forked from WA-Catalog/te_ulb
332 lines
48 KiB
Plaintext
332 lines
48 KiB
Plaintext
|
\id GAL Galatians
|
|||
|
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\c 1
|
|||
|
\s పలకరింపులు
|
|||
|
\p
|
|||
|
\v 1 మనుష్యుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపోస్తులుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,
|
|||
|
\v 2 నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతం లో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుంచి మీకు కృపా, శాంతీ కలుగు గాక.
|
|||
|
\v 4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు.
|
|||
|
\v 5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగుతుంది గాక. ఆమేన్.
|
|||
|
\s లేఖ ముఖ్యాంశం, సందర్భం
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన శుభ వార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
|
|||
|
\v 7 అసలు వేరే శుభ వార్త అనేది లేదు, క్రీస్తు శుభ వార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 8 మేము మీకు ప్రకటించిన శుభ వార్త గాక వేరొక శుభ వార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక!.
|
|||
|
\v 9 మేము ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన శుభ వార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వానిని దేవుడు శపిస్తాడు గాక!
|
|||
|
\v 10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
|
|||
|
\s 10 పౌలు ప్రకటించిన సువార్త అతనికి ప్రత్యేకంగా వెల్లడి అయినది, ఇతర అపోస్తలుల నుంచి పొందినది కాదు
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 11 సోదరులారా, నేను ప్రకటించిన శుభ వార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.
|
|||
|
\v 12 మనిషి నుంచి నేను దానిని పొందలేదు, నాకెవరూ దానిని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 13 నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.
|
|||
|
\v 14 అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 15 అయినా తల్లిగర్భం లోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుని ప్రకటించాలని
|
|||
|
\v 16 ఆయన్ని నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.
|
|||
|
\v 17 నాకంటె ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్లలేదు, అరేబియా దేశానికి వెళ్లి ఆ తర్వాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 18 మూడు సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వచ్చి అతనితో పదిహేను రోజులున్నాను.
|
|||
|
\v 19 అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
|
|||
|
\v 20 నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను అబద్ధమాడడం లేదు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 21 ఆ తరువాత సిరియ, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.
|
|||
|
\v 22 క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ
|
|||
|
\v 23 "మునుపు మనల్ని హింసించినవాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు" అనే విషయం మాత్రమే విని,
|
|||
|
\v 24 వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచారు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\c 2
|
|||
|
\s నిర్దోషిగా అయ్యేది విశ్వాసం మూలంగానే (గలతి 2: 15 – 3: 24). యూదులకు సైతం ఇదే మార్గం
|
|||
|
\p
|
|||
|
\v 1 పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్లాను.
|
|||
|
\v 2 మేము వెళ్లాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్లాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న శుభ వార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ప్రత్యేకంగా వివరించాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 3 అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనా సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు.
|
|||
|
\v 4 క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనల్ని ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరుల్ని ప్రవేశపెట్టారు.
|
|||
|
\v 5 శుభ వార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 6 ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నాకెలాంటి తోడ్పాటూ ఇవ్వలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు.
|
|||
|
\v 7 అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు శుభ వార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందనివారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు.
|
|||
|
\v 8 అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగచేసాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 9 నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు.
|
|||
|
\v 10 మేము యెరూషలేములో ఉన్న తోటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాల్ని ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వాళ్ళు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తితో ఉన్నాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 11 అయితే కేఫా, అంతియొకయ వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను.
|
|||
|
\v 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. గాని వాళ్ళు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపటవేషధారణ వల్ల మోసపోయాడు.
|
|||
|
\v 14 వారు శుభ వార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, "నీవు యూదుడవై ఉండి కూడా యూదుల లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?" అన్నాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 15 మనం పుట్టుకతో యూదులం గానీ "పాపులైన యూదేతరులం" కాదు. మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు నందలి విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము.
|
|||
|
\v 16 ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 17 అయితే, దేవుడు మనల్ని క్రీస్తులో నీతి మంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు.
|
|||
|
\v 18 నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా.
|
|||
|
\v 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.
|
|||
|
\s 20 లోపల నివసిస్తున్న క్రీస్తును బయటకు కనుపరచేదే క్రైస్తవ జీవితం
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 20 నేను క్రీస్తుతో కూడ సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తన్నుతాను సమర్పించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వలననే.
|
|||
|
\v 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్లే గదా.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\c 3
|
|||
|
\s ఆత్మ వరం విశ్వాసం వల్లనే, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు
|
|||
|
\p
|
|||
|
\v 1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళముందు చూపించాము గదా!
|
|||
|
\v 2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దానిని విశ్వసించడం వలన పొందారా?
|
|||
|
\v 3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా?
|
|||
|
\v 5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
|
|||
|
\s అబ్రాహాము నిబంధన విశ్వాస నిబంధన
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 6 అబ్రాహాము "దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది."
|
|||
|
\v 7 కాబట్టి, నమ్మకముంచే వాళ్ళే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి.
|
|||
|
\v 8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరుల్ని నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. "ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి." అని అబ్రాహాముకు శుభ వార్త ముందుగానే ప్రకటించడం జరిగింది.
|
|||
|
\v 9 కాబట్టి విశ్వాస సంబంధుల్నే విశ్వాసముంచిన అబ్రాహాముతో కూడా దేవుడు దీవిస్తాడు.
|
|||
|
\s ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్న మనిషి ధర్మశాస్త్ర శాపం కింద ఉన్నవాడు
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వారందరినీ దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే "ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు" అని రాసి ఉంది.
|
|||
|
\v 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవర్నీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, "నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు."
|
|||
|
\v 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గానీ "దాని విధులను ఆచరించే వాడు వాటి వలనే జీవిస్తాడు."
|
|||
|
\s ధర్మశాస్త్ర సంబంధిత శాపాన్ని క్రీస్తు భరించి విశ్వాస సంబంధమైన దీవెనలను మనకు ఇచ్చాడు
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనల్ని ధర్మశాస్త్రం శిక్ష నుంచి విమోచించాడు.
|
|||
|
\v 14 అందుకే "మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు" అని రాసి ఉంది .
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.
|
|||
|
\v 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు "నీ సంతానాలకు" అని అనలేదు గానీ ఒకని గురించి అన్నట్టుగా, "నీ సంతానానికి" అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
|
|||
|
\s అబ్రాహాముకు చేసిన విశ్వాస నిబంధనకు ధర్మశాస్త్రం ఏమీ కలపడం లేదు
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్ధం చేయదు.
|
|||
|
\v 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వలనే వారసత్వాన్ని ఇచ్చాడు.
|
|||
|
\s ధర్మశాస్త్రం అసలు ఉద్దేశం శిక్ష విధించడమే
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 19 ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దానిని కలిపాడు. ఎవరికి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకు అది అమల్లో ఉంది. దానిని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.
|
|||
|
\v 20 మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వలననే నీతి కలిగి ఉండేది.
|
|||
|
\v 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 23 క్రీస్తులో మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకు, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము.
|
|||
|
\v 24 కాబట్టి దేవుడు మనల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు.
|
|||
|
\s 25 విశ్వాసి జీవితంపై రాజ్యమేలుతున్నది కృపే, చట్టం కాదు.
|
|||
|
\p
|
|||
|
\v 25 అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము.
|
|||
|
\v 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు.
|
|||
|
\v 28 ఇందులో యూదుడు, గ్రీకు, దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు, స్త్రీ అనే తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
|
|||
|
\v 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\c 4
|
|||
|
\p
|
|||
|
\v 1 నేను చెప్పేదేమిటంటే వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు.
|
|||
|
\v 2 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకు అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 3 అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.
|
|||
|
\s విశ్వాసి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాడు
|
|||
|
\p
|
|||
|
\v 4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కొడుకుని పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి,
|
|||
|
\v 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యాడు.
|
|||
|
\s విశ్వాసి కుమారత్వాన్ని వాస్తవం చేసేది ఆత్మ
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 6 మీరు కొడుకులు కాబట్టి, "నాన్నా, తండ్రీ," అని పిలిచే తన కుమారఆత్మను దేవుడు మన హృదయాలలోకి పంపాడు.
|
|||
|
\v 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.
|
|||
|
\s ధర్మశాస్త్ర క్రియల వైపుకు మళ్ళడం అంటే తిరిగి ప్రాథమిక మతం వైపు తిరగడమే
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 8 ఆ కాలంలో మీరు దేవుని ఎరుగనివారై, వాస్తవానికి దేవుళ్లు కానివారికి బానిసలుగా ఉన్నారు గాని
|
|||
|
\v 9 ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి, బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా?
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 10 మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తూ ఉన్నారు.
|
|||
|
\v 11 మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 12 సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వాళ్ళు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
|
|||
|
\v 13 మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను శుభ వార్త మీకు ప్రకటించానని మీకు తెలుసు.
|
|||
|
\v 14 అప్పుడు నా దేహంలో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
|
|||
|
\s చట్టపరమైన నీతికి మళ్లడం ద్వారా గలతీయులు తమ దీవెనలను పోగొట్టుకున్నారు
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 15 మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను.
|
|||
|
\v 16 నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 17 వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు.
|
|||
|
\v 18 నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండటం మంచిది.
|
|||
|
\s ధర్మశాస్త్రం, కృప, ఈ రెండూ కలిసి ఉండడం అసాధ్యం
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 19 నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.
|
|||
|
\v 20 మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 21 ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారలారా, మీరు ధర్మశాస్త్రం వినడం లేదా? నాతో చెప్పండి.
|
|||
|
\v 22 దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉందిగదా?
|
|||
|
\v 23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమూలంగా పుట్టాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 24 ఈ విషయాల్ని అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలుగా ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లల్ని కంటుంది. ఇది హాగరు.
|
|||
|
\v 25 ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. అది మనకు తల్లి.
|
|||
|
\q1
|
|||
|
\v 27 "గొడ్రాలా, పిల్లల్ని కనని దానా, ఆనందించు.
|
|||
|
\q1 ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.
|
|||
|
\q1 ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటె భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు" అని రాసి ఉంది .
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 28 సోదరులారా, మనం కూడా ఇస్సాకు లాగా వాగ్దాన ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నాం.
|
|||
|
\v 29 అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింసపెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 30 లేఖనం ఏమి చెబుతున్నది? "దాసిని, ఆమె కొడుకుని వెళ్లగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు."
|
|||
|
\v 31 అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\c 5
|
|||
|
\s ఉపమానం వివరణ
|
|||
|
\p
|
|||
|
\v 1 స్వేచ్ఛ గా ఉండడం కోసం క్రీస్తు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడి మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
|
|||
|
\v 2 మీరు సున్నతి పొంది ఉంటే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 3 ధర్మశాస్త్రమంతటినీ పాటించ బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషికీ నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
|
|||
|
\v 4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునేవారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
|
|||
|
\v 6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో , పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం.
|
|||
|
\v 7 మీరు బాగా పరుగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
|
|||
|
\v 8 ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాని నుంచి కలగలేదు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 9 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియ చేస్తుంది.
|
|||
|
\v 10 మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 11 సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి నాశనం చేస్తుంది గదా?
|
|||
|
\v 12 మిమ్మల్ని తప్పు దారి పట్టించే వాళ్ళు తమ్మును తాము మీ నుంచి నరికివేసుకొనడం మంచిది.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 13 సోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
|
|||
|
\v 14 ధర్మశాస్త్రమంతా "నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు" అనే ఒక్క ఆజ్ఞ లో ఇమిడి ఉంది.
|
|||
|
\v 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకొని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
|
|||
|
\s పవిత్రీకరణ ఆత్మ ద్వారానే, ధర్మశాస్త్రం ద్వారా కాదు
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 16 నేను చెప్పేది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
|
|||
|
\v 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పనిచేస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
|
|||
|
\v 18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
|
|||
|
\v 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
|
|||
|
\v 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
|
|||
|
\v 23 అలాంటి వాటికి ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదు.
|
|||
|
\v 24 క్రీస్తు యేసుకు చెందిన వాళ్ళు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
|
|||
|
\s క్రీస్తులో నూతన జీవం బహిర్గతం కావడం
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 25 మనం దేవుని ఆత్మతో బతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి కలిసి నడుద్దాం.
|
|||
|
\v 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయపడకుండా ఉందాం.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\c 6
|
|||
|
\s సహోదరత్వం తో కూడిన నూతన జీవితం
|
|||
|
\p
|
|||
|
\v 1 నా తోటి సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనస్సుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. అలాటి వ్యక్తిని మీరు సరిదిద్దుతున్నపుడు మీరు కూడా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
|
|||
|
\v 2 ఒకరి సమస్యల్ని ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 3 వ్యర్ధుడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు.
|
|||
|
\v 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది.
|
|||
|
\v 5 ప్రతివాడు తన బరువు తానే మోసుకోవాలి గదా?
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.
|
|||
|
\v 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనుషుడు ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
|
|||
|
\v 8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.
|
|||
|
\v 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\p
|
|||
|
\v 11 నా సొంత దస్తూరి తో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి.
|
|||
|
\v 12 శరీర విషయంలో చక్కగా కన్పించాలని కోరే వాళ్ళు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు.
|
|||
|
\v 13 అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వాళ్ళు మీ శరీర విషయంలో అతిశయించడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ అతిశయించడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నేను లోకానికీ సిలువ మరణం చెందాను.
|
|||
|
\v 15 కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
|
|||
|
\v 16 ఈ పద్ధతి ప్రకారం నడుచుకొనే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగుతాయి గాక.
|
|||
|
|
|||
|
\s5
|
|||
|
\v 17 నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు.
|
|||
|
\v 18 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు+గాక. ఆమేన్.
|