te_ulb/58-PHM.usfm

52 lines
7.0 KiB
Plaintext
Raw Normal View History

2017-08-23 20:08:18 +00:00
\id PHM
\ide UTF-8
\sts Philemon
\h ఫిలేమోనుకు రాసిన పత్రిక
\toc1 ఫిలేమోనుకు రాసిన పత్రిక
\toc2 ఫిలేమోనుకు రాసిన పత్రిక
\toc3 phm
\mt1 ఫిలేమోనుకు రాసిన పత్రిక
2017-05-19 05:56:45 +00:00
\s5
\c 1
2017-08-23 20:08:18 +00:00
\s1 అపొస్తలిక అభివందనాలు
2017-05-19 05:56:45 +00:00
\p
2017-08-23 20:08:18 +00:00
\v 1 మా ప్రియ జతపనివాడు అయిన ఫిలేమోనుకు,
2017-05-19 05:56:45 +00:00
\v 2 మన సోదరి అప్ఫియకు, మనతో కలిసి పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ ఇంట్లో సమావేశమయ్యే సంఘానికీ క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, సోదరుడు తిమోతి రాస్తున్న సంగతులు.
\v 3 మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
2017-08-23 20:08:18 +00:00
\s1 ఫిలేమోను వ్యక్తిత్వం
2017-05-19 05:56:45 +00:00
\p
\s5
2017-08-23 20:08:18 +00:00
\v 4-5 ప్రభువైన యేసు పట్ల, పరిశుద్ధులందరి పట్ల నీకున్న ప్రేమను గూర్చి, విశ్వాసం గూర్చి నేను విని, నా ప్రార్థనల్లో మీ గురించి విజ్ఞాపన చేస్తూ, ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞత చెబుతున్నాను.
\v 6 క్రీస్తులో నీకు కలిగిన ప్రతి మంచినీ నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వలన ఇతరులు నీ విశ్వాసంలో భాగస్తులు అవుతూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
\v 7 సోదరా, పరిశుద్ధుల హృదయాలకు నీవు సేద తీర్చావు కాబట్టి నీ ప్రేమ నాకెంతో ఆనందాన్నీ ఆదరణనూ తెచ్చింది.
\s1 ఒనేసిము కోసం వేడికోలు
2017-05-19 05:56:45 +00:00
\p
2017-08-23 20:08:18 +00:00
\s5
\v 8 అందుచేత తప్పకుండా చేయవలసి ఉన్న వాటిని గురించి నీకు ఆజ్ఞాపించే ధైర్యం క్రీస్తులో నాకున్నప్పటికీ,
2017-05-19 05:56:45 +00:00
\v 9 ముసలివాడినీ ఇప్పుడు క్రీస్తు యేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను ప్రేమను బట్టే నిన్ను వేడుకుంటున్నాను.
\s5
2017-08-23 20:08:18 +00:00
\v 10 నేను ఒనేసిము గురించి నిన్ను అడుగుతున్నాను. నేను చెరలో ఉన్నపుడు అతడు నాకు కొడుకయ్యాడు.
2017-05-19 05:56:45 +00:00
\v 11 గతంలో అతడి వలన నీకు ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఇప్పుడయితే అతడు నీకూ నాకూ ప్రయోజనకారి అయ్యాడు.
2017-08-23 20:08:18 +00:00
\v 12 నా ప్రాణంతో సమానమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను.
\v 13 నేను సువార్త కోసం సంకెళ్ళలో ఉంటే నీకు బదులుగా నాకు సాయం చేయడానికి నా దగ్గరే అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను
2017-05-19 05:56:45 +00:00
\s5
2017-08-23 20:08:18 +00:00
\v 14 అయితే నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. నీ మంచితనం బలవంతంతో కాక ఇష్టపూర్వకంగా ఉండాలని నా అభిప్రాయం.
2017-05-19 05:56:45 +00:00
\v 15 బహుశా అతడు ఎప్పుడూ నీ దగ్గరే ఉండడానికి కొంతకాలం నీకు దూరమయ్యాడు కాబోలు.
2017-08-23 20:08:18 +00:00
\v 16 ముఖ్యంగా నాకూ, శరీర బంధాన్ని బట్టీ ప్రభువును బట్టీ మరి ముఖ్యంగా నీకూ అతడు ఇక ఎంత మాత్రం బానిసగా మాత్రమే కాక అంతకంటే ఎక్కువగా ప్రియమైన సోదరుడు.
2017-05-19 05:56:45 +00:00
\s5
2017-08-23 20:08:18 +00:00
\v 17 అందుచేత నీవు నన్ను నీ జత పనివానిగా ఎంచితే నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా చేర్చుకో.
2017-05-19 05:56:45 +00:00
\v 18 ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి.
2017-08-23 20:08:18 +00:00
\v 19 పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు.
\v 20 ఔను, సోదరా, ప్రభువులో నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.
2017-05-19 05:56:45 +00:00
\s5
2017-08-23 20:08:18 +00:00
\v 21 నీవు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నీవు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.
\s1 వందనాలు, ముగింపు
2017-05-19 05:56:45 +00:00
\p
2017-08-23 20:08:18 +00:00
\v 22 సరే. నా కోసం వసతి సిద్ధం చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్ను మీ దగ్గరికి పంపుతాడనే ఆశాభావంతో ఉన్నాను.
2017-05-19 05:56:45 +00:00
\s5
\v 23 క్రీస్తు యేసు కోసం నా సాటి ఖైదీ ఎపఫ్రా,
2017-08-23 20:08:18 +00:00
\v 24 అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు అభివందనాలు చెబుతున్నారు.
\p
\v 25 మన ప్రభు యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండు గాక. ఆమెన్.