైన యజమానులు గల దాసులైతే ఆ యజమానులు తమ సోదరులే కదా అని వారిని చిన్న చూపు చూడక, తాము సేవించేది తమ ప్రేమ పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.
\s5
\v 3 ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు క్షేమకరమైన మాటలకూ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా , దానికి భిన్నంగా బోధిస్తే
\v 4 అలాటి వాడికి ఏమీ తెలియదు. వాడు తర్కాలు, వాగ్వాదాలు చేస్తూ వ్యర్ధంగా ప్రయాసపడుతూ గర్విష్టి అవుతాడు.
\v 5 ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలూ కలుగుతాయి. ఇంకా చెడిపోయిన మనస్సుతో దైవభక్తి లాభం చేకూరుస్తుంది అనుకునే వారి పనికిమాలిన వివాదాలూ కలుగుతున్నాయి.
\s5
\v 6 సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం.
\v 7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలోనుండి ఏమీ తీసుకు పోలేము.
\v 8 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు సంపాదించుకొని వాటితో తృప్తిగా ఉందాం..
\s5
\v 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశలలో పడిపోతారు. అలాంటివి మనుషుల్ని నష్టానికీ నాశనానికీ గురిచేస్తాయి.
\v 10 ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే తీవ్రమైన శిక్షలను కొని తెచ్చుకున్నారు.
\s5
\v 11 దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటిని వదలిపెట్టి, నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ, సంపాదించుకోడానికి ప్రయాసపడు.
\v 12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు.
\s5
\v 13 అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుట, పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుట,
\v 14 నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీనిని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.
\s5
\v 15 భాగ్యవంతుడు, అద్వితీయుడు అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆ మహా ఘనుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
\v 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవడూ ఆయన్ని చూడలేదు, ఎవడూ చూడలేడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం ఉంటాయి గాక. ఆమేన్‌.
\s5
\v 17 ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, సుఖంగా అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు.
\v 18 వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసికోవాలనీ,
\v 19 మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.
\s5
\v 20 తిమోతీ, ప్రభువు నీకు అప్పగించిన దానిని కాపాడుకొంటూ, అపవిత్రమైన వట్టి మాటలకూ జ్ఞానం అని కొందరు అనుకునే విపరీత వాదాలకూ దూరంగా ఉండు.
\v 21 కొందరు ఆ విషయంలో తెలివి గలవారమనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. కృప మీకు తోడై ఉంటుంది గాక.

161
56-2TI.usfm Normal file
View File

@ -0,0 +1,161 @@
\id 2TI 2 Timothy
\s5
\c 1
\s అపోస్తలుని అభివందనాలు
\p
\v 1 క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు తన ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.
\v 2 తండ్రియైన దేవుని నుండీ మన ప్రభువు క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
\s5
\v 3 నా ప్రార్థనల్లో నిన్ను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నా పూర్వీకుల వలే కల్మషం లేని మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
\v 4 నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసికొని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని రాత్రింబవళ్ళు ఎదురు చూస్తున్నాను. నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు.
\v 5 ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయి లోనూ, యునీకే అనే మీ అమ్మలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.
\s5
\v 6 ఆ కారణంగానే నేను నీపై నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను.
\v 7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహాలను కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికి తనాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు.
\s5
\v 8 కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త నిమిత్తమైన కష్టాల్లో భాగం పంచుకో.
\v 9 మన క్రియలను బట్టి కాక తన సంకల్పాన్ని బట్టీ, క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడైన తన కృపను బట్టీ
\v 10 ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. అనాది కాలంలోనే క్రీస్తు యేసులో దానిని మనకు అనుగ్రహించాడు. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనీ సువార్త ద్వారా ఉనికిలోకి తెచ్చాడు.
\v 11 ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.
\s5
\p
\v 12 ఆ కారణం చేత నేనీ కష్టాలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినవాడు నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ రోజు వరకు ఆయన కాపాడగలడని నాకు పూర్తి నమ్మకం ఉంది.
\v 13 క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు.
\v 14 దేవుడు నీకు అప్పగించిన ఆ మంచి దానిని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.
\s5
\p
\v 15 ఆసియలోని వారంతా నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. ఫుగెల్లు, హెర్మొగెనే లు అలాటివారే.
\v 16 ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
\v 17 అతడు రోమ్ కి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు.
\v 18 పైగా అతడు ఎఫెసులో నాకు ఎంత ఉపచారం చేశాడో నీకు బాగా తెలుసు. ఆ ప్రభువు రోజున అతడు దేవుని వలన కనికరం పొందు గాక.
\s5
\c 2
\s మంచి సైనికుని తీరు
\p
\v 1 కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడుగా ఉండు.
\v 2 అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించ గలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.
\s5
\v 3 క్రీస్తు యేసు కోసం మంచి సైనికునిలా నాతో కూడా కష్టాలు భరించు.
\v 4 సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకొన్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు.
\v 5 ఒక క్రీడాకారుడు పోరాడేటప్పుడు నియమాల ప్రకారం పోరాడకపోతే అతనికి బహుమానం దొరకదు.
\s5
\v 6 కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొట్టమొదట భాగం పొందడానికి అర్హుడు.
\v 7 నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.
\s5
\v 8 నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసికో.
\v 9 ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ల పాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు.
\v 10 అందుచేత ఎన్నికైన వారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకొన్నాను.
\s5
\v 11 ఈ మాట నమ్మదగినది 'మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.
\v 12 కష్టాలు సహిస్తే ఆయనతో కూడ రాజ్య పరిపాలన చేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటే ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.
\v 13 ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే.'
\s5
\v 14 వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు సాక్ష్యమిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి.
\v 15 దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడ నక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.
\s5
\v 16 భక్తిహీనతకు కారణమయ్యే పొగరుబోతు మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి.
\v 17 పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే.
\v 18 వారు 'పునరుత్థానం గతించిపోయింద'ని చెప్తూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
\s5
\p
\v 19 అయితే 'ప్రభువుకు తన వారెవరో తెలుసు' 'ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగి పోవాలి' అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.
\v 20 ధనవంతుల ఇంటిలో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి.
\v 21 ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు.
\s5
\p
\v 22 నువ్వు యువకులకు కలిగే కోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనీ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి.
\v 23 బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదలివేయి.
\s5
\v 24 ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరిమీదా దయ చూపాలి. బోధనాసామర్ధ్యం కలిగి, అపకారాన్ని సహించేవాడై ఉండాలి.
\v 25 దేవునికి ఎదురాడే వారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు.
\v 26 వాడి ఉరినుండి తప్పించుకొని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన అనుభవ జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.
\s5
\c 3
\s భ్రష్టత్వం సంభవిస్తుంది
\p
\v 1 చివరి దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని నీవు గ్రహించాలి.
\v 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. గర్విష్టులూ, దైవ దూషణ చేసేవారూ, కన్నవారికి అవిధేయులూ, చేసిన మేలు మరిచేవారూ, అపవిత్రులూ,
\v 3 ప్రేమ బొత్తిగా లేని వారూ, అదుపులో ఉండనివారూ, దుర్భాషలాడేవారూ, నిగ్రహం లేనివారుగా ఉంటారు. వారు మంచివారిని ద్వేషిస్తారు.
\v 4 వారు ద్రోహులూ, తల బిరుసువారూ, గర్వాంధులూ, దేవునికంటె శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు.
\s5
\v 5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గాని దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
\v 6 ఇలాంటి వారు బలహీన మనస్తత్వం కల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల ఉద్రేకాలతో కొట్టుకు పోయే వారుగా ఉంటారు.
\v 7 వాక్యాన్ని అస్తమానం వింటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.
\s5
\v 8 యన్నే, యంబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్టు వీరు కూడా చెడుమనస్సు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.
\v 9 అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.
\s5
\v 10 నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనీ గ్రహించావు.
\v 11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
\v 12 క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు.
\v 13 అయితే దుర్జనులూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.
\s5
\v 14 క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.
\v 15 కాబట్టి, నీవు ఖచ్చితంగా తెలుసుకొన్నవాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో.
\s5
\v 16 దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి సత్కార్యాన్నీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి.
\v 17 అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది సత్యాన్ని బోధించడానికీ, దోషాలను ఖండించడానికీ, తప్పుదిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
\s5
\c 4
\s విశ్వాసపాత్రుడైన సేవకుడు
\p
\v 1 దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.
\v 2 వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా కష్టపడు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.
\s5
\v 3 ఎందుకంటే ప్రజలు మంచి బోధను సహించలేరు. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణం గా బోధించేవారిని పోగు చేసికొని,
\v 4 సత్యాన్ని లెక్కచేయక కట్టు కథల వైపు మళ్లుతారు.
\v 5 నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.
\s5
\v 6 ఒక పానార్పణగా నేను బలి కావలసిన సమయం ఆసన్నమయింది. నా మరణం సమీపించింది.
\v 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
\v 8 నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దానిని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురు చూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.
\s5
\v 9 నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నించు.
\v 10 దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి థెస్సలొనీక వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయకీ, తీతు దల్మతియకీ వెళ్ళారు.
\s5
\v 11 లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును తీసుకు రా. అతడు పరిచారం కోసం నాకు ఉపయోగంగా ఉంటాడు. తుకికును ఎఫెసుకు పంపాను.
\v 12 నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచి వచ్చిన అంగీనీ, పుస్తకాలనూ,
\v 13 ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసికొని రా.
\s5
\v 14 అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేసాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు.
\v 15 అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు.
\v 16 నేను మొదట న్యాయ స్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.
\s5
\v 17 అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దానిని వినేందుకూ, ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటినుండి తప్పించుకో గలిగాను.
\v 18 ప్రభువు అన్ని చెడు పనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్‌.
\s5
\v 19 ప్రిస్కకూ అకులకూ ఒనేసిఫొరు కుటుంబానికీ నా అభివందనాలు.
\v 20 ఎరస్తు కొరింథులో ఆగిపోయాడు. త్రోఫిముకు జబ్బు చేసింది. అందుకే అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
\v 21 నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చేయి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, ఇతర సోదరులంతా నీకు వందనాలు చెబుతున్నారు.
\v 22 ప్రభువు నీ ఆత్మకు తోడై ఉంటాడు గాక. కృప మీకు తోడై ఉంటుంది గాక.

111
57-TIT.usfm Normal file
View File

@ -0,0 +1,111 @@
\id TIT Titus
\s5
\c 1
\s స్థానిక సంఘాలలో దైవిక క్రమం
\p
\v 1 మన అందరి విశ్వాసం విషయంలో నా సొంత కుమారుడు తీతుకు పౌలు రాస్తున్న ఉత్తరం.
\v 2 దేవుడు ఎన్నుకొన్నవారి విశ్వాసం ప్రకారం, దైవ భక్తికి అనుకూలమైన సత్యాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం ప్రకారం నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపోస్తలుడిని.
\v 3 ఇది శాశ్వత జీవాన్ని గూర్చిన ఆశాభావానికి సంబంధించినది. అబద్దమాడలేని దేవుడు ఆ నిత్యజీవాన్ని అనాదికాలంలోనే వాగ్దానం చేశాడు గాని, అది మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించిన సువార్త ప్రకటన వలన తన వాక్యాన్ని సరైన సమయంలో ఇప్పుడు బయలుపరిచాడు.
\s5
\v 4 తండ్రియైన దేవుని నుండీ, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండీ కృపా, శాంతిసమాధానాలూ నీకు కలుగు గాక.
\v 5 నేను నీకు ఆదేశించినట్టు నువ్వు లోపాలను సరిచేసి, ప్రతి పట్టణంలోని క్రీస్తు ప్రభువు సంఘంలో పెద్దలను నియమించడం కోసం నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను.
\s5
\p
\v 6 సంఘ పెద్ద నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య కలవాడై ఉండాలి. అతని పిల్లలు దుర్మార్గులూ, తిరగబడే వారనే పేరు లేకుండా విశ్వాసులై ఉండాలి.
\v 7 అధ్యక్షుడు దేవుని సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు విచ్చలవిడిగా ప్రవర్తించేవాడూ, ముక్కోపీ, తాగుబోతూ, దెబ్బలాడేవాడూ, దురాశపరుడూ అయి ఉండకూడదు.
\s5
\v 8 అతిథి ప్రియుడూ, మంచిని ప్రేమించేవాడూ, మనసు అదుపులో ఉంచుకునేవాడూ, నీతిపరుడూ, పవిత్రుడూ, ఆశలను అదుపులో ఉంచుకోనేవాడూ,
\v 9 క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడై నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టేవాడూ అయి ఉండాలి.
\s5
\p
\v 10 ఎందుకంటే సున్నతిని ఆచరించేవారూ, అవిధేయులూ, వాగుడుకాయలూ, మోసకారులూ అనేకమంది ఉన్నారు.
\v 11 వారి నోళ్లు మూయించాలి. వారు తమ స్వలాభం కోసం బోధింప కూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలను పాడు చేస్తున్నారు.
\s5
\v 12 వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తే ఇలా అన్నాడు, 'క్రేతు ప్రజలు ఎంతసేపూ అబద్ధికులు, ప్రమాదకరమైన దుష్టమృగాల వంటివారు, సోమరులు, తిండిపోతులు.'
\v 13 ఈ మాటలు నిజమే. అందుచేత వారు యూదుల కల్పిత కథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి మాటలనూ లెక్కచేయకుండా
\s5
\v 14 విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.
\s5
\p
\v 15 పవిత్రులకు అన్నీ పవిత్రమే. అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. వారి హృదయం, వారి మనస్సాక్షి కూడా అపవిత్రాలే.
\v 16 దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకుంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.
\s5
\c 2
\s కాపరి పరిచర్య
\p
\v 1 నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు.
\v 2 వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలగుతూ విశ్వాసం, ప్రేమ, సహనం ధారాళంగా కలిగి ఉండాలి.
\s5
\v 3 అలాగే వృద్ధ స్త్రీలు కొండేలు చెప్పేవారు కాకూడదు. మద్యపానంలో మునిగిపోక మర్యాదస్తులై ఉండాలి. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. .
\v 4 వారు యువతులకు బుద్ధి చెప్పాలి. యువతులు భయభక్తులు కలిగి, దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలకు లోబడుతూ, వారినీ తమ పిల్లలనూ ప్రేమతో చూసుకుంటూ,
\v 5 మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.
\s5
\p
\v 6 అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు
\v 7 నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో.
\v 8 నీ ఉపదేశం మోసం లేనిదిగా, మర్యాదపూర్వకంగా, ఆక్షేపణకు చోటియ్యనిదిగా ఉండాలి.
\s5
\p
\v 9 దాసులు అన్నివిషయాల్లో తమ యజమానులకి విధేయులై ఉండాలి. తమ యజమానులను ఎదిరించక అన్ని విషయాల్లో వారిని సంతోషపెట్టాలి. పనివారు మన రక్షకుడైన దేవుని గూర్చిన బోధ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా,
\v 10 యజమానులకు ఎదురు చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. సంపూర్ణ విశ్వాస పాత్రులుగా ఉండాలి. మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని ఇతరులకు ఆకర్షణీయంగా చేయాలి. ఈ సంగతులు వారికి బోధించు.
\s5
\v 11 ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది.
\v 12 భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, నీతి న్యాయాలతో జీవిస్తూ, ఈ యుగంలో మనసుని అదుపులో పెట్టుకుని జీవించమని అది మనకు నేర్పుతుంది.
\v 13 మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం, మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ, ఈ లోకంలో జ్ఞానయుక్తంగా, నీతితో, భక్తితో జీవించాలి.
\s5
\v 14 ఆయన సమస్త చెడు నుండి మనల్ని విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తి గల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసికోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.
\s5
\v 15 వీటిని గూర్చి బోధిస్తూ, హెచ్చరిస్తూ సంపూర్ణమైన అధికారంతో అబద్ద బోధను ఖండించు. ఎవరూ నిన్ను నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.
\s5
\c 3
\s యోగ్యమైన కాపరి పరిచర్య
\p
\v 1 పరిపాలకులకూ, అధికారులకూ విధేయులై ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి.
\v 2 వారు మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి, ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా జీవించాలి.
\s5
\v 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానావిధాలైన దురాశలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ఒకరిపై ఒకరం ద్వేషంతో ఉండేవాళ్ళం.
\s5
\v 4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు
\v 5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు.
\s5
\v 6 ఆయన తన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు.
\v 7 నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణకు వారసులు కావడం కోసం మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.
\s5
\v 8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతుల్ని గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
\s5
\v 9 అర్ధంపర్ధం లేని వాదాలు, వంశావళులను గూర్చిన తగాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు.
\v 10 మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో.
\v 11 నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి తనకు తానే శిక్ష విధించుకొని పాపం చేస్తున్నాడు.
\s5
\p
\v 12 నికొపొలిలో చలికాలం గడపాలని నేను నిర్ణయించుకొన్నాను. కాబట్టి నేను అర్తెమాని గాని, తుకికుని గాని నీ దగ్గరకి పంపినప్పుడు నీవు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి.
\v 13 న్యాయవాది జేనానీ అపొల్లోనీ త్వరగా పంపించు. వారికేమీ తక్కువ కాకుండా చూడు.
\s5
\v 14 మనవారు నిష్ఫలులు కాకుండా అవసరాన్ని బట్టి సమయోచితంగా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి.
\s5
\v 15 నాతో ఉన్నవారంతా నీకు శుభాకాంక్షలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించేవారికి మా శుభాకాంక్షలు చెప్పు. కృప మీ అందరికి తోడై ఉంటుంది గాక.

52
58-PHM.usfm Normal file
View File

@ -0,0 +1,52 @@
\id PHM Philemon
\s5
\c 1
\s అపోస్తలిక అభివందనాలు
\p
\v 1 మా ప్రియ సోదరుడూ జతపనివాడూ అయిన ఫిలేమోనుకు
\v 2 మన సోదరి అప్ఫియకు, మనతో కలిసి పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.
\v 3 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
\s ఫిలేమోను వ్యక్తిత్వం
\s5
\p
\v 4 ప్రభువైన యేసు పట్ల నీకున్న విశ్వాసం గూర్చి, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, నేను విని
\v 5 నా ప్రార్థనలలో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.
\v 6 క్రీస్తులో నీకు కలిగిన ప్రతి మంచినీ నీవు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం వలన ఇతరులు నీ విశ్వాసంలో భాగస్తులు అవుతూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
\v 7 సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద తీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.
\s ఒనేసీము కోసం వేడికోలు
\s5
\p
\v 8 అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే అధికారం క్రీస్తులో నాకున్నా సరే
\v 9 ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.
\s5
\v 10 నేను ఒనేసీము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు.
\v 11 గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు.
\v 12 నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపాను.
\v 13 నేను శుభవార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీకు బదులుగా నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను
\s5
\v 14 అయితే నీ అనుమతి లేకుండా అలాంటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనం బలవంతంతో కాక ఇష్ట పూర్వకంగా ఉండాలని నా అభిప్రాయం.
\v 15 బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు.
\v 16 ఇక ఏమాత్రం బానిసగా కాకుండా అంతకంటే ఎక్కువగా, ప్రియమైన సోదరుడుగా ఉంటాడు. ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ ఉంటాడు.
\s5
\v 17 అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్నులాగా అతణ్ణి కూడా చేర్చుకో.
\v 18 ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి.
\v 19 పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా నీ జీవితమే నాకు బాకీ పడి ఉంది.
\v 20 ఔను, సోదరా, ప్రభువులో నీవల్ల నాకు ఆనందం కలగనివ్వు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.
\s5
\v 21 నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటె నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.
\s 22 వందనాలు, ముగింపు
\p
\v 22 సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే నీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను నీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.
\s5
\v 23 క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా,
\v 24 అలానే నా జతపని వారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.
\v 25 మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. అమేన్‌.

660
59-HEB.usfm Normal file
View File

@ -0,0 +1,660 @@
\id HEB Hebrews
\s5
\c 1
\s గొప్ప రక్షణ (1) కుమారుడు ప్రవక్తలకంటే గొప్పవాడు
\p
\v 1 పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు.
\v 2 ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు.
\v 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బలప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. మన పాపాల విషయమలో తానే శుద్ధీకరణం చేసి, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
\s (2) కుమారుడు దేవదూతల కంటే గొప్పవాడు
\s5
\p
\v 4 దేవదూతల కంటె ఎంతో శ్రేష్ఠమైన పేరుని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటె ఎంతో శ్రేష్టుడయ్యాడు.
\v 5 ఎందుకంటే దేవుడు "నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను." అని గానీ "నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు." అని గానీ తన దూతలలో ఎవరి గురించైనా అన్నాడా?
\s5
\v 6 ఆయన సృష్టికి ప్రథముణ్ణి భూమి పైకి తిరిగి తీసుకు వచ్చినప్పుడు "దేవదూతలందరూ ఆయనను పూజించాలి" అన్నాడు.
\v 7 తన దూతల్ని గూర్చి చెప్పినప్పుడు ఆయన "వారిని ఆత్మలుగా తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడు" అని చెప్పాడు.
\s5
\v 8 అయితే తన కుమారుని గూర్చి ఇలా అన్నాడు. "దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం.
\v 9 నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.
\s5
\v 10 ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు.
\v 11 నీ చేతులతోనే ఆకాశాల్ని చేసావు. అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు సదా నిలిచి ఉంటావు. బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి.
\v 12 వాటిని పైపంచెలా మడిచి వేస్తావు. బట్టల్ని మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. కానీ నువ్వు ఒకేలా ఉంటావు. నీ సంవత్సరాలు ముగిసిపోవు"
\s5
\v 13 "నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో" అని దేవుడు తన దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా?"
\v 14 ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికీ పంపించిన సేవక ఆత్మలే కదా?
\s5
\c 2
\p
\v 1 అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
\s5
\v 2 ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం న్యాయబద్ధమైనదై దాని ప్రకారం ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన దండన కలుగుతుంది.
\v 3 అయితే మొదటిగా ప్రభువే ప్రకటించి, దానిని విన్న వారిద్వారా మనకు ఖాయం చేసిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం?
\v 4 దేవుడు తన సంకేతాలూ, అనేక రకాల అద్భుతాలూ, గొప్ప గొప్ప కార్యాలూ చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దానిని రుజువు చేశాడు.
\s భూమిని యేసు క్రీస్తుకు లోబరచవలసి ఉంది
\s5
\p
\v 5 మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు.
\v 6 దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్ష్యమిస్తూ ఇలా అన్నాడు. "నువ్వు జ్ఞాపకం చేసుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు?
\s5
\v 7 నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. కీర్తీ ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు.
\v 8 నువ్వు సమస్తాన్నీ వాడి పాదాల కింద ఉంచావు." ఆయన సమస్తాన్నీ మానవ జాతికి వశం చేశాడు. వాడికి వశం చేయకండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ వాడికి వశం కావడం మనం ఇంకా చూడలేదు.
\s కొంచెం కాలం క్రీస్తును దూతల కంటే తక్కువ వానిగా చేసిన తరువాత ఆయన మానవుల కోసం మరణించి వారిని దూతల కంటే ఉన్నత స్థితికి చేర్చాడు.
\s5
\p
\v 9 అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా ఆయన చేసిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసలూ మరణాల ద్వారా కీర్తీ, ఘనతా యశస్సు లతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కొరకూ మరణాన్ని రుచి చూశాడు.
\v 10 ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారుల్ని మహిమకు తీసుకురావడం, వారి రక్షణ కర్తను తాను పొందే శ్రమల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే.
\s5
\v 11 పరిశుద్దులుగా అయేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు.
\v 12 ఆయన "నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను" అన్నాడు.
\s5
\v 13 ఇంకా "నేను ఆయనలో నమ్మకముంచుతాను" అనీ "చూడు, నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ" అనీ అన్నాడు.
\v 14 ఆ పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి మరణబలం కలిగి ఉన్న వాణ్ణి అంటే సాతానుని ప్రభావ శూన్యంగా చేయడానికి యేసు కూడా ఆ రక్తమాంసాల్ని పంచుకున్నాడు.
\v 15 మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు.
\s5
\v 16 ఆయన ఖచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. కానీ అబ్రహాం సంతతి వారికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు.
\v 17 దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధానయాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకి క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరులలో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది.
\v 18 ఆయన తానే శ్రమలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనల నెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.
\s5
\c 3
\s దేవుని విశ్రాంతి (కుమారుడైన క్రీస్తు సేవకుడైన మోషేకన్నా గొప్పవాడు)
\p
\v 1 కాబట్టి, పరలోకసంబంధమైన పిలుపులో భాగస్వాములూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపోస్తులుడూ, ప్రధానయాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి.
\v 2 దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
\v 3 మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయనను యోగ్యుడిగా ఎంచారు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దానిని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం.
\v 4 ప్రతీ ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించినవాడు దేవుడే.
\s5
\v 5 మోషే నిజంగానే దేవుని ఇంట్లో నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు. ఈ సంగతి భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్ష్యంగా ఉంది.
\v 6 కానీ క్రీస్తు కుమారుడు కనుక దేవుని ఇంటికి నిర్వాహకుడిగా, బాధ్యుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మ ధైర్యాన్నీ, ఆ ధైర్యం వల్ల కలిగే అతిశయాన్నీ విడువకుండా ఉంటే మనమే ఆయన ఇల్లు.
\s హెచ్చరిక. ఈజిప్టు విడిచి వచ్చిన తరం అపనమ్మకం వల్లనే కనాను విశ్రాంతి లోకి ప్రవేశించలేక పోయారు
\s5
\p
\v 7 కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, "ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్లయితే
\v 8 అరణ్యంలో తీవ్రమైన పరీక్షలు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల వలె మీ హృదయాల్ని కఠినం చేసుకోవద్దు.
\s5
\v 9 నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను శోధించారు.
\v 10 కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను.
\v 11 కాబట్టి నేను కోపంతో 'వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాల్లో సత్యానికి దూరంగా ఉంటున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వాళ్ళు నా విశ్రాంతి లో ప్రవేశింపరని ప్రమాణం చేశాను'".
\s5
\v 12 సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసం తో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండా జాగ్రత్త పడండి.
\v 13 పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతీరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.
\s5
\v 14 ప్రారంభం నుండి చివరి వరకూ ఆయన పైని మనకున్న స్థిర విశ్వాసం పై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
\v 15 దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు "ఈ రోజే మీరు ఆయన మాట వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటులో చేసినట్లు మీ హృదయాల్ని కఠినం చేసుకోవద్దు"
\s5
\v 16 దేవుని మాటవిని కూడా తిరుగుబాటు చేసిందెవరు? ఐగుప్తులో నుండి మోషే బయటకు నడిపించిన వారందరే కదా!
\v 17 దేవుడు నలభై ఏళ్ళు ఎవరి మీద కోపపడ్డాడు? పాపం చేసిన వారి మీదే కదా! వారి మృతదేహాలు అరణ్యంలో పడి ఉన్నాయి
\v 18 తనకు అవిధేయులైన వారిని గూర్చి కాకుంటే తన విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు ఎవరిని ఉద్దేశించి ప్రమాణం చేశాడు?
\v 19 దీన్నిబట్టి, అవిశ్వాసం మూలానే వాళ్ళు ఆయన విశ్రాంతిలో ప్రవేశింపలేక పోయారని మనకు తెలుస్తుంది.
\s5
\c 4
\s విశ్వాసికి మరింత శ్రేష్టమైన విశ్రాంతి ఉంది
\p
\v 1 అందుచేత, 'దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం' అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా ఆ వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి.
\v 2 దేవుని విశ్రాంతిని గూర్చి ఇశ్రాయేలీయులకు ప్రకటన జరిగినట్లే మనకూ జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.
\s5
\v 3 భూమి ప్రారంభం అయినప్పట్నించీ సృష్టి పనులన్నీ ముగిసినా ఆయన ఇలా అన్నాడు. "నేను నా తీవ్ర ఆగ్రహంతో వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ప్రమాణం చేశాను". అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతి లో ప్రవేశిస్తాం.
\v 4 మరో చోట ఏడో దినం గూర్చి చెప్తూ "దేవుడు ఏడో రోజు తన పనులన్నీ ముగించి విశ్రాంతి తీసుకున్నాడు" అన్నాడు.
\v 5 తిరిగి "వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశింపరు" అని చెప్పాడు.
\s5
\v 6 దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది ఖచ్చితం కాబట్టీ, అనేకమంది ఇశ్రాయేలీయులు దేవుని విశ్రాంతిని గూర్చిన సువార్తను విన్నా తమ అవిధేయత కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు కాబట్టీ
\v 7 దేవుడు "ఈ దినం" అనే ఒక ప్రత్యేక రోజును నిర్ణయం చేశాడు. మొదట దీని గూర్చిన ప్రస్తావన జరిగిన చాలా కాలానికి, తిరిగి దావీదు ద్వారా ఆయన మాట్లాడినప్పుడు "ఈ దినం"ని ఆయన నిర్ధారణ చేశాడు . ఆయన ఇలా అన్నాడు, "మీరు మీ హృదయాల్ని కఠినపరచుకోకుండా నేడు ఆయన మాట వింటే మేలు"
\s5
\v 8 ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరో రోజు గూర్చి చెప్పేవాడు కాదు.
\s పరిపూర్ణ విమోచన లో విశ్వాసికి విశ్రాంతి
\p
\v 9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది.
\v 10 ఎందుకంటే దేవుడు తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.
\v 11 కాబట్టి, వాళ్ళలా అవిధేయతలో పడిపోకుండా, ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.
\s5
\v 12 ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైంది, క్రియాశీలకమైంది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనీ, కీళ్ళ నుండి మూలుగనీ విభజించ గలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలనూ ఉద్దేశాలనూ పరిశీలిస్తుంది.
\v 13 సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పచెప్పాల్సిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.
\s దేవుని కుమారుని కృప, కరుణ ద్వారా విశ్వాసికి విశ్రాంతి ఉంది
\s5
\p
\v 14 ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడూ, మన ప్రభువూ అయిన యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం.
\v 15 మన బలహీనతల పట్ల మన ప్రధాన యాజకుడికి సానుభూతి ఉంది. ఎందుకంటే ఆయన కూడా మనలాగే అన్ని విషయాల్లో పరీక్షలెదుర్కొన్నాడు. కానీ ఆయన పాపం లేని వాడు గా ఉన్నాడు.
\v 16 కాబట్టి మన అవసరాలలో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరకు వెళ్దాం.
\s5
\c 5
\s మన గొప్ప ప్రధాన యాజకుడు (1) అయన పని
\p
\v 1 దేవునికి సంబంధించిన పనులు చేయడానికీ, ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలనూ, బలులనూ అర్పించడానికీ, ప్రతీ ప్రధానయాజకుడి నియామకమూ ప్రజలలో నుండే జరుగుతుంది.
\v 2 అతడు అజ్ఞానుల విషయంలోనూ, దారితప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే తనకు కూడా అలాంటి బలహీనతలు ఉంటాయి కనుక.
\v 3 ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కొరకు కూడా అర్పించాల్సి ఉంటుంది.
\s5
\v 4 ఈ గొప్పదనాన్ని ఎవరూ తమకు తామే ఆపాదించుకునే వీలులేదు. అహరోనుకు ఉన్నట్టుగా దీనికి దేవుని ప్రత్యేక పిలుపు ఉండాలి.
\s (2) క్రీస్తు మెల్కీసెదేకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు
\p
\v 5 క్రీస్తు కూడా ప్రధానయాజకుడిగా వ్యవహరించి ఈ గౌరవాన్ని తనకు ఆపాదించుకోలేదు. కానీ దేవుడే ఆయనతో ఇలా అన్నాడు, "నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను."
\s5
\v 6 అలాగే మరోచోట ఆయన " నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి" అన్నాడు.
\s5
\v 7 ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్ధనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు ఆలకించాడు.
\v 8 ఆయన కుమారుడైఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు.
\s5
\v 9 మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధానయాజకుడిగా పిలిచి నియమించాడు.
\v 10 ఈ విధంగా ఆయన పరిపూర్ణుడయ్యాడు, తనకు విధేయులైన వారందరి శాశ్వత రక్షణకు కారణమయ్యాడు.
\s విజ్ఞప్తి, హెచ్చరిక
\p
\v 11 యేసును గూర్చి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు కనుక మీకు వివరించడం కష్టం.
\s5
\v 12 ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండాల్సింది కానీ దేవుని మాటలలోని ప్రాధమిక సూత్రాలను మరొకడు మీకు బోధించాల్సి వస్తుంది. మీరింకా పాలు తాగే దశ లోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు.
\v 13 కేవలం పాలు మాత్రమే తాగే ప్రతీవాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేనివాడుగా ఉంటాడు.
\v 14 దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ అనుభవం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీచెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.
\s5
\c 6
\p
\v 1 కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణితి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ,
\v 2 బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం.
\v 3 ఒకవేళ దేవుడు ఆదేశిస్తే వాటిని కూడా చేద్దాం.
\s5
\v 4 తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్దాత్మలో భాగం పొందినవారు
\v 5 దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు, ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం.
\v 6 ఎందుకంటే దేవుని కుమారుని వాళ్ళే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.
\s5
\v 7 ఇది ఎలాగంటే, తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసిన నేల, అదే నేలపై శ్రమిస్తున్న వారికి ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది.
\v 8 అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే వ్యర్ధమైనదని శాపాలు పెడతారు. చివరికి దానిని తగులబెడతారు.
\s5
\v 9 ప్రియమైన స్నేహితులారా, మేం ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితి లోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం.
\v 10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని పేరుకు మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు.
\s5
\v 11 మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, పూర్తి నమ్మకంతో ఇంతే శ్రద్ధతో చివరి వరకూ సాగుతారని ఎంతగానో ఆశిస్తున్నాం.
\v 12 మీరు మందకొడిగా ఉండాలని మేం కోరుకోవడంలేదు, విశ్వాసంతోనూ సహనంతోనూ వాగ్దానాల్ని వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.
\s (3) తెర లోపలికి ప్రవేశించిన మన ప్రధాన యాజకుడు మనల్ని కూడా ప్రవేశ పెడతాడు
\s5
\p
\v 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి "నా తోడు" అంటూ ప్రమాణం చేశాడు.
\v 14 "నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని విస్తారం చేస్తాను" అన్నాడు.
\v 15 ఈ విధంగా అబ్రాహాం సహనంతో వేచి ఉన్న తర్వాత దేవుడు తనకు వాగ్దానం చేసిన భూమిని పొందాడు.
\s5
\v 16 సాధారణంగా ప్రజలు తమ కంటే గొప్పవాడి "తోడు" అంటూ ప్రమాణం చేస్తారు. వారికున్న ప్రతి వివాదానికీ పరిష్కారం చూపేది ప్రమాణమే.
\v 17 వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు తన ప్రమాణాన్నే హామీగా ఇచ్చాడు.
\v 18 దేవుడు ఆబద్ధం ఆడలేని ఈ రెండు మార్పు చెందని విషయాల ద్వారా దీనిని చేశాడు. ఆశ్రయం కోరి పరుగు తీసే మనకు మన ముందు ఉన్న ఆశాభావాన్ని బలంగా పట్టుకోడానికి గట్టి ప్రోత్సాహం మనకి కలగాలని చేశాడు.
\s5
\v 19 ఈ ఆశాభావం మన ఆత్మలకు చెక్కుచెదరని, స్థిరమైన లంగరు వలే ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది.
\v 20 కలకాలం మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడైన యేసు మన తరుపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.
\s5
\c 7
\s (4) చరిత్ర పురుషుడైన మెల్కీసెదెకు క్రీస్తుకు ముంగుర్తు
\p
\v 1 రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రాహామును
\v 2 షాలేం పట్టణానికి రాజైన మెల్కీసెదెకు కలుసుకుని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను యుద్ధంలో పట్టుకున్న వాటిలో పదో వంతు అతనికి ఇచ్చాడు. "మెల్కీసెదెకు" అనే అతని పేరుకు నీతికి రాజు అనీ, ఇంకా "షాలేం రాజు", అంటే శాంతికి రాజు అనీ అర్థం.
\v 3 అతడు తండ్రి లేకుండానూ, తల్లి లేకుండానూ ఉన్నాడు. ఇతనికి పూర్వీకులంటూ ఎవరూ లేరు. ఇతని జీవిత కాలానికి ప్రారంభం లేదు. జీవితానికి అంతం అంటూ లేదు. దేవుని కుమారుడిలా ఇతను కలకాలం యాజకుడై ఉన్నాడు.
\s మెల్కిసెదేకు యాజకత్వం ఆహారోను యాజకత్వం కన్నా గొప్పది ఎందుకంటే ఆహారోను అబ్రాహాములో ఉండి మెల్కిసెదేకుకు పదవభాగం సమర్పించాడు
\s5
\p
\v 4 ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వీకుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువులలో పదోవంతు ఇతనికి ఇచ్చాడు.
\v 5 లేవి వంశస్తులలో నుండి యాజకులైన వారు, ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర పదో వంతును కానుకగా సేకరించాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.
\v 6 కానీ లేవితో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు కానుకలు స్వీకరించి అబ్రాహమును ఆశీర్వదించాడు.
\s5
\v 7 ఆశీర్వదించేవాడు అధికుడనీ దానిని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం.
\v 8 లేవి క్రమంలో యాజకుడై కానుక స్వీకరించేవాడు ఒకరోజు మరణిస్తాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు కలకాలం జీవిస్తూ ఉన్నట్టుగా వివరణ ఉంది.
\v 9 ఒకరకంగా చెప్పాలంటే పదోవంతు కానుకల్ని స్వీకరించిన లేవి తాను కూడా పదో వంతు కానుకలు ఇచ్చాడు.
\v 10 ఇది ఎలాగంటే, లేవి అబ్రాహాము నుండే రావాలి కాబట్టి, అబ్రాహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవి ఉన్నాడు.
\s అహరోను యాజకత్వం దేనినీ పరిపూర్ణం చేయదు
\s5
\p
\v 11 లేవీయులు యాజకులై ఉన్నప్పుడే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ యాజకుల వల్లనే పరిపూర్ణత కలిగిందీ అనుకుంటే లేవీయుడైన ఆహారోను క్రమంలో కాకుండా మెల్కీసెదెకు క్రమంలో వేరే యాజకుడు రావాల్సిన అవసరమేంటి?
\v 12 యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి.
\s5
\v 13 ప్రస్తుతం ఈ విషయాలన్నీ వేరే గోత్రంలో పుట్టిన వ్యక్తిని గూర్చి చెప్పుకుంటున్నాం. ఈ గోత్రం లో పుట్టిన వాళ్ళెవరూ బలిపీఠం వద్ద సేవ చేయలేదు.
\v 14 మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు.
\s5
\v 15 మెల్కీసెదెకు వంటి మరొక యాజకుడు వచ్చాడు కనుక మేం చెప్తున్నది మరింత స్పష్టమవుతూ ఉంది.
\v 16 ఈ కొత్త యాజకుడు ధర్మశాస్త్రం ప్రకారం వంశం ఆధారంగా రాలేదు. నాశనం కాలేని జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
\v 17 "నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి" అని లేఖనాలు ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి.
\s5
\v 18 ఈ విషయంలో ముందు వచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అది బలహీనంగానూ వ్యర్ధమైనదిగానూ ఉంది.
\v 19 ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణం చేయలేదు. భవిష్యత్తు గూర్చి అంత కంటె శ్రేష్ఠమైన ఆశాభావం మనల్ని దేవుని వద్దకు చేరుస్తూ ఉంది.
\s5
\v 20 ఈ శ్రేష్ఠమైన ఆశాభావం ప్రమాణం చేయకుండా కలగలేదు. ఇతర యాజకులైతే ప్రమాణం లేకుండానే యాజకులయ్యారు.
\v 21 అయితే యేసును గూర్చి మాట్లాడుతూ దేవుడు ఇలా ప్రమాణం చేశాడు. "నువ్వు కలకాలం యాజకుడిగా ఉంటావని దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన తన ఆలోచనను మార్చుకోడు."
\s5
\v 22 ఈ విధంగా మరింత శ్రేష్టమైన ఒప్పందానికి ఆయన పూచీ అయ్యాడు.
\s ఆహారోను వంశీకులు మరణించారు, క్రీస్తు శాశ్వతకాలం జీవిస్తున్నాడు
\p
\v 23 ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తర్వాత మరొకరుగా అనేకమంది యాజకులు అయ్యారు.
\v 24 యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పులేనిదిగా ఉంటుంది.
\s5
\v 25 కాబట్టి ఈయన తనద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారిని రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపుగా విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు.
\v 26 ఆయన పాపరహితుడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరియైనవాడు.
\s5
\v 27 ఇతర ప్రధాన యాజకులవలె ప్రతిదినం ముందు తన సొంత పాపాల కొరకు అర్పణలు అర్పింఛి తర్వాత ప్రజలకోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు.
\v 28 ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ప్రధాన యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన కలకాలం ఉండి పరిపూర్ణత పొందినవాడు.
\s5
\c 8
\s అహరోను వంశ యాజకులు నీడలకు, ఛాయలకు పరిచర్య చేసారు.
\p
\v 1 ఇప్పుడు మేం చెప్తున్న విషయంలో ముఖ్య అంశం ఇది. మనకో ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడి వేపున ఆసీనుడై ఉన్నాడు.
\v 2 మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.
\s5
\v 3 ప్రధానయాజకుణ్ణి కానుకలూ, బలులూ అర్పించాడానికీ నియమిస్తారు. కాబట్టి అర్పించడానికి ఈయన దగ్గర ఏదో ఒకటి ఉండాలి.
\v 4 ఇప్పుడు క్రీస్తు భూమి మీదే ఉంటే యాజకుడిగా ఉండలేడు. ఎందుకంటే భూమి మీద యాజకులందరూ ధర్మశాస్త్రం ప్రకారమే అర్పణలు అర్పిస్తున్నారు.
\v 5 మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు "పర్వతం పైన నీకు నేను చూపించిన నమూనా ప్రకారమే దానిని చేయాలి" అంటూ దేవుడు హెచ్చరించాడు. కాబట్టి యాజకులు సేవ చేస్తున్న గుడారం పరలోకంలో ఉండేవాటికి నకలు గానూ నీడ గానూ ఉంది.
\s క్రీస్తు మరింత శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి
\s5
\p
\v 6 కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్టమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్టమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు.
\s కొత్త నిబంధన పాత నిబంధన కన్నా శ్రేష్టమైనది
\p
\v 7 ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండో ఒప్పందానికి అవకాశం ఉండదు.
\s5
\v 8 ప్రజలలో దోషాలు కన్పించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు, "ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.
\v 9 ఐగుప్తు దేశం నుండి వాళ్ళ పూర్వీకుల్ని చేయి పట్టుకుని బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది. ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు. నేనూ ఇక వారిమీద మనస్సు పెట్టడం మానేశాను."
\s5
\v 10 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, "ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది. వారి మనస్సుల్లో నా శాసనాలు ఉంచుతాను. అలాగే వాళ్ళ హృదయాలపై వాటిని రాస్తాను. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను. వాళ్ళు నా ప్రజలై ఉంటారు.
\s5
\v 11 'ప్రభువుని తెలుసుకో' అంటూ వాళ్ళలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు. ఎందుకంటే చిన్నవాడి దగ్గరనుండి గొప్పవాడి వరకూ అందరూ నన్ను తెలుసుకుంటారు.
\v 12 నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను. వారి పాపాల్ని ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను."
\s5
\v 13 ఆయన 'కొత్త ఒప్పందం' అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. పాతదని ప్రకటన జరిగింది, అదృశ్యం కావడానికి సిద్ధంగా ఉంది.
\s5
\c 9
\s పాత నిబంధన నియమాలు, మందిరం కేవలం సాదృశ్యరూపాలే
\p
\v 1 మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి.
\v 2 ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
\s5
\v 3 ఇక రెండో తెర వెనుక మరో గది ఉంది. దీనిని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
\v 4 అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారంతొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన ఆహారోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి.
\v 5 "కరుణా పీఠం" అని పిలిచే మందసం మూత పైభాగాన తేజస్సు తో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు.
\s5
\v 6 వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారం లోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు.
\v 7 కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కొరకు బలి అర్పించి ఆ రక్తాన్ని చేత పుచ్చుకుని ప్రవేశిస్తాడు.
\s5
\v 8 దీనినిబట్టి, ఆ మొదటి గది ఉండగా అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గం వెల్లడి కాలేదని పరిశుద్ధాత్మ స్పష్టం చేస్తున్నాడు.
\v 9 ఆ గుడారం, ఈ కాలానికి ఒక ఉదాహరణగా ఉంది. ఈ అర్పణలూ కానుకలూ ఆరాధించే వ్యక్తి మనస్సాక్షిని ఉత్తమంగా చేయలేక పోయాయి.
\v 10 ఇవి అనేక రకాల ఆచార సంబంధమైన ప్రక్షాళనలకు అనుసంధానంగా ఉన్న ఆహార పానీయాలే. ఇవి నూతన వ్యవస్థ వచ్చేంత వరకూ నిలిచి ఉండే శరీర సంబంధమైన నియమాలు.
\s కొత్త నిబంధన మందిరం, బలులు వాస్తవాలు
\s5
\p
\v 11 అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పవిత్రమైనదీ, పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు.
\v 12 మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు అందరి శాశ్వత విమోచన కొరకు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు.
\s5
\v 13 ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన వారిని పవిత్రపరిస్తే
\v 14 ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనులనుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి!
\v 15 ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తి గా ఉన్నాడు. ఇలా ఎందుకంటే, మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి, ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది.
\s5
\v 16 ఎవరైనా వీలునామా వదిలి వెళ్తే, ఆ వ్యక్తి మరణించాడని నిరూపణ కావాలి.
\v 17 మరణం ఉంటేనే వీలునామా చెల్లుబడి అవుతుంది. దానిని రాసిన వాడు బతికి ఉండగా ఆ వీలునామా చెల్లదు.
\s5
\v 18 కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు.
\s కొత్త నిబంధన క్రీస్తు అంతిమ వీలునామా, ఆయన రక్తంతో ముద్ర వేసినది
\p
\v 19 మోషే కూడా ధర్మశాస్త్రం లోని అన్ని ఆదేశాలనూ ప్రజలకు వివరించిన తర్వాత కోడెదూడల, మేకల రక్తాన్ని నీళ్ళతో కలిపి ఎర్రని ఉన్నీ హిస్సోపు తో దానిని తీసుకుని ధర్మశాస్త్రం చుట్ట మీదా, ప్రజలందరి మీదా చిలకరించాడు.
\v 20 తర్వాత "ఇది ఒప్పందపు రక్తం. ఈ ఒప్పందం లోనే దేవుడు మీకు ధర్మశాస్త్రపు ఆదేశాలను ఇచ్చాడు" అని చెప్పాడు.
\s5
\v 21 అలాగే ఆ రక్తాన్ని, ఆరాధనా గుడారం పైనా, గుడారంలోని సేవకుపయోగించే పాత్రలన్నిటి పైనా చిలకరించాడు.
\v 22 ధర్మశాస్త్రం ప్రకారం, దాదాపు వస్తువులన్నీ రక్తం వల్ల శుద్ధి అవుతాయి. రక్తం చిందించకపోతే పాపాలకు క్షమాపణ కలుగదు.
\s పరలోక మందిరం మరింత శ్రేష్టమైన బలిద్వారా శుద్ధి అయింది
\s5
\p
\v 23 కాబట్టి పరలోకంలో ఉన్నవాటికి నకలుగా ఇక్కడ ఉన్నవి జంతుబలుల వల్ల శుద్ధి కావలసి ఉంది. అయితే అసలు పరలోకానికి సంబంధించినవి శుద్ధి కావాలంటే అంతకంటే శ్రేష్టమైన బలులు జరగాలి.
\v 24 అందుచేత చేతులతో నిర్మాణం జరిగి, నిజమైన దానికి నకలుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశింపలేదు, ప్రస్తుతం ఆయన మనందరి కొరకూ దేవుని సన్నిధిలో కనిపించడానికి ఏకంగా పరలోకంలోకే ప్రవేశించాడు.
\s 25 కొత్త నిబంధనలోని ఒకే బలి పాత నిబంధన లోని అనేక బలులకన్నా శ్రేష్టమైనది
\s5
\p
\v 25 అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతీ సంవత్సరం తనది కాని వేరే రక్తం తీసుకొని అతి పరిశుద్ధస్థలం లో ప్రవేశిస్తాడు. అయితే ఆయన పదే పదే తనను తాను అర్పించుకోడానికి అక్కడికి వెళ్ళలేదు.
\v 26 ఒకవేళ ఆయన పదేపదే అక్కడికి వెళ్ళాల్సి వస్తే భూమి ప్రారంభం నుండి ఆయన అనేకసార్లు హింస పొందాల్సి వచ్చేది. కానీ ఆయన ఈ కాలాంతంలో ప్రత్యక్షమై ఒకేసారి తనను తాను బలిగా అర్పించడం ద్వారా పాపాన్ని తీసివేశాడు.
\s5
\v 27 మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తర్వాత తీర్పు జరుగుతుంది.
\v 28 అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాలకోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.
\s5
\c 10
\p
\v 1 ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది భవిష్యత్తులో కలిగే శ్రేష్టమైన విషయాలకు ప్రతిబింబంలా ఉంది కానీ అది వాటి నిజ స్వరూపం కాదు. యాజకులు ప్రతీ సంవత్సరం అర్పించే ఒకేరకం బలుల ద్వారా ధర్మశాస్త్రం దేవుని దగ్గరకు వచ్చేవారిని పరిపూర్ణుల్ని చేయలేదు.
\v 2 ఒకవేళ అలా చేయగలిగితే ఇక ఆ బలులు అర్పించడం మానేస్తారు కదా! ఆరాధించేవారు శుద్దులైతే పాపానికి గూర్చిన స్పృహ వారికిక ఉండదు కదా!
\v 3 అయితే ఆ బలులు అర్పించడం వల్ల ప్రతీ సంవత్సరం పాపాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి.
\v 4 ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం.
\s5
\v 5 క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు. " నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు. కాని నాకో దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు.
\v 6 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు.
\v 7 అప్పుడు నేను నీతో ఇలా అన్నాను 'చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను.'"
\s5
\v 8 పైన చెప్పినట్టుగా ఆయన "నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, ధర్మశాస్త్రం ప్రకారం జరిగే వీటిలో నీకు సంతోషం ఉండదు" అన్నాడు.
\v 9 ఆ తర్వాత ఆయన "చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను" అని చెప్పాడు. రెండో ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు.
\v 10 ఈ రెండో ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది.
\s5
\v 11 ప్రతీ యాజకుడూ ప్రతీ రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎలానూ పాపాల్ని తీసివేయలేవు.
\v 12 కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు.
\v 13 తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారడానికి వేచి చూస్తూ ఉన్నాడు.
\v 14 శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు.
\s5
\v 15 దీనిని గురించి పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు.
\v 16 "'ఆ రోజులు గడిచిన తర్వాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే' అని ప్రభువు అంటున్నాడు. 'నా శాసనాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను. వాళ్ళ మనస్సులపై వాటిని రాస్తాను.'"
\s5
\v 17 తర్వాత ఆయన "వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను" అని అన్నాడు.
\v 18 ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పట్నించి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.
\s విశ్వాసి అతి పవిత్ర స్థలంలో ఆరాధిస్తాడు
\s5
\p
\v 19 కాబట్టి సోదరులారా యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనం ధైర్యం కలిగి ఉన్నాం.
\v 20 ఈ మార్గాన్ని ఆయనే తన దేహం ద్వారా తెరిచాడు. తెర గుండా వెళ్ళే ఈ మార్గం కొత్తదీ, సజీవమూ అయినది.
\v 21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక,
\v 22 విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, పరిశుద్ధమైన నీటితో కడిగిన శరీరంతో, యథార్ధమైన, కల్మషం లేని మనస్సాక్షి కలిగిన హృదయంతో దేవుణ్ణి సమీపిద్దాం.
\s5
\v 23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి అటూ ఇటూ ఊగకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.
\v 24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి.
\v 25 కొంత మంది సమావేశాలకు రావడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ రోజు దగ్గర పడటం చూస్తున్న మీరు ఒకరినొకరు ఎక్కువగా ప్రోత్సహించుకుంటూ ఉండండి.
\s చంచల బుద్ధికి వ్యతిరేకంగా హెచ్చరిక
\s5
\p
\v 26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తర్వాత కూడా మనం ఉద్దేశ పూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు.
\v 27 కానీ భయంతో తీర్పు కొరకు ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్నీ ఉంటుంది.
\s5
\v 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయా లేకుండా చంపుతారు.
\v 29 ఇలా ఉంటే దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసిన వాడికీ, తనను శుద్ధి చేసిన ఒప్పందపు రక్తాన్ని పనికిమాలినది గా ఎంచిన వాడికీ, కృపా ఆత్మను అవమానించిన వాడికీ ఎంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి!
\s5
\v 30 "ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను" అనీ అలాగే "ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు" అనీ చెప్పిన వాడు మనకు తెలుసు.
\v 31 సజీవుడైన దేవుని చేతిలో పడటం భయానకమైన విషయం.
\s5
\v 32 అయితే గతించిన రోజుల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తర్వాత ఎంత గొప్ప హింసనూ వేదననూ భరించారో జ్ఞాపకం చేసుకోండి.
\v 33 హింసలూ, అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరో వైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు.
\v 34 ఇదెలాగంటే, మీరు జైలులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్టమైన, కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తుల్ని ఇతరులు పట్టుకు పోతుంటే ఆనందంగా అంగీకరించారు.
\s5
\v 35 కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది.
\v 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తర్వాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి.
\v 37 "ఇక కొద్ది కాలం తర్వాత వస్తున్న వాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు.
\s5
\v 38 నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను."
\v 39 అయితే వినాశనం ఎదురైనప్పుడు మనం వెనక్కు తిరగం. కానీ ఆత్మను కాపాడుకోడానికి విశ్వాసం కలిగిన వారిలో ఉన్నాం.
\s5
\c 11
\s విశ్వాసమార్గం శ్రేష్టత (1) విశ్వాసం పరిథి
\p
\v 1 విశ్వాసం అంటే ఒక వ్యక్తి ఆశతో ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటిని గూర్చిన నమ్మకం.
\v 2 మన పూర్వీకులు తమ విశ్వాసం బట్టి దేవుని ఆమోదం పొందారు.
\v 3 విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్ధం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి, కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్ధం చేసుకుంటున్నాం.
\s (2) విశ్వాసం ఉదాహరణలు : హేబెలు
\s5
\p
\v 4 విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడటం జరిగింది. అతను తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.
\s హనోకు
\s5
\p
\v 5 విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. "దేవుడు తీసుకు వెళ్ళాడు కనుక అతడు కనిపించ లేదు" అని అతని గూర్చి చెప్పారు. దేవుడు తీసుకు వెళ్లక ముందు అతడు దేవుణ్ణి సంతోష పెట్టాడని చెప్పడం జరిగింది.
\v 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
\s నోవహు
\s5
\p
\v 7 విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.
\s అబ్రాహాము, శారా
\s5
\p
\v 8 దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు.
\v 9 విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశి గా నివసించాడు. అతడూ అతనితో కూడా వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకూ, యాకోబూ అనే వారు గుడారాల్లో నివసించారు.
\v 10 ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే వాస్తు శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు.
\s5
\v 11 విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా లు ఎంతో వృద్ధాప్యం లో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తిని పొందింది.
\v 12 అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్కించలేని వారసులు పుట్టుకొచ్చారు. వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల్లా, సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లా విస్తరించారు.
\s5
\v 13 వీళ్ళంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు.
\v 14 ఇలాంటి విషయాలు చెప్తున్న వాళ్ళు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
\s5
\v 15 ఒకవేళ వాళ్ళు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వాళ్లకు అవకాశం ఉంది.
\v 16 కానీ వాళ్ళు మరింత శ్రేష్టమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వాళ్ళ దేవుడినని చెప్పుకోడానికి సంకోచించడు.
\s5
\v 17 విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొన్నప్పుడు ఇస్సాకును బలిగా అర్పించాడు.
\v 18 "ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు" అని ఈ ఇస్సాకు ను గూర్చి చెప్పారు.
\v 19 దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలోనుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
\s ఇస్సాకు, యాకోబు
\s5
\p
\v 20 విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరుగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు.
\v 21 విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారుల్ని ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు.
\s యోసేపు
\p
\v 22 విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకల్ని వాళ్ళతో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
\s మోషే, అతని తల్లిదండ్రులు
\s5
\p
\v 23 విశ్వాసాన్ని బట్టి మోషే తలిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండటం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వాళ్ళు భయపడలేదు.
\v 24 విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడు అయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు.
\v 25 కొద్ది కాలం పాపం లోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసల్ని పంచుకోవడం మంచిదని తలచాడు.
\v 26 ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలుగబోయే బహుమానంపై ఉంచాడు.
\s5
\v 27 విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు.
\v 28 విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివల్ల ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రధమ సంతానాన్ని ముట్టుకోలేదు.
\s5
\v 29 విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వాళ్ళను మింగివేసింది.
\s యెహోషువ, ఇశ్రాయేలు
\p
\v 30 విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి.
\s రాహాబు
\p
\v 31 విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో కూడా నశించలేదు.
\s అనేకమంది విశ్వాస వీరులు
\s5
\p
\v 32 ఇంకేం చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు.
\v 33 విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.
\v 34 అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటుల్ని తప్పించుకున్నారు. అనారోగ్యం నుండి బాగయ్యారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు.
\s5
\v 35 స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు.
\v 36 ఇంకా కొందరు వెక్కిరింతల్నీ, కొరడా దెబ్బల్నీ సహించారు. నిజమే, సంకెళ్లనూ జైలునూ సైతం సహించారు.
\v 37 వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపంతో కోశారు. కత్తులతో చంపారు. గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాధల్లా, వేదన పడ్డ వారుగా ఉన్నారు. వీళ్ళను అమర్యాదగా చూశారు.
\v 38 అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు.
\s5
\v 39 వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందర్నీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వాళ్ళు పొందలేదు.
\v 40 మనం లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు. .
\s5
\c 12
\s యాజక విశ్వాసి నడత, ఆరాధన (1) ఆదర్శం యేసే
\p
\v 1 మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనల్ని కుంగదీసే ప్రతీ భారాన్నీ మనల్ని తేలిగ్గా సమస్యల్లో పడవేసే ప్రతీ పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.
\v 2 మన విశ్వాసానికి కర్తా దానిని సంపూర్ణం చేసే యేసు పైన మన చూపులు నిలుపుదాం. ఆయన తన ముందు ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
\s తండ్రి ఇచ్చే శిక్ష
\p
\v 3 మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండటానికి తనకు వ్యతిరేకంగా పాపులు విపరీతమైన ద్వేషంతో పలికిన మాటల్ని సహించిన ఆయన్ను గూర్చి ఆలోచించండి.
\s5
\v 4 మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.
\v 5 కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటల్ని మీరు మరచిపోయారు. " నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు."
\v 6 ప్రభువు తాను ప్రేమించే వాణ్ణి క్రమశిక్షణ లో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు.
\s5
\v 7 హింసల్ని క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు.
\v 8 కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్ధం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానం లాంటి వారన్న మాట.
\s5
\v 9 ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వాళ్ళను గౌరవించాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వానికి విధేయులంగా జీవించనక్కర్లేదా?
\v 10 మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్లుగా కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని దేవుడు మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి మన మంచి కొరకు మనకు శిక్షణనిస్తున్నాడు.
\v 11 అయితే ప్రతీ శిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తర్వాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది.
\s5
\v 12 కాబట్టి కిందకు జారిన మీ చేతుల్ని పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్లను తిరిగి బలపరచండి.
\v 13 కుంటికాలు ఉన్నవాడు మార్గం తప్పకుండా బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి.
\s5
\v 14 అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండటానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
\v 15 దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేకమందిని కలుషితం చేసే కాఠిన్యం అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి
\s యాజకత్వాన్ని కోల్పోవద్దని హెచ్చరిక
\p
\v 16 లైంగిక అవినీతిని సాగించేవారు కానీ ఒక్క పూట భోజనం కోసం తన జన్మహక్కును అమ్మి వేసుకున్న ఏశావులాంటి దైవభీతి లేనివాడు కానీ మీలో లేకుండా జాగ్రత్త పడండి.
\v 17 ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్ళతో శ్రద్ధగా వెదికినా తన తండ్రి దగ్గర పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు.
\s యాజక విశ్వాసి వచ్చేది సీనాయి కొండకు కాదు
\s5
\p
\v 18 చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతూ ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు.
\v 19 బాకా శబ్దమూ మాటలూ విని మీరు రాలేదు. "ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే, దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలి"
\v 20 అని ఆజ్ఞాపించిన, భయానకమైన ఆ మాటలు విన్నవారు ఆధ్వనిని భరించలేక ఇక తమతో ఎలాంటి మాటా చెప్పవద్దని వేడుకున్నారు.
\v 21 భయానకమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే "నేను ఎంతో భయపడి వణుకుతున్నాను" అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు.
\s5
\v 22 ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ, సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకు అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
\v 23 పరలోకంలో నమోదు అయిన ప్రముఖులందరి సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత చెందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.
\v 24 ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకూ, హేబేలు రక్తం కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకూ మీరు వచ్చారు.
\s సూచనలు, హెచ్చరికలు
\s5
\p
\v 25 మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వాళ్ళు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించే వాణ్ని తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?
\v 26 ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. "ఇంకా మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను."
\s5
\v 27 "మరోసారి" అనే మాట కదలనివి నిలిచి ఉండటానికై కదిలినవి అంటే దేవుడు సృష్టించిన వాటిని సమూలంగా తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది.
\v 28 కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం.
\v 29 ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.
\s5
\c 13
\p
\v 1 సోదరుల మధ్య ఉండే ప్రేమను కొనసాగించండి.
\v 2 అపరిచితుల్ని ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతల్ని ఆహ్వానించారు.
\s5
\v 3 జైలులో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా వాళ్ళతో జైలులో ఉన్నట్టూ, మీ శరీరాలు కూడా వాళ్ళ శరీరాల్లా కష్టాలు పడుతున్నట్లు తలచుకోండి.
\v 4 వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరుల్నీ, వ్యభిచారుల్నీ దేవుడు శిక్షిస్తాడు.
\s5
\v 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. "నిన్ను ఎన్నటికీ విడువను. నిన్ను విడిచి పెట్టను."అని దేవుడే చెప్పాడు.
\v 6 కాబట్టి "ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయ గలరు" అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.
\s5
\v 7 మీకు దేవుని మాటలు చెప్పిన వారినీ మిమ్మల్ని నడిపించిన వారినీ పట్టించుకోండి. వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించండి.
\v 8 యేసు క్రీస్తు నిన్న, నేడు, ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ, ఒకేలా ఉంటాడు.
\s5
\v 9 అనేక రకాలైన విచిత్రమైన బోధలకు తిరిగి పోకండి. తినే వాటిని బట్టి జీవించే వారికి అవేమీ సహాయపడవు. కాబట్టి మీ హృదయాలను కృప ద్వారా సుస్థిరం కానివ్వండి. భోజన అలవాట్లు, కట్టుబాట్లపై కాదు.
\s క్రైస్తవ ప్రత్యేకత, ఆరాధన
\p
\v 10 మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు.
\v 11 ఎందుకంటే పాప పరిహారం బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరానికి బయట కాల్చి వేస్తారు.
\s5
\v 12 కాబట్టి యేసు కూడా ప్రజల్ని తన రక్తం ద్వారా శుద్దీకరించడానికి పట్టణ ద్వారం బయట యాతనలు పొందాడు.
\v 13 కాబట్టి మనం ఆయన నిందను భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరకు వెళ్దాం.
\v 14 ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం.
\s యాజక విశ్వాసి అర్పించే బలులు
\s5
\p
\v 15 యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం.
\v 16 ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.
\s యాజక విశ్వాసి విధేయత
\p
\v 17 మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వాళ్ళు లెక్క అప్పచేప్పేవారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వాళ్ళు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారుగా ఉండటానికి వారికి లోబడండి. వాళ్ళు విచారంగా ఉండటం మీకు మేలుకరం కాదు.
\s ముగింపు, అపోస్తలిక ఆశీర్వచనం
\s5
\p
\v 18 అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మా కోసం ప్రార్ధించండి.
\v 19 మీ దగ్గరకు త్వరలో తిరిగి రాగలిగేలా మరింత ప్రార్ధించాలని కోరుతున్నాను.
\s5
\v 20 గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య ఒప్పందపు రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలోనుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు
\v 21 ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక! తన దృష్టిలో ప్రీతికరమైన దానిని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక! ఆ యేసు క్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమెన్.
\s5
\v 22 సోదరులారా మీకు సంక్షిప్తంగా రాసిన ఈ ప్రోత్సాహపు మాటను సహించమని కోరుతున్నాను.
\v 23 మన సోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరగా వస్తే అతనితో కలసి మిమ్మల్ని చూస్తాను.
\s5
\v 24 మీ అధికారులందరికీ పరిశుద్దులందరికీ శుభాకాంక్షలు తెలియజేయండి. ఇటలీ లో ఉన్నవారు మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
\v 25 మీకందరికీ కృప తోడై ఉంటుంది గాక!

221
60-JAS.usfm Normal file
View File

@ -0,0 +1,221 @@
\id JAS James
\s5
\c 1
\s విశ్వాసానికి పరీక్షలు (పరీక్షల ఉద్దేశం)
\p
\v 1 దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి రాస్తున్నది.
\v 2 నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకొని
\v 3 అనేక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దానిని ఆనందంగా భావించండి.
\s5
\v 4 ఓర్పును తన కార్యం సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు.
\v 5 మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు.
\s5
\v 6 కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు.
\v 7 అలాంటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు.
\v 8 చంచలమైన మనస్సు గలవాడు నిలకడ లేనివాడు.
\s5
\v 9 పేద సోదరుడు తనకు కలిగిన ఘనతను బట్టి సంతోషించాలి. ధనవంతుడైన సోదరుడు, తన తగ్గింపును బట్టి
\v 10 తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతాడని తెలిసి, సంతోషించాలి
\v 11 సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు.
\s5
\v 12 పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరువాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతను పొందుతాడు.
\s చెడు చేయాలనే ప్రేరణ దేవుని నుంచి కలిగేది కాదు
\p
\v 13 చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, "ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది," అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు. అలాంటి ప్రేరేపణ దేవుడు ఎవరికీ కలిగించడు.
\s5
\v 14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన ప్రేరేపణ బట్టి ఆకర్షణకు గురై నాశనం అవుతాడు.
\v 15 పాపపు ప్రేరణ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.
\v 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి.
\s5
\v 17 ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.
\v 18 దేవుడు, తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జీవం ఇవ్వడానికి మనల్ని ఎన్నుకున్నాడు.
\s5
\v 19 నా ప్రియ సోదరులారా, ప్రతివాడూ వినడానికి తొందరపడాలి. మాట్లాడడానికీ, కోపం చూపించడానికీ, నిదానించాలి. ఇది మీకు తెలుసు.
\v 20 ఎందుకంటే, మనిషి కోపం, దేవుని నీతిని సాధించదు.
\v 21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి, మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును స్వీకరిం చండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.
\s విధేయతకు పరీక్ష
\s5
\p
\v 22 వాక్యానికి విధేయులుగా ఉండండి. వాక్యం వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.
\v 23 ఎవరైనా వాక్యం విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగాచూసుకునే వాడిలా ఉంటాడు.
\v 24 అతడు తన మొహం పరిశీలనగా చూసుకొని, బయటకు వెళ్ళిన తరువాత తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు.
\v 25 స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చూస్తూ, దానికి విధేయుడుగా ఉంటూ, విని మరిచి పోయేవాడుగా ఉండని వాడు తాను చేస్తున్న దాన్ని బట్టి దీవెన పొందుతాడు.
\s నిజమైన భక్తికి పరీక్ష
\s5
\p
\v 26 తాను భక్తిపరుణ్ణి, అని చెప్పుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్ధం.
\v 27 తండ్రి లేని వారికి, వితంతువులకు, వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.
\s5
\c 2
\s సోదర ప్రేమకు పరీక్ష
\p
\v 1 నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తు విశ్వాసం విషయంలో పక్షపాతం లేకుండా ఉండండి.
\v 2 బంగారు ఉంగరాలు పెట్టుకొని, ఖరీదైన బట్టలు వేసుకొన్నవాడొకడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వస్తే,
\v 3 మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాని మీద ఉంచి, "దయచేసి ఈ మంచి చోట కూర్చోండి," అని చెప్పి, పేదవానితో "నువ్వు అక్కడ నిలబడు," లేదా "నా కాళ్ళ దగ్గర కూర్చో," అంటే,
\v 4 మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని తేడా చూపుతున్నట్టే కదా?
\s5
\v 5 నా ప్రియ సోదరులారా, వినండి. ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?
\v 6 మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ, ధనవంతులు కాదా?
\v 7 మిమ్మల్ని పిలిచిన వాని మంచి పేరు, ఈ ధనవంతుల వల్లే కదా దూషణకు గురౌతున్నది?
\s5
\v 8 "నిన్ను ప్రేమించుకున్నట్టే, నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు," అని లేఖనాల్లో రాసి ఉన్న రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే.
\v 9 కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రం ద్వారా నిర్ధారణ అవుతుంది.
\s5
\v 10 ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, తాను ఆజ్ఞలన్నీ మీరిన అపరాధి అవుతాడు.
\v 11 "వ్యభిచారం చెయ్యవద్దు," అని చెప్పిన దేవుడు "హత్య చెయ్యవద్దు," అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రం మీరినట్టే.
\s5
\v 12 నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్ర విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి.
\v 13 కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.
\s సత్క్రియలకు పరీక్ష
\s5
\p
\v 14 నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?
\v 15 ఒక సోదరునికిగాని, సోదరికిగాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే,
\v 16 మీలో ఒకడు అలాటి వాళ్ళతో "శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను," అని చెబితే ఏం ప్రయోజనం?
\v 17 అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటీ ఉంటే, అది చచ్చినదే.
\s5
\v 18 అయినా ఒకడు, "నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి," అనవచ్చు. క్రియలు లేని విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియలతో కూడిన విశ్వాసం చూపిస్తాను.
\v 19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కాని దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.
\v 20 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?
\s అబ్రాహాము ఉదాహరణ (రోమా 4: 1- 25)
\s5
\p
\v 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా?
\v 22 అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం దాని ఉద్దేశం నేరవేర్చింది.
\v 23 "అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అందుకు దేవుడు అతణ్ణి నీతిమంతుడుగా ఎంచాడు," అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.
\v 24 మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూసారు.
\s5
\v 25 అలానే వేశ్య రాహాబు కూడా వార్త తెచ్చిన వాళ్ళని ఆహ్వానించి వేరొక మార్గంలో వాళ్ళని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమెను నీతిమంతురాలని ఎంచారు గదా?
\v 26 ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.
\s5
\c 3
\s నిజమైన విశ్వాసం నాలుకను అదుపులో ఉంచుతుంది
\p
\v 1 నా సోదరులారా, మీలో ఎక్కువమంది ఉపదేశం చేసేవాళ్ళుగా ఉండకండి. ఉపదేశకులమైన మనకు కఠినమైన తీర్పు ఉంది.
\v 2 మనమందరం అనేక విషయాలలో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేని వాడిగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు.
\s5
\v 3 గుర్రాలు మనకు లోబడడానికి నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా!
\v 4 ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు.
\s5
\v 5 అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, గొప్ప ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి!
\v 6 నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగులబెడుతుంది. తరువాత నరకాగ్నికి గురై కాలిపోతుంది.
\s5
\v 7 అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా.
\v 8 కాని, మనుషులలో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నారు. అది విశ్రమించని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది.
\s5
\v 9 నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం.
\v 10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం, రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు.
\s5
\v 11 ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా?
\v 12 నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరపు పళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.
\s5
\v 13 మీలో, జ్ఞానం, గ్రహింపు, ఉన్నవాడు ఎవడు? అలాంటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి.
\v 14 కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, స్వార్ధంతో కూడిన ఆశయం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి.
\s5
\v 15 ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.
\v 16 ఎక్కడైతే అసూయ, స్వార్ధంతో కూడిన ఆశయాలు ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి.
\v 17 అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రంగా ఉండేది. అది శాంతిని కాంక్షించేది, మృదువుగా ఉండేది, ప్రేమతో నిండిన హృదయం కలిగింది, కనికరంతో మంచి ఫలాలతో నిండింది, పక్షపాతం లేకుండా నిజాయితీ కలిగింది.
\v 18 శాంతిని చేకూర్చేవాళ్ళు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.
\s5
\c 4
\s లోకరీతి ప్రవర్తనకు మందలింపు
\p
\v 1 మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడనుంచి వస్తున్నాయి? సహ విశ్వాసుల మధ్య కలహాలకు కారణమైన మీ దురాశల నుంచి కాదా?
\v 2 మీరు ఎంతో కోరుకుంటారు గానీ మీకు దక్కడం లేదు. మీరు పొందలేని దాని వెనకాల పరుగు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందలేరు.
\v 3 మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసమే చెడు ఉద్దేశాలతో అడుగుతారు.
\s5
\v 4 కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
\v 5 ఆయన మనలో ఉంచిన ఆత్మ అసూయ పడేంతగా మనల్ని కోరుకుంటాడు అని లేఖనం చెప్తున్నది. ఆ లేఖనం వ్యర్ధం అనుకుంటున్నారా?
\s5
\v 6 కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే 'దేవుడు గర్వించే వారిని అడ్డుకుంటాడు. దీనంగా ఉండేవారికి కృపను అనుగ్రహిస్తాడు' అని లేఖనం చెప్తున్నది.
\v 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానుని వ్యతిరేకించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
\s5
\v 8 దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతుల్ని పరిశుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి.
\v 9 వేదన పడండి. ఏడవండి, విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి.
\v 10 ప్రభువు ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
\s5
\v 11 సోదరులారా, మీలో ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడటం లేదని అర్ధం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్ధం.
\v 12 ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు?
\s5
\v 13 "ఈ రోజో, రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం" అనుకునే వారికి ఒక మాట.
\v 14 రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరి లాంటిది.
\s5
\v 15 కాబట్టి మీరు "ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఫలానా పనులు చేద్దాం" అనుకోవాలి.
\v 16 ఇప్పుడైతే మీరు మీ ప్రణాళికలను బట్టి ఎంతో గర్విస్తున్నారు. ఈ గర్వం చెడ్డది.
\v 17 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
\s5
\c 5
\s ధనికులకు హెచ్చరిక
\p
\v 1 ధనవంతులారా, మీమీదికి వచ్చే దుర్దశను తలుచుకుని విలపించండి.
\v 2 మీ సిరిసంపదలు చెడిపోయాయి. మీ బట్టలు చిమ్మటలు కొట్టేస్తున్నాయి.
\v 3 మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు అంత్యదినాల్లో ధనం పోగు చేసుకున్నారు.
\s5
\v 4 మీ చేను కోసిన పనివారికి సమయానికి ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపనివారి ఆక్రందనలు సేనల ప్రభువు అయిన దేవుని ప్రభువు చెవిని బడుతున్నాయి.
\v 5 మీరు భూమి మీద సుఖంగా బ్రతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు.
\v 6 మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపుతారు.
\s ప్రభువు రాకడను పురస్కరించుకుని హెచ్చరికలు
\s5
\p
\v 7 సోదరులారా, ప్రభువు రాక వరకు ఓపికగా ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా.
\v 8 ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.
\s5
\v 9 సోదరులారా, ఒకని మీద ఒకడు సణుగుకోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు.
\v 10 నా సోదరులారా, ప్రభువు పేరున బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి.
\v 11 సహనం గల వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.
\s5
\v 12 నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు 'అవునంటే అవును కాదంటే కాదు' అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.
\s5
\v 13 మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.
\v 14 మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి; వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.
\v 15 విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.
\s5
\v 16 మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి; ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయుడి, అప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. నీతిమంతుని విజ్ఞాపనకు వచ్చే ఫలితం అపారం. అది ఎంతో బలవత్తరమైనది.
\v 17 ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవ లేదు.
\v 18 అతడు ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.
\s5
\v 19 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్లించినట్టయితే
\v 20 అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్లించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

233
61-1PE.usfm Normal file
View File

@ -0,0 +1,233 @@
\id 1PE 1 Peter
\s5
\c 1
\s క్రైస్తవులకు వాటిల్లే హింసలు, వారి ప్రవర్తన
\p
\v 1 యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు, పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాలలో చెదిరిపోయి పరదేశులుగా బతుకుతున్న వారికి శుభమని చెప్పి రాస్తున్నది.
\v 2 తండ్రి అయిన దేవుని భవిష్యద్‌ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొంది యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన మీపై కృప నిలిచి ఉండు గాక. మీకు సమాధానం విస్తరించు గాక.
\s5
\v 3 మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు.
\v 4 దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో భద్రంగా ఉండేది.
\v 5 ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.
\s5
\v 6 రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా మీరు ఆనందిస్తున్నారు.
\v 7 నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటె విలువైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది.
\s5
\v 8 మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ, మీ విశ్వాసానికి ఫలాన్ని,
\v 9 అంటే మీ ఆత్మల రక్షణ పొందుతూ, మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.
\v 10 మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు.
\s5
\v 11 రాబోయే రక్షణ ఎలాంటిదో వాళ్ళు తెలిసి కోవాలని ఎదురు చూశారు. తమలోని క్రీస్తు ఆత్మ, తమకు సూచిస్తూ వచ్చిన కాలాన్ని గురించి విచారించి పరిశోధించారు. క్రీస్తు బాధల గురించీ వాటి తరువాత రాబోయే గొప్పతనం గురించీ ఆత్మ ముందుగానే తెలియచేసినట్టుగానే జరుగుతూ ఉంది.
\v 12 పరలోకం నుండి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు శుభవార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి దేవుడు వారికి వెల్లడించాడు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు.
\s5
\v 13 కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపలో సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
\v 14 విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు.
\s5
\v 15 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతట్లో పరిశుద్ధులై ఉండండి.
\v 16 ఎందుకంటే "నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి" అని రాసి ఉంది.
\v 17 ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు "తండ్రీ" అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.
\s5
\v 18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వత వస్తువులతో కాదు,
\v 19 అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.
\s5
\v 20 విశ్వం ఉనికి లోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. చివరి రోజుల్లోనే మీ కోసం ఆయన ప్రత్యక్ష మయ్యాడు.
\v 21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.
\s5
\p
\v 22 యథార్ధమైన సోదర ప్రేమ కోసం సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనస్సుల్ని పవిత్రపరచుకున్నారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.
\v 23 మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్యం ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు.
\q1
\s5
\v 24 ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండి పోతుంది. పువ్వు రాలిపోతుంది
\p
\v 25 గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
\p ఈ సందేశమే మీకు శుభవార్తగా ప్రకటించడం జరిగింది.
\s5
\c 2
\p
\v 1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి
\v 2 అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి.
\v 3 కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాల కోసం అశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు.
\s5
\v 4 మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకొన్నదీ విలువైనదీ అయిన సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరకు రండి.
\v 5 ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా కూడా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమయిన ఆత్మ సంబంధమైన బలుల్ని అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.
\q1
\s5
\v 6 లేఖనంలో ఇలా రాసి ఉంది.
\q1 "నేను సీయోనులొ మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.
\q1 ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు."
\q1
\s5
\v 7 అయితే, విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. "ఇల్లు కట్టే వాళ్ళు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది."
\q1 అది "అడ్డురాయి, అడ్డుబండ అయింది."
\q1
\v 8 వారు వాక్యానికి అవిధేయులై తొట్రుబడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.
\s విశ్వాసికి ఉన్న ఏడు విధాల స్థితిని బట్టీ, విశ్వాసికి బదులుగా క్రీస్తు పడిన హింసలను బట్టీ విశ్వాసి జీవితం
\s5
\p
\v 9 చీకటిలో నుండి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికయిన వంశమూ రాచరిక యాజక బృందమూ పరిశుద్ధ రాజ్యమూ దేవుని సొత్తయిన జనంగా ఉన్నారు.
\q1
\v 10 ఒకప్పుడు మీరు ప్రజ కాదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజ. పూర్వం మీరు కనికరం పొందలేదు, అయితే ఇప్పుడు కనికరం పొందారు.
\s5
\p
\v 11 ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని చెబుతున్నాను.
\v 12 యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వాళ్ళు మీ మంచి పనులు చూసి, దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమ పరచేలా, వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి.
\s5
\v 13 ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి.
\v 14 రాజు అందరికీ అధిపతి అనీ, అధికారులు దుర్మార్గుల్ని శిక్షించడానికీ, మంచి వాళ్ళని మెచ్చుకోడానికీ, ఆయన పంపిన వారనీ వారికి లోబడి ఉండండి.
\v 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.
\v 16 స్వేచ్ఛ పొందిన వారిగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
\v 17 అందరినీ గౌరవించండి. తోటి సోదరుల్ని ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును గౌరవించండి.
\s5
\v 18 సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.
\v 19 ఎవరయినా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే, అది గొప్ప విషయం.
\v 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే దేవుడు మెచ్చుకుంటాడు.
\s5
\v 21 దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడ మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్లి పోయాడు.
\q
\v 22 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.
\q1 ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
\q1
\v 23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.
\q1 ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు.
\s5
\p
\v 24 మనకు పాపాలలో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.
\v 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరకు తిరిగి వచ్చారు.
\s5
\c 3
\p
\v 1 భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి.
\v 2 అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువుకోసం సంపాదిస్తుంది. ఎందుకంటే గౌరవంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వాళ్ళు చూసి ఉంటారు.
\s5
\v 3 బాహ్య అలంకారాలు, జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదయిన బట్టలు, అనేవి మీకు వద్దు.
\v 4 వాటికి బదులు, హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువయినది.
\s5
\v 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వాళ్ళు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు.
\v 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. మీరు ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆమె పిల్లలవుతారు.
\s5
\p
\v 7 అలాగే భర్తలైన మీరు, జీవితమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు.
\s5
\v 8 చివరికి మీరంతా మనస్సులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నిత మనస్సుతో వినయంతో ఉండండి.
\v 9 కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
\s5
\v 10 జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవుల్నీ కాచుకోవాలి.
\v 11 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెదకి అనుసరించాలి.
\v 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం, చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
\s5
\p
\v 13 మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
\v 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.
\s5
\v 15 దానికి బదులు, మీ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకెందుకు అంత నమ్మకం అని అడిగే ప్రతివానికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
\v 16 మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అవమానించే వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు.
\v 17 కీడు చేసి బాధ పడడం కంటె మేలు చేసి బాధ పడడాన్ని దేవుడు అనుమతిస్తే, అదే చాలా మంచిది.
\s క్రీస్తు ఆత్మ నోవహు దినాల్లో ప్రకటించడం
\s5
\p
\v 18 క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనల్ని దేవుని దగ్గరకు తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయన్ని శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.
\v 19 ఇప్పుడు చెరసాలలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగా వెళ్లి ప్రకటించాడు.
\v 20 ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘ శాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.
\s5
\v 21 దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటిమీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవుని పట్ల మంచి మనస్సాక్షి నుంచి వచ్చే అభ్యర్ధనే.
\v 22 ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, అధికారాలు, అన్నీ ఆయనకు లోబడాలి.
\s5
\c 4
\p
\v 1 క్రీస్తు శరీర రీతిగా చనిపోయాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి.
\v 2 దేహంలో చనిపోయిన వాడు పాపం చేయడం మానేస్తాడు. ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు.
\s5
\v 3 యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు, లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, దురాశలూ, మద్యపానం, అల్లర చిల్లర వినోదాలూ, విచ్చలవిడి విందులూ, హేయమైన విగ్రహ పూజలూ చేశారు.
\v 4 వారితో పాటుగా మీరూ ఇలాటిపనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వాళ్ళు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.
\v 5 బతికున్న వాళ్ళకీ చనిపోయిన వాళ్ళకీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వాళ్ళు లెక్క అప్పచెప్పాలి.
\v 6 అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా శుభవార్త ప్రకటించారు.
\s5
\p
\v 7 అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మీరు వివేచనతో ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి.
\v 8 అన్నిటి కంటె ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.
\v 9 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి.
\s5
\v 10 దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరం పొంది వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
\v 11 ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌.
\s5
\p
\v 12 ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
\v 13 క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో సంతోషించేలా, క్రీస్తు పడిన హింసల్లో మీరు పాలివారై ఉన్నంతగా ఆనందించండి.
\v 14 క్రీస్తు పేరును బట్టి మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అంటే దేవుని ఆత్మ, మీమీద నిలిచి ఉన్నాడు.
\s5
\v 15 మీలో ఎవడూ హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోయే వాడుగా బాధ అనుభవించకూడదు.
\v 16 ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాల్సి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుని మహిమ పరచాలి.
\s5
\v 17 దేవుని ఇంట్లో వాళ్ళకి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని శుభవార్తకు లోబడని వారి గతేంటి?
\v 18 నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి?
\v 19 కాబట్టి దేవుని చిత్తప్రకారం బాధపడే వాళ్ళు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి.
\s5
\c 5
\s ప్రధాన కాపరి తిరిగి రానైయున్నందువల్ల క్రైస్తవ సేవ ఎలా ఉండాలి
\p
\v 1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
\v 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు ఇష్టపడేలా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి.
\v 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి.
\v 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.
\s5
\v 5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి సేవ చేసుకోండి.
\q1 దేవుడు గర్విష్టుల్ని ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు.
\q1
\v 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
\p
\v 7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.
\s5
\v 8 నిబ్బరమైన బుద్ధి గలిగి మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
\v 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
\s5
\v 10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు, కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు.
\v 11 ఆయనకే ప్రభావం ఎప్పటికీ కలుగు గాక. ఆమేన్‌.
\s5
\v 12 సిల్వాను నా నమ్మకమైన సోదరుడని ఎంచి, అతని సాయంతో క్లుప్తంగా రాశాను. నేను రాసిందే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీనిలో నిలకడగా ఉండండి.
\v 13 బబులోను పట్టణం లో ఉన్న ఆమె, (మీతో పాటు దేవుడు ఎన్నుకున్న ఆమె) మీకు అభినందనలు చెబుతున్నారు. నా కుమారుడు మార్కు, మీకు అభినందనలు చెబుతున్నాడు.
\v 14 ప్రేమ ముద్దుతో ఒకనికి ఒకడు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగు గాక.

144
62-2PE.usfm Normal file
View File

@ -0,0 +1,144 @@
\id 2PE
\mt 2 పేతురు
\s5
\c 1
\s గొప్ప క్రైస్తవ సుగుణాలు
\p
\v 1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని స్వీకరించిన వాళ్ళకు రాస్తున్న సంగతులు.
\v 2 దేవునిలో, మన ప్రభువైన యేసులో, పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరిస్తాయి గాక!
\s5
\p
\v 3 తన మహిమను బట్టి, మంచి గుణాన్నిబట్టి, మనల్ని పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా, మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు.
\v 4 వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా, దుష్టమైన ఆశలతో నిండిన ఈ లోకపు చెడుతనం నుండి తప్పించుకొని మీరు తన స్వభావాన్ని పంచుకోవాలన్నదే దేవుని ఉద్దేశం.
\s5
\v 5 ఈ కారణంగా మీరు పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి, మీ విశ్వాసంతో పాటు మంచి గుణం, మంచి గుణంలో జ్ఞానం,
\v 6 జ్ఞానంతో పాటు ఆశల అదుపు, ఆశల అదుపులో ఓర్పు, ఓర్పులో భక్తి,
\v 7 భక్తితో పాటు దయ, దయలో ప్రేమ కలిగి ఉండండి.
\s5
\v 8 ఇవి మీలో నిలిచి ఉండి వృద్ధి చెందినపుడు, మన ప్రభు యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో మందకొడిగా, నిష్ఫలంగా ఉండరు.
\v 9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలను దేవుడు క్షమించాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు.
\s5
\v 10 కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు.
\v 11 దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది.
\s5
\p
\v 12 వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా, ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను.
\v 13 నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకు ఇవి మీకు గుర్తుచేయడం మంచిదని భావిస్తున్నాను.
\v 14 మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు.
\v 15 నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
\s లేఖనాల ఘనత
\s5
\p
\v 16 ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తి, ఆయన రాకడ గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వాళ్ళంగా చెప్పాం.
\v 17 ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు,
\v 18 ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం.
\s5
\p
\v 19 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యం చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు గ్రహిస్తే మీకు మేలు.
\v 20 లేఖనాల్లో రాసిన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి.
\v 21 ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలోనుండి పుట్టలేదు, పవిత్రాత్మతో నిండిన మనుషులు మాట్లాడగా వచ్చింది.
\s5
\c 2
\s భ్రష్ట బోధకుల గురించి హెచ్చరికలు- వారు రక్తబలి మూలమైన విమోచనను తిరస్కరిస్తారు
\p
\v 1 ఇదివరకు ఇశ్రాయేలీయులలో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వాళ్ళు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా కొట్టిపారేస్తారు. దాని ద్వారా తమ పైకి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు.
\v 2 వారి నాశనానికి నడిపే మార్గాలలో అనేకమంది నడుస్తారు. వాళ్ళవల్ల సత్యమార్గానికి అపకీర్తి వస్తుంది.
\v 3 ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కధలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వాళ్లకు విధించిన శిక్ష పూర్వకాలం నుండి వాళ్ళకోసం సిద్ధంగా ఉంది. వాళ్ళ నాశనం నిద్రపోదు.
\s5
\p
\v 4 పూర్వం పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా దేవుడు వాళ్ళను సంకెళ్లకు అప్పగించి నరకంలో దట్టమైన చీకటిలో తీర్పు వరకు ఉంచాడు.
\v 5 అలాగే దేవుడు పూర్వకాలపు లోకాన్ని కూడా విడిచిపెట్టకుండా, నీతిని ప్రకటించిన నోవహును, మిగతా ఏడుగురిని కాపాడి, దైవభక్తిలేని ప్రజల మీదికి జల ప్రళయం రప్పించాడు.
\v 6 దైవ భక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు, సొదొమ, గొమొర్ర పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు.
\s5
\v 7 దైవభయం లేని దుర్మార్గుల లైంగిక వికార ప్రవర్తన చేత మనస్తాపానికి గురైన నీతిమంతుడైన లోతును రక్షించాడు.
\v 8 దిన దినం ఆ దుర్మార్గుల మధ్య ఉంటూ, వాళ్ళు చేసే అక్రమమైన పనులు చూస్తూ, వింటూ, నీతిగల అతని మనస్సు దుఃఖిస్తూ ఉండేది.
\v 9 ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గుల్ని ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు.
\s5
\p
\v 10 ముఖ్యంగా ప్రభుత్వాన్ని త్రోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశల్ని తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వాళ్ళ విషయంలో ఇది నిజం.
\v 11 దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వాళ్ళను దూషించి వాళ్ళ మీద నేరం మోపడానికి భయపడతారు.
\s5
\v 12 వారైతే తమకు తెలియని సంగతులను గురించి దూషిస్తారు. పశుప్రవృత్తి గల ఈ ప్రజలు బంధకాలకు, చావుకు, నాశనానికి తగినవారు. వారు తమ దుర్మార్గత వల్ల పూర్తిగా నశించిపోతారు.
\v 13 వారి చెడుతనానికి ప్రతిఫలంగా వాళ్లకు హాని కలుగుతుంది. వాళ్ళు పట్టపగలు సుఖభోగాలలో ఉంటారు. మచ్చలుగా, కళంకాలుగా ఉంటారు. వాళ్ళు, మీతో కూడా విందులలో పాల్గొంటూనే తమ భోగాలలో సుఖిస్తూ ఉంటారు.
\v 14 వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేనివారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారు శాపానికి గురైన ప్రజలు. వాళ్ళ హృదయాలు ఎప్పుడూ దోచుకొనేందుకే సిద్ధంగా ఉంటాయి.
\s భ్రష్ట బోధకులు బిలాము వంటి వారు
\s5
\p
\v 15 వాళ్ళు, అవినీతికి ప్రతిఫలం పొందడానికి ఆశపడిన బెయోరు కుమారుడు బిలామును అనుసరించి తప్పిపోయారు. సక్రమ మార్గాన్ని వదిలిపెట్టారు.
\v 16 కాని, బిలాము చేసిన తప్పుకు మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా అతన్ని గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.
\s వారు ఆత్మలో దివాలాకోరులు
\s5
\p
\v 17 ఈ మనుషులు నీళ్ళులేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే మేఘాల వంటి వాళ్ళు. గాడాంధకారం వీళ్ళ కోసం సిద్ధంగా ఉంది.
\s వారు డంబాలు పలుకుతారు
\p
\v 18 వాళ్ళు మితిమీరి గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు శరీర సంబంధమైన చెడు ఆశలు కలిగి, చెడు మార్గం నుండి అప్పుడే తప్పించుకున్న వాళ్ళని తమ పోకిరి పనులతో వెనుదిరిగేలా ప్రేరేపిస్తారు.
\s వారిది విచ్చలవిడి బ్రతుకు
\p
\v 19 వాళ్ళే స్వయంగా దుర్నీతికి బానిసలై ఉండి, ఇతరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తారు. ఒక వ్యక్తిని ఏది జయిస్తుందో దానికి అతడు బానిస అవుతాడు.
\s5
\p
\v 20 ఎవరైనా ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు విషయంలో అనుభవజ్ఞానం వల్ల ఈ లోకపు అపవిత్రతను తప్పించుకొన్న తరువాత దానిలో మరలా ఇరుక్కొని దాని వశమైతే, వారి మొదటి స్థితి కన్నా చివరి స్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది.
\v 21 వారు, నీతి మార్గాన్ని తెలుసుకున్న తరువాత తమకు అందిన పవిత్ర ఆజ్ఞ నుండి తప్పిపోవడం కన్నా అసలు ఆ మార్గం వారికి తెలియకుండా ఉండడమే మేలు.
\v 22 'కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్లినట్టుగా' అని చెప్పిన సామెతలు వీళ్ళ విషయంలో నిజం.
\s5
\c 3
\s ప్రభువు రాక, ప్రభువు దినం
\p
\v 1 ప్రియులారా, యథార్ధమైన మీ మనస్సును పురికొల్పడానికి ఈ రెండో ఉత్తరం రాస్తున్నాను.
\v 2 పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
\s ప్రభువు రెండవ రాకను చాలామంది నమ్మడం లేదు
\s5
\p
\v 3 ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
\v 4 “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వికులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలు ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని గేలి చేస్తారు.
\s5
\v 5 చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలోనుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,
\v 6 ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
\v 7 అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజున, మంటలలో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.
\s5
\p
\v 8 కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
\v 9 కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనస్సుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించకూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పు కలిగి ఉన్నాడు.
\s ప్రభువు దినం
\s5
\p
\v 10 అయితే, ప్రభువు వచ్చే రోజు, ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్న వన్నీ తీర్పుకు గురౌతాయి.
\s5
\v 11 ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాలలో ఏ విధంగా జీవించాలి?
\v 12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన వేడిమితో కరిగిపోతాయి.
\v 13 అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిమంతులు నివాసం చేస్తారు.
\s5
\p
\v 14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనుక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకమూ లేనివారిగా ఉండండి.
\v 15 మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో తన ఉత్తరాలన్నిటిలో ఈ విషయాల గురించి రాశాడు.
\v 16 అయితే వాటిలో కొన్నిటిని అర్ధం చేసుకోవడం కష్టం. అక్రమకారులు, నిలకడ లేని కొందరు ఇతర అనేకమైన లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
\s5
\p
\v 17 కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్త పడండి.
\v 18 మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, ఎప్పుడూ, మహిమ కలుగు గాక! ఆమేన్.

229
63-1JN.usfm Normal file
View File

@ -0,0 +1,229 @@
\id 1JN 1 John
\s5
\c 1
\s కుటుంబానికి తండ్రితో సహవాసం (క్రీస్తు అవతారం వల్ల సహవాసం సాధ్యమయింది)
\p
\v 1 ఆదినుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ, మీకు ప్రకటిస్తున్నాం.
\v 2 ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్ష్యమిస్తూ దానిని మీకు ప్రకటిస్తున్నాం.
\s సహవాసం తండ్రితో, కుమారునితో కూడా
\s5
\p
\v 3 మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేం చూసిందీ, విన్నదీ, మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో ఉంది.
\v 4 మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం.
\s సహవాసానికి షరతు- వెలుగులో నడవాలి
\s5
\p
\v 5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీనిని మేం ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం.
\v 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు.
\v 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి సహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది
\s లోపలున్న పాపాన్ని గుర్తించాలి
\s5
\p
\v 8 మనలో పాపం లేదని మనం అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు.
\s పాపం ఒప్పుకోలు, క్షమాపణ, కడిగి వేయడం
\p
\v 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతినుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు.
\v 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయన్ని అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.
\s5
\c 2
\s క్రీస్తు మనకోసం విజ్ఞాపన చేస్తూ ఉండడం వల్ల సహవాసం కొనసాగుతున్నది
\p
\v 1 నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పాలిట న్యాయవాది, నీతిమంతుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.
\v 2 మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.
\s సహవాసం గురుతులు- విధేయత, ప్రేమ
\p
\v 3 ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగినవారం అని మనకు తెలుస్తుంది.
\s5
\v 4 "నాకు దేవుడు తెలుసు" అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించనివాడు అబద్ధికుడు.
\v 5 కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది
\v 6 ఆయనలో ఉన్నానని చెప్పేవాడు, యేసు క్రీస్తు ఎలా నడుచుకోన్నాడో, అలాగే నడుచుకోవాలి.
\s5
\v 7 ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ, మీరు విన్న వాక్కే.
\v 8 అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది.
\s5
\v 9 తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు.
\v 10 తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతను తడబడి పడిపోయే అవకాశం లేదు.
\v 11 కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివానిగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.
\s5
\v 12 ప్రియమైన చిన్నపిల్లలారా! ఆయన నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.
\v 13 తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.
\v 14 చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకొని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానుని ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.
\s దేవుని పిల్లలు ఈ లోకాన్ని ప్రేమించ కూడదు
\s5
\p
\v 15 ఈ లోకాన్నిగానీ, ఈ లోకంలో ఉన్నవాటినిగానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.
\v 16 ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఇంకా ఈ జీవిత దురహంకారం, ఇవి తండ్రి సంబంధమైనవి కాదు.
\v 17 ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయిగాని దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.
\s క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించే వారి విషయం జాగ్రత్తగా ఉండాలి
\s5
\p
\v 18 పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది.
\v 19 వాళ్ళు మన దగ్గరనుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవాళ్ళు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు మనకు సంబంధించినవాళ్ళు కాదని కనబడుతూ ఉంది.
\s5
\v 20 కాని, మీకు పవిత్రుని అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు.
\v 21 మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యంనుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను.
\s5
\v 22 యేసే క్రీస్తు అని అంగీకరించనివాడే అబద్ధికుడు. తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించినవాడే క్రీస్తు విరోధి.
\v 23 కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి అంగీకరించిన వాడికి తండ్రి ఉన్నట్టే.
\s5
\p
\v 24 మీరైతే, మొదటినుండీ ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారునిలో, తండ్రిలో నిలిచి ఉంటారు.
\v 25 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేసాడు.
\v 26 ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వాళ్ళని గురించి రాశాను.
\s5
\v 27 ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి
\v 28 కాబట్టి పిల్లలూ, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఆయనలో నిలిచి ఉండండి.
\s చిన్నపిల్లలు ఒకరినొకరు ఎలా గుర్తిస్తారు?
\p
\v 29 ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వాళ్ళందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.
\s5
\c 3
\p
\v 1 మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనల్ని ఎలా ప్రేమించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. అ కారణం చేత లోకం మనల్ని గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
\v 2 ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇకముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయన వలె ఉంటామనీ మనకు తెలుసు.
\v 3 ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపినవారందరూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తానూ పవిత్రం చేసుకుంటాడు.
\s5
\v 4 పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.
\v 5 మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు.
\v 6 ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయన్ని ఎన్నడూ చూడలేదు.
\s5
\v 7 పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించేవాడు నీతిమంతుడు.
\v 8 పాపం చేసేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్ష్యం అయ్యాడు.
\s5
\v 9 దేవుని ద్వారా జన్మించినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించినవానిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతను పాపం చెయ్యలేడు.
\v 10 నీతిని జరిగించనివాళ్ళు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివాళ్ళు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
\s చిన్నపిల్లలు కలిసి నివసించాలి
\s5
\p
\v 11 మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు.
\v 12 సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
\s5
\p
\v 13 నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
\v 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవం లోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
\v 15 తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం లేదని మీకు తెలుసు.
\s5
\v 16 యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణాన్ని అర్పించాలి.
\v 17 ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
\v 18 పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, క్రియలతో సత్యంతో ప్రేమిద్దాం.
\s5
\v 19 దీనివల్ల మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ముందు స్థిరంగా ఉంటాయి.
\v 20 మన హృదయం మనమీద నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.
\v 21 ప్రియులారా, మన హృదయం మనమీద నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.
\v 22 అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడంవల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గరనుండి పొందుతాం.
\s5
\v 23 ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
\v 24 దేవుని ఆజ్ఞలు పాటించినవాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.
\s5
\c 4
\s కుటుంబం, లోకం- కపట బోధకుల విషయంలో జాగ్రత్త
\p
\v 1 ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.
\s క్రీస్తు గురించి వారి తప్పుడు బోధ
\p
\v 2 శరీర రూపంలో వచ్చిన యేసు క్రీస్తు దేవుడని అంగీకరించిన ప్రతి ఆత్మా దేవునికి చెందిందని, దేవుని ఆత్మ ద్వారా మీరు గ్రహిస్తారు.
\v 3 యేసు దేవుని కుమారుడని అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కాని అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది.
\s5
\v 4 పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు.
\s వారి లక్షణాలు
\p
\v 5 వాళ్ళు లోకానికి చెందినవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది.
\v 6 మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీనిని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.
\s 7 నిజమైన పిల్లలు జన్మించిన విధానం
\s5
\p
\v 7 ప్రియులారా, ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ఎందుకంటే, ప్రేమ దేవునికి చెందింది. ప్రేమించే ప్రతి వాడు దేవుని ద్వారా పుట్టి, దేవుణ్ణి తెలుసుకున్న వాడు.
\v 8 దేవుడు ప్రేమ. ప్రేమించని వాడికి దేవుడు తెలియదు.
\s5
\v 9 దేవుడు, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి, ఆయన ద్వారా మనం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. దీని ద్వారా దేవుని ప్రేమ మన మధ్య వెల్లడి అయ్యింది.
\v 10 మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనల్ని ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.
\s5
\v 11 ప్రియులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
\v 12 ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది.
\v 13 దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు.
\v 14 తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా పంపించడం మేము చూసాము. దానికి మేము సాక్షులం.
\s5
\v 15 యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరిస్తారో వారిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతడు దేవునిలో నిలిచి ఉంటాడు.
\v 16 దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలిసికొని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు.
\s5
\v 17 తీర్పు రోజు మనం ధైర్యంతో ఉండేలా మన మధ్య ఈ ప్రేమ పరిపూర్ణం అయ్యింది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన ఉన్నట్టే ఉన్నాం.
\v 18 ప్రేమలో భయం లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయం ఉన్నవాడు ఇంకా ప్రేమలో పరిపూర్ణత పొందలేదు.
\s5
\v 19 దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం.
\v 20 "నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను" అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు.
\v 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది.
\s5
\c 5
\s విశ్వాసమే ఈ లోకం లో విజయం
\p
\v 1 యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిని ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు.
\v 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లల్ని ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.
\v 3 ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.
\s5
\v 4 దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే.
\v 5 లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!
\s5
\v 6 నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే కాదు. నీళ్ళ ద్వారానూ, రక్తం ద్వారా కూడా వచ్చాడు. దేవుడు ఆత్మ రూపి గనక ఆత్మే సాక్షమిస్తున్నాడు
\v 7 సాక్షం ఇచ్చే వారు ముగ్గురున్నారు.
\v 8 ఆత్మ, నీళ్ళు, రక్తం, ఈ మూడూ ఒకే సాక్షం చెబుతున్నాయి.
\s5
\v 9 మనుషుల సాక్షం మనం స్వీకరిస్తాం. కాని దేవుని సాక్షం అంతకన్నా గొప్పది. దేవుని సాక్షం, ఆయన కుమారుణ్ణి గూర్చినదే.
\v 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్షం ఉంటుంది. దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్షం నమ్మనివాడు దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసినట్టే.
\s5
\v 11 ఆ సాక్షం ఇదే: దేవుడు మనకు శాశ్వత జీవం ఇచ్చాడు. ఈ జీవం తన కుమారునిలో ఉంది.
\v 12 కుమారుడు ఉన్నవానికి జీవం ఉంది. దేవుని కుమారుడు లేని వాడికి జీవం లేదు.
\s5
\v 13 దేవుని కుమారుని నామంలో విశ్వాసం ఉంచిన మీకు శాశ్వత జీవం ఉందని మీరు తెలుసుకోడానికి ఈ సంగతులు మీకు రాస్తున్నాను.
\v 14 ఆయన దగ్గర మనకున్న ధైర్యం ఇదే: ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు.
\v 15 మనం అడిగిన విషయాలన్నీ ఆయన వింటాడని తెలిస్తే, మనం అడిగినవి మనకు కలిగాయని మనకు తెలుసు.
\s5
\v 16 తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతనిని బట్టి మరణం కలిగించని పాపం చేసినవానికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతను ప్రార్థించాలని నేను చెప్పను.
\v 17 సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.
\s5
\v 18 దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వానిని దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు.
\v 19 మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. సర్వలోకం దుష్టుని ఆధీనంలో ఉంది.
\s5
\v 20 దేవుని కుమారుడు వచ్చి, సత్య స్వరూపి ఎవరో తెలుసుకొనే జ్ఞానం మనకిచ్చాడు. మనం, ఆ సత్య స్వరూపి యేసు క్రీస్తులో ఉన్నాం. ఈయనే నిజమైన దేవుడూ, శాశ్వత జీవం కూడా.
\v 21 పిల్లలూ, విగ్రహాలనుండి దూరంగా వెళ్ళిపోండి.

32
64-2JN.usfm Normal file
View File

@ -0,0 +1,32 @@
\id 2JN 2 John
\s5
\c 1
\s క్రైస్తవ జీవితంలోసత్యాన్నీ ప్రేమను వేరు చేయలేము
\p
\v 1 ఎన్నికైన తల్లికి, ఆమె పిల్లలకు, నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ, పెద్దనైన నేను సత్యాన్ని ఎరిగిన వారితో కలిసి రాస్తున్న సంగతులు.
\v 2 మనలో ఉన్నదీ, మనలో శాశ్వతంగా నిలిచి ఉండేదీ అయిన ప్రేమను బట్టి రాస్తున్నాను.
\v 3 తండ్రి అయిన దేవుని నుండీ, కుమారుడైన యేసు క్రీస్తు నుండీ సత్యంలో, ప్రేమలో మనకు కృప, దయ, శాంతి, తోడుగా ఉంటుంది గాక.
\s5
\v 4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం మీ పిల్లల్లో కొందరు సత్యమార్గంలో ఉన్నారని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను.
\v 5 తల్లీ, కొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలన్న ఆజ్ఞ ఆరంభం నుండి మనకు ఉన్నదాన్నిబట్టి మీకు విన్నపం చేస్తున్నాను.
\v 6 ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
\s వాస్తవ పరిస్థితికి అంతిమ పరీక్ష సిద్ధాంతమే
\s5
\p
\v 7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. వాళ్ళు క్రీస్తు విరోధులు.
\v 8 మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి.
\s5
\v 9 క్రీస్తు ఉపదేశం అతిక్రమించిన వాడికి దేవుడు లేనట్టే. క్రీస్తు ఉపదేశంలో నిలిచి ఉన్నవానికి తండ్రి, కుమారుడు, ఇద్దరూ ఉన్నట్టే.
\v 10 ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరకు వస్తే, అతనిని పలకరించవద్దు, మీ ఇంటికి ఆహ్వానించవద్దు.
\v 11 అతనిని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.
\s చివరి మాటలు
\s5
\p
\v 12 ఇంకా ఎన్నో సంగతులు మీకు రాయాలని ఉంది. కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు. మన ఆనందం సంపూర్ణం అయ్యేలా మీ దగ్గరకు వచ్చి మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశగా ఉంది.
\v 13 ఎన్నికైన మీ సోదరి పిల్లలు మీకు శుభాలు తెలుపుతున్నారు.

36
65-3JN.usfm Normal file
View File

@ -0,0 +1,36 @@
\id 3JN 3 John
\s5
\c 1
\s పలకరింపులు
\p
\v 1 ప్రియమైన గాయస్ కి, పెద్దనైన నేను (యోహాను) యథార్థమైన ప్రేమతో రాస్తున్నది.
\v 2 ప్రియ సోదరుడా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాలలో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.
\v 3 నీవు సత్యమార్గంలో నడుచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు చెప్పగా విని చాలా సంతోషించాను.
\v 4 నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకొంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం ఇంకేమీ లేదు.
\s సువార్త పరిచర్య చేసే వారి గురించి
\s5
\p
\v 5 ప్రియ సోదరా, నీవు సోదరుల కోసం, పరుల కోసం చేస్తున్నది నమ్మకంగా చేస్తున్నావు.
\v 6 వాళ్ళు సంఘం ముందు నీ ప్రేమను గూర్చి సాక్షం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు.
\v 7 వాళ్ళు దేవుని నామం కోసం వెళ్తున్నారు. యూదేతరుల నుండి వాళ్ళు ఏమీ తీసుకోలేదు.
\v 8 మనం సత్యం విషయంలో జత పని వారినిగా వాళ్ళని స్వీకరించాలి.
\s పెత్తనం చెలాయిస్తున్న దెయోత్రెఫే
\s5
\p
\v 9 అక్కడి సంఘానికి నేను రాశాను గాని, వాళ్ళలో గొప్పవాడుగా ఉండాలని కోరుకొనే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు.
\v 10 కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులు, మా విషయంలో మాట్లాడిన చెడ్డ మాటలు గుర్తు చేసుకుంటాను. అంతే కాదు, తాను స్వయంగా సోదరుల్ని ఆహ్వానించడు, ఆహ్వానించిన వారిని అడ్డగించి, సంఘంలోనుండి బహిష్కరిస్తున్నాడు.
\s5
\v 11 ప్రియ సోదరా, చెడుని కాక మంచినే అనుకరించు. మంచి జరిగించేవాడు దేవుని సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు.
\s మంచివాడు దేమేత్రి
\p
\v 12 దేమేత్రి గురించి అందరూ మంచి సాక్షం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్షం పొందాడు. మేము కూడా మంచి సాక్షం ఇస్తున్నాం. మా సాక్షం సత్యం అని మీకు తెలుసు.
\s5
\v 13 ఇంకా చాలా సంగతులు మీకు రాయాలనుకున్నాను గాని కలంతో, సిరాతో రాయడం నాకు ఇష్టం లేదు.
\v 14 కాని, నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అపుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం.
\v 15 నీకు శాంతి కలుగు గాక. స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు పేరు పేరున మా అభివందనాలు తెలియజెయ్యి.

60
66-JUD.usfm Normal file
View File

@ -0,0 +1,60 @@
\id JUD Jude
\s5
\c 1
\s పరిచయం
\p
\v 1 తండ్రి అయిన దేవుని పిలుపు అందుకుని, ప్రేమను చూరగొని, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు యూదా రాస్తున్నది.
\v 2 దయ, శాంతి, ప్రేమ, మీకు సమృద్ధిగా కలుగు గాక.
\s పత్రిక రాసిన సందర్భం- భ్రష్టత్వం
\s5
\p
\v 3 ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయాలనిపించింది.
\v 4 ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను, లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు దుష్టులు. వీళ్ళు శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది.
\s భ్రష్టత్వం ఉదాహరణలు
\s5
\p
\v 5 ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కాని నమ్మని వాళ్ళని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.
\v 6 తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వాళ్ళని చీకటి సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.
\s5
\v 7 అదేవిధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక కోరికలకు తమను తాము అప్పగించుకున్నారు. వాళ్ళు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.
\s భ్రష్ట బోధకుల వర్ణన
\p
\v 8 అదే విధంగా, వాళ్ళు కూడా కలల్లో తమ శరీరాల్ని అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని గొప్ప దూతల్ని గురించి చెడుగా చెబుతున్నారు.
\s5
\v 9 అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. "ప్రభువు నిన్ను గద్దించును గాక," అన్నాడు.
\v 10 కాని వీళ్ళు, తమకు అర్ధం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువులు ప్రకృతి సిద్ధంగా తెలుసుకో గలిగే వాటిలోనే తమను తాము నాశనం చేసుకొంటున్నారు.
\v 11 వీళ్ళకు శ్రమ! వీళ్ళు కయీను మార్గంలో నడుస్తున్నారు. లాభం కోసం బిలాము పట్టిన తప్పు దారిలో నడుస్తున్నారు. కోరహు తిరుగుబాటులో నశించిపోయారు.
\s5
\v 12 వీళ్ళు సిగ్గు లేకుండా విందుల్లో మీతో భోజనం చేస్తూ, తమను తాము బాగా పోషించుకుంటూ, నీటిలో దాగిన బండల్లా ఉన్నారు. వీళ్ళు గాలిలో ఎగిరే నీళ్ళులేని మేఘాలు. ఆకురాలే కాలంలో పళ్ళు లేకుండా రెండు సార్లు చచ్చి వేళ్ళతో సహా పెళ్ళగించిన చెట్ల లాంటి వాళ్ళు.
\v 13 సముద్రంలోని అలల నురగలా వాళ్ళ సొంత అవమానం ఉంటుంది. వీళ్ళు దిక్కు తెలియక తిరుగుతున్న చుక్కల్లా ఉంటారు. శాశ్వత గాడాంధకారం వాళ్ళకోసం సిద్ధంగా ఉంది.
\s5
\v 14 ఆదాము నుండి ఏడవ వాడైన హానోకు కూడా వీళ్ళని గూర్చి ప్రవచిస్తూ ఇలా అన్నాడు, "వినండి, ప్రభువు వేవేలమంది పవిత్రులతో కలిసి వస్తున్నాడు
\v 15 అందరికీ తీర్పు తీర్చడానికి, వాళ్ళల్లో భక్తి లేనివాళ్ళు భక్తిలేని మార్గంలో చేసిన భక్తిలేని పనులన్నిటి గూర్చి నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించి ఆయన వస్తున్నాడు."
\v 16 వాళ్ళు తమ దురాశలను బట్టి నడుచుకుంటూ, లాభం కోసం మనుషుల్ని పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, గొణుగుతూ ఉంటారు.
\s5
\v 17 కాని ప్రియులారా, అంతకుముందు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపోస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి.
\v 18 చివరి రోజుల్లో, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. తమ అపవిత్ర కోరికల వెంటపడతారు, అని అపోస్తలులు చెప్పారు.
\v 19 వీళ్ళు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. భేదాలు కలిగించే వారు.
\s నిజ విశ్వాసులకు ఆదరణ, వారికున్న ఏడు బాధ్యతలు
\s5
\p
\v 20 కాని ప్రియులారా, అతిపవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పవిత్ర ఆత్మలో ప్రార్ధన చేస్తూ
\v 21 మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవం కోసం, మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.
\s5
\v 22 అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి.
\v 23 అగ్నిలోనుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిని భయంతో కూడిన దయతో రక్షించండి. పాపంతో మలినమైన దుస్తుల్ని సైతం మీరు అసహ్యించుకోండి.
\s5
\v 24 మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమ గల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వాళ్ళుగా ఉంచగల వాడు.
\v 25 ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి, అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

990
67-REV.usfm Normal file
View File

@ -0,0 +1,990 @@
\id REV Revelation
\s5
\c 1
\s ముందు మాటలు
\p
\v 1 ఇది త్వరలో జరగాల్సిన సంగతుల్ని యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతుల్ని తెలియజేశాడు.
\v 2 యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్ష్యాన్ని గురించీ తాను చూసిన దానంతటికీ సాక్షిగా ఉన్నాడు.
\v 3 ఈ ప్రవచన వాక్యాల్ని బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
\s5
\p
\v 4 ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, భవిష్యత్తులో వచ్చే వాని నుండీ, ఆయన సింహాసనం ముందు నిలబడే ఏడు ఆత్మల నుండీ,
\v 5 నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగుతాయి గాక.
\v 6 ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం వల్ల మనల్ని మన పాపాల నుండి విడిపించాడు. మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తియశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక!
\s5
\v 7 చూడండి! ఆయన మేఘం పై ఎక్కి వస్తున్నాడు. ఆయన్ని ప్రతి కన్నూ చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయన్ని చూసి గుండెలు బాదుకుంటారు.
\p
\v 8 "ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండీ, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. అమిత శక్తి గలవాణ్ణి" అని ప్రభువు అంటున్నాడు.
\s పత్మస్ లో యోహానుకు క్రీస్తు విశ్వరూపం
\s5
\p
\v 9 మీ సోదరుణ్నీ, యేసు క్రీస్తు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పు లోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు క్రీస్తు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను.
\v 10 ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీ నాదం లాంటి ఒక పెద్ద స్వరం
\v 11 నా వెనక వినిపించింది, "నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దానిని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు" అని చెప్పడం విన్నాను.
\s5
\v 12 అది వింటూనే 'ఎవరిదీ స్వరం?' అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను.
\v 13 ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని లాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
\s5
\v 14 ఆయన తలా, తల వెంట్రుకలూ ఉన్ని లాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.
\v 15 ఆయన పాదాలు కొలిమిలో కాలి తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది.
\v 16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటినుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితోనూ, గొప్ప వెలుగుతోనూ ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.
\s5
\v 17 నేను ఆయన్ను చూడగానే నిశ్చేష్టుడనై ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు. "భయపడకు, మొదటి వాణ్ణీ చివరి వాణ్ణీ నేనే.
\v 18 జీవిస్తున్న వాణ్ణీ నేనే. చనిపోయాను కానీ కలకాలం జీవించే ఉన్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.
\s5
\v 19 ఇప్పుడు నువ్వు చూసిన సంగతుల్నీ, ప్రస్తుతమున్న సంగతుల్నీ, వీటి తర్వాత జరుగబోయే సంగతుల్నీ రాయి.
\v 20 నా కుడిచేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు, ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
\s5
\c 2
\s ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ
\p
\v 1 ఎఫెసులో ఉన్న సంఘం దూతకు ఇలా రాయి. 'తన కుడిచేతిలో ఏడు నక్షత్రాల్ని పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే,
\v 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గుల్ని సహించలేవనీ, అపోస్తలులు కాకుండానే మేము అపోస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.
\s5
\v 3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం ప్రయాస పడుతూ అలసి పోలేదనీ నాకు తెలుసు.
\v 4 అయినా నీకు వ్యతిరేకంగా ఒక నింద వేయాలి. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు.
\v 5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాప పడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీప స్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను.
\s5
\v 6 అయితే నీలో ఈ విషయం ఉంది. నీకొలాయితులు అనే వారి పనుల్ని నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.
\v 7 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక! జయించే వాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవవృక్ష ఫలాల్ని తిననిస్తాను'.
\s స్ముర్నలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 8 స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి, 'మొదటివాడూ, చివరివాడూ, చనిపోయి తిరిగి బతికిన వాడు చెప్తున్నదేమిటంటే
\v 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా అపనిందల పాలు చేస్తున్నారో నాకు తెలుసు.
\s5
\v 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరసాలలో వేయించ బోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.
\v 11 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!. జయించే వాడికి రెండో మరణం ఏ హానీ చేయలేదు'.
\s పెర్గములో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 12 పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. రెండు వైపులా పదునున్న కత్తి కలవాడు చెప్తున్న సంగతులు
\v 13 నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.
\s5
\v 14 అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పుల్ని నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను తు.చ. తప్పకుండా పాటించేవాళ్ళు నీలో ఉన్నారు.
\v 15 అలాగే నీకొలాయితుల బోధను అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారు.
\s5
\v 16 కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరకు త్వరగా వస్తాను. నా నోటి నుండి బయటకు వస్తున్న కత్తితో వాళ్ళతో యుద్ధం చేస్తాను.
\v 17 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!. జయించే వాడిని దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతిమీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది, గానీ ఇంకెవరికీ తెలియదు.
\s తుయతైరలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 18 తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాటి కళ్ళూ, మెరుస్తున్న కంచు లాంటి పాదాలూ కలిగిన దైవ పుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే
\v 19 నీ పనులూ, నీ ప్రేమా, నీ విశ్వాసమూ, నీ సేవా, నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు.
\s5
\v 20 అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే 'నేను ప్రవక్తని' అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా దాసులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది.
\v 21 పశ్చాత్తాప పడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాప పడటానికి ఇష్టపడలేదు.
\s5
\v 22 ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం ఎక్కేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వాళ్ళు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను.
\v 23 ఆమె పిల్లల్ని కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ, హృదయాలనూ పరిశీలించే వాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.
\s5
\v 24 అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు మాకు తెలియదని చెప్పే వారందరితో 'ఇక మరే భారమూ మీ మీద పెట్టను' అని చెప్తున్నాను.
\v 25 నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి.
\s5
\v 26 జయిస్తూ, నేను చేసిన పనుల్ని చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను.
\v 27 అతడు ఇనుప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్లుగా ముక్కలుచెక్కలు చేస్తాడు.
\v 28 తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయ తారను ఇస్తాను.
\v 29 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s5
\c 3
\s సార్దీస్‌లో ఉన్న సంఘానికి లేఖ
\p
\v 1 సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు, నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరుమాత్రం నీకుంది గానీ నువ్వు చచ్చినవాడివే .
\v 2 జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపడేలా చెయ్యి. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కన్పించడం లేదు.
\s5
\v 3 కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే స్వీకరించి పశ్చాత్తాప పడు. నువ్వు మేలుకొనక పోతే, నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు.
\v 4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వాళ్ళు యోగ్యులు. కాబట్టి వాళ్ళు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు.
\s5
\v 5 జయించే వాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలోనుండి అతని పేరుని నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ముందూ, ఆయన దూతల ముందూ అతడి పేరు ఒప్పుకుంటాను.
\v 6 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s ఫిలదెల్ఫియలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 7 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. సత్యం మూర్తీభవించిన వాడూ, పరిశుద్ధుడూ, దావీదు తాళం చెవులుని చేత పట్టుకున్న వాడు, తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు. అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే
\v 8 నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. దానిని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు.
\s5
\v 9 సాతాను సమాజానికి చెందినవారై ఉండి మేము యూదులమే అని అబద్దమాడే వారిని రప్పిస్తాను. వాళ్ళు వచ్చి నీ కాళ్లపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయేలా చేస్తాను.
\v 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడుతాను.
\v 11 నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో.
\s5
\v 12 జయించే వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులోనుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునీ, పరలోకంలో నా దేవుని దగ్గరనుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునీ, నా కొత్త పేరునీ అతనిపై రాస్తాను.
\v 13 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s లవొదికయలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 14 లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఆమేన్‌ అనే పేరున్న వాడూ, నమ్మకమైన సత్యసాక్షీ, దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే
\v 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది.
\v 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటినుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను.
\s5
\v 17 'నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు' అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నువ్వో నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.
\v 18 నా సలహా విను, నీకు సంపద పెరగడానికై కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కన్పించి నీ సిగ్గు పోకుండా ఉండటానికై తెల్లని వస్త్రాలనూ, నీఉ చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో.
\s5
\v 19 నేను ప్రేమించే వారిని మందలిస్తాను. శిక్షణనిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.
\v 20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను ఇంట్లోకి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు.
\s5
\v 21 నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.
\v 22 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s5
\c 4
\s పరలోక దర్శనం: దేవుని సింహాసనం
\p
\v 1 ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం "పైకి రా. తర్వాత జరగాల్సినవి నీకు చూపిస్తాను" అని వినిపించింది.
\v 2 వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్లాను. అప్పుడు పరలోకంలో వేసి ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను.
\v 3 అలా కూర్చున్న వ్యక్తి చూడటానికి సూర్యకాంత మణిలా, కెంపులా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక రంగుల విల్లు ఆవరించి ఉంది.
\s ఇరవై నలుగురు పెద్దలూ, నాలుగు జీవులూ
\s5
\p
\v 4 ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటిమీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.
\v 5 ఆ సింహాసనం నుండి మెరుపులు, ఏవో శబ్దాలు, ఉరుములూ వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
\s5
\v 6 ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికం లాటి సముద్రంలా ఉంది. ముందూ వెనుకా కన్నులు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి.
\s5
\v 7 మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండోది దూడలా ఉంది. మూడో ప్రాణికి మనిషి ముఖం లాటి ముఖం ఉంది. నాల్గో ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.
\s పెద్దల, జీవుల ఆరాధన
\p
\v 8 ఈ నాలుగు ప్రాణులలో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెప్తున్నాయి, "పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ భవిష్యత్తులో వచ్చేవాడూ, సర్వాన్నీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!"
\s5
\v 9 ఆ ప్రాణులు సింహాసనం పై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వానికి యశస్సూ, కీర్తీ, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు
\v 10 ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి
\v 11 "మా ప్రభూ, మా దేవా! నువ్వు యశస్సూ, కీర్తీ, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి" అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు వేశారు.
\s5
\c 5
\s ఏడు సీళ్లు వేసి ఉన్న గ్రంథం
\p
\v 1 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు ముద్రలతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం బయటా లోపలా రాసి ఉంది.
\v 2 దృఢమైన ఒక దేవదూత "ఆ గ్రంథం ముద్రలు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?" అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను.
\s5
\v 3 కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడటానికైనా భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.
\v 4 ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవాళ్ళు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
\v 5 అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో, "ఏడవకు, చూడు, ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ , దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు" అన్నాడు.
\s క్రీస్తు ఆ గ్రంథం విప్పడం
\s5
\p
\v 6 సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండటం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయిన గొర్రెపిల్లలా ఉంది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ, ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.
\v 7 గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడిచేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.
\s మనుషుల విమోచనకై పెద్దల ఆరాధన
\s5
\p
\v 8 ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యం, ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.
\s5
\v 9 ఆ పెద్దలు " ఆ గ్రంథాన్ని పట్టుకుని దాని ముద్రలు తెరవడానికి నువ్వు సమర్థుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతీ భాష మాట్లాడేవారి నుండీ, ప్రతీ జాతి నుండీ, ప్రతీ జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషుల్ని కొన్నావు.
\v 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశావు. కాబట్టి వాళ్ళు భూలోకాన్ని పరిపాలిస్తారు" అంటూ ఒక కొత్త పాట పాడారు.
\s5
\v 11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణుల్నీ, పెద్దలనీ ఆవరించి ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య కోట్లకొలదిగా ఉంది.
\v 12 వారు "వధ అయిన గొర్రెపిల్ల ప్రభావమూ, ఐశ్వర్యమూ, జ్ఞానమూ, బలమూ, ఘనతా, యశస్సూ, ప్రశంసా పొందడానికి యోగ్యుడు" అని పెద్ద స్వరంతో చెప్తూ ఉన్నారు.
\s5
\v 13 అప్పుడు పరలోకంలోనూ, భూమి పైనా, భూమి కిందా, సముద్రం లోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ, వాటిలోనిదంతా "సింహాసనంపై కూర్చున్న ఆయనకూ, గొర్రెపిల్లకూ ప్రశంసా, ఘనతా, యశస్సూ, పరిపాలించడానికి అధికారమూ కలకాలం కలుగుతాయి గాక!" అనడం నేను విన్నాను.
\v 14 ఆ నాలుగు ప్రాణులూ "ఆమేన్‌" అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.
\s5
\c 6
\s సీళ్లు విప్పడం. మొదటిది.
\p
\v 1 ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్ర తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణులలో ఒకటి గర్జిస్తున్నట్లుగా "ఇలా రా" అనడం విన్నాను.
\v 2 నేను అటు చూస్తుంటే అక్కడ ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న ఆశ్వికుని చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
\s రెండో సీలు: యుద్ధాలు
\s5
\p
\v 3 గొర్రెపిల్ల రెండో ముద్ర తెరచినప్పుడు రెండో ప్రాణి "ఇలా రా" అనడం విన్నాను.
\v 4 అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న ఆశ్వికుడికి పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.
\s మూడవ సీలు: కరువుకాటకాలు
\s5
\p
\v 5 ఆ తర్వాత గొర్రెపిల్ల మూడో ముద్ర తెరిచాడు. అప్పుడు "ఇలా రా" అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు.
\v 6 నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం "రోజు కూలికి ఒక కిలో గోధుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు, ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు" అని పలకడం విన్నాను.
\s నాలుగో సీలు: మరణం
\s5
\p
\v 7 గొర్రెపిల్ల నాల్గో ముద్ర తెరచినప్పుడు "ఇలా రా" అని నాల్గో ప్రాణి చెప్పడం విన్నాను.
\v 8 అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్లు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనుకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగో భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది.
\s ఐదవ సీలు: హతసాక్షులు
\s5
\p
\v 9 ఆయన అయిదో ముద్రను తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలి పీఠం కింద చూశాను.
\v 10 వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, " సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?"
\v 11 అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. "మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి" ని వారికి చెప్పడం జరిగింది.
\s అరవ సీలు: ఆకాశం లో ఉత్పాతాలు
\s5
\p
\v 12 ఆయన ఆరవ ముద్ర తెరచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబం రక్తంలా ఎర్రగా అయింది.
\v 13 పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టునుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశం లోని నక్షత్రాలు భూమి పైన రాలాయి.
\v 14 ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.
\s5
\v 15 ఇంకా భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాలమీదా రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు.
\v 16 వాళ్ళు ఆ రాళ్ళతోనూ పర్వతాలతోనూ ఇలా అన్నారు, "మీరు మా మీద పడండి! సింహాసనం పై కూర్చున్న ఆయన ముఖ కాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి.
\v 17 వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. వారికి ఎదురుగా ఎవరు నిలబడగలరు?" అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.
\s5
\c 7
\s అదనపు వివరణ
\p
\v 1 ఈ సంగతులు జరిగిన తర్వాత భూమి నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం నేను చూశాను. వాళ్ళు భూమి మీద నాలుగు వైపుల్నించి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రం మీద గానీ, ఏ చెట్టు మీద గానీ గాలి వీయడం లేదు.
\v 2 మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని ముద్ర ఉంది. భూమికీ సముద్రానికీ హాని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా
\v 3 "మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హానీ చేయవద్దు" అన్నాడు.
\s ఇశ్రాయేలు లో శేషించిన వారి లెక్క
\s5
\p
\v 4 ముద్ర పొందిన వారి సంఖ్య చెప్తుంటే నేను విన్నాను. ఇశ్రాయేల్ వారి గోత్రాలన్నిటిలో ముద్ర పొందినవారి సంఖ్య 1,44,000.
\p
\v 5 గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య.యూదా గోత్రంలో 12,000, రూబేను గోత్రంలో 12,000, గాదు గోత్రంలో 12,000,
\p
\v 6 ఆషేరు గోత్రంలో 12,000, నఫ్తాలి గోత్రంలో 12,000, మనష్షే గోత్రంలో 12,000,
\s5
\p
\v 7 షిమ్యోను గోత్రంలో 12,000, లేవి గోత్రంలో 12,000, ఇశ్శాఖారు గోత్రంలో 12,000,
\p
\v 8 జెబూలూను గోత్రంలో 12,000, యోసేపు గోత్రంలో 12,000, బెన్యామీను గోత్రంలో 12,000.
\s మహా బాధల కాలంలో నుండి వచ్చిన యూదేతరులు
\s5
\p
\v 9 ఆ తర్వాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండటం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతీ జాతినుండీ, ప్రతీ వంశం నుండీ, ప్రతీ గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషలలో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు.
\v 10 వీళ్ళంతా కలసి " రక్షణ సింహాసనం పై కూర్చున్న మా దేవునికీ, గొర్రెపిల్లకీ చెందేది," అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.
\s5
\p
\v 11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ముందు సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి
\p
\v 12 "ఆమేన్! మా దేవునికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలూ, ఘనతా, అధికారమూ, మహా బలమూ కలకాలం కలుగుతాయి గాక" అని చెప్తూ దేవుణ్ణి పూజించారు.
\s5
\p
\v 13 అప్పుడు ఆ పెద్దలలో ఒకతను "తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?" అని నన్ను అడిగాడు.
\v 14 అందుకు నేను "అయ్యా, నీకే తెలుసు" అని జవాబిచ్చాను. అప్పుడు అతను నాతో ఇలా చెప్పాడు, "వీళ్ళంతా మహా బాధలలో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు.
\s5
\v 15 అందుకే వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన వారి మీద తన గుడారాన్ని కప్పుతాడు.
\v 16 వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ వడగాలి గానీ వారికి తగలదు.
\v 17 ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల వద్దకు వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే ప్రతీ కన్నీటి చుక్కనూ ఆయనే తుడిచివేస్తాడు".
\s5
\c 8
\s ఏడవ సీలు, అందులో ఉన్న ఏడు బాకా నాదాలు
\p
\v 1 ఆయన ఏడో ముద్ర తెరచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది.
\s ఏడు బాకాలు
\p
\v 2 అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతల్ని చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు.
\s5
\v 3 మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిల్చున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠం పై పరిశుద్ధుల ప్రార్ధనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు.
\v 4 అప్పుడు ఆ దూత చేతిలోనుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్ధనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి.
\v 5 ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదకు విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.
\s5
\v 6 అప్పుడు ఏడు బాకాలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.
\s బాకానాదాల తీర్పులు. మొదటిది
\p
\v 7 మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడో భాగం, చెట్లలో మూడో భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది.
\s రెండవ బాకా
\s5
\p
\v 8 రెండో దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడో భాగం రక్తం అయిపోయింది.
\v 9 సముద్రం లోని ప్రాణులలో మూడో భాగం చచ్చిపోయాయి. ఓడలలో మూడోభాగం నాశనం అయ్యాయి.
\s మూడవ బాకా
\s5
\p
\v 10 మూడో దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం అగ్నిగోళంలా మండిపోతూ ఆకాశం నుండి రాలి పోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడో భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది.
\v 11 ఆ నక్షత్రం పేరు "చేదు." కాబట్టి నీళ్ళలో మూడో భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల చాలా మంది చచ్చిపోయారు.
\s నాలుగవ బాకా
\s5
\p
\v 12 నాలుగో దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడో భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాలలో మూడోభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడో భాగం, రాత్రి మూడో భాగం వెలుగు లేకుండా పోయింది.
\s5
\v 13 తర్వాత గాలిలో ఎత్తుగా ఎగిరిపోతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ "ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!" అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.
\s5
\c 9
\s ఐదవ బాకా: మొదటి యాతన
\p
\v 1 ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిమీద పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది.
\v 2 అతడు అంతు లేని ఆ అగాథాన్ని తెరిచాడు. బ్రహ్మాండమైన కొలిమిలో నుండి లేచినట్లుగా దట్టమైన పొగ ఆ అగాథంలోనుండి లేచింది. ఆ పొగ వల్ల సూర్యగోళం నల్లబడి చీకటి కమ్మింది. గాలి కూడా నల్లబడింది.
\s5
\v 3 ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదకు వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్ళకు ఉన్న శక్తి లాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది.
\v 4 నుదిటి మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికి గానీ, మొక్కలకు గానీ, చెట్లకు గానీ ఎలాంటి హానీ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఉంది.
\s5
\v 5 ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే వేదన తేలు కుట్టినపుడు కలిగే వేదనలా ఉంటుంది.
\v 6 ఆ రోజుల్లో మనుషులు చావుని వెదుకుతారు కానీ అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు కానీ మరణం వారి దగ్గర్నుంచి పారిపోతుంది.
\s5
\v 7 ఆ మిడతలు చూడటానికి యుద్ధానికి సిద్ధం చేసిన గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల పై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాంటివి.
\v 8 వాటికి వెంట్రుకలున్నాయి. అవి స్త్రీల తలవెండ్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహం కోరల్లా ఉన్నాయి.
\v 9 ఇనుప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే విన్పించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది.
\s5
\v 10 ప్రతీదానికీ తేళ్ళలా తోకా, కొండీ ఉన్నాయి. తమ తోకలతో ఐదు నెలల వరకూ మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది.
\v 11 వాటి పైన ఒక రాజు ఉన్నాడు. వాడు అగాధ దూత. వాడి పేరు హీబ్రూ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపోల్యోను ('విధ్వంసకుడు' అని ఈ పేరుకి అర్థం).
\v 12 మొదటి యాతన ముగిసింది. ఈ విషయాలు జరిగిన తర్వాత మరో రెండు యాతనలు కలుగుతాయి.
\s ఆరవ బాకా
\s5
\p
\v 13 ఆరవ దూత బాకా ఊదాడు. అప్పుడు దేవుని ముందు ఉన్న బంగారు బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినిపించింది.
\v 14 ఆ స్వరం "మహా నది యూఫ్రటీసు దగ్గర బంధించిన నలుగురు దూతలను విడిచి పెట్టు" అని బాకా పట్టుకొని ఉన్న ఆరో దూతతో చెప్పడం విన్నాను.
\v 15 మనుష్యులలో మూడో భాగాన్ని చంపివేయడానికి ఆ గంట కోసం, అ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధపరచిన ఆ నలుగురు దూతల్ని విడిచిపెట్టారు.
\s5
\v 16 సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను.
\v 17 నా దర్శనంలో ఈ గుర్రాలను గూర్చీ, వాటిపైన ఉన్న సైనిక దళం గూర్చీ నేనేం చూశానంటే, గుర్రాలూ, సైనికులూ ధరించిన కవచాలు నిప్పులాటి ఎరుపూ, చిక్కటి నీలం, గంధకంలాటి పసుపు రంగుల్లో ఉన్నాయి. ర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి తమ నోళ్ళలో నుండి అగ్నీ, పొగా, గంధకమూ వెళ్ళగక్కుతున్నాయి.
\s5
\v 18 వాటి నోళ్లలోనుండి బయటకు వస్తున్న అగ్నీ, పొగా, గంధకమూ అనే మూడు అనర్థాల వలన మనుషులలో మూడో వంతు జనాభా చనిపోయారు.
\v 19 ఆ గుర్రాల బలం వాటి నోళ్ళలోనూ తోకలలోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు పాముల్లా ఉన్నాయి. అవి తమ తలలతో మనుషుల్ని గాయపరుస్తాయి.
\s5
\v 20 ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాప పడ లేదు. తమ చేతులతో చేసిన, చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలనూ, దయ్యాలనూ పూజించడం వారు మానలేదు.
\v 21 అలాగే వారు సాగిస్తున్న నరహత్యల్నీ, మాయమంత్రాల్నీ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాప పడలేదు.
\s5
\c 10
\s అదనపు వివరణ దర్శనాలు: మహా ప్రతాపశాలి, చిన్న పుస్తకం
\p
\v 1 మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై రంగుల విల్లు ఉంది. ఆయన వదనం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
\v 2 ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడికాలు సముద్రం పైనా ఎడమకాలు భూమి పైనా ఉంచాడు.
\s5
\v 3 తర్వాత ఆయన ఒక పెద్ద కేక వేసాడు. ఆ కేక సింహం గర్జించినట్లుగా ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి.
\v 4 ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తర్వాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి "ఏడు ఉరుములు పలికిన విషయాల్ని రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు" అంటూ నాకో స్వరం వినిపించింది.
\s5
\v 5 అప్పుడు సముద్రం పైనా, భూమి పైనా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు.
\v 6 పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని పేరున ఇలా శపథం చేశాడు.
\v 7 "ఇక ఆలస్యం ఉండదు. ఏడో దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది."
\s5
\v 8 అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం తిరిగి, "సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో" అని నాకు చెప్పాడు.
\v 9 నేను ఆ దూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన "ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది" అన్నాడు.
\s యోహాను చిన్న పుస్తకాన్ని తినడం
\s5
\p
\v 10 అప్పుడు నేను దూత చేతిలోనుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది.
\v 11 అప్పుడు కొన్ని స్వరాలు నాకిలా చెప్పాయి, "నువ్వు అనేకమంది ప్రజలనుగూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి."
\s5
\c 11
\s యూదేతరుల కాలం
\p
\v 1 కొలబద్దలా ఉపయోగించడానికి ఒక చేతి కర్రను నాకిచ్చారు. అప్పుడు దేవదూత నాతో ఇలా అన్నాడు. "నువ్వు లే. దేవుని ఆలయం, బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్క పెట్టు.
\v 2 ఆలయం బయటి ఆవరణం మాత్రం కొలవకు. అది యూదేతరులది. వాళ్ళు నలభై రెండు నెలల పాటు ఈ పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు.
\s ఇద్దరు సాక్షులు 42 నెలల కార్యకలాపాలు
\s5
\p
\v 3 నా యిద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను."
\v 4 భూమికి ప్రభువైన దేవుని సన్నిధిలో ఉండే రెండు అలీవ్ చెట్లు, రెండు దీపస్తంభాలు వీరే.
\v 5 ఎవరైనా వీరికి హాని చేయాలని చూస్తే, వారి నోటినుండి అగ్ని జ్వాలలు బయల్దేరి వారి శత్రువులను దహించి వేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి.
\s5
\v 6 తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది.
\v 7 వారు తమ సాక్ష్యాన్ని ప్రకటించి ముగించగానే అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది.
\s5
\v 8 వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.
\v 9 మనుషులలో, అన్ని జాతుల వాళ్ళలో, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళలో, తెగల వాళ్ళలో కొందరు వీరి మృత దేహాల్ని చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు.
\s5
\v 10 ఈ ఇద్దరు ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు కనుక వారికి పట్టిన గతిని చూసి వాళ్ళంతా సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు.
\v 11 కాని మూడున్నర రోజులైన తర్వాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు తమ కాళ్ళపై లేచి నిలబడతారు. ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది.
\v 12 అప్పుడు "ఇక్కడికి పైకి రండి" అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు.
\s రెండవ యాతన
\s5
\p
\v 13 సరిగ్గా ఆ గంటలోనే ఒక మహా భూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో పదో భాగం కూలిపోతుంది. ఆ భూకంపం లో ఏడు వేలమంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్న వారు భయకంపితులై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు.
\v 14 రెండో యాతన ముగిసింది. ఇప్పుడు మూడో యాతన త్వరలో ప్రారంభం కానుంది.
\s రెండవ వివరణ దర్శనం సమాప్తం. ఏడవ బాకా
\s5
\p
\v 15 ఏడో దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి. "ఈ లోక రాజ్యం మన దేవుని రాజ్యమూ , ఆయన అభిషిక్తుడైన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన కలకాలం పరిపాలన చేస్తాడు."
\s5
\v 16 అప్పుడు దేవుని ముందు సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ దేవునికి సాష్టాంగ పడి నమస్కారం చేశారు.
\v 17 "ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.
\s5
\v 18 జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు చెప్పడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది" అన్నారు.
\s5
\v 19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన పెట్టె అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.
\s5
\c 12
\s ఏడుగురు వ్యక్తులు. 1. స్త్రీ - ఇశ్రాయేలు
\p
\v 1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై ఉన్న కిరీటంలో పన్నెండు నక్షత్రాలున్నాయి.
\v 2 ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.
\s 2. సాతాను
\s5
\p
\v 3 ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.
\v 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడో భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదకు విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగి వేయాలన్నది వాడి ఉద్దేశం.
\s 3. మగ బిడ్డ- క్రీస్తు
\s5
\p
\v 5 ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనుప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గర్నుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.
\v 6 ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
\s 4. ప్రధాన దూత- మిఖాయేలు
\s5
\p
\v 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేసారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేసాడు.
\v 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకీ స్థానం లేకపోయింది.
\v 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వీడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వీణ్ణీ వీడితో పాటు వీడి అనుచర గణాన్నీ భూమి మీదకు తోసి వేశారు.
\s5
\v 10 అప్పుడు పరలోకం నుండి బిగ్గరగా ఒక స్వరం వినపడింది. "మన సోదరుల్ని నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ముందు మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా, శక్తీ, రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది.
\s5
\v 11 వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్ష్యాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.
\v 12 కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రమా, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ వద్దకు దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.
\s మహా బాధల కాలంలో సాతాను, ఇశ్రాయేలు
\s5
\p
\v 13 తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ మహాసర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని హింసించాలని చూశాడు .
\v 14 కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది.
\s5
\v 15 కాబట్టి ఆ స్త్రీ నీళ్ళల్లో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.
\v 16 కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటినుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగి వేసింది.
\s 5. ఇశ్రాయేలులో శేషించిన వారు
\p
\v 17 అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.
\v 18 దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.
\s5
\c 13
\s 6. సముద్రంలో నుండి వచ్చిన మృగం- క్రీస్తువిరోధి
\p
\v 1 తర్వాత క్రూర మృగం ఒకటి సముద్రం లోనుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.
\v 2 నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, పాలించే అధికారాన్నీ ఇచ్చాడు.
\s5
\v 3 దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంటపడి వెళ్ళారు.
\v 4 ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. "ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగలవారెవరు?" అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.
\s5
\v 5 బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.
\v 6 కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు.
\s5
\v 7 ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతీ వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడేవారిపైనా, ప్రతీ జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది.
\v 8 భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొ ర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.
\s5
\v 9 చెవులు ఉన్నవాడు వింటాడు గాక!
\v 10 బానిసత్వం లోకి తీసుకు వెళ్ళాలి అనుకునే వాడు బానిసగా వెళ్తాడు, కత్తితో చంపే వాణ్ణి కత్తితోనే చంపాలి. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనమూ, విశ్వాసమూ కలిగి ఉండాలి.
\s భూమిలో నుండి వచ్చిన మృగం- అబద్ధ ప్రవక్త
\s5
\p
\v 11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూరమైన మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలా మాట్లాడుతూ ఉన్నాడు.
\v 12 వాడు మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని వాడి ముందే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.
\s5
\v 13 వాడు అనేకమైన చిత్రవిచిత్రాలు చేశాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేశాడు.
\v 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమి మీద అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని పెట్టాలని వాడు అందరికీ చెప్తూ ఉన్నాడు.
\s5
\v 15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.
\v 16 వాడు ఇంకా తమ కుడిచేతిపై గానీ నుదుటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ బలవంతం చేశాడు.
\v 17 ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం చేశాడు.
\s5
\v 18 ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.
\s5
\c 14
\s అదనపు వివరణ దర్శనాలు- గొర్రెపిల్ల తో లక్షా నలభై నాలుగు వేల మంది
\p
\v 1 తర్వాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతం పైన గొర్రెపిల్ల నిలబడి ఉండటం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1,44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి.
\v 2 అప్పుడు విస్తారమైన నీళ్ళు పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం వస్తే విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు ఒక్కసారిగా వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
\s5
\v 3 వాళ్ళంతా సింహాసనం ముందూ, ఆ నాలుగు ప్రాణుల ముందూ, పెద్దల ముందూ ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1,44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.
\v 4 వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకున్న వాళ్ళు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలోనుండి దేవుని కొరకూ, గొర్రెపిల్ల కొరకూ మొదటి ఫలాలుగా విమోచన జరిగిన వారు.
\v 5 అబద్దమన్నది వీళ్ళ నోటినుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
\s శాశ్వత సువార్త గల దూత
\s5
\p
\v 6 అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతీ దేశానికీ, తెగకూ, ప్రతీ భాష మాట్లాడేవారికీ, ప్రతీ జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత శుభవార్త ఉంది.
\v 7 అతడు "మీరు దేవునికి భయపడండి. ఆయన్ను కీర్తించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమి, ఆకాశాల్నీ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటల్నీ సృష్టించిన ఆయన్ను పూజించండి." అంటూ బిగ్గరగా చెప్పాడు.
\s బాబులోను పతనం ప్రకటన
\s5
\p
\v 8 వేరొక దూత, అంటే రెండో దూత అతని వెనకే వచ్చాడు. "నాశనమైంది! తన లైంగిక విచ్చలవిడితనమనే సారాయిని భూమిమీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైంది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది." అని చెప్పాడు.
\s మృగాన్ని పూజించే వారి వినాశం
\s5
\p
\v 9 తర్వాత మూడో దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. "ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి పైనో చేతి పైనో వేయించుకున్నా
\v 10 వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారు చేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ముందూ, గొర్రెపిల్ల ముందూ అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.
\s5
\v 11 వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు అశాంతితో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
\v 12 దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ, అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి అని ఇదే వారికి పిలుపు."
\s పవిత్రులైన మృతుల ధన్యత
\s5
\p
\v 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది "ఇలా రాయి. 'ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.'" నిజమే, వాళ్ళు తమ శ్రమ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళ వెనకే వెళ్తాయి.
\s మనుష్య కుమారుని పంట కోత
\s5
\p
\v 14 మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘం పైన మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
\v 15 అప్పుడు మరో దూత దేవాలయంలోనుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, "పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు"
\v 16 అపుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదకు కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది.
\s దుర్మార్గుల పంటకోత
\s5
\p
\v 17 అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
\v 18 మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు, "భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోయి" అన్నాడు.
\s5
\v 19 అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదకు విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోసాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
\v 20 పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.
\s5
\c 15
\s ఏడు పాత్రలు పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు
\p
\v 1 పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరి కీడులు. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.
\s5
\v 2 తర్వాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరును సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్ర్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.
\s5
\v 3 వాళ్ళు దేవుని సేవకుడైన మోషే పాటా, గొర్రెపిల్ల పాటా పాడుతూ, "ప్రభువైన దేవా, అన్నిటిపై పరిపాలన చేసేవాడా, నువ్వు చేసే పనులన్నీ గొప్పవి, అద్భుతమైనవి, జనాలకు రాజా, నీ విధానాలు న్యాయయమైనవి, సత్యమైనవి.
\v 4 ప్రభువా, నువ్వు మాత్రమే పరిశుద్దుడివి, నీకు భయపడనిదెవరు? నీ పేరుని కీర్తించనిదెవరు? నీ న్యాయ తీర్పులు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు."
\s5
\v 5 ఆ తర్వాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్ష్యపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరచుకుంది.
\v 6 అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వాళ్ళంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు దట్టీ కట్టుకుని ఉన్నారు.
\s5
\v 7 అప్పుడు ఆ నాలుగు ప్రాణులలో ఒకరు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రలలో నిత్యం జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది.
\v 8 దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.
\s5
\c 16
\s దేవుని ఉగ్రత పాత్రలు
\p
\v 1 అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలోనుంచి "మీరు వెళ్లి ఏడు పాత్రలలో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి" అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం విన్నాను.
\s మొదటి పాత్ర
\s5
\p
\v 2 అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూరమృగం యొక్క ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై అసహ్యమైన, బాధాకరమైన కురుపు పుట్టింది.
\s రెండవ పాత్ర
\s5
\p
\v 3 రెండో దూత తన పాత్రని సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.
\s మూడవ పాత్ర
\s5
\p
\v 4 మూడో దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి.
\v 5 అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత "పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా,
\v 6 నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వాళ్ళు ఒలికించారు. అందుకే నువ్వు వాళ్ళకి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు కనుక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వాళ్ళు అర్హులే." అని చెప్పాడు.
\v 7 అప్పుడు బలిపీఠం " అవును, ప్రభువైన దేవా, అన్నిటినీ పరిపాలించేవాడా, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవిగానూ, న్యాయమైనవిగానూ ఉన్నాయి" అంది.
\s నాలుగవ పాత్ర
\s5
\p
\v 8 నాలుగో దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషుల్ని తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది.
\v 9 మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును తిట్టారుగానీ పశ్చాత్తాపపడి ఆయనను కీర్తించలేదు.
\s ఐదవ పాత్ర
\s5
\p
\v 10 అయిదో దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.
\v 11 తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి తిట్టారే తప్ప పశ్చాత్తాప పడలేదు.
\s అరవ పాత్ర
\s5
\p
\v 12 ఆరో దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కు నున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.
\s అదనపు వివరణ
\p
\v 13 అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లా కనిపిస్తున్న మూడు అపవిత్ర ఆత్మలు బయటకు రావడం చూశాను.
\v 14 అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. అన్నిటి పైనా పరిపాలన చేసే దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరకు వెళ్తున్న ఆత్మలు అవి.
\s5
\v 15 హీబ్రూ భాషలో 'హర్ మేగిద్దోన్' అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
\v 16 "వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తతో ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు."
\s ఏడవ పాత్ర
\s5
\p
\v 17 ఏడో దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ "ఇక ముగిసింది" అని ఒక పెద్ద శబ్దం వినిపించింది.
\v 18 అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం ఇది.
\v 19 ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహంతో తయారైన మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు.
\s5
\v 20 ప్రతి ద్వీపమూ అదృశ్యమైంది. ప్రతి పర్వతమూ కనిపించకుండా పోయింది.
\v 21 ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.
\s5
\c 17
\s ఏడు విధ్వంసాలు- 1. బబులోను పతనం
\p
\v 1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో "అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను.
\v 2 ఆమెతో భూమి మీద రాజులు వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలతా మద్యాన్ని, విచ్చలవిడితనమనే సారాయిని తాగి మత్తులో మునిగారు." అన్నాడు.
\s5
\v 3 నేను అప్పుడు ఆత్మ స్వాధీనంలోకి వెళ్లాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని నేను చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవునికి అవమానకరమైన పేర్లు రాసి ఉన్నాయి.
\v 4 ఆ స్త్రీ ఊదారంగు, ఎర్రని రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది. బంగారం, రత్నాలూ, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలోఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రపు పనులూ ఉన్నాయి.
\v 5 ఆమె నుదిటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. \bd "ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, అసహ్యమైన వాటికీ ఇది తల్లి."\bd*
\s5
\v 6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండటం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను.
\v 7 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, "నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.
\s5
\v 8 నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధం లోనుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తర్వాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించే వారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు.
\s5
\v 9 దీనికి జ్ఞానం కలిగిన మనస్సు అవసరం. ఆ మృగానికున్న ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు.
\v 10 ఇంకా ఏడుగురు రాజులున్నారు. వారిలో అయిదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంత కాలం ఉండాలి.
\s5
\v 11 ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిదీ అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే.
\s5
\v 12 నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంతకుముందు రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వాళ్ళు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చలాయిస్తారు.
\v 13 వీరికి ఒకే మనస్సు ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.
\v 14 వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు."
\s5
\v 15 ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు. "ఆ వేశ్య కూర్చున్నచోట నువ్వు చూసిన జలాలు ప్రజల్నీ, జన సమూహాల్నీ, జనాల్నీ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి.
\s5
\v 16 నువ్వు చూసిన పది కొమ్ములు చూశావు గదా, వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంట పెట్టి ఆమెను కాల్చివేస్తారు.
\v 17 ఎందుకంటే తన ఉద్దేశాలు వారు నెరవేర్చాలని దేవుడు వారి హృదయాలలో పెడతాడు. దానికోసం వారు ఏకీభవించి రాజ్యాన్ని మృగానికి ఇవ్వడానికి అనుమతించాడు.
\s5
\v 18 ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజుల్ని పరిపాలిస్తున్న మహా నగరమే.
\s5
\c 18
\s చివరి రోజుల్లో ఉండబోయే భ్రష్ఠక్రైస్తవ్యం
\p
\v 1 ఆ తర్వాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
\v 2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. "బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
\v 3 ఎందుకంటే దైవాగ్రహాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనాలంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల వల్ల సంపన్నులయ్యారు."
\s5
\v 4 తర్వాత మరో స్వరం పరలోకంనుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది, "నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడులలో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చేయండి.
\v 5 ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలనన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
\v 6 ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కొరకు రెండొంతులు కలపండి.
\s5
\v 7 ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలుగజేయండి. ఎందుకంటే ఆమె తన మనస్సులో "నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను" అనుకుంది.
\v 8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దేవుడైన ప్రభువు మహా శక్తిమంతుడు. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె సంపూర్ణంగా అగ్నికి ఆహుతైపోతుంది.
\s బబులోను పతనం గురించి విలాపం
\s5
\p
\v 9 ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ గుండెలు బాదుకుంటారు.
\v 10 "అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తిమంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా" అంటూ ఏడుస్తారు.
\s5
\v 11 లోకం లోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి ఏడుస్తూ విలపిస్తారు. 'మా సరుకులు ఎవరు కొనుగోలు చేస్తారు' అంటూ ఏడుస్తారు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా
\v 12 పరిమళాన్నిచ్చే ప్రతి రకమైన కలపా, దంతమూ, ఎంతో విలువైన చెక్కా, ఇత్తడీ, ఇనుమూ, చలువరాళ్ళూ మొదలైనవాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ
\v 13 దాల్చిన చెక్క, వాము, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తనిపిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి, ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
\s5
\v 14 "నీ శాయశక్తులా నువ్వు కోరుకున్న ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసమూ, వైభోగమూ మాయమయ్యాయి. అవి ఇక కనపడవు" అని చెప్తూ ఏడుస్తారు.
\s5
\v 15 ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన వల్ల భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు.
\v 16 " సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారం, రత్నాలూ, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంట లోనే మాయమయిందే!" అంటారు.
\v 17 ప్రతీ నౌకాధిపతీ, సముద్ర యాత్రికుడూ, ఓడ నావికుడూ, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళంతా దూరంగా నిలబడి
\s5
\v 18 నగరం తగులబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి "ఈ నగరానికి సమానమైనదేది?" అంటూ కేకలు పెడతారు.
\v 19 తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదనం చేస్తూ "అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వాళ్ళంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాంటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే" అంటారు.
\s బబులోను పతనం గురించి భక్తుల హర్షం
\p
\v 20 "పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే మీ తరుపున దేవుడు ఆమెను శిక్షించాడు."
\s5
\v 21 ఆ తర్వాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు. "ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసాత్మకంగా పడిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
\v 22 కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవీ, బూరలు వూదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
\s5
\v 23 దీపం వెలుతురు నీలో ఇక వెలగదు. పెళ్లి కొడుకు స్వరం, పెళ్లి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు భూమికి ప్రభువుల్లా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి."
\v 24 ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.
\s5
\c 19
\s వివరణ దర్శనం. నాలుగు హల్లెలూయలు
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తర్వాత అనేకమంది మాట్లాడుతున్నట్టు ఒక పెద్ద శబ్దం పరలోకంలో నుండి నాకు వినిపించింది. "హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.
\v 2 ఆయన తీర్పులు సత్యంగానూ న్యాయమైనవిగానూ ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు."
\s5
\v 3 రెండోసారి వారంతా "హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది" అన్నారు.
\v 4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి "ఆమెన్, హల్లెలూయ!" అని చెప్తూ ఆయనను పూజించారు.
\s5
\v 5 అప్పుడు తిరిగి "దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ ఆయన్ను స్తుతించండి" అంటూ ఒక స్వరం వినిపించింది.
\s5
\v 6 తర్వాత అనేకమంది మాట్లాడుతున్నట్టుగా, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. "హల్లెలూయ! అన్నిటి పైనా ఏలిక అయిన మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నాడు."
\s గొర్రెపిల్ల కళ్యాణం
\s5
\p
\v 7 "గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకే మహిమ ఆపాదించుదాం."
\v 8 ఆమెకు వెలుగుమయం, పవిత్రం అయిన అందమైన బట్టలు ధరించుకోడానికి ఇచ్చారు. అందమైన బట్టలు అంటే పరిశుద్ధుల నీతి కార్యాలు.
\s5
\v 9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు. "గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానం అందినవారు దీవెన పొందినవారు అని రాయి." అతడే ఇంకా "ఇవి నిజంగా దేవుని మాటలు" అన్నాడు.
\v 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగ పడబోయాను. కానీ అతడు "అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకీ నేను తోటి దాసుణ్ణి మాత్రమే." అన్నాడు.
\s మహిమలో క్రీస్తు రాక
\s5
\p
\v 11 తర్వాత పరలోకం తెరుచుకుని ఉండటం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు 'నమ్మకమైన వాడు, సత్యవంతుడు.' ఆయన న్యాయంగా తీర్పు చెప్తూ యుద్ధం చేస్తాడు.
\v 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
\v 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. 'దేవుని వాక్కు' అనే పేరు ఆయనకుంది.
\s5
\v 14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్లని గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
\v 15 వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుపలాఠీ తో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారియైన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.
\v 16 ఆయన బట్టల మీదా, తొడ మీదా 'రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు' అనే పేరు రాసి ఉంది.
\s హర్మేగిద్దోన్ యుద్ధం
\s5
\p
\v 17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండటం నేను చూశాను.
\v 18 అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షుల్ని పిలిచాడు. "రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి. రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడిలేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి" అన్నాడు.
\s5
\v 19 క్రూరమృగమూ, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండటం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
\s 1. మృగం పతనం. 2. అబద్ధ ప్రవక్త పతనం
\p
\v 20 అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారినీ ఆ విగ్రహాన్ని పూజించిన వారినీ మోసం చేశాడు. ఈ ఇద్దర్నీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.
\s 3. వారిని అనుసరించిన రాజుల పతనం
\s5
\p
\v 21 మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు ఆరగించాయి.
\s5
\c 20
\s సాతానుకు అగాధంలో చెర
\p
\v 1 తర్వాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ, అగాధం తాళం చెవీ ఉన్నాయి.
\v 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.
\v 3 వాణ్ణి అగాధంలో పడవేసి, దానిని మూసివేసి దానికి ముద్ర వేసాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజల్ని మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తర్వాత కొద్ది సమయం వాణ్ణి వదిలి పెట్టాలి.
\s మొదటి పునరుత్థానం
\s5
\p
\v 4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కొరకూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.
\s5
\v 5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునర్జీవితం.
\v 6 ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు దీవెన పొందిన వారు. వీళ్ళ పైన రెండో మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
\s సాతాను విడుదల. 4. గోగు, మాగోగు పతనం
\s5
\p
\v 7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలోనుండి విడుదల అవుతాడు.
\v 8 వాడు బయల్దేరి నాలుగు దిక్కులలో ఉన్న గోగు, మాగోగు అనే దేశాల్ని మోసం చేసి యుద్ధానికై సమకూరుస్తాడు.
\s5
\v 9 వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకంనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది.
\s 5. సాతాను పతనం
\p
\v 10 వారిని మోసం చేసిన అపవాదిని గంధకం ఉన్న అగ్ని సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధలు పడతారు.
\s 6. అవిశ్వాసుల పతనం. అంతిమ తీర్పు
\s5
\p
\v 11 తర్వాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలు పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.
\v 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ముందు నిలబడి ఉండటం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దానిని బట్టి వారు తీర్పు పొందారు.
\s5
\v 13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.
\v 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండో మరణం.
\v 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.
\s5
\c 21
\s ఏడు కొత్త విషయాలు. 1. కొత్త భూమి, 2. కొత్త ఆకాశం
\p
\v 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు.
\v 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్లికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగి రావడం చూశాను.
\s 3. కొత్త ప్రజ
\s5
\p
\v 3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం "చూడండి, దేవుని నివాసం మనుష్యులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.
\v 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడటం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి" అని చెప్తుండగా విన్నాను.
\s5
\v 5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన "చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను" అన్నాడు. "ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి" అని నాతో అన్నాడు.
\v 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు. "ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
\s5
\v 7 జయించే వాడు వీటిని వారసత్వంగా పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
\v 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండో మరణం.
\s గొర్రెపిల్ల భార్య. 4. కొత్త యెరూషలేము
\s5
\p
\v 9 అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రల్ని పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు నా దగ్గరకు వచ్చాడు. "ఇలా రా, పెళ్లి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను" అన్నాడు.
\v 10 ఆత్మస్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని కీర్తీ యశస్సులతో పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.
\s5
\v 11 యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా ధగ ధగ మెరుస్తూ ఉంది.
\v 12 ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి.
\v 13 తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి.
\s5
\v 14 ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదుల పైన పన్నెండు మంది గొర్రెపిల్ల అపోస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
\v 15 నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాల్నీ, ప్రహరీ గోడనీ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది.
\s5
\v 16 ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
\v 17 తర్వాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.
\s5
\v 18 ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంలా ఉంది.
\v 19 ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండోది ఇంద్ర నీలమణి, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ,
\v 20 అయిదోది కురువిందం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణల శునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది ఊదామణి.
\s5
\v 21 దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
\s 5. కొత్త ఆలయం
\p
\v 22 అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. అన్నిటినీ పాలించే ప్రభువైన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
\s 6. కొత్త ప్రకాశం
\s5
\p
\v 23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కర్లేదు. దేవుని కీర్తీ యశస్సులే అక్కడ ప్రకాశిస్తాయి. గొర్రెపిల్ల దాని దీపం.
\v 24 వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
\v 25 పగటి పూట దాని ద్వారాలు మూయరు. అక్కడ రాత్రి లేదు.
\s5
\v 26 వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
\v 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ పుస్తకంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
\s5
\c 22
\s పరలోకం, జీవజల నది
\p
\v 1 అప్పుడు జీవజల నదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ,
\v 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండీ ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, ఏడాదికి పన్నెండు కాపులు ఇస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
\s5
\v 3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు.
\v 4 ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళ పైన ఉంటుంది.
\v 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.
\s5
\v 6 ఆ దూత నాతో ఇలా చెప్పాడు. "ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు."
\v 7 "చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకం లోని ప్రవచన మాటల్ని స్వీకరించేవాడు ధన్యుడు."
\s5
\v 8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ముందు సాష్టాంగపడ్డాను.
\v 9 అప్పుడు అతడు "అలా చేయకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటల్ని స్వీకరించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు" అని చెప్పాడు.
\s5
\v 10 అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు. "ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్యాలను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
\v 11 అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూ ఉండనీయి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనీయి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనీయి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనీయి.
\s5
\v 12 "చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.
\v 13 అల్ఫా ఓమెగా నేనే, మొదటి వాణ్ణి చివరి వాణ్ణి, ప్రారంభాన్నీ ముగింపునీ.
\s5
\v 14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణపు ద్వారాలనుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయేందుకై తమ వస్త్రాల్ని ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.
\v 15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అసత్యాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.
\s5
\v 16 యేసు అనే నేను సంఘాల కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.
\s5
\v 17 "రా" అంటూ ఆత్మా, పెళ్లికూతురూ చెప్తున్నారు. వింటున్నవాడూ "రా" అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు."
\s5
\v 18 ఈ పుస్తకంలోని ప్రవచన మాటల్ని వినే ప్రతి వ్యక్తికీ నేను చెప్పేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలుగజేస్తాడు.
\v 19 ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవవృక్షం లోనూ, పరిశుద్ధ పట్టణం లోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.
\s చివరి వాగ్దానం, చివరి ప్రార్థన
\s5
\p
\v 20 ఈ సంగతులను గురించి సాక్ష్యమిస్తున్న వాడు "అవును, త్వరగా వస్తున్నాను" అని అంటున్నాడు. ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.
\v 21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉంటుంది గాక! ఆమేన్‌.

252
manifest.yaml Normal file
View File

@ -0,0 +1,252 @@
dublin_core:
type: book
conformsto: rc0.2
comment: ""
format: text/markdown
identifier: ulb
title: 'Unlocked Literal Bible - Telugu'
subject: Bible
description: 'An unrestricted literal Bible'
language:
identifier: te
title: తెలుగు
direction: ltr
source:
-
identifier: ulb
language: 'Holy Bible in Telugu: 1903'
version: '1'
rights: 'CC BY-SA 4.0'
creator: 'Distant Shores Media'
contributor:
- 'PRABHAT KUMAR'
- 'PRASANNA KUMAR KAKI'
- 'DASARI SUNDARA DAS'
- 'Prem Darshan Kodali'
- 'K PRASHANT KUMAR'
relation: []
publisher: unfoldingWord
issued: '2016-10-21'
modified: '2016-10-21T00:00:00.000Z'
version: '1'
checking:
checking_entity:
- 'Dr. JOB SUDARSHAN'
checking_level: '3'
projects:
-
categories:
- bible-nt
identifier: mat
path: ./41-MAT.usfm
sort: 40
title: Matthew
versification: ufw
-
categories:
- bible-nt
identifier: mrk
path: ./42-MRK.usfm
sort: 41
title: Mark
versification: ufw
-
categories:
- bible-nt
identifier: luk
path: ./43-LUK.usfm
sort: 42
title: Luke
versification: ufw
-
categories:
- bible-nt
identifier: jhn
path: ./44-JHN.usfm
sort: 43
title: John
versification: ufw
-
categories:
- bible-nt
identifier: act
path: ./45-ACT.usfm
sort: 44
title: Acts
versification: ufw
-
categories:
- bible-nt
identifier: rom
path: ./46-ROM.usfm
sort: 45
title: Romans
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 1co
path: ./47-1CO.usfm
sort: 46
title: '1 Corinthians'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 2co
path: ./48-2CO.usfm
sort: 47
title: '2 Corinthians'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: gal
path: ./49-GAL.usfm
sort: 48
title: Galatians
versification: ufw
-
categories:
- bible-nt
identifier: eph
path: ./50-EPH.usfm
sort: 49
title: Ephesians
versification: ufw
-
categories:
- bible-nt
identifier: php
path: ./51-PHP.usfm
sort: 50
title: Philippians
versification: ufw
-
categories:
- bible-nt
identifier: col
path: ./52-COL.usfm
sort: 51
title: Colossians
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 1th
path: ./53-1TH.usfm
sort: 52
title: '1 Thessalonians'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 2th
path: ./54-2TH.usfm
sort: 53
title: '2 Thessalonians'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 1ti
path: ./55-1TI.usfm
sort: 54
title: '1 Timothy'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 2ti
path: ./56-2TI.usfm
sort: 55
title: '2 Timothy'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: tit
path: ./57-TIT.usfm
sort: 56
title: Titus
versification: ufw
-
categories:
- bible-nt
identifier: phm
path: ./58-PHM.usfm
sort: 57
title: Philemon
versification: ufw
-
categories:
- bible-nt
identifier: heb
path: ./59-HEB.usfm
sort: 58
title: Hebrews
versification: ufw
-
categories:
- bible-nt
identifier: jas
path: ./60-JAS.usfm
sort: 59
title: James
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 1pe
path: ./61-1PE.usfm
sort: 60
title: '1 Peter'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 2pe
path: ./62-2PE.usfm
sort: 61
title: '2 Peter'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 1jn
path: ./63-1JN.usfm
sort: 62
title: '1 John'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 2jn
path: ./64-2JN.usfm
sort: 63
title: '2 John'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: 3jn
path: ./65-3JN.usfm
sort: 64
title: '3 John'
versification: ufw
-
categories:
- bible-nt
identifier: jud
path: ./66-JUD.usfm
sort: 65
title: Jude
versification: ufw
-
categories:
- bible-nt
identifier: rev
path: ./67-REV.usfm
sort: 66
title: Revelation
versification: ufw